4, మే 2018, శుక్రవారం

మనసే జతగా పాడిందిలే - 10 - కవలపాటలు - ఆ పాటా ఈ పాటా ఒకటే లెమ్మంటి!


ఈ మధ్యనే ఒక పాట అనుకోకుండా టీవీలో కన్నానంటి
కంటూ, వింటూ - ఇదెక్కడో విన్నానింతకు ముందే అనుకొంటి
ఏంటా పాటా ....? అని అనుకొన్నానంటి
అనుకున్న తడవే గుర్తు పట్టానంటి
అది నా చిన్నప్పడు విన్న ఆ పాటే అని మురిశానంటి

అప్పటి పాటలో మాటలు ఎక్కువ అనుకొంటి
ఇప్పటి పాటకు కొన్నే మాటలు తెచ్చారు అరువంటి
పాత పాటకు రాగం వేగమంటి
కొత్త పాటకు దరువులు సొగసంటి

ఆ పాటలు మళ్ళీ విన్నానంటి
నా బ్లాగులో పోస్టుగా రాద్దామనుకొంటి
ఈ శుక్రవారం వీలుందనుకొంటి
'పాటల భైరవి' హ్యాటే పెట్టానంటి
పాటల మాటలు టైపానంటి
యూట్యూబుల లింకులు పట్టానంటి
ఈ కిందనే అన్నీఇచ్చానంటి
ఆ మాటలు చదవండంటి
ఆ ఆటలు చూడండంటి
నాకు నచ్చిన పాటలు ఇక్కడ పంచానంటి

ఇదీ అసలు సిసలు పాటంటి:

సినిమా ఏంటి? - మంచి-చెడు అంటి
ఎవరు రాశారేంటి? - మన-సు-కవి ఆత్రేయ అంటి
ఎవరు వరస కట్టారేంటి? - మెలోడియస్ ఎమ్మెస్ విశ్వనాథనంటి 
ఎవరు ఆడారేంటి? రాజంటి ఎన్టీఆర్ అంటి , గులాబీ-బాల లాంటి బీ సరోజాదేవంటి
యూట్యూబు లింకెక్కడేంటి? - ఇదిగో ఈ కిందే ఉందంటి

ఈ అసలు పాటలో సరోజా నేత్రాల సిగ్గుల కంటి
రామారావు నుదుట పడిన ముంగురుల సాధనా-cut కంటి
వారిరువురి జంటా కన్నుల పంటంటి
పాట చూస్తూ మీరూ ముచ్చట పడిపోమంటి ...




పాటలలో మాటలు ఏంటి? - ఇవిగో ఈ కిందే వున్నాయంటి...

రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి

రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కళలూ కలలూ నీ సొమ్మంటీ...

నా తోడు నీవై వుంటే నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే - వేరే లేదు లేదంటి
నా తోడు నీవై వుంటే.. నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే - వేరే లేదు లేదంటి
నీ పైన ఆశలు వుంచి.. ఆపైన కోటలు పెంచి
నీ పైన ఆశలు వుంచి.. ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి

రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి

నే మల్లెపువ్వై విరిసి... నీ నల్లని జడలో వెలిసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి
నే మల్లెపువ్వై విరిసి... నీ నల్లని జడలో వెలిసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి
నీ కాలి మువ్వల రవళి.. నా భావి మోహన మురళి
నీ కాలి మువ్వల రవళి.. నా భావి మోహన మురళి
ఈ రాగ సరళి ... తరలి పోదాం ... రమ్మంటి

రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కళలూ కలలూ నీ సొమ్మంటీ...

నీలోని మగసిరి తోటి నాలోని సొగసుల పోటి
వేయించి...  నేనే ఓడి పోనీ పొమ్మంటి
నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి...

రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కళలూ కలలూ నీ సొమ్మంటీ...

రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి


కొసరేసిన పాటేంటంటి  ? ఇదిగో ఇక్కడ కిందుందంటి...

సినిమా ఏంటి? - జోకర్ అంటి
ఎవరు రాశారేంటి? - ఎవరో గురుచరణ్ అంటి -ఇంతకు ముందెప్పుడూ ఈ పేరు వినలేదంటి. అసలీ పాటలో ఓ రెండు సార్లు ఎలాగెలాగనడం తప్ప, ఇంకో నాలుగు లైన్లు కోరస్ తప్ప ఈయన రాసిందేంటంటి?!
ఎవరు వరస కట్టారేంటి? - సినిమా తీసిన వంశీయే తనకు తోచినట్టంటి
ఎవరు ఆడారేంటి? నటకిరీటి రాజేంద్ర ప్రసాదు నంటి మళయాళ కుట్టి వాణీ విశ్వనాథంటి
యూట్యూబు లింకెక్కడేంటి? - ఇదిగో ఈ మాటల కింద వుంది - క్లిక్కండంటి...

ఈ కొసరు పాటలో ఆట బావుందంటి.
అమ్మాయి ఎలగెలాగా...? అనడం భలే నచ్చిందంటి. 
పాట ఆగీ ఆగీ సరదాగా మోగిందంటి.  భలే హాంటింగ్ ట్యూనంటి!
నటకిరీటి నటనం డప్పుకి స్టెప్పులా మజాగా సాగిందంటి. 
నే చెప్పేకన్నా మీరే చూసి ఆనందించండంటి... 





రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట ... నా పరుగంటి

రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ...  నీ సొమ్మంటీ...

ఇటురా త్వరగా ... ఇక మా దొరగా
ఎదిగే చెలిమే...   కలిసే జతగా

నా తోడు నీవై వుంటే .. నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరు లేదు లేదంటి
ఎలగెలాగా...?
నా తోడు నీవై వుంటే.. నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరు లేదు లేదంటి
నీ మీద  ఆశలు వుంచి.. ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి

రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ...

కొలిచే చెలిమి... తలచే ఇటు రా

నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి
వేయించి నేనే ఓడి పోనీ పొమ్మంటి
ఎలగెలాగా...?
నా లోని మగసిరి తోటి నీ లోని సొగసులు పోటి
వేయించి నేనే ఓడి పోనీ పొమ్మంటి

నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి...

రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ...

ఆటలు చూస్తూ పాటలు వింటూ 
లాగిలాగే  మీరిక్కడ ఉంటుంటుండండంటి ... 
మీరిలా వింటూ వుంటూ వుంటే 
అలాగలాగే నే వెళ్ళొచ్చేస్తానంటి ... 

~ పాటల భైరవి