మా వూర - నాల్గు రోజులై
ముసురేసిన ఆకాశం
ముసుగేసిన ప్రకాశం
ఉషస్సు ఎటూ లేదు!
తగులు-మిగుళ్ల నిశిలో చైత్ర పాడ్యమి మసిబారింది
ఉన్నపళాన - నింగి నిచ్చెననెక్కి అందుకోలేని వేప్పూత ఆకాశకుసుమమైంది
తన తర్వాత అందుకోవడానికి విళంబి ఏడాదికావల వేచివుండగా
తనలో చేరిన మునుపెన్నడూ ఎరగని '(హే)మలంబ' ని పోల్చుకోలేక
తన పేరు తానే - ఇల్లలకకుండానే - మర్చిపోయి బిక్కమొహం వేసిన హేవిళంబి -
వెతుక్కోవాలేమో ఇక
ఉగాది! నువ్వెక్కడ?
పంచాంగాల పట్టింపుల్లో
మారు-పేర్ల ఉగాదుల్లో
నీరుకారిన మనసులో
మెరుపులా మెరిసింది
చిరునవ్వు మొలిచింది
ఈరోజు - ఈలాగుండునని
ఆ రోజే - ఊహించి రాశారేమో అనిపించి -
అనుకోకుండానే గుర్తొచ్చిన - కృష్ణశాస్త్రి గారి కవిత
కారుమబ్బు అంచున మెరిసిన తటిల్లత
భావమేదైతేనేం - పొల్లులేని ఆ భాష
నిలిపింది నా మదిన - వెల్లువైన వసంతం
చిరునవ్వు - చిరుజల్లు - కలిసి కురిసి
వెల్లవేయగా - హేవిళంబి ఉగాది - నా సొంతం
ముసురేసిన ఆకాశం
ముసుగేసిన ప్రకాశం
ఉషస్సు ఎటూ లేదు!
తగులు-మిగుళ్ల నిశిలో చైత్ర పాడ్యమి మసిబారింది
ఉన్నపళాన - నింగి నిచ్చెననెక్కి అందుకోలేని వేప్పూత ఆకాశకుసుమమైంది
తన తర్వాత అందుకోవడానికి విళంబి ఏడాదికావల వేచివుండగా
తనలో చేరిన మునుపెన్నడూ ఎరగని '(హే)మలంబ' ని పోల్చుకోలేక
తన పేరు తానే - ఇల్లలకకుండానే - మర్చిపోయి బిక్కమొహం వేసిన హేవిళంబి -
వెతుక్కోవాలేమో ఇక
ఉగాది! నువ్వెక్కడ?
పంచాంగాల పట్టింపుల్లో
మారు-పేర్ల ఉగాదుల్లో
నీరుకారిన మనసులో
మెరుపులా మెరిసింది
చిరునవ్వు మొలిచింది
ఈరోజు - ఈలాగుండునని
ఆ రోజే - ఊహించి రాశారేమో అనిపించి -
అనుకోకుండానే గుర్తొచ్చిన - కృష్ణశాస్త్రి గారి కవిత
కారుమబ్బు అంచున మెరిసిన తటిల్లత
నాకుగాదులు లేవు - నాకుషస్సులు లేవు
నేను హేమంత కృష్ణానంత శర్వరిని
నాకు కాలమ్మొక్కటే కారురూపు
నా శోకమ్ము వలెనే - నా బ్రతుకు వలె - నా వలెనే
భావమేదైతేనేం - పొల్లులేని ఆ భాష
నిలిపింది నా మదిన - వెల్లువైన వసంతం
చిరునవ్వు - చిరుజల్లు - కలిసి కురిసి
వెల్లవేయగా - హేవిళంబి ఉగాది - నా సొంతం
రిప్లయితొలగించండిఓయమ్మ లలిత బిరబిర
సాయంబట్టితివిగాద సారంబొప్పన్!
మాయల విళంబి వత్సర
ఛాయలకై వేచెదనిక చతుర జిలేబీ !
జిలేబి విళంబి :)
రారండి జిలేబి చరచర
తొలగించండిపొగడంబట్టిరిగాద స్నేహంబొప్పన్
రాగల విళంబి వత్సర
ఛాయలకై వేచెదమిక ఇచట ఇలాగే !
లలిత గారు పద్యాలు రాస్తున్నారా !
తొలగించండిబహు చక్కగా ఉందండీ ఈ కందం .
కాపోతే , కుంచం - ప్రయత్నం .....
----- ఉగాది శుభాకాంక్షలండీ .
లక్కాకుల వెంకట రాజారావుగారు: ఇది జిలేబిగారి కందానికి పేరడీ-గారడీయే తప్ప ఛందస్సుతో రాసిన కందం కాదండి. నా కొసరు-కందంలో అందమేదైనా వుంటే అది అసలు-కందానిదే :)
తొలగించండిమీ కవిత సందర్భోచితంగా బాగుంది లలిత గారు. మీకు, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండివిన్నకోట నరసింహారావుగారు: కవిత మెచ్చినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ఉగాది శుభకామనలు!
తొలగించండిహాయిగా ఉంది మీ కవిత.
రిప్లయితొలగించండిలలితా మేడం గారు,
ఉగాది మీ సొంతమైన వేళలో
హృదయపూర్వక శుభాకాంక్షలు -
మీకు - మీ కుటుంబానికి -
మనూరు అనాతవరానికి ...
:)
ఱావుగారు: హాయిగా వున్నవేళ రాసినది ఇది :) మీకు ఉగాది శుభకామనలు!
తొలగించండిబావుందండి మీ కవిత. కృష్ణశాస్త్రి గారిని భలే తలచుకొన్నారు. నిన్న వర్షంతోనే మాక్కూడా పండగయిపోయింది. విన్నకోట వారి పుణ్యమా అని, మీ న-ఉగాది (పాత WWW) వ్యాసం కూడా చదవగలిగాను.
రిప్లయితొలగించండిఅన్యగామిగారు: కృష్ణశాస్త్రిగారిని తలుచుకున్న ప్రతీసారీ ఆమనే - ఉగాదే నాకు.
తొలగించండినా పాత పోస్టు చదివినందుకు మీకు - దాన్ని పైకి తెచ్చే అవకాశం ఇచ్చిన నరసింహారావుగారికి ధన్యవాదాలు.
మీ బ్లాగుని ఇప్పుడే చూసానండీ
రిప్లయితొలగించండిచాలా బావుందండీ..(మొహమాటానికి పోగిడేస్తున్నా కానీ ముప్పావు వంతే అర్ధమయింది.కూసింత గ్రాంథికముంది కదా.,అర్ధమయి చావలే)ఇప్పుడు శబ్దరత్నాకరాన్ని శోదించే
ఓపిక లేదు.. కాస్త 'హేమలంబ'అంటే అర్ధం చెప్పరూ..
రవిచంద్రగారు: నా బ్లాగ్ నచ్చినందుకు సంతోషం. హేమ అంటే బంగారం, లంబ అంటే perpendicular అని తప్ప రెంటికీ కలిపి అర్థం నాకు తెలీదు :)
తొలగించండిహ్హ హ్హ హ్హ హ్హ లలిత గారూ ☺.
తొలగించండిఏమనుకోకండి గానీ ఇది మీరు వినితీరాలి - ఓసారి "మీలో ఎవరు కోటీశ్వరుడు?" కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి 'పాంచాలి' అంటే 'పాంచ్' మందికి 'ఆలి' కాబట్టి 'పాంచాలి' అనే మాట వచ్చిందని 'వివరించింది' 😀😀.
(అన్నట్లు, 'హేమలంబ' అనే పదం ఆంధ్రభారతిలో కానరాలేదు)
విన్నకోట నరసింహారావుగారు: 'మీలో ఎవరు కోటీశ్వరుడు ' లో మీరు చెప్పిన పాంచ్-ఆలి లాంటి ఆలీ-టైపు-పంచులు వినే అవకాశం లేని నా అదృష్టానికి నేనే మురిసిపోతూ వుంటాను :)
తొలగించండిమీరు బ్లాగుల్లో ఓపిగ్గా రాసే వ్యాఖ్యలు చదివి నేననుకునే మాట: మీరు మాత్రం - "మాటల్లో విన్నైన కోటీశ్వరుడు" గారు - అని.
రిప్లయితొలగించండిమాటల్లో విన్నైనటి
కోటీశ్వరుడు గద విన్నకోట జిలేబీ
మేటి లలితమ్మ పలుకుల
ధాటిగ కందపు గమకము ధమధమ వచ్చెన్ :)
జిలేబి
< " మాటల్లో విన్నైన కోటీశ్వరుడు" గారు"
రిప్లయితొలగించండిథాంక్యూ, థాంక్యూ లలితగారు, జిలేబి గారు. మీ అందరి అభిమానం ఉంటే అదే పది ' కోట్లు ' 🤑 🙂.
"ఆలీ-టైపు-పంచులు" ??? అది పంచ్ కాదు లలితమ్మ తల్లీ ☝️. సీరియస్ షో లో సీరియస్ గా అడిగిన సీరియస్ ప్రశ్నకు ఇచ్చిన సీరియస్ సమాధానం (పైగా ఒక్కో ప్రశ్నకు సరైన సమాధానానికి వేలరూపాయల బహుమానం ఇచ్చే సీరియస్ షో) 😬.
రిప్లయితొలగించండినిజంగానే మీ అదృష్టానికి మురిసిపొండి. Happy weekend 👍.
విన్నకోట నరసింహారావుగారు: వివరించినందుకు ధన్యవాదాలు. My TV ignorance is my bliss :)
తొలగించండి