శీతాకాలం
కిటికీ కావల కనబడే బంగారం లాంటి ఎండ
అది కనువిందే కానీ ఒంటి కందదు, అది తగిలి ఒళ్ళు కందదు
కురచైన పగళ్లు, తరచైన రాత్రులు
ఆకు రాలిన చెట్లు, పూలు పూయని కొమ్మలు
మిణుకు నక్షత్రాలకి పోటీగా తళుకుమనే క్రిస్మస్ దీపాలున్నా, అవేవీ ఒదిలించలేని చీకటి బెంగ
ఇంటా బయటా ఒణికించే చలి
కనిపించక, వినిపించక, వున్నట్టు కూడా అనిపించని మనిషి అలికిడి
ఈ మాత్రం కారణాలు చాలు, వెచ్చవెచ్చగా కంబళేదో కాళ్ళ దాకా కప్పుకుని, కదలకుండా కూర్చుని కుడిచెయ్యి మాత్రం బయట పెట్టి రిమోటు-మీటలు నొక్కుతూ, చలంటని కళ్ళు మాత్రం కదుపుతూ చేయగలిగే పని చెయ్యడానికి, అదే! సినిమాలు చూడడానికి.
నెట్‌ఫ్లిక్సో, అమెజాన్ ప్రైమో ఏదైతేనేమి, ఏ ఛానెలైతేనేమి బుర్ర వాయగొట్టుకోవడానికి అననిపించిన నటవారస ప్రసాదాలైన చిత్రరాజాలు మూడైతే, కారెక్కి గంటసేపు పడీపడీ ప్రయాణం చేసి వెళ్లి చూసి ఠారెత్తి మళ్ళీ లేవకుండా పడ్డవాళ్ళను చేసిన retrograde amnesiatic సిన్మా ఇంకోటి. ఆ సినిమాలు, వాటి వల్ల నా శారీరక, మానసిక ఆరోగ్యాల మీద నాక్కలిగిన అనుమానాలు రాసేసుకోవాలి ఇవాళే, ఇప్పుడే. అలా రాసుకోకపోతే ఎప్పట్లాగే ఏదో ఓ నా నక్షత్రాలు బావుండని సాయంత్రం ఇవే సినిమాలు చూడలేదేమో నని పెట్టేసుకుని, సగం దాకా చూశాక "అరే! ఇంతకు ముందే చూశానే ఇది, అయినా ఏంటబ్బా కథ గుర్తుకు రావట్లేదు" అనుకుని మళ్ళీ చూసి చిత్రహింసకి గురవుతానేమో నన్న భయం. ఎందుకంటే చదువుకునే రోజుల్లో బళ్ళో మా మాష్టార్లు, ఇంట్లో మా అమ్మ పదేపదే చెప్పిన ఒకసారి రాస్తే పదిసార్లు చదువుకున్నట్లన్న చద్దిమూట లాంటి మాటని నమ్ముకుని ఈ వేళ్టికి ఇలా రాసేసుకుంటే, రేపో వేళ పొరపాట్న నా ఆధీనంలో లేని నా కవల కుడిచెయ్యో, కవల ఎడం చెయ్యో రిమోటు నొక్కేసినా ఇంకా retrogade amnesia పాలబడని నా ఈ రాసుకున్న పాత జ్ఞాపకాలు నన్ను కాపాడతాయన్న ఆశే నాతో ఇలా రాయిస్తోంది.
మొదలెట్టేస్తున్నా మరి ... ఇది చదివి మనో-నేత్ర-ప్రక్షాళన చేసుకోవాలంటే మాత్రం ఏ మిస్సమ్మో, మాయాబజారో, సాగరసంగమమో చూసుకోమని మనవి.
శైలజారెడ్డి అల్లుడు:
ఆరడుగులకి అరడుగు మాత్రమే తక్కువైన హీరోగారి అందం, ఎంతో ఎత్తుకి ఎగిరెగిరి విలన్లని ఎగిరి తన్నిన అద్భుతం
పరిచయంతోనే కనిపించిన ఆరంగుళాల హీలున్న హీరోయిన్ గారి పాదం
అ! సినిమాతోనే అడలుగొట్టించిన మురళీశర్మ పలికే ఆంధ్రలో ఏ యాసో తెలియని భాష
బాహుబలిలో పూనిన శివగామి ఇంకా దిగని రమ్యకృష్ణ పాలబడినపెద్ద నరేష్ ఘోష
వూళ్ళో ఆడవాళ్ళ బాధలు తీర్చడానికి పుట్టిన అమ్మ శైలజారెడ్డి తన కూతురుతో మాత్రం మాట్లాడదు - వాళ్ళిద్దరికీ మాటలు మోసే తడికలా పృథ్వీ, ఆయన చేయబోయిన అపహాస్యపు కామెడీ
అస్సలు నవ్వకుండా, ఆరబెట్టుకున్నపుడు అనుకోకుండా కురిసిన వర్షానికి తడిసి ఎప్పుటికీ పేలని చిచ్చుబుడ్లలా మొహాలు పెట్టుకుంటేనే అదేదో చాలా గొప్ప ఏక్షన్ అనుకునే హీరోయిన్లు, పనీపాటా లేకుండా వారి వెనక పడి విన్యాసాలు చేసే నటశూన్యత్ అనదగ్గ హీరోలు
ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తు లేని మాటలు, పాటలు
సినిమా మొదలెట్టిందగ్గర్నుంచీ సోఫాలో ఇబ్బందిగా కదుల్తూ, నాకేసి "ఇంత జాలి లేదేంటి నీకు?" అన్నట్లు చూస్తూ, ఇంకోసారి అడిగితే ఆపేస్తానేమో అని ఆశతో "ఇంకాపేద్దామా బుజ్జీ!?" అనడుగుతూ, "వుండండి... రమ్యకృష్ణ ఇంకా రాందే? అప్పుడు బావుంటుందేమో?!" అన్న నా మాటతో ఆరిపోతున్న ఆప్టిమిజానికి ఆజ్యం పోసుకొంటూ, నాతో పాటే చివరాఖరి "శుభం" కార్డు దాకా సిన్మా చూసి, పట్టీపట్టని నిద్రలోంచి దడుచుకుని లేచి మరీ "నువ్వెంత రాక్షసివే! నా చేత శైలజారెడ్డి అల్లుడు చూపిస్తావా?" అనిపించుకున్న ఆ రాత్రి చిరు-స్మైలీయం, చిరస్మరణీయం.
సాహసం శ్వాసగా సాగిపో:
ఇది నేనొక్కదాన్నేచూశా.
Life After Google చదువుకుంటూ బదరి, Wodehouse నవ్వుల్లో మునిగి తేలుతూ అన్నగాడు, కీబోర్డ్ మీద సన్నగా కూనిరాగాలు తీస్తున్న బుజ్జిజింక, వాళ్ళు ముగ్గురూ ఎవరి వ్యాపకాల్లో వాళ్ళుంటే నాకు మాత్రం కొంచెం dumb-time కావాలనిపించింది. అనుకున్నదే తడవు సిన్మాలు వెతుక్కుంటూ ఉంటే నటవారసుడి ఇంకో సిన్మా, సాహసం శ్వాసగా సాగిపో తెర మీద మెరిసింది. "హన్నా! నీకు మరీ prejudice ఎక్కువై పోతోంది. ఒకటి బాలేపోతే అన్ని బావోనట్లు కాదు కదా! చూడు, చూడు" అని నాకు నేనే సినీ-ప్రోత్సాహమిచ్చేసుకుని చూడడం మొదలు పెట్టాను.
ఇంజినీరింగ్ చదివి "నెక్స్ట్ ఏంటి?" అనాలోచిస్తున్న హీరో, హీరో గారి బైకు
హీరో గారి మీద హీరోయిన్ను లైకు
రాత్రి పూట హీరో గారు ఎక్కించే గోడలు దూకే హీరో గారి ఫ్రెండు
కన్యాకుమారిలో సూర్యోదయం చూడడానికి బయలుదేరిన హీరో, హీరోయిన్నూ
దార్లో వీళ్ళిద్దరూ తలుపు కొట్టి, "నేనూ నా చెల్లెలి ఫ్రెండూ వచ్చాం - మీ ఇంట్లో ఉంటాం, తింటాం" అని హీరో చెప్పగానే ఆకేసి, పప్పేసి, అన్నం పెట్టి సాగనంపే ఓ తమిళ కుటుంబం
రోడ్డు మీద ప్రమాదం జరగ్గానే హాస్పిటల్లో హీరోని చేర్చి మాయమైన హీరోయిన్
కదిపితేనే నొప్పి అంటూనే, ఆ విరిగి కట్టు కట్టుకున్న చేత్తోనే హీరోయిన్ కోసం హీరో చేసే ఫైట్లు, ఫీట్లు
ఎందుకు చంపుతున్నారో తెలీకుండా హీరోయిన్ కుటుంబాన్ని, ఆమెకు ఆశ్రయమిచ్చిన అందర్నీ చంపే విలన్లు, వాళ్ళకి సహాయపడే పోలీసులు
తీరా చూస్తే అంతగా convincing గా అనిపించని హీరోయిన్ తన కూతురు అని ఎవ్వరికీ తెలియకూడదని ఆమె తండ్రే చేయిస్తున్న హత్యలు
చివర్లో పట్టుబట్టి సివిల్స్ రాసి, IAS వద్దనుకుని IPS అయి వచ్చే హీరో
అబ్బబ్బబ్బా!What an inspiring story! ఇందులో కూడా మాటలు, పాటలు ఏమీ గుర్తు లేవు. మరీ రాత ఎందుకంటే మరోసారి దీని జోలికెళ్ళే సాహసం చేయకుండా సాగిపోవడానికి.
సవ్యసాచి:
ముచ్చటగా మూడో నటవారసులవారి వరప్రసాదం.
పుట్టిన ఒక్క కొడుకులో అసలు కొడుకు విక్రమ్.
ఎడం చెయ్యిలో ఇరుక్కుపోయిన కవల ఆదిత్య.
వెరసి హీరో విక్రమాదిత్య.
ఆతని సోదరి పేషేంటుకి పేటెంటులాంటి భూమిక.
ఏ సిన్మాలోనైనా ఈవిడ కొంచెం చురుగ్గా ఉంటే చూడాలనే తీరని కోరిక.
ఇందులో హీరోయిన్ను ఉందా అంటే వుంది.
ఆమె ఉందన్న జ్ఞాపకమే నాకు లేదు.
ఆరేళ్ళ తర్వాత హీరోయిన్ని కలుసుకున్నా అస్సలు ఆ excitement నటనలో ఏ కోశానా కనిపించనివ్వని హీరోగారి నట-స్థితప్రజ్ఞత్వం
సినిమా అంతటికీ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గర అరువు తెచ్చుకున్న వేటూరి వారి లగాయిత్తు-పాట తప్ప ఇంకేమీ గుర్తు లేదు.
ఇది చూశాక మాత్రం ఒకటి మాత్రం ఖాయం అయిపోయింది నాకు. అదేంటంటే రావురమేష్ చెప్పినట్లు ప్రతి ముగ్గురిలో ఒకరికి pregnancy లో కవలలు form అయి, అందులో ఆహారం సరిగ్గా అందని కవలని ఇంకో కవల తనలో కలిపేసుకున్నా- ఆకలేసి కలిసిపోయిన ఆ కవల ఎడం చేతిలోనో , కుడి చేతిలోనో చేరి అసలు పుట్టిన కవలలో కనిపించని ఇంకో కవలగా మిగిలిపోవడం నిజమే ననిపిస్తోంది. ఎందుకంటే, నా కుడి చెయ్యి నా ప్రమేయం లేకుండా రిమోట్ బటన్లు నొక్కి "నేను చూడను మొర్రో!" అంటున్నా ఈ సిన్మాలన్నీ నేను చూసేలా చేస్తోంది ఎవరనుకున్నారు? నాలో వున్న అసలైన నేను కాదు. నా కుడి చేతిలో వున్న ఆకలేసి, అన్నం అందక నాలోకి ఆవిరైపోయిన నా కవల. ఇది అర్థం కావాలంటే సవ్యసాచి చూడాల్సిందే. మధ్యలో రిమోట్ నొక్కి సినిమా ఆపెయ్యకుండా చూడాలంటే మీ కుడి చెయ్యి ఓ రుమాలతో వెనక్కి కట్టేసుకుని మరీ చూడండేం!
పడిపడి లేచె మనసు:
అసలీ మధ్య "పాత్రల్లో ఒదిగిపోయారు, జిడ్డు వదిలేలా తోమి వదిలారు" అని రాసే ఆన్లైను రివ్యూలు చదవట్లేదు, ఒకవేళ ఆత్రం ఆపుకోలేక చదివినా ఏమాత్రం నమ్మట్లేదు మేము. అలాంటిది ఈ మధ్య - ఇండిపెండెంట్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, కొంచెమైనా నిజం చెప్తున్నారు - అనిపించే ఒక వెబ్సైట్ లో పడిపడి లేచె మనసు ముచ్చట చదివి, ముచ్చట పడి ఒక గంట కార్లో డ్రైవ్ చేసుకుంటూ పడీపడీ వెళ్లి మరీ మధ్యలో లేచి రావాలన్న విషయం గుర్తు కూడా రానంత retrogade amnesia కి గురయ్యాం.
నేనైతే మాత్రం సాయి పల్లవి డాన్సులు చూద్దామని వెళ్లాను. అందులోనూ రివ్యూలో కూడా ఆ అమ్మాయి డాన్స్ ప్రసక్తి వుండేటప్పటికి, ఏమీ లేకపోయినా ఆ fluid movements చూద్దామని బోల్డంత ఆశతో వెళ్ళాను. తీరా చూస్తే పొడుగు పొడుగు షిఫాన్ గౌన్లు వేసి, గాల్లో ఎగిరింది అంతే.
ఇందులో కూడా హీరోకో బైకు. టీవీ చూడ్డం తప్ప ఇంకో పనేమీ లేనట్లు కనపడే హీరో తల్లి ప్రియా రామన్. శుభసంకల్పం సిన్మా తర్వాత ఇదే ఈవిణ్ణి చూడడం. ఈవిడుండి పెద్దగా చేసిందేం లేదు, వర్షంలో తడిసొచ్చిన కొడుకుని విసుక్కోవడం తప్ప.
హీరోయిన్ డాక్టర్. తండ్రి మురళీశర్మ మేజిస్ట్రేట్. తన్ను కాపాడిన హీరోని ఇంటికి కాఫీకి పిలవడం, నేపాల్లో దెబ్బ తగిలిన హీరోయిన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం, ఓ ట్రాక్ సూటేస్కుని జాగింగ్ చేస్తున్నట్లు కనబడ్డం తప్ప ఈయనకి పెద్ద రోలేం లేదు.
హీరోయిన్ తల్లి - వంటింట్లోనో , సినిమాలో కనపడని పెద్దకూతురి కూతురికి స్నానం చేయిస్తూనో వుండే ఈవిడకి Bread-Bath & No-Beyond. లండన్ చదువుకోవడానికి వెళ్లిన డాక్టర్ కూతురు నేపాల్ లో వుంది, ఆక్కడ భూకంపం వచ్చిందని టీవీలో చూసి కూడా "ఇంటికి తిన్నగా వద్దామన్న ఇంగితం లేదు దీనికి" అని విసుక్కుంటుందే తప్ప "అయ్యో! పిల్ల అక్కడ ఏమయ్యిందో" అని కొంచెం కూడా కంగారు పడదు.
హీరో తండ్రి ఒక పెద్ద పుస్తక రచయిత. ఈయన తగ్గిపోయిన హీరో కోపం పెంచడానికి పనికొచ్చే catalyst. ఈయన రాసే ఇంతోటి పుస్తకాలకి ఇంట్లో ఏదో ఓ గదిలో కూర్చుని రాసుకోక, అదేదో ప్రపంచాన్ని ఉద్ధరించే ఏ మందో, మాకో కనిపెట్టే సైంటిస్టేమో అన్నంతగా "నా కెరీర్‌కి మీరు అడ్డు" అని వాళ్ళ పాటికి వాళ్ళు టీవీ చూసే అమ్మా-కొడుకుల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతాడో నాకర్థమే కాలేదు.
హీరోయిన్ సాయిపల్లవి. ఈ అమ్మాయి నిజంగా డాక్టరట. ఈ సిన్మా లోనూ డాక్టరే. అప్పుడప్పుడు కోల్కత్తా వీధుల్లో బెంగాలీలో "హింషా, అహింషా" అని అరుస్తూ వీధినాటకాలూ వేస్తూ ఉంటుంది. ఎక్కడో రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు, ఎదురుగా ఆగిన బస్సులోంచి డాన్స్ డ్రెస్ వేసుకున్న పిల్లలు కొందరు దిగి "అక్కా! డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాలి, లేట్ అవుతోంది. హెల్ప్ చెయ్యక్కా" అంటే ఈ సాయిపల్లవి కళ్ళు మెరిపిస్తూ తలూపితే "ఏదో ఉపాయం చేసి పిల్లల్ని సమయానికి వాళ్ళు వెళ్లాల్సిన చోటుకు చేరుస్తుందేమో, ఏం చేయబోతోందబ్బా" అని కూర్చున్న సీటు అంచుకి జరిగి మరీ చూడబోతే ఈ పిల్ల కూడా ఆ పిల్లలతో పాటు బస్సు టాపెక్కి ఓ భరతనాట్యం స్టెప్పు వేస్తుంది. ఇంకా ఈ సిన్మాలో ఏదో ఉంటుంది అనుకునే నన్ను నా కుడి చెయ్యి నా ప్రమేయం లేకుండానే "సాచి" పెట్టి కొట్టి ఆట్టే ఆశించక "సవ్యం"గా వుండమంది.
ఇంక నేపాలు, భూకంపం...ఏడాది తర్వాత అక్కడ కలుసుకుందామనుకున్న హీరో, హీరోయిన్లు భూకంపం వల్ల కలుసుకోలేక పోవడం, ఎప్పుడో దాసరి-గోరింటాకు రోజుల్లో హీరో-హీరోయిన్లలా ఈ సినిమాలో కూడా ఎదురెదురుగా ఉంటూనే ఒకళ్ళతో ఒకళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోకుండా వాళ్ళిద్దరి మధ్యా జరిగిన మహా-డ్రామా...ఇంత జరుగుతున్నా, సీట్లోంచి మేము లేచి రాలేకుండా మమ్మల్ని కూర్చోపెట్టిన మాలోని మాకే తెలియని మా ఇంకో కవలలు.
సిన్మాలో నాకు నచ్చినవి ఏంటంటే కోల్కత్తాలో హీరో-హీరోయిన్ల ఇళ్ళు - కొంచెం చూడ్డానికి బావున్నాయి. ఆ వీధుల్లో తిరిగిన ట్రాములు. కురిసిన వర్షాలు. హీరోయిన్ వేసుకున్న కొన్ని డ్రెస్సులు. హీరో గురించి చెప్పడానికేమీ లేదు. ఇందులో ఇంకో డాక్టరుగా వేసిన అజయ్‌ని చూసినప్పుడల్లా అనిపించేది మళ్ళీ ఈ సినిమా లోనూ అనిపించింది - ఈ అబ్బాయికి ఎవరైనా మంచి రోల్స్ ఇస్తే బావుండును అని. సునీల్ వున్నాడు. వెన్నెల కిషోర్ ఉండక తప్పదేమో మరి.
నిన్ననే చూశామీ సినిమాని. అయినా సరే ఇంతకు మించి ఏమన్నా చెబ్దామంటే గుర్తు రావట్లేదు. జై బోలో Retrogade Amnesia కి!
ఈ సినిమాలు చూసిన ఆవేశంలో, ఆక్రోశంలో శ్రీశ్రీ గారిని అరువు తెచ్చుకున్నా...
దుఃఖితులార !
ప్రేక్షకులార !
తెలుగు సినీ ద్రష్ట లార !
ఆశించకండాశించకండి !
వచ్చేస్తాయొచ్చేస్తాయి...
రీమేక్, డబ్బింగ్ సిన్మాల్
వచ్చేస్తాయొచ్చేస్తాయి !
~ సినీ-మా-లక్ష్మి

ఎంత ఓపికండీ మీకు. పైగా మీ మూలంగా యింట్లో వారికి శిక్ష. తెలుగు చిత్రరాజములు కావవి గులక రాళ్లు.
రిప్లయితొలగించండివారానికి ఒక్క మూడు గంటలు మాత్రం ఏ పనీ చెయ్యకుండా, కదలకుండా కూర్చోవాలని ఒక ఎజెండా అండి, వనజగారు! ఆ ప్రణాళికలో భాగమే ఈ హింసలూ, చిత్రహింసలూ!
తొలగించండి. . . జై బోలో Retrograde Amnesia కి! . . .
రిప్లయితొలగించండిఆమాటే మాదీను. అదుండే ఇంత విపులంగా మీసినీకష్టాలు ఏకరువు పెట్టారే, లేకుంటే ఈబ్లాగుటపా ఒక నవలంత ఐపోయేది. మాకూ సంపూర్ణసినీవైరాగ్యం వచ్చేసేది!
శ్యామలీయంగారు! అంతా గుర్తుంటే మీరన్నట్లే నవలంత అయ్యేది. మీకు సినీవైరాగ్యంతో పాటు నాకు బ్లాగ్-వైరాగ్యం కూడా వచ్చేది.
తొలగించండిమీరు ముందుమాట రాసిన నా ఇ-బుక్ కినిగెలో ఈ రోజున ప్రచురింపబడింది.
రిప్లయితొలగించండిhttp://kinige.com/kbook.php?id=9231
చూడగలరు.
శర్మగారు! శుభాభినందనలు! మీ పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు!
తొలగించండిఈ మధ్య నేను తెలుగు సినెమాలు చూడటం మానేశాను, కాస్త ప్రశాంతంగా బ్రతుకుతున్నాను.
రిప్లయితొలగించండిఆది నిజమే అనిపిస్తోంది మీ కబుర్లు విన్నాక లలిత గారు.
రక్షింపబడ్డారు. అలాగే సుఖంగా వుండండి, పవన్‌గారు!
తొలగించండిమేము కూడా చివరి సినిమాని మరో ఇద్దరు ప్రేక్షకులతో (హాలు మొత్తానికి) చూసాం. మీరు చెప్పినవన్నీ సత్యాలే. అదృష్టం కొద్దీ నేను త్వరగా అన్ని మర్చిపోతాను. అందువల్ల మళ్ళీ మళ్ళీ తెలుగు సినిమాలు ధైర్యంగా చూస్తున్నాను.
రిప్లయితొలగించండిఎప్పటికప్పుడు ఎక్కడో ఒకటన్నా బావుండకపోతుందా అనుకుంటూ మేమూ చూస్తూ వుంటామండి, అన్యగామిగారు!
తొలగించండి