పొద్దు పొద్దున్నే (సమ్)(సన్)క్రాంతి కబుర్లు
"ఇవాళ సంక్రాంతా?"
"కాదు - భోగి - ఇండియా లో అయిపోయింది కూడా - రేపు సంక్రాంతి"
"ఊఁ "
"..."
అసలే సెయింట్ లూయిస్ లో ఇవాళ Winter Ice Storm alerts వున్నాయి.
Fox News లో వాతావరణ మాంత్రికుడు Dave Murray మహా ఉత్సాహంగా -
అదేదో ఆయనే బూజుకఱ్ఱ పట్టుకుని మబ్బులని మావూరి వైపుకి మళ్లించేస్తున్నట్టు -
అవొచ్చి ఆయన చెప్పిన చోటే కురిసేట్టు -
వర్షం వస్తుందని ఊరందరికీ చెప్పి ఆయన తన సొంత నర్సరీలో గప్-చుప్ గా నీళ్లు పెట్టుకుంటున్న విషయం మాకు తెలియనట్టు -
-----ఇలా రకరకాలుగా ఏంటేంటో మనసులో అనేసుకుంటూ రంగురంగుల మ్యాపులు చూపించేస్తూ - "ఇదిగో! ఇంకేముంది! మీ నెత్తిమీదే ఐసు గడ్డలు పడి మీరు గడ్డకట్టుకుపోతారు, జాగ్రత్త్త!!" - అని పదే పదే - ముందుకీ వెనక్కీ కదులుతూ - పడీ పడీ చెప్తున్నాడు.
ఆరో తరగతి చదివే బుజ్జిజింకకి బడి లేదు -
నిన్నటి గురువారపు సాయంత్రమే - బడినుంచి అమ్మానాన్నలకి చెరో e-mail
ఇద్దరి ఫోన్లకి చెరో SMS
ఇంటి ఫోన్ కి ఒక voice mail -
"మీ పిల్లాణ్ని బడికి పంపించాలని హడావిడి పడి లేవకుండా ఇంకో అరగంట ఎక్కువ పడుకోండొహో"
- అని వరమిచ్చేసిన స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్
శీతాకాలపు సెలవులకి ఇంట్లో వున్న అన్నకి ఎలాగూ బడి లేదు - పదహేడు దాకా.
ఇద్దరూ రాత్రి పుస్తకాలు చదువుకుంటూ ఎప్పుడు పడుకున్నారో ఇంకా లేవలేదు.
అమ్మా, నాన్న లేచారు - ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవేమో గానీ - ఇంటినుంచి పని చేసేటప్పుడు - ఒక సాకెట్ లో రెండు లాప్టాప్ ప్లగ్గులు ఇమడక తప్పదు. వాటితో పాటు నాలుగు చెవుల్లో ఇయర్ ప్లగ్గులూ కావాలి ఎవరి - కాన్ఫరెన్స్ కాళ్లు - వాళ్లు ఏ interference - లేకుండా వినడానికి.
ఉద్యోగానికి - సహజ కవచ కుండలాల్లాంటి - ఆ ప్లగ్గులూ, ఇయర్ ప్లగ్గులూ ధరింపజేసి, ధరించి - కార్యోన్ముఖులయ్యేముందు బదరీకి వచ్చిన సందేహం (సన్-దేహం? సమ్-దేహం?) -
" సంక్రాంతి - అంటే అర్థం ఏంటి?"
"అంటే సూర్యుడు మకరరాశిలో సంక్రమణం చేస్తున్నాడని అంటే ప్రవేశిస్తున్నాడని"
"అది సన్-క్రాంతా? సమ్-క్రాంతా?"
"ఎందుకు అది మీకు?"
"అదే - అది సన్-క్రమణమా? సమ్-క్రమణమా?"
"ఏదో ఒకటి - మొత్తానికి 'సం' అది"
"అదే - సన్నా - సమ్మా"
బయటికి చూస్తే ఆకాశం పేద్ద మసకేసిన గాజుముక్కలా - అప్పుడే రాలుతున్న (కురుస్తున్న) ఐసు తుంపర కిటికీల మీద చిన్న చిన్న గాజు తునకలుగా రాలుతున్న శబ్దం.
దారి పొడుగునా సిటీ అధికారులు చల్లుతున్న మంచు కరిగించే - మంచునరిగించే ఉప్పుపోతలు.
డ్రైవ్-వే లో వున్న ఎర్రటి కారుకున్న నల్లటి చక్రం మీద అందంగా పేరుకున్న మంచుర-కత్తుల జాలు - చూడడానికి బావున్నా - ముందున్న చలి-పండగని తలుచుకుని బెంగ-తలపోతలు.
పవర్ పోతుందేమో -
వంట కాదేమో -
చలేస్తుందేమో -
డిష్-వాషర్ గబగబా వేయాలేమో -
కొవ్వొత్తులు తీసిపెట్టుకోవాలేమో -
పవర్ పోతే ఆఫీస్ లో ఇవాళ బోల్డన్ని కాన్ఫరెన్స్ కాల్స్ వున్నాయి miss అవుతానేమో -
ఇన్ని బెంగల మధ్య - ఈ సన్నా - సమ్మా ప్రశ్నలు.
"ఏమో బాబూ - నేనంత ఆలోచించలేదు - వదిలేయండి"
అలా వదిలేస్తే మజా ఏంటి కదా! కొనసాగింది వేరు-కారణ-విశ్లేషణ (root cause analysis) - వేరు మాటే లేకుండా ...
"అసలు సంక్రాతి, సంక్రమణం - word ఆరిజిన్ ఏంటా అని"
"ఏదో ఒకటి - మకర రాశిలో సంక్రమణమనే నాకు తెలుసు - అందుకే సంక్రాతి"
"అయితే - Happy మకర సంక్రాతి - అనే చెప్పాలి కదా - ఎందుకంటే ఇంకో పదకొండు సంక్రమణాలు వుంటాయి కదా - to be specific ?!"
"అబ్బా! ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు మీరు? నేనెవరికీ చెప్పలేదు బాబూ - పుట్టినప్పట్నుంచీ చెప్పామా ఏంటి - Happy భోగి, Happy సంక్రాంతి, Happy కనుమ అని - ఇప్పుడు మాత్రం ఎందుకు? మీరేంటి - ఇప్పట్నించీ ప్రతి నెలా ప్రతి రాశి సంక్రమణానికి కూడా చెప్తారా ఏంటి?"
"నేనూ చెప్పట్లేదులే..."
వంటింటి - స్టవ్ ఆఫ్ కి, ఆఫీస్ లాప్టాప్ - లాగిన్ కి మధ్య పరుగు - ice storm పెరిగి పెద్దదయ్యేలోగా అన్ని పనులూ చక్కబెట్టేయాలని.
"మరైతే - ఇప్పటికి వదిలేయండి బాబూ - సన్నో, సమ్మో"
మీసాల చాటునుంచి నవ్వు - నా ఉడుకుమోత్తనం చూసి - "వూరికే అడిగాలే - ఏదో - ఉబుసుపోక కబుర్లు" అని సన్నగా అంటూ.
ఈలోగా తొమ్మిదవ్వడంతో - మా ఇద్దరి - కబుర్లు కట్టు - ఆఫీస్ కాల్ మొదలుపెట్టు...

మా వూరు తొడిగె 'మబ్బు'రపు అంబరం
హిమమద్దె దానికి మంచు సరిగంచు

భూమికావల మీవి భోగిమంటలు
అవనికీవల మావి చలి-కీలలు
మకర సంక్రమణం అక్కడ పండగ
మంచు ఆక్రమణం ఇక్కడ మెండుగ
కనుమ గారెల ఘుమఘుమలు మీవి
హిమపు ధారల రిం ఝిమ్ మాది
sun-దో; some-other-దో - ఎల్లెడలా క్రాంతి
ఎలాగైతేనేం - మనందరి సంక్రాంతి
Nicely written.
రిప్లయితొలగించండిభూమికావల మీవి భోగిమంటలు
అవనికీవల మావి చలి-కీలలు
మకర సంక్రమణం అక్కడ పండగ
మంచు ఆక్రమణం ఇక్కడ మెండుగ
కనుమ గారెల ఘుమఘుమలు మీవి
హిమపు ధారల రిం ఝిమ్ మాది
sun-దో; some-other-దో - ఎల్లెడలా క్రాంతి
ఎలాగైతేనేం - మనందరి సంక్రాంతి
I like the above part 👍
గిరిధర్ గారు: నా కబుర్లు మెచ్చిన మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండి👍👌👏😀
రిప్లయితొలగించండిలలిత గారు,
మీ సన్(మ్) కాం(క్రాం)తులు ఆ సన్ కాంతుల కొరతని తీరుస్తున్నాయి.
VenkateswaraRao Valluripalli గారు: మీ సన్-కాంతుల వ్యాఖ్య కోటి సూర్య ప్రభల పెట్టు - చాలా థాంక్స్!
తొలగించండిChaala chakkagaa vundi (sun)(Some)kranthi (Some)baraalu!
రిప్లయితొలగించండిThanks andi, Srinivas garu!
తొలగించండిVery nice postings Lalitha...!!! Very interesting indeed...!! Keep it up.
రిప్లయితొలగించండిThank you Srinivas - for taking time to read & comment!
తొలగించండిమీ దేశంలో కూడా పవర్ పోతుంటుందా అని ఓ సమ్-దేహం.
రిప్లయితొలగించండిమీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
Freezing rain పడ్డప్పుడు ఆ ice బరువుకి పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి - power lines కూడా తెగిపోతాయి. మాకు 2007 లో అలా ఒకసారి దాదాపు వారం రోజులపాటు power లేదు. ఈసారి అంత పెద్ద ice storm వస్తుందని అనుకున్నారు - కానీ తప్పిపోయింది. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండిలలితా! నీ Awesomeక్రాంతి కబుర్లు చాలా బావున్నాయి.
రిప్లయితొలగించండిఈ రెండు లైన్లయితే మరీను. నాకు చాలా నచ్చాయి.
'sun-దో; some-other-దో - ఎల్లెడలా క్రాంతి
ఎలాగైతేనేం - మనందరి సంక్రాంతి'.
నీ "Awesomeక్రాంతి" పదం నాకు భలే నచ్చింది - వీలు చూసుకునో, చేసుకునో మళ్లీ రాయడం మొదలు పెట్టకూడదూ?!
తొలగించండి
రిప్లయితొలగించండిఎట్లా యిలా లలిత గా
రెట్లా రాసిరి జిలేబి రేణువు లూరన్
గట్లా నదియై వరదై
మాట్లాడిన పలుకులెల్ల మధురిమ గాంచెన్ :)
ಜ಼ಿಲೆಬಿ
ఇట్లా యిలా జిలేబి గా
తొలగించండిరిట్లా రాసిన కమెంట్ తీదనా లూరన్
అట్లా బ్లాగుకె తోరణమై
రాసిన పద్యాలెల్ల మధురిమ గాంచెన్ :)
Another Nice post from you Lalitha garu
రిప్లయితొలగించండిPavan garu: Thank You for your nice words!
తొలగించండిమీ కవిత కోసం మిగిలింది వ్రాసారు. అవునా? కవిత బావుంది.
రిప్లయితొలగించండిఅన్యగామి గారు: కబుర్లు రాసి, వాటికి పొడిగింపుగా ఆ ఎనిమిది లైన్లు రాశానండి. వాటిని కవిత అన్నందుకు, బావుందన్నందుకు బోల్డన్ని ధన్యవాదాలు.
తొలగించండిSooryudu thana kaanti ni eppudu samanga panchaledu...Thanu oka chota fix ayi poyi manalne gundramga thiragamani vadilesadu. Ee mukkani nee endnote poem baaga cheppindi. Enjoyed this write-up.
రిప్లయితొలగించండినా చివరి లైన్లు నీకు నచ్చడం బావుంది - I like the way you qualified them as 'endnote poem'.
తొలగించండిమీ సరదా కబుర్లు భలే సరదాగా ఉన్నాయి! అందుట్లో తెలుగు మాటలమధ్య బుజ్జిగింకలు, డిష్వాషర్లు, fox newsల గురించి ముచ్చటిసుతుంటే..అవధుల్లేని తెలుగునేల ఇంకా బాగుంది.
రిప్లయితొలగించండిAnonymous గారు: నా సరదా కబుర్లు మెచ్చినందుకు ధన్యవాదాలు!
తొలగించండిఅయ్యో(didnt sign in)anonymous=వసుధ:)
తొలగించండిThank You, Vasudha - for your nice words!
తొలగించండిVery nice writeup !!
రిప్లయితొలగించండిLatha: Thanks for taking time to read my blog!
తొలగించండి
రిప్లయితొలగించండిభూమికావల మీవి భోగిమంటలు
అవనికీవల మావి చలి-కీలలు
మకర సంక్రమణం అక్కడ పండగ
మంచు ఆక్రమణం ఇక్కడ మెండుగ
కనుమ గారెల ఘుమఘుమలు మీవి
హిమపు ధారల రిం ఝిమ్ మాది
sun-దో; some-other-దో - ఎల్లెడలా క్రాంతి
ఎలాగైతేనేం - మనందరి సంక్రాంతి
చాలా బాగా చెప్పావు అక్కా
అవును ఇంతకీ......సమ్....క్రాంతి లేక సన్...క్రాంతి.....???
క్లియర్ చెయ్యలేదు ఇలాగ మద్యలో వదిలెస్టే ఎలా ???
అదిప్పుడప్పుడే తేలేది కాదు, హనుమాన్ - ప్రస్తుతానికి "సన్-క్రాంతి" అనుకుందాం - ఎంతైనా "Sun-క్రమణం" కదా!
తొలగించండి