కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 30 - థియేటర్లో సిన్మా వుంది - ఇంటర్నల్లు టెస్టు వుంది - దేనినీ మానుకోముగా...
మాకు శీతాకాలపు సెలవులు డిసెంబర్లో క్రిస్‌మస్ ముందు మొదలై సంక్రాతి తరవాత ముగిసేవి. ఈసారి కూడా సెలవుల డేట్లు చెప్పారు. ఇంటికెళ్లడానికి అమ్మాయిలం అందరం టికెట్లు బుక్ చేసుకున్నాం. మేమున్నది ఫిఫ్త్ సెమిస్టర్ కదా! వచ్చే ఏడాది ఈ టైంకి ఇక్కడ ఉండం కదా - అని ఒక చిన్న బెంగ అప్పుడే మొదలయింది. మళ్ళీ అంతలోనే "సెలవుల తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాం, ఆ తర్వాత ఇంకో నాలుగు నెలలు వుంటాం, ఇప్పట్నుంచే బెంగెందుకు" అని మాకు మేమే అనేసుకుని ఇంటికి వెళ్లే హడావిడిలో పడిపోయాం.
ఇంతలో నాన్న నుంచి మళ్ళీ ఫోన్. రెండ్రోజుల్లో బయల్దేరి శనివారం పొద్దున్నకి తిరుపతి వస్తున్నాము అంటూ. ఆ రోజు సాయంత్రం అలిపిరికి వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు బదరికి చెప్పాను - నాన్న, రవి వస్తున్నారని. అది వినీ వినగానే తన కళ్ళల్లో - తనకి మాత్రమే చేతనయిన - కళ్ళలో మెరిసి పెదవుల మీద పూసిందో, పెదవి మీద పూసి కళ్ళలోకి వెలుగై పాకిందో - ఓ చిన్న వెలుగుపువ్వు లాంటి మెరిసే నవ్వు... షికారుకై నడిచే నడకలో వేసే అడుగులో అప్పటికప్పుడు చేరిన ఓ చిటికెడు హుషారు... ఈ అబ్బాయి సంబరమేంటబ్బా అనుకుంటున్న నాతో "పోన్లే! నేనే ఇంకా మీ నాన్నగారిని ఎలా కలవాలా, ఎప్పుడు కలవాలా అనుకుంటూ వున్నాను. ఆయనే ఇలా రావడం మనకీ మంచిదే! కాకపోతే ఈసారి నేను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కి వెళ్ళక్కర్లేదు కదా! వాళ్లొచ్చాక ఎక్కడ కలుద్దామనుకుంటారో మాత్రం కనుక్కో! తయారై వస్తా. మా కాబోయే మామగారికి నేను నచ్చాలి కదా మరి!" అంటూ సరదాగా అంటూ సెలవు తీసుకున్నారా పూటకి.
తనతో ఉన్నంతసేపూ, తనలా మాట్లాడుతున్నంత సేపూ నాకూ సంబరంగా, సరదాగా అనిపించింది కానీ ఆ రాత్రి నాన్న ఫోన్ చేసినప్పుడు "ఆ అబ్బాయిని శనివారం మధ్యాహ్నం రెండింటికి మీ హాస్టల్ దగ్గరికి రమ్మని చెప్పు. నేనూ, రవి అక్కడికొస్తాం" అని చెప్పగానే కొంచెం బెంగగా అనిపించింది. కాకపోతే ఏదైనా జరుగుతుంది, జరిగి తీరుతుంది అని తెలిసినప్పుడు అదేదో జరిగేదాకా దాని గురించి అంతగా ఆలోచించి, దాని కోసం ప్రిపేర్ అవడం అనేది నాకస్సలు అలవాటు లేదు. అందులోనూ అమ్మ ఎపుడూ చెప్పే మాట ఉండనే వుంది - ఏమదీ? "రాత్రి పడుకోబోయే ముందు ఓ గ్లాసుడు పాలు తాగితే బాగా నిద్ర పడుతుంది, పొద్దున్నే లేవడానికి బద్ధకం అనిపించదూ" అనే ఓ క్షీరోపదేశం. అందుకే హే...ప్పీగా ఓ కప్పు వేడిపాలు తాగి హాయిగా పడుకుండి పోయాను - "అన్యథా శరణం నాస్తి... Him ఏవ అభయం మమ... His మామేవ మా నాన్నః "అనుకుని, అలా అనుకున్న నా మాటలకి నేనే నవ్వుకుని.
ఆ మర్నాడు బదరికి చెప్పాను శనివారం మధ్యాహ్నం మా హాస్టల్ దగ్గరికి నాన్న రమ్మని చెప్పారని. అది విన్న మా చిద్విలాస మూర్తి మోము అయింది మరింత ప్రకాశమానం.
శనివారం వచ్చింది. పొద్దున్న క్లాసులు అయిపోగానే లంచ్ చేసేసి రూమ్ కొచ్చేశాను. ఒంటిగంటన్నరకి మా కరుణాకర్-బొమ్మ నాగలక్ష్మి వచ్చి "లల్లీ! మీ కోసం మీ నాన్నగారు వెయిటింగ్ రూంలో కూర్చుని వున్నారు" అని చెప్పింది.
అద్దీ! అప్పుడు ఆ క్షణంలో మొదలయింది మదిలో ఓ చిన్న బెరుకు. ఇంతకు ముందు దీపావళికి ఇంటికెళ్లినప్పుడో, అంతకు ముందు అమ్మ వచ్చినప్పుడో ఒక్కసారన్నా నాన్న నన్నుకొంచెమైనా కోప్పడి ఉంటే నాకీ బెరుకు వుండకపోను. ఆయనేమన్నా చిన్న మాటన్నా నేను ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేనేమో, హాస్టల్లో ఒక్కదాన్నే వుండి బెంగ పెట్టుకుని నాలో నేనే ఏడుస్తానేమో అనుకుని ఇప్పటిదాకా పల్లెత్తు మాట కూడా అనలేదు.
నిజ్జంగా...
మా నాన్న మది పువ్వువలె మెత్తనమ్మా…
ఆటవిడుపె నాదిగా మురిసెనమ్మా...
హాస్టల్లో చదువుకుని అలసిపోతినా…!
ఆడుకుని పాడుకుని అలుపు మరవమనెనమ్మా…
అలా అనుకుంటూ, రెండేసి మెట్లు దాటుకుంటూ దిగేసి వెళ్లి నాన్ననీ, రవిని చూసి "బావున్నారా నాన్నా? అమ్మా, పప్పి, కుట్టి అందరూ బావున్నారా? నువ్వెలా వున్నావు రవీ? లంచ్ చేశారా? ఎక్కడా? భీమాస్ లోనేనా?" అని నా బెదురు కనిపించకుండా ఉండాలని హడావిడిగా మాట్లాడేస్తూ ఉంటే నాన్న కొంచెం సీరియస్‌గా "అందరం బావున్నాం కానీ మీ పాత హాస్టల్ దగ్గరకెళ్దాం పద!" అన్నారు.
నాన్న అలా అనగానే నాన్న, రవి నాకు అటూ ఇటూ నడుస్తూ మా సినీగేటు దాటి మా పాత హాస్టల్ బిల్డింగ్ ఎదురుగుండా వుండే బజ్జీల కొట్టు దగ్గర ఆగాం. ముగ్గురం ఏమీ మాట్లాడుకోకుండా అక్కడకి ఎదురుగుండా వున్న పెద్ద గేటు కేసి చూస్తూ నించున్నాం.
[ఈ పార్ట్ ఆఫ్ స్టోరీ అందించుడు బై బదరి] ఇక్కడిలా మూకీ సినిమా నడుస్తూ ఉంటే అక్కడ SVU మెన్స్ హాస్టల్లో పెళ్ళివారి హడావిడి. ఓ నల్ల పాంటూ, పింకు చారల ఫుల్హాండ్స్ చొక్కా తొడిగేసుకుని బదరి బయల్దేరగానే "ఆయ్! మేమందరం నీ స్నేహ-బృందరం ఇందరం నీకండగా ఉండగా నువ్వొక్కడివే అక్కడికి వెళ్లడమే?! మేమూ వస్తాం నీ తోటి" అంటూ ఒకటిన్నర బైకుడు MBA అబ్బాయిలు ఒకే బైకు మీదెక్కి వచ్చారు. అందులో ఒకరు అసలైన అబ్బాయి అయితే మిగిలిన వారిలో నాగ్గుర్తున్నవారు - చిరుభాయ్ అని మేం పిలుచుకునే మోహన్, రాజశేఖర్ రెడ్డి.
[చిరుభాయ్ అన్న పేరు మోహన్‌కి ఎలా వచ్చిందంటే మా మొదటి ట్రెయిన్ ప్రయాణంలో తను డాన్స్ చేయడం చూసిన మా సీనియర్స్ పెట్టిన పేరది అన్నట్లు గుర్తు.]
సరిగ్గా రెండు గంటలకి మా పాత హాస్టల్ దగ్గర ఇరు పక్షాల వారమూ ఏదో వారు కోసమై వచ్చిన వారుగా ఒకరినొకరు నవ్వీ నవ్వకుండా చూసుకుంటూ ఒకరికెదురుగా ఒకరం నించున్నాం.
వాళ్ళు వచ్చీ రాగానే పేరుపేరునా నాన్నకీ, రవికీ పరిచయం చేశానో లేదో, నాన్న నాకేసి తిరిగి "లల్లీ! నువ్వు మీ హాస్టలుకి వెళ్ళు. నేనొచ్చి కలుస్తాను ఆనక" అన్నాక ఇంకక్కడ నేనుండడం నాన్నకి ఇష్టం లేదని అర్థమై వెనక్కి తిరిగి నా రూంకి వచ్చేశాను.
[ఈ పార్ట్ ఆఫ్ ద స్టోరీ నేరేటెడ్ బై నాన్న]
వచ్చిన ముగ్గురబ్బాయిలు, నాన్న, రవి మా పాత హాస్టల్ లాన్‌లో ఎదురెదురుగా కూచున్నారు. సంభాషణ అంతా నా తండ్రీ-తనల మధ్యనే....
"అంకుల్! బావున్నారా? మీ ప్రయాణం బాగా జరిగిందా?"
"అంతా బానే జరిగింది కానీ - నేనసలు ఎందుకొచ్చానంటే నీతో మాట్లాడి అసలు సంగతేంటో తేల్చుకుందామని! "
"ఏ సంగతి, అంకుల్?"
"అదే... నీ సంగతి, మా లల్లీ సంగతి... "
"ఓ అదా! చెప్పండి అంకుల్!"
"మా బాగ్గ్రౌండ్ వేరు, మీది వేరు. పైగా ఇంటికి పెద్దపిల్ల ఇది. ఇదే ఆఖరుపిల్ల అయ్యుంటే అసలాలోచించే వాణ్ణే కాదు. ఇది కాక ఇంకో ఇద్దరారాడపిల్లలకి నేను పెళ్లిళ్లు చెయ్యాల. అటువంటి పరిస్థితిలో నువ్వు ఈ డెసిషన్ తీసుకుని మీరీ పని చేస్తే ...అసలేం అనుకుంటున్నారు? నా గురించి ఏమాలోచిస్తున్నారు మీరు? అంత పిచ్చోణ్ణనుకుంటున్నారా? చేతకాని వాణ్ణనుకుంటున్నారా? నా సంగత్తెలీదు మీకు! ఏమనుకుంటున్నారో!" - అప్పటివరకూ అణచుకున్న కోపం పొంగుకొచ్చింది నాన్నకి.
"బుజ్జాయ్ - అదే లల్లీ ... ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటుంది, అంకుల్! మా నాన్న మాతో ఇలా మాట్లాడతారు, ఎంతో సరదాగా వుంటారు అంటూ ఎప్పుడూ మీ కబుర్లే. మిమ్మల్ని ఇన్నాళ్లూ పర్సనల్ గా కలవలేదు కానీ ఈ రోజేదో కొత్తవాళ్లని కలిసినట్లు లేదు. మీరు నాకెప్పట్నుంచో తెల్సినవారు అన్నట్లే వుంది. మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే మాకు లేదంకుల్! ఎప్పటికైనా మీరొప్పుకుంటేనే - ఒప్పుకునేదాకా వెయిట్ చేస్తాం ఫర్వాలేదు"
"ఏంటి ఫర్వాలేదు? చెప్తుంటే అర్థం కావట్లేదా? మీకూ మాకూ కుదరదు. మీ ఇంట్లోనూ ఓ ఆడపిల్లుంది. ఆ సంగతి గుర్తుంచుకోవాలి ఇంకో ఆడపిల్ల గురించి ఇలా ఆలోచించే ముందు... !"
".... .... ... " అబ్బాయి మొహంలో నవ్వు కొంచెం వెలుగు తగ్గీ తగ్గనట్లు తగ్గి మళ్ళీ వెలిగింది.
"ఏం మాట్లాడట్లేదు... ఇబ్బందిగా అనిపించిందా? నాది కూడా అదే పరిస్థితి. పిచ్చిపిచ్చి ఆలోచనలు మానుకుని చక్కగా చదువుకోండి. ఎవరి దారిన వాళ్ళు వుండండి"
ఇలా అన్నా అబ్బాయి తొణకడు - బెణకడు. చిరునవ్వు చిలకరింపుడు ఆపడు.
"మీరెంత చెప్పినా, ఏమని బెదిరించినా నా డెసిషన్ నాదే, అంకుల్! మీరేం బెంగ పెట్టుకోకండి మా గురించి" అన్నాడు.
అంతే! ఇంక మాటలు అనడానికి, వినడానికి, వినిపించుకోలేదు అనుకోవడానికి ఏమీ లేదు. అబ్బాయిలత్రయం SVU హాస్టల్ కేసి. బాబాయి-అబ్బాయీ-ద్వయం (నాన్న-రవన్న) మా హాస్టల్ కేసి.
నాన్న, రవి నా దగ్గరకొచ్చి మా హాస్టల్ వెయిటింగ్ రూంలో ఓ అరగంట సేపు కూర్చున్నారు. వాళ్ళిద్దరికీ నేనూ. మా నాగలక్ష్మి కలిసి మా డైనింగ్ హాల్లోంచి టీ తెచ్చి పెట్టాము.
టీ తాగి బయల్దేరుతూ నాన్న " లల్లీ! చదువు మీద concentrate చెయ్యి. ఇంకో వారంలో పొంగల్ హాలిడేస్ కదా! జాగ్రత్తగా ఇంటికొచ్చెయ్" అని మాత్రం చెప్పి రవితో కలిసి గుంటూరు తిరిగి వెళ్లారు.
ఇంకిప్పట్నుచీ నా కథ కొంచెం కుదుపులతో సాగుతుంది... ఎలాంటి కుదుపులంటే ఎండుగడ్డేసి, దానిమీద పరుపేసుకుని కూర్చున్నా అప్పుడప్పుడూ అటూ ఇటూ ఊపేసి, బండి గూడుకి తల తగిలినా బొప్పి కట్టించని గూడు కట్టిన ఒంటెద్దుబండి ప్రయాణం లాంటి కుదుపులు...
ఈ పూటకీ కబుర్లు ఆపుతూ... నాకెంతో ఇష్టమైన ఈ డిసెంబర్ 19కి నన్ను కన్నవారి - నాతో వున్న మావారి ప్రేమని తలుచుకుంటూ - వారివారి పొగడిక వాటా వారికిస్తా... ఇలా...
మా నాన్నది మాట మామిడల్లం - మనసు పటికబెల్లం - అచ్చంగా నా పోలికే :)
ఆయన మాటకి-మనసుకి బలం మాత్రం మా అమ్మ పట్టిన ఓర్పు... ఆడపిల్ల మనసులని పట్టి వారికేది ఇష్టమో తెలుసుకుని అందించగలిగే నేర్పు...
మా నాన్న పెద్దల్లుడిది మాట మధురం - మనసు మధురం - నవ్వు మధురం - లలితాపతే సకలం మధురం :)
తను నాకు నేర్పిన జీవనమంత్రం - ఓ Terzanelle రూపంలో: https://magazine.saarangabooks.com/life-is-beautiful/
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

Bavundi lalli మీ story
రిప్లయితొలగించండిఆహా... మా నాన్నది మాట మామిడల్లం - మనసు పటికబెల్లం
రిప్లయితొలగించండినా కథ చదువుతున్నందుకు ధన్యవాదాలు, వనజగారు!
తొలగించండికళ్ళ ముందు ఒక మంచి లవ్ స్టోరీ visualize చేస్తున్నారు మీ రాతలతో లలిత గారు.
రిప్లయితొలగించండిక్రమం తప్పకుండా చదువుతూ, కమెంట్లతో ప్రోత్సహిస్తున్న మీకు బోల్డన్ని థాంక్స్, పవన్‌గారు!
తొలగించండిఅక్కాబావల అందమైన ప్రేమకథ చాలా బావుంది....శనివారం ఫోన్ లో మొత్తం చెప్పాలి హా.!
రిప్లయితొలగించండితప్పకుండా తమ్ముడూ! ఏ శనివారమో కూడా చెప్పు మరి :)
తొలగించండిఅత్త ఒడి పువ్వు వలె మెత్తనమ్మా
రిప్లయితొలగించండిఆదమరచి హాయిగా ఆడుకొమ్మా
ఆడుకుని పాడుకుని అలసిపోతివా
అలుపు తీర బజ్జోమ్మా అందాల బొమ్మా
అదే, అదే...అవునండి :)
తొలగించండి