అనువుగాని కాలం
అలవిమాలిన కాలం
అయినవాళ్ళందరూ అక్కడక్కడే ఉన్నా అందరు కలిసి మెలిసి ఉండలేని కాలం
అత్తిపత్తి పోలికని అందరూ అరువు తెచ్చుకున్న కాలం.
అలాంటి అర్థం-పర్థం లేని కాలంలో అక్కడ అమ్మ ఒక్కతే ఒంటరిగా.
ఆ ఏకాంతం కూడా "అందరిలో ఉన్నా నాకు నేనే... నాతో నేనే ఉన్నా మీరందరూ ఉన్నట్లుంటుంది నాతోనే. అందుకే నా ఇష్టం వచ్చినట్టు, నా మనసుకి నచ్చినట్టు నన్నుండనీయండ్రా బాబూ ! " అని గలగలా నవ్వేసే అమ్మ కోరుకున్నదే.
అమ్మకి బోల్డంత ధైర్యం, ధీమా.
అమ్మ ఎప్పుడు మాట్లాడినా ఆ మాటల్లో ధిలాసా.
అమ్మ హమేషా కులాసా.
అసలు అమ్మే అందరికీ దన్నూ, ధైర్యం, అండా, దండా!
ఇక్కడున్న అబ్బాయి - ఇండియాలో ఇంటిలో ఉన్న అమ్మకి రోజూ ఫోన్ చెయ్యాల్సిందే...
అబ్బాయితో పాటు అబ్బాయి అందించిన వేలు పట్టుకుని వచ్చేసిన కోడలు పిల్ల-అమ్మాయి కూడా అ(త్త)మ్మతో మాట్లాడాల్సిందే!
ఒకరి తర్వాత ఒకరొకరుగా మాట్లాడుతున్న అబ్బాయి-అమ్మాయిలతో అ(త్త)మ్మ "హమ్మయ్య! ఇవాళ్టికి అందరూ హాజరు వేయించుకున్నారా?" అని మేలమాడాల్సిందే.
రోజూ మాట్లాడుకోవడానికి ఏముంటాయి?
"అమ్మా! అన్నం తిన్నావా?
అత్తయ్యా! ఇవాళ వాకింగ్ చేశారా?
అమ్మా! ఇవాళ చెల్లాయికి ఫోన్ చేశావా? తమ్ముడొచ్చాడా?
అత్తయ్యా! ఇవాళేం సినిమా చూసారు టీవీలో?
అమ్మా! సీరియల్స్ చూస్తున్నావా?
అత్తయ్యా! రామకోటి రాస్తున్నారా?"
ఎంత మార్చిమార్చి అడిగినా ఇవే ప్రశ్నలు. అవే సమాధానాలు.
కానీ ఈ మధ్య - అమ్మ - మాట్లాడుతూ మాట్లాడుతూ - వారంలో ఓ రెండు-మూడు సార్లైనా "పెద్దదాన్నవుతున్నానుగా..." అనేస్తోంది.
అది వింటుంటే అబ్బాయికి ఏదో తెలియని గుబులు మనసులో.
తెలిసీ తెలియని చిన్నారి వయసులో పెళ్ళై పెద్దరికం తెచ్చుకున్న అమ్మ - ఉన్నపళాన నాన్నగారు గుండెనొప్పితో కూలిపోతే - అయినవాళ్ళెవ్వరూ అండలేని వేళ అదరక, బెదరక - దేనికైనా వెరవక - తనని, తమ్ముడిని, చెల్లాయిని - కంటిరెప్పల కావలిలో పెంచి పెద్దచేసిన అమ్మ అప్పుడే పెద్దయిపోవడమేంటి? పెద్దదాన్నయి పోతున్నానని అనుకోవడమేంటి? - అని.
ఉన్న సమస్యకి చేతనైన పరిష్కారం వెతుక్కోవటం తప్ప - ఊర్కే బెంగ పడి ఆగిపోవడం అసలు అలవాటు లేదు అబ్బాయికి.
అమ్మని పెద్దతనపు తలపు నుంచి తప్పించాలి - ఆ మాట మరిపించాలి. ఆ మాట మరిపించాలంటే అమ్మ కోసం ఏమన్నా చెయ్యాలి - అమ్మకి నచ్చినదేదన్నా కొనుక్కోమనాలి.
కానీ అమ్మకి ఏమీ వద్దంటుందే! అమ్మ చేతిలో పెట్టిన డబ్బు పారాడే పాపాయి చేతిలో బొమ్మలాంటిది. అటూ-ఇటూ చూసి ఎక్కడో పెట్టి మళ్ళీ తిరిగి తన చేతికే ఇచ్చేస్తుంది. అందుకని అమ్మకేదైతే నచ్చుతుందో అబ్బాయే ఆలోచించి కొనిపెట్టాలి.
అలా అనుకున్నదే తడవు అబ్బాయి నుంచి తమ్ముడికి పిలుపు వెళ్ళింది - అమ్మకో స్మార్ట్ ఫోన్ కొనిపెట్టి అది ఎలా వాడాలో నేర్పించమని.
అమ్మ "నాకు వద్దురా బాబూ!" అన్నా వినిపించుకోలేదు అబ్బాయి. మొత్తానికి అమ్మకి ఆడుకోవడానికి ఓ కొత్తబొమ్మ దొరికింది - అదే అబ్బాయి అమ్మకి కొనిపెట్టిన స్మార్ట్ ఫోన్.
ముందు వద్దు-వద్దన్నా అమ్మకి ఆ ఫోన్ నచ్చింది. అది నొక్కి, ఇది నొక్కి అన్నీ ఒక్కటొక్కటిగా నేర్చుకోవడం మొదలు పెట్టింది.
ఇక్కణ్ణించి అబ్బాయి, అక్కడున్న తమ్ముడు కలిసి అమ్మకి చిన్నచిన్న పరీక్షలు పెట్టారు - "రాజమండ్రి ఆంటీకి voice call చెయ్యి, శివకోడు చెల్లాయత్తకి video call చెయ్యి, సౌండ్ పెంచు- తగ్గించు" అంటూ already smart ఐన అమ్మకి smart-phone వాడడం ఆడుతూ, పాడుతూ నేర్పించారు.
కొన్నదేదైనా కొత్తలో కాలక్షేపంగా ఉంటుంది కానీ పాతబడేకొద్దీ అలవాటుగా మారి అంతగా అలరించదు కదా!
మరి అమ్మని హుషారుగా ఉంచాలంటే ఇంకేం చెయ్యాలీ అని మళ్ళీ అబ్బాయికో ఆలోచన.
అప్పుడు తట్టింది అబ్బాయికి - మహత్తరమైన ఓ idea.
చిన్నప్పుడు అమ్మ అబ్బాయికి "అనగనగా ఓ రాజుగారుండేవారు. ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులూ. వాళ్ళో రోజు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు...." అంటూ మొదలుపెట్టి బోల్డన్ని కథలు చెప్పేది.
అబ్బాయి కూడా తాను పెరుగుతూ ఉన్నప్పుడు అమ్మ చెప్పిన కథలకి దీటుగా - చెప్పిన పని చెప్పినట్లు చెయ్యకుండా ఉండడానికో, చేసిన పని చేసినట్లు చెప్పకుండా ఉండడానికో చెప్పిన కథలు - ఉన్నవీ, లేనివీ, ఊహించుకున్నవీ, ఊహకందనివీ - ఇంకా బోల్డన్ని ఉన్నాయి.
అవన్నీ అబ్బాయికి గుర్తొచ్చాయి.
అవి అలా గుర్తు రాగానే "అమ్మకెందుకు మళ్ళీ కథలు చెప్పకూడదు?!" అనిపించింది అబ్బాయికి.
అబ్బాయి ఇటీవల చేసుకున్న కథ-లవాట్లు రెండు.
కొప్పర్తి వారి కథావాహినిలో కొప్పర్తి రాంబాబు గారు చదివే కథలు వినే అలవాటొకటి - విన్నవి ఎవరికైనా చెప్పకుండా ఉండలేని అలవాటింకొకటి.
అలా విన్న కథల్లో వారానికో కథ అమ్మకి చెబ్దామన్నదే అబ్బాయికొచ్చిన బహు-మంచి ఆలోచన.
అనుకున్నదే తడవు వారం, వారం - కథలు చెప్పుకొనువారం - చెప్పిన కథలు వినువారం అయ్యారు అబ్బాయీ-అమ్మా.
సాధారణంగా శుక్రవారం కథల వారం.
మొదటి వారం మునిమాణిక్యం నరసింహారావుగారి కాంతం కథల్లో "వెండి కంచం" కథతో మొదలయ్యింది.
"అమ్మా! ఇప్పట్నుంచి నీకు వారానికో కథ చెప్తాను.వింటావా?" ఊరింపుగా అబ్బాయి ప్రశ్న.
"కథ చెప్తావా? చెప్పు నాయనా వింటాను" ఉత్సాహంగా అమ్మ బదులు.
అలా మొదలు - ఇటు నుంచి అబ్బాయి చెప్తున్న కథలూ - అటు నుంచి అమ్మ కథ వింటూ కొడుతున్న "ఊఁ ఊఁ - లూ...
ఒక ఇరవై నిముషాల్లో కథ చెప్పడం పూర్తయింది. అబ్బాయి చెప్పిన కథ అమ్మకి నచ్చింది.
రెండో శుక్రవారం అబ్బాయి చెప్పిన కథ భమిడిపాటి రామగోపాలం గారి "వెన్నెల నీడ".
"అమ్మా! ఇవాళ నీకు 'వెన్నెల నీడ' అనే కథ చెప్తున్నానూ... దీన్ని భమిడిపాటి రామగోపాలం అనే ఆయన రాశారు. విను మరి!" గొంతు సవరించుకుంటూ అబ్బాయి.
"చెప్పయ్యా బాబూ వింటాను" చెవులు అప్పగిస్తూ అమ్మ.
"ఒకమ్మాయి, వాళ్ళాయన, ఇద్దరు పిల్లలతో ట్రెయిన్ ఎక్కుతారు - బంధువుల పెళ్ళికెళ్ళి వాళ్ళ ఊరికి తిరిగెళ్తూ.అప్పుడు ఆ అమ్మాయి తన ఎదురు సీట్లో కూర్చున్న ఒకతన్ని అదే పనిగా చూస్తూ - ఇతన్ని ఇంతకు ముందు ఎక్కడ చూశానా? - అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది" అంటూ మొదలు అబ్బాయి చెప్తున్న కథ.
అమ్మ వింటోంది. కథఎక్కడా ఆగకుండా భలే సాగుతోంది.
కథ చెప్తూ ఉన్న అబ్బాయికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది.
చెప్తున్న కథ హఠాత్తుగా ఆపేసి "ఇవాళ ఇక్కడికి ఆపేస్తాను. మిగిలిన కథ వచ్చేవారం. ఈలోగా కథలో తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ఊహించి నాకు చెప్పు" అని అనగానే ఫక్కున నవ్వి "నాకు హోంవర్క్ ఇస్తున్నావన్న మాట. బావుంది నాయనా!" సంబర పడింది అమ్మ ఆట్లాడే-బాలలా.
"అంతే మరి! నువ్వు రోజూ కార్తీకదీపం, వదినమ్మ సీరియల్స్ చూస్తావు కదా... అలాగే నేనూ నీకు కథలు సీరియళ్ళలా చెప్తా. వచ్చే వారం నేను కథ ఎక్కడాపానూ అనడిగితే సరిగ్గా నేనెక్కడ ఆపానో గుర్తు పెట్టుకుని నాకు చెప్పాలి." అమ్మ సంబరం విని అబ్బాయి గొంతులో ఆనందం.
అమ్మకి కథలు ఆసక్తికరంగా చెప్పడంలో అబ్బాయి వేసే ఎత్తుగడలు - అబ్బాయి పక్కనే ఉండి వింటున్న అమ్మాయి క్కూడా భలే సరదాగా అనిపించింది.
తర్వాత శుక్రవారం అమ్మ అప్పటివరకూ విన్న 'వెన్నెల నీడ' కథ గుర్తు చేయడం, అక్కణ్ణించీ మొదలుపెట్టి అబ్బాయి మిగిలిన కథ పూర్తి చెయ్యడం - అంతా అనుకున్నట్టుగానే జరిగింది.
మరసటి శుక్రవారం అబ్బాయి ఫోన్ చేసీ చెయ్యగానే అమ్మ తనంతట తానే అడిగింది "కథ చెప్తావా నాయనా!" అంటూ.
అలా అడిగినప్పుడు అమ్మ చిన్నప్పుడు అమ్మమ్మని ఇలాగే అడిగేదేమో అనిపించి చాలా సంతోషమేసింది అబ్బాయికి.
అమ్మ అడగ్గానే అబ్బాయి మొదలు పెట్టి చెప్పిన కథ వెధవ డబ్బు. ఈ కథ రాసినవారు పాలంకి వెంకట రామచంద్రమూర్తిగారు.
కథ మొదలుపెట్టి చెప్తున్న అబ్బాయికి మధ్యలో ఎందుకో అమ్మ కథ వినట్లేదేమో అనిపించింది.
"అమ్మా! నేను చెప్తున్న కథ వింటున్నావా? లేకపోతే టీవీ చూస్తున్నావా? నీకు వినాలని లేకపోతే చెప్పు. ఇంకోసారి చెప్పుకుందాం" అబ్బాయి గొంతులో ఇసుమంత కినుక.
"అయ్యో! లేదురా బాబూ! నువ్వు చెప్పే కథే వింటున్నా. చెప్పు. చెప్పయ్యా బద్రీ! "చెప్తూచెప్తూ ఉన్న కథ అబ్బాయి ఆపేస్తాడేమోనన్న బెదురు అమ్మకి.
"సరే! విను... " అంటూ అబ్బాయి మొదలుపెట్టిన కథ పూర్తయింది.
"హమ్మయ్య! కథ మధ్యలో ఆపేసి మిగిలింది మళ్ళీ వచ్చేవారం చెప్తాననలేదురా బాబూ నువ్వు!" అప్పటిదాకా ఊపిరి బిగబట్టి కథ విన్న అమ్మ 'చూశావా! నువ్వెలా బోల్తా కొట్టావో?' అంటున్నట్టు కలకలా నవ్వింది.
ఫోన్ తీగకి ఇవతల నుంచి అమ్మకి కథ చెప్తున్న అబ్బాయి కళ్ళు నవ్వుతో వెలిగాయి - అమ్మ కోసం ఇంకోటేదో ఆలోచించుకుని అట్టేపెట్టాడుగా మరి!
ఆ అమ్మ పెంచిన అబ్బాయి మరి! అమ్మ చిన్నప్పుడు ఆడించిన ఆటల్లో ఆరితేరిన అబ్బాయి! మరిప్పుడు అమ్మని ఆడించే వంతు తనదని మురిసిపోతున్న అబ్బాయి!
"అక్కడికే వస్తున్నానమ్మా! ఆగు మరి... తొందర పడకు... ఇదేం నెల...చెప్పమ్మా?!" తాపీగా అబ్బాయి పలికాడు అబ్బాయి.
ఓస్ ఇంతేనా - ఈ మాత్రం నాకు తెలీదా అనుకుంటూ "ఆగష్టూ...." అంటూ దీర్ఘం తీసింది అమ్మ.
"కరెక్టుగా చెప్పావ్" అబ్బాయి మెచ్చుకోలు విని అమ్మ చిన్నపిల్లలా మురిసింది - ఆ మెచ్చుకోలు తర్వాత దేనికి దారి తీస్తోందో అమ్మకి ఇంకా తెలీదు కదా!
"అమ్మా! ఇప్పటికి మొత్తం మూడు కథలు చెప్పాను - అవేంటో చెప్పు!" మెత్తటి గొంతుతో అబ్బాయి నుంచి తర్వాతి ప్రశ్న.
అమ్మకి హుషారొచ్చేసింది - తనకి సమాధానం తెలుసు కదా!
"ముందు చెప్పిన కథ డబ్బులు దాచి వాళ్ళాయనకి వెండి కంచం కొనిపెట్టిన కాంతం కథ, రెండోది వాళ్ళాయన ఊరెళ్తే బెంగ పెట్టుకున్న అమ్మాయి కథ వెన్నెల నీడ, ఇవాళ చెప్పింది - కింద పడ్డ కాణీనేరుకున్న డబ్బున్న ముసలాయన కథ వెధవ డబ్బు ... సరిగ్గా చెప్పానా?" గబగబా తడుముకోకుండా చెప్పేసి గొప్పగా అడిగింది అమ్మ.
"భలే చెప్పావమ్మా!" అబ్బాయి చప్పట్లు కొట్టబోయి ఆగాడు.
అమ్మ - పైకనలేదు కానీ - "నేనంటే ఏమనుకున్నావురా!" అనుకుంటున్నట్టుగా నవ్వింది. ఆ తర్వాత ఇంకేమేం ప్రశ్నలు రాబోతున్నాయో అమ్మకింకా తెలీదు కదా!
"సరే! అమ్మా! ఇప్పుడేం చేద్దామంటే... ఇప్పుడు చెప్పినట్టే ప్రతీవారం నీకో కథ చెప్తాను. డిసెంబర్లో నీకు పరీక్ష. పరీక్ష ఏంటంటే - ఎన్ని కథలు చెప్పాను? ఏం కథలు చెప్పాను? ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి నువ్వు. నేనడిగిన కథ నువ్వు మళ్ళీ నాకు చెప్పాలి. మరి సంక్రాంతికి ముందు చిన్నప్పుడు మాకు హాఫర్లీ పరీక్షలు పెట్టేవాళ్ళు కదా బళ్ళో. అలాగే నీక్కూడా ఇది హాఫర్లీ పరీక్ష " నెమ్మదిగా అమ్మకి పెట్టబోయే పరీక్ష గురించి చెప్పాడు అబ్బాయి.
"అమ్మో! కథంతా అంటే నువ్వు చెప్పినట్టే చెప్పలేను కానీ - టూకీగా చెప్తా" అమ్మ స్కూల్ కెళ్ళే పాపాయిలా మారాం చేసింది.
"సరే! సరే! టూకీగానే చెప్పు. కానీ నేను చెప్పే కథలు అన్నీ నువ్వు గుర్తుంచుకోవాలి. ఏ కథ అడుగుతానో నాకే తెలీదు" అమ్మని సరదాగా సవాల్ చేస్తున్నట్టు అన్నాడు అబ్బాయి.
"అలాగేరా బాబూ! గుర్తు పెట్టుకుంటాను. కాయితం మీద రాసుకోవచ్చా?" అబ్బాయి పెట్టబోతున్న పరీక్ష ఎలాగైనా పాసవ్వాలన్న ఆరాటంతో ఆరాగా అడిగింది అమ్మ.
"రాసుకో అమ్మా! నే చెప్పే ప్రతి కథ గురించి ఒకటో రెండో లైన్లు రాసుకో - నీ గుర్తు కోసం. " ఏదో రాయితీ ఇస్తున్నట్లుగా అబ్బాయి సమాధానం.
అలా అమ్మకి హాఫర్లీ పరీక్షకి సిలబస్సు, తేదీ ఖరారు అయిపోయాయి.
అమ్మ అప్పుడే పరీక్షలకి తయారవడం మొదలు పెట్టింది.
అమ్మతో మాట్లాడి ఫోన్ పెట్టిన వెంటనే అబ్బాయి తమ్ముడికి ఫోన్ చేశాడు - "చిన్నా! అమ్మకి కథలు చెప్తున్నా" అంటూ.
అది వింటూనే అటునుంచి తమ్ముడు నవ్వి "అమ్మేమందిరా, అన్నాయ్!? నాకెందుకురా ఈ కథలు అందా?" అనడిగాడు.
వెంటనే అబ్బాయి "అమ్మ అలా ఎప్పుడూ అనదురా చిన్నా! అన్నట్టు అమ్మకి డిసెంబర్లో హాఫర్లీ పరీక్ష కూడా పెడతానన్నాను. పేపర్ కూడా లీక్ చేశాను" అని ఇటునుంచి నవ్వులు రువ్వాడు.
అటునుంచి తమ్ముడు కూడా "హహ్హహ్హా!" అని నవ్వి "మంచి పని చేశావన్నాయ్! లాపోతే చిన్నపుడు ఎప్పుడూ మన చేత పరీక్షలకి చదివించి, పరీక్షలు రాసొచ్చాక కూడా ఏం రాసొచ్చామో కూడా మన చేతే చెప్పిస్తుందా? అమ్మకి అట్టా పరీక్ష పెట్టాల్సిందే!" అంటూ అన్నైన అబ్బాయి నవ్వులకి ఇంకొన్ని రవ్వలు చేర్చాడు.
ఇక అ(త్త)మ్మకి కోడలైన అమ్మాయి...
ఇటునుంచి అబ్బాయి అ(త్త)మ్మకి చెప్పిన కథలూ వింది.
అటునుంచి అ(త్త)మ్మ కొట్టిన "ఊఁ -ఊఁ" లూ వింది.
అబ్బాయి అ(త్త)మ్మకి పెట్టబోయే హాఫర్లీ పరీక్ష కబుర్లూ వింది
అ(త్త)మ్మ రాయబోయే పరీక్షకి రాసుకోబోతున్న నోట్స్ వివరాలూ వింది.
ఆఖర్న - అన్నదమ్ములిద్దరూ కలిసి అ(త్త)మ్మ రాయబోయే పరీక్ష గురించి రువ్విన నవ్వుల సవ్వడీ వింది.
ఇన్ని విన్న అమ్మాయి --- ఊరికే ఎందుకుంటుంది?
విన్నవన్నీ - తనకూ ఉన్నారుగా - ఇద్దరబ్బాయిలు - వాళ్ళకి కథలుగా చెప్పుకోవడానికి - కబుర్లుగా రాసుకుంది.
రాసుకున్నవి బోల్డన్ని కబుర్లలో చేర్చుకుంది.

అబ్బా ! ఎంత బావుంది అమ్మకిలా కధలు చెప్పడం . మీ బద్రికి అభినందనలు చెప్పండి . 👏👏👏
రిప్లయితొలగించండినీ అభినందనలు బద్రికి చేరాయి, ఇంద్రాణీ! చాలా థాంక్స్!
తొలగించండి👏👏... మీ కథల కబుర్లు బాగున్నాయి... మీ కబుర్లని... మీ పిల్లలే కాదు మేమూ కథలుగా... చదువుకుంటున్నాము
రిప్లయితొలగించండినువ్విలా నా కబుర్లు ఇష్టంగా చదవడం నాకూ ఇష్టంగా ఉంది, శారదా! థాంక్ యూ!
తొలగించండిSimply Superb!
రిప్లయితొలగించండిముద్దుగా ఉంది చాలా! అబ్బాయి అమ్మని చిన్నపిల్లని చేసి కథలు చెప్తూ ఉంటే అమ్మ ఎప్పటికీ పెద్దది అవ్వదు. ఎంచక్కా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటుంది కదా!
Bonus: Links to those stories :-)
అమ్మలలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండడమే కదా మనకీ కావాల్సింది! నా బ్లాగ్ చదివి మెచ్చినందుకు థాంక్స్!
తొలగించండిలలిత - బాగుందమ్మా కథ. మా అమ్మ రెండేళ్ళక్రితం ఇక్కడికి వచ్చినప్పుడు సుమారుగా ఇటువంటిపనే ఆవిడకు పెట్టాము. వారానికొకటి చొప్పున మా చిన్నప్పటి కబుర్లు మాకు గుర్తులేనివి స్మార్ట్ ఫోనులో తన గళంలోనే రికార్డ్ చేయడం, ఒక పుస్తకం ఇచ్చి వ్రాయమనడం పనులుగా పెట్టాము. కొంతవరకు సక్సెస్ అయింది కానీ ఆ ఆసక్తి సస్టెయిన్ చేయలేకపోయాము.
రిప్లయితొలగించండికిషోర్గారూ! భలే...మీరూ ఇలాంటిదే చేశారన్నమాట. నేను కూడా మా నాన్న చేత ఆయన కథ చెప్పిస్తూ ఉంటాను. ఇప్పుడు బద్రి మా అత్తగారితో ఇలా కథల-ఆటలు ఆడిస్తున్నారు. నా బ్లాగ్ చదివినందుకు చాలా థాంక్స్ అండీ!
తొలగించండిVery nice
రిప్లయితొలగించండిచాలా బాగుంది. మా అమ్మకి కూడా చెప్పాలనిపిస్తోంది. చాలా మంచి ఆలోచన, ఆచరణ.
రిప్లయితొలగించండిపద్మజా! మా కథల-కబుర్లు నీకు నచ్చినందుకు సంతోషం. థాంక్స్!మరి నువ్వు కూడా ఆంటీకి కథలు చెప్పడం మొదలు పెట్టు. నిజంగానే భలే enjoy చేస్తారు.
తొలగించండిచాలా మంచిపని చేస్తున్నారు. మేం పెద్దవాళ్ళమైపోయాం, మేం ఒంటరివారమైపోయాం అన్న ఆలోచనల నుండి ఇంటిపెద్దలను దూరంగా ఉంచాలీ వాళ్ళని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచాలీ అన్న దృక్పథం గొప్పది. అది విజయవంతంగా ఆచరణలో పెట్టటం ఇంకా గొప్పవిషయం. మీరు ఈవిషయంలో ఆదర్శంగా ఉన్నారు అందరికీ.
రిప్లయితొలగించండిచదువగలిగితే మనచుట్టూ ఉన్న జీవితాలలోనే ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. అందుకే కథ ఎప్పటికీ గొప్ప ఆసక్తి కరమైన విషయమే -మనం బాగా చెప్పగలగాలి. అంతే.
అభినందనలు.
శ్యామలీయం గారూ! మీ మెచ్చు మాకొక గొప్ప యోగ్యతాపత్రం. ధన్యవాదాలు!
తొలగించండిAmazing thought. This thought should go beyond this blog. Don't now how. Please suggest other members.
రిప్లయితొలగించండిThanks a lot, Giriraj, for your nice words about my blog post. Entire credit for this blog goes to Badari :)
తొలగించండిమీ అత్తగారు కృష్ణకుమారి లాగా ఉన్నారు. అల్జీమర్స్ రాకుండా భలే చూసుకుంటున్నారు బద్రిగారు. ఇలాంటి కొడుకుంటే దూరాలు భారాలు కావు.
రిప్లయితొలగించండిచప్పట్లు అబ్బాయిగారికే !👏👏👏
మీరన్నది చెప్తే మా అత్తగారు బోల్డు సంతోషిస్తారు. రేపు ఫోన్ చేసినప్పుడు తప్పకుండా చెప్తాను. బదరి కూడా మీకు థాంక్స్ చెప్పమన్నారు. చాలా థాంక్సండి, నీహారికా!
తొలగించండికొప్పర్తి రాంబాబుగారు అని చెప్పారు. ఆ సైట్ ఎవరిది ?
రిప్లయితొలగించండిఇక్కడ చూడండి: https://anchor.fm/rambabu-kopparthy
తొలగించండిNice లల్లి
రిప్లయితొలగించండిచాలా బావుంది
మీ అత్తగారు కదా
మీ వారికి చెప్పు చాలా బావుంది అని అమ్మ కి halfyearly పరీక్ష 🙏🙏🙏👌👌👌👌👌👌
మా ఇద్దరి నుంచి - నీకు బోల్డన్ని థాంక్స్, శ్యామలా!
తొలగించండిమాటలతో చెప్పలేను అంత బాగుంది లల్లీ ... మోహిని ఆంటీ
రిప్లయితొలగించండిమీ అభిమానం, మోహిని ఆంటీ! చాలా థాంక్స్!
తొలగించండిఇంత ప్రేమ అభిమానం చూపించే పిల్లలు ఉన్న తల్లీ తండ్రులు అదృష్టవంతులు. మీ వారికి అభినందనలు. నేను కూడా నుంచుని చప్పట్లు కొడుతున్నాను. ......... మహా
రిప్లయితొలగించండిధన్యవాదాలు, సర్! మీ అభినందనలు మా వారికి అందజేశాను.
తొలగించండిలలితా .. అమ్మ కి వారం వారం కథలు చెప్పటం అనే ఆలోచనే అద్భుతం అని చెప్పాలా? లేక, ఆ ఆలోచనని ఇంత అందంగా రాసిన విధానం అద్భుతం అని చెప్పాలా? అసలిదంతా నిజమేనా?! ఏంటో..ఏమీ తెలియట్లేదు. ఇది చాలా అన్యాయం.
రిప్లయితొలగించండిమీరెవరో పేరు కూడా తెలియకుండా ఇంత మంచి కమెంట్ పెట్టడం మహా అన్యాయం. Thank You!
తొలగించండిచాలా బాగుంది అంది... చాలా పెద్దది అనిపించింది కానీ చదువుతుంటే నాకు తెలియకుండానే కళ్ళలోనుండి నీళ్ళు వచ్చాయి.. అంత ప్రేమగా చూసుకునే కొడుకు- కొడుకు అలుగుతాదేమో అని కలవర పడ్డ అమ్మ.. అబ్బ వర్ణనాతీతం. మా పిల్లలికి పడుకునే సమయానికి ఈకథే చెప్పాను. వాళ్ళు కూడా ఎక్సమ్ రాస్తారుట. వాళ్ళని బాగా motivate చేసింది మీ స్టోరి. అమ్మకి, బద్రి గారికి,మీకు మా తరుపున ధన్యవాదములు.
రిప్లయితొలగించండిభలే! మీరు చెప్పే కథలు విని పరీక్ష రాస్తామన్న మీ పిల్లలకి నా తరపు నుంచి All the Best చెప్పండి! మీ కమెంట్ కూడా నన్ను బాగా motivate చేసింది. Thanks a lot!!
తొలగించండిభలే ఆలోచనండీ, పెద్దవాళ్ళకి ఇలా కబుర్లు చెప్తుంటే వాళ్ళకి బేటరీ రీచార్జ్ అయిపోతుంది.
రిప్లయితొలగించండికదా! థాంక్సండి శ్రీనివాస్ గారు!
తొలగించండిహాఫియర్లీ పరీక్షకి ప్రిపరేషన్‌గా షార్ట్ టెర్మ్ కోచింగ్ ఇప్పించాలి, వదినా :)
రిప్లయితొలగించండివిజయ్
తప్పకుండా, విజయ్! ఆ కోచింగ్ ఏదో మీరే ఇవ్వాలి :)
తొలగించండిచాలాబాగుంది లల్లీ. అమ్మని అలా ప్రేమగా చూసుకునే కొడుకులు వుండటం ,నిజం గా చాలా అదృష్టం.
రిప్లయితొలగించండిప్రతి తల్లి,, కొడుకుల దగ్గరనుండి కోరుకునేది ఇదే. నన్ను మా పిల్లలు అలాగే చూసు కుంటారు. నీకు బదరికి ,👋👋 - సరోజాంటీ
మీ అభిమానానికి ధన్యవాదాలు, సరోజాంటీ!
తొలగించండిఈ మధ్య చూసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూసిన తరువాత మళ్ళీ ఈ పోస్టు గురించి వ్రాయాల్సిన అవసరం నాకు కలిగింది.
రిప్లయితొలగించండిఏదైనా ఒక రచన లేదా సృజనాత్మక సృజన వెనుక ఒక ప్రయోజనం ఉండొచ్చు లేకపోవచ్చు. అది ఆ వ్యక్తి ఆలోచనా శక్తి పరిమితిని బట్టి ఉంటుంది. దానిని హేళన చేయడం నా ఉద్దేశ్యం కాదు. విమర్శ వల్ల కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు.
మీరు ఈ పోస్టులో ఒక సమస్య చెప్పి దానిని ఎలా అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పారు.మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. సఫలమైతే మార్గదర్శకులు అవుతారు. మీ ప్రయత్నానికి నా చప్పట్లు.
అందరూ ధ్రిల్లర్లు తీస్తున్నారు కదా అని ఆడవాళ్ళ వీక్‌నెస్ లని భూతద్దంలో చూపిస్తే చూసి ఊరుకోవడానికి బ్లాగులు డైలీ సీరియళ్ళు చూపే వేదికలు కావు. అక్కడ ఏమీ చేయలేకపోతున్నాం కదా అని ఇక్కడ కూడా అలాంటివి చూపిస్తే తప్పక విమర్శించాల్సి వస్తుంది.