అలుపెరుగక - ఆదమరవక
ఇంకెంత దూరమనక - ఇంకెక్కడ మజిలీ అనక
ఉన్న చోటుండక - ఉస్సురుస్సురనక
ఎప్పుడూ - ఎడతెగక - ఎక్కడా ఆగక
ఒంటరిననుకోక - ఒలపక్షం లేక
కదులుతూ ఉంటుంది
కాలమది - కలకాలముండునది
అందులో ఒక అంశమట తిథి
తిథుల్లో అనాదిగా ఆది ఐనది
చైత్రశుధ్ధపాడ్యమి
చాంద్రమాన పంచాంగంలో మొట్టమొదటి పుట దానిది
ఏడాదికి తొలి పండగది.
పేరట ఉగాది.
ఎన్ని కొత్త ఉగాదులొస్తున్నా, ప్రతి ఉగాదికీ గడిచిన ఉగాది రోజుల్ని నెమరేసుకోవడం, మరుగున పడ్డ జ్ఞాపకాల్ని ఓ సారి తలచుకుని నవ్వుకోవడం, ఆ నవ్వులతో ఉగాదిని గడుపుకోవడం ఎప్పుడూ జరిగినట్లే ఈ ఉగాదికీ...
అప్పట్లో...
పెరుగుతున్న పగళ్ళు
అప్పటివరకూ వెచ్చని పూతలా వున్న సూరీడి వెలుగు కాస్తా వేడి వాతలా అనిపిస్తూ
తరుగుతున్న రాత్రుళ్ళు
అప్పుడప్పుడే పెరుగుతున్న కరెంటు కోతలు
ఉక్కి ఉసురుసురనే ప్రాణాల విసురుతో ఊగే విసనకఱ్ఱలు
ఎర్రెర్రటి లేత ఆకులతో, పచ్చని పిందే-కాయలతో గుబురుగా నవనవలాడుతున్న మామిడి చెట్లు
వాటి కొమ్మల్లో ఎక్కడో కూర్చుని కూతకి బదులుగా కూసే మా పిల్లమూకతో పంతాలు పోయి ఇంకా ఇంకా కూసే కోయిల్లు
నిలువెల్లా పూసిన వేపచెట్లు
అప్పటివరకూ స్తబ్ధుగా వున్న లోకమేదో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచినట్లు అంతటా ఒకే సందడి, హడావిడి - ఉగాది వస్తోందంటూ.
ముందే తెచ్చి పెట్టిన పంచాంగాలు, పిడపర్తి వారిదోటి, నేమాని వారిదింకోటి. ఉగాది దాకా తెరవకూడదని, చదవకూడదని చెప్పేవారు నాన్న.
అసలు వెనకేం జరిగిందో, ముందేం జరగబోతోందో అక్కర్లేని, అసలేం జరుగుతున్నా లెక్క చెయ్యని చీకూ-చింతా లేని ప్రాణాలు మావి. అయినా ఆ అక్కర్లేనితనం లోనే పంచాంగంలో రాసిన కొత్త అక్షరాల్లో ఏం రాసుంటారా అనే కుతూహలం. అయినా నాన్న చెప్పారని ఉగాది రోజు కోసం ఎదురు చూసేవాళ్ళం. ఉట్టినే! అసలలా ఎదురు చూడ్డమెందుకంటే ...చెప్తా...చెప్తా... ముందు ఉగాది రోజు గురించి మొదలెట్టాక.
ఉగాది అనగానే అమ్మ కాటన్ చుడీదార్లు కొనేది. రాబోయే ఎండాకాలానికి హాయిగా వుంటాయని. ఒక ఉగాదికి అల్లాగే కుట్టించింది - నాకో ఆకుపచ్చ చారలది. నేను దానికో చిన్న పసుప్పచ్చ టెడ్డీబేర్ బ్రూచ్ కొనుక్కున్నాను ఎడం పక్క భుజం దగ్గర ఎక్కించుకోవడానికి. పప్పీదేమో పసుప్పచ్చ చారలది. పప్పి దాన్ని ఉగాది పూటకి పులివేషమనేది. మాకన్నా పొడుగ్గా వుండే కుట్టీకి కుట్టించక్కర్లేదు - రెడీమేడ్లో దొరికేసింది భలే మంచి డ్రెస్సు.
ఇక ఉగాది రోజు వేపపూత ఒలవడం, మామిడికాయ ముక్కలు తరగడం నా ఒంతు. బెల్లం కోరడం ఒంతులేసుకునే పప్పీ, కుట్టీల ఒంతు. మిగిలేదిక కొబ్బరికాయ. దాని చుట్టూ బోల్డంత పీచు. ఓ ఇనప అట్లకాడ నా చేతిలో పెట్టి "కోనసీమలో పుట్టావు, కొబ్బరికాయ ఒలవడం రావాలి" అంది అమ్మ ఓ సారి. ఓ పది నిముషాలు ఎలాగోలా అటు వంగి, ఇటు వాలి, "నేనసలు ఇంత పీచుతో పుట్టకపోయి ఉంటే బావుండేది" అని కొబ్బరికాయే వాపోయేలా మొత్తానికి పీచు-ఒలుచుడు కార్యక్రమం పూర్తయింది ఆ సారికి. తరవాత్తర్వాత కొబ్బరికాయకి ఆట్టే దెబ్బ తగలకుండా పీచు తీయడం, చేతికి నూనె రాసుకుని పనసపండు కోసి తొనలు తీయడం లాంటి వాటిల్లో ప్రత్యేక నైపుణ్యం సాధించా - అమ్మ మెప్పు కోసం.
మేము కిందామీదా పడి ఒలిచిచ్చిన, కోరిచ్చిన వాటితో మా అమ్మ ఉగాది పచ్చడి చేసిచ్చేది. అది తినేసి - అప్పుడు మొదలెట్టేవాళ్ళం మా పంచాంగపఠనం.
రాజులే పూజ్యమైన రోజుల్లో రాజపూజ్యం, అవమానం లెక్కలు తేల్చి చూసుకోవడం ఎలా? దానికి మా లెక్కేంటంటే... అడిగిన వెంటనే అమ్మ పెడితే రాజపూజ్యం ఎకౌంట్లో, "ఉండో నిముషం. కాస్సేపాగి పెడతాను" అంటే అవమానం కౌంట్లో వేసేసుకునే వాళ్ళం. నాన్న ఇచ్చే పాకెట్ మనీ ఏమో మా ఆదాయం, అమ్మ మా కోసం కొనేవన్నీ మాకే వ్యయం. అలా అల్లిబిల్లి లెక్కలేసేసుకుని అవి పంచాంగంలో మా రాశిఫలితాలకి సరిపోతాయో లేదో చూసుకునేవాళ్ళం.
ప్రతీసారీ ప్రతి ఒక్క రాశికీ "విద్యార్థులకి రెండో ఛాన్సులో విజయం" అనుండేది అందులో. అది చదువుకుని ఒకళ్ళనొకళ్ళం "ఈసారి నువ్వింక పాడుకోవాలి ఉందిగా సెప్టెంబర్ మార్చి పైనా " అంటూ, అనుకుంటూ, నవ్వుకుంటూ, ఉంటూ ఉండగా - ఇంతలో నాన్నొచ్చి "అంతెక్కువ నవ్వకండి, మూతి చెవులదాకా సాగిపోతుంది, పెళ్లిళ్లు చెయ్యలేను" అంటే దానికింకా నవ్వుకుంటూ, ఉంటూ ఉండగా గంట పది కొట్టేది.
అంతే! ముగ్గురం పంచాంగాలు మధ్యాహ్నభోజనానంతరపఠనానికి దాచుకుని టీవీ ముందు చేరేవాళ్ళం. ఎందుకూ? దూర్‌దర్శన్‌లో వచ్చే ఉగాది కవి సమ్మేళనం చూడడానికి. అది చూశాక మా ఇంటి మేడ మీద చేరేవాళ్ళం. అక్కడ మా కపి-సమ్మేళనం జరిగేది.
అలా గుర్తున్నదే అప్పటిది ఓ కవిత - ఇప్పటికీ పప్పి, నేనూ ఉగాది అంటే తలుచుకుని, తలుచుకుని మరీ నవ్వుకునే కవిత...
నీళ్లు నిండితే అది నది
నీళ్లు ఎండితే గోడల్లేని గది
నేనన్నది వినగానే ...
వహ్వా...వహ్వా అనేది పప్పి నవ్వు కప్పిన మెచ్చుకోలైతే
ఏం చెప్పావే లల్లెమ్మా!
ఇది విని పరిగెడతారే జనమా! - అనేది కుట్టి కప్పని మేకతోలు.
ఏ ఉగాదైనా అదే వరస. ఇప్పటికీ ఉగాది అంటే ఏదో అల్లిబిల్లి కవిత ఆల్లనిదే ఆనాడు ఉగాదిలా ఆనదు.
అందులోనూ ఈసారి ఉగాది పేరు విన్నప్పట్నుంచీ ఒకటే అనిపిస్తోంది - అసలు వికారి అనెందుకు దీన్నన్నారని. అదుగో ... అలా అలా అనుకుంటూ వికారితో నేనంటున్నట్టూ, వికారి నేనన్నది విని తిరిగి నాతో అంటున్నట్టూ... ఈ వికారి నామ నూతన సంవత్సర ఉగాదికి నే రాసుకున్న pun-చాంగం!
"ఉగాదీ!
అరవై పేర్ల బడాయీ!
ఏటేటా కొత్త పేరు నీకు, సంగతేంటది?
అందులోనూ ఈమాటు నీ పేరట వికారి
ఎబ్బే! ఏం పేరది?"
అని నేననుకున్నానో లేదో
నేనన్నది విందేమో అనిపించిన వికారి ఇలా అన్నట్లనిపించింది...
"కదిలే కాలంలో ఎప్పట్లానే ఓ పాలు నేను
నీకేదో ఇరవయి - అరవయ్యని- నువ్వేసిన లెక్క నేను
ఆ లెక్కేదో లెక్కే చెయ్యక సాగేది నేను
ఎబ్బే! అని నువ్వన్న నా పేరు నేనడిగి తెచ్చుకున్నది కాదు
అది లేదని నే నొచ్చుకున్నది కాదు
ఆ పేరు
నాకిచ్చినవారు
ఎవరో నీలాంటి నోరున్నవారు
నా పేరు బట్టి వారి తీరు మారుతుందనుకున్నవారు
మారని వారి తీరుకి నా పేరే కారణమనొచ్చనుకున్నవారు
ఇదీ నీ పేరని ఒకరన్నాక
ఆ పేరుతో మనక తప్పదు
ఆ పేరే నాదనుకోక తప్పదు
అందుకే... నేను వికారిని
చేతకాని నెపాలకి వికారిని...
చేవ కలిగిన జీవితాలకి సహకారిని..."

వహ్వా ......వహ్వా !
రిప్లయితొలగించండిషుక్రియా...షుక్రియా!
తొలగించండిచేతకాని నెపాలకి వికారిని...
రిప్లయితొలగించండిచేవ కలిగిన జీవితాలకి సహకారిని...
Super ... Thanks for ur positive attitude !
వహ్వా..వహ్వా..వహ్వా
నీహారికా!నా రాతల వెనక ఎసెన్స్‌ని పట్టుకున్నారు. అందుకోండి నా "వహ్వా...వహ్వా"!
తొలగించండి84 - 88 ల మధ్యలో ఎప్పుడో వచ్చిన మరో ఉగాది కవిత - "గది గదిలో ఉగాది, మది మదిలో ఉగాది; మది గదిలొ ఉగాది .... blah blah blah" కూడా మీరు వినే వుంటారు.
రిప్లయితొలగించండిబహుశః అదో, అలాంటిదో మా కపి-సమ్మేళనానికి స్ఫూర్తి అనుకుంటా, YVR గారు! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!
తొలగించండిఅదరగొట్టేసారు ఈ పోస్ట్ ని మీ ఉగాది కబుర్లతో లలిత గారు.
రిప్లయితొలగించండిభలే! నా బ్లాగ్ చదివి, నేను రాసేవన్నీ మెచ్చుకుంటున్నందుకు బోల్డన్ని థాంక్స్, పవన్ గారు!
తొలగించండి"నేనసలు ఇంత పీచుతో పుట్టకపోయి ఉంటే బావుండేది" అని కొబ్బరికాయే వాపోయేలా ....బాగున్నాయండీ..ఉగాది అనుభవాలు..!
రిప్లయితొలగించండిమోహనా! మీ పేరు చాలా బావుంది. నా సరదా కబుర్లు మీకు నచ్చినందుకు సంతోషం. మీ కమెంట్‌కి థాంక్స్!
తొలగించండి'మేఘసందేశం' సినిమా కోసం జయదేవుడి అష్టపదిని తెనిగించింది పాలగుమ్మి పద్మరాజు గారండీ..
రిప్లయితొలగించండిమురళిగారు! "కౌముది" లో నా మేఘసందేశం కథ చదివారన్న మాట. తప్పు సరి చేయడానికి వీలవుతుందేమో చూస్తాను. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండివికారి నామ సంవత్సరాది శుభాకాంక్షలు అని చెప్పడం కొంత ఇబ్బందే అనిపించింది. కానీ దుర్ముఖి లాంటి పేర్లు కూడా ఉన్నాయని గుర్తుకి వచ్చింది. ...... మహా (మందహాసం)
రిప్లయితొలగించండినమస్తే అండి సుబ్రహ్మణ్యంగారు! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. దుర్ముఖి గురించి కూడా రాశాను :)
తొలగించండిhttp://boldannikaburlu.blogspot.com/2016/04/blog-post_4.html
చివరి కవిత సరదాగా ఉంది. అందరికి శ్రీవికారి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసరదాగా నే రాసిన కవిత మీకు సరదాగా అనిపించడం బావుంది. ధన్యవాదాలు, అన్యగామిగారు!
తొలగించండివెరీ నైస్ అండి, లలితగారు! మా చిన్నతనంలో చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి :)
రిప్లయితొలగించండినా బ్లాగ్ చదువుతున్నందుకు చాలా థాంక్స్, ఫ్రసన్నా!
తొలగించండిచదివే ఓపిక లేదు. మన్నించాలి.
రిప్లయితొలగించండిఐనా సరే, మీర్రాసారు కాబట్టే, వహ్వా వహ్వా
దారుణం. ఇటువంటి వాక్య.
తొలగించండిశ్యామలీయంగారు! నేనేం రాసినా by default బానేవుంటుంది అనేట్లున్న మీ వ్యాఖ్యకి బోల్డన్ని ధన్యవాదాలు!
తొలగించండిఅజ్ఞాత (మీరెవరో పేర్రాస్తే బావుండేది): చదవకపోయినా బావుందన్నారుగా శ్యామలీయంగారు, అదంత దారుణం కాదులెండి :)
తొలగించండిNostalgic trip down the memory lane. And also liked the subtle message of hope, renewal and fortitude in the face of the endless march of Time. Kalaaya tasmay namaha. Happy Yugadi!
రిప్లయితొలగించండిAparne! I like the way you look through the lines that I write and comment on them. Thank You!
తొలగించండిచదవని మెచ్చుకోలు
రిప్లయితొలగించండిచదురైన ఒప్పుకోలు
అఙ్ఞాత అదురుకోలు
Default దారుణాలు