ఏదో ఒక కొలువుని అంటిపెట్టుకుని కాకుండా
ఇచ్ఛామాత్రంగా పని చేసేటప్పుడు,
ఆ చేసే చోట వ్యవహారకర్తలు మారినప్పుడు,
ఆ మార్పు ఒక్కోసారి లాభసాటిగా ఉన్నా ఉండకపోయినా ఫర్వాలేదు.
కానీ అప్పటికి వున్న స్థితిని, పరిస్థితిని తగ్గించేదిగా వుండకూడదు.
ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ఆర్థికంగా కొంచెం తగ్గినా సహించొచ్చు.
కానీ హార్దికంగా లోటుంటే ఆ చోటున ఇంకా ఉండడం సాధ్యం కాదు.
అదిగో అలాంటి పరిస్థితే వచ్చినప్పుడు -
ఇక్కణ్ణుంచి ఎంత తొందరగా బయట పడదామా! - అని ఒక్కసారి అనిపించినప్పుడు
మన మనుగడకి మన్ననైన ఇంకో దారేదన్నా ఉందా అని వెతుకుతున్నప్పడు
అప్పటివరకూ అటూ ఇటూ ఊగిసలాడుతూ
చేతికందక వున్న ఆదరువేదో
తనంతట తానే చేతికి చిక్కితే
ఇంకంతకన్నా కావాల్సిందేంటి?
ఉన్నపళాన ఎగిరి అందుకోవాల్సిందే!
ఉన్న చోట కొలువుకి సెలవు చెప్పి
విలువ లేమి వున్న తావు వీడి
చెలిమి పూతావుల చెలువొందు నెలవుల కొలువుల కేగాల్సిందే!
ఈ నెలలో బదరికి అలాంటి పరిస్థితే వచ్చింది. ఎప్పట్నుంచో చేస్తున్న ప్రాజెక్టు వదలాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ కాకుండా వేరే చోటెక్కడైనా సరే వెళ్ళిపోదాం అనుకోగానే, అనుకోకుండా, కోరుకున్న చోట కొత్త ప్రాజెక్ట్ దొరికింది. ప్రస్తుతానికి చేస్తున్న చోట ఏప్రిల్ 19న వదిలేస్తున్నానంటూ రెండువారాల నోటీసు ఇవ్వడమూ అయ్యింది. అదొక టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయ్యింది. దాంతో పాటు వీడ్కొలుపు సన్నాహమూ మొదలయ్యింది.
వీడ్కొలుపు నోటీసులో మొదటివారం బదరి తన టీము పది-పదిహేను మందితో కలిసి లంచ్‌కి వెళ్లారు. అందులో ఎంప్లాయిస్, కన్సల్టెంట్స్ అందరూ ఉండడంతో బిల్లు ఎవ్వరివ్వాలీ అనే గందరగోళం రానే వస్తుందని ఊహించి, వాళ్ళందరూ ఇంకా భోంచేస్తుండగానే బదరి నెమ్మదిగా లేచెళ్ళి అందరి బదులూ తనే బిల్లు కట్టేశారు. తీరా అందరూ ఎవరి చెక్కులు వాళ్ళు తెమ్మని అడిగే సమయానికి రెస్టరెంట్ వాళ్ళు బదరి ఇచ్చేశారని చెప్పగానే అందరూ తెగ ఆశ్చర్యపోయి బదరికి థాంక్స్ చెప్పారు.
అక్కడినుంచి తిరిగొస్తూ వుండగా బదరితో పాటు తన ఫ్రెండ్ డీన్, ఇంకో ఇద్దరు అబ్బాయిలు కలిసి కార్లో హోటల్‌కి వస్తూ ఉండగా, ఆ ఇద్దర్లో ఒకబ్బాయి అడిగాడట: "మేమందరం మీకు ఫేర్‌వెల్ లంచ్ అని వస్తే మా అందరికీ మీరు పే చేశారేంటి?" అని. అది వినగానే "అక్కడ మనతో పాటు చాలా మంది లోకల్ వాళ్ళు వున్నారు. వాళ్ళకి మన ట్రావెలర్స్‌కి ఇచ్చినట్లుగా Per Diem ఇవ్వరు. వాళ్లకి ఇబ్బంది కలక్కుండా వుండాలని అలా చేశాను." అంటూ బదరి అన్న మాటలు విని ముందు సీట్లో కూర్చున్న డీన్ వెనక్కి తిరిగి "I still have a lot to learn" అనడం బదరికొక వీడ్కొలుపు-బహుమతి డీన్ నుంచి.
ఇక ఏప్రిల్ 14 నుంచి 18 వరకూ బోల్డన్ని వీడ్కొలుపు లంచులూ, డిన్నర్లూ. అంతా కోలాహలంగా జరిగిపోతోంది. ఆ విశేషాలు ఫోన్లో వింటూ నేనూ ఆనందిస్తున్నాను.
ఏప్రిల్ 16న బదరి నుంచి నాకొక ఫోటో - ఒక ఆకుపచ్చ రంగు గిఫ్ట్ పాక్ పట్టుకున్నట్టు, దాంతో పాటు ఓ టెక్స్ట్ మెసేజ్ : Surprise gift from Sheraton guys with many hugs. Can't still believe it. Wondering if I really deserve all this - అంటూ.
ఏంటీ సంగతి అనడిగితే తను సాయంత్రం ఆఫీస్ నుంచి హోటల్ రూంకి వెళ్తూ ఉంటే వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ హోటల్ ఫ్రంట్-డెస్క్ దగ్గర పని చేసే అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ తన దగ్గరకొచ్చి "We are going to msiss you" అంటూ చాలా ఆత్మీయంగా కౌగిలించుకుని వీడ్కోలుపు శుభకామనలు తెలిపారట. వాళ్లందరికీ థాంక్స్ చెప్పి తన రూంకి వెళ్లిన బదరికి అక్కడ ఇంకో పెద్ద ప్లెజెంట్ సర్‌ప్రైజ్ ఏంటీ అంటే...
ప్రతిరోజూ ఆఫీసుకి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి హోటల్ రూంకి వచ్చేటప్పుడు ఫ్రంట్-డెస్క్ దగ్గర పనిచేసే అమ్మాయిలు, అబ్బాయిలు గెస్టులతో బిజీగా లేకుండా, వాళ్ళేదో తలొంచుకుని పని చేసుకునే వేళ వాళ్ళని దూరం నించే పేరు పెట్టి పిలిచి మరీ పలకరించడం బదరికి అలవాటు. ఆ అలవాటు తనకి బోల్డంత ఇష్టాన్ని, అభిమానాన్ని సంపాదించి పెట్టింది ఆ హోటల్ స్టాఫ్ నుంచి.
ఇదొక ఎత్తైతే తండూరిఫ్లేమ్స్ అనే రెస్టరెంట్‌లో జరిగింది ఇంకో ఎత్తు.
తండూరిఫ్లేమ్స్ బదరికి ఇష్టమైన ఒక రెస్టరెంట్. ఎప్పుడూ చెప్తూ ఉండేవారు - అక్కడ భోజనమే కాదు సెర్వింగ్ కూడా చాలా ప్రొఫెషనల్‌గా బావుంటుంది అని. ఇంక ఆ ప్లేస్ వదిలేసే ముందు ఒకసారి లంచ్ చేద్దామని అక్కడికి వెళ్లారు బదరి & టీం. వెళ్ళినప్పుడు మామూలుగా అక్కడ పని చేసే ఒకతనికి తను ప్రాజెక్టు మారుతున్నానని, వచ్చేవారం నుంచి రానని చెప్పారట బదరి.
బదరి, తనతో వెళ్ళిన వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు. ఇంకొక్కరొక్కరుగా వెళ్లి బిల్ చేద్దామనుకుని ముందు డీన్ వెళ్ళగానే ఆ రెస్టరెంట్ అతను "Please be seated, Sir! We have a surprise for Badari Sir" అనగానే డీన్ గప్‌చుప్‌గా వచ్చేసి తన సీట్లో కూర్చుండిపోయాడు.
ఈ లోగా అందరివీ భోజనాలు ఐపోయాయి. అప్పుడు రెస్టరెంట్ అతను ఒక కేక్, ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టగానే బదరి టేబుల్ దగ్గర అందరూ చప్పట్లు కొట్టారట. పైగా ఏదో మ్యూజిక్ చాలా హై వాల్యూమ్లో ప్లే చేశారట. అది చూసి రెస్టరెంట్‌లో మిగిలిన టేబుల్స్ దగ్గర వున్న వాళ్ళందరూ లేచొచ్చి బదరికి "Happy Birthday" అని చెప్తుంటే బదరి నవ్వి "ఇవాళ నా పుట్టినరోజు కాదు, నాకు Farewell పార్టీ ఇది" అనగానే అందరూ "Farewell ఇలా కూడా చేస్తారా? మేమెప్పుడూ చూడలేదు, వినలేదు" అని బోల్డు ఆశ్చర్యపోయి బదరికి బెస్ట్ విషెస్ చెప్పారట.
బదరికి అది first-time-in-life-kind-of-thrill. చాలా చాలా సంతోషించారు. అదంతా అయి బయటికి రాగానే కెన్ హారిసన్ అనే కొలీగ్ బదరి దగ్గర కొచ్చి "ఇందాక లోపల వాళ్ళు ప్లే చేసిన పాటేమిటో తెలుసా?" అనడిగితే, బదరి తను సరిగ్గా వినలేదు అని చెప్తే, దానికి కెన్ సమాధానం "అది Farewell to you My Friends !" అంటూ.
ఇప్పుడు వెళ్లబోయే నిన్నాపం
నీపై అలగబోం
ఇంకెప్పుడిటు రాకని అననే అనం
నీ చోటెవ్వరికీ ఇవ్వబోం
నీ మనసు మళ్ళి,
మళ్ళెప్పుడైనా ఇటొస్తున్నానని కబురంపితే చాలు
మన్నననిస్తాం...
మనవాడు మన కోసమే వచ్చాడనుకుంటాం
- అంటూ ఎంతో అభిమానంగా వీడ్కొలుపు తెలిపారు బదరికి అందరూ.
కొసమెరుపు:
ఇంటికొచ్చి బదరి ఈ విశేషాలన్నీ చెప్తుంటే, సంబరంగా వింటున్న నాకు, బుజ్జిజింకకి, సెలవు పెట్టి ఇంటికొచ్చిన అన్నజింకకి - బదరి నేర్పిన ఓ కొత్త పాఠం: If people are doing something good for you when they don't have to, that is because of thier goodness, but not your greatness.
అది వినగానే బుజ్జిజింక "నాన్నగారూ! This sounds like a Reader's Digest quote!" అంటూ తెగ మురిసిపోయాడు.
ఇంకొసమెరుపు (దిష్టిచుక్కలా):
ఇంతా జరుగుతుంటే - ఇంతటి ఇష్టాన్ని వదిలెళ్ళే కష్టం కలవరపెడుతుంటే - అది తేల్చెయ్యడానికీ, మనసారా నవ్వుకుని తేలిక పడ్డానికా అన్నట్టు ఒక అనుమానచక్రవర్తి "ఈ ఫేర్‌వెల్ హడావిడి చూస్తుంటే looks like people are happy that you are leaving!" అంటూ సందేహ పడ్డాడట.
ఈ మాటా పైన చెప్పిన అన్ని మాటల్లాగే వెలుగుతున్న నవ్వుతో చెప్పారు బదరి.
ఇది వినగానే - ఇంట్లో అందరం - That's another way to look at it - అనుకున్నాం.
ఫక్కున నవ్వుకున్నాం...

Farewell కబుర్లు, అలాగే బదరి గారు నేర్పిన ఓ కొత్త పాఠం బాగున్నాయి లలిత గారు.
రిప్లయితొలగించండిథాంక్స్, పవన్‌గారు!
తొలగించండిమీ క్రిందటిపోస్ట్ లో YVR గారు అన్నట్టు ఆయనో మణిపూస. ఈపోస్ట్ లో ఆ మణి ఇంకా ధగధగలాడింది. మరోమారు బదరి గారికి దిష్టి తీయండి.
రిప్లయితొలగించండిమీ ఆత్మీయపూరిత వ్యాఖ్యకి ధన్యవాదాలు, అన్యగామిగారు!
తొలగించండిThanks for making your readers a part of this warm experience. As a kosa kosamerupu.. Here is the link with lyrics to the farewell song... Sing along! https://youtu.be/4MqTzTbYTnU
రిప్లయితొలగించండిThanks for the kosa-kosa merupu song, Aparne!
తొలగించండికొంతమంది ప్రవర్తన ఆత్మీయతతో కూడినదై ఉంటుందండీ, అది అవతలివారికి మనసుని తాకుతూ ఉంటుంది, అలా మాట్లాడడం ప్రవర్తించడం గొప్ప వరం (ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ప్రవర్తించాలో హనుమని ఉపాసిస్తే తెలుస్తుందని పెద్దలు చెప్తారు). స్మిత పూర్వ భాషి అని శ్రీరాముడ్ని అంటారు, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులకి ఎక్కడకి వెళ్ళినా ఇలానే అవుతుందనుకుంటా. బదరీ రాముడు కూడా అలాంటివారే.
రిప్లయితొలగించండిఎన్నాళ్ళకెన్నాళ్ళకు, శ్రీనివాస్‌గారు! మొత్తానికి మా బదరీ-రాముడు మిమ్మల్ని నా బ్లాగ్‌కి రప్పించారు. సంతోషం!
తొలగించండి