కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ
ఇంతకు ముందు చెప్పడం మర్చిపోయాను - B.Sc ఫస్ట్ ఇయర్ లోనే ACC Centenary సెలెబ్రేషన్స్ జరిగాయి. ఆ సందర్భంగా చాలా బుక్ స్టాల్స్ పెట్టారు. స్టాంప్ ఎగ్జిబిషన్ జరిగింది. . దాదాపు నా ఆరవ తరగతి నుంచీ చేస్తున్న నా స్టాంప్ కలెక్షన్ ఒక డీసెంట్ కలెక్షన్ గా మారింది డిగ్రీ లోనే. నాన్న ఇచ్సిన పాకెట్ మనీ, దండాల పండక్కి (సంక్రాంతి) నాన్నమ్మ ఇచ్చిన డబ్బులతో బోల్డన్ని స్టాంప్స్ కొనుక్కున్నాను.
ఇక సెకండ్ ఇయర్ మొదలయ్యాక - ఈసారి అమ్మతో చెప్పించుకోకుండానే నా అంతట నేను అపర్ణ తో కలిసి ముందు రాఘవేంద్ర రావు (BRR) గారి దగ్గరికి వెళ్లాను - ఒక రోజు సాయంత్రం - ఫిజిక్స్ ట్యూషన్ బ్యాచ్ ఎప్పటినుంచో తెలుసుకుని సీట్ రిజర్వ్ చేసుకుందామని.
మేమెళ్లే టైంకి ఆయన వేరే బ్యాచ్ క్లాస్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.
మమ్మల్ని చూడగానే బయటికి వచ్చి - మేము "గుడ్ ఈవెనింగ్ సర్" అనగానే - "ఏంటీ ఇలా వచ్చారు?" - అనడిగారు.
నాకెందుకో కొంచెం మొహమాటంగా అనిపించి చిన్నగా నవ్వి సైలెంట్ గా వుండిపోయాను.
అపర్ణ "సర్! సెకండ్ ఇయర్ బ్యాచ్ ఎప్పటినుంచండి?" అనడిగింది
"మండే నుంచి స్టార్ట్ !" అని తనతో అంటూ నాకేసి తిరిగి - "అవునూ - నీకు ట్యూషన్ అంటే ఇంట్రెస్ట్ లేదు కదా - నువ్వెందుకు వచ్చావు? " అని నేను సమాధానం చెప్పేలోపే " జూనియర్ ఇంటర్ లో ఎన్నాళ్ళొచ్చావ్?" అనడిగారు.
"వన్ మంతండీ " నా సమాధానం
"సీనియర్ ఇంటర్లో ?" -
"2 వీక్స్ అండీ"
"డిగ్రీ ఫస్ట్ ఇయర్- అసలే లేదు. నువ్వు జూనియర్ ఇంటర్ లో మానేసినప్పుడే చెప్పేయాల్సింది ఇంక రావద్దని. సీనియర్ ఇంటర్ లో మీ అమ్మగారు వచ్చి అడిగారని సరే అన్నాను. నిన్ను తీసుకోకపోతే ఇంకో ఇంట్రెస్ట్ వున్న స్టూడెంట్ చేరతాడు. ..." అంటూ ఎందుకో నా మొహం కేసి చూసి ఏమనుకున్నారో - "సరే ! ఇద్దరూ వచ్చేవారం నుంచీ రండి " అన్నారో లేదో - ఇంకా అక్కడే వుంటే మళ్లీ ఆయన మనసు మార్చుకుంటారేమో అని భయమేసి "Thank You Sir!" - అనేసి గబగబా బయటకొచ్చేశాం - నేను, అపర్ణ.
ఫిజిక్స్ తప్ప ఇంకో భాష రాని BRR గారి చేత ఇంకో భాష మాట్లాడించిన ఘనత నాదేనేమో :)
అక్కడి నుంచి భవభూతి శర్మ గారి దగ్గరికి వెళ్లాము - కెమిస్ట్రీకి - ఆయన దగ్గరికి నేను వెళ్లడం అదే మొదటిసారి. అందుకని BRR గారి దగ్గర లాంటి ఎపిసోడ్ జరగలేదు.
ఇంకా చివరిగా - మాథ్స్ - కోటేశ్వరరావు గారింటికి వెళ్లాము.
అప్పటికే చాలా మందిఅబ్బాయిలు, అమ్మాయిలు సర్ చుట్టూ నించుని వాళ్ల వాళ్ల బ్యాచ్ టైమింగ్స్ గురించి నోట్ చేసుకుంటున్నారు. వాళ్లందరితో మాట్లాడడం అయ్యి వాళ్లని పంపించేశాక మా వైపు వచ్చారు కోటేశ్వరరావుగారు.
నేను, అపర్ణనే కాక మాతోపాటు రమణకుమారి (RK), ఆషా కూడా వున్నారు.
నేను ఇక్కడకూడా కొంచెం వెనక్కి నించున్నాను. అపర్ణ, రమణకుమారి, ఆషా - ఆల్రెడీ ఇంతకు ముందు ఏడాది కూడా ఆయన దగ్గరికే మాథ్స్ ట్యూషన్ కి వెళ్లి వుండడంతో ఆయన వెంటనే టైమింగ్స్ చెప్పడం, వాళ్లు సరే అనడం జరిగిపోయింది. సర్ "ఇంక రండమ్మా సోమవారం నుంచి - మొదలు పెట్టేద్దాం" అని ఇంటి లోపలికి వెళ్లబోతూ ఆగి నాకేసి తిరిగి "నిన్ను చేర్చుకోలేనమ్మా" అని ఒక్క మాట మాత్రం అనేసి నా మొహం లోకి చూశారు.
నాకింక బోల్డంత ఏడుపు వచ్చేసింది - ఎప్పుడూ లేనిది బోనస్ గా రాబోతున్న సెప్టెంబర్ మాథ్స్ మార్క్స్ కార్డు కళ్ల ముందు కనిపించింది. కళ్లలో నీళ్లు ఎవరికీ కనిపించకూడదని తల "సరే" నన్నట్లు అటూ ఇటూ తిప్పి అపర్ణ పిలుస్తున్నా వినిపించుకోకుండా దాదాపు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశాను.
అప్పుడే పప్పి, కుట్టి నాగార్జున సంగీత కళాశాలకి వీణ, సంగీతం క్లాసులకి వెళ్దామని బయల్దేరి చెరో సైకిలూ పట్టుకుని గేట్ దగ్గర నించుని అమ్మతో ఎదో మాట్లాడుతున్నారు.
నన్ను చూడగానే "అపర్ణ ఏదీ ? ఇద్దరూ కలిసివెళ్లారుగా - జంటకవుల్లా" అనడిగింది అమ్మ.
"జంటకవులా - జంటకపులా?" అని దాని ధోరణిలో ఏదో ఇంకా అనబోతూ నా కళ్ళలోంచి అప్పటికే కారిపోతున్న నీళ్లు చూసి "అమ్మా! దీనికి ఆకలి వేస్తున్నట్టు వుంది - గబగబా ఏమన్నా పెట్టు" అంటుంటే నేనుక్రోషంగా "నువ్వింక నీ క్లాసుకి వెళ్లు - నన్నొదిలి" అని ఆ గేట్ దగ్గరే నించుని కళ్లు తుడుచుకుంటూ వున్నాను. "సర్లే నా సంగీతం క్లాస్ అయి రాగానే నీ పని చెప్తాను" అనుకుంటూ పప్పితో కలిసి వెళ్ళిపోయింది కుట్టి.
ఇంతలో నా వెనకాలే వస్తున్న అపర్ణ, RK, ఆషా వచ్చేశారు. వస్తూనే చెప్పారు " నువ్వొచ్చేశావు పిలుస్తున్నా వినకుండా. సర్ చెప్పారు నిన్ను కూడా ట్యూషన్ కి రమ్మని" అని.
అప్పటికి మా అమ్మకి అర్థం అయ్యింది సంగతి ఏంటో.
"ఆ మాత్రం దానికే ఏడుస్తారా లల్లీ?" అని నాతో అంటూ "మీరన్నా మా లల్లీకి చెప్పండమ్మా - అలా ఏడవకూడదని. నీళ్లకుండ నెత్తిమీద ఉంటుంది లలితా పరమేశ్వరికి" అనగానే రమణకుమారి పెద్ద ఆరిందాలా "ఆంటీ! మీ లలితకి పెళ్లి చేస్తే మీరు ఇల్లరికం తెచ్చుకుంటే బెటర్" అంది.
అదివినగానే మా అమ్మకేం బెంగొచ్చిందో నా కంటి నీళ్లు ఆవిడ కళ్లలో ముత్యాలై మెరిసాయి.
మా కుట్టి అన్నట్టు అలా - literally - ఏడ్చి సాధించాను - అస్సలు నేనెప్పటికీ వెళ్ళకూడదు అనుకున్న ట్యూషన్స్ లో సీట్లు.
ఇంక కాలేజ్ లో కూడా రోజులు కూడా గబగబా దొర్లిపోతుండేవి - ఫిజిక్స్ మెయిన్ అవడంతో వారానికి మూడు రోజులు ల్యాబ్ వుండేది.
ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ పార్టీ లో కాలూపుతూ నా "సుహానా సఫర్" పాటని మెచ్చుకున్న హనుమంతరావు గారు (KHR) - ఫిజిక్స్ లో Sound టీచ్ చేసేవారు.
ఒకరోజు ల్యాబ్ లో Sonometer ఎక్స్పరిమెంట్ - నేనూ, అపర్ణా మహా ఉత్సాహంగా ట్యూనింగ్ ఫోర్క్ తో ఆడుకుంటూ, పేపర్ రైడర్ వైబ్రేషన్స్ కి కింద పడుతూ వుంటే - ఆడుతూ పాడుతూ తొందరగా ముగించేశాం.
దగ్గర్లోనే మా ఇద్దరి పుట్టినరోజులూ వుండడంతో - ఒకరికొకరం గిఫ్ట్స్ ఎం కొనుక్కోవాలో తెగ డిస్కషన్ నడుస్తోంది మా ఇద్దరి మధ్య.
మేమిద్దరం న్యూ ఇయర్ కి, పుట్టినరోజులకి, మా ఫ్రెండ్స్-డేకి (ఆగస్ట్ 8 - మేమిద్దరం ఫ్రెండ్స్ అయిన రోజు - ప్రతీ ఏడాది ఇష్టంగా జరుపుకుంటాము.) ఇద్దరం గిఫ్ట్స్ కొంటాము ఒకరికొకరం - కానీ... ముందే ఏం కావాలో తెలుసుకొని అదే కొంటామన్నమాట.
అదిగో ---అలాంటి కబుర్లలో మేముండగా KHR గారువచ్చి పక్కనే నించుని కాసేపు మా మాటలు విని -
"Did you finish your calculations?" - అనడిగారు.
నేను - "We will do at home, Sir" - అని బదులివ్వగానే
అచ్చ తెలుగులో - "ఇంటికి వెళ్లి చేస్తావా? ఏంటీ? డాబా ఎక్కి అల్లరేగా? Complete them now!" - అన్నారు.
పక్కనుంచి గోళీసోడా కొట్టిన శబ్దం వినిపించి - తిరిగి చూస్తే పక్కనే Bernoulli, పానకాలస్వామి KHR ని ఏదో డౌట్ అడగడానికి వచ్చి - ఆయన నన్ను అన్న మాటలు విని నవ్వాపుకుంటూ కనిపించారు.
కొంచెం కోపంగానే కాళ్ల చెప్పులు టప-టపలాడిస్తూ Clark's Tables పుస్తకం, ల్యాబ్ రీడింగ్స్ తీసుకుని అపర్ణతో పాటు ఒక పక్కగా నించుని calculations చేయడం మొదలుపెట్టాను.
(Bernoulli, పానకాలస్వామిల అసలు పేర్లు నాకసలు గుర్తు లేవు -మా క్లాస్ లో మొదటిసారిపరిచయం అయినప్పటి context ని బట్టి వాళ్లకి అలా బారసాల అయిపోయింది -
Bernoulli - ఎప్పుడు చూసినా బోర్డు మీద Bernoulli's equations రాసేస్తూ ఉండేవాడు
పానకాలస్వామి - మంగళగిరి నుంచి వచ్చేవాడు )
KHR గారు Bernoulli, పానకాలస్వామిలను చూసి ఏంటన్నట్టు కళ్లెగరేశారు.
"సార్! ఆ Sonometer దారం లో లూప్స్ రావట్లేదండీ!'
"ఏం - ఎందుకలా ?"
"ఏమోనండీ - వెయిట్ కూడా బానే పెట్టాం"
"వెయిట్ బానే పెట్టారా? అంటే ఎంతా ?"
"ఆరండీ"
"అంటే మూడు కేజీలు - అసలు నువ్వు కూర్చోలేకబోయావు?"
ఇప్పుడు మేము కిలకిలా - వాళ్లు వలవలా :))
సెకండ్ ఇయర్ లో మాథ్స్ రాశాను - సెప్టెంబర్ లో. ఆ పేపర్ సెట్ చేసిన వాళ్లెవరో గానీ చాలా సమదృష్టి గలవాళ్లు - హన్నా! ఈజీ గా ఇచ్చేస్తే మార్చ్ లో రాసిన వాళ్లకి అన్యాయం చేసినట్టవ్వదూ ?! - అన్నట్లు దాదాపుగా అదేమోడల్ లో ఈసారి కూడా అవుట్ ఆఫ్ సిలబస్సే. కానీ ఈసారి రాసేశాను.
పరీక్షల హడావిడి అవుతూనే నాన్న చెప్పారు - KITS లో ఇంజినీరింగ్ చదువుతున్న బాబు నాలుగు రోజులు సెలవులు దొరికాయని వరంగల్ నుంచి వస్తున్నట్టు.
అప్పటికే - ఇంట్లో - గుంటూర్లో చదువుకోవడానికి వచ్చి - వినాయకచవితి పండగ కోసమని - మా ఇంటికి వచ్చిన నాన్న ఫ్రెండ్ కొడుకు కృష్ణంరాజు వున్నాడు.
హైద్రాబాదు నుంచి ప్రశాంతి, లక్ష్మి దొడ్డ వచ్చి వున్నారు. చిలకలూరిపేట నుంచి రవి వచ్చాడు. ఇల్లంతా సందడి సందడిగా వుంది.
ఆ రోజు సాయంత్రం బాబు వచ్చాడు. వస్తూనే ఎప్పట్లాగే బోల్డన్ని నవ్వులు తెచ్చాడు.రాత్రి అందరం భోంచేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే తన ఇంజనీరింగ్ కాలేజ్ రాగింగ్ విశేషాలు చెప్పాడు - ఇలా :
"మా సీనియర్లు ఒక డబ్బాలో చీటీలు తీసుకొచ్చి మా క్లాసులో వాళ్లని ఒక్కొక్కళ్లుగా వచ్చి చీటీ తీసుకుని అందులో ఏది వస్తే అది స్టేజ్ ఎక్కి చేయాలి అన్నారు.
నా ముందు ముగ్గురున్నారు - వాళ్లకి ఏదో పాట పాడాలి, జోకు చెప్పాలి ఇలాంటివేవో వచ్చాయి. ఇంతలో నా వంతు వచ్చింది - చీటీ తీసి చూస్తే "కుయిలీ గురించి మాట్లాడాలి" అని వుంది.
నాకేమో కుయిలీ అంటే అర్థం తెలీలేదు. స్టేజ్ ఎక్కబోతూ ఎందుకయినా మంచిదని మా సేనియర్నే అడిగాను - కుయిలీ అంటే ఏంటండీ - అని.
అతను సరదాగా నవ్వుతూ - నీ ఫేవరెట్ ఏక్టర్ - అన్నాడు.
ఓస్ - ఇంతేనా - అనేసుకుని స్టేజ్ ఎక్కి "నా ఫేవరెట్ ఏక్టర్ NTR ఎందుకంటే ..."- అని మొదలుపెట్టి ఓపది నిముషాలు ఆపకుండాఎన్టీఆర్ డైలాగులు, పాటలు ఉదాహరణలుగా చెప్పేస్తూ మాట్లాడేశాను.
ఆ పది నిముషాలూ - హాల్ అంతా - పిన్ డ్రాప్ సైలెన్స్.
"ఆహా! నా స్పీచ్ కి మొదటిరోజే ఇంత ఇంప్రెస్స్ అయిపోయారేంటబ్బా?! - అని మురిసిపోతూ స్టేజ్ దిగివస్తుంటే - ఇందాక కుయిలీ అంటే- నీ ఫేవరెట్ ఏక్టర్ - అన్న సీనియర్ ఎదురొచ్చి - "అవునూ - ఇంతకీ మేమా రాగింగ్ చేస్తోంది నిన్ను - లేకపోతే నువ్వు మమ్మల్ని చేస్తున్నావా? నీకు కుయిలీ ఎవరో తెలీదా నిజంగానే?" అనడిగాడు.
తర్వాత తెలిసింది కుయిలీ అంటే సినిమాల్లో డాన్సులు చేసే ఏక్టర్ - అని"
బాబు చెప్పే కబుర్లు విని అందరూ ఒకటే నవ్వు.
తరవాతి రోజు సాయంత్రం పత్రి కొనుక్కు రావడానికి - నన్ను, బాబుని - శంకరవిలాస్ సెంటర్ కి వెళ్లి రమ్మంది అమ్మ.
షాపుల వాళ్లు అడిగినంతా ఇచ్చిరాకుండా - జాగ్రత్తగా బేరమాడి - మంచి ఆకులు, పళ్ళు చూసి కొనుక్కురమ్మంది.
వెళ్లేముందే అడిగాను - "బాబూ! నీకు బేరమాడడం వచ్చా?" - అని.
"ఇదిగో అలాంటివన్నీ నాకు పెట్టకు - నీతో వెళ్లమన్నారు - వస్తున్నాను - నేను వెనకాల నించుని నువ్వు మోయలేవు కాబట్టి సంచీయో, బుట్టో పట్టుకుంటాను- అంతే" అన్నాడు.
"సరే - ఈ బాబుకి అసలు బేరమాడడమంటే ఏంటో తెలిసి రావాలి ఈ దెబ్బతో" - అనుకున్నాను - నాలో నేనే నవ్వేసుకుంటూ.
వెళ్లేటప్పుడు నడుచుకుంటూ వెళ్లాము.
ముందు తమలపాకుల అమ్మే ఒక ముసలావిడ దగ్గర ఆగి - "కట్ట ఎలా?" - అన్నాను - మా అమ్మ ఎలాబేరమాడడం చేస్తుందో గుర్తు తెచ్చుకుంటూ.
"కట్ట రూపాయిన్నర"
"రూపాయి ముప్పైఐదు పైసలకి ఇస్తారా?" -అంతకంటే తక్కువకి అడగాలంటే మొహమాటంగా అనిపించింది మరి.
"ఒకటీ-నలభైకి తీసుకో " - ఉదారంగా ఇస్తున్నట్టే అనిపించింది నాకు.
డబ్బులు ఇచ్చి వెనక్కి తిరిగి చూస్తే - నవ్వుతూ అటెటో చూస్తూ బాబు.
"తెలుస్తోంది అబ్బాయికి నేనంటే ఏంటో" - అనుకున్నాను.
వర్సగా - రూపాయి నోట్లు చేత్తో పట్టుకుని - మూర మూడు రూపాయలు చెప్పిన పూలు రెండూ తొంభైకి, డజను ఐదు రూపాయలు చెప్పిన అరటి పళ్ళు నాలుగు డెబ్భై ఐదుకి, పది రూపాయలు చెప్పిన పత్రి తొమ్మిదిన్నరకి - చాలా తెలివిగా బేరమాడేసి - అవన్నీ మోసుకుని నడవలేం కాబట్టి రిక్షా ఎక్కుదాం అన్నాను.
బాబు నావెనకాలే కొన్నవన్నీ మోసుకుంటూ వచ్చాడు - రిక్షా అబ్బాయిని - బ్రాడీపేట 4/18 కి - అని చెప్తే - "పండక్కదమ్మా - రెండున్నర ఇవ్వండి " - అన్నాడు.
మళ్లీ మా అమ్మ చేసిన బేర-బోధ గుర్తుకొచ్చి - "లేదు - రెండు రూపాయిలయితేనే వస్తాము" అన్నాను.
పక్కనుంచి బాబు నవ్వు -"రిక్షా తొక్కేది నువ్వు కాదు వస్తాము - కాదు - రిక్షా ఎక్కుతాము అనాలి " అంటూ.
నాక్కొంచేమేం - బాగానే కోపం వచ్చేసింది - బాబు మీద, బేరం కుదరని రిక్షా మీద.
"నేను నడిచెళ్లిపోతాను అయితే - నువ్వెక్కేసి రా రిక్షా" అని ముందుకి నడిచాను.
పాపం - ఆ రిక్షా అతను - కొంచెం పెద్దవాడు - అలసిపోయి వున్నాడు - "పదండమ్మా - నాదీ లాస్ట్ బేరమే - ఈరోజుకి - మా ఇల్లు అటేపే" - అని ఎక్కించుకున్నాడు.
పత్రీ, పళ్లూ వున్న సంచీ తో పాటు బాబు సీట్లో కూర్చుంటే - నేను రిక్షా అతని సీట్ వెనకాల అడ్డంగా వేసిన చెక్క మీద కూర్చుని ఇంటికి వచ్చేశాం - దార్లో ఎక్కడా కూడా బాబుతో మాట్లాడనే లేదు నేను కోపంతో.
రిక్షాలో కూర్చుయి ఇంటికి వచ్చేంత వరకూ ఆలోచిస్తూనే వున్నాను - "పాపం - పండపూట కూడా ఆ రిక్షా అతను పని చేస్తేనే డబ్బులొస్తాయి. ఎలాగైనా కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వాలి - కానీ బాబు చూస్తే ఏడిపిస్తాడు ఎలా ?!" - అని.
ఇంటి దగ్గర దిగగానే - బాబు దిగి పత్రీ, పళ్ళూ దింపే హడావిడిలో ఉండగా - తను చూడట్లేదనుకుని రిక్షా అబ్బాయికి ఐదు రూపాయలిచ్చి - "ఉంచుకో" - అని చెప్పి గబగబా ఇంట్లోకి వెళ్లిపోయాను.
ఇంట్లోకి వెళ్లామో లేదో - బాబు కుట్టిని పిలిచి "నీకో కథ చెప్తా రా" అని - నాకు వినబడేలా -
" అనగనగా ఒక అడవిలో ఒక సింహం వుంది. అన్ని జంతువులనీ తినేస్తోందని జంతువులన్నీ సింహంతో రోజుకొక జంతువుని ఆహారంగా పంపించేలా ఒప్పదం కుదుర్చుకున్నాయి"
అని మొదలు పెట్టగానే - "అబ్బా బాబూ - ఇది తెలిసిన కథేగా ! " అంది అది.
"నన్ను చెప్పనీ ! ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివిగలది కదా - మన లల్లీలా! - అదేమో ఒక ప్లాన్ వేసి సింహం దగ్గరికి వెళ్లి - "సింహం ! సింహం! - దారిలో ఒక నుయ్యిలో అచ్చు నీలాంటి సింహాన్ని చూశాను. దాన్నలాగే వదిలేస్తే నీకు పోటీ వస్తుంది. పద చంపేద్దుగాని" అంది.
సింహం కుందేలు మాట విని దాంతో పాటే ఆ నుయ్యి దగ్గరికి వెళ్లింది. నుయ్యిలో తన రిఫ్లెక్షన్ చూసుకుని ఇంకో సింహం అనుకుంది"
వింటున్న నాకు - బాబు ఎందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు - మేమందరం చిన్నప్పట్నుంచీ విన్న ఆ కథని.
బాబు కథ చెప్తూనే వున్నాడు "అప్పుడేమో - ఆ సింహం - కుందేలు కేసి చూసి నేను నిన్ను తినేస్తానని తెలిసి కూడా నాకింత హెల్ప్ చేస్తున్నావంటే - నువ్వు మామూలు కుందేలు కాదు. కుందేలూ-త్యాగమయివి - ఆ నూతిలో సింహాన్ని చంపాలి అంటే బలం కావాలి కదా - నిన్ను తినేసి ఆ బలం తెచ్చేసుకుంటానేం! - అని కుందేల్ని తినేసి నూతి లోకి దూకేసింది"
కుట్టి, పప్పి - ఆ కథ విని తెగ నవ్వుతూ -"ఇంతకీ ఆ కుందేలు-త్యాగమయికి లల్లీకి ఏంటి పోలిక ?" అడిగితే
బాబు ఎదురు ప్రశ్న "ఆకులూ, పూలూ, పళ్లూ - ఎంతో బేరమాడి 95 పైసలు ఆదా చేసి - రిక్షాకి అడిగిన దానికన్నా మూడు రూపాయలుఎక్కువ ఇస్తే - టోటల్ గా త్యాగమెంతా - అంటే - ఆ పోలికంత - అవునా-కాదా?"
"పోన్లే బాబూ - ఇది తేగలు ఎక్కువ తింటుంది - అందుకే రాను రానూ - త్యాగరాణి అయిపోతోంది" - పప్పి, కుట్టి యుగళ-వ్యాఖ్య!
వినాయక చవితి ఇంకా రానేలేదు - చవితి చంద్రుణ్ణి చూణ్ణే లేదు - ఎంత గోలాపనింద నామీద - హన్నా!
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

మీ కబుర్లు, జ్ఞాపకాలు సరదాగా పంచుకుంటున్నారని అర్ధమవుతోంది గానీ చిన్న ధర్మసందేహం అండి. కాలేజ్‌లో మీకు పాఠాలు చెప్పిన లెక్చరర్లే ట్యూషన్‌లు చెప్పిన లెక్చరర్లు కూడానా? దాన్ని బట్టి, అవసరమయితే, తర్వాతి సందేహం అడుగుదామని 🙂.
రిప్లయితొలగించండిమీ ధర్మ సందేహానికి సమాధానం - "అవును-కాదు" అండీ :)
తొలగించండిNice to read... bale rastaru meeru.. cchaduvutunte inka chadavali anipistundi.... ending lo appude ayyippyonda anipistundi
రిప్లయితొలగించండిథాంక్స్, శారదా! నీ కమెంట్ చూసి బోల్డంత సంతోషంగా అనిపించింది.
తొలగించండిత్యాగమయి నీ త్యాగానికి జోహార్లు !!!!హి..హి...హి...హి !
రిప్లయితొలగించండిలలితా "త్యాగ" సుందరి మరి ;)
తొలగించండిమీ కుట్టి పిలిచే అల్లరి పేర్లు గానీ, మీ కాలేజిలో పెట్టే nick names గానీ భలే humorous గా ఉంటాయి లలితా!
రిప్లయితొలగించండి''త్యాగరాణి'...'గోలాపనింద'....... :-)
మాటల గారడి
తొలగించండినవ్వుల సందడి
- అది మా trio motto :)