ఈ వారం ఇద్దరు ముగ్గురు స్నేహితులు చాలా ఉత్సాహంగా నాకు మెసేజ్ చేశారు - లలితా! మీరు ఎదురు చూస్తున్న మధ అమెజాన్ ప్రైమ్‌లో వచ్చింది - అంటూ.
చెప్పొద్దూ... ముందే ఆ సినిమా psychological thriller అని విని వున్నానేమో... చూడాలనుకోలేదు.
ఇంతలో మా ఆడపడుచుతో ఫోన్‌లో మాట్లాడుతుంటే తను "మధ" చూసినట్టు చెప్పింది. చెప్తూ "నువ్వు చూడొద్దులే వదినా... చాలా మామూలు కథ - ఇంతకు ముందు చాలా సార్లు చాలా సినిమాల్లో చెప్పినదే. అంత గొప్పగా ఏమీ లేదు." అని మరీమరీ చెప్పింది కూడా.
సరే! నా మాట నాకే ఉందిగా... సీన్ సీన్ పే లిఖా హై దేఖ్‌నేవాలే కా నామ్! నా బతుకుపుస్తకపు పుటలో already నేను "మధ" చూడాలని రాసేసి ఉన్నట్లుంది.
నిజంగా చెప్పాలంటే మార్చ్ 14 నుంచే మా వూళ్ళో voluntary self-quarantine లో వున్నాం మేమందరం. 13 న "మధ" విడుదల అవుతుంది అని ముందే తెలుసు కదా... ఆ వారం మేము ఎంత తలుచుకున్నామో "పాపం! ఆ శ్రీవిద్య బసవ తన సినిమా మీద అంత hopes పెట్టుకుంది. ఇప్పుడు రిలీజ్ చెయ్యడానికి అసలు మంచి సమయమే కాదు" అని తెగ ప్చ్-ప్చ్-లాడిపోయాం.
సరే! మరి .. just ఒక interview చూసి బోల్డంత excite అయి ఒక వారం ఆ సినిమా కబుర్లు కూడా రాసేశాను కదా ... అంత రాసినందుకన్నా, ఉన్న డబ్బులన్నీ పెట్టి ఆ సినిమా తీసిన అమ్మ కోసం, అమ్మాయి కోసమైనా ఒకసారి చూద్దాం అనేసుకున్నాను. అదే మాట బదరితో అన్నాను. వెంటనే ఇద్దరం ఈ శుక్రవారం చూసేద్దాం అనేసుకున్నాం. అనుకున్నవాళ్ళం అనుకున్నట్టుగానే చూసేశాం.
"మధ" లో కొట్టొచ్చినట్టు కనిపించినవి నేపథ్యసంగీతం, సినిమా అంతా పరచుకున్న ఆకుపచ్చ రంగు.
అంతకు మించి నాకింకేమీ చెప్పుకోదగ్గవి కనిపించలేదు. సినిమా అంతా అయ్యాక "ఎందుకు ఈ సినిమాకి ఇన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చాయబ్బా?!" అని బదరీ, నేనూ ఓ రెండు నిముషాలు అనుకున్నాం.
అప్పటికీ బదరి అన్నారు కూడా - "పాపం! ఆ డైరెక్టర్ అమ్మాయి చాలా confuse అయినట్టు వుంది కథ రాసుకోవడంలో" అంటూ కొంచెం జాలిపడుతూ. అంటూనే వెంటనే ఇంకో ప్రశ్న తన నుంచే "ఒకవేళ థియేటర్లలో వచ్చినా కూడా ఎవరైనా చూస్తారా దీన్ని?" అంటూ.
మళ్ళీ వెంటనే "ఇప్పటికే ఓ రెండుగంటలు సినిమా-పాలు చేశాం. అదే ఎక్కువ" అనుకుని తలొకసారి విదిలించుకుని సినిమా తాలూకు తలపులని దులిపేసుకున్నాం. ఇంకేం చేస్తాం... ఇది మాకలవాటైన ఓ రకమైన self -inflicting సినీ-మా-ఓదార్పు యాత్ర
అదీ "మధ"సినిమా-చూపుల కథ.
Once bitten, twice shy అనేది సినిమాల విషయంలో అస్సలు వర్తించదు నాకు.
ఎన్నిసార్లు - ఎందుకొచ్చిన "పిచ్చ"రిది - అనే లాంటివి ఎన్ని చూసినా, ఇంకోటి venture చేద్దామనే adventurous gene నాది - అనే emotion మళ్లీమళ్లీ motion-picture చూసేలా చేస్తుంది.
అందుకే... బదరి ఫ్రెండ్ సాయిప్రసాద్ బావుందని చెప్పిన మలయాళం సినిమా "అయ్యప్పనుమ్ కోషియుమ్" అమెజాన్ ప్రైమ్‌లో ఉంటే చూశాం.
"అయ్యప్పనుమ్ కోషియుమ్" నేను చూసిన మొట్టమొదటి మలయాళం సినిమా.
చూస్తున్నంత సేపూ... కేరళ వాసుల సంస్కారం, మలయాళ ప్రేక్షకుల ఉన్నతాభిరుచి ఎంత గొప్పగా లేకపోతే ఇంత మంచి సినిమా తీయగలరో కదా అనిపించిన సినిమా.
చూస్తున్నంత సేపూ... కళ్ళలో కమ్మిన కేరళ అడవుల పచ్చదనం, మనసులో సినిమా తీసిన దర్శకుడు సాచీ మీద, సినిమాలో నటించిన బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ల మీద గౌరవం.
చూస్తున్నంత సేపూ... నాకు తెలీకుండా నేనే పదేపదే తలూపుకుంటూ, "భలే సినిమా" అని మెచ్చుకుంటూ, ఇంత మంచి సినిమా చూస్తున్నందుకు నన్ను నేనే నచ్చుకుంటూ - అయ్యప్పన్ నాయర్, కోషీ కురియన్ల మధ్య జరుగుతున్న ఎవరి అహాన్ని వాళ్ళు చల్లార్చుకోవటానికి ఒకరితో ఒకరు చేస్తున్న పోరాటంలో గెలుపెవరిదా అని ఆరాటపడుతూ, ఇద్దరూ గెలిస్తే బావుండునని ఆశ పడుతూ, మధ్యమధ్యలో నా పక్కనే కూర్చుని సినిమా చూస్తున్న బదరితో "చివరికి ఇద్దరికీ ఏమీ కాకుండా ఉంటే బావుంటుంది కదా!" అని అంటూ - ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నంత సేపూ ఊపిరి బిగబట్టి కళ్ళు తిప్పకుండా చూసిన సినిమా - "అయ్యప్పనుమ్ కోషియుమ్".
సినిమా మొదలవుతూనే కనిపించేది - కమ్ముకొస్తున్న రాత్రి మాటున నిశ్శబ్దంగా నిల్చున్న వన-సాలభంజికల్లాంటి చెట్ల ఆకుపచ్చదనం.
వాటి మధ్యన మలుపుల మెలికలు తిరుగుతూ ఆట్టప్పాడి అడవి లోంచి ఊటీ వైపుగా వెళ్ళే ఘాట్ రోడ్.
ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న కార్లో - ముందు సీట్లో డ్రైవర్ కుమార్, వెనక సీట్లో పడుకున్న కోషీ కురియన్.
కోషీ సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన హవల్దారు. కోషీది కాట్టప్పన్ అనే ఊరు. తనకి స్నేహితుడైన ఒక సినిమా దర్శకుడిని కలవడానికి కార్లో ఊటీ వెళ్తూ ఉంటాడు.
ఆట్టప్పాడి అడవి మద్యనిషేధం అమలులో వున్న ప్రాంతం.
అదే దారిలో నరసిముక్కు చెక్‌పోస్ట్ దగ్గర ఆట్టప్పాడి పోలీసులు, ఎక్సైజ్ డిపార్టుమెంటు వాళ్ళు కలిసి అటుగా వచ్చే వాహనాల్ని ఆపి చెక్ చేస్తూ వుంటారు. దానికి నాయకత్వం వహిస్తున్నది ఎస్సై అయ్యప్పన్ నాయర్.
అటుగా వస్తున్న కోషీ కారుని కూడా చెక్ చేద్దామని ఆపిన వాళ్లకి, కారులో నిద్రపోతున్న కోషీ సీటు కింద పన్నెండు మద్యం సీసాలు కనిపిస్తాయి. వెంటనే అయ్యప్పన్ నాయర్, అతనితో వున్న పోలీసులు కోషీని, అతని డ్రైవర్ కుమారుని పోలీసు స్టేషనుకి తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళే process లో పోలీసుల మీద చెయ్యి చేసుకున్న కొషీని అయ్యప్పన్ చెంప మీద కొడతాడు. కోషీ, కుమార్ దగ్గరున్న సెల్‌ఫోన్లు పోలీసులు తీసేసుకుంటారు. వాళ్ళ కార్లో దొరికిన మద్యం సీసాల్ని లక్కతో సీల్ చేస్తారు. స్టేషన్లో కొచ్చిన కోషీ మీద మద్యం తెస్తున్నందుకు, ఎక్సైజ్ జీప్ లైట్ పగలగొట్టినందుకు, ఎక్సైజ్ ఆఫీసర్ని, పోలీసులను కొట్టినందుకు కేసులు రాయమంటాడు అయ్యప్పన్. ఆ స్టేషన్లో ఇద్దరు మహిళా పోలీసులు కూడా వుంటారు. అందులో ఒకమ్మాయి పేరు జెస్సీ.
ఇంతలో జాయ్ కుట్టన్ అనే పోలీస్ చేతిలో వున్న కోషీ ఫోనుకి సినిమా దర్శకుడు జానీ ఆంటోనీ నుంచి ఫోన్ వస్తుంది. ఇంకా ఆ ఫోన్లో ఎవరెవరి ఫోన్ నంబర్లు ఉన్నాయా అని చూసిన జాయ్ కుట్టన్‌కి - కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్స్పెక్టర్ జనరల్ విజయన్ ఫోన్ నంబర్లు కనిపిస్తాయి. అవి చూడగానే అయ్యప్పన్ నాయరుకి కోషీ సమాజంలో పలుకుబడి వున్నవాడని తెలుస్తుంది. వెంటనే స్టేషన్ బయటికి వెళ్ళి తన పై అధికారి అయిన సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) సతీషుకి ఫోన్ చేస్తాడు అయ్యప్పన్. సతీష్ కోషీని కొంచెం జాగ్రత్తగా హేండిల్ చెయ్యమని చెప్తాడు అయ్యప్పన్‌కి. అలా చెప్తూనే కోషీకి ముందు జరగబోయే దాని గురించి (అంటే నిషేధ ప్రాంతంలో మద్యం తీసుకెళ్తున్నందుకు ఓ పన్నెండు రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది అనే దాని గురించి) అర్థమయేలా చెప్పమంటాడు.
అయ్యప్పన్ స్టేషన్ లోపలి వెళ్ళి కోషీని తన గదిలోకి రమ్మని చెప్పి, అతను వచ్చి కుర్చీలో కూర్చున్నాక - కోషీకి పది-పన్నెండు రోజుల దాకా శిక్ష పడుతుందని, ఇది non-bailable offence అని చెప్పగానే - ఇక అప్పుడు మొదలవుతుంది అసలు కథ.
అయ్యప్పన్ నాయర్, కోషీ కురియన్ల మధ్య మొదలైన ఒక చిన్న గొడవ చిలికి చిలికి గాలివానై, అందులో కోషీ నాన్న కురియన్ జాన్ ఓ పిడుగులా తోడై - చివరికి ఎంత దూరం వెళ్తుందో, చివరికి ఏమవుతుందో తెలుసుకోవాలంటే - "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమా చూడాల్సిందే. ఓ మంచి సినిమా చూశామని మీకనిపించాలంటే నేనిక్కడ ఆపాల్సిందే!
కాకపోతే నాకు ఈ సినిమా ఎందుకు నచ్చిందో మచ్చుక్కొన్ని మెచ్చు-తునకలు మాత్రం చెప్తాను.
ఈ సినిమా చూశాక పోలీసుల మీద గౌరవం పెరిగింది నాకు. పోలీసుల్ని అంత గొప్పగా చూపించిన దర్శకుడు సాచీది ఎంతో గొప్ప సంస్కారం.
మహిళా పోలీసుల్ని - భారీకాయులుగానో, comic figures లానో కాకుండా - మంచి వ్యక్తిత్వమున్న అమ్మాయిల్లా చూపించడం, వాళ్ళని పై అధికారులైన SI అయ్యప్పన్, CI సతీష్ ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఎంతో ఎంతో బావుంది.
ఒకానొక సందర్భంలో తను చేయని తప్పుకి భయపడుతూ ఏడుస్తున్న జెస్సీని "నువ్వు unifrom లో వున్నావు - ఏడవకూడదు" అని SI అయ్యప్పన్ మర్యాదైన భాషలో మందలించడం విన్న నాకు ఇదసలు 2020లో వచ్చిన కొత్త సినిమాయేనా అని ఓ గొప్ప-అనుమానం వచ్చేసింది.
కోషీ వల్ల ఉద్యోగం లోంచి సస్పెండ్ అయి సెలవు మీద వెళ్ళాల్సొచ్చిన జెస్సీని వాళ్ళ ఊరు పంపడానికి స్టేషన్ లోంచి బయటికి తీసుకెళ్తున్న సుజిత్ అనే పోలీస్ తలొంచుకుని నడుస్తున్న జెస్సీతో "నువ్వు తలెత్తుకుని నడవాలి" అని చెప్పడం - భేష్! అప్పుడే ఎదురొచ్చి తనతో "నిన్ను ఇలా ఇబ్బంది పెట్టాలని నేననుకోలేదు" అని చెప్పబోయిన కోషీ మీద ఆడపులిలా అరుస్తున్న ఓ మామూలు పోలీసు జెస్సీ మీదకి రాబోతున్న తన స్నేహితుల్ని కోషీ ఆపి "ఆమెకి నన్ను తిట్టే హక్కుంది" అని చెప్పడం నేను ఓ contemporary సినిమాలో చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. Kudos to the sensible directror, Sachy!
నాలుగు నెలల పసిపాపడిని ఎత్తుకుని స్టేషన్ దగ్గరికి వచ్చిన భార్యకి డబ్బులిస్తూ SI అయ్యప్పన్ పిల్లాడికి మందులు కొనుక్కోమని చెప్తుంటే - "అర్రే! ఇలా చూపిస్తున్నారేంటీ? తన స్టేషన్లో పని చేసే పోలీసుల చేత ఇంటికి సరుకులు తెప్పించుకోవడం, ఇంట్లో బట్టలు ఉతికించుకోవడం లాంటి పనులు చెయ్యాలి కదా సినిమా ఎస్సైలూ" అని ఎంతో ఆశ్చర్యమేసేసింది నాకు.
అప్పుడే స్టేషన్ దగ్గరకొచ్చిన CI సతీష్ SI అయ్యప్పన్ నాయర్ని "అయ్యప్పెట్టా! (అయ్యప్పగారూ)" అని పిలవడం, అయ్యప్పన్ భార్య కణ్ణమ్మని "చేచి (అక్కా)" అని సంబోధించి మర్యాదగా మాట్లాడడం - అవునూ... ఇది.. కలా ...నిజమా... ఇంత మర్యాద-మన్ననలున్న మర్యాదరామన్నలున్న సినిమాని - నేనేనా? చూస్తున్నానా? అని పదేపదే నన్ను నేనే తట్టి చూసుకున్నా!
తన భర్త SI అయ్యప్పన్ ఉద్యోగం పోయిందని తన ఇంటికొచ్చి చెప్పి మరీ హేళన చేస్తున్న కోషీని అతని దగ్గరికి వచ్చి మరీ "నీ వల్ల నీ తల్లి అవమానంతో చనిపోకుండా చూడు" అని చీవాట్లేసిన కణ్ణమ్మ కోపానికి silent గా ఊరుకున్న కోషీదెంత సంయమనం! అప్పుడు కోషీకి ఇలాంటి చీవాట్లు పడాల్సిందే అన్నట్టు చూసిన డ్రైవర్ కుమార్ చూపులు భలే మంచిగా అనిపించాయి.
సినిమాలో కనిపించిన ప్రతి రౌడీ పోలీసులంటే భయభక్తులతో మెలగడం, తప్పుకు తిరగడం - పోలీసుల్లోనే తమతో పని చేసే పోలీసులంటే, అధికారులంటే ఇష్టం, గౌరవం - వాళ్ళ కోసం ఏమైనా చెయ్యగలం అన్న ధీమా - సినిమాలో నటనే అయినా ఎంత బావుందో!
అంత antagonist లా కనిపించిన కోషీ కూడా అయ్యప్పన్ భార్య కణ్ణమ్మని ఇబ్బందుల్లో పెట్టబోయిన తన స్నేహితులతో "ఇది ఇద్దరు మగవాళ్ళ మధ్య జరిగుతున్న పోట్లాట. ఇందులోకి ఆడవాళ్ళని, కుటుంబాల్ని తీసుకురాకండి" అని గట్టిగా చెప్పడం - ప్రేక్షుకులుగా మేము గట్టిగా చప్పట్లు కొట్టిన సన్నివేశం.
అరవకుండా మర్యాదగా మాట్లాడే పోలీసుల్నీ
అమర్యాదకి చోటివ్వకుండా చూపించిన మహిళా పోలీసుల్నీ
తాము వేసుకున్న uniform కి గౌరవం ఇచ్చే పోలీసుల్నీ
పోలీసులని చూసి భయపడే రౌడీలనీ
హోదాకి కాకుండా మనిషి వ్యక్తిత్వానికి, వ్యక్తికీ ప్రాముఖ్యతనిచ్చే మనుషుల్నీ
ఏడవకుండా తలెత్తుకు నిలబడిన ఆడవాళ్ళని
ఆడవాళ్ళని తేలికగా మాట్లాడని మగవాళ్ళని
మీ సినిమాలో ముఖ్యపాత్రలుగా చేసుకుని...
అన్నిటి కన్నా ముఖ్యంగా -
అందంగా వున్నారని మగవాళ్ళ వెంటపడే ఆడపిల్లలు, ఆడపిల్లల కాళ్ళావేళ్ళా పడే మగపిల్లలూ లేని సినిమాని - తీసినందుకు ...
దర్శక సాచీ! ... మీకు చేస్తున్నా వందనం తల వంచి...
మీ సినిమాలో ఏవో చిన్నచిన్న లోపాలుంటే వుండు గాక - వాటన్నిటినీ మించి - ఒక మంచి ఆలోచనతో కూడిన సంస్కారవంతమైన సినిమా తీయగల దర్శకులు ఇంకా వున్నారు అని మీరు మాకిచ్చిన భరోసా బహు గొప్పది!
ఇంత గొప్ప సినిమా గురించి మాకు తెలిసేలా చేసిన సాయిప్రసాద్‌కి బోల్డన్ని ధన్యవాదాలతో...
~ సినీ-మా-లక్ష్మి

భాషాభేదం లేకుండా చూడడం
అదొక సినీ-మా-వినోదం
నచ్చకపోతే మరి తలవక మర్చిపోవడం
అదొక సినీ-మా-విలాపం
నచ్చితే మరిమరి తలుచుకుని మురిసిపోవడం
అదొక సినీ-మాయా-విలాసం.

Wonderful article, Lalitha garu. Coincidentally we saw Ayyappanum Koshiyum yesterday. Could very well relate to your observations. 👍
రిప్లయితొలగించండిThanks, Sucharita, for your your comment!
తొలగించండిపోలీసులు, నేరస్థులు , మన చుట్టూ ఉన్నవాళ్లు ఇలా ప్రవర్తిస్తే బాగుంటుంది అనిపించేలా చేసి సినిమాలోని పాత్రలతో కలిసి ప్రేక్షకులను ప్రయాణం చేయించడం ఒక మంచి దర్శకుడి లక్షణం కావచ్చు.
రిప్లయితొలగించండిరాజమౌళి అన్ని సినిమాలలో ఇలా పాత్రలతో కలిసి సాగడం వల్ల అవి బాగా కనెక్ట్ అవుతాయి అనిపిస్తుంది.
మీ సమీక్ష బాగుంది.
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండిNice review andi.. I will plan to watch this today. Thank you
రిప్లయితొలగించండిI hope you had a chance to watch the movie.
తొలగించండిNice review. One more scene I really liked was when Koshi meets his family in jail. He’s firm with his wife and other friends but has a tender moment with his kids, not too emotional. Very balanced and totally human. You may also like Drivers license, a similar theme of ego clashes but entertaining too by Prithviraj.
రిప్లయితొలగించండిI watched Driving License. I like that one too. Thanks for suggesting.
తొలగించండిచాలా బావుంది. బోల్డు థాంక్సులు ఓపికగా చూసి చెప్పినందుకు. కింది అధికారులు, అమ్మాయిలు ...వీళ్ళ పట్ల ఇలా ఆలోచించాలి అనే సత్యాలు కనుమరుగు, తెరమరుగే కాదు, మనుషుల మస్తిష్కాల్లోంచే మాయమైపోతున్నాయి. వాటిని పట్టుకుని చూపించినందుకు, పోలీస్, పూజారి, టీచర్ లాంటి వృత్తులని హక్కుగా, రొటీన్‌గా అవమానించడం అలవాటు చేసేసిన పరిస్థితిలో ఇలాంటి పరిశీలన, ఇవి మంచి విషయాలు గుర్తించండి అని చెప్పినందుకు మీకు, సినిమా తీసినవారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసినిమా తీసినవారికి ధన్యవాదాలు చెప్పాల్సిందే! దాంతోపాటు ఈ వ్యాఖ్య రాసిన మీక్కూడా!
తొలగించండి
రిప్లయితొలగించండిలలిత యొక్క బదరి కి ఆ సినిమా గురించి చెప్పిన సాయి ప్రసాద్ అనే నేను :
Read the blog. Told my wife Usha about the blog, salient points. Usha is a Tamilians, she could read Telugu in bits but not long ones. While telling about Lalita, I told that she has a శైలి, that genuine authors only possess, sort of born authors. తల నిమురుతూ, జుట్టు చిక్కు సుతిమెత్తగా విడదీస్తూ మనకి ఊసులు చెప్పినట్టు ఉంటుంది.
సరళంగా మొదలు అవుతుంది అప్పుడే పుట్టిన పిల్లఏరు పాయ లాగ. కాసేపట్లో కొండల్ని, కొనల్ని వెతుక్కుని చెంగున దూకి, చలాకీగా ఉరవలెత్తి, పరువులెడుతుంది. శోధించాలే గాని, బోల్డంత లోతు కూడా.
తెలుగు భాష కి మిగతా అన్ని భాషల్లాగే అందం ఒక సింగారం. ప్రతి భాష కి ఒక రుచి. అయితే చాలా భాషల్లో కంటే తెలుగు లో ఇంపైన రుచి దాని తీయదనం.
బొబ్బర్లంక లో మండుతున్న ఎండా కాలంలో పొద్దుకుంకుతున్నప్పుడు అరటి తోట లో చెట్టు నీడ కింద గోదారెంట వీస్తున్న పైర గాలి లో మల్లెపూలు తురుముకుని పౌడర్ అద్దుకుని వచ్చే దొరసాని కోసం వేచి చూస్తూ పండిపోయి మగ్గటానికి సిద్ధం గా ఉన్న అరటి పండుని చెట్టుకి వేలాడుతున్న గెల నుండి పీక్కుని నులక మంచం మీద జారిగిలపడి తింటే ఉండే తీయదనం వుందే, అది తెలుగు భాష తీయదనం. కమ్మదనం.
ఆ తీయదనాన్ని ఎంతో కమ్మగా వండి అరిటాకు భోజనం పెట్టినట్టు ఉంటుంది తన రచన శిల్పం.
ఇదంతా తను నా పేరు ఉదహరిస్తూ రాసింది కాబట్టి చెప్తున్నాను అనుకుంటున్నావేమో. అది నిజమే అనుకో. కానీ ఎప్పుడూ అనుకునేది కనీసం ఇప్పుడయినా చెప్పకపోతే బొబ్బర్లంక అరటి పండ్లు తిని గోదారికి హారతి ఇవ్వనట్లు.
సాయిప్రసాద్! ఎంత గొప్ప ప్రశంస! Thanks a lot!
తొలగించండిNice review ma’am. Good one Sai. Saw the movie yesterday. Try Charlie n Kumbalangi Nights also. Both are good movies.
రిప్లయితొలగించండిKumbalangi Nights is a nice movie. Thanks for suggesting. Added Charlie to our watch list :)
తొలగించండినమస్తే సాయిప్రసాద్ గారు!
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యలో చివరి వాక్యం భలే నచ్చేసింది. ఎంత అంటే ఇది రాయడానికి వెనకాడనంత.
భలే సంతోషంగా అనిపించింది when someone Is echoing my strands of thoughts..my depths of feelings and happiness!
తిరుపతి లడ్డు తిన్నాక ఇదీ అని చెప్పలేని పరిమళం, రుచి (అది తీపి మాత్రమే కాదు) ఎలా లోపలే ఉండి బోల్డుసేపు అనుభవించేలా చేస్తుందో ... అదేదో ఉంది ఈ రచనల్లో.
Yes.. depths, ఆలోచించేలా చేసేవి తప్ప ఎవరినీ సాధించని చురకలు, పాఠాలు, పాటలు, content, context, conscious, అన్నీ ... చాలా cute గా.
ఇంత పెద్ద comment నాచేత రాయించిన మీక్కూడా థాంక్సులు. బహుమతిగా ఒక అరటిగెల మీకు ...
ఒక అరటిచెట్టు ఈ బ్లాగ్ రచయితకి.
అరటిగెలలూ, అరటిచెట్లూ పంచుతున్న అజ్ఞాత గారెవరో తెలిస్తే అరటిపండు తాంబూలమివ్వాలని వుంది :)
తొలగించండిరివ్యూ బాగుంది లలిత గారు. దీన్ని తెలుగులో తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమర్షియలైజషన్ పేరుతో స్టోరీ ని ఎన్ని వంకలు తిప్పుతారో మరి.
రిప్లయితొలగించండితెలుగులో ఏమన్నా చేసుకోనివ్వండి... నేనటు పక్కకి ఎలాగూ చూడను. Thanks for your comment, Pavan garu!
తొలగించండిHow about "Driving License". That is worth watching too.
రిప్లయితొలగించండిWatched it & liked it :)
తొలగించండిSaw the movie after reading your review. Passable movie.
రిప్లయితొలగించండిThanks for reading my views on the movie and watching it!
తొలగించండి
రిప్లయితొలగించండిఎన్నో రోజుల తర్వాత చూస్తున్నంత సేపూ ఊపిరి బిగబట్టి కళ్ళు తిప్పకుండా చూసిన సినిమా - "అయ్యప్పనుమ్ కోషియుమ్".
అదీ లెక్ఖ :)
అలాగే వినీత్ శ్రీనివాసన్ అరవిందంటే అతిధిగళ్ చూసేయండి :) వీలయితే " ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం " మనోహరం " కూడా :)
సంవత్సరం తిరిగే కొద్దికి ఆంధ్రా ఆడపడుచు మళయాళ చేచి అయిపోవాలె :)
జిలేబి
తప్పకుండా మీరు చెప్పిన సినిమాలు చూస్తామండి, జిలేబి గారూ! హిందీ సినిమాలు చూసి దీదీలు, మలయాళ సినిమాలు చూసి చేచీలు ఎలా అయిపోతామండి? - అన్ని భాషల్నీ ఆదరించే ఆంధ్రా ఆడపడుచుల్లాగే ఉంటాం :)
తొలగించండి