నీతో కలిసి పాడుకున్న
అప్పటి ...
అప్పటి ...
పాట ఒకటి - గాలిలా తాకేది
పాట ఒకటి - చినుకులా తగిలేది
పాట ఒకటి - అలలుగా ఎగసేది
పాట ఒకటి - తలపుగా ఒదిగేది
పాట ఒకటి - మనసులో నిలిచేది
పాట ఒకటి - వలపుగా మసలేది
************
************
నీతో పంచుకున్న ఊసుల
ఒకప్పటి...
ఒకప్పటి...
ఆ పాటే... తెలిసిన దారుల తిప్పినది
ఆ పాటే... తెలియని తీరుల మప్పినది
ఆ పాటే... కంటి చెమ్మై తడిపినది
ఆ పాటే... ఎంతో ప్రేమై తడిమినది
ఆ పాటే... తొలివలపై మురిసినది
ఆ పాటే ... చిరునగవై మెరిసినది
************
************
నువ్వు లేని ఈవేళ
ఇప్పుడూ...
ఇప్పుడూ...
అదే పాట - మళ్ళొచ్చి పిలుస్తుంది
అదే పాట - మళ్ళించి మరిపిస్తుంది
అదే పాట - రమ్మని కవ్విస్తుంది
అదే పాట - కమ్మగ నవ్విస్తుంది
అదే పాట - ఇంతలోనే ఆటపట్టిస్తుంది
అదే పాట - అంతలోనే పట్టరాని ఏడుపవుతుంది
************
************
అప్పుడుండి ... ఇప్పుడు లేక ... ఇంకెప్పటికీ రాక...
నువ్వు లేక మనని మన-మై
పలకలేని మౌనమై
తోడులేని నా పాట
పలకలేని మౌనమై
తోడులేని నా పాట
మరలిపోయిన వసంతమై
మరల కూడని యుగళమై
పగిలిన గొంతుకై
పిగిలిన గానమై
మరపురాని బాధై
మరవలేని గాధై
వీడలేని నీడలాగ
వెన్నంటి ఉంటుంది
వీడిపోయిన తోడులాగ
వెంటాడి వేధిస్తుంది
************
************
************
************
ఒక జ్ఞాపకం...
ఒక తీగకి విరిసిన పువ్వుల్లా నవ్వుకున్న రోజుల్నాటిది.
మువ్వల్లా తుళ్ళుకుంటూ పాటల సవ్వడి చేసిన పూటల్నాటిది.
ఇప్పటికీ తలుచుకున్నప్పుడు నవ్వుగా విచ్చుకుంటుంది.
అల్లాంటప్పుడు విన్న పాటొకటి, వింటుండగానే నచ్చిందొకటి గుర్తుకొస్తుంది.
ఆనాటి ఆ పాట గుర్తు - అచ్చు అప్పట్లాగే - నవ్వుగా విచ్చుకుంటూనే, అంతలోనే నొవ్వుగా గుచ్చుకుంటుంది.
అలాంటి ఓ జ్ఞాపకం... అప్పటి పాటే - ఈ పూటకి ఈ చోట... ఓ రెండు కవలపాటలుగా...

చైత్ర-వైశాఖ మాసములు - వసంతఋతువు.
చెట్లు చిగిర్చి పూలు పూయును
అది ప్రకృతి నియమం.
లల్లి-పప్పి-కుట్టి హాసములు - మా సొంత ఋతువు.
నవ్వులొలికి పాటలవును.
ఇది మా శృతి సమయం.
చిరుచిరు చలి రోజులు పాతబడి, సూరీడి పాలబడి, గాలి వెచ్చపడి, వేడెక్కి గాడుపై - విసిరి విసిరి - వట్టివేరు పరదాల దాటి రాలేక ఉడుకుమోత్తనంగా - విసిగి వేసారి - మా ఇంటి గడపల కావల కావలిగా చిందులాడేవేళ.
కన్నకడుపు మా అమ్మది.
ఉసురుసురనిపించే వేసంగి మధ్యాహ్న వేళ - సనసన్నటి బియ్యపు రవ్వతో జావ కాచి, దానికి చలచల్లటి పల్చటి మజ్జిగ జేర్చి, ఆపై పులపుల్లటి నిమ్మరసం పిండి, దాంట్లో చిటికెడు రాతి ఉప్పేసి, వాటన్నిటినీ గరిటెతో తిప్పేసి - ఆ పుల్లమృతాన్ని తలో కప్పులో పోసి మా ముగ్గురి చేత బెట్టేది.
తిన్న మా కడుపుకి చలవది.

చేతిలో కడుపు నింపే చల్లని జావామృతం.
పక్కనే టేప్ రికార్డర్లోంచి మనసు జిల్లుమను ఇళయరాజా-సంగీతామృతం.
అప్పుడు విన్నది ఆ పాట.
మొదటిసారి విన్నప్పుడే ఆకట్టేసుకుంది.
పెదవుల చుట్టేసుకుంది.
అర్థం అయీ అవక అవస్థ పెట్టేసింది.
ఎక్కడికెళ్ళినా వెంటాడి వచ్చేసేది.
గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ వాలులో జారిపోతున్నట్టుగా నడుస్తూ తేలిపోతున్నప్పుడో - నవోదయా లోనో, ప్రబోధ లోనో కొత్తపుస్తకాల వాసనల మఱఁగి సోలిపోతున్నప్పుడో - అదాటుగా గుర్తుకొచ్చేసి - గాలి అలలుగా చుట్టుముట్టి - ఉక్కిరిబిక్కిరి చేసేసేది.
అప్పట్నుంచి ఆ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్క లేదు.
ఇప్పటికీ వింటుంటాను - దాదాపు రోజూ.
అప్పుడెప్పుడో పారేసుకున్న కల-పాటైన మా కుట్టి నవ్వుల్ని గుర్తు చేస్తుందనే ఇష్టంతో.
అలా కోరికోరి కొనితెచ్చుకునే కావాలనుకునే ఓ ఇష్టమైన నొప్పిలా అలవాటైపోయింది ఆ పాట.
ఆ పాటే - భారతీరాజా దార్శనిక "ఆరాధన" లోని "అరె, ఏమైందీ!" పాట.
ఈ పాటలో నాకిష్టమైనవి...
ఆత్రేయ రాయుట...
ఎస్పీబీ, ఎస్జానకి పాడుట...
పాట మొదట్లో కనిపించే క్రిస్టియన్ హోమ్ - మా ఏసీ కాలేజ్‌ని గుర్తు చేస్తూ...
అప్పుడప్పుడే నడక నేరుస్తూ - తలలొంచుకుని కాళ్ళ కింద తరుగుతున్న నేలని చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ కాళ్ళని చుట్టేయాలనుకునే అల్లరిపిల్లల్లా - ఒడ్డుకి సాగి వస్తున్న అలల నురుగులు...
అందుకుందామన్నట్టు ఎగసి వచ్చే అలలకందక పైపైకి ఎగిరిపోయే పక్షులు...
పాటంతా పరుచుకున్న సముద్రం, ఇసక, గాలి, వెండి ఎండ, వెచ్చటి సూర్యుడు, కురిసే వర్షం, పచ్చగ తడిసే చెట్లు...
వీటన్నిటి మధ్యా - కాన రాని గుండె లోకి - కన్నమేసి వచ్చావు - అన్న మాటల దగ్గర - తన వలపు-దొంగతనాన్ని పట్టేసిన అమ్మాయి తన మీద మోపిన నేరాన్ని ఒప్పుకుంటున్నట్టుగా ఒక్క కంటి రెప్ప పాటులో చిరంజీవి చేసిన అభినయం...
పాట పొడవునా మెరిసిన నవ్వులు...సుహాసిని పట్టుకున్న లేతరంగు గొడుగులు...

బీడు లోన - వాన చినుకు - పిచ్చి మొలక వేసింది - అన్న దగ్గర టీచరమ్మతో దొరికిన సావాసాన్ని తలుచుకుని - కాలు ఊపుతున్న చిరంజీవిలో కనిపించిన పట్టరాని సంతోషం ...
అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టమైనవి... రెండో చరణంలోని నాలుగు లైన్లు...
బీడు లోన - వాన చినుకు - పిచ్చి మొలక వేసింది
పాడలేని - గొంతు లోన - పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటె - పాట నీవు రాయగలవు - ఇవి ఏ నీరెండ జాలుల్లోనో నాకు మాత్రమే కనిపించి - వానచినుకుల గలగలల్లో నాకు మాత్రమే వినిపించే మా కుట్టి నవ్వులా - అది లేకపోయినా నేను పాడుతూనే వుండాలని చెప్తున్నట్టుంటాయి...
ఇవన్నీ మీరూ చూసెయ్యండి...

అరె, ఏమైందీ?...
అరె, ఏమైందీ?
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ?
తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది...
అది నీలొ మమతను నిద్దుర లేపింది...
ఆ ఆ ఆ ఆ ...
అరె, ఏమైందీ?
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ?
నింగి వంగి - నేలతోటి - నేస్తమేదొ కోరింది
నేల పొంగి - నింగి కోసం - పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేను - పూజలేవి చేయలేను
నేల పైన కాళ్ళు లేవు - నింగి వైపు చూపు లేదు
కన్నెపిల్ల కళ్ళ లోకి ఎన్నడైన చూశావో!
కాన రాని గుండె లోకి - కన్నమేసి వచ్చావు
అది దోచావూ...
ల ల ల ల ....
బీడు లోన - వాన చినుకు - పిచ్చి మొలక వేసింది
పాడలేని - గొంతు లోన - పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటె - పాట నీవు రాయగలవు
రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో?!
చేతనైతె మార్చి చూడు - వీడు మారిపోతాడు
మనిషౌతాడూ..

ఈ పాటకో కవల వుంది తమిళంలో. అసలదే ముందు పుట్టింది.
సినిమా పేరు "కడలోర కవితైగళ్" - అంటే "కడలి తీరపు కవితలు" అని నాకొచ్చిన "కొంజం కొంజం తమిళ్" లో నా కర్థమైంది.
సినిమా పేరు భలే poetic గా అనిపించి నచ్చేసింది.
అందులోనూ పాటని ఇళయరాజా, ఎస్జానకితో కలిసి పాడడం ఇంకా నచ్చింది. ఇళయరాజా గొంతు rustic గా ఉండి సత్యరాజ్‌కి భలే సరిపోయింది.
నాకు ఈ తమిళ్ పాటలో మాటలూ చాలా నచ్చాయి కానీ తప్పులు రాస్తానేమో అన్న భయంతో రాయట్లేదు.
ఎవరైనా తమిళ్ వచ్చిన పెన్ తోళి నెవరినైనా అడిగి ఆ పాట రాసుకోవాలి.
ఇప్పటికి నాతో పాటు మీరూ వినండి...సరేనా!
************
************
అదీ...
తమిళ కడలి ఒడ్డున పాడిన కవితే ... తెలుగు ఆరాధన అయిన తీరు..
అని
నేను చెప్తే వినాలి మీరు :)
ఇట్లు,
~ పాటల భైరవి వ్రాలు
చాలా బాగుంది లలితగారు మీ ఆ "పాట" మధురాలు.
రిప్లయితొలగించండినా బ్లాగ్ చదువుతున్నందుకు ధన్యవాదాలు మీకు :)
తొలగించండిఈ పాటలో చిరంజీవి అభినయం సత్యరాజ్ కంటే బాగా చేశాడు.
రిప్లయితొలగించండికద కదా!
తొలగించండిపోస్ట్ ఆ పాటలా ఉంది!!
రిప్లయితొలగించండిఆ పాట ఎప్పుడూ భలే ఆశ్చర్యకరమే!
సముద్రాన్ని సడీ, వడీ లేకుండా అర్ధరాత్రి నిండు వెన్నెల్లో (completely against nature) ఒకసారి చూసి వెంటనే అల్లరి గోల, గొడవ ఉన్న మామూలు సముద్రాన్ని చూస్తే తెలుస్తుంది...ఇంత గంభీరం, విస్త్రుతి, లోతు, అందులోని అనంతాలు, అన్నీ దాచుకున్న అల్లరి గోల..
ఎంతో depth ఉన్న సాహిత్యాన్ని ఇలాంటి orchestration లో పొదిగిన ఇళయరాజాకి, సరళమైన పదాల్లో సారాన్ని దట్టించేసిన ఆత్రేయకి, ఆ రెండిటినీ కలిపినట్టు గంధం రాసిన దారంతో మల్లెపూలమాలలా రాసిన ఈ పోస్ట్‌కి అభినందనలు, థాంక్సులు!
పోస్ట్ బావుంటే అది ఆ పాట గొప్పదనం, దాన్ని చదివి మెచ్చుకున్న మీ మంచితనం. మీకే బోల్డన్ని థాంక్సులు!
తొలగించండిపాడేస్కున్నాం అనడమే కానీ మీ పాట మాకు వినిపించనేలేదు. ఓ పాలి వినిపించండి !
రిప్లయితొలగించండిఅప్పుడెప్పుడో కదండీ పాడేస్కున్నది... ఇప్పుడు వినిపించడమెలా? :)
తొలగించండి