8, నవంబర్ 2024, శుక్రవారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 4

 క్రిందటి శ్లోకం / Previous slOkaH:  స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 3





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



శ్లోకం - 4

ఆత్మవాన్ కో జితక్రోధః
ద్యుతిమాన్ కోనసూయకః
కస్య బిభ్యతి దేవాశ్చ
జాతరోషస్య సంయుగే


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అర్థం: 



వాల్మీకి నారదుణ్ణి ఇంకా ఏమని అడుగుతున్నాడంటే...

ఎవరు ఆత్మనిగ్రహం కలవాడు? కోపాన్ని జయించినవాడు, తేజస్సు కలవాడు, అసూయ లేనివాడు ఎవరు? యుద్ధంలో కుపితుడైన ఎవరిని చూస్తే దేవతలు కూడా భయపడతారు?


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)

ఆత్మవాన్ = ఆత్మనిగ్రహం కలవాడు
కః =  ఎవరు?
జితక్రోధః = కోపాన్ని జయించినవాడు
ద్యుతిమాన్ = తేజస్సు కలవాడు
కః = ఎవరు?
అనసూయకః = అసూయ లేనివాడు
కస్య = ఎవరికి
బిభ్యతి = భయపడతారు
దేవాః = దేవతలు
చ = కూడా
జాతరోషస్య = కోపం కలిగిన వానికి
సంయుగే = యుద్ధంలో

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

श्लोकः - 4

आत्मवान् को जितक्रोधः |
द्युतिमान् कोनसूयकः |
कस्य बिभ्यति देवाश्च |
जातरोषस्य संयुगे ||





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Meaning in English


Valmiki continued to ask Narada:

Who has command over his self? Who has conquered his anger? Who does not have jealousy? When he is provoked by wrath, from whom even the Gods do fear?


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


Word to word meaning (In the same order of occurrence in the slOkaH):

आत्मवान् = subduer of self 
कः = who?
जितक्रोधः = conquers anger
द्युतिमान् = possesses splendor
कः = who?
अनसूयकः = is  not jealous
कस्य = from whom
बिभ्यति = do fear
 देवाः = the Gods
च = too
जातरोषस्य = when wrath is provoked
संयुगे = in the battle




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 5

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి