19, ఫిబ్రవరి 2025, బుధవారం

చేవ గలిగిన దర్శకుడు కన్న కల - ఛావా

 ఊళ్ళో వున్నా
ఊరికెళ్ళినా
ఉన్న ఊళ్ళో
ఓ మంచి సినిమా వుందీ అంటే
ఊసుపోని వేళేదైనా కుదిరిందంటే
ఉన్నపళంగా వెళ్దాం-వెళ్దామనుకుంటూ
ఉరుకులపరుగుల మీద సినిమాకెళ్ళేవాళ్ళని 
ఏమంటారు?
సినీ-మా-రాజపోషకులంటారు అనుకుంటే
అందులో మొదటివరసలో వుండేదెవరనుకుంటున్నారు?
మేమే!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    బద్రి ఆఫీసు పని కోసమని నార్ఫోక్ (Norfolk, Virginia) కి వస్తుంటే ఒక్కదాన్నీ ఇంట్లో వుండలేక నా వర్క్ లాప్టాపూ, బ్లాగ్ లాప్టాపూ, నా సంస్కృతం పుస్తకాలూ, ఇంకా టైముంటే చదువుకోవడానికి తెలుగూ-ఇంగ్లీషు పుస్తకాలు - ఇవన్నీ pack చేసుకుని నేనూ తనతో వచ్చేశా క్రిందటి ఆదివారం అంటే ఫిబ్రవరి 9వ తారీఖు. మళ్ళీ 23వ తేదీన ఆదివారం ఇంటికి తిరిగి వెళ్తాం. 

    బద్రీకి ఇక్కడ శని-ఆదివారాలు కూడా సెలవు లేదు అని చెప్పారు. కానీ ఆదివారం (2/16) రోజు సాయంత్రం నాలున్నరకల్లా ఆఫీసు పనైపోయిందని హోటల్ రూంకి వచ్చేశారు తను. 

    వస్తూనే "తొందరగా రెడీ అవ్వు, పది నిముషాలు నడిచి వెళ్తే ఒక మాల్లో 'ఛావా' సిన్మా వుంది. చూసొద్దాం పద" అన్నారు. 

    తనా మాటన్న తొమ్మిదో నిముషంలో రోడ్డుమీద నడుస్తున్నాం. 

    అంతలో నాకే అనిపించింది ఇప్పుడు సినిమాకి వెళ్ళకపోతే ఏం అని? అంటే సినిమా చూడడం మానేద్దామని అనుకుంటున్నానని కాదు  ఏదో కొంచెం మొహమాటపడ్తున్నట్టు అనిపిద్దామని, కనిపిద్దామని అంతే! 

    అదే మాట బద్రీతో అంటే "నువ్వు నార్ఫోక్‌లో సినిమా మళ్ళీ ఎప్పుడు చూడాలీ?! పద పద" అన్నారు.

    ఎంతైనా "మనసెరిగినవాడు ..." కదా! 

    అందుకే తన "పద-పద"కి నేను "సరి-సరి" అన్నా!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    Apple maps పెట్టుకుని Norfolk Downtown లో వున్న Mac ArThur - Regal Crown Club అనే సినిమా హాలుకి వెళ్ళి  - పతీ-సమేత-ముగా (అనగా సినిమా హాల్లో నా మేతకి కొనుక్కున్న చిప్స్‌తో సహా) - ఎక్కే  ప్రతి మెట్టు మీదా కుడికాలు పెట్టి ఎక్కుతూ వెళ్ళి సీట్లో కూర్చున్నాను. 

    మేమెళ్లినప్పుడు అక్కడక్కడా కూర్చున్నవాళ్ళు కొంతమంది మాత్రమే కనిపించారు. ఇంత చలిలో, ఈ డౌన్టౌన్ సినిమాకి ఎవరొస్తార్లే అనుకుంటూ వున్నాం. 

    ఇంతలో "ఆపణ్ కసే ఆహత్?" అంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ, మరాఠీలో పరామర్శించుకుంటూ బోల్డంత మంది సకుటుంబ-సపరివార-స"మేత"-సహితంగా  - పెద్దపెద్ద పాప్‌కార్న్ టబ్బులు, పెప్సీ-కోక్ డబ్బాలు పట్టుకుని బిలబిల్లాడుతూ వచ్చి కూర్చున్నారు. 

    సిన్మా-హాలుకే మాటలొచ్చి వున్నట్లైతే "నేనేనా  ఇంత నిండిందీ - ఇలా నిండి ఎన్నిరోజులయ్యిందో ?!" అని గాఠి...గా హా-శ్చర్యపడిపోయేంతగా నిండిపోయింది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***





    "ఛావా" సినిమా పేరు వినగానే ఇదెక్కడి మాటా, దీని అర్థం ఏంటా అని వెతికితే "సింహం పిల్ల" అని కనిపించింది. సంస్కృతంలో "శావః" లేక "శావకః" అంటే కూడా అదే అర్థం. 

    అంటే సింహం ఒక్కదానికే కాదు ఏ జంతువుకి cub అయినా అది శావః / శావకః అనే పిలవబడుతుంది. ఆ 'శావః' కి హిందీ / మరాఠీ వాడుక పదం 'ఛావా' అయుంటుంది.  


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇప్పటిదాకా సినిమాకి ఎలా బయల్దేరామో, పేరు వెనకాల భాషా-భావ-విశేషాల గురించి ఏమాలోచించానో చెప్పడం అయిపోయింది. 

    ఇప్పుడు అసలు సినిమా చూశాక నాకు ఏమనిపించిందో చెప్తా.  


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    "ఛావా" సినిమా ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజు గురించి. 

    ఈ సినిమా కథకి ఆధారం శివాజీ సావంత్ అనే ఆయన రాసిన మరాఠీ నవల "ఛావా" అట. 

    ఒకవేళ ఆ నవల నేను చదవగలిగిన తెలుగు లోనో, ఇంగ్లీషు లోనో వున్నా కూడా నేను పూర్తిగా చదవలేనేమో. 

    (హంపీ-విజయనగరం అంటే ఇష్టమని అప్పుడెప్పుడో కొనిపించుకున్న A Forgotten Empire Vijayanagar ఇప్పటిదాకా చదవడం పూర్తి చేయలేకపోయాను - అందులో వున్న యుద్ధాలూ, రక్తపాతాల వర్ణనల వల్ల. ఇక ఈ "ఛావా" అయితే అస్సలు చదవనేలేను. దాదాపు పావు భాగం సినిమా కళ్లు మూసుకుని చూశాను.) 

    ఈ సినిమాలో నేను గుర్తు పట్టిన నటులు - వికీ కౌశల్, రష్మిక మందన్న, దివ్యా దత్తా, అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్, డయానా పెంటీ. 

    సినిమాలో వచ్చే నటుల పేర్లలో అలోక్ నాథ్ పేరు చూశాను. కానీ ఇప్పటికీ అతని పాత్ర ఏదో గుర్తు కూడా రావట్లేదు. OTTలో వచ్చినప్పుడు సావకాశంగా చూస్తే కనిపిస్తాడేమో!

    సినిమా సగమైపోయి బద్రి చెప్పేదాకా తెలీలేదు - ఔరంగజేబు ఎవరో! అక్షయ్ ఖన్నా అని తెలిశాక నిజ్జంగా ఆశ్చర్యపోయా! 

    నాకు పేర్లు తెలిసి సినిమాలో గుర్తు పట్టిన నటులూ, పేరు తెలిసినా గుర్తు పట్టలేని అలోక్ నాథూ, బద్రి పేరు చెప్పాక గుర్తు పట్టిన అక్షయ్ ఖన్నా, ఇంకా పేర్లు కూడా తెలియని మిగిలిన నటులూ - అందరూ ఎంత బాగా నటించారంటే  - జరిగిపోయిన కథేదో కళ్ల ముందు కనిపిస్తున్నట్టే అనిపించింది. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇహ పోతే "ఛావా" సినిమాలో నాకు నచ్చిన విషయాలు:

    1. శంభాజీ మహారాజు మరాఠా సైన్యంతో బర్హన్‌పూర్ మీద దాడి చేసినప్పుడు అక్కడున్న ఔరంగజేబు సైన్యం మరాఠా సైన్యం కోట లోకి ప్రవేశించకుండా చెక్క దూలాల్లాటివి అడ్డం వేస్తారు. వాటి మధ్య ఖాళీలు వుండడం వల్ల మరాఠా సైనికుల గుఱ్ఱాలు వాటి మీద ఎక్కి రాలేవని. కానీ కొందరు మరాఠా సైనికులు జఱ్ఱున జారుకుంటూ ఆ చెక్క దూలాల కిందకి దూరి ఆ దూలాల మధ్య నున్న ఖాళీలన్నింటినీ తమ చేతుల్లో వున్న డాళ్లతో (అంటే shields) కప్పేస్తారు. అప్పుడు గుఱ్ఱాల మీదున్న మిగిలిన మరాఠా సైనికులు సులువుగా ఆ డాళ్ల మీదుగా దాటి వెళ్లి అవతల పక్కనున్న మొఘల్ సైనికులతో యుద్ధం చేస్తారు. ఇది చాలా బాగా చిత్రీకరించారు. 

    2. శంభాజీ మహారాజు పాత్రలో పరకాయప్రవేశం చేసిన వికీ "కౌశలం" మహ-గొప్పగా వుంది. కొన్ని కొన్ని పాత్రల్లో జీవించాలంటే ఆ పాత్రకు తగ్గ వేషం (అంటే ఆహార్యం) వేసుకుంటే చాలదు. చాలా గొప్ప పరిశ్రమ కావాలి. అందులోనూ ఒక మహాయోధుడైన ఛత్రపతిలా చేసి మెప్పించాలంటే నోటితో పలికే పలుకు క్లుప్తంగా, గంభీరంగా వుండాలి. చేతల్లో నేర్పరితనం, నైపుణ్యం కనిపించాలి. వికీ కౌశల్ ఎంత కృషి చేసి వుంటాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    3. తన రాణి యేసుబాయితో మాట్లాడేటప్పుడు శంభాజీ మహారాజు కళ్ళల్లో కనిపించింది అభిమానపూర్వకమైన ప్రేమ. ఎక్కడా వెగటు పుట్టించని హుందా అయిన ప్రవర్తన. మరాఠీ చీర కట్టులో శంభాజీ మహారాజు భార్య యేసుబాయిగా నటించిన రష్మిక మందన్న సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతో మర్యాదగా, ఒద్దికగా, వీరుడైన భర్తకు ధీర అయిన భార్యగా చాలా చక్కగా నటించింది. హిందీ కూడా చాలా బాగా మాట్లాడింది.  

    4. శంభాజీ మహారాజుకి మామ హంబీర్ రావ్‌గా నటించిన అశుతోష్ రాణా కళ్లల్లో మహారాజు మీద ఇష్టం, వాత్సల్యం  - అదే సమయంలో - మహారాజన్న గౌరవం - ఎంతో గొప్పగా అనిపించాయి. శంభాజీ మహారాజుకి, మామ అయిన హంబీర్ రావ్‌కి మధ్య జరిగిన సంభాషణలు ఎంతో ఉదాత్తంగా వున్నాయి.

    5. శంభాజీ మహారాజుకి సవతితల్లిగా, అనుక్షణం అతన్ని తప్పించి తన కొడుకు రామ రాజేని ఛత్రపతినిగా చేయాలని ఆశపడి కుట్రలు పన్నుతూ వుంటుంది రాజమాత సోయరాబాయి. ఎంత ద్వేషం వున్నా అది ప్రకటించడంలో - ఊరికే గొంతు చించుకుని అరవడమో, మొహం చిట్లించుకోవడమో చేయకుండా - సంతులితంగా నటించిన దివ్యా దత్తా subtelity భళా! అంతలా తనని ద్వేషిస్తోందని తెలిసీ ఆవిడ ఆఖరిక్షణాల్లో చూడడానికి వచ్చిన శంభాజీ మహారాజు తన పాదాలు తాకినప్పుడు స్పృహలో లేని సోయరాబాయి కంటి చివర కనిపించిన కన్నీటి బొట్టుకి భళ-భళా! 

    6. తెలుగు సినిమాల్లో కౄరుడైన విలన్ లాగానో, అస్తవ్యస్తపు హాస్యాలతో నవ్వులపాలుగానో కనిపించే ప్రదీప్ రావత్ "ఛావా" లో శంభాజీ మహారాజు పక్కన ఒక మంచి పాత్రలో కనిపించడం ప్రదీప్ రావత్ కేమో కానీ నాకు మాత్రం బహు మంచిగా అనిపించింది.  

    7. ఔరంగజేబు కూతురుగా చేసిన డయానా పెంటీ మొదటి నుంచి చివరి దాకా చిరునవ్వనేది మొహమ్మీదికి రానీకుండా నిలువెత్తు ద్వేషానికి పేష్వాజ్ వేసి నగలు పెడితే ఇలా వుంటుందేమో అనిపించేలా చేసింది. 

    8. అంతటి సినిమా - ప్రతి ఫ్రేమూ, సీనూ ఎంతో ఇష్టంగా చూశానని అనుకున్నానా - ఇప్పటికీ అందులో అలోక్‌నాథ్ చేసిన పాత్ర ఏదో గుర్తు రావట్లేదు. తప్పకుండా OTTలో వచ్చినప్పుడు చూసి పట్టుకోవాలి. 

    9. అందరి కన్నా ప్రత్యేకంగా నాకు నచ్చింది ఔరంగజేబుగా కౄరించిన అక్షయ్ ఖన్నా. నిర్వ్యాపారంగా బాలీసుల మీద పడుకుని ద్రాక్షపళ్లు తింటూ, తనకు నచ్చని వార్త చెప్పారని తనవారినే నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ, క్షణక్షణం శంభాజీ మహారాజు మీద పగతో ఊగిపోతున్నట్టుంటాడు. ముందసలు నేను గుర్తు పట్టలేదు. ఎక్కడో చూసిన మొహంలా వుందనుకున్నా కానీ అది ఈ ఖన్నా దనుకోలేదు. ఇంటర్వెల్‌లో బద్రి "ఔరంగజేబుని గుర్తు పట్టావా?" అనడిగి "అక్షయ్ ఖన్నా" అని చెప్పగానే "అబ్బా! భలే!" అనుకున్నా - "అబ్బా! భలే!" అని పైకే అన్నా!
 
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


"ఛావా" సినిమాలో అర్థం కాని ఒకే ఒక విషయం: 

    సినిమాలో ఒక చోట శంభాజీ మహారాజు కోటకి ఎదురుగా వున్న ఒక కొండ మీదికి గురి పెట్టి  ఫిరంగి గుండుని పేలుస్తాడు. 

    ఆ సమయంలో అక్కడొక అమ్మాయి మేకలను కాస్తూ వుంటుంది. ఆ ఫిరంగి గుండు పేలిన శబ్దానికి భయపడుతున్న మేకలని అక్కడికి దూరంగా తోలుకుంటూ వెళ్తుంటుంది. 

    ఇంతలో కొండకి అవతల పక్క నుంచి మొఘల్ సైన్యం గుఱ్ఱాల మీద వస్తూ కనిపిస్తారు. ఆ మేకలు కాచుకునే అమ్మాయి మంటల్లో కాలిపోతూ, అరుస్తూ కనిపిస్తుంది. ఆ sequence మాత్రం నాకర్థం కాలేదు. ఫిర్ సే OTT మే దేఖ్‌నా హై! 

    రెహ్మాన్ సంగీతమూ అంతే - బావున్నట్టుంది కానీ - ఫిర్ సే OTT మే సున్‌నా హై! 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    లక్ష్మణ్ ఉటేకర్ - తను కన్న కలని అందంగా, తీద్దామనుకున్న కథని ఉన్నతంగా - శంభాజీ మహారాజు మీద భక్తితో - ఒక సినిమాలా తీసినట్టు కాకుండా పూజ చేసినట్టనిపించింది.  

    చిన్నప్పుడు కథల్లో  చదువుకున్న ఛత్రపతి శివాజీ మహారాజు ప్రత్యేకతైన గెరిల్లా యుద్ధాలని  - మట్టిలో మట్టిగా, నీటిలో నీరుగా, గాలిలో గాలిగా - దాక్కుని మరాఠా సైన్యం మొఘల్ సైన్యాలని చికాకు పెట్టినట్టు  ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. 

    రష్మిక మందన్నని మహారాణిగా నిండుగా చూపించినా  - flashback లో పెళ్లికి ముందు కన్నె రాజకుమారిలా చూపించే వంకతో దేవతావస్త్రాల్లాంటి ఉల్లిపొర బట్టలు వేసో, పాటల్లో చెమ్మచెక్కలాడించో - చూపించకుండా వున్నందుకు లక్ష్మణ్ ఉటేకర్‌కి వందకి రెండొందల మార్కులు. 

    రష్మిక అనే కాదు సినిమాలో వున్న నాలుగైదు స్త్రీ పాత్రలను చాలా మర్యాదగా చూపించారు. 

    ఈ సినిమాలో ఒక పాటలో శంభాజీ మహారాజు, రాణి యేసుబాయి డాన్స్ చేస్తున్నట్టు - యూట్యూబ్‌లో - ఒక వీడియో వుంది కానీ అది సినిమాలో లేదు. 

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్ణవీస్ శంభాజీ  మహారాజు చేత డాన్స్ చేయించడమేంటని తీసెయ్యమని చెప్తే లక్ష్మణ్ ఉటేకర్ "నాకు సినిమాలో డాన్స్ కన్నా శంభాజీ మహారాజు కథ చెప్పటం ముఖ్యం" అని ఆ డాన్స్ తీసేశారట. 

    హవ్వ! ఇది ఈ రోజుల్లో జరిగింది అంటే ఎవ్వరన్నా నమ్ముతారా? 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    వారెవా ! 
    అది కదా రాష్ట్రం! 
    అది కదా ప్రభుత్వం! 
    అది కదా చరిత్రకి ఇవ్వాల్సిన  గౌరవం! 
    జయహో మహారాష్ట్ర! జయహో మరాఠా! జయహో మరాఠీ భాషా! 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ఛావా" - ఒక కథగా విషాదాంతమనిపించినా - ఒక గొప్ప సినిమాగా విజయోత్సవం. 

    మంచి కథని మర్యాదగా తీస్తే మంది మెచ్చే సినిమా అవుతుందని చేసి చూపించిన చేవ గలిగిన దర్శకుడు  కన్న కల - "ఛావా"! 

    చాలా రోజుల తర్వాత  - సినిమా చూశాక  - చూసీ చూడనట్టుండనీయక - చూసినదాన్ని తలుచుకుంటూ రాస్తూ - మళ్ళీ ఇంకోసారి చూద్దామా అనిపిస్తున్న సినిమా "ఛావా"! 

    నాకు నచ్చిన ""ఛావా" ఇంకొందరికన్నా నచ్చుతుందని అనుకుంటూ 

~సినీ-మా-లక్ష్మి 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


16, ఫిబ్రవరి 2025, ఆదివారం

गृहपाठः (तृतीयः)

गृहपाठः (तृतीयः)


क) पररूपविधायकानि सूत्राणि वार्तिकानि च ( भवद्भिः पठितानि सर्वाणि) 
अत्र लिखन्तु - 

पररूपसन्धिविधायकानि वार्तिकानि -

1. शकन्ध्वादिषु पररूपं वाच्यं तच्च टेः |
2. ओत्वोष्ठयोः समासे वा |
3. सारङ्गः पशुपक्षिणोः |
4. सीमान्तः केशवेशे |
5. अव्यक्तानुकरणे एकाच्-शब्दे पररूपसन्धिः न भवति |

पररॊपस्नधिविधायकानि सूत्राणि -

1. ओमाङ्गोश्च | (6.1.95)
2. अव्यक्तानुकरणस्यात इतौ | (6.1.98)
3. नाम्रेडितस्यान्त्यस्य तु वा | (6.1.99)

ख) स्ववाक्यैः उत्तरन्तु- 

1. प्रकृतिभावसन्धिः कस्मिन् सन्धौ अन्तर्भवति तथा च 'प्रकृतिभाव'-शब्दस्य 
अर्थः कः? 

प्रकृतिभावसन्धिः अच्-संधौ अन्तर्भवति |

"प्रकृतिभाव"-शब्दस्य अर्थः "प्रकृत्या एव तिष्ठति" इति |



2. पदान्ताः अ/इ/उ/ऋ/लू-वर्णाः + ऋ 

अस्यां स्थितौ कस्य सन्धेः प्रथमं प्राप्तिः ? 

अक्-वर्णात् (अ / इ / उ / ऋ /  लू ) ऋकारे परे प्रकृतिभावसन्धिः विकल्पेन भवति |

3. अष्टमाध्यायपठितेषु सन्धिसूत्रेषु युगपत्प्राप्तिस्थले कस्य प्राधान्यम् ? पूर्वसूत्रस्य उत परसूत्रस्य? 

अष्टमाध्यायपठितेषु सन्धिसूत्रेषु युगपत्प्राप्तिस्थले पूर्वसूत्रस्य प्राधान्यं भवति |


4. कस्यां स्थितौ श्चुत्वसन्धिः भवितुं न अर्हति

शकारात् परस्य तवर्गस्य स्थाने चवर्गः आदेशः न भवति |

5. कीदृशीषु स्थितिषु ष्टुत्वसन्धिः भवितुं न अर्हति

1. तवर्गात् षकारेण योगे ष्टुत्वं न भवति |
2. पदान्तात् नाम् - नवति - नगरीशब्दानां विहाय टवर्गात् परस्य सकार-तवर्गयोः ष्टुत्वं न भवति |


) अत्र सन्धिस्थलानि परिचित्य अधीतसन्धीनां नामानि सूचयन्तु- 

* कर्म सन्तानयामास सोपाध्यायर्त्विगादिभिः । 


सोपाध्यायर्त्विगादिभिः 
= सोपाध्यायर्त्विक् + आदिभिः - जश्त्वसन्धिः
= (सोपाध्याय + ऋत्विक्)+ आदिभिः - गुणसन्धिः
= (स + उपाध्याय)+ ऋत्विक् + आदिभिः - गुणसन्धिः


* पश्यञ्जनं स्वपरविग्रहवैरमैत्रं हन्तेति पारचर पीपृहि मूढमद्य  

पश्यञ्जनं = पश्यन् + जनं - श्चुत्वसन्धिः
हन्तेति = हन्त + इति - गुणसन्धिः


* अहो इयं वधूर्धन्या या चैवं भूभुजां पतिम्। 

वधूर्धन्या = वधूः + धन्या - विसर्गसन्धिः (रेफादेशः)
चैवं = च + एवं - वृद्धिसन्धिः


* पश्चिमे द्वे अमूषां ते नामानि नृप वर्णये । 

(अत्र सन्धिः कोऽपि न दृश्यते | )



* यदा नोपलभेताङ्‌घ्रावूष्माणं  पत्युरर्चती । 

नोपलभेताङ्‌घ्रावूष्माणं 

नोपलभेताङ्‌घ्रौ + ऊष्माणं  - यान्तवान्तादेससन्धिः

= (नोपलभेत + अन्घ्रौ) + उष्माणं - सवर्णदीर्घसन्धिः 

= (न + उपलभेत) + अङ्‌घ्रौ उष्माणं  - गुणसन्धिः


पत्युरर्चती = पत्युः + अर्चती - विसर्गसन्धिः (रेफादेशः)

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 18, 19, 20, 21, 22

 క్రిందటి శ్లోకం / Previous slOkaH:  స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 16, 17





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


శ్లోకం -18

విష్ణునా సదృశే వీర్యే
సోమవత్ ప్రియదర్శనః
కాలాగ్నిసదృశః  క్రోధే
క్షమయా  పృథివీసమః

శ్లోకం -19

దనదేన సమస్త్యాగే
సత్యే ధర్మ ఇవాపరః
తమేవం గుణసంపన్నం
రామం సత్యపరాక్రమం


శ్లోకం -20

జ్యేష్ఠం  శ్రేష్ఠగుణైర్యుక్తం
ప్రియం దశరథః  సుతం
ప్రకృతీనాం  హితైర్యుక్తం
ప్రకృతిప్రియకామ్యయా


శ్లోకం -21

యౌవరాజ్యేన సంయోక్తుం 
ఐచ్ఛత్  ప్రీత్యా మహీపతిః
తస్యాభిషేకసంభారాన్
దృష్ట్వా  భార్యా~థ  కైకయీ


శ్లోకం -22

పూర్వం దత్తవరా దేవీ
వరమేనమయాచత
వివాసనం  చ  రామస్య
భరతస్యాభిషేచనం


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)

శ్లోకం -18

విష్ణునా  సదృశః   వీర్యే
సోమవత్  ప్రియదర్శనః
కాలాగ్ని-సదృశః   క్రోధే
క్షమయా   పృథివీ-సమః

విష్ణునా = విష్ణువుతో
సదృశః = సమానమైనవాడు
వీర్యే = పరాక్రమములో
సోమవత్ = చంద్రుని వలె
ప్రియదర్శనః = ప్రియముగా కనిపించువాడు
కాలాగ్ని-సదృశః  = ప్రళయకాలపు అగ్నిలాంటివాడు
క్రోధే = కోపములో
క్షమయా  = సహనములో
పృథివీ-సమః = భూమితో సమానమైనవాడు

శ్లోకం -19

దనదేన సమః త్యాగే
సత్యే ధర్మ ఇవ అపరః
తం ఏవం  గుణ-సంపన్నం
రామం సత్య-పరాక్రమం


దనదేన = కుబేరునితో 
సమః  = సమానమైనవాడు
త్యాగే = త్యాగబుద్ధిలో
సత్యే = సత్యపాలనములో
ధర్మ ఇవ = ధర్మదేవత లాంటివాడు
అపరః = మరొక
తం = అతడిని
ఏవం = ముందు చెప్పబడిన
గుణ-సంపన్నం = గొప్ప గుణములు కలవాడిని
రామం = రాముడిని
సత్య-పరాక్రమం = అమోఘమైన పరాక్రమవంతుడిని

శ్లోకం -20

జ్యేష్ఠం  శ్రేష్ఠ-గుణైః యుక్తం
ప్రియం దశరథః  సుతం
ప్రకృతీనాం  హితైః యుక్తం
ప్రకృతి-ప్రియ-కామ్యయా

జ్యేష్ఠం  = పెద్దవాడిని
శ్రేష్ఠ-గుణైః  యుక్తం = ఉత్తమమైన గుణములను కలిగియున్నవాడిని
ప్రియం = ఇష్టుడిని
దశరథః  = దశరథమహారాజు
సుతం = కొడుకుని
ప్రకృతీనాం  = ప్రజల యొక్క
హితైః యుక్తం = శ్రేయస్సులో ఆసక్తి కలిగినవాడిని
ప్రకృతి-ప్రియ-కామ్యయా = ప్రజలు ప్రీతితో కోరుకున్నందు వల్ల

శ్లోకం -21

యౌవరాజ్యేన సంయోక్తుం 
ఐచ్ఛత్  ప్రీత్యా మహీ-పతిః
తస్య   అభిషేక-సంభారాన్
దృష్ట్వా  భార్యా  అథ  కైకయీ


యౌవరాజ్యేన  = యువరాజ పట్టాభిషిక్తునిగా
సంయోక్తుం  = చేయుటకు
ఐచ్ఛత్  = కోరుకున్నాడు
ప్రీత్యా  = ప్రేమతో
మహీ-పతిః  = దశరథ మహారాజు
తస్య   = అతని
అభిషేక-సంభారాన్ = పట్టాభిషేక  సన్నాహములను
దృష్ట్వా   = చూసి
భార్యా  = దశరథుని భార్య
అథ  = అప్పుడు
కైకయీ = కైకేయి


శ్లోకం -22

పూర్వం దత్త-వరా దేవీ
వరం  ఏనం  అయాచత
వివాసనం  చ  రామస్య
భరతస్య  అభిషేచనం


పూర్వం  = ఇంతకు మునుపు
దత్త-వరా  = వరములను పొందినదైన
దేవీ = రాణి కైకేయీ
వరం   = వరముని
ఏనం  = అతడిని (దశరథ మహారాజుని)
అయాచత = అడిగినది
వివాసనం  = దేశబహిష్కారము
చ  = మరియు
రామస్య  = రాముడి
భరతస్య  = భరతుడి
అభిషేచనం = పట్టాభిషేకము

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

అర్థం: 

(గమనిక: 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వాల్మీకి మహర్షికి  వివరిస్తూ నారద మహర్షి రాముని సుగుణాల గురించి చేసిన వర్ణన వుంటుంది.)


    [శ్లోకం -18] పరాక్రమములో  విష్ణువుతో  సమానమైనవాడు. చంద్రుని వలె ప్రియముగా కనిపించువాడు, కోపములో ప్రళయకాలపు అగ్నిలాంటివాదు, సహనములో భూమితో సమానమైనవాడు. [శ్లోకం -19] త్యాగబుద్ధిలో  కుబేరునితో సమానమైనవాడు, సత్యపాలనములో  మరొక  ధర్మదేవత లాంటివాడు. అతడిని, ముందు చెప్పబడిన గొప్ప గుణములు కలవాడిని, అమోఘమైన పరాక్రమవంతుడిని, రాముడిని... [శ్లోకం -20] ఇంటికి పెద్దవాడిని, ఉత్తమమైన గుణములను కలిగియున్నవాడిని, ప్రజల యొక్క శ్రేయస్సులో ఆసక్తి కలిగినవాడిని, ఇష్టుడైన దశరథమహారాజు పుత్రుడిని ప్రజలు ప్రీతితో కోరుకున్నందు వల్ల ... [శ్లోకం -21]  దశరథ మహారాజు ప్రేమతో యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుటకు కోరుకున్నాడు. అప్పుడు అతని  పట్టాభిషేక సన్నాహములను చూసి దశరథుని భార్య కైకేయి... [శ్లోకం -22]  ఇంతకు మునుపు వరములను పొందినదైన రాణి కైకేయీ దశరథ మహారాజుని ఆ వరముని ఇప్పుడు అడిగినది - అదేంటంటే - రాముడి దేశబహిష్కారము మరియు భరతుడి పట్టాభిషేకము.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


श्लोकः - 18

विष्णुना  सदृशो  वीर्ये 
सोमवत्प्रियदर्शनः |
कालाग्निसदृशः  क्रोधे 
क्षमया  पृथिवीसमः  ||

श्लोकः - 19

धनदेन  समस्त्यागे  
सत्ये  धर्म  इवापरः |
तमेवं  गुणसम्पन्नं 
रामं  सत्यपराक्रमम्  ||


श्लोकः - 20

ज्येष्ठं  श्रेष्ठगुणैर्युक्तं 
प्रियं  दशरथः  सुतम् |
प्रक्र्तीनां  हितैर्युक्तं 
प्रकृतिप्रियकाम्यया ||

श्लोकः - 21

यौवराज्येन  संयोक्तुं 
ऐच्छत्  प्रीत्या  महीपतिः |
तस्याभिषेकसम्भारान् 
दृष्ट्वा   भार्या~थ  कैकयी ||

श्लोकः - 22

पूर्वं  दत्तवरा  देवी 
वरमेनमयाचत  |
विवासनं  च  रामस्य 
भरतस्याभिषेचनम् ||


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


Word to word meaning (In the same order of occurrence in the slOkaH):

श्लोकः - 18

विष्णुना  सदृशः  वीर्ये 
सोमवत्  प्रिय-दर्शनः |
कालाग्नि-सदृशः  क्रोधे 
क्षमया  पृथिवी-समः  ||

विष्णुना  = with Vishnu
सदृशः  = competent
वीर्ये  = in prowess
सोमवत्  = like the moon
प्रिय-दर्शनः  = having pleasing appearance
कालाग्नि-सदृशः  =  resembling the destructive fire
 क्रोधे  = in anger
क्षमया  = in forbearance
 पृथिवी-समः  = like the Earth


श्लोकः - 19

धनदेन  समः  त्यागे  
सत्ये  धर्म  इव  अपरः |
तम्  एवम्   गुणसम्पन्नम् 
रामम्    सत्य-पराक्रमम्  ||

धनदेन  = with Kubera
समः  = comparable
त्यागे  = in liberality
सत्ये  = in truthfulness
धर्म  इव  = like the God of Dharma
अपरः  = another
तम्   = him
एवम्   =    aforesaid 
एवम्  गुण-सम्पन्नम्  = endowed with the qualities
रामम्   = Rama 
सत्य-पराक्रमम्   = who possessed of unfailing prowess



श्लोकः - 20

ज्येष्ठम्   श्रेष्ठ-गुणैः  युक्तम् 
प्रियम्   दशरथः  सुतम् |
प्रक्र्तीनाम्   हितैः  र्युक्तम्
प्रकृति-प्रिय-काम्यया ||


ज्येष्ठम्    =  the eldest
श्रेष्ठ-गुणैः  = with the highest virtues
युक्तम्  = endowed
प्रियम्    =  beloved
दशरथः  =  King Dasaratha
सुतम्  = the son
प्रक्र्तीनां  = of the people
हितैः  = with the well-being
र्युक्तम्  = concerned
प्रकृति-प्रिय-काम्यया  = with the intent to gratify (delight) people



श्लोकः - 21

यौवराज्येन   संयोक्तुम् 
ऐच्छत्  प्रीत्या  मही-पतिः |
तस्य  अभिषेक-सम्भारान् 
दृष्ट्वा   भार्या  अथ  कैकयी ||


यौवराज्येन   = with the right of succession the Kingdom
संयोक्तुम्  = to install
ऐच्छत्  = desired
प्रीत्या  = lovingly
मही-पतिः  = the King
तस्य  = his 
अभिषेक-सम्भारान्  = preparations for Coronation
दृष्ट्वा   = having seen
भार्या  = wife
अथ  = then
कैकयी  = Kaikeyee

श्लोकः - 22

पूर्वम्   दत्त-वरा  देवी 
वरम्  एनम्  अयाचत |
विवासनम्   च   रामस्य 
भरतस्य  अभिषेचनम् ||


पूर्वम्   = on a former occaassion
दत्त-वरा  = having granted a boon
देवी  = queen
वरम्  = boon
एनम्  = him (to Dasaratha)
अयाचत  = asked
विवासनम्   =  exile 
च   = and
रामस्य  = of Rama
भरतस्य  = of Bharata
अभिषेचनम्  = Coronation


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



Meaning in English

(NOTE: From the slOkaH 8 until slOkaH 20, the virtues of Rama are described by Narada maharshi to Valmeeki maharshi)


[श्लोकः - 18] He is competent with Vishnu in prowess. He is like the moon in having pleasing countenance. He resembles the destructive fire in anger. He is like the Earth in forbearance. [श्लोकः - 19] Rama, who is comparable with Kubera in liberality, who is like another God of Dharma in truthfulness, who is endowed with all the aforesaid qualities and who possessed unfailing prowess [श्लोकः - 20] King Dasaratha's beloved eldest son, who is endowed with the highest virtues, who is concerned with the well-being of the people - to such Rama, with the intent to gratify people [श्लोकः - 21] King Dasaratha lovingly desired to install with the right of succession the Kingdom. Then, having seen his preparations for Coronation, his wife Kaikeyee [श्लोकः - 22]  who has been granted a boon on a former occasion - the Queen Kikeyee asked the King Dasaratha for that boon - the exile of Rama and the Coronation of Bharata.




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 23