"వడ్లమాని సోమేశ్వర రావూ, ఆగవయ్యా! అడుగులో అడుగు వేసుకుంటూ ఎందాకా ఆ నడకా?!"
"ఎవరదీ?! నన్నెరిగిన వాడవా, ఎరగని వాడవా?"
"ఆది నుంచి వున్నవాడినీ, అనాది అయిన వాడినీ - నిన్నెరిగిన వాడనే!"
"నన్నెరిగిన వాడవా? అయితే అదేం పిలుపు - నన్ను నాని అంటారని తెలీదా?"
"తెలుసనుకో! ఏదో తమ్ముడికి తండ్రి తర్వాత తండ్రిలా నిలిచినవాడివి, కొడుకులకి తండ్రివి , మనవల తాతవీ - అని అలా పిలిచాననుకో."
"నా గురించిఅన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావే - ఇంతకీ ఎవరు నువ్వు - చూపసలే ఎందుకో ఇవాళ సరిగా ఆనట్లేదు"
"నీ గురించి నాకు తెలియకపోవడమేం ? నీ తమ్ముడి కూతురుందే - అదే సొట్ట పూసలా బోల్డన్ని కబుర్లు చెప్తుందీ- లల్లీ - ఆ పిల్లే ... అయినా నాకు తెలీకడుగుతాను - పై మెట్టు ఎక్కి గడపలోకి వచ్చే వేళ "అప్పా! బావున్నారా" అని పలకరించి - పసుపూ- కుంకుమ ఒడి నింపుకెడుతూ కాళ్లకి దండం పెట్టి వీడి వెళ్లే వేళ "వెళ్లొస్తానప్పా" అని చెప్పి- "మళ్లీ చూడడమెప్పుడూ" అని నువ్వడిగితే - "ఎప్పుడో ఇలాగే, అప్పా!" అని కళ్ళు తుడుచుకుంటూ గడప దాటేదే - ఆ పిల్ల - నీతో ఆ మూడు ముక్కలు తప్ప ఇంకో మాట మాటాడిందీ? ఇప్పుడు చూస్తే ఊరూ-వాడా ఏకం చేసేలాంటి కబుర్లు చెప్తూవుంటుంది"
"మరీ బాగుంది - అది మా ఇంటి ఆడపిల్ల - మాటాడని మల్లెమొగ్గ"
"మరిప్పుడా కబుర్లేంటంటావ్ ?"
"ఆడపిల్లకి తండ్రి పోలిక వస్తే అదృష్టం - మా బాబీ చెప్పడూ - అదీ చెప్తుంది మరి - నా దగ్గరంటావా - దానికి మాటలవసరం లేదు - మనసుతో చెప్పేది - వాళ్ల నాన్నా అంతే "
"బానే వుంది నీ సమర్ధింపు - అయినా ఏ మాటకామాట చెప్పుకోవాలిలే - నీ గురించి బానే చెప్పింది కబుర్లు - ఇటీవల నీకు నలతగా ఉందని తెలిశాక "అయ్యో - చిన్నప్పట్నుంచీ అప్ప గురించి మనసులో అనుకోవడమే కానీ ఎప్పుడూ ఎదుటపడి - చెప్పలేకపోయాను" అని బెంగ పడి నీకోసమే మొదలెట్టిందట నేర్పించిరి (చదివించని) గురువులు అంటూ కబుర్ల వరస. అది అలాగే కొనసాగిస్తుందట. పైగా - గాంధీ-నెహ్రూల గురించి ఎవరైనా రాస్తారు - మన ఇళ్లల్లో వుండే ఎవరూ ఎరగని మన మనుష్యుల మంచితనం గురించి మనమే కదా రాసుకోవాలి అని - అంటుంది కూడా "
"అవునవును - నేనూ చదివాను - మనవరాలు లలిత ప్రింటౌట్ తెస్తే - బారాసింది - నా గురించి నాకే చెప్పింది. అవునూ మా ఇంటి పిల్ల గురించి ఇన్నిమాట్లాడుతున్నావు - ఎవరసలు నువ్వు? "
"అది చెప్తా కానీ - మళ్లీ మరుస్తానేమో ఈ మాట నీ చెవిన వెయ్యనీ - తనది పెద్దలిచ్చగించని పెళ్లి అయినా వాళ్ల నాన్నకి అండగా -నీ చేత్తో మంగళసూత్రం, వెండి చుట్లు, మధుపర్కాలు కొని - పెళ్లిపందిరికి నువ్వూ-నీకొడుకులూ నాలుగు స్తంభాల్లా నించుని తన పెళ్లి జరిపించారని ఇప్పటికీ తలచి-తలచి మురుస్తూ ఉంటుంది - ఈ ఒక్క మాట నీకెప్పుడూ చెప్పలేదని ఇప్పుడనుకుంటోంది."
"సర్లే - మాఇంటి ఆడపిల్ల - మా దివాణపు హోదాకి తగ్గట్టు వెళ్లాలి - వెళ్లింది - మా ఇంటి విషయాలింక ఆపి - ఇంతకీ నువ్వెవరో చెప్పు"
"ఆశ్వీయుజ మాసం - బహుళ ఏకాదశి - బుధవారం - సమయం - మధ్యాహ్నం 2:15 - అప్పుడు మొదలయింది నీ ప్రయాణం నాతో"
"నువ్వెవరంటే - తిథివారనక్షత్రాలు చెప్తావేంటి? నువ్వేమన్నా"సీతారామాభ్యాంనమః" అంటూ ఇంటికొచ్చే యాయవారపు బ్రాహ్మణుడివా? నీ గొంతు గుర్తు ఆనవాలు పట్టలేకపోతున్నానే?!"
"ఆ... ఆ... నేనాయన్ని కాదు - బహుదూరపు బాటసారిని - ఏదో నా బాటలో కలిశావు - మాట కలిపితే మార్గాయాసం లేకుండా దాటిపోతావని - అంతే! "
"బానే వుంది వరస - ఎవరో చెప్తావా - నన్నాట్టే విసిగించకుండా నీ దారిన నువ్వెళ్తావా?"
"బావుందయ్యా, నానీ! - నీ విసుగు - సరే విను - నేను నీకు బాగా తెలిసిన వాడినే - దేవుడంటారు నన్ను - అసలెప్పుడైనా తలిచావా నన్ను?"
"ఎందుకూ తలవడం - నా సంగతి నేను చూసుకోలేనూ? అండగా తమ్ముడు, నా పిల్లలు ఉండనే వున్నారు"
"తెలుసులేవయ్యా - ఒక తల్లి కడుపున పుట్టిన రామలక్ష్మణులు - నువ్వూ నీ తమ్ముడూ - మనసుతో మాట్లాడుకుంటారు - ఇవన్నీ చెప్పావులే. ఎంత వాళ్ళందరూ వున్నా నేను నేనే కదా?"
"రాముడితో పోల్చావూ - అసలు నీతో ఒక సంగతి తేల్చుకోవాలి - నువ్వేమో రాముడిగా పధ్నాలుగేళ్లు, నీ వాళ్లు - ఆ పాండవులకేమో - పోనీలే - బావమరిది - బతుకగోరేవాడు అన్చెప్పి - ఓ రెండేళ్లు తగ్గించి పన్నెండేళ్లు - మరి నేనేనా కాని వాడినని యాభై ఏళ్లకు పైగా వనవాసం చేయించావు - ఆ అనాతవరంలో ? "
"భలే వుందయ్యా నీ నింద ! వనవాసమన్నావు కానీ ఏ ఒక్క రోజన్నా ఇలా కాదు-ఇంకోలా కావాలని అడిగావా - కనీసం అనుకున్నావా ? ఉన్నచోటే కైలాసం అనుకున్నావు - పైగా "జమీలు పోయినా దార్లు" మిగిలాయనుకుని తృప్తి పడ్డ జమీందారు బిడ్డవి- నన్నిప్పుడిలా దబాయిస్తావూ?"
" సర్సర్లే - అవన్నీ ఎందుకు గానీ - ఇప్పుడీ ప్రయాణమేంటి నాతో?"
"ఇది నీ ప్రయాణమే - అవునూ ఆ గొంతులో రాచపుండొచ్చి నొప్పొచ్చినా నన్ను తలవలేదేమయ్యా - అది రాకుండా ఆపలేదని నామీద కోపం రాలేదూ?"
"సరిపోయింది. అదేం నొప్పో - పిల్లలు జ్వరం వచ్చిందన్నారు - మందు రాస్తే తగ్గిపోతుందన్నారు - దానికి నువ్వేంచేస్తావు? ఇంతకీ అది రాచపుండా? బావుందయ్యా - నేనున్నది రాచపొరుగు, వచ్చింది రాచపుండు - బాగా కుదిరింది వరస"
"ఇదిగో - ఇలా అనేసుకుని ప్రతీ దానికీ సరిపెట్టేసుకుంటే నీతో నాకు కలహమేముంది - వినోదమేముంది? అసలు నువ్వు ఊరివారితో మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు - నేనేదో సుప్రభాతాలు-పవళింపు సేవల హడావిడిలో వినలేదేమో అనుకుంటే - మీ ఊరి చిన్నవాడు - అదే రాంబాబు మాష్టారు గారి రమేష్ - అతనిదీ అదే మాట"
"అదెప్పుడు నీకు చెప్పాడు - నువ్వెక్కడ విన్నావు?"
"సర్వాంతర్యామిని - నాకు తెలీనివి ఉండవని నీకు తెల్సనుకుంటాను. నీకు ఈ ఫోన్లూ-వాట్సాప్పులూ అలవాటు లేవు కదూ - అలవాటు అనేకన్నా - అక్కర్లేదు కదూ - అదిగో - అక్కడ - మీ వూరబ్బాయి - సతీష్ నడిపే - అనాతవరం గ్రూపులో రమేషేమన్నాడో - విను చదువుతాను
"విన్నాను - సంతోషం "
"నువ్వేంటి - పిల్లల్నసలు ఏమనవా? అలా అయితే భయం-భక్తీ లేకుండా తయారవరూ?"
"పిల్లల్ని భయపెడితే భక్తి రాదు - ప్రేమిస్తే ప్రేమొస్తుంది తిరిగి"
"అర్థమయింది - ఇదిగో ఆ రమేష్ తమ్ముడు - ప్రసాద్ - నీగురించి ఏమన్నాడో విను:
నాకు తెలిసిన నాని గారు
నాని గారు గురుంచి కొన్ని నాకు తెలిసిన అనుభూతులు
ప్రసాద్ వాళ్ళ ఇంటి దగ్గెర క్రికెట్ ఆడినప్పుడుకాని, వాళ్ళ ఇంట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లు చూస్తున్నపుడు, అప్పుడప్పుడు కుర్రాళ్లతో దూరదర్శన్ లో ఆదివారం సినిమాలు చూస్తున్నప్పుడు నాని గారిని దగ్గెర నుండి చూసి అయన గురుంచి కొన్ని మీతో
నాని గారు మౌన ముని అంటే ఎక్కువ మాట్లాడరు కానీ అయన కి తెలియని ప్రపంచ విషయాలు ఏమి ఉండవు .అలాగే వాళ్ళఇంట్లో TV లు చూస్తున్నపుడు ఏ సచినో 6 కొట్టినా లేదా ఏ రవి శాస్త్రీ 6 లు ఇచ్చినా, అప్పుడు టీవీ చూస్తూ వచ్చే కుర్రాళ్ల గొంతులో ఆనందాన్ని లేదా అక్రాందాన్ని కూడా ఆయన సరిగా అర్ధం చేసుకుని ఏమి అనేవారు కాదు.ఇప్పటికి గుర్తు చిత్రలహరి లో మెగాస్టార్ ఆపద్భాందవుడు పాటని నాని గారి ఇంట్లో నేను అయన సోఫా మీద కూర్చుని చూడటం.
కొందరికి నలుగురు తో ఉంటె నాలెడ్జి వస్తుంది కొందరికి ప్రపంచమంతా తిరుగుతే వస్తుంది
నాని గారికి ఆ ప్రపంచ నాలెడ్జి ని తన నాలుగు రకాల న్యూస్ పేపర్స్ తో బంధించి ఇంటికి వచ్చిన ఆ నలుగురి కి ఆ నాలెడ్జిని షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు నేను కూడా Up to Date అని చెప్పడం. - ప్రసాద్ ఓరుగంటి
"....."
"నేను చదివేది నీకు నచ్చిందని నీ చిరునవ్వే చెప్తోంది - మీ ఊరి బిడ్డ - హనుమానూ అదేమాట - విను ఇది కూడా...
ప్రసాద్ నానీ గారి గురించి చక్కగా చెప్పావ్ ! నిజం గా పుస్తకాలు చదవడం అక్కడే అలవాటు అయ్యింది. నాకు తెలిసి మన ఊళ్ళో కుర్రాళ్ళ అల్లరి ని ఆయన చిరునవ్వు తో చూసేవారు ఎవ్వరిన ఆయన ఏరోజు విసుక్కోలేదు.
తెల్లటి గ్లాస్కో పంచె లో ఎప్పుడూ పెదవి పై చిరుదరహసము ఉండే నానీ గారు లేరు అంటే మనసుకు చాలా బాధగా ఉంది. - హనుమాన్
"....."
"ఇదిగో - బాండ్ అంటారు - అదే కుమార్ - నువ్విచ్చిన వాచీ కూడా చూపించాడు అందరికీ - నాని గారి నుండి బహుమతిగా పొందినది - అంటూ...
"అవునూ - నీకు వారం క్రితం జ్వరం వచ్చి కళ్లు తెరిచాకైనా నన్ను తలుస్తావనుకుంటే నీకొడుకుని పిలిచి "ఆ బ్రాహ్మడికి ఓ కుంచెడు బియ్యం - పదిహేను రూపాయలు ఇచ్చి పంపించు - కూరలు కొనుక్కుంటాడు" - అని చెప్తావా? ఇంతకీ అక్కడ ఏ బ్రాహ్మడూ లేడు. నీ కలలో కూడా అడిగేవారు - వాళ్లకి - కళ్ళు తెరవగానే నువ్వు ఇవ్వమని పురమాయించడాలు - బాగు - బహు బాగు - ఇంక నీకు నన్ను తలుచుకోవడానికి సమయమేది?"
"ఇంతకీ నిన్ను తలుచుకుని నువ్వొస్తే నీకేం చెప్పాలి - అన్నీ వున్న నేను నిన్నేమని అడగాలి"
"కనీసం నొప్పి తగ్గించమని వేడొచ్చుకదా - అలా నీలో నువ్వే బాధ పడకపోతే?"
"సరి - ఇప్పటి నొప్పి సరే - ఇంతకు ముందెప్పుడూ నాకు నొప్పి రాలేదా- శరీరానికి కానీ - మనసుకి కానీ - మరప్పుడేమయ్యావు?"
"నాకు లోకమంతా సవాలక్ష మొక్కులు - మొక్కుబళ్లు, విన్నపాలు-సన్మానాలు - తీరిక లేకపోయింది"
"మరి అప్పుడు తీరిక లేని నువ్వు ఇప్పుడు మాత్రం పిలిస్తే వస్తావా - నా సాయమేదో నేనే పట్టుకున్నాను - అయినా నిన్ను పిలవలేదు కానీ - నిన్నేమీ కాదనుకోలేదే - అన్నిరకాలుగా నీ పట్ల నా ధర్మం నిర్వర్తించాను"
"అదీ - అదే మరి - నువ్వు అన్ని రకాలుగా నీ ధర్మం నిర్వర్తించి నన్ను మాత్రం ఏ సాయానికి పిలవలేదనే కదా - నా బాధ! సాయం వద్దు - నిన్నో మొన్నో మెలకువలో వున్నప్పుడు ఒక్కసారైనా మోక్షమిమ్మన్నావా?"
"ఎవరన్నా వింటే నవ్వుతారు - అదీ ఓ బాధే - చెప్తా విను - మోక్షం కోరడమూ ఓ కోరికే - నిన్నడగాలి - అడిగితే ఇస్తావో - కాదంటావో. ఇస్తే సరే - కాదంటే మళ్లీ నువ్వెందుకు నాకివ్వాలో కారణాలు చెప్పి నిన్నొప్పించాలా? అలా చెప్పినా నువ్వు ఒప్పుకుంటావని ఏముంది?ఎందుకా లేనిపోని వాదన అని వూరుకున్నాను. అయినా చివరివరకూ ఇవ్వగలిగినంత ఇవ్వడంలో వున్న ఆనందం - పుచ్చుకోవడంలో వుండదులే"
"భేషైన మాట చెప్పావు ! ఇదిగో ఇప్పుడే చూశాను - పేపర్లో వార్త. ఇందాకట్నుంచీ ఈ ఆకాశవీధిలో - కళ్లు మిరుమిట్లుగొల్పే ఈ నక్షత్ర కాంతిలో - నీ చూపానట్లేదంటే ఏంటా అనుకున్నాను - కారణం తెల్సింది - వచ్చేటప్పుడు ఇచ్చే వచ్చావూ - మాటల్లో పడి నేను గమనించనే లేదు సుమీ ... చదువుతాను విను ...
"83 ఏట దాకా కళ్ళజోడెరగను - అవి ఇంకొకరికి చూపానజేస్తే అంతకన్నా ఇంకేం కావాలి?"
"బానే వుంది సంబడం - ఓ మాట మాట్లాడవు - పుస్తకాలు తప్ప ఇంకే కాలక్షేపం లేదు - కళ్లు కూడా దానమిచ్చేస్తే నీకు కాలక్షేపమెలా?"
"చేసేవన్నీ చేసేసి ఏమీ ఎరగనట్టు నన్ను దబాయిస్తావేంటి? కథలు-కబుర్లు చెప్పే మా అమ్మని తీసుకెళ్ళావ్. నా ఇంటి మాలక్ష్మి-లలితనక్కడ చేర్చావ్. మోహనరాగం ఎంత బాగా పాడేదనీ?! - అదే మా కుట్టి - అందరికన్నా చిన్నదని కూడా చూడకుండా పట్టుకెళ్లి అక్కడ చేర్చావు కదా - వాళ్లందరూ వుండగా నా కాలక్షేపానికి లోటేంటి?"
"సమయానికి బాగా గుర్తుచేశావ్ - మీ ఇంటి ఇంకో పిల్ల పప్పి ఏమందో విను -
అప్పకు నమస్సుమాంజలి అర్పిస్తూ - వారి అత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
అప్ప , దొడ్డ చక్కగ ఈ రెందు ఏళ్లు మిస్ అయిన కబుర్లు చెప్పుకుంటు వుండి వుంటారు. నేత్ర దానం సింప్లీ సుపర్బ్. I'm proud to be one of the Vadlamani family members!
గెలిచావయ్యా- నాని!! - ఉన్నన్నాళ్లూ చప్పుడు చేయక - ఉనికి మాత్రమే తెలిసేలా - చుట్టూ వున్నవారికి దీపంలా వెలుగు పంచి - ఇప్పుడు మలుగుతూ ఇంకో కంటికి వెలుగునివ్వబోతున్నావు - మీ వాళ్లన్నట్టు అమరజీవివే - ఈమాట దేవుణ్ణి నేను మాత్రమే కాదు - నిన్నెరిగిన వారందరూ అంటున్న మాట"

Very rare combination -highly educated, reserved, great humanity and
values in one person in our village Never asked anyone to respect him,
but none of us behaved badly when he is around. - రమేష్ ఓరుగంటి