(మా చిన్న చెల్లి కుట్టి చాలా బాగా పాడేది. కొన్ని సంవత్సరాలు కర్ణాటక సంగీతం మరియు లలిత సంగీతం కూడా నేర్చుకుంది. తను ఇప్పుడు లేకపోయినా తన పాట మాతోనే వుంది. కుట్టి పాడిన లలిత సంగీతం పాటల్లో నాకు గుర్తున్నవి ఈ బ్లాగ్ లో పొందు పరుస్తున్నాను.)
మంచి గంధం ముద్ద మీద
నల్ల కస్తూరి బొట్టు లాగ
చందమామ ఆకసంలో
అందగించాడు...చిందులేశాడు
నీలి నీలి సాగారానా ఆ ఆ ఆ
నీలి నీలి సాగరాన
తెల్ల తెల్లని తెరచాపెత్తి ||నీలి||
సాగిపోయే పడవలాగా ఆ ఆ ఆ
సాగిపోయే పడవలాగ
చందమామ ఆకసంలో
మంచి గంధం ముద్ద మీద
నల్ల కస్తూరి బొట్టు లాగ
చందమామ ఆకసంలో
అందగించాడు...చిందులేశాడు
నీలి నీలి సాగారానా ఆ ఆ ఆ
నీలి నీలి సాగరాన
తెల్ల తెల్లని తెరచాపెత్తి ||నీలి||
సాగిపోయే పడవలాగా ఆ ఆ ఆ
సాగిపోయే పడవలాగ
చందమామ ఆకసంలో
అందగించాడు...చిందులేశాడు ||మంచి||
నల్ల నల్లని కొప్పులోనా ఆ ఆ ఆ
నల్ల నల్లని కొప్పులోన
తెల్ల మల్లియ దండవోలె ||నల్ల||
చీకటింట్లో దివ్వెలాగా ఆ ఆ ఆ
చీకటింట్లో దివ్వెలాగ
చందమామ ఆకసంలో
అందగించాడు...చిందులేశాడు ||మంచి||