దాదాపు ఓ నెల క్రితం వచ్చింది ఓ ఈమెయిలు - ప్రస్తుతానికి మీరు మీ కంప్యూటర్లో వాడుతున్న మైక్రోసాఫ్ట్ వారి కిటికీలు ఏడు ముందుముందు చాలవు, పదికి పెంచాల్సిందే అంటూ.
అప్పట్నుంచి ఆ కిటికీలు పెంచుటలో వున్న ఆపసోపాల గురించి చెప్పిన కథ చెప్పకుండా బోల్డంత మంది బోల్డన్ని కథలు చెప్పి "లలితా! నువ్వు మాత్రం డౌన్‌టౌన్ ఆఫీసులో వున్న ఐక్యూ బారుకి వెళ్ళు, నీ పని చులాగ్గా ఐపోతుంది" అని చెప్పారు.
అసలా ఐక్యూ బారు పేరు విన్నప్పుడల్లా ఎప్పటికైనా అదేంటో చూద్దామని.
దాని గురించి బోల్డన్ని ఊహలు కూడా - ఐక్యూ బారు అంటే ఉండీ లేనట్లుండే మన ఐక్యూని సాగదీసి బారుగా పెంచుతుందా? లేకపోతె ఏజ్‌బార్ లాగా వున్న కొంచెం ఐక్యూ కూడా ఐక్యూబార్ అయిపోతుందా? అనుకుంటూ, నాలో నేనే నవ్వుకుంటూ.
ఎందుకంటే నేను డౌన్‌టౌన్ ఆఫీసులో పని చేసేటప్పుడీ ఐక్యూ బార్ ఉండేది కాదు. మూడేళ్లకోసారి లాప్‌టాప్ లీజ్ అయిపోయి కొత్తది తీసుకోవాలంటే ఓ రెండతస్తులు పాతాళం లోకి వెళ్లి, వైరు చుట్టల మధ్య, చెక్క బల్లల మీద చుట్టూ కంప్యూటర్లు పెట్టుకుని తలొంచుకుని పని చేసే టెక్ సపోర్ట్ వాళ్ళు కనిపించేవారు.
ఇదే మొదటిసారి ఐక్యూ బారుకి వెళ్ళడం.
ముహూర్తం ఇవాళ కుదిరింది ఐక్యూ బారుకి వెళ్ళడానికి.
ఆ ముహూర్తానికి బోల్డన్ని అంకెల్లెక్కలు కుదిరాయి...భలే!
ఇవాళ్టి తారీఖు 9/11 - సెప్టెంబర్ 11.
పొద్దున్నే ఎనిమిదింటికల్లా వచ్చిన నల్లరథంలాంటి అలెక్స్ కాబ్ ఎక్కి 1010 పైన్ రోడ్డులో వున్న మా ఆఫీసు ముందు దిగా.
తొమ్మిదింటికి ఐక్యూ బారులో నా ఎపాయింటుమెంటు.
అక్కడ నా లాప్‌టాప్ మీద జరగబోయేది విండోస్ 10 అప్‌గ్రేడ్.
నేనెళ్ళాల్సిన ఐక్యూ బారు మూడో అంతస్తులో.
ఆ ఐక్యూ బారులో వున్నది నలుగురు టెక్ సపోర్ట్ వాళ్ళు.
విండోస్ 10 అప్‌గ్రేడ్ కోసం నేను అక్కడ ఉన్నది ఏడు గంటలు.
వెళ్ళిన పని అయ్యి నేనింటికి వచ్చేటప్పటికి టైము సాయంత్రం ఐదు గంటలు.
పొద్దున్న వెళ్ళగానే నా లాప్‌టాప్ ఐక్యూ బార్ వాళ్ళ పరం చేసి, నేనొక loaner లాప్‌టాప్ తీసుకుని నే చేయాల్సిన డాక్యుమెంట్ పనేదో చేసుకున్నాను రోజంతా. ఇచ్చిందో లాప్‌టాప్, పుచ్చుకుందో లాప్‌టాప్ - వెరసి రెండు అవి.
మధ్యాహ్నం లంచ్ ఎక్కడ చేద్దామా అనాలోచిస్తూ ఉండగా బదరి ఫోన్ చేశారు - "సెన్-థాయి ఆ పక్కనే వుంది. . ఆఫీసులో ఎవరైనా కలిస్తే వాళ్ళతో కలిసి వెళ్ళు" అంటూ.
సెన్-థాయి నాకు చాలా ఇష్టమైన థాయి restaurant. కానీ నాతో రావడానికి ఎవరూ లేరు. ఒక్కదాన్నే వెళ్ళాలి. గూగుల్ మాప్స్ తెరిచి "ఎక్కడ ఎక్కడ ఉందా హోటలూ?" అని వెతికితే - అక్కడే... ఆ పక్కనే... ఆరు నిముషాల నడక దూరంలో వాషింగ్టన్ అవెన్యూలో ఉన్నట్లు కనిపించింది.
ఫోనులో గూగుల్ మాప్స్ పెట్టుకుని వెళ్తుంటే - అదేదో రోడ్డులో ఎడం పక్కకి తిరగమంది. నేను ఎన్ని ఎడమ పక్కలు తిరిగినా గూగుల్ దారి వెళ్లాల్సిన బాణం ముక్కలోకి వెళ్ళట్లేదు.
"ఫోనుని నమ్మితే ఏముంది? మనిషిని నమ్మితే ఎంతుందో? అడిగేందుకు ప్రశ్నుంటుందీ...చెప్పేందుకు బదులుంటుందీ... చూపేందుకు దారుంటుందీ... " అని దాసరి వారి వరసలో వరసగా "ది...దీ...దీ...దీ..." పాడుకుంటూ ముందుకెళ్లి అక్కడున్న ఎవరినో వాషింగ్టన్ అవెన్యూకి ఎటెళ్ళాలీ అనడిగితే అతనికి తెలీలేదు. సెన్-థాయికి ఎలా వెళ్ళాలీ అనగానే చటుక్కున అందుకుని ఆ దారిలోనే ఓ నాలుగు బ్లాకుల అవతల ఎడం పక్కగా వెళ్తే కనిపిస్తుంది అని చెప్పాడు.
ఓ రెండు బ్లాకులు నడిచి అక్కడ నించున్న ఇద్దరమ్మాయిలని వాషింగ్టన్ అవెన్యూ ఎక్కడా అనడిగితే వాళ్ళు నేను సరైన దార్లోనే వెళ్తున్నాను అని భరోసా ఇచ్చారు.
ఇంకొక్క బ్లాక్ దాటగానే గాలి అలల తేలి వచ్చిన థాయి-తావిల మఱఁగి మురిసిన నా ముక్కే దారి చూపింది నా కాళ్ళకి.
గబగబా లోపలికెళ్ళి థాయి-అబ్బాయి చూపించిన ఓ మూలనున్న టేబుల్ దగ్గర కూర్చుని - థాయి-అమ్మాయి తెచ్చిచ్చిన నూడుల్స్ తినేసి వచ్చేశా.
తినే ముందు - అమెరికా వచ్చిన ఇన్నేళ్ళలో - మొట్టమొదటిసారిగా - నేనొక్కదాన్నే - నా అంతట నేనే - సెయింట్ లూయిస్ డౌన్‌టౌన్‌లో సెన్-థాయికి నడుచుకుంటూ వెళ్ళిన గుర్తుగా ఒక ఫోటో తీసుకుందామనుకుని - ఫోన్ కెమెరా నా కేసి తిప్పుకుని - జాగ్రత్తగా నేను అందులో లేకుండా నేను కూర్చున్న టేబుల్ వెనకాల వున్న కిటికీకి సెల్ఫీ తీశా.
ఆ పైనున్న - ఓ పార్కింగ్ మీటరు, మూడు చెట్లు, నాలుక్కార్లు... - అదీ నే తీసుకున్న సెల్ఫ్‌లెస్ సెల్ఫీ. ఆ పార్కింగ్ మీటర్ పక్కనున్న చెట్టు కింద ముగ్గేసినట్లున్న డిజైన్ నాకు భలే నచ్చింది.
ముక్తాయింపు:
ఈ రోజు మొదలు పెట్టిన దగ్గర్నుంచీ ఒకటి నుంచి పదకొండు అంకెలూ వచ్చేశాయి - వరసాగ్గా... ముందూ వెనగ్గా ఏదో వరసలో...
తొమ్మిదో నెల, పదకొండో తారీఖు, ఇంటి నుంచి బయల్దేరిన ఎనిమిది గంటల టైం, విండోస్ 10 అప్‌గ్రేడ్ , మూడో అంతస్తు, నలుగురు టెక్ సపోర్ట్, ఐక్యూ బార్లో వున్న ఏడు గంటలు, ఇంటికొచ్చిన సాయంత్రం ఐదు గంటల టైం, సెన్ థాయికి నడిచిన ఆరు నిముషాలు, ఇవాళ వాడిన రెండు లాప్‌టాప్లు - నేనొక్కదాన్ని.
నేనొక్కదాన్నే సెన్-థాయికి వెళ్ళా...
నేనే లేని సెల్ఫ్‌లెస్ సెల్ఫీ ఓటి తీశా!
అవన్నీ కలిపి - వాటి గుర్తుగా - నేటి ఈ బ్లాగ్ రాశా
"ఒకటి నుంచి పదకొండూ - సెన్ థాయీ - సెల్ఫ్‌లెస్ సెల్ఫీ" అని పేరెట్టేశా!