రంగులేసుకున్న కోడిపిల్ల
పాలు తాగలేక బెంగెట్టుకుని పారిపోయిన కుక్కపిల్ల
నూతిలో దూకేసి తప్పించుకుందామనుకున్న పిల్లిపిల్ల
ఎర్ర జాకెట్లు, అద్దాలు పట్టుకొచ్చేసే కోతిపిల్ల
అగ్గిపెట్టెలో బజ్జోపెట్టిన వెల్వెట్స్
గీతలు గీసి దారిమళ్లించిన యాంట్స్
ఇవన్నీ ఏంటంటే ...నా pet-పెంపకానికి అంపకాలెట్టేసిన కొన్ని పెంపుడు జంతువుల జాబితా.
రాము, షిప్లీ:
నాగ్గుర్తుండి నేను పెంచుకుందామనుకున్న మొట్టమొదటి ప్రాణి - కుక్కపిల్ల.
జంగారెడ్డిగూడెంలో ఏకోపాధ్యాయ పాఠశాలలో - నేలబెంచీల మీద కూర్చుని - గార్డుగారి పిల్లలతోనూ, మేమద్దెకున్న ఇంటి ఓనరైన తాతగారి మనవరాలు రాధ తోనూ కలిసి - మూడు నించి ఐదో తరగతి దాకా చదువుకున్న రోజుల్లో - బడికెళ్లే దారిలో బోల్డన్ని కుక్కలుండేవి. అందులో ఒక కుక్క ఒకసారి పిల్లలు పెట్టింది. అదీ - ఎక్కడా...? మా ఇంటి పక్కనే వున్న ZPH స్కూల్లో పనిచేసే పెద్ద హిందీ టీచరుగారి ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో.
పెద్ద హిందీ టీచరు గారంటే ఎనిమిది, తొమ్మిది, పది తరగతులకి హిందీ చెప్పేవారన్నమాట. ఆ టీచరుగారి కూతురు విజయలక్ష్మీ ఆండాళ్ నాకన్నా ఒకటో, రెండో ఏళ్ళు పెద్దది. అయినా మేమందరం కలిసి వాళ్ళింటి ముందు వున్న మామిడి చెట్టు, జామచెట్టు ఎక్కి కోతికొమ్మచ్చి ఆడేవాళ్ళం. ఎప్పుడైతే కుక్కపిల్లలు పుట్టాయో మా ఆటలన్నీ బంద్. "అప్పుడే పిల్లలు పెట్టిన కుక్క ఆకలి మీద ఉంటుంది, దాని పిల్లల జోలికి వెళ్తే కరుస్తుంది" అని అమ్మ పదేపదే చెప్పేది. దాంతో బుజ్జిబుజ్జిగా వుండి ఎంతో ముద్దొచ్చే ఆ శునక-బేబీలని దూరం నుంచే చూసి - అవి పడుతూ లేస్తూ బంతుల్లా దొర్లుతూ ఉంటే - వాటి చుట్టూ మూగి, చూసి మురిసిపోతూ ఉండేవాళ్ళం. ఓ రోజు పెద్ద హిందీ టీచరుగారు మమ్మల్ని పిలిచి - కుక్కపిల్లల్ని ఎవరికైనా కావాలంటే తీసుకెళ్లొచ్చు - అని చెప్పారు. వెంటనే ఇంటికి పరిగెత్తుకెళ్లి అమ్మకా విషయం చెప్పాను. చెప్పి నేనూ ఒక కుక్కపిల్లని తెచ్చుకుంటానని అన్నాను. అమ్మ ససేమిరా అంది. కావాలంటే రోజూ సాయంత్రం పూట స్కూల్ అయిపోగానే వెళ్లి కుక్కపిల్లలతో ఆడుకుని రమ్మని చెప్పింది. అంతే! అక్కడితో నా మొదటి-పెంపకపు-అంకానికి తెర పడిపోయింది.
జంగారెడ్డిగూడెం వదిలి, కాకినాడ చేరీ చేరగానే మళ్ళీ బదిలీ. టంగుటూరు మా తర్వాతి మజిలీ. ముందొక ఆరు నెలలు కొండలవుగారింట్లో వున్నా, తర్వాత చెరువుకి ఎదురుగుండా వుండే కొణికి వెంకటశేషయ్య గారి ఇంట్లోకి అద్దెకెళ్ళాం. మేమద్దెకుండే ఇంటి ముందు శేషయ్యగారు ఒక పాక వేసుకున్నారు. ఆ పాకలోనే ఆయన చేసే కంసాలి వృత్తికి కావాల్సిన సామానంతా ఉండేది. పొద్దున్నే ఎండ రాకుండానే ఆయన పని పూర్తి చేసుకునేవారు. ఇంక మధ్యాహ్నం నుంచి మేమా పాకలో బోల్డు ఆటలు ఆడుకునేవాళ్ళం.
శేషయ్యగారు అప్పుడప్పుడు ఒక కుక్కకి అన్నం పెడుతూ ఉండేవారు. ఆ కుక్క నలుపు-తెలుపు రంగుల్లో ఉండేది. ఆ కుక్క శేషయ్యగారు ఒక చిన్న బండ మీద అన్నం పెట్టి, గిన్నెతో బండ మీద శబ్దం చేయగానే - నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి అన్నం తినేసి ఎండాకాలమైతే నీడగా వుండే పాకలో, శీతాకాలమైతే పాక బైట ఎండలో పడుకుంటూ ఉండేది. అంతగా చడీ చప్పుడూ చేసేది కాదు. ఎవరైనా వచ్చినా ఒక కన్ను తెరచి చూసి, ఒక చెవి ఏదో వింటున్నట్టుగా ఎత్తి - మళ్ళీ పడుకుండి పోయేది. నాకు తెల్సి అంత బద్ధకపు కుక్కని అప్పటిదాకా ఎప్పుడూ చూళ్ళేదు.
ఓ రోజు స్కూల్ నుంచి వచ్చే టైంకి మా ఇంటి ముందున్న పాకలో బోల్డు హడావిడి. శేషయ్యగారి అమ్మాయి జగదీశ్వరక్క, అక్క తమ్ముడైన ఏడుకొండలు, మా కుట్టి - అందరూ పాకకి కొంచెం ఇవతలగా నించుని చూస్తున్నారు. ఏంటా అని నేనూ వాళ్ళ పక్కన చేరి చూస్తే అక్కడ మూడు బుజ్జిబుజ్జి నల్ల కుక్కపిల్లలు పడుకుని వున్నాయి. వాటి అమ్మ ఎవరంటే తెలుపు-నలుపుల లేజీ-బేపి.
ఆ బుజ్జి కుక్కపిల్లలు బోల్డు ముద్దుగా వున్నాయి. అందులో ఒక్కదాన్నైనా పెంచేసుకుందాం అనేసుకున్నాను. చిత్రంగా మా అమ్మ ఒప్పుకుంది. అదీ ఎందుకంటే మా ఇంటికెదురుగా వున్న పాకలోనే వున్నాయి కదా - వాటికి మా ఇంట్లో వేరే బస ఏర్పాటు చేయక్కర్లేదని. ఇంక పోటీలు పడి పొద్దున్న, సాయంత్రం పాలు తాగేటప్పుడు నేనూ, కుట్టీ చెరో చిన్న గ్లాసుడు పాలు ఒక చిన్న జర్మన్ సిల్వర్ బేసిన్లో పోసి కుక్కపిల్లల చేత తాగించేవాళ్ళం. పుట్టిన మూడు కుక్కపిల్లల్లో రెండు పిల్లలను ఎవరో పట్టికెళ్లారు. ఇంకొక్కటే మిగిలింది. దానికి "రాము" అని పేరు పెట్టాం. రాము పుట్టిన వారం రోజులకి పెద్ద వాన వచ్చింది. అది పాకలో ఉంటే తడిసిపోతుంది అని చెప్పి మా ఇంట్లోకి తీసుకొచ్చి అమ్మ చీరలు పెట్టుకునే గాడ్రెజ్ బీరువా కింద ఒక గోనెపట్టా వేసి పడుకోబెట్టాం. దానికి మా నాన్న కూడా సపోర్ట్ చేసి, ఆ గోనెపట్టా వేయడానికి సాయం చేయడంతో అమ్మ మమ్మల్ని ఇంకేమీ అనలేదు. అలా మా చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగింది - రాము.
రాముకి మధ్యాహ్నం, రాత్రి మా భోజనాలు అయ్యాక మా ఇంటి వాటా సందులో అన్నం పెట్టేవాళ్ళం. అన్నం పెట్టి గిన్నెతో నేల మీద శబ్దం చేయగానే ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చేసేది. ఒక్కోసారి రాముని టెస్ట్ చేద్దామని అన్నం పెట్టకుండానే ఊరికే గిన్నెతో శబ్దం చేసినా - పాపం - పరిగెత్తుకుంటూ వచ్చి, ఒకసారి చూసి వెళ్లిపోయేది. ఆ తర్వాత అమ్మ దానికి అన్నంతో పాటు మాకు చీవాట్లు కూడా పెట్టేది - అలా దాన్ని ఏడిపించడం పాపం అంటూ.
రాము వాళ్ళ అమ్మలా కాదు. అస్సలు నిశ్శబ్దంగానే ఉండేది కాదు. అటూ ఇటూ పరిగెడుతూ, అరుస్తూ గొప్ప హడావిడిగా ఉండేది. మా ఇంటి ముందు నుంచి ఎవరెళ్తున్నా గొంతెత్తి "భౌ" మంటూ మొరిగి - "బా మొరిగానా?" అన్నట్లు మాకేసి చూసేది.
ఈ రాము గురించే ఇంతకూ ముందొకసారి చెప్పాను కూడా నా సంగీత పరస్థానం - చరణం అనే బ్లాగ్ పోస్టులో:
నేను సంగీతం నేర్చుకునే రోజుల్లో నా సాధనలో ... మా పాటకి కాపలాగా - రోజూ మధ్యాహ్నం, రాత్రి పళ్లెం కొట్టి మరీ పిలిచి మేం పెట్టే అన్నం తినే కృతజ్ఞతతో - చెవులు కాళ్లతో కప్పుకుని మరీ సాగిలపడి పాట వినే - మా జాగిలం 'రాము' - మేము పాట ఆపగానే - ఉలిక్కిపడి లేచి చెవులు రెండూ దులుపుకుని - శాలువా కప్పుకుని అస్తమిస్తున్న సూర్యుడివైపు నడిచివెళ్లే హీరోలా - అదేదో ట్రాన్స్‌లో ఉన్నట్లు తిరిగేది - ప్రతీ సాయంత్రం పూట.
మేము టంగుటూరు నుంచి గుంటూరు వచ్చేసేటప్పుడు మా సామాన్లు లారీలోకి ఎక్కిస్తునంత సేపూ "కుయ్..కుయ్..." మంటూ మా కాళ్ళావేళ్ళా పడింది రాము :)
గుంటూరొచ్చాక జంతుప్రేమ మరీ పెరిగింది. అందులోనూ అపర్ణ నా ఫ్రెండయ్యాక ఇంకానూ. దానికి కారణం అపర్ణ చెల్లెలు ఆరతి పెంచే "కస్తూరి" అనే చిలక. కస్తూరి చిలకపలుకులు కూడా నేర్చింది - ఎంతైనా చిలక కదా! ముందు దానికి దాని పేరే పలకడం వచ్చింది.
అది అస్తమానూ "కస్తూరి...కస్తూరి" అని అరుస్తూ ఉండేది. అరిచి చివర్లో దానికదే "షటప్" అనుకునేది. అపర్ణ వాళ్ళమ్మగారు (శాంతా ఆంటీ) అంకుల్‌ని "రీ ...రీ" (కన్నడలో "రీ" అంటే "ఏమండీ" అని) అంటుంటే ఆవిడతో సమానంగా కస్తూరి కూడా "రీ...రీ..." అని అరుస్తూ ఉండేది. ప్రతిరోజూ కాలేజ్ కనో, ట్యూషన్ కోసమో అపర్ణ వాళ్ళింటికెళ్లినప్పుడల్లా కస్తూరిని మాట్లాడించడం, దాంతో సమానంగా అరవడం బావుండేది.
ఓ రోజు ఎక్కడినుంచి వచ్చిందో ఓ చాకొలేట్ బ్రౌన్ కలర్ కుక్కపిల్ల ఒకటి మా ఇంటి కాంపౌండ్ లోకి వచ్చింది. భలే ముద్దుగా వుంది. దాన్ని వెంటనే ఎత్తుకుని బ్రాడీపేట నాలుగో లైన్లో అటూఇటూ చూస్తే దాని ఓనర్ అనదగ్గవాళ్ళు ఎవరూ కనిపించలేదు. "ఆహా! ఇది మనకి దేవుడిచ్చిన కుక్క" అనేసుకుని దానికి "షిప్లీ" అని పేరు పెట్టేసుకుని దాన్ని ఎత్తుకున్నవాళ్ళం ఎత్తుకున్నట్టే వుండి, దాన్ని కాలు కింద పెట్టనీయకుండా అరచేతుల్లో పెంచడం మొదలుపెట్టాం. అపర్ణకి "షిప్లీ" గురించి చెప్పగానే అపర్ణ, అపర్ణతో పాటు ఆరతి మా ఇంటికి వచ్చారు. షిప్లీని చూడగానే ఆరతి "ఇది Pekingnese breed లా వుంది" అని తెగ మురిసిపోయింది.
నేను, పప్పి, కుట్టి - ఒంతులేసుకుని షిప్లీకి పొద్దున్న ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, రాత్రి ఒకళ్ళు పాలు పోసేవాళ్ళం. అది గింజుకుంటున్నా కిందకి దింపక ఎత్తుకు మోసేసేవాళ్ళం. ఇలా ఓ రెండ్రోజులు గడిచింది. మూడోరోజు పొద్దున్నే ఎలా మాయమయిందో చాలా mysterious గా షిప్లీ కనిపించడం మానేసింది. ఎక్కడైనా మడత మంచాల కిందో, నూతి వెనకాల మోటార్ దగ్గర దాక్కుందో అని ఎంతో వెతికాం. షిప్లీ జాడే లేదు. అది కనిపించట్లేదన్న దిగులుతో "బర్‌సే గగన్ - మేరే బర్‌సే నైన్ దేఖో - తర్‌సే హై మన్ అబ్ తూ ఆజా!" అంటూ విషాదగీతాలు పాడుతున్న మమ్మల్ని చూసి మా అమ్మ "దానికి మూడు పూటలా అది వద్దన్నట్లు మొహం తిప్పేస్తున్నా అతి ప్రేమతో పాలు పోసి - దానికి పాలంటేనే మొహం మొత్తేలా చేశారు. అందుకే పారిపోయింది" అని తేల్చేసింది.
ఆ పారిపోయిన షిప్లీ గుర్తుగా ఓ బొమ్మకి "షిప్లీ" అని పేరు పెట్టుకున్నాను. నా బొమ్మ-షిప్లీ నాతో యూనివర్సిటీ చదువుకి, పెళ్లయ్యాక కాపురానికి వచ్చి ఇప్పటికీ నాతోనే వుంది.
లింపింగ్ లూసీ:
సరే! షిప్లీ పారిపోయింది. ఇంకెప్పుడూ పాలు పోసినా పారిపోయే కుక్కపిల్లలని పెంచనేకూడదు అని గట్టిగా అనేసుకున్నాను.
ఇంతలో ఇంకో విశేషం జరిగింది. అమ్మ పండగ కోసమని ఇల్లు దులిపిస్తూ ఉంటే వంటింట్లో అటక మీద నుంచి గులాబీ రంగులో వున్న ఎలకపిల్లలు కింద పడ్డాయి. ఇంక అవి చూడగానే అమ్మ గొడవ పెట్టేసింది - ఇంక ఇల్లంతా ఎలకల మయం అయిపోతుందని. అప్పుడు నాన్న సరదాగా "పిల్లిని పెంచుకుందాం. ఎలకలు పారిపోతాయి" అన్నారు .
అది విన్నదే తడవు ఎప్పుడూ ఏదో ఒక pet వుంటే బావుంటుంది అనుకునే మా ముగ్గురి కళ్ళు మెరిశాయి. అప్పటికి మా కాంపౌండులో ఓ మూడు పిల్లులు తిరుగుతూ ఉండేవి - వున్న మూడు వాటాలని పంచుకుని పాలు, తోడుపెట్టిన పెరుగు తాగేసేట్టుగా ఒప్పందం చేసుకుని.
అందులో ఒక పిల్లి - పాపం - ఎందుకో సన్నగా వుండేది. మా అక్కాచెల్లెళ్ల కళ్ళు దాని మీద పడ్డాయి - దానికెలాగైనా పాలు తాగించి బొద్దుగా తయారుచెయ్యడమే మా కర్తవ్యం, భాద్యత అనేసుకుని, రోజూ పొద్దున్నే అది పాల-విహారానికి వచ్చేవేళల్లో మేమే దానికి ఎదురెళ్లి ఓ చిన్న కప్పులో పాలు పోసేవాళ్ళం. ఓ రెండు, మూడ్రోజులు కాగానే ఆ సన్న-పిల్లికి అర్థమైపోయినట్లుంది - మా పాలబడి పాలు తాగితే ఇల్లిల్లూ తిరిగి తిట్టించుకోవక్కర్లేదని.
ఇంక మా కాళ్ళ చుట్టూ చుట్టుకుంటూ తిరగడం మొదలుపెట్టింది. పైగా నేను పొద్దున్నే పేపర్ చదివే టైంకి వచ్చి పేపర్ మీద పడుకునేది. అలా మా అమ్మ ముగ్గురు పిల్లలం మేము, మా పిల్లీ అన్యోన్యంగా కాలం గడుపుతున్నాం.
ఓ వారం బానే గడిచింది. ఆ పిల్లి ఎంతకీ లావెక్కట్లేదు. మరి ఎలకని చూడగానే "లావొక్కింతయు లేను...ధైర్యం విలోలంబయ్యె" అనేసుకుని ఈ పిల్లే ముందు పారిపోతుందేమో అనుకుని దానికి పాలు పట్టే వేళలు ఖచ్చితంగా ప్లాన్ చేశాం. పాపం - మా అమ్మ చెప్తూనే వుంది "పిల్లికి విశ్వాసం ఉండదు. ఎన్ని పాలు పోసినా యజమాని కళ్ళు పీకెయ్యాలనే చూస్తుంది" అని. మేం వింటేగా - ఈ పిల్లికి కూడా మూడు-పూటల-పాలు-పోసే-పథకం మొదలు పెట్టాం.
ఓ రోజలాగే మధ్యాహ్నం పాలు గిన్నెలో పోసి పిల్లిని అక్కడికి తీసుకెళ్లి దింపగానే అది ఒక్క ఉదుటున ఎగిరి మా ఇంటికి, పక్కింటికి మధ్యలో వున్న పిట్టగోడ దూకి పారిపోబోయి - దాని కన్నే చెదిరిందో, కాలే జారిందో మా వాటా ముందున్న నూతిలో పడిపోయింది.
"పిల్లిని చంపిన పాపం బ్రహ్మహత్యాపాతకం కన్నా ఎక్కువ" అంటూ అమ్మ ఒకటే తిట్లు.
లక్కీగా ఆ టైంకి నాన్న ఇంట్లోనే వున్నారు. నూతి చుట్టూ చేరి "అయ్యో!" అంటున్న మా గొంతులు విని ఏమయిందో అనుకుంటూ గబగబా బయటికి వచ్చి నూతిలో చేద వేసి పిల్లిని పైకి తీశారు. పిల్లైతే బతికింది కానీ - పాపం - ఒక కాలికి దెబ్బ తగిలింది. కుంటటం మొదలుపెట్టింది. అప్పటికి Wilkie Collins రాసిన The Moon Stone నా పేవరెట్ పుస్తకం. అందులో ఒక character పేరు Limping Lucy. మా కాలు విరిగిన పిల్లికి "లింపింగ్ లూసీ" అన్న పేరు పెట్టేసి - దాన్ని మా ప్రేమ-నిర్బంధంలోంచి విడుదల చేసి జనజీవనస్రవంతిలో కలిపేసేదాకా మా అమ్మకి మనశ్శాంతి లేకపోయింది. తర్వాత చాలా రోజులు లింపింగ్ లూసీ కుంటుకుంటూ తిరుగుకుంటూ మేము కనిపించగానే మిగిలిన మూడు కాళ్లతోనే స్పీడుగా పారిపోయేది. అలా పిల్లి ముచ్చట తీరిపోయింది.
కోతి:
అప్పటికి ఓ నాలుగు రోజుల్నుంచి మా ఇంటి ఓనరైన నాయక్ గారింట్లో, పక్కనే వున్నౘందమామలో-రాక్షసిగారింట్లో దండాల మీద ఆరేసిన జాకెట్లు మాయమవడం మొదలుపెట్టాయి - అవి కూడా ఎర్రరంగువి.
[ౘందమామలో-రాక్షసిగారు ఎవరంటే మా ఇంటి పిట్టగోడ అవతల వుండే ఇంకో ఇంటి ఓనర్. ఆవిడ చూడడానికి పాత తెలుగు సినిమాల్లో హేమలతలా ఉంటారని అమ్మ మెచ్చుకుంటూ ఉండేది. కానీ ఆవిడ అమాయకుడైన కొడుక్కి పెళ్లిచేసి వచ్చిన కోడల్ని దేనికో దానికి ఏదో ఒకటి అంటూ ఉండేవారని మా కుట్టి ఆవిడకి "ౘందమామలో-రాక్షసి" అని పేరు పెట్టింది - అంటే ౘందమామ కథల్లో వుండే రాక్షసి లాంటి ఆవిడ అని.]
ముందు అందరూ ఏమనుకున్నారంటే ఎవరో మధ్యాహ్నం ఎండవేళ అందరూ తలుపులేసుకుని లోపల వున్న సమయంలో వచ్చి జాకెట్లు దొంగతనం చేస్తున్నారు అనుకున్నారు. నాలుగు రోజుల తర్వాత ఓ బుల్లికోతి మెళ్ళో ఓ జాకెట్టు వేసుకుని, ఒక చేత్తో అద్దం పట్టుకుని మా ఇంటి పిట్టగోడ మీద కూర్చుని కనిపించింది. దాన్నలా చూడగానే అందరికీ కోపంతో పాటు కొంచెం ముచ్చటగా కూడా అనిపించింది - ఆ అద్దంలో దాని మొహం చూసుకుంటూ కనిపించేటప్పటికి.
సాయంత్రం నాన్న ఆఫీస్ నుంచి రాగానే కోతి విషయం విని తెగ సంబర పడ్డారు - "ఇదేదో తెలివైన కోతిలా వుందే!" - అంటూ. పైగా "నాకు సిగరెట్లు అయిపోతే తెచ్చిపెట్టడానికి ఎవరూ లేరు. ఈ కోతికి ట్రైనింగ్ ఇచ్చి కొట్టు మీదికెళ్లి నాకు సిగరొత్తులు, మీ అమ్మ చేసే పూజకి అగరొత్తులు ఇల్లాంటివన్నీ తెప్పించుకుందాం" అని చెప్పి ఆ కోతి కోసం అరటిపళ్ళు తేవడం, దానికి చేతికి అందించడం చేసేవాళ్ళు.
మాకు కోతి అంటే కొంచెం భయంగా వున్నా అది మా నాన్న ట్రైనింగ్‌లో చేయబోయే షాపింగ్‌ని ఊహించుకుంటూ, ఆ పైన మాకు బ్రాడీపేటలో రాబోయే గొప్పపేరుని తలుచుకుంటూ ఆ కోతి-శిక్షణ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నాము. మా అమ్మకి మాత్రం ఒకటే టెన్షన్ - తోకలేని ముగ్గురు కోతులకి తోడు ఇంకో తోకున్న కోతి తోడైతే ఎలారా బాబూ అనుకుంటూ. ఓ రోజు పొద్దున్నే నాన్నకి చెప్పేసింది - "రేపట్నుంచి ఆ కోతికి అరటిపళ్ళు పెట్టకండి. చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇలాగే ఉంటే మనల్ని ఇల్లు ఖాళీ చేసేయమంటారు. మనకొద్దీ కోతి-చుట్టం" అంటూ. ఆ రకంగా కోతికి ట్రైనింగ్ ఇచ్చి పేరు తెచ్చుకునే ఛాన్స్ మిస్సయ్యాం.
ఎర్ర వెల్వెట్లు, నల్ల యాంట్లు:
ఇలా కుక్కపిల్లలు, పిల్లులు,ఆ పైన ఓ కోతి - ఇవే కాక నేను పెంచిన ఇంకొన్ని ఏంటంటే బుజ్జిబుజ్జి red velvets, ఇంకా black ants అనబడే బుల్లిబుల్లి నల్లచీమలు. ఇవే కాక రంగులేసిన కోడిపిల్లలు.
వేసవి సెలవులకి హైద్రాబాద్ వెళ్ళినప్పుడల్లా BHEL దగ్గరున్న గంగారాంలో వున్న మా అమ్మ చెల్లెలైన చిన్నపాప్పిన్నిఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర గడ్డిలో గునగునా తిరుగుతున్న బుజ్జిబుజ్జి వెల్వెట్ పురుగులని చూసి తెగ ముచ్చటపడి వాటిని అగ్గిపెట్టెల్లో పెట్టి పెంచుదామనుకున్నా కానీ వాటికి ఆహారం ఏం పెట్టాలో తెలీక వదిలేశాను.
వాటి తర్వాత ఇంకేం పెంచుదామా అనాలోచిస్తే చీమలు అన్నిటికన్నా హాయనిపించాయి. ఓ రోజు మధ్యాహ్నం పూట చీమల్ని తెగ పరిశీలించి, ఒక లైన్లో వెళ్లే చీమల మధ్య వేలితో రాసి ఒక చీమని దారి తప్పించి ant-nap చేసి ఓ 3-Mangoes అగ్గిపెట్టెలో కొంచెం పటికబెల్లం పెట్టి అందులో చీమని పెట్టాను - ఆ అగ్గిపెట్టెని నా దగ్గరున్న ఓ అద్దాల సంచీలో పెట్టుకున్నా. పటికబెల్లం ఎందుకంటే దాన్ని చీమ దొర్లించుకుని పోలేదుగా! - అందుకు. తీరా చూస్తే సాయంత్రానికల్లా బోల్డన్ని చీమలు పట్టేసి, వాటన్నిట్లో నా పెంపుడు-చీమ ఏదో అర్థం కాక అన్నిటినీ దులిపేయాల్సి వచ్చింది.
చివరాఖరిగా రంగులేసిన కోడిపిల్లలు. నేనెప్పుడూ రంగులేసిన కోడిపిల్లలని కొనలేదు కానీ పక్కింటి ఆంటీ వాళ్ళు కొన్నవాటితో కాసేపు ఆడుకుని సరదా తీర్చేసుకున్నాను.
పెళ్ళై బుజ్జిజింకలు పుట్టిన తర్వాత వాళ్ళతో కథలు, కబుర్లు, ఆటలు, పాటలు మొదలయ్యాక వాళ్ళని పెంచులక్ష్మిని మాత్రమే అయ్యాను కానీ అసలింక వేరే పెంపకాల జోలికే పోలేదు.
ఇదిగో - మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మా ఇంట్లో కుక్కపిల్లల ప్రసక్తి వచ్చింది. అన్నజింకకి, బుజ్జిజింకకి - ఇద్దరికీ కూడా వాళ్ళకే సొంతమైన pet dogs కావాలని చాలాసార్లు చెప్పారు. వాళ్లకి నా stock answer - "నేను మిమ్మల్ని సవ్యంగా పెంచగలిగితే చాలు. కుక్కలో, పిల్లులో మీరు పెద్దయ్యాక మీ ఇంట్లో పెంచుకోండి" అని - ఇంచుమించుగా మా అమ్మ నాకు చెప్పిన సమాధానమే!
బుజ్జి కుక్కపిల్లలు చూడడానికి ముద్దుగానే ఉంటాయి కానీ మా sub-division లో వుండే చాలా మంది ఎండనక, వాననక, చలనక ఒక ప్లాస్టిక్ కవర్ పట్టుకుని, leash మెడలో వున్న కుక్కలని నడిపిస్తూ - అవి ఎక్కడైనా ఆగి చిన్నపనో, పెద్దపనో చేస్తే వెంటనే అక్కడ శుభ్రం చేస్తూ ఉండడం ఆ ముద్దుగా ఉండడాన్ని cancel చేసేస్తుంది.
ప్రస్తుతానికి మాత్రం పక్కింట్లో వుండే బార్బ్ పెంచుకునే టోసీ అనే బుజ్జికుక్కపిల్ల రెండువారాలకొకసారి గ్రూమింగ్‌కి వెళ్లొచ్చి రెండు చెవులకూ కట్టుకొచ్చే పింక్ రిబ్బన్లను దూరం నుంచి చూసి ఆనందిస్తూ ఉన్నాననడంతో నా Peటోపాఖ్యానం అనబడు పెంచులక్ష్మి కబుర్లు సమాప్తం.