"డియర్ పాపా! ఇప్పుడు మధ్యాహ్నం రెండయ్యింది. బాగా ఎండగా వుంది. పది నిముషాల ముందే నేనూ, మీ బావ సుబ్బులు టీ తాగాము. పప్పి బయట ఆడుకుంటోంది. నేను, పప్పి బయల్దేరి శనివారం మూడు గంటల బస్సుకి వస్తున్నాము. లల్లీ, కుట్టీలు కులాసాగా ఆడుకుంటున్నారని తలుస్తాను. వాళ్ళకి దొడ్డ బోంబే డైయింగ్ స్కర్టులు, ఎమ్మెస్ 55 షిమీజులు తెస్తోందని చెప్పు. కుట్టీ కోసం లస్కోరా తెస్తున్నాను. బాబీ కిష్టమని మజ్జిగట్లు వేసి పట్టుకొస్తాను, పిల్లలు జాగ్రత్త. వుంటాను మరి - ఇట్లు లక్ష్మి"
నా చిన్నప్పుడు వేసవి సెలవుల ముందు ఇలాంటి తాయిలం లాంటి కమ్మని కబురు మోసుకొచ్చే నీలంరంగు ఇన్లాండు లెటరు కోసం మా అమ్మతో పాటు నేను కూడా తెగ ఎదురు చూసేదాన్ని.
ఉత్తరం వచ్చిన మూడో, నాలుగో రోజులకి ఓ ఎయిర్-బాగ్గులో బట్టలు, పైన కవర్ వుండే ప్లాస్టిక్ బుట్టలో చెగోడీలు, జంతికలు, లేతకొబ్బరి తురిమి బెల్లం పాకం పట్టి చేసిన లస్కోరా, పుల్లమజ్జిగలో అటుకులు నానేసి వేసిన మజ్జిగట్లు పట్టుకుని ఫుల్ వాయిలు చీర కట్టుకొచ్చిన కాశీ-అన్నపూర్ణలా వచ్చేది మా లక్ష్మిదొడ్డ.
మా ఇంటికి ఎవరొచ్చినా బస్టాండుకో, రైల్వే స్టేషనుకో వెళ్లి రిసీవ్ చేసుకునేవాళ్లం. మా లక్ష్మిదొడ్డ మాత్రం ఎంత రాత్రైనా ఆవిడంతట ఆవిడే ఎక్కొచ్చిన బస్సో, రైలో దిగి - రిక్షానో, ఆటోనో కట్టించుకుని జా... మ్మని ఇంటికొచ్చేసేది. అసలు మా లక్ష్మిదొడ్డతో ఉంటే మననంటిపెట్టుకుని వున్న భయానికే ధైర్యమొచ్చేసి, మననొదిలేసి ధైర్యంగా వెళ్ళిపోతుంది.
వస్తూవస్తూ ఉత్తరంలో రాసినట్లే బోంబే డైయింగ్ స్కర్టులు, వాటి మీదకి బ్లౌజులు తెచ్చేది. వాటికి తోడు వేసంకాలం పిల్లలు మల్లెపువ్వుల్లా ఉండాలి అంటూ తెల్లటి షిమీజులు ఎమ్మెస్ 55 గుడ్డతో కుట్టించి తెచ్చేది.
అప్పటికి నేను ఇంకా బళ్ళో వున్న రోజులు. లక్ష్మిదొడ్డతో పాటే వచ్చే పప్పికి భుజాలు దాటని బాబ్డ్ హెయిర్ ఉండేది. దానికో హెయిర్ బ్యాండు. పప్పిని అలా చూడగానే అప్పటిదాకా రెండు జళ్ళేసుకుని రంగురంగుల రిబ్బన్లతో పైకి కట్టుకునే నేను వెంటనే జుట్టిప్పేసుకుని బాబ్ కట్ చేయించేసుకునేదాన్ని మా దొడ్డ చేత. అందులోనూ మహా-ఆశావహి అయిన మా అమ్మకొక నమ్మకం ఉండేదేమో - బుద్ధిమంతుల జుట్టు భుజాలు దాటదని - ఎలాగోలా నాకు బుద్దొస్తే చాలనుకుని జుట్టు కత్తిరించడానికి ఒప్పుకునేది. అంతే! ఇంక ఆ వేసవి కాలపు సాయంత్రం - బాబ్డ్ హెయిర్, తెల్ల షిమీజు లల్లమ్మ గారు, బాబ్డ్ హెయిర్, ఇంకో తెల్ల షిమీజు పప్పమ్మ గారు - అని గంతులేసుకుంటూ తిరిగేవాళ్ళం పప్పి, నేను. అన్నట్లు మా ఇద్దరికీ లల్లి, పప్పి అనిన్నీ, ఆ తర్వాత కుట్టికి కుట్టి అనిన్నీ పేర్లు పెట్టింది మా లక్ష్మి దొడ్డే!
అసలు లక్ష్మిదొడ్డ వచ్చిందంటే ఇంట్లో ఒకటే సందడి. ఓ పక్క అమ్మతో కబుర్లు చెప్తూనే, ఇంకో పక్క పొద్దున్న కాఫీలు కలపడం దగ్గర్నుంచీ, మధ్యాహ్నం మూడింటి వేళ పిల్లలకి ఆకలేస్తోందని పూరీ-బంగాళాదుంప కూర, సాయంత్రం "అస్తమానూ అన్నమే ఏం తింటాం?" అంటూ వేసే రొట్టిముక్కలూ, అందులోకి చేసే సివంగి పులుసూ, పప్పీ కోసమని తెచ్చే తేనెపానకం - ఇలా ఒక చిన్న సైజు ఫుడ్-ఫెస్టివల్ నడిచేది మా ఇంట్లో రోజూ.
ఇవి కాక దొడ్డ మాకోసమే ఇంట్లో తయారు చేసే మిక్స్డ్ ఫ్రూట్ జాములు, రోజ్ మిల్క్ ఎస్సెన్సూ, కస్టర్డ్ పౌడర్ పాలల్లో మరిగించి దాంట్లో ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్, అరటి పళ్ళేసి చేసే ఫ్రూట్ సలాడ్, రేగి వడియాలు, దేవుడి పెళ్లి గారెలు, సొజ్జప్పాలు - వాహ్! ఎన్నెన్ని వంటలు, ఎన్నెన్ని వంటలు, నాకున్నదేమో ఒకటే నోరు - అని ఒకానొక శోభన్ బాబు పాట స్టయిల్లో పాడేసుకుంటూ - తిన్నవాళ్ళం తిన్నట్లే ఉండేవాళ్ళం.
నేను వేసవికాలం ఒంటిపూట బడికెళ్ళి ఎండలో నడుచుకుంటూ ఇంటి దాకా వచ్చి, బయట మెట్ల మీదే కూర్చుని ఆకలి అని ఏడుస్తూ ఉంటే, మా లక్ష్మి దొడ్డ గబగబా అన్నం కంచంలో పెట్టి అక్కడికే తెచ్చిచ్చి, నేనో రెండు ముద్దలు తిన్నాకే ఇంట్లోకి తీసుకెళ్లేది.
మా లక్ష్మిదొడ్డ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే - పల్చగా, కొంచెం తొరకలు-తొరకలుగా మీగడ పైకి తేలేలా చిలికి, చంద్రావతి ఇంట్లోంచి తెచ్చి మరీ వేసే దబ్బాకులు కలిపి, ఉప్పేసిన వెన్నమజ్జిగ - దాని పేరు దబ్బాకు-మజ్జిగ. అది తాగి ఔరా ఏమి రుచి?! - అన్నాం మైమరచి!
ఈ రోజుకి కూడా వేసవి కాలం రాగానే బజారుకి వెళ్లి మామిడి కాయలు దగ్గరుండి ముక్కలు కొట్టించుకొచ్చి, కారం-ఆవపిండి కొనుక్కొచ్చి ఆవకాయ పెట్టే మా ఇంటి ఆంధ్రమాత లక్ష్మిదొడ్డే!
నేను ఐదో తరగతిలో వున్నప్పుడు బళ్ళో మల్లయ్య మాస్టారు "ఆధునిక మూల్యాంకన దర్శిని" అనే పుస్తకం గురించి చెప్పారు. అందులో వుండే లెక్కలు, ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులలో వుండే కొత్తకొత్త ఎక్సర్సైజుల గురించి విన్న తర్వాత నాకెలాగైనా ఆ పుస్తకం కొనుక్కోవాలనిపించింది. తీరా అమ్మతో వెళ్లి ఊళ్ళో వున్న పుస్తకాల షాపులో అడిగితే అది విజయవాడలో తప్ప దొరకదు అని చెప్పారు. వెంటనే విజయవాడ సత్యన్నారాయణపురంలో రాజన్ కిళ్లీషాపు పక్కనున్న ఇంట్లో అద్దెకున్న మా లక్ష్మిదొడ్డకి ఉత్తరం రాసేశాను నాకు ఆధునిక మూల్యాంకన దర్శిని పుస్తకం కొనిపెట్టమని. నా ఉత్తరం అందిన వెంటనే "మన లల్లి అడిగింది, వెంటనే కొని పంపిద్దాం" అన్చెప్పి మా సుబ్బారావు పెదనాన్న ఆ పుస్తకం కొని, దానికి మంచి రంగురంగుల సోవియట్ ల్యాండ్ పేజీల అట్ట వేసి రిజిస్టర్డ్ పోస్టులో పంపించారు. ఐదో తరగతిలో అంత అందమైన ప్యాకేజ్ అందుకోవడం నాకు భలే గొప్పగా అనిపించింది. ఈ రోజుకీ ఏ పుస్తకం కొన్నా, ఆ కొత్తపుస్తకపు వాసనలో జ్ఞాపకం వచ్చేది ఆ ఆధునిక మూల్యాంకన దర్శిని వాసనలే.
మొట్టమొదటి సారిగా ఇల్లు వదిలి హాస్టలుకి వెళ్ళినప్పుడు ఇంటికి దూరంగా వుండి బెంగ పెట్టుకుంటానని హైదరాబాదు నుంచి లక్ష్మిదొడ్డ, అప్పటికే ఉద్యోగం కోసం రియాద్ వెళ్లిన సుబ్బారావు పెదనాన్న చెరో ఉత్తరమూ రాసేవాళ్ళు. నాకు స్టాంప్స్ కలెక్ట్ చేయడం ఇష్టం అని తెలిసిన పెదనాన్న నా కోసం తనకి, తన స్నేహితులకి వేరే దేశాల నుంచి వచ్చే ఉత్తరాల మీద వుండే స్టాంపులని తీసి, దాచి నాకు రాసే ప్రతి ఉత్తరంలో పెట్టి పంపించేవారు.
నా పెళ్ళైన కొత్తలో గ్యాస్ సిలిండర్లు అంత సులువుగా దొరికేవి కావు. "అడగ్గానే మనకిష్టమైనట్టు పెళ్లి చేశారు కదా, మన పెద్దవాళ్ళనింకెప్పుడూ ఏమీ అడిగి కష్టపెట్టకూడదు" అనేసుకుని కిరోసిన్ స్టవ్వుతో సతమతమౌతూ - ఇంగువ పోపు ఘుమఘుమలకన్నా కిరోసిన్ ధుమధుమలతో నా వచ్చీరాని వంటని నింపేస్తున్నానని తెలిసి - "అయ్యో పాపం! పిల్ల కష్ట పడుతోంది" అని తెలిసిన గ్యాస్ డీలర్ల చుట్టూ పట్టువదలకుండా తిరిగి నాకోసం ఓ సిలిండర్ని సంపాదించేసింది మా లక్ష్మిదొడ్డే.
తొలిచూలు కానుపుకి రాజమండ్రి వెళ్లిన నా కోసం, అమ్మకు సాయంగా ఉండడం కోసం రాజమండ్రి వచ్చింది లక్ష్మిదొడ్డ. అప్పుడు అమ్మావాళ్లు అద్దెకున్న నిబ్బరాజు గారింట్లో సదుపాయంగా ఉండదని పురుడైన పదకొండో రోజు వరకూ హాస్పిటల్లోనే ఉంచింది అమ్మ నన్నూ, పుట్టిన బుజ్జిగాడినీ. ఆ పదకొండు రోజులూ లక్ష్మిదొడ్డ నాకు సాయంగా నాతో పాటే ఉండేది. రాత్రి పూట పక్కలో వున్న చంటిపిల్లాడు కదిలితే, నా కన్నా ముందు ఆవిడ లేచి "నువ్వు పడుక్కో లల్లీ! నిద్ర లేకపోతే నీరసం వస్తుంది" అంటూ చంటిపిల్లాణ్ణి రెండు చేతుల్లో ఎత్తుకుని ఊపుతూ రాత్రంతా అలాగే కూర్చునేది. మళ్ళీ పొద్దున్నే పెందరాడే నేను లేవకుండానే ఇంటికెళ్లి స్నానం చేసి, చాకింటి చీర కట్టుకుని కొత్తరూపాయి నోటులా ఫెళఫెళలాడుతూ, నా కోసం పాలూ, బ్రెడ్డూ పట్టుకొచ్చేది. నా పథ్యం కోసం శొంఠిపొడి, కాయం, కారప్పొడి అన్నీ ఓపిగ్గా చేసి పెట్టేది. మధ్యాహ్నం భోజనం తర్వాత కవిరి వేసిన తాంబూలం కట్టించుకొచ్చి నాతో తినిపించేది. అన్నం తినగానే నిద్రొస్తోంది అంటే బాలింత మధ్యాహ్నం పడుకోకూడదు అని, అలా అని పుస్తకాలూ చదవకూడదు అని, నాతో ఏవో కబుర్లు చెబుతూ కూర్చునేది. అందులోనూ అదే టైంలో కత్తిపీటతో అనాసపండు కోస్తూ తన చెయ్యి కూడా కోసుకుంది పాపం! అది బాగా లోతుగా తెగింది కూడా. అయినా సరే! అదేమీ లెక్క చెయ్యకుండా మా అమ్మతో పాటు, తనూ ఇంకో అమ్మలాగే నాకు ఏ నొప్పీ తెలీకుండా, తెలీనీకుండా సేవ చేసింది.
నేను పుట్టిన దగ్గర్నుంచీ, నాకు పిల్లలు పుట్టే వరకూ నా జీవితపు పుస్తకంలో మా లక్ష్మిదొడ్డ ప్రసక్తి రాని పేజీ లేదు.
మా చిన్నప్పుడు ...
ఒళ్ళంతా వాయిలు కోక
కళ్ళకు కాటుక రేఖ
బారెడు ఈత పాయల జడ
తెల్లగా - చలాకీగా
సన్నగా - చురుగ్గా
ఒబ్బిడిగా - శుభ్రంగా
పొడుగ్గా - గడుగ్గాయిలా
చూడ్డానికి "అమెరికా అమ్మాయి" దేవయానిలా ఉండేది మా దొడ్డ.
అలా అమెరికా అమ్మాయి సిన్మా హీరోయిన్లా వుండే మా దొడ్డకి సరిగా-సరిజోడుగా మా సుబ్బారావు పెదనాన్న కూడా అమెరికా అబ్బాయిలా ఉండేవారు. పచ్చగా, ఎత్తుగా, సన్నగా ఉండి మెడికల్ రిప్రెజెంటేటివ్ కిట్ పట్టుకుని, తలకి హేటూ, కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని వచ్చే మా పెదనాన్నని చూసి ఎవరో ఫారినర్ అని అనుకునేవాళ్లు.
ఇల్లాళ్లు వాళ్ళవాళ్ళ పతిదేవుళ్ళని పదిమందిలో "ఏమండీ" అని పిలవడానికే మొహమాట పడుతూ ఉండే ఆ రోజుల్లోనే లక్ష్మిదొడ్డ మా సుబ్బారావు పెదనాన్నని "ఇదిగో సుబ్బులూ!" అని పిలిచేది. ఇద్దరూ చిన్నపిల్లల్లా పోట్లాడుకునేవాళ్ళు, మళ్ళీ అంతలోనే పోట్లాట మర్చిపోయి బోల్డన్ని మాట్లాడుకునేవాళ్లు. పిల్లలైన మాతో ఆట్లాడుకునేవాళ్లు. పప్పిని తీసుకెళ్లి పెంచుకున్నదొడ్డ-పెదనాన్నలకి కొంచెం ఆలస్యంగా ప్రశాంతి పుట్టింది. సుబ్బారావు పెదనాన్నకి పుట్టపర్తి సాయిబాబామీద చాలా నమ్మకం ఉండేది. అందుకే ప్రశాంతికి ఆ పేరు పెట్టారు.
అన్నట్లు మర్చిపోయాను చెప్పడం... మా దొడ్డ వాడే భాష చాలా తమాషాగా ఉంటుంది.
లొడలొడ వాగడం - అంటే ఎక్కువగా మాట్లాడడం
దడదడలాడిపోతోంది - అంటే నీరసంగా వుంది
లొట్టలొట్ట చేతులు, లొట్టలొట్ట కాళ్ళు - అంటే సన్నగా ఉన్నట్లు (నన్ను చిన్నప్పుడు ఎప్పుడూ ఇలాగే అనేది)
వంకాయ బంగాళదుంప పేస్ట్ - పేస్ట్ అంటే ముద్దకూర
టమటమా పప్పు - టొమాటో పప్పు
టమటమలాడించడం - దెబ్బలాడడం (పోట్లాట)
మంకీ బ్రాండ్ - అల్లరి పిల్లలు
డిబ్బీ - పెద్దకబుర్లు చెప్పే పిల్లలు
ఇప్పటికీ ఒక్క నిముషం కూడా కూర్చోకుండా, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది మా లక్ష్మిదొడ్డ.
ప్రశాంతి చిన్న పిల్లగా వున్నప్పుడే - కొండంత అండగా వుంటారనుకున్న పెదనాన్న గుండెనొప్పి భరించలేక వెళ్ళిపోతే - తనకి తానే అండనుకుని, తనని తానే ఆదుకుని - పట్టుదలే పెట్టుబడిగా చీరల వ్యాపారం చేసి - తన కాళ్ళ మీద తను నిలబడి - తన కూతుర్ని ఒకింటి కోడలిగా నిలబెట్టింది స్వయంసిద్ధ మా లక్ష్మిదొడ్డ.
మా లక్ష్మిదొడ్డ ఐదు-పదహార్ల వయసులోకి అడుగు పెట్టబోతూ కూడా పదహారేళ్ళ పడు-చురుకుదనంతో కదులుతూ ఉంటుంది. "నీకెన్నేళ్లు దొడ్డా!" అనడిగే నాతో "ఎంతా?! ఇంకా పదహారే నాకు" అని నవ్వేస్తుంది ఇప్పటికీ.
GPS పెట్టుకుని కూడా తప్పిపోగలిగే హైదరాబాదు రోడ్లలో, ఏ రోడ్డులో ఏ మలుపులో చెట్టు ఉంటుందో, పోస్టుబాక్స్ ఏ వైపు ఉంటుందో చీకట్లో కూడా గుర్తులు చెప్పగలిగే మా లక్ష్మిదొడ్డని చూసి క్యాబ్ డ్రైవర్లు కూడా ఆశ్చర్యపోతారు.
అన్న పాట స్ఫూర్తితో, ఎంత కష్టాన్నైనా నవ్వుకుంటూ, ఈదుకుంటూ వచ్చేసిన మా లక్ష్మిదొడ్డ నా all-time-favorite-real-life-heroine!
That's why I'm proud to say....లక్ష్మిదొడ్డా!
YOU inspire me.....

కలిమి మిగలదు
లేమి నిలవదు
కలకాలం ఒకరీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా
వాడిన బ్రతుకే పచ్చగిల్లదా -
It is always said that:
Every fairy tale has a prince
Every fairy tale has a prince
Every story has a hero
Every family has a head
Every office has a chairman
and also that:
Two is a company
and also that:
Two is a company
Together can have fun
Duet is sung by two
Duel is done by two
You rewrote all those rules:
You took over the prince
You rewrote all those rules:
You took over the prince
You made hero a part of you (i.e., heroine)
You're both mommy and daddy for your offspring.
You're the boss of your life
and also
You learnt to enjoy being yourself
You're the boss of your life
and also
You learnt to enjoy being yourself
You have fun even while chasing your life
You sing all voices in a life's chorus
You play all sides in the game of life.....