3, మార్చి 2017, శుక్రవారం

ఒక టి నుంచి ప(ది)ల దాకా...

రోజులు ఒక వారగా వచ్చి వారమై  - వారాల నెలవు నెలై  - నెలల కూడిక ఏడాదై
ఏడుకొకయేడు తోడై - బడి రోజుల అమ్మాయి నుండి - బడికంపే అమ్మనయినా

ఆమని పచ్చని - ఎండ ఎరుపుని - తొలకరి మేఘపు సన్నటి మెరుపుని
శిశిరపు పసుపుని - శీతలపు తెలుపుని - చుక్కల వెలుగులో తళుకుమనే నలుపుని

పూటేదైనా - అది పూసుకున్న రంగేదైనా
వేళేదైనా - కలలదైనా - తలపోసుకున్న కలతదైనా

ఎదలో - ఏమూలనుంచో - ఎప్పుడూ పలకరించి - కలవరింపజేసి 
పెదవిపై  - చిట్టి బుడగలా పగిలి - పెగిలి పెగిలి - వరదలా వెలికివచ్చి

దో ...బూ... చీ - అని అలరించే ఆ పసితనపు గిలిగింత జాడ నాకింకా తోడే

ఆ తోడుందన్న ధీమాతోనే కాబోలు - అప్పుడప్పుడే కాదు - ఎప్పుడంటే అప్పుడు - బుజ్జిజింకల లోకంలోకి పరిగే...త్తుకుంటూ వెళ్లిపోతుంటా.

వెళ్లి ఊర్కుంటానా? -
చెట్టెక్కి ఊగే కొమ్మల వాలి - కింద తూగే ఊడల జారుతా
పోటెత్తే కడలి నురగల అలల వుయ్యాలలూగుతా
రెక్కల-పిట్టల విమానాల చంద్రుని చేరి వెన్నెల కోసుకొస్తా
వెలుగు పూసల దారుల సూర్యుని చిన్నెల పూసుకొస్తా
చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, రోజులు దాటిపోయాయని బెంగ పడనుగా
Green Eggs And Ham, Hop on  Pop, The Cat In The Hat - ఇలా ఇంకెన్నో వున్నాయిగా.

అదుగో ...అలా ...
Dr. Seuss పుస్తకాల ప్రేమలో పడి
కలల-దోనెలో వాలి
కథల-కబుర్ల-వాగులో అల్లి-బిల్లిగా వెళ్తున్న నాకు -
ఓ రెండు వారాలముందు ఏమనిపించిందంటే ...
ఈ Seuss గారు ఇన్ని మంచి పుస్తకాలు ఎన్నో పిల్లల కోసం రాశారు కదా -
ఇవన్నీ చదువుతున్న -  చదువుతూ మురిసిపోతున్న నేను  -
ఆయనంత బాగా కాకపోయినా -
కొంతైనా తెలుగులో రాయగలనా? - రాయనా? - రాసి చూడనా? - అని.

వెంటనే గబగబా నాకెంతో ఇష్టమైన అంకెల లెక్కలు మాటల్లో పెట్టి రాసేశాను -
ఒక-టి నుంచి ప-ది-ల దాకా...
ఒకటంటే ఒక 'టి'  నుంచి పది 'ది' ల దాకా.
రాసి ఊర్కున్నానా ?-
ఇంకా...  వెంటనే 'ఈమాట' వారికి పంపించాను.


ఈమాట వారు - మంచి మాటల వారు - మామంచివారు
ఇంకా...  ఇంకా...  వెంటనే వేసేసుకుంటామన్నారు
ఇంకా - పనిలోపనిగా - మీ ఈ అంకెల మాటలని పాట కట్టిద్దామమనుకుంటున్నాము - పోనీ మీరే పాడతారా? - అనడిగారు
నే రాసిన మాట - నేనే పాట కట్టటమా - ఇకంతకన్నా పసిడిమూట ఏముంటుంది నాకు ?!
అడిగిందే తడవు - మాటల్ని పాట-కాని-పాట కట్టేశా.
ఈమాట వారు మెచ్చేశారు - నా మాటని అచ్చేశారు - నా పాటని అక్కడే మాల గుచ్చేశారు. 


నా పాట-కాని-పాట చదివి వినాలంటే ఈమాట  మీద క్లిక్ చేయండి.
అక్కడ బోల్డన్ని కథలూ, కవితలూ, కబుర్లూ - గొప్ప గొప్ప రచయితలు రాసేవి బోల్డు వుంటాయి.
 వాటి పక్కనే - నా చిన్ని-చిన్ని మాటల అంకెల-పాటా వుంటుంది.

అక్కడకి - వెళ్లి పై బొమ్మలో కనిపిస్తోందే - Dr. Seuss గారి అందమైన బొమ్మతో నా కవిత ఒకటి నుంచి పదిల దాకా...

దానిమీద కూడా క్లిక్ చేశారనుకోండి -  చదివే టైమూ, వీలూ- మీకుంటే ఇప్పుడే చదవొచ్చు 
మీ కళ్లు బిజీ గా వున్నాయనుకోండి - హాయిగా వినేయొచ్చు - ఆ హాయి వినగలిగే వీలుకే!
వినడం మాత్రం - ఏ మాత్రం నా పూచీలేని - ఎట్ యువర్ ఓన్ రిస్కే!


26 కామెంట్‌లు:

  1. అసలు ఈ introduction తో పంపించి ఉండాల్సింది, 'ఈ మాట' e పత్రిక వారికి.
    ఎంత బాగా రాశావో చెప్పలేను.
    నీ కవిత చాలా చాలా బావుంది.
    ఆ కవిత నువ్వు చదివిన/పాడిన తీరు ఇంకా బావుంది.
    ఆ కవితను ఇక్కడ పరిచయం చేసిన తీరు ఇంకా ఇంకా బావుంది.
    Just awesome.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా ఈ కవితని, పాడిన తీరుని, పరిచయం చేసిన విధానాన్ని - పేరుపేరునా నువ్వు మెచ్చుకోవడం - ఇంకెంతో బావుంది.

      తొలగించండి
  2. నేను audio విన్నాక ... నా ఒకటవ తరగతి పంతులమ్మ గారు చెప్పిన పద్యాలు , పాటలు గుర్తుకు వచ్చాయి. పాటల రూపంలొ విషయాలు ఎంత బాగా చెప్పేది ఆమె ? ఇది వింటుంటే చదువుటుంటే అలాగ వుంది. ఇప్పటి పిల్లలకి ఇలాంటివి చెప్పి, వాళ్ళు ఆనందిస్తే ఎంత బాగుండు ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గిరిరాజ్: మీ ఒకటవ తరగతి పంతులమ్మగారిని గుర్తుకు తెచ్చిన నేను, నా కవిత ధన్యులం.

      తొలగించండి
  3. Very nice Lalli. There is a kid within you that has come out beautifully in this poem !

    రిప్లయితొలగించండి
  4. Such a nice tribute to dr Seuss Lalithagaru:) true that some inspirations can wake us up to a different rhythm and realm. The kid in me was envious got growing in dr Seuss's magic. Your audio narration is exquisite👍🏽

    రిప్లయితొలగించండి
  5. 👍👌👏🍀
    బహు బాగు మీబ్లాగు, సు'లలిత'మ్. (ఇంకేమి చెప్పినా లలితంగా ఉండదేమోనని... )

    రిప్లయితొలగించండి
  6. లలిత గారు మీరు పోస్ట్ చేసే కబుర్లన్నీ తప్పకుండా చదువుతుంటాను.
    ఇప్పుడీ పోస్ట్ లో మీ కవిత/పాట కూడా విన్నాను చాలా బాగుంది.
    Happy Women's Day .. :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజిగారు: నా కబుర్లు చదువుతున్నందుకు, నా కవిత విన్నందుకు థాంక్స్!

      తొలగించండి
  7. మీలో చాలా talent కనిపిస్తోందని ఈమధ్యే అన్నాను "కష్టేఫలి" వారి బ్లాగ్ లో. ఆ మాటకి కట్టుబడున్నాను. పాట కూర్పులోను, పాడడంలోను బహుముఖ ప్రజ్ఞ కనిపిస్తోంది. 'లలిత' మైన స్శరంతో వినసొంపుగా ఉంది. Good job 👏.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహారావుగారు: మీ ఈ వ్యాఖ్య నాకు చాలా సంతోషాన్నిచ్చింది. చదివి, విని - మనసులోనే "బావుంది" అనేసుకుని బ్లాగ్ క్లోజ్ చేసేయకుండా ఇలా వచ్చి ఇంత మంచిమాట చెప్పిన మీకు బోల్డన్ని ధన్యవాదాలు.

      తొలగించండి
  8. మీ కవిత చదివాను , విన్నాను.బాగుంది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాలాకుమార్ గారు: కవిత చదివి, విని - మెచ్చినందుకు ధన్యవాదాలు !

      తొలగించండి
  9. రిప్లయిలు
    1. థాంక్స్, పవన్ గారు! మీరు కబుర్లు రాసి చాలా రోజులయినట్లుంది. Hope all is well!

      తొలగించండి
  10. Sujatha: Thank You for your nice words.
    Aparne: Will do :)
    Srinivas garu: Thank You!
    Vasudha: Thanks a lot!
    Kamesh garu: Thank You!

    రిప్లయితొలగించండి


  11. ఒకటికి రెండును మూడిం
    టికి నాల్గైదులను కలిపిరిట స్యూసుకథ
    ల్కిక బుజ్జిజింకలాదర
    ణ కలుగ జేసిరి గదా మన లలిత బాలా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామెంటిడి ఎంతనొ సంతో
      షము నిచ్చిరట చదివిరట స్యూసుకథ
      నే రాసిన అంకెల కథ
      కాదరణ కలుగ జేసిరి గదా మన జిలేబి బాగా :)

      తొలగించండి
  12. దిది...దిది.....మా "ధీధీ"కవిత కి లేదు పోటీ
    అంకెల తోటి పాటలు... అక్షరాలతో ఆటలు ఆడే మా అక్కయ్య 😊
    ఒకటి నుంచి పది వరకూ చదివాను విన్నాను ఆనందించాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నాళ్లకెన్నాళ్లకి హనుమాన్! వస్తూనే మళ్లీ కామెంట్ల సందడి తెచ్చావు - నా అంకెల పాట-కాని-పాట విన్నందుకు చాలా థాంక్స్ తమ్ముడూ!

      తొలగించండి
  13. Awesome kavita 👏 mee voice lo inka 👌🏻adbhutaha

    రిప్లయితొలగించండి