కిందటి వారం అన్నజింక వేసవి సెలవులకని ఇంటికొచ్చినపుడు వాడితో ఏవో సినిమా కబుర్లు చెప్తూ బదరి మెమెంటో (మన తమిళ-తెలుగు-హిందీ గజినీల ఆంగ్ల మాతృక మెమెంటో) ఎంత బావుంటుందో చెప్తూ - అసలు క్లైమాక్స్ నుంచి వెనక్కి సినిమా తీయడానికి అసలా డైరెక్టర్‌కిఎంత ధైర్యం ఉండాలి - అంటూ తెగ మెచ్చేసుకుంటుంటే విన్నాను.
అదుగో - అప్పుడే అనుకున్నాను - నా ఈ నాలుగైదు నెలల నానా సంబరాల తానా విశేషాల కబుర్లని చివరిరోజు నుంచి మొదలుపెట్టి వెనక్కి చెబ్దామని.
అదెలాగంటే ...

తా(నా) సంబరాల తాజాకబుర్లు - రాం-రాబర్ట్-రహీం మా ఇంటికి వచ్చినవేళ
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - <పోస్ట్ పేరు>
తా(నా) సంబరాల తాజా(-2)కబుర్లు - <పోస్ట్ పేరు>
తా(నా) సంబరాల తాజా(-3)కబుర్లు - <పోస్ట్ పేరు>
... ... ... ... ... ... ... ... ... ...
... ... ... ... ... ... ... ... ... ...
తా(నా) సంబరాలు - మజాగా మొదలు - <పోస్ట్ పేరు>
అదీ వరస.
లెక్కప్రకారం తానా-2017 మే 28తో ఆఖరు. కానీ నావరకు నాకు ఆ సంబరం గురువారం (జూన్ 1) దాకా కొనసాగింది.
సోమవారం మాకు సెలవు రోజు కదా (మెమోరియల్ డే) - అనుకున్న ప్రకారం పొద్దున్నే లేచి తయారయి బదరి సెయింట్ లూయిస్ డౌన్‌టౌన్‌కి వెళ్ళి మా అపురూప-అతిథులని ఇంటికి తీసుకొచ్చేట్లు, నేనేమో వాళ్ళు ఇంటికి వచ్చేలోగా ఆట్టే ఆటలు-పాటలతో కాలక్షేపం చేయకుండా బుద్ధిగా వంట చేసేట్టు - ఒడంబడికలు జరిగిపోయాయి.
తొమ్మిదింటికల్లా వంట మొదలుపెట్టి దోసకాయ పప్పు, బంగాళదుంప వేపుడు, గోంగూరపచ్చడి, టమాటాచారు, వూరుమిరపకాయలు చేసేసి - బదరితో ముందు రెండు రోజుల తానా-కబుర్లు చానా ఉత్సాహంతో చెప్పేస్తూ వున్నాను నేను.
నా మాటలు వింటున్న తను ఉన్నట్టుండి - ఇవాళ మనింటికి రాం-రాబర్ట్-రహీం వస్తున్నారు కదా! - అంటూ చిన్నగా నవ్వారు.
అది వినగానే - భలే చెప్పారు బావా - అంటూ నా సెల్‌ఫోన్ చూసిన నాకు అందులో 10:22 AMకి ఒక మిస్డ్‌కాల్ కనిపించింది. వెంటనే నేను ఆ నంబర్ మా అతిథుల్లో ఒకరిదిగా గుర్తు పట్టి ఫోన్ చేశాను. ఎన్నిసార్లు చేసినా పిలుపు చేరట్లేదు.

కొంచెం కంగారుగా అనిపించింది.
అరెరె - ఊరు కాని ఊళ్ళో వాళ్ళింటికి రమ్మని చెప్పింది - తీరా ఫోన్ చేస్తే తీయను కూడా తీయలేదు - అనుకుంటారనే కాక చెప్పినట్లు బదరి ఇంకా రాలేదేంటా అని కంగారు పడుతున్నారేమో - అన్చెప్పి వెంటనే వారుంటున్నామని చెప్పిన అమెరికా కన్వెన్షన్ సెంటర్ పక్కనే వున్న Mariott కి గూగుల్లో ఫోన్‌నంబర్ వెతికి ఫోన్ చేస్తే నేను చెప్పిన ఇంటిపేరుతో వాళ్ళ హోటల్లో ఎవరూ బస చేయలేదని ఆ స్వాగతకర్త్రి చెప్పింది.
అలా చెప్తూనే రోడ్డుకావల ఇంకో Mariott ఉందని చెప్పి ఆ ఫోన్‌నంబర్ ఇచ్చింది. వెంటనే అక్కడికి ఫోన్ చేసి ఇంటిపేరు చెప్పగానే అక్కడి స్వాగతకర్త్రి వెంటనే ఆ గెస్ట్ వున్న గదికి ఫోన్ కలిపింది. కానీ ఎవరూ ఫోన్ తీయట్లేదు.
ఇంతలో బదరి బయల్దేరారు - హోటల్ దగ్గరికి వెళ్ళి కనుక్కుని మా ఇంటికి వచ్చేవారిని తీసుకుని వస్తానని.
తను బయల్దేరిన పావుగంటకి ఒక తెలియని నంబర్‌నుంచి కాల్ వచ్చింది. తీసినవెంటనే అవతలనుంచి మా అతిథుల్లో ఒకరైన వాసిరెడ్డి నవీన్‌గారు - "లలితగారు! నా ఫోన్ ఎందుకో పని చెయ్యట్లేదు - అది చెబ్దామనే చేస్తున్నాను" అనగానే "నమస్తే అండి నవీన్‌గారు! బదరి బయల్దేరారు - వచ్చేస్తూ వుంటారు. మీరిప్పుడు చేసిన ఫోన్‌నంబర్ తనకివ్వనా?" - అనడిగితే "వద్దమ్మా! ఈ ఫోన్ నాది కాదు - నేను లాబీలోనే కూర్చుని వుంటాను" అన్నారు.

సరేనని ఆ ఫోన్ పెట్ట్టేశాక వెంటనే బదరికి ఫోన్ చేసి - బావా! నవీన్‌గారి ఫోన్ పనిచేయట్లేదు - అని చెప్తూనే వున్నాను - ఇంతలో మళ్ళీ నవీన్‌గారి నుంచి ఫోన్ - ఫోన్ పనిచేస్తోందని.
మొత్తానికి మా ముగ్గురు అతిథులని తీసుకుని వస్తూ బదరి ఫోన్ చేశారు - నాతో సహా అందరూ మంచి ఆకలి మీద వున్నాము - అంటూ.
వంట అయిపొయింది - వాళ్ళొచ్చేలోగా ఇంకో అరగంట టైం వుంది అని మెంఫిస్ తిరుగు ప్రయాణంలో వున్న రమా-సదా దంపతులకి ఫోన్ చేసి ముందు రోజు మళ్ళీ కలవలేకపోయినందుకు సారీ చెప్పి - మళ్ళీ తీరికగా ఒకసారి సెయింట్ లూయిస్ చూడడానికి రమ్మని ఆహ్వానించి - తర్వాత వసుధకి ఫోన్ చేశాను.
వసుధతో - ముందు రోజు సినీ సాహిత్య ప్రసంగాల్లో కలిసిన అయోధ్యకుమార్ గురించి మాట్లాడి - ఆ మాటల మధ్యలో మా ఇంటికి వస్తున్నవారి గురించి చెప్పాను.
అది వినగానే తనూ సంబరపడి - సాయంత్రం వాళ్ళని కలవడానికి వస్తాను వీలైతే అయోధ్య కుమార్ తో కలిసి అని.
సరే అని ఫోన్ పెట్టానో లేదో మళ్ళీ ఐదు నిముషాల్లో ఫోన్ చేసి గోగినేని బాబు గారిని తీసుకు రావచ్చా అనడిగింది వసుధ.
"ఆయన బేబీ కాదు కదా - అల్లరి చేయరు కదా - అలా అయితేనే తీసుకురా" అని కొంచెం తనని ఆట పట్టిస్తూ నా గాలి-కబుర్లేవో చెప్తూనే వున్నాను - ఈలోగా మా బుజ్జిజింకలిద్దరూ - they are here - అంటూ తలుపు తీయడానికి వెళ్ళి - లోపలి వస్తున్న ముగ్గురినీ - వాసిరెడ్డి నవీన్‌గారు, కొలకలూరి ఇనాక్‌గారు, కవి యాకూబ్‌గార్లని - చేతులు జోడించి - నమస్తే - చెప్తూ ఆహ్వానించారు.
నేను కూడా వసుధకి bye చెప్పేసి - రండి రండి - అంటూ ఎదురెళ్ళి - మీ ముగ్గురినీ మా బదరి రాం-రాబర్ట్-రహీం అన్నారు - అనగానే యాకూబ్‌గారు "భలే" అని ముచ్చట పడ్డారు.
లోపలి వస్తూనే యాకూబ్‌గారు చుట్టూ చూస్తూ కనులానిన ప్రతిచోటా కనిపిస్తున్న లెగో్‌స్‌ని చూసి - ఎన్ని బొమ్మలో - అని ఆశ్చర్యపోయారు. అవి బుజ్జిజింక చేసినవి అని చెప్పగానే - పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మీ ఇల్లు - అని మురిపెంగా మెచ్చుకున్నారు.
వచ్చిన ముగ్గురూ - సోఫాల్లో కూర్చుని సేద తీరాక - ఓ పది నిముషాలు పరిచయాలు, కుశలప్రశ్నలూ అయ్యాక - వచ్చిన అతిథులకి, బదరికి భోజనాలు వడ్డించాను. బుజ్జిజింకలు అప్పటికే తినేసి ఉన్నారేమో వాళ్ళ గదిలోకి వెళ్ళి పుస్తకాలు చదువుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
భోంచేస్తూ - ఎర్రగా వేగిన బంగాళదుంపల వేపుణ్ణి - తింటూ నవీన్‌గారు - "అసలమెరికాలో బంగాళదుంపలో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది - ఇలా వేగనే వేగదు - భలే చేశావమ్మా" అని మెచ్చుకున్నారు. అలా అంటూనే - "వంకాయ కూరకూడా అంతే , మీ అమెరికాలో బా రాదు. నేను వంకాయ కూర చాలా బాగా చేస్తాను" - అన్న ఆయన మాట విని నేను వెంటనే చెప్పాను - "అయితే మీరింకోసారి మా ఇంటికి రావాల్సిందే నేను చేసే వంకాయ కూర తినడానికి" - అని.
కబుర్లు చెప్పుకుంటూ - నా వంటలని పదేపదే మెచ్చుకుంటూ - మా బదరి-సహిత అతిధి-త్రయం నెమ్మదిగా సోఫాలో చేరారు మళ్ళీ.
ఇనాక్‌గారు భోజనానికి ముందే - అయిన తర్వాత పడుకుంటానని చెప్పడం వల్ల - బదరి ఆయన్ని తీసుకెళ్లి - పైన మా బెడ్‌రూంలో పడుకోమని చెప్పి వచ్చారు.
ఇంక - నవీన్‌గారు "ఒక్క ఐదు నిముషాలు పడుకుని లేస్తాను - ఈలోగా మీరు భోంచేసి రండి" అని నాకు చెప్తూనే సోఫాలో వాలారు.
పక్కనే రిక్లైనర్‌లో కూర్చున్న యాకుబ్‌గారూ నెమ్మదిగా కాళ్ళు చాపారు.
రెండు నిముషాల్లో గాఢనిద్రలోకి జారిపోయారు నవీన్‌గారు. కళ్ళు మూతలు పడుతున్న యాకుబ్‌గారిని ముందు గదిలో వున్న ఇంకో సోఫాలో పడుకోమని చెప్పాము.
యాకుబ్‌గారు పడుకున్న పది నిముషాలకి అమృతరెడ్డిగారు ఫోన్ చేశారు - "నేను ఇటుపక్కకి వచ్చానండి - యాకుబ్‌గారు మిసిసిపి చూడాలని ఉందన్నారు కదా - వస్తానంటే తీసుకెళ్దామని" అంటూ. నేనాయనకి చెప్పాను - ఇప్పుడే పడుకున్నారండి, పాపం లేపాలనిపించట్లేదు , బాగా అలసిపోయి వున్నారు - వద్దులెండి" అంటూ - "ఒకవేళ ఆయన ఒక అరగంటలో లేస్తే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, వీలైతే వద్దురుగానీ " అని కూడా చెప్పాను.
ఇండియాలో బయల్దేరిన దగ్గర్నుంచీ ఒక్క క్షణం తీరిక లేకుండా అలసిపోయి వున్నారేమో ఒక మూడుగంటలు గాఢంగా నిద్రపోయారు వాళ్ళిద్దరూ - ఇనాక్‌గారు ఇంకొంచెం ఎక్కువసేపు.
ముందుగా నవీన్‌గారు లేచారు. ఓ రెండు గంటలు మాతో కబుర్లు చెప్పారు. తానా తెర-ముందు-విశేషాలు, తెర- వెనుక-తమాషా కబుర్లు - ఎన్నో బోల్డన్ని కబుర్లు.
అసలు కథలెలా రాయాలి - అన్న బదరి ప్రశ్నకి చాలా విపులంగా ఆ టెక్నిక్స్ & టెక్నికాలిటీస్ గురించి చెప్పారు.
కబుర్లు అలా అలా సాగుతూ తానా-సావనీర్ దగ్గర ఆగాయి.
"నేనూ రాశానండి - సావనీర్లో" అనగానే "ఏదీ చూపించండి - నేనే ఎడిట్ చేశాను దాన్ని" అన్నారు నవీన్‌గారు.
నా "ఎల్లలు దాటే-ఎల్లెడలా వెలిగే" వ్యాసం చూపించగానే - "ఓ లలిత టి .ఎస్ అంటే మీరా? ఇది మీర్రాశారా ? నేనే సెలెక్ట్ చేశాను దీన్ని - చదవగానే బావుందనిపించి" అనగానే నాకు బోల్డంత సంబరం - నా గాలి కబుర్లు నవీన్‌గారంతటి వారికి నచ్చాయని తెలియగానే.
ఇంతలో - నిద్ర లేచిన యాకుబ్‌గారు కూడా - నేను టీ కలిపి తెచ్చేలోగా - నా ఎల్లలు దాటే-ఎల్లెడలా వెలిగే చదివి - "మీ వాక్యం పరుగులు పెడుతుంది - శైలి బావుంది" అని చెప్పారు. నా బోల్డంత సంబరం ఇంకో బోల్డంత అయింది.
నెమ్మదిగా సాయంత్రం ఆరు-ఆరున్నర అయింది. వారి బంధువులు గోకుల్, అభిజ్ఞ రావడంతో నవీన్‌గారు వాళ్ళతో వెళ్ళిపోయారు - మళ్ళీ మా ఇంటికి వస్తానని మాటిచ్చి.
ఆయన వెళ్లిన అరగంటకి ఇనాక్‌గారు లేవడం, ఇంతలో గోగినేని బాబుగార్ని తీసుకుని వసుధ, వెంకట్ మా ఇంటికి రావడం - అప్పుడు మొదలుపెట్టి రాత్రి భోజనాలు అయ్యేదాకా - బాబుగారు, యాకుబ్‌గారు, ఇనాక్‌గారు, బదరి, వసుధ - మాట్లాడుతూ ఉంటే వినడం - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - అని పాడుకోవాలనిపించే సందర్భం నాకు.
మాటల మధ్యలో - ఈరోజుల్లో అబద్ధాలు వాస్తవాలుగా ఎలా చలామణీ అవుతున్నాయో - అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే "ఈ రోజుల్లో వాస్తవాలు లేవండీ - ఉన్నవన్నీ వాట్సాపవాస్తవాలు" అన్న నా సరదా-కబుర్లు విని బాబుగారు "బావుంది మీ మాట " అని మెచ్చేసుకుంటే - వసుధ అభిమానం "లలిత మాటలంతే భలే ఉంటాయి" అని దాన్నింకొంచెం హెచ్చవేసింది.
భోజనాలవగానే వసుధ, గోగినేని బాబుగారు వసుధ వాళ్ళింటికి వెళ్ళారు.
మరసటి రోజు మంగళవారం. యాకుబ్‌గారి ప్రయాణం డెన్వర్‌లో వున్న వాళ్ళ అబ్బాయి దగ్గరికి - ఫ్లైట్ మధ్యాహ్నం మూడింటికి.
పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసి యాకుబ్‌గారు, ఇనాక్‌గారు ఒక అరగంట వాకింగ్ చేసి వస్తామని వెళ్ళారు.
ముందురోజు అనుకున్న ప్రకారం వసుధ తొమ్మిదింటికి వచ్చి- క్లేటన్‌లో ఎథికల్‌సొసైటీలో బాబుగారివ్వబోతున్న ప్రసంగానికి - అదయిన తరవాత మిసిసిపి-మిజొరి సంగమం చూపించడానికి ఇనాక్‌గారిని తీసుకెళ్ళి - సాయంత్రం మా ఇంట్లో దిగబెడ్తానని చెప్పింది.
ఇంట్లో వున్న యాకుబ్‌గారు "ఇవాళ ప్రయాణం లేకపోతే నేనూ మిసిసిపి చూసేవాణ్ణి" అనుకున్నారు ఒకసారి. అంతలోనే కొన్నిగంటల్లో చూడబోతున్న మనవణ్ణి తలచుకుని మురిసిపోయారు.
యాకుబ్‌గారు వారి సతీమణి లక్ష్మి గారి గురించి సౌభాగ్య గారు రాసిన పరిణత కవయిత్రి శిలాలోలిత పుస్తకం ఇచ్చారు నాకు.
మీ పుస్తకాల పేర్లు చెప్పండి - ఈసారి ఇండియా వచ్చినపుడు కొని తెచ్చుకుంటాము - అంటే - "నేనిస్తాను గదరా తల్లీ!" - అంటూ ఎంతో నొచ్చుకున్నారు - కవి యాకుబ్.
బదరితో భోజనం చేస్తూ - "బదరిగారు! నిన్నటినుంచి మీమాటలు వింటూ అనుకుంటున్నాను - మీరూ మా ఖాతాలోని వారే" - అంటూ ఎంతో అభిమానంగా మమ్మల్నీ వారి ఆత్మీయుల్లో చేర్చేసుకున్నారు యాకుబ్‌గారు.
ఒంటిగంటకు బదరితో ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరుతూ "బై 1205" అని మా ఇంటికీ చెప్పి వెళ్ళారు - కవి యాకుబ్ .
ఐదున్నరకల్లా ఇనాక్‌గారిని ఇంట్లో దింపి వెళ్ళింది వసుధ.
పగలంతా తిరుగుతూ అలసిపోయిన ఇనాక్‌గారు భోంచేసి తొందరగా పడుకుండిపోయారు.
సాయంత్రం ఏడుంపావుకి కాలిఫోర్నియా నంబర్ నుంచి నాకొక కాల్ వచ్చిందని చెప్పారు బదరి. ఎవరా అని వెంటనే చేస్తే - అవతల నుంచి - సాయి బ్రహ్మానందం గొర్తి గారు - "నవీన్‌గారు ఇచ్చారు మీ నంబర్. తానాలో మీతో మాట్లాడ్డం కుదరలేదు - మీరు ముందే తెలిసుంటే బావుండేది" - అంటూ.
అది వినగానే తానా-నాకు-చానా-మంచి-చేసింది అనిపించింది.
ఎక్కడో ఏదో నాలుగు గాలి-కబుర్లు రాసుకునే నాకు సాహిత్యంలో వాళ్ళదైన ముద్ర వున్న వీళ్ళందరి పరిచయం, ఆదరణ - కలగడం, దొరకడం - దానికి కారణం - తమదైన మనఃశ్రీగంధపు-తావిని వారిపక్కనున్న నాలాంటి వాళ్ళక్కూడా ఆపాదించగలిగిన వాళ్ళ-మంచితనం.
బుధవారం అన్నజింక ప్రయాణం - కాలిఫోర్నియాకి . వాడిని విమానం ఎక్కించి - ఇనాక్‌గారితో సెయింట్ లూయిస్ ఆర్చ్, మెరామెక్ కావెర్న్స్ సందర్శనం - తర్వాత సిగ్నేచర్-ఇండియా లో భోజనం.
భోజనం చేస్తున్న నా మొహంలో అలసట చూసి - ఇనాక్‌గారు - "అమ్మా ! రేపింక మీరు కష్టపడొద్దు - నాకు పాలల్లో ఓట్స్ ఇచ్చేయండి" అనగానే ఆయన ఎంత సున్నిత మనస్కులో - భాషలోనే కాదు, భావంలోనూ ఎంత ఉన్నతులో అనిపించింది.
ఆయన మాట నేను విన్లేదు - అది వేరే సంగతి. అమ్మో - ఓట్స్ పెట్టేస్తే నేను చేసే కట్టు-పొంగలికి పొగడ్తలెలా వస్తాయి?! బెంగెట్టేసుకోదూ ?!
ఇనాక్‌గారు బదరితో "బదరిగారు! మీరదృష్టవంతులు - అమ్మాయిలో ఇంకా ఆ బాల్యగుణం అలానే వుంది. మనుషులు కావాలి, మా ఇంటికి రావాలి - మాతో ఉండాలి అనుకోవడం పిల్లల స్వభావం - ఈమె ఎప్పటికీ రఫ్‌గా వుండలేదు" అని అంటూ "నేను చిన్నప్పుడు ఇంటికి చుట్టాలొస్తే వాళ్ళు వెళ్ళిపోకూడదని వాళ్ళ సంచీ నా స్కూల్ బాగ్లో దాచేసేవాణ్ణి" - అని ఆయన చిన్నప్పటి విషయాలు కొన్ని చెప్పుకొచ్చారు.
అన్నట్టు - మర్చిపోయాను - నాకు వారి అమ్మాయి కొలకలూరి మధుజ్యోతి రాసిన నాన్న పుస్తకం ఇచ్చారు ఇనాక్‌గారు. తానా పుణ్యమా అని నా పుస్తకాస్తి పెరిగింది.
ఇంకో ముఖ్య విషయమేంటంటే - తానా-సాహిత్య కమిటీ ప్రసక్తి వచ్చిన ప్రతీసారి ఇనాక్‌గారు అమృతరెడ్డి గారిని "He is a nice gentleman" అంటూ ఇష్టంగా తలచుకునేవారు.
ఇంక గురువారం రానే వచ్చింది - మధ్యాహ్నం మూడింటికి షికాగోకి ట్రైన్. బదరి, నేను - సెయింట్‌లూయిస్ డౌన్‌టౌన్‌లోని ఏంట్రాక్ స్టేషన్‌కి వెళ్ళాము - ఇనాక్‌గారిని తీసుకుని. నవీన్‌గారిని స్టేషన్ దగ్గర కలవాలని ప్లాన్.
నవీన్‌గారు 2:46కి వచ్చారు.
ఇనాక్‌గారి లగేజ్ పట్టుకుని సినిమాలో క్లైమాక్స్ సీనులా పరిగెట్టి, పరిగెట్టి వాళ్ళిద్దరినీ క్షేమంగా ట్రైన్ ఎక్కించి "హమ్మయ్య" అనుకున్నాం - మేమిద్దరం.

దరి కాని దూరమందు వేదికల మీద చూసి
మురియుటే నాకిరవైనదని పరి పరి తలచు నాకు
విరివిగ దొరికెబో - తానా పుణ్యమాని
సరిలేని సజ్జన-సాహిత్య-సాంగత్యము
రాం-రాబర్ట్-రహీం మా ఇంటికి వచ్చినవేళ...చాలా బాగా రాశారు లలిత గారు. చాలా మంచి విషయాలు తెలియజేసారు. ధన్యవాదాలు. --వెంకట్ నాగం
రిప్లయితొలగించండివెంకట్గారు: నా బ్లాగ్ చదివినందుకు ధన్యవాదాలు.
తొలగించండిఒకేసారి "ఆ నలుగుర్ని " హోస్ట్ చెయ్యడం, మీ వంటల రుచికి తోడు వారి తో రసవంతమైన చర్చలు...వ్వావ్!!!
రిప్లయితొలగించండిచ(చె)వులూరించే అద్భుత సన్నివేశం.
....👌👌👌
YVRగారు: నిజమేనండి - ఆ మూడున్నొక్కరిని కలవడం, ఆతిథ్యమీయగలగడం మా అదృష్టం.
తొలగించండిలలితా! 'బాల్యగుణం' ఇది మాత్రం 100% కరెక్ట్!
రిప్లయితొలగించండిహాయిగా నవ్వుతూ, నవ్వించగలిగే నీతో మాట్లాడ్డం నాకెంతో ఇష్టం.
నీ మెనూ చవులూరిస్తే, తానా కబుర్ల కోసం చెవులూరుతున్నాయి.
నువ్వలా ఊ- కొడుతూ వుండు - చెప్పడానికి నేను ఎవర్రెడీ :))
తొలగించండిచాలా బాగా, ఎంతో ఆసక్తికరంగా రాశారండి, చదవడం మొదలెట్టాక కళ్ళు అక్షరాలవెంట పరుగెత్తాయి. పోస్ట్ మొత్తం ఏకబిగిన చదివేసాను.
రిప్లయితొలగించండిఆ మహనీయులతో సమయం గడపగలిగిన మీరు అదృష్టవంతులు. మీ ఆతిథ్యంలాగే వారి సౌజన్యం కూడా ఎంతో గొప్పగా ఉంది.
నాగేశ్వరరావుగారు: నా బ్లాగ్ మీకు నచ్చినందుకు సతోషంగా వుంది.
తొలగించండిమీ ప్రయోగం బాగుందండి. నాకు సినిమా జ్ఞానం తప్ప కవుల గురించి పెద్దగా తెలీదండి (క్షమించండి నా అజ్ఞానానికి), అందుకే మీరు చెప్పిన ఆ ముగ్గురి గురించి తెలియాలంటే మీ ప్రయోగం పూర్తవ్వాలనుకుంటా లలిత గారు.
రిప్లయితొలగించండిపవన్గారు: ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో చాలాసేపు ఆలోచించి చివర్నుంచి మొదలుపెట్టేశాను - జరిగిపోయినవి ఎలాగూ గుర్తు తెచ్చుకుని, కూడబలుక్కుని రాయాలి కదా అని. అదొక ప్రయోగం అయ్యింది అంతే! చదువుతూ వుండండి - అర్థం అయ్యేలాగే రాద్దామని నా ప్రయత్నం - చూడాలి ఎంతవరకు నేనే తికమక పడకుండా రాయగలనో!
తొలగించండితానాకి చాలా బాగా ఆతిధ్యం ఇచ్చింది సెయింట్ లూయీస్ నగరం: మా వూళ్ళో పోయినయేటి ఆటా కంటే వెయ్యిరెట్లు మెరుగు ఈయేటి తానా.
రిప్లయితొలగించండిపొతే, తానా కార్యక్రమ పట్టిక (ప్రోగ్రాం గైడ్) లో "స్పిరిట్యువల్ క్విజ్" చూసి నేను, మా ఆవిడ పాల్గొందామని వచ్చాము మా బుడ్డోడితో కలిసి, కానీ టీంకి నలుగురు ఉండాలని అన్నారు, సమయానికి ఎవరో ఇద్దరు "లోకల్" బంగారు తల్లులు కనపడ్డారు, మాతో కలిసి పార్టిసిపేట్ చెయ్యడానికి. వాళ్ళ హెల్ప్ తో క్విజ్ లొ మొదటి ప్లేస్ సాధించాము. మీ ఈమైల్ అడ్డ్రెస్ ఇస్తే ఫోటో పంపుతాను, మీకు తెలిసిన వారైతే మా ధన్యవాదాలు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పగలరు.
అరుణ్‌గారు: మా సెయింట్‌లూయిస్ ఆతిథ్యం మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీకు, మీ కుటుంబానికి శుభాభినందనలు - క్విజ్‌లో గెలిచినందుకు. Please share your email ID.
తొలగించండితానా సావనీర్లు కొన్ని కాపీలు తెచ్చాను ఇంటికి, ఇక్కడి ఫ్రెండ్స్ చదువుతారని, నేను ఇంకా పూర్తిగా చదవలేదు, ఈరొజు తప్పకుండా మీ "ఎల్లలు దాటే-ఎల్లెడలా వెలిగే" తప్పక చదువుతాను.
రిప్లయితొలగించండితప్పక చదవండి :) Thank You!
తొలగించండిపెద్దవారితో పరిచయం పెరగడం ఎప్పుడూ సంతోషకరమే.
రిప్లయితొలగించండిమీ నివాసం సెయింట్ లూయిస్ (మిజోరి) లో అన్నమాట. మీ ఊరి ఐకాన్ అయిన ఆర్చ్ నేను చూసానండోయ్. సరే అదలా ఉంచండి గానీ మీరు తానా-2017 సంబరాలకు హాజరయ్యారా? అయితే ఓ సంగతి చెప్పండి. వారి వెబ్ సైట్ లో "ప్రోగ్రామ్ గైడ్" లో ఆరవ పేజ్ లో చూస్తే మే 27 సాయంత్రం "మెయిన్ స్టేజ్" కార్యక్రమంలో ఆఖరి అంశం "Jabardasth show" అని వ్రాసుంది 😬!! ఏమిటి మా "జబర్దస్త్" ప్రోగ్రామే 😳😳???!!! అదే గనక అయితే దాని "ఖ్యాతి" సప్తసముద్రాలూ దాటిందన్నమాట. హతవిధీ 😢.
అఫ్ కోర్స్ అంత ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం చాలా ప్రయాసతో కూడిన పని నిస్సందేహంగా 👏. తానా వారు ఎన్నో సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా చేస్తున్నారు, శ్లాఘించాలి 👌.
తానాలో "జబర్దస్త్ షో" నా?
విన్నకోట నరసింహారావుగారు: అది ఈ-టీవీ వారి జబర్దస్త్ టీమేనండి - కాకపోతే దృష్టాదృష్టం కలగలేదనుకోండి :) ఆర్చ్ చూసేశారా? ఈసారి సెయింట్‌లూయిస్ వచ్చే ప్లాన్ ఏమన్నా వుంటే తప్పక తెలియజేయండి.
తొలగించండి🙏త్రివర్ణ సమ్మోదనం/సమ్మేళనం🙏
రిప్లయితొలగించండిధన్యవాదాలు, వెంకట్‌గారు!
తొలగించండినాకైతే భలే కుళ్ళుగా ఉంది.
రిప్లయితొలగించండికదా - గిరిరాజ్! నాకైనా అలాగే వుండేది - ఇది రాసింది నేను కాకపోతే :)
తొలగించండిమీ తానా కబుర్లు బాగున్నాయి. రాం, రాబర్ట్, రహీం ఇంకా గోగినేని గారు -వీరంతా నాకు ఇక్కడ మిత్రులే. "ఎల్లలు దాటే-ఎల్లెడలా వెలిగే" వ్యాసం ఎక్కడ చదవాలి? మీ వద్ద google document ఉంటే share చెయ్యగలరా? నా విద్యుత్లేఖ చిరునామా cbraoin@gmail.com
రిప్లయితొలగించండినా తానా-కబుర్లు చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు, CB Rao గారు! నా "ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే" వ్యాసం త్వరలో బ్లాగ్‌లో పోస్ట్ చేస్తానండి. మీకు e-mail కూడా చేశాను :)
తొలగించండికళ్ళకు కట్టినట్టు రాశారు.చాలా బావుంది.
రిప్లయితొలగించండిమీకు నచ్చినందుకు సంతోషం - ధన్యవాదాలు, నారాయణస్వామిగారు.
తొలగించండిశ్రీనిధుల యెదుటను చిగురించు సాహితి
రిప్లయితొలగించండివారి మాట విన్న వలచు సిద్ధి
భోజరాజు ఎదుట బొమ్మైన పలుకదా!
గంధమబ్బి తీరు ఘనుల చెంత!
మీ పద్య-వ్యాఖ్య చాలా ఆనందం కలిగించిది. ధన్యవాదాలు, శ్రీనివాస్‌గారు! మీరన్నట్టు సాహితీమూర్తుల సాంగత్యం వల్ల విద్యా-గంధం కొంచెం అబ్బినా చాలు - నాలాంటి అంతంత మాత్రం భాష తెలిసిన అమ్మైనా ఎంతో తెలిసినట్టు పలుకు :)
తొలగించండి