పదకొండేళ్ల క్రితం ... అప్పుడు ...
ఇల్లు కొన్న మొదటి రోజులు
ఇంట్లో - అమ్మా, నాన్నా, అన్న కాబోతున్న ఓ బుజ్జి-జింకా
ఇల్లు కొన్న మొదటి రోజులు
ఇంట్లో - అమ్మా, నాన్నా, అన్న కాబోతున్న ఓ బుజ్జి-జింకా
ఆ ముగ్గురి కళ్లనిండా ఎదురు చూపుల దీపాలు
అవి వెలిగించి పెట్టింది - ఇంకో నెలలో రాబోతున్న బుజ్జి-పాపడు
ఇల్లంటే - ఆకూ కొమ్మా , వెన్నెల వెల్లా ...
ఇల్లంతా - అనుకున్నట్లే అంతా వెన్నెల వెల్లే అవి వెలిగించి పెట్టింది - ఇంకో నెలలో రాబోతున్న బుజ్జి-పాపడు
ఇల్లంటే - ఆకూ కొమ్మా , వెన్నెల వెల్లా ...
అన్నకి తమ్ముడు తోడు రాబోతున్నాడన్న సంబరం
తమ్ముడొచ్చాక - ఆ ఆలనలో-పాలనలో - అలసి-సొలిసే అమ్మ ఆదమరపుగా వుందని అన్న దిగులు పడకూడదు కదా!
అందుకు నాన్న వేసిన కిటుకు ఏంటంటే - అన్నకి ఇష్టమయిన బొమ్మలతో ఓ రంగుల గది సృష్టించేయడం.
అది ఎలా చేయడం? నాన్న దగ్గర - అమ్మని, అన్నని నవ్వించే - బుజ్జిపాపడిని రాత్రంతా ఎత్తుకుని లాలించే - ప్రేమంత్ర దండం వుంది కానీ - "రంగేయరా-బొమ్మ గీయరా డింభకా!" అంటే చిటికెలో గోడల్ని చిత్ర-కుడ్యాలుగా మార్చే మాయల ఎల్ఫులు లేరే మరి ?!
అందుకని - అమ్మా-నాన్న కలిసి అక్కడ వెతికి-ఇక్కడ వెతికి మొత్తానికి రంగులు-బొమ్మలు వేయడం వచ్చిన ఒక అమ్మాయిని పట్టుకున్నారు.
ఆ అమ్మాయి వచ్చింది - అమ్మని, నాన్నని అడిగింది - "ఏం బొమ్మ వేయనూ?", అని.
అమ్మ-నాన్న కలిసికట్టుగా, కూడబలుకుగా "నేనెరుగ నేనెరుగ - మా జింకనడుగు " అన్నారు.
అన్న గంతులేసుకుంటూ చెప్పాడు - ఆటలాడుకునే స్నూపీ, వుడ్ స్టాక్ - బొమ్మలు కావాలని.
తెల్లగా వుండే స్నూపీ , ఎల్లోగా వుండే వుడ్ స్టాక్ - వెల్లవేసిన గోడలమీద - వెలవెలలాడతారు కదా! అందుకని నీలపు ఆకాశంలో ఆడుకుంటున్నట్టు కావాలన్నాడు.
అంతే! గోడలేమయ్యాయో మీరే చూడండి మరి!!!
NASCAR మంచాన్నే కారులా నడిపేయడానికి ముస్తాబయిన స్నూపీ
బంతి గురించి ఊహిస్తూ, బంతాడుతూ, బంతుల నడుమ - చీర్-లీడరైన వుడ్ స్టాక్
క్లోజెట్ కి అటూ ఇటూ నుంచుని హాకీ ఆడుతున్న స్నూపీ - వుడ్ స్టాక్
స్కేట్ బోర్ద్ మీద స్నేహితులు - బంతాడుతూ స్నూపీ
టెన్నిస్ ఆడుకుంటూ ....
పదకొండేళ్ల తర్వాత... ఇప్పుడు
అన్న ఎదిగాడు - ఇంకా ఎదిగించే చదువుల బడికి వెళ్లాడు
పదకొండేళ్ల క్రితం కన్నుల వెలిగిన ఇంకొక దీపం - అన్నెడబాటుకి బెంగిలి చిన్న బుచ్చుకున్నాడు
మళ్లీ నాన్న మంత్రం వేయాల్సివచ్చింది
ఇంకేం - ఇంకొక రంగుల-బొమ్మల-కారిణిని పిలుచుకొచ్చారు
ఈసారి తమ్ముడి వంతు - బొమ్మల ఎంపిక
శలవులకి ఇంటికి వచ్చిన అన్న అయ్యాడు - తమ్ముడికి బొమ్మల-కన్సల్టెంట్
తమ్ముడు కావాలన్నాడు - బుజ్జి కాల్విన్ చారల హాబ్స్ తోడుగా
అన్న వేశాడు ఆమోదముద్ర - అంతకన్నా హుషారుగా
మరి - వాళ్లిద్దరూ ఎన్నిసార్లు చదివారో లెక్కే లేదు - మూడు వాల్యూముల - ఒక్కొక్కటి ఐదేసి వందల పేజీల కాల్విన్ & హాబ్స్ అల్లరి కథలు
ఇంట్లో ఒక - చిన్నదేమిటి - ఒక పెద్ద సైజు డిజైన్ సెషనే నడిచింది - ఆ పుస్తకాల్లోని ఏ బొమ్మలని గోడకెక్కిద్దామా అని
మొత్తానికి బొమ్మల ఎంపిక పూర్తయింది
ఈసారి మంచు రంగు గోడలమీద వేయిద్దామని అనుకున్నారు
అదుగో...కాల్విన్ & హాబ్స్ - మా బుజ్జి-జింక కలలాంతఃపుర కుడ్యారోహులైన వైనం
ఎడమ పక్క గోడ కింద మొదలుపెట్టి కుడి గోడ కిందుగా పూర్తయిన నాట్య విన్యాసం (from Book#3 - Pg.351)
వేసవి కాలపు సరదాలలో కాలవ మీదుగా నడుస్తూ (from Book#1 - Pg. 144)
శిశిరపు రంగులలో హంగులు పోతూ (from Book#1 - Pg. 133)
వాక్-ఇన్ క్లోజెట్ లో - ఒకరికొకరుగా - సేదతీరుతూ
చివరిగా - కొత్త ప్రారంభానికి ఎదురుచూస్తూ .... (from Book#3 - Pg. 481)
ఇది Bill Watterson వేసిన ఆఖరి కామిక్ స్ట్రిప్ - మా బుజ్జి-జింకలకి - ఇద్దరికీ అతి ఇష్టమైనది :)
ఆటల పాటల అలిసి
చదువూ-సంధ్యల సొలిసే
బుజ్జి-జింకల కలలు నిండిన కళ్ళు తెరవగానే
ఆ కలల కొనసాగింపుగా - కనులకింపుగా వుండాలని
కలల-గదులకి రంగుల-హంగుల ముస్తాబు చేసి ఇచ్చేశారు - అమ్మా-నాన్న...
కలల-గదులకి రంగుల-హంగుల ముస్తాబు చేసి ఇచ్చేశారు - అమ్మా-నాన్న...