దాదాపు మూడేళ్ల క్రితం నేనేం రాశానో ఒక్కసారి గుర్తుచేసుకుంటున్నాను.
6, అక్టోబర్ 2025, సోమవారం
కాంతార ఛాప్టర్ 1 ... దృశ్యవిధ్వంసం
19, జులై 2025, శనివారం
బేరు...బేరు...బెంబేరు!
ఏదో చెప్పలేని చికాకు, ఏమీ చెయ్యలేని విసుగు.
ముళ్ళపూడినీ, P. G. Wodehouse నీ మార్చి మార్చి చదువుకుంటూ, కృష్ణగీత మననం చేసుకుంటూ, నడకలో పగళ్లనీ - నిద్రలో రాత్రులనీ కొలుచుకుంటూ - ఆఫీసు పని కూడా అన్యమనస్కంగా జరుపుకుంటున్న రోజులవి.
ఈలోగా అందరూ ఆహా-ఓహో అంటున్న సినిమా విశేషాలు యూట్యూబ్‌లో కనిపించాయి.
నాకూ కొంచెం ఆసక్తీ, ఆశా కలిగాయి.
అంతటి అనుభవం వున్న కథానాయకుడు నాగార్జునే గొప్పగా వచ్చింది సినిమా అంటున్నాడు. ధనుష్షుని సెట్లో పోల్చుకోలేనంత అద్భుతంగా వున్నాడూ అని కూడా చెప్పాడు. ఇంకా విలేఖరులు, సినిమా నిర్మాతలూ సినిమా గురించి ఒక కళాఖండమన్నట్టు పరవశంతో మాట్లాడుతున్నారు.
దాంతో ఈ సినిమా ఎలా తీశారో అన్న ఆసక్తీ, దీన్ని చూస్తే కొంచెమన్నా వేరే విషయాల మీదకి మళ్లి - మనసులో వున్న చికాకు తగ్గుతుందన్న ఆశా కలిగాయి నాకు.
ఓ రోజు సాయంత్రపు నడకలో బద్రీని అడిగాను "బావా! కుబేర సినిమాకి వెళ్దామా?" అని.
సినిమా అన్న మాట నా నోట్లోంచి పూర్తిగా రాకుండానే టికెట్లు కొనేసే బద్రి ఆ రోజు మాత్రం - చాలా క్లుప్తంగా "వద్దు" అన్నారు.
అంతే ! అక్కడితో ఆ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసి మిగిలిన దారంతా వేరే కబుర్లతో కొలిచి ఇంటికొచ్చేశాం.
19, ఫిబ్రవరి 2025, బుధవారం
చేవ గలిగిన దర్శకుడు కన్న కల - ఛావా
బద్రీకి ఇక్కడ శని-ఆదివారాలు కూడా సెలవు లేదు అని చెప్పారు. కానీ ఆదివారం (2/16) రోజు సాయంత్రం నాలున్నరకల్లా ఆఫీసు పనైపోయిందని హోటల్ రూంకి వచ్చేశారు తను.
వస్తూనే "తొందరగా రెడీ అవ్వు, పది నిముషాలు నడిచి వెళ్తే ఒక మాల్లో 'ఛావా' సిన్మా వుంది. చూసొద్దాం పద" అన్నారు.
తనా మాటన్న తొమ్మిదో నిముషంలో రోడ్డుమీద నడుస్తున్నాం.
మేమెళ్లినప్పుడు అక్కడక్కడా కూర్చున్నవాళ్ళు కొంతమంది మాత్రమే కనిపించారు. ఇంత చలిలో, ఈ డౌన్టౌన్ సినిమాకి ఎవరొస్తార్లే అనుకుంటూ వున్నాం.
ఇంతలో "ఆపణ్ కసే ఆహత్?" అంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ, మరాఠీలో పరామర్శించుకుంటూ బోల్డంత మంది సకుటుంబ-సపరివార-స"మేత"-సహితంగా - పెద్దపెద్ద పాప్‌కార్న్ టబ్బులు, పెప్సీ-కోక్ డబ్బాలు పట్టుకుని బిలబిల్లాడుతూ వచ్చి కూర్చున్నారు.
సిన్మా-హాలుకే మాటలొచ్చి వున్నట్లైతే "నేనేనా ఇంత నిండిందీ - ఇలా నిండి ఎన్నిరోజులయ్యిందో ?!" అని గాఠి...గా హా-శ్చర్యపడిపోయేంతగా నిండిపోయింది.
8, డిసెంబర్ 2024, ఆదివారం
ఓ పుష్పోత్తరం - టు పుష్ప-2 డైరెక్టర్ ఫ్రమ్ పుష్ప-వాచర్...
పుష్ప-2 డైరెక్టర్‌కి,
శానా శానా పుష్పాభినందనలతో ఓ పుష్ప-వాచర్ రాస్తున్న ఓ పుష్పోత్తరం (దుషట సమాసంలా అనిపిస్తే - ఈ తూరికి మన్నించేయప్పా, సుక్కప్పా!).
పుష్ప చుట్టూ వుండేవోళ్లంతా వాళ్లవాళ్లోళ్ల పేర్లతో, ఇంటిపేర్లతో గాకుండా పుష్ప-అమ్మ, పుష్ప-అన్న, పుష్ప-మేనేజరు, పుష్ప-డ్రయివరు అంటా పేమస్సు అయిపోయుండారుగా...అందికే పుష్ప-సిన్మా తీసినోడు పుష్ప-డైరెక్టరు, పుష్ప సిన్మా చూసుండిన నేను పుష్ప-వాచరు గాక ఇంకేమిటి అయ్యుండేది? అదీ పుష్ప-లెక్క!
సుక్కప్పా! బలేనప్పా! సిన్మా మొదలవుతూనే బలే క్యామెడీ చూపిచ్చినావే.
అదెట్లెట్లా!
జపాన్లో గూడా విలన్లు మన దగ్గరి మాదిరే నెత్తి మీద జులపాల జుట్లేస్కుని, ఒంటి మీద సూట్లేస్కుని - ఫైటింగనేటప్పటికి కత్తులూ, గొడ్డళ్లేసుకొస్తారా? పైగా అందరూ ఒక్క తూరి మీద బడి తన్నక ఒక్కోళ్ళే వరసలో బోయి పుష్పతో తన్నిచ్చుకున్నారు గదా!
పుష్ప అనుకుంటే ప్యానిండియా అనుకుంటి గానీ జపానిండియా అనుకోనేలేదబ్బా!
మన పుష్పా నలఫైరెండ్రోజులు గాలీ, ఎలుతురూ రాకుండా నాలుగు పక్కలా మూసేసిన కంటెయినర్లో 30 రోజుల్లో జపాన భాష పుస్తకం సదివినాడంటే ఆడెట్టాంటి మనిషబ్బా! వాళ్ళావిడ శ్రీవల్లి జెప్పినట్టు బగమంతుడెట్టా?! ల్యాపోతే ఆ కంటెయినర్లో ఆ ఎఱ్ఱచందనం దుంగల మద్దెన పరుపేసి, పక్కేసి , ఏసీ గూడా పెట్టించావా ఏంది పుష్ప వస్తుండాడని?
అవునూ....పుష్పరాజుని జపాన్లో సముద్రంలో ముంచావు. అక్కణ్ణుంచి ఊరికి సీను తిప్పిచ్చి పిల్ల-పుష్పరాజ్ నీళ్ళల్లో మునిగిన మాదిరి చూపించావ్. ఆమిటికి మళ్ళీ పెద్దోణ్ణి చేసి పీడకలేదో కన్నట్టు నిద్ర లోంచి లేపిచ్చినావ్. ఇంతకీ ఆ జపాన్ ఫైటు కలంటావా? కలపలేక మర్సిపోయిన కతంటావా?
మూడు గంటల పైగా తీస్తే తీశావ్ గానీ సినిమా అంత బాగుండనట్టు అనిపిచ్చకుండుండె. ఎట్టనిపిచ్చిద్దిలేబ్బా! సిన్మా మొదలైన పద్నిమిషాలకే తల పంజేయడం ఆగిపోయుండుండ్లా? ఇంక ఎంత సేపు చూసుండామో లెక్కపత్రం తెలిసేదెట్టా? నోరెళ్ళబెట్టుకుని చూస్చానే వుండిపోయా.
ఆ పుష్ప నోటెంబడి మాట సరింగా ఇనిపిస్తే గదా... దాంతోడు నాటకాల్లో హార్మనీ పెట్టె తొక్కిన మాదిరి ఒకటే కుయ్యి-కుయ్యి BGM సాగతానే వుండే సిన్మా పొడుగూకి.
పుష్పకి ఎదురే ల్యాకుండా ఏకపాత్రాభినయమనిపిచ్చింది. విలను షెకావత్తు వేషమేసిన ఫహాదుతో క్యామెడీ చేపిచ్చి అంతటి విలన్నూ నవ్వులపాలు జేపిచ్చినావే!
సుక్కప్పా! హీరోయిన్ల మీద పూలూ, పళ్ళూ ఏపిచ్చిన రాఘవేందర్రావుని నువ్వు మించిపోయుండావబ్బా... పుష్ప బొడ్డు మీద పచ్చిమిరపకాయేసి.
పుష్ప-1 లో ఒక పాటలో ఆడిచ్చిన సమంతాని పుష్ప-2 రష్మికాలో పాటపాటకీ గుర్తు చేపిచ్చినావే! ఒగ టికెట్టుకి మూడు సిన్మాలన్నట్టు.
జాతర్లో కాంతారాని దించినట్టనిపిచ్చింది.
పుష్పరాజ్ కాళ్ళూ-చేతులూ కట్టిపిచ్చినా ఎగిరెగిరి విలన్లందరినీ కరిచి, కరిచి మరీ చంపె కదప్పా! స్పైడర్-మ్యాను దారాలేసుకుని గోడలెక్కగా లేంది మన వైల్ద్-ఫైర్ మ్యాన్ పుష్ప ఆ మాత్రం జేయకూడదా అంటావా.
నాకైతే సిన్మా ఏదో చుట్టేసినట్టనిపిచ్చిందిలేబ్బా!
ముందు చూపించిన జపాన్కి, చివరాఖర్లో చూపించిన శ్రీలంకకి లింకు చూపిచ్చలేక పుష్పాల్లో బాంబు పెట్టి పేలిపిచ్చి పుష్ప-3 వున్నట్టు చూపిచ్చినావు.
ఇంకో మూడేళ్లకి అయిడియాలు దండిగ రావా ఏంది? ఇప్పటికి చూసిందంతా మర్చిపోయి మేమంతా ఇంకో తడవ పుష్ప-3 చూసేదానికి ఎగబడమా ఏంది? నీ బుద్ధి సూక్ష్మమబ్బా!
ఎట్లైనా మాష్టార్వి గదా - పిలకాయలకి ముందు చదివిన సిలబస్సు మతికుండేదేల్యా అని నీకు తెల్సిపాయె.
ఇంకో తూరి "పార్టీ వుండాది, పుష్పా" అనుకుంటా నువ్వొచ్చేదీ, మందికి పుష్ప-3, 4, 5, 6, 7....అనుకుంటా హారీపాటర్ సిరీసు మాదిరి పుష్పాలు పంచిపెట్టిచ్చేదీ ఖాయమనిపిస్చాందప్పా!
పుష్ప-వాచర్
26, జూన్ 2024, బుధవారం
ఈ ఏటికి హాల్లో సినిమావలోకానికో చెల్లుచీటీ...అను చలనచిత్రోపాఖ్యానం-2024 AD
9, ఏప్రిల్ 2023, ఆదివారం
రంగమార్తాండ - అమ్మానాన్నలదెలా అయిందా అనిపించిన కథ!
6, నవంబర్ 2022, ఆదివారం
కాంతార చిత్రం... దృశ్య విశిష్టం!
PAN అంటే Presence Across Nation అట.
ఇప్పుడు నాదైన ఒక మాట. నేనెప్పుడూ అనుకునే మాట - "నాల్కకో చవి - కంటికో చూడ్కి"
నాల్కకో చవి.
చూసిన సినిమా అదే అయినా అది చూసినప్పుడు - ఎవరి అనుభూతి వారిదే.
ಕಾಂತಾರ - ಒಂದು ದಂತಕಥೆ!





