16, నవంబర్ 2024, శనివారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 6

  క్రిందటి శ్లోకం / Previous slOkaH:  స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 5





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



శ్లోకం - 6

శ్రుత్వా  చైతత్త్రిలోకజ్ఞః 
వాల్మీకేర్నారదో  వచః
శ్రూయతామితి  చామంత్ర్య
ప్రహృష్టో  వాక్యమబ్రవీత్



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అర్థం: 

త్రిలోకజ్ఞుడైన నారదుడు అప్పటి వరకు వాల్మీకి మహర్షి అన్న మాటలను విని సంతోషించి "వినుము" అని
ఇట్లు పలికెను. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)

శ్రుత్వా చ ఏతత్ త్రిలోక-జ్ఞః 
వాల్మీకేః నారదః వచః
శ్రూయతాం ఇతి చ ఆమంత్ర్య
ప్రహృష్టః వాక్యం అబ్రవీత్ 


శ్రుత్వా చ = విని
ఏతత్ = ఆ (ఇంతకు ముందు చెప్పిన)
త్రిలోక-జ్ఞః = ముల్లోకాలు తెలిసినవాడైన
వాల్మీకేః = వాల్మీకిని
నారదః = నారద మహర్షి
వచః = మాటలను 
శ్రూయతాం = "వినుము" 
ఇతి = అని
 ఆమంత్ర్య = ఆహ్వానించి
ప్రహృష్టః = సంతసించినవాడై
వాక్యం = ఈ మాటలు 
అబ్రవీత్ = పలికెను  



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



श्लोकः - 6

श्रुत्वा  चैतत्त्रिलोकज्ञः |
वाल्मीकेर्नारदो  वचः |
श्रूयतामिति  चामन्त्र्य |
प्रहृष्टो  वाक्यमब्रवीत् ||





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Meaning in English

Hearing the request of Valmiki maharshi, Narada maharshi who possessed the knowledge of three worlds became so happy and said, "Please listen", and addressed the following words.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


Word to word meaning (In the same order of occurrence in the slOkaH):


श्रुत्वा  च  एतत्   त्रिलोकज्ञः |
वाल्मीकेः  नारदः  वचः |
श्रूयताम्  इति  च   आमन्त्र्य |
प्रहृष्टः  वाक्यम्  अब्रवीत्   ||


श्रुत्वा  = hearing
एतत्  = that (the words said by Valmiki maharshi)
 त्रिलोकज्ञः = one who knows three worlds
वाल्मीकेः  = to Valmiki maharshi
नारदः  = Narada maharshi
वचः = words
श्रूयताम् = "Please listen"
 इति  = that
   आमन्त्र्य = addressing
प्रहृष्टः  = being delighted
वाक्यम्  = statement (words)
अब्रवीत्  = spoke



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 7

10 కామెంట్‌లు:

  1. వినుడని రామాయణమును
    వినుపించిరి పెక్కు , రిపుడు వినుపించె తగన్
    ఘను డా వాల్మీకి రచన
    వినుతింతును లలిత గార్ని విద్వణ్మణిగన్ .

    రిప్లయితొలగించండి
  2. పరగ నాంధ్రదేశ పల్లె పల్లెలయందు
    రాముని గుడి లేని భూమి గలదె ?
    ఘనము రామ నవమి కళ్యాణ వేడుకల్
    జరుపని గుడి గలదె ధరణి యందు ?

    రిప్లయితొలగించండి
  3. ఫాలాక్షుం డర్చించిన
    శ్రీలున్ రఘువరుని భక్త చింతామణినిన్
    పాలిత సాకేత పురీ
    శ్రీలలితుని రామభద్రు సేవింతు హరిన్ .

    రిప్లయితొలగించండి
  4. రామ భద్రా యనును తల్లి ప్రేమ మీర
    రాఘవా యని బిల్చు నోరార తండ్రి
    రామచంద్రా యను వశిష్టు డీ మహితుని
    రామ ప్రభుడని కొలుతురు ప్రజలు భక్తి .

    రిప్లయితొలగించండి
  5. మొనసి వాల్మీకి యొక్కడే మూల పురుషు
    డిలను రామాయణ కథాంశములు దెలుపగ
    తక్కొరులు రాసిన కథ యదార్థ మెట్లు
    శ్రీ కరమ్ముగ వాల్మీకి చెప్ప డేని .

    రిప్లయితొలగించండి
  6. ఛందస్సు పాటిస్తున్నారా? అనుష్టుప్పా?

    రిప్లయితొలగించండి
  7. రామాయణ పారాయణ
    శ్రీమద్యజ్ఞం బెచట విశేషంబగునో
    భూమి నచట హనుమ నిలిచి
    క్షేమంకరుడయి జనులకు సిరు లిడి బ్రోచున్ .

    రిప్లయితొలగించండి
  8. ప్రాతస్సాయం సంధ్యల
    సీతా రాములను గొలిచి జీవించు నెడన్
    భూ తలము స్వర్గ సీమగు
    చేతము సుశ్లోకంబగు , చేరవు క్లేశాల్ .

    రిప్లయితొలగించండి