కిందటి 19 చెప్పిన కబుర్లు
సెకండ్ సెమిస్టర్ మొదలయింది - Data Structures తో పాటు Business Data Processing (COBOL), Accountancy - ఇవీ మెయిన్ సబ్జెక్ట్స్.
ఈ రెండో సెమిస్టర్‌కి కాలేజ్, హాస్టల్ - రెండూ బాగానే అలవాటు అయ్యాయి.
పైగా వారం వారం ఇంటినుంచి ఫోన్ వచ్చేది. రెండు వారాలకో ఉత్తరం - పెదనాన్నో, లక్ష్మి దొడ్డో, శ్రీనో, వేణూనో - ఎవరో ఒకరు రాసేవారు. దాంతో బెంగ తగ్గి చదువు మీద కాన్సంట్రేషన్ పెరిగింది.
అకౌంటెన్సీ - మాకు మూడో, నాలుగో బాచ్‌ల ముందు SVU లో MBA చేసిన రాజశేఖర్ సర్ టీచ్ చేసేవారు. మా అమ్మాయిల MCA క్లాసుకి మొట్టమొదటి మేల్ లెక్చరర్.
అప్పటివరకు ఫిజిక్స్, మాథ్స్ చదివిన నాకు మొదటిసారిగా కామర్స్ సబ్జెక్ట్ చదవడం - ఆ గీతలు గీసి అంకెలు బాలన్స్ చేయడం సరదాగా ఉండేది. దానికి తోడు కేస్ స్టడీస్ అనీ, రియల్ మార్కెటింగ్ ఉదాహరణలు అనీ రాజశేఖర్ సర్ చెప్పే పాఠాలు ఆసక్తికరంగా ఉండేవి.
అప్పటికి లలితా రామకృష్ణన్ అని సీనియర్ బ్యాచ్‌లకు మేనేజ్‌మెంట్ సబ్జక్ట్స్ చెప్పే లెక్చరర్ ఒకావిడ ఉండేవారు. ఒకరోజు ఆవిడ - SV ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ సురేష్ గారితో కలిసి - మా MCA క్లాసులు జరిగే CC (కంప్యూటర్ సెంటర్) కి వచ్చి - SPIC-MACAY గురించి చెప్పి ఆసక్తి వున్నవాళ్లు మెంబర్స్ కావొచ్చు అని చెప్పారు.
SPIC-MACAY అంటే Society for Promotion of Indian Classical Music and Culture Amongst Youth.
దాంట్లో భాగంగా - దేశంలో గొప్ప గొప్ప సంగీత, నృత్య కళాకారులని మా యూనివర్సిటీకి ఆహ్వానించి - వాళ్ళతో కచ్చేరీలు, ప్రదర్శనలు ఇప్పించే కార్యక్రమాలని ఏర్పాటు చేసే - అవకాశం మాకుంటుందని చెప్పారు.
దానికోసం SPIC-MACAY - తిరుపతి చాఫ్టర్ మొదలు పెడుతున్నారని, మొదటి కార్యక్రమం తొందరలోనే అని చెప్పారు.
నాకింక బోల్డంత ఉత్సాహంగా అనిపించింది - నాకంటూ అభిమాన కళాకారులు ప్రత్యేకంగా ఎవరూ లేకపోయినా ఎటువంటి సంగీతం లేక నృత్యం అయినా ఎంజాయ్ చేసే అలవాటున్న నాకు తెగ నచ్చేసింది SPIC-MACAY.
వెంటనే పాతిక రూపాయల మెంబర్‌షిప్ కట్టి SPIC-MACAYలో చేరాను.
మొట్టమొదటి కార్యక్రమం - ప్రముఖ వయోలిన్ విద్వాంసులు - M. S. గోపాలకృష్ణన్ గారిది.
ఆ కార్యక్రమానికి - స్టేజ్‌కి ముందూ వెనకా కూడా చాలా ఏక్టివ్‌గా పని చేశాను నేను - నా సీనియర్స్‌తో కలిసి. మొట్టమొదటిసారి అంత గొప్ప కళాకారుల సభలో వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పడం ఒక మంచి జ్ఞాపకం.
SPIC-MACAY కార్యక్రమాల కోసం అప్పుడప్పుడు సురేష్ గారి దగ్గరికి SV ఇంజనీరింగ్ కాలేజ్‌కి వెళ్లాల్సి వచ్చేది. ఒకసారి అలా వెళ్ళినప్పుడు శ్యామల, పుని (సునీత) అనే ఇద్దరు ఇంజనీరింగ్ అమ్మాయిలు వచ్చి పలకరించారు. అందులో శ్యామల నన్ను నా ఇంటిపేరు అడిగి - నువ్వూ, నేను కజిన్స్ - అని చెప్పింది.
నాకు భలే తమాషాగా అనిపించింది - ఇప్పటివరకూ నాకసలు తెలియని అమ్మాయి వచ్చి మనిద్దరం కజిన్స్ అని చెప్పేటప్పటికి.
అదెలా అనడిగాను.
నీ ఇంటి పేరు బట్టి చెప్పాను - అంటూ మా ఇద్దరికీ కామన్ అయిన బంధువుల పేర్లు చెప్పింది.
అసలు నన్ను పలకరించాలని నీకెలా తోచింది అనడిగాను.
వెంటనే శ్యామల - "నువ్వు సురేష్ సర్ దగ్గరికి వచ్చినప్పుడు మా క్లాస్ అబ్బాయిలు నిన్ను చూసి నా దగ్గరికి వచ్చి - శ్యామలా! ఈ రోజు నీలాగే ముక్కుకి రింగ్ పెట్టుకున్న ఒకమ్మాయిని చూశాము - చూడడానికి కూడా నీలానే వుంది - అని చెప్పారు. నాక్కూడా నాలాంటి అమ్మాయి ఎవరా అని క్యూరియాసిటీ పుట్టి నిన్ను చూడడానికి వచ్చాను" - అని చెప్పింది.
అంతే! ఇంక తనతో బోల్డన్ని కబుర్లు - పప్పి, కుట్టీల గురించి, వాళ్ళని నేను ఎంత మిస్ అవుతున్నానో, శ్యామల తెలియడం వల్ల ఎంత సంతోషంగా ఉందో - ఇవే కాకుండా నా కాలేజ్ కబుర్లు, హాస్టల్ కబుర్లు అన్నీ మాట్లాడుకుంటూ చాలాసేపు తనతో గడిపి వచ్చేస్తుంటే - అవి చాలనట్లు - "లలితా - ఈ శనివారం మా హాస్టల్ రూంకి రా - సరదాగా కబుర్లు చెప్పుకుందాం" అంది.
వస్తాను కానీ మరీ ఈ శనివారమే కాదు అని చెప్పి వచ్చేశాను.
తర్వాత ఒకటి రెండు సార్లు శ్యామలే తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చినన్ను చూసి వెళ్ళేది. తనకి అప్పుడు చెప్పాను - సెకండ్ సెమిస్టర్ పరీక్షలు అయ్యాక వస్తానని.
రోజులు మహా ఉత్సాహంగా జరుగుతున్నాయి - కొత్త కొత్త జూనియర్ బాచెస్ వచ్చాయి - అన్ని డిపార్టుమెంటుల్లో - MCAలో కూడా.
ఇంతలోనే రెండో SPIC-MACAY కార్యక్రమం కూడా ప్లాన్ చేశారు - హరి ప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ కాన్సర్ట్.
నాకు జూనియర్స్‌లో శుభా రామస్వామి, రజని, అరుణ అనే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో కలిసి కొత్తగా చేరిన మా జూనియర్స్ అందరినీ SPIC-MACAYలో మెంబర్స్‌గా చేర్పించాను.
హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ వాయించిన - సిరివెన్నెల సినిమా పాటలు తెలుగు అమ్మాయిలకి - ఆయన పండిట్ శివ్‌కుమార్‌శర్మతో కలిసి శివ్-హరిగా సంగీత దర్శకత్వం వహించిన సిల్‌సిలా-పాటలు హిందీ వచ్చిన అమ్మాయిలకి వినిపించేసి - వాళ్ళు నా మాటల-పాటల మైకంలోంచి కోలుకునేలోగా - పాతిక రూపాయలు నా చేతిలోకి, SPIC-MACAY మెంబర్‌షిప్ కార్డు వాళ్ళ చేతిలోకి ఎప్పుడు మారాయో - కనురెప్ప పాటే అయిందీ - మెంబర్‌షిప్పు ఆట అన్నట్లుగా అయేది.
మొత్తానికి హరిప్రసాద్ చౌరాసియా కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.
ఆయనతో పాటు తబలా వాయించడానికి ప్రముఖ తబలా విద్వాంసులు అల్లారఖాకి తనయుడు, జాకిర్ హుస్సేన్‌కి తమ్ముడు అయిన ఫజల్ ఖురేషి వచ్చారు.
వాళ్ళిద్దరితో పాటు స్మిత అని ఇంకొకావిడ కూడా వచ్చారు - తంబుర వాయించడానికి.
ఆరోజు రాత్రి వాళ్ళ భోజనాల టైంలో మా యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో కలిసినప్పుడు సీనియర్ గుత్తి పద్మజ తనకి వచ్చిన ఒక ట్యూన్ ఫ్లూట్ మీద హరిప్రసాద్ చౌరాసియా ముందు వాయించడం ఇంకో బహు మంచి జ్ఞాపకం.
హరిప్రసాద్ చౌరాసియా కార్యక్రమం తర్వాత - మా జూనియర్స్‌లో నా పరపతి, పలుకుబడి బాగా పెరిగిపోయాయి.
అటు సీనియర్స్, ఇటు జూనియర్స్ - మధ్యలో కాలేజ్ టైంలో క్లాస్‌మేట్స్ - వీళ్ళే కాకుండా తోచీ తోచనివేళ షిప్లీని పట్టుకుని కారిడార్లలో - అప్పటి మూడ్‌ని బట్టి - ఏ ఆకులో ఆకునై అనో , లేకపోతె ప్రతీ రాత్రి వసంత రాత్రి అనో దేవులపల్లి వారి పాటతో పాటుగా తిరిగే నన్ను ఆపి - వాళ్ళ రూములోకి పట్టుకెళ్లి - "ఆ పాటేదో ఇక్కడ పాడు" - అనే హోంసైన్స్ అమ్మాయిలు, నన్ను దూరం నుంచే చూస్తూ ఇష్టంగా నవ్వే ఇంగ్లీష్ లిటరేచర్ అమ్మాయిలు, సెరికల్చర్ పట్టు-వనితలు, కాబోయే-టీచర్లయిన బీఎడ్ వాళ్ళు - ఒకరేమిటి - హాస్టల్ మొత్తం నా ఫ్రెండ్సే.
పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ - హడావిడిగా చేసేసి వెళ్ళిపోయినా - సాయంత్రం డిన్నర్ టైంలో తీరిగ్గా అందరినీ ఒకసారి పలకరించి - నాక్కావాల్సిన సాంబార్ బకెట్ (ముక్కలతో నిండుగా వున్నది కావాలి కదా - మరి) ఒకటి ఏ టేబుల్ మీదున్నా సరే - తెచ్చుకుని నా పక్కన పెట్టుకుని - అన్నం తక్కువ - ముక్కలెక్కువ తిని, మా అమ్మ చెప్పి వెళ్లడంతో - ప్రతిరోజూ రాత్రిపూట కొదై లేకపోతే కణ్ణగి - పిలిచి మరీ ఇచ్చే ఒక గ్లాసు పాలు పట్టుకుని రూంకి వచ్చేటప్పటికి తొమ్మిదయ్యేది.
అప్పటికి శ్రీలత, సంగీత, పద్మజ, పద్మజవల్లి - అందరూ చదువుకుంటూ వుండేవాళ్ళు.
నాకెప్పుడూ క్లాసులో విన్న పాఠాలు నెమరు వేసుకోవడం తప్ప పుస్తకం పట్టి చదవడం అలవాటు లేదు - మంచం మీద పడుకుని ఆరోజు క్లాస్‌లో విన్న పాఠాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి - అకౌంటెన్సీలోనో, NM (Numerical Methods) లోనో వున్న హోంవర్క్ పూర్తి చేసేదాన్ని.
ఆగస్టులో సెకండ్ సెమిస్టర్ పరీక్షలు అయ్యాయి. ఈసారి కొంచెం పెద్దయ్యాను కదా - ఒక ఆరు నెలలు - అందులోనూ జూనియర్స్ వున్నారు కదా - ఇంక బెంగంటే బావుండదు కదా - అందుకని అమ్మ రావాల్సిన అవసరం లేకపోయింది.
థర్డ్ సెమిస్టర్ ఒక రెండు రోజుల సెలవు తర్వాత మొదలయింది.
OB (Organizational Behaviour) లాంటి మేనేజ్‌మెంట్ సబ్జక్ట్స్ పెరిగాయి. సత్యం సర్ టీచ్ చేసే వారు. సత్యం సర్ ఇంకో SVU - MBA ప్రాడక్ట్. ఈయన క్లాసులు సరదాగా జరిగేవి.
ఇంతలో అక్టోబర్ - దసరా సెలవులు వచ్చాయి.
శ్రీలత, నేను, ఇంకా గుంటూరు అమ్మాయిలు - సుమలత, ఉషా లక్ష్మి - అందరం నారాయణాద్రికి టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నాం.
నేను టికెట్ రిజర్వ్ చేయించుకునేటప్పుడు ఎప్పుడూ నాకు సైడ్‌బెర్త్ కావాలని అడిగి మరీ తీసుకునేదాన్ని. ఈసారి కూడా అంతే - నాదీ, శ్రీలతది పక్క పక్క సీట్స్.
మా లగేజ్ పట్టుకుని ట్రైన్ ఎక్కాము. సీట్లలో కూర్చుని - నోరు మూస్తే ట్రైన్ హోరు వినబడుతుందేమో - దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు - అన్నట్లు మాట్లాడుకుంటూనే వున్నాము.
ఇంతలో ట్రైన్‌లోకి ఒకతను ఎక్కి మా ముందు నుంచే వెళ్లి మా పక్కనున్న సైడ్‌బెర్త్-సీట్‌లో కూర్చున్నాడు. మేమంతగా పట్టించుకోలేదు - బోల్డంత మంది ఎక్కుతూ వుంటారు - ట్రైన్ మా సొంతం కాదు కదా.
నారాయణాద్రి గూడూరు స్టేషన్‌లో ఒక గంట ఆగేది - ఇంజిన్ మార్చుకోవడానికి.
మా పక్క సీట్లో అతను గూడూరు స్టేషన్లో దిగి బిస్కెట్ పాకెట్లు, మంచినీళ్ల బాటిల్ కొనుక్కుని మళ్ళీ ట్రైన్ ఎక్కాడు.
తన సీట్లోకి వెళ్ళబోతూ శ్రీలతతో మాట్లాడుతున్న నా దగ్గర ఆగి ఒక గుడ్‌డే బిస్కెట్ పాకెట్ తీసుకోమన్నట్టు నాకేసి చెయ్యి చాపాడు.
"ఏంటిది?" - అప్పటికే నాకు కోపం వచ్చేసింది - ముక్కూ మొహం తెలియని ఎవరో వచ్చేసి బిస్కెట్లు ఇవ్వడం ఏంటి అని.
"పర్లేదు తీసుకోండి - అందరికీ తెచ్చాను" - ఆ అబ్బాయి సమాధానం.
"నేనేమన్నా కుక్క-పిల్లలా కనిపిస్తున్నానా?" - కోపంలో ఏం మాట్లాడుతున్నానో తెలియనంత తిక్కగా అడిగాను.
ఎదురుగుండా శ్రీలత ఏం మాట్లాడకుండా నవ్వాపుకుంటూ - "వద్దులెండి - మా దగ్గర వున్నాయి " అని చెప్తుంటే - ముందుకు చాచిన చేతిని వెనక్కి తీసుకుని తన సీటులోకి వెళ్లి కూర్చున్నాడతను.
అతన్నింక ప్రశాంతంగా కూర్చోనివ్వాలనిపించలేదు.
మా దగ్గర ఆగినప్పుడు చూశాను - అతనొక పింక్ షర్ట్ వేసుకుని వున్నాడు.
"శ్రీలత! మీకు తెలుసు కదా - పింక్ వేసుకుంటే మా స్కూల్లో చిన్నప్పుడు ఏం పాట పాడేవాళ్ళమో?" - అనడిగిన నాకు - "ఏమో లల్లీ - ఏంటది?" అన్న శ్రీలత ప్రశ్న సమాధానం.
"అదే -
Inky Pinky Ponky
Father had a donkey
Donkey died
Father cried - ఇప్పటికీ పింక్ చూస్తే నాకదే పాట గుర్తుకొస్తుంది"
- అని నాకు బాగా వచ్చిన పర-మన-ఆందోళన-రాగంలో రెండు సార్లు రాగయుక్తంగా పాడుతూ కిటికీలోంచి బయటికి చూసేటప్పటికి మా పక్క సీట్లోని అబ్బాయి మావైపు రాకుండా కంపార్టుమెంటులో ఆ చివరి వరకూ నడిచి ఎప్పుడు దిగి వెళ్ళాడో - బుద్ధిమంతుడిలా ఒక పుస్తకంలో తల దూర్చి మహ-సీరియస్‌గా చదివేసుకుంటున్నాడు. ఆ చదువరి మళ్ళీ ట్రైన్ కదిలేదాకా లోపలి రాకుండా అక్కడే కూర్చున్నాడు.
ట్రైన్ కదిలిన తర్వాత గుంటురులో దిగే దాకా - దిగాక కూడా అతన్నింక మళ్ళీ చూడలేదు.
దసరా సెలవుల తర్వాత వెనక్కి వెళ్ళి - మళ్ళీ నేను కాలేజ్ కబుర్లు మొదలు పెట్టేదాకా... కొంచెం విరామం.
ఈలోగా ... ఈ పోస్ట్ టైటిల్ పాట - ఈ కింది క్లూ పాట - నే కట్టిన వరస కనిపెట్టి, వరస పెట్టి పాడేసుకోండి మరి...
టైటిలేమిటో - ఆ పాట ఏమిటో
టైటిలేమిటో - ఆ పాట ఏమిటో
ఆ టైటిల్... ఓ పాటే ...
ఆ పాటా అతి మధురము
ఈ పాటా శృతి మధురము
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>
Batukantha prati nimisham pata laaga saagali,prati raatri vasantha raatri?
రిప్లయితొలగించండిఅవునండి - అదే పాట ! మీ కమెంట్‌కి థాంక్స్ - వాసుగారు.
తొలగించండి👌👌
రిప్లయితొలగించండిThanks, Laksmi garu!
తొలగించండిపోస్ట్ బాగుందండి. టైటిల్ పాట ఏకవీరలోది - ప్రతిరాత్రి వసంతరాత్రి - బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి. కరెక్ట్?
రిప్లయితొలగించండినాగేశ్వర రావుగారు: మీరు కరెక్టండి - మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండిMadhuramaina aa paata title emito telidu kani.... mee Madhura anubhutulu bagunnayi chadavadaniki
రిప్లయితొలగించండిThanks a lot, Sarada.
తొలగించండిHi Lalli. ☝🏼 is great. How do you remember all those small details also. Hats off to you.
రిప్లయితొలగించండిI vaguely remember 2 incidents. GP standing for election and we going on strike . And college people sending us home because there's no water in hostel.
Remember the queue of buckets for hot water?
Yes even I still have the student membership card of SPICMACAY.
SriLatha: Thanks for your nice words & endorsing my memory :) Yes - I do remember the elections - they will be part of the future posts. Stay tuned!
తొలగించండిపోస్ట్ బాగుంది లలిత గారు, ఎప్పటిలాగే 19వ తారీఖు తప్పలేదు అలాగే మీ పోస్టులో మాధుర్యం తగ్గలేదు
రిప్లయితొలగించండిపవన్గారు: ప్రతి 19న రాసే నా త్వామనురజామి చదువుతున్న మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండిఇదన్యాయం లలితా! పోస్ట్ టైటిల్ సాంగ్ మాత్రం ఈజీగా ఇచ్చి చివర్లో, 'క్లూ' పేరు పెట్టి మరీ కష్టమైన పాట ఇస్తావా?? నేను మాత్రం ఖచ్చితంగా తప్పని తెల్సినా, 'గ్రీకువీరుడు... నా రాకుమారుడు...ట్యూన్ లో కష్టపడి మరీ నీ పేరడీ పాటను ఖూనీ చేస్తూ పాడుకుంటున్నాను.
రిప్లయితొలగించండినీ ఈ 'ట్యూన్ కనుక్కోండి...
పాటను పట్టుకోండి' ఐడియా ��
నీ జ్ఞాపకశక్తి కి మాత్రం జోహార్లు. క్లాసు పాఠాలే ఊరికే నెమరు వేసుకుని గుర్తు పెట్టేసుకునే నీకు, కాలేజి, హాస్టల్ జ్ఞాపకాలు గుర్తుండటం ఎంత పని??
అన్నీ సులువుగా ఇచ్చేస్తే మజా ఏంటి కదా! Keep trying the "clue" song. వచ్చే 19 లోగా చెప్తే సరి - లేకపోతే అప్పుడు నేనే చెప్తా.
తొలగించండిlalita,
తొలగించండిI am really surprised how you are able to remember all this details....
Did you note them somewhere in a diary or somewhere in your brain itself ?
Amazing....
-Veena
Thanks for your comment, VeenaVani. I wish I had written a diary :)
తొలగించండిఎప్పటిలాగే మీ కబుర్లు హాయిగా ఉన్నాయండీ... ఇంతకీ ఆ ఉత్తరం అబ్బాయీ, ఈ బిస్కట్లబ్బాయి ఒక్కరే అంటారా :-)
రిప్లయితొలగించండిఈ నెల కూడా ఆలశ్యంగా నిన్ననే చదివానండీ మీ పోస్ట్.. నే వచ్చేసరికే మిత్రులు టైటిల్ సాంగ్ చెప్పేశారు కదా.. క్లూ పాట నాక్కూడా తెలియలేదు. వచ్చే పందొమ్మిది వరకూ టైమిచ్చారుగా ఇంకో రెండ్రోజులు ఆలోచించి చూస్తా :-)
అబ్బాయిలు ఎవరికి వారేనండి - ఒకరికొకరు ఏమీ కారండి :)
తొలగించండిఆ పాట ఇలా ప్రయత్నించండి : "టైటిల్ తెల్సునా - ఆ పాట తెల్సునా?"
ఇంకొక క్లూ: ఇదొక కమల్‌హాసన్-శ్రీదేవి పాట.
spic-macay జ్ఞాపకాలు అతి మధురం. అన్ని universities లో promote చేసారేమో అప్పట్లో అనిపించింది ఈ post చదివాక. మొత్తానికి nostalgia కి మారు పేరు ఈ త్వామనురజామి series అని నేను డిక్లేర్ చేసేస్తున్నానోచ్ :-) waiting for more...even though I know what is in store :-))
రిప్లయితొలగించండిచదువుతూ ఉండు మరి - I know that you know what is in store - and... I feel happy that you are still wanting to read more :)
తొలగించండిఓహో, మీకూ నాకూ ఇది మరో బాదరాయణ బంధం. వరంగల్ ఆర్యీసీలో 80లలో స్పిక్ మెకే వరంగల్ ఛాప్టర్ స్థాపించిన ఘనత మాదే. ఆ నేపథ్యంలో శ్రీ ఈమని శంకరశాస్త్రిగారితో మా బృందం అనుభవాలు ఇక్కడ చదవొచ్చు.
రిప్లయితొలగించండిhttp://kottapali.blogspot.com/2013/09/blog-post.html
మీ బ్లాగ్ చూశాను ఇప్పుడే - బోల్డన్ని విశేషాలున్నాయి. గబగబా చదివేశాను - మళ్ళీ తీరిగ్గా చదివాలి - ఇవాళ మధ్యాహ్నం. Thanks a lot for sharing!
తొలగించండిపేరు చెప్పనా నీ రూపు చెప్పనా
రిప్లయితొలగించండినీ పేరే అనురాగం నీ రూపము శృంగారము నీ చిత్తమూ నా భాగ్యము
పేరు తెలుసునూ నీ రూపు తెలుసును నీ పేరే ఆనందం నీ రూపము అపురూపము
పట్టేశారు పాటని అనురాధగారు 👏 Thanks for trying.
తొలగించండి