కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 49 - నన్నూ, తననూ కన్నవాళ్ళకు... కోటి దండాలు... శతకోటి దండాలు...
పొద్దున్నేఅమ్మ లేపుతుంటే లేచిన నాకు మొదలయింది - ఆ కల లాంటి రోజు.
నేను తలంటుకుని రాగానే అమ్మ ఓ కొత్త చీర ఇచ్చి కట్టుకోమంది.
ఈలోగా అమ్మ, చెల్లాయత్త కలిసి ఓ బుట్టలో దేవుడి సింహాసనం, కుందులు, ఒత్తులు, అగ్గిపెట్టె, పసుపు, కుంకుమ, పూలు - ఇంకో బుట్టలో అంతకు ముందు రాత్రే తెప్పించి ఉంచిన మల్లెపూల జడ, జడగంటలు సర్దారు. నేను ముందే చెప్పాను నా జుట్టుతోనే జడ వెయ్యాలి, సవరాలు అవీ పెట్టొద్దని.
ఇంకో చిన్న పెట్టెలో సర్దుతూ అమ్మ చెల్లాయత్తకి చెప్తోంది - "ఇదిగో - ఇటు చూడండి - బుట్టలోకి కొన్న చీర ఈ గోల్డ్ కలర్‌కి పింక్ బోర్డర్ చీర. జాకెట్టు కూడా అందులోనే పెట్టాను. అదెలాగూ కన్నెధార పోసేటప్పుడు దానికని చేయించిన పలకసర్లు, మెళ్ళో ఉన్న చిన్న గొలుసు తప్ప ఇంకేమీ పెట్టుకోనంది. వాటితో పాటే దాని వడ్డాణం కూడా ఆ పక్కనే పెట్టాను. మీరక్కడికి వెళ్ళగానే అక్కడ పనివాళ్ళు కళ్యాణమండపం ముందు ముగ్గు వేశారో లేదో చూడండి. అక్కడ మనకి గదులవీ ఉన్నాయి. వాటికి తాళాలు అవీ ఇస్తాను. అక్కడ లల్లీకి చీర అదీ కట్టి, పూలజడ వేసేసి మీరు రెడీగా ఉంటే ఈలోగా మేమందరం తయారయి వస్తాము."
చెల్లాయత్త "అలాగే, పాపా! నేనన్నీ చూస్తాను. మీరొచ్చేలోగా గౌరీపూజకి కూడా అన్నీ సర్దేస్తాను. మీరేమీ కంగారు పడకండి" అంటూ అమ్మకి భరోసా ఇస్తున్నారు.
ఇంకో పక్కనుంచి నిద్ర కళ్ళతో పప్పి, కుట్టి కూడా వచ్చారు. కుట్టి వస్తూనే ఓ చిన్న పెట్టె చెల్లాయత్త చేతికి ఇచ్చి "చెల్లాయత్తా! ఇందులో ఉన్నది లల్లెమ్మ చేతికి పెట్టండి" అంటూ అందించింది.
అది చూస్తూనే నేను "అదేంటి మళ్ళీ? నాకేమీ వద్దన్నానా?" అంతకు ముందు రోజే తలలో పెట్టుకునే రాగిడీ పెట్టుకోమని అదీ, అది నా జుట్టు పీకేస్తుంది పెట్టుకోనని నేనూ - మా మధ్య జరిగిన చిన్న గొడవోటి గుర్తొచ్చి అడిగాను.
"ఏం లేదు లేవే బాబూ... ఇది పెట్టుకుంటే నీ చేతులు వీడియోలో, ఫొటోల్లో బాగా కనిపిస్తాయని బోల్డు షాపులు తిరిగి తీసుకొచ్చాను నేను. ఇది పెట్టుకోనంటే ఇహ బావుండదు." అని నా మీద విసుక్కుంటూ - చెల్లాయత్త కేసి తిరిగి "ఇదిగో ...చెల్లాయత్తా! ఇది మీరు దీనికి మర్చిపోకుండా పెట్టండి. ఒద్దంటే చూడండి...నేనొచ్చాక ఆ చేతులు కట్టి మరీ పెడతాను" అని ఆవిడ చేతిలో ఆ ప్లాస్టిక్ బాక్స్ పెట్టింది కుట్టి.
"కుట్టెమ్మా! ఇలా ఇయ్యది - నువ్వే చూస్తావుగా మన లల్లెమ్మని నేనెలా తయారు చేస్తానో" అంటూ చెల్లాయత్త అత్యుత్సాహం, ఆపేక్ష చూపిస్తూ కుట్టి అందించిన ప్లాస్టిక్ డబ్బాని ఆవిడ హ్యాండ్‌బేగ్‌లో పెట్టుకున్నారు.
నేనింకేం మాట్లాడలేదు. ఈ రోజు ఎవ్వరినీ కాదనదలుచుకోలేదు - దేన్నీ వద్దనదలుచుకోలేదు. నిజం చెప్పాలంటే గత రెండు రోజులుగా జరుగుతున్న సందడి నన్ను ఒక కలలా నన్ను మూసేసింది. ఒక మైకంలా నన్ను కమ్మేసింది. నేను physical గా మెలకువలో ఉంటూ, నా mind మహా blank గా ఉన్న క్షణాలవి.
సరే! కావాల్సినవన్నీ సర్దిపెట్టి - నన్నూ, చెల్లాయత్తని కారెక్కించి - చిలకలూరిపేట రోడ్డులో ఉన్న - ఇండియన్ టొబాకో అసోసియేషన్ కళ్యాణ మండపానికి పంపించింది అమ్మ.
అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పటికే మా రాములమ్మ, కూతురు శ్రీదేవి కళ్యాణ మండపం బిల్డింగ్ బయట నీళ్ళు జల్లి ముగ్గేసేశారు.
ఓ పక్కగా ఎవరో నలుగురు ఓ చిన్న లారీ లాంటి దాంట్లోంచి చిన్నచిన్న పంజరాలు దింపుతున్నారు. అందులోంచి బుజ్జిబుజ్జి కుందేళ్లు, తెలతెల్లని పావురాలు, చిగురాకుపచ్చ చిలకలు కనిపిస్తున్నాయి. పక్కనే బుల్లిబుల్లి వాటర్ ఫౌంటెన్స్ కూడా ఉన్నాయి.
వాటిని చూడగానే - అంతకు ముందు రాత్రి నాన్న అమ్మతో చెప్తుండగా నేను ఆ పక్కనే పడుకుని విన్నది గుర్తుకొచ్చింది - ఆ డెకరేషన్ సాంబశివరావుగారెవరో నాన్నతో 'సార్! పాప పెళ్ళికి నేనే చెయ్యాలండి డెకరేషన్ - చిలకలు, పావురాళ్ళు, కుందేళ్ళు అన్నీ పట్టుకొస్తాను' చెప్పారట - అయన చెప్పినట్టే అవన్నీ తెచ్చేసినట్టున్నారు అనుకున్నాను.
వాటిని చూస్తూనే చెల్లాయత్త భలే సంబరంగా "బాబన్నయ్య ఎంత బాగా చేయిస్తున్నారు నీ పెళ్ళి ఏర్పాట్లు, లల్లీ! అమ్మకి, నాన్నగారికి నువ్వంటే ఎంత ప్రేమో చూశావా?!" అంటూనే నన్ను తీసుకుని కల్యాణ మండపంలో ఒక గదిలోకి తీసుకెళ్ళారు. ఈలోగా కార్లో ఉన్న మిగిలిన సామాన్లు అన్నీ కూడా డ్రైవర్ తీసుకొస్తే వాటిని ఇంకో గదిలో పెట్టించారు.
తడిగా ఉన్న నా తల ఆరుతుందని జుట్టంతా రబ్బర్ బ్యాండుతో కట్టి వదిలేసి, అమ్మ చెప్పినట్టు బంగారం రంగుకి గులాబీ అంచున్న జలతారు పట్టుచీరని గోచీ పోసి కట్టి, కుడి పక్కకి పమిట వేస్తూ - చీరకున్న జరీ పమిట చెంగు ముందుకి కనిపిస్తే బావుంటుందని - పమిట చెంగుని మాత్రం మార్వాడీలు కట్టుకునేట్టు ముందుకి వేశారు. అసలు అంతకు ముందు కూడా నేను ఓణీలు, చీరలు ఎక్కువగా మార్వాడీ కట్టే కట్టుకునే దాన్ని. నా ముక్కుకున్న వేలాడే ముత్యం, నా చీర కట్టూ చూసి నన్ను తెలియనివాళ్ళు నేను మార్వాడీ అమ్మాయిని అనుకుంటూ, నా నోట అచ్చతెలుగు విని ఆశ్చర్యపోతూ ఉంటే నేను, పప్పి, కుట్టి - వాళ్ళని నా చీరకట్టు - నోటి వాక్కు confuse చేసినందుకు నవ్వుకునే వాళ్ళం. అదే తలుచుకుంటూ నాలో నేనే నవ్వుకుంటున్న నా మొహం చూసి "ఏం గుర్తొచ్చింది లల్లీ - అలా నవ్వుకుంటున్నావ్?" అంటూ ఆవిడ కూడా నవ్వుతూ నా పమిటకి పిన్ పెట్టారు అత్త.
చీర కట్టడం అవగానే నాకు నుదుటిపై తిలకం పెట్టి, దానిమీద కుంకం అద్ది నామం పెట్టారు. ఎడమ బుగ్గన కాటుకతో చుక్క పెట్టారు. మెళ్ళో పలకసర్లు వేసి, నడుముకి వడ్డాణం పెట్టారు.
ఆ తర్వాత జడగంటలు పెట్టి నాకు జడ వేసి - పక్కనే బుట్టలో ఉన్న ready-made మల్లెపూల జడ తీశారు చెల్లాయత్త. దాంతో పాటే ఓ దారపుండ కూడా.
ఆ రెండూ తీస్తూనే "అయ్యోయ్! లల్లెమ్మోయ్!" అన్నారు అత్త.
అటువేపు తిరిగున్న నేను వెనక్కి చూస్తూ "ఏమైంది చెల్లాయత్తా?" అనడిగాను.
"హడావిళ్ళో చూసుకోలేదు చూశావా? ఈ దారపుండకి సూది గుచ్చి లేదు. ఇప్పుడెలా?" అన్నారు.
ఒక్క నిముషం నేనేం మాట్లాడలేదు. "హమ్మయ్య! ఆ బరువు జడ వేసుకోక్కర్లేదు. అత్తకి ఓ పెద్ద పూలమాల తీసి నా జడకి చుట్టెయ్యమని అడుగుతాను" అని మురిసిపోతూ ఉన్నానో లేదో ఇంతలో అత్త "ఉండు ఇప్పుడే వస్తాను" అని పూజ సామాన్లు పెట్టిన గదిలోకి వెళ్ళారు.
అలా వెళ్ళినావిడ చేతిలో ఓ అగ్గిపుల్లతో తిరిగొచ్చారు. వస్తూనే పక్కనే పెట్టున్న దారపుండ తీసి ఓ పెద్ద దారంముక్క తెంపి దాన్ని ఆగిపుల్ల తల దగ్గర చుట్టి, మల్లెపూల జడని నా జడకి పెట్టి - దారం కట్టిన అగ్గిపుల్ల రెండో కొసని మల్లెపూల జడకి వెనకున్న అట్టలోంచి నా జడ లోకి దింపి నాకు జడ కుట్టటం మొదలుపెట్టి ఓ పది నిముషాల్లో జడ కుట్టడం, పైన పూలు పెట్టడం అంతా పూర్తి చేశారు. అప్పటిదాకా ఏవో చిన్నచిన్నగా మాట్లాడుతున్న నేను జడ కుట్టడం పూర్తవగానే మాట్లాడడం మానేశాను. కొంచెంగా తలనొప్పి మొదలవుతున్నట్టనిపించింది.
ఇంతలో అత్త పాపిడిబొట్టు పెట్టి నా అలంకరణ పూర్తి చేశారు. అన్నట్టు కుట్టి ఇచ్చిన - దాని పేరేంటో నాకు తెలీదు - చేతి మణికట్టు దగ్గర్నుంచీ ఐదు వేళ్ళకీ గొలుసుల్లా పెట్టుకునే ఉంగరాల్లాంటివి కూడా పెట్టారు. అత్త నా జడ కుడుతుండగానే అమ్మ, నాన్న, పప్పి, కుట్టిలతో పాటు ఒక్కరొక్కరుగా పెళ్ళివారందరూవచ్చారు.
గురువుగారు వెంకన్నగారు కూడా వచ్చారు. పూజ సామాన్లు అన్నీ పెట్టి వున్న గదిలోనే లలితత్తయ్య, లలిత దొడ్డ, జయాంటీ - వీళ్ళందరూ లలితాసహస్రనామం చదువుతుండగా - ఆకుపచ్చ మెరుపు కాయితాలు అంటించిన
మేదర బుట్టలో కూర్చున్న - నా చేత గౌరీపూజ చేయించారు గురువుగారు. అది జరుగుతున్నంత సేపూ నేను మాట్లాడకూడదు అని చెప్పారు. చేతిలో కుంకం తీసుకుని పసుపు గౌరమ్మకి పూజ చేస్తూ మధ్యలో కళ్ళెత్తిన నాకు ఎదురుగుండా గుమ్మంలో నిల్చున్న గణపవరం కరణంగారు అనుమంచి లక్ష్మీనారాయణగారు కనిపించారు. కళ్ళెత్తి చూసిన నన్ను చెయ్యెత్తి పలకరించి అయన వెళ్ళిపోయాక అప్పుడు చూశాను ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు కూడా నా పక్కనే కూర్చుని లలిత చదువుతున్నారని. అప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. నన్ను చిన్నపిల్లప్పట్నుంచి వాళ్ళ మనవలతో సమానంగా అభిమానించిన వాళ్లిద్దరూ నా పెళ్ళికి రావడం నాకు అపురూపంగా అనిపించింది.
అన్నపూర్ణమ్మగారే నేను టెన్త్ క్లాసులో ఉన్నప్పుడు వేసవి సెలవుల్లో అమ్మతో కలిసి గణపవరం వెళ్తే - లల్లీకి ఒంటిరాయి ముక్కుపుడక కన్నా వేలాడే ముత్యం అయితే బావుంటుంది అని చెప్పి - నాకు ముక్కుకి ఉన్న ఎఱ్ఱరాయి ముక్కుపుడకని తీయించేసి ఓ చిన్న బంగారం రింగుకి వేలాడే ముత్యం, దానికిందో ఎఱ్ఱపూస వేసి కుట్టించారు.
నేనిక్కడ గౌరీపూజ చేస్తూ ఉన్నాను - ఇంతలో నాకేదో చుట్టూ కొంచెం హడావిడి ఏదో జరుగుతున్నట్టు అనిపించింది. నన్ను పూజ చేస్తూ ఉండమని చెప్పి గురువుగారు బయటికి వెళ్ళిపోయారు.
ఓ ఐదు నిముషాల తర్వాత కుట్టి వచ్చి నా పక్కనే కూర్చుని చిన్నగా "లల్లెమ్మా! కంగారేం లేదు - పెళ్ళికొడుకు వాళ్ళు రావడం ఆలస్యం అయింది. నాన్న కొంచెం టెన్షన్ పడ్డారు. వాళ్ళొచ్చేశారులే! కాకపోతే వాళ్ళు రావడమే ఆలస్యం అయిందని గురువుగారు ఎదురుసన్నాహం నువ్వు లేకుండానే చేయించేశారు. నువ్వు నీ పూజ కానీయ్" అని నా జడ సర్దేసి వెళ్ళిపోయింది.
ఈలోగా అమ్మ ఓ బాసికం పట్టుకుని వచ్చి నాకు కడుతూ "మనకి ఆనవాయితీ లేదు. కానీ మీ అత్తవారింట్లో బాసికాలు కడతారట. వీటికోసం ఎక్కడికి పరిగెత్తాలా ఇప్పుడు అనుకున్నాం కానీ కల్యాణమండపం వాళ్ళ దగ్గరున్నాయట." అంటూ "జడ లాగేస్తోందా? కొంచెం ఓర్చుకో. ఈ ఒక్క పూటకేగా!" అమ్మ కదా నేనేమీ నోరు తెరిచి చెప్పకుండానే నా నొప్పి తెలిసినట్టు నా తల నిమిరి వెళ్ళిపోయింది.
అమ్మ - నా మనసెరిగి - నాన్న వెనక ఉండి - నాకు మనసైన - నా పెళ్ళి జరిపిస్తోంది కానీ - ఎందుకో దిగులుగా, moody గా ఉంది. ఏదో గుర్తు చేసుకోకూడనిది మరిచిపోవడానికన్నట్లు నవ్వుతోంది - అంతలోనే మరిచిపోవాలనుకున్నది గుర్తొచ్చినట్టు నవ్వలేకపోతోంది. అమ్మ పడుతున్న అవస్థ నాకు తెలుస్తూనే ఉన్నా - ఇదీ నా కలే - అనుకుని అది నాకు తెలియనట్టు ఉండిపోతున్నా.
ఈలోగా నా గౌరీపూజ పూర్తయింది. బయట పోలీస్ బ్యాండు వాళ్ళు ముఠామేస్త్రీ పాటలు "హోయిరబ్బా .... హోయిరబ్బా" పాట ఓ రెండు, మూడు సార్లు వాయించి ఉంటారు. పక్కనుంచి పప్పి, కుట్టి మాట్లాడుకుంటున్నారు "మన పాపాయి పిన్ని వాళ్ళ నాని కొడుక్కి ఆ పాట ఇష్టంట. వాళ్ళ దగ్గరికెళ్ళి అదే పాట వాయించమని మళ్లీమళ్లీ అడుగుతున్నాడని వాళ్ళూ అదే వాయించేస్తున్నారు." అని.
ఇంతలో బుట్టలో కూర్చుని ఉన్న నా చేతుల్లో గుమ్మడిపండు, కొబ్బరిబొండం, గంధం చెక్క పెట్టారు. తంబి మామయ్య, ప్రసాద్ బాబయ్య (జ్యోతిపిన్ని husband), పాపాయి అమ్మమ్మ గారి నాని (మామ), పాపాయత్తయ్య గారి రామం (బావ) వచ్చి బుట్టలో కూర్చున్న నన్ను - బుట్టతో సహా ఎత్తి ఆ గది లోంచి కళ్యాణమండపం మీదకి తీసుకెళ్ళారు. నాకేమో బోల్డంత మొహమాటం - వాళ్ళ నలుగురూ నన్నలా ఎత్తుకు తీసుకెళ్తున్నారని. అప్పుడే పోలీస్ బ్యాండ్ వాళ్లు "బంగారుబొమ్మ రావేమే!" పాట వాయించడం మొదలుపెట్టారు. చిన్నప్పట్నుంచీ చూసిన ప్రతీ పెళ్ళిలో విన్న ఆ పాట నా కోసం వాయిస్తున్న ఆ క్షణాన నాలో నాకే తెలియని ఒక excitement. నన్నలా తీసుకెళ్ళి పెళ్ళికొడుకు బదరికి ఎదురుగా కూర్చున్న నాన్న-అమ్మల పక్కన బుట్టతో సహా కూర్చోపెట్టారు. మా ఇద్దరికీ మధ్య తెఱసెల్లా.
తంబి మామయ్య కొడుకు పన్నెండేళ్ళ వాసు ఆ తెఱసెల్లా ఒక కొస పట్టుకుని నా పక్కనే నిల్చుని ఉన్నాడు. మా పెళ్ళికి ఫోటోలు తీస్తానని వచ్చిన బదరి ఫ్రెండ్ సాయి అనే అతను వాసుని తెఱసెల్లాని కొంచెం కిందకి పట్టుకోమని బోల్డు దబాయించాడు. అలా చేయడంలో తను బదరికి ఏదో పే... ద్ద సాయం చేసేస్తున్నట్టు కాసేపు ఫీల్ అయ్యాడు కూడా. ఆ ఉత్సాహంలో చిన్నపిల్లాడిని చేసి వాసుగాడికి రెండు బుల్లి మొట్టికాయలు కూడా వేశాడు. ఆ సాయి ఒక్కడే కాకుండా నాన్న ఏర్పాటు చేసిన ఫోటో/వీడియోగ్రాఫర్ కూడా ఫోటోలు, వీడియోలు తీశాడు.
నాకు అంతకు ముందు బదరి ఎంత తెలిసినా పెళ్ళిపీటల మీదకి వెళ్ళేటప్పటికి నాకు తల ఎత్తలేనంత సిగ్గుగా అనిపించింది. అందులోనూ ఓ పక్కనుంచి ప్రభావతి దొడ్డ వాళ్ళ సాయి అమ్మతో, నాన్నతో "పెద్దపాపా, బాబయ్యా! నవ్వండి ....నవ్వాలి మీరు!" అని అనడం విని వున్నానేమో కొంచెం బెంగగా కూడా ఉన్నాను.
బదరి తల నాకు సరిగ్గా అందలేదు (తను కావాలని కొంచెం పైకి పెట్టుకుని ఉన్నారు) కానీ మొత్తానికి జీలకఱ్ఱ-బెల్లం పెట్టడం అయింది అనుకున్న ముహూర్తానికి.
అప్పుడు చూశాను నాకు అక్షింతలు వేయడానికి వచ్చిన అతిథి దేవుళ్ళని ....
నా చేత పలక-బలపం పట్టించి చదువు నేర్పిన మల్లయ్య మాష్టారు...
నా చిన్నతనాన్ని గుర్తుచేసుకుని మురిసిపోయే గణపవరం కరణంగారు, అన్నపూర్ణమ్మగారు...
నా చదువుని నమ్మి వాళ్ళ పిల్లలకి ఆడుతూపాడుతూ నాచేత లెక్కలు చెప్పించిన ఆర్మీ ఆఫీసర్ సంతోష్ ఆల్ఫ్రెడ్ గారు...
నా ప్రియ నేస్తం అపర్ణ, పక్కనే వాళ్ళమ్మగారు శాంత ఆంటీ...
BH లో ఇంటర్ చదివేరోజుల్లో కొరకొరా చూసుకున్నా MCA లో ఫ్రెండ్ అయిన నిరుపమ...
నాన్న ఆఫీసులో జనరల్ మేనేజర్ రామ్మోహన్ గారు
బదరి డిగ్రీ ఫ్రెండ్స్ బాలాజీ, సాయి గిరిధర్, CK (చెన్నకేశవరెడ్డి), నాగశ్రీను, జార్ (రాజగోపాల్), మదన్...
నా డిగ్రీ క్లాస్మేట్, బదరి ఫ్రెండ్ - వేణుగోపాలకృష్ణమూర్తి
బదరి MBA ఫ్రెండ్ - సాయి ప్రసాద్...
ఇంకా....బదరిని మొట్టమొదటగా నాకు పరిచయం చేసి మా పెళ్ళికి మూలకారణమైన రాజశేఖర్...
అక్షింతలు వెయ్యడానికి ఒక్కొక్కళ్ళుగా వస్తున్న వీళ్ళందరినీ చూస్తుంటే నాకు బోల్డంత ఆనందం.
అసలు పెళ్ళి జరుగుతున్నంతసేపూ ఏదో బెరుకు నాకు. అన్నీ శాస్త్రోక్తంగా చెయ్యడానికి టైం ఉంటుందో ఉండదో అని. ఎదురుసన్నాహం లాగానే ఈ గురువుగారు అన్నీ హడావిడిగా జరిపించేస్తారేమో అని.అంతలోనే ఒక చిన్న సందేహం - ఈ గుంటూరు టౌనులో పెళ్ళిలో తల మీదుగా పట్టుకునే కాడి దొరికిందో లేదో నని. అవన్నీ నా ఉట్టుట్టి బెంగలే కానీ అన్నీ చక్కగా జరిగేలా చూశారు నాన్న.
మధుపర్కాలు కట్టుకుని, జ్యోతులు పట్టుకుని వచ్చిన నా మెళ్ళో బదరి మంగళసూత్రాలు రెండూ కట్టడం - ఆ కట్టే సమయంలో మా చెల్లాయత్త నా జడని ఎత్తి పట్టుకోవడం - అది చూస్తూ నా వెనకనే కూర్చున్న కుట్టి "చెల్లాయత్తకి ఏం చేస్తే ఫొటోల్లో బాగా పడతారో బాగా తెలుసు" అనడం - అది వింటూ మా అత్త ఫక్కున నవ్వడం - కల... కల... కలే అది నాకు!
ఈలోగా తలంబ్రాలు.అమ్మ నెమ్మదిగా నా పక్కకొచ్చి కుడిపక్కగా వేసుకున్న మధుపర్కం పమిటని నెమ్మదిగా తీసి నా ఎడమ భుజం మీదుగా కప్పింది. అమ్మ కదా! చేతులెత్తి తలంబ్రాలు పోసే వేళ కొంగు కప్పి ఉంటే ఇబ్బంది ఉండదని - అప్పుడు నా మనసెరిగిన అమ్మ మనసు నాకెంత హాయినిచ్చిందో!
పెళ్ళి తతంగమంతా అవుతూ ఉండగా - బదరి వెనకాల మా ఆడపడుచు తులసి, నా వెనకాల కుట్టి కూర్చుని ఉన్నారు.
లాజహోమం చేస్తుండగా ఆ నిప్పుసెగకి నా చేతికి కుట్టి పెట్టిన గొలుసులు వేడెక్కాయని చూసి - అదే వచ్చి - "అయ్యో లల్లెమ్మా! చేతులు కాల్తున్నాయని చెప్పొద్దే?! అని చెప్పి వాటిని తీసేసింది.
చివరికి - అప్పగింతలు. అప్పటిదాకా ఫోటోలు తీస్తున్న బదరి ఫ్రెండ్ సాయి "నేను అప్పగింతలు చూడలేను - ఫోటోలు తియ్యను" అని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు.
అమ్మ, నాన్న - వెండిపళ్ళెంలో పోసిన పాలలో నా చేతులు ముంచి - వాళ్ళ చేతులకి ఆ పాలు అద్దిస్తూ - మా అత్తగారికి, మరిదికి, ఆడపడుచుకి - అప్పగించారు. నాకెదురుగా నించున్న మా జ్యోతిపిన్ని ఏడుపు ఆపుకోలేకపోతోంది. పప్పి, కుట్టి ఏడుపు ఆపుకుంటూ ముక్కు పీలుస్తున్నారు. నాకూ బోల్డు ఏడుపొచ్చింది. ఎందుకో తెలీదు - కానీ ఏడుపొచ్చింది. ఏడుస్తున్న నన్ను దగ్గరగా తీసుకుని - "మా లల్లి చాలా సున్నితం. మీకప్పగిస్తున్నాను. మీ పిల్లలాగే చూసుకోండి" అంటూ మా అమ్మ మా అత్తగారితో అంటూ - ఆవిడ "ఇక మీ అమ్మాయేంటి, వదినగారూ!--- మా అమ్మాయే!" అంటుంటే - ఆవిడ పక్కనే నించున్న మా ఆడపడుచు తులసి "మా వదినని అచ్చు మీలాగే చూసుకుంటాము ఆంటీ!" అంది. తను అలా అంటూ ఉండగా విన్న నాకు తను ఒక మంచి ఫ్రెండులా అనిపించింది. ఆ మాటకి అమ్మకి కూడా హాయిగా అనిపించిందో ఏమో - తేటగా నవ్వుతూ - మా మరిది కేసి చూసి - "లల్లీ! లక్ష్మణస్వామి లాంటి మరిది నీకు" అనగానే మా విజయ్ కళ్ళలో తళుక్కుమన్న ఆనందం నాకు నా రేపటి రోజుకి వెలుగుగా కనిపించింది.
అప్పగింతలు అవగానే పెద్దలందరికీ దండాలు పెట్టాము - బదరి, నేను.
అన్నట్టు - మా పెళ్ళిలో విశేషం - మా ఇద్దరి కళ్ళల్లో మెరిసిన నక్షత్రాలు అరుంధతిని మరిపించేట్లున్నాయి కాబోలు - మాకు అరుంధతీ నక్షత్రాన్ని చూపెట్టలేదు.
మా పెళ్ళిలో ఇంకో విశేషం - అసలు బాబి ఈ పెళ్లెలా చేస్తాడా? వంకలేమి వెతుకుదామా? - అని బస్సులెక్కి వచ్చిన వాళ్ళందరూ "అబ్బా! ఏం చేశాడు బాబీ వాళ్ళ పెద్దపిల్ల పెళ్ళి! మాకు హోటల్లో ఏసీ రూములు ఏర్పాటు చేశాడు. బెల్లు నొక్కితే చాలు ఒక బోయ్ రావడం - ఏది కావాలంటే అది అమర్చడం. అబ్బబ్బబ్బా! మహ బాగా చేశాడులే!" అని చెప్పుకునేలా చెయ్యగలగడం మా నాన్నకే చెల్లింది. అందులో సగం మెప్పు ఆయన వెనకాల ఉన్న మా అమ్మకి చెందుతుంది.
ఇప్పటికి - ఇక్కడ - ఈ రాతలో ... ఇక్కడికి... ఇలా... ఆపుతున్నట్టనిపించినా - ఈ రాతకి ఆవల ఎప్పుడూ జరుగుతుండే 'త్వామనురజామి' కి ఒక చిన్న కామా పెడుతూ... ఆ విరామ వ్యవధిలో ఒక చిన్న మేలి-కబురు, ఆ కబురుతో పాటు ఓ మంచి పాట ....
కొంగుముడి చాలదన్నట్టు చిటికెనవేలు మెలికతో కట్టేసుకున్నానని - నా బంగరుబొమ్మవు నీవని ఒట్టేసుకున్నానని ఒదిలేదిక లేదని - పొంకాలుచూపుతున్న అబ్బాయిగా బదరి ...
మా యిద్దరి చుట్టూ చేరిన స్నేహితులు, సన్నిహితులు - పలకరింపులు - చిరునవ్వులు; ఛలోక్తులు - పకపకలు
ఉక్కిరిబిక్కిరయ్యే హడావిడి - ఊపిరాడనివ్వని సందడి.
అలసిన అక్కని కనుసన్నల చల్లగా చూడమని - సన్నగా - బావగారికి పన్నీరు జల్లవచ్చిన చిట్టిమరదళ్ళు - ఈ అక్కకు చెల్లెళ్ళు - నా పక్కన చేరారు.
మాలో చిన్నది - పాటలాధరాల పాటలనెప్పుడూ మోసే రాగాల పల్లకి - పాటే శ్వాసైన నయగారాల వల్లకి .
ఎప్పుడైనా ఎవరైనా పాట పాడమంటే - "కోయిలను నేను - పాడమన్నప్పుడల్లా పాడను - నాకు పాడాలనిపించి నే పాడితే మీరు వినండి" - అని మాటలతో దబాయించే చిలిపితనపు కలికి.
బావగారి నోట నుంచి విన్న మొదటి కోరిక "నువ్వు బాగా పాడతావని మీ అక్క చెప్పింది - ఒక్క పాట పాడవా? " అంటూ.
వెంటనే గొంతు సవరించుకుని ఆ ఫాల్గుణ మాసపు మధ్యాహ్నాన - చిగురాకు-మేతరిని మావికొమ్మల వూగ రమ్మని పిలుస్తూ - తాను నేర్చిన ఓ పాట పాడింది మా ఇంటి కోయిల - విన్న బావగారి గుండెలో ఆ నవనీతగీతి మరపురాని మైమరపు-గీతి కాగా.
ఎప్పటికైనా వస్తుందిలే అనుకున్న ఆ రోజు
ఇదిగో - వచ్చేవచ్చేనంటూ ఇప్పుడయ్యింది
కలగన్న ఆ ఘడియ గడప కావల నిలిచి
అదిగో - నీ కలల గడప తొక్కే ఘడియ ఇల్లిక్కడన్నది...

అదండి ... మా కథ!
మా కథలో అసలు నాయికా-నాయకులు - ఎవరేమనుకున్నా మన పిల్లల ఇష్టాల్ని మన్నించడమే మిన్న అనుకుని, మాకు వెన్నుదన్నుగా నిలబడి మా పెళ్ళి చేసిన - మా అమ్మా-నాన్నలు, మా అత్తగారు.
ఇక
మేమిద్దరం ఒకరికొకరం
తనో సగం - నేనో సగం
ఒకరికొకరం మేలి-సగం !
ఇప్పటికి - ఇక్కడ - ఈ రాతలో ... ఇక్కడికి... ఇలా... ఆపుతున్నట్టనిపించినా - ఈ రాతకి ఆవల ఎప్పుడూ జరుగుతుండే 'త్వామనురజామి' కి ఒక చిన్న కామా పెడుతూ... ఆ విరామ వ్యవధిలో ఒక చిన్న మేలి-కబురు, ఆ కబురుతో పాటు ఓ మంచి పాట ....
ఎర్రంచు తెల్ల మధుపర్కాలు - పసుపుతాడు తోడు, నల్లపూసల పేరు సౌరు.
కంఠాన మెరుస్తున్న చమ్కీపూల కర్పూరదండలు - కంటి చివరన తళుకంటించుకున్న నీటిముత్యాలు.
లాజహోమంలో వేడెక్కిన చేతులు మండుతున్నాయని వంకే గానీ - పాల నరచేయి ముంచి అమ్మ పెట్టిన అప్పగింతల తాలూకు బెంగేమీ లేదని - బింకాలు పోతున్న అమ్మాయిగా నేను ...
కొంగుముడి చాలదన్నట్టు చిటికెనవేలు మెలికతో కట్టేసుకున్నానని - నా బంగరుబొమ్మవు నీవని ఒట్టేసుకున్నానని ఒదిలేదిక లేదని - పొంకాలుచూపుతున్న అబ్బాయిగా బదరి ...
మా యిద్దరి చుట్టూ చేరిన స్నేహితులు, సన్నిహితులు - పలకరింపులు - చిరునవ్వులు; ఛలోక్తులు - పకపకలు
ఉక్కిరిబిక్కిరయ్యే హడావిడి - ఊపిరాడనివ్వని సందడి.
అలసిన అక్కని కనుసన్నల చల్లగా చూడమని - సన్నగా - బావగారికి పన్నీరు జల్లవచ్చిన చిట్టిమరదళ్ళు - ఈ అక్కకు చెల్లెళ్ళు - నా పక్కన చేరారు.
మాలో చిన్నది - పాటలాధరాల పాటలనెప్పుడూ మోసే రాగాల పల్లకి - పాటే శ్వాసైన నయగారాల వల్లకి .
ఎప్పుడైనా ఎవరైనా పాట పాడమంటే - "కోయిలను నేను - పాడమన్నప్పుడల్లా పాడను - నాకు పాడాలనిపించి నే పాడితే మీరు వినండి" - అని మాటలతో దబాయించే చిలిపితనపు కలికి.
బావగారి నోట నుంచి విన్న మొదటి కోరిక "నువ్వు బాగా పాడతావని మీ అక్క చెప్పింది - ఒక్క పాట పాడవా? " అంటూ.
వెంటనే గొంతు సవరించుకుని ఆ ఫాల్గుణ మాసపు మధ్యాహ్నాన - చిగురాకు-మేతరిని మావికొమ్మల వూగ రమ్మని పిలుస్తూ - తాను నేర్చిన ఓ పాట పాడింది మా ఇంటి కోయిల - విన్న బావగారి గుండెలో ఆ నవనీతగీతి మరపురాని మైమరపు-గీతి కాగా.
ఆ రోజు విన్న ఆ పాట - ఈ పూట మా నాన్న పాడగా... మా నాన్న గొంతులో
<<... మళ్ళీ 19 కి ఇంకొన్నీ మాత్రమే మిగిలాయి కబుర్లు >>
Adiicted to this series..
రిప్లయితొలగించండిసిరీస్ అయిపోవచ్చిందండి, మోహనా! Thanks for your comment!
తొలగించండిThe beauty of your writings is your true and complete experience behind each word.
రిప్లయితొలగించండిWhen you write you RE LIVE that experience and simply tell everyone about it.
Makes me experience it as well.
Just superb!!
Thank you for your nice words about my blog!
తొలగించండి>>>> ఓ చిన్న లారీ లాంటి దాంట్లోంచి చిన్నచిన్న పంజరాలు దింపుతున్నారు. అందులోంచి బుజ్జిబుజ్జి కుందేళ్లు, తెలతెల్లని పావురాలు, చిగురాకుపచ్చ చిలకలు కనిపిస్తున్నాయి.>>>>
రిప్లయితొలగించండిఇవి ఎందుకో చెప్పలేదు ?
భలే గుర్తుపెట్టుకుని పూస గుచ్చినట్లు చెప్పారు.👏👏👏
పూసలు గుచ్చడం దాదాపుగా అయిపోయిందండి, నీహారికా :)
తొలగించండిThanks for your comment!
మీరడిగిన దానికి చిన్న వివరణ చేర్చాను.
"ఓ పక్కగా ఎవరో నలుగురు ఓ చిన్న లారీ లాంటి దాంట్లోంచి చిన్నచిన్న పంజరాలు దింపుతున్నారు. అందులోంచి బుజ్జిబుజ్జి కుందేళ్లు, తెలతెల్లని పావురాలు, చిగురాకుపచ్చ చిలకలు కనిపిస్తున్నాయి. పక్కనే బుల్లిబుల్లి వాటర్ ఫౌంటెన్స్ కూడా ఉన్నాయి.
వాటిని చూడగానే - అంతకు ముందు రాత్రి నాన్న అమ్మతో చెప్తుండగా నేను ఆ పక్కనే పడుకుని విన్నది గుర్తుకొచ్చింది - ఆ డెకరేషన్ సాంబశివరావుగారెవరో నాన్నతో 'సార్! పాప పెళ్ళికి నేనే చెయ్యాలండి డెకరేషన్ - చిలకలు, పావురాళ్ళు, కుందేళ్ళు అన్నీ పట్టుకొస్తాను' చెప్పారట - అయన చెప్పినట్టే అవన్నీ తెచ్చేసినట్టున్నారు అనుకున్నాను."
మీ పెళ్ళికి మేమంతా వచ్చి, మండపంలో జరిగే పెళ్లిని చూసినట్లే ఉంది. ప్రతి ఒక్క అనుభూతిని చదివేవారు కూడా మనసారా ఆస్వాదించేలా రాయడం మీకే చెల్లు. చాలా బాగుంది లలిత.
రిప్లయితొలగించండిబోల్డన్ని థాంక్స్, ఇంద్రాణీ!
తొలగించండిలల్లీ పెళ్లి గురించి ఎంత బాగా రాసావు . పెళ్లి తతంగం అంతా ఇంచు , ఇంచు అంతా మరచి పోకుండా చాలా బాగా రాసావు . ఎన్ని సంవత్సరాలు అయ్యింది పెళ్లి జరిగి . నిన్ను చేసుకున్న బదరి ( మా అబ్బాయి ) చాలా అదృష్టవంతుడు . మల్లెపువ్వులు పూజ చేసి ఉంటారు . మేము నీ పెళ్ళికి రాకపోయినా పెళ్లి అంతా మా కళ్ళ ముందర ఉంచావు . పెళ్లి చూస్తున్నట్లే వుంది . పెళ్లి బాగా జరిగింది .ఆఖరున అత్తగారిని , అమ్మని ఒకేలా చూడడం నాకు చాలా బాగా నచ్చింది . మనస్సుకు హత్తుకు పోయింది. నువ్వు చాలా గ్రేట్ అండ్ సూపర్ . - లక్ష్మత్త
రిప్లయితొలగించండిమీ అభిమానం లక్ష్మత్తా! మీ మెప్పుకి బోల్డన్ని థాంక్స్!
తొలగించండిఅసలుని మించిన కొసరు
రిప్లయితొలగించండికొసరు కోసం అల్లిన అసలు
అసలులో కలిసిపోయిన కొసరు
కొసరులో ఒదిగిపోయి పరిమళించిన అసలు
కొసరు చెప్పినట్టు కోయిల తోడుగా ఉంటుంది కదా...
మొత్తం వేసవే ఐపోతే బావుంటుంది.
మీరన్నట్టే...కోయిల తోడు అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది... ఆ కోయిల తోడు!!! ఏ కాలమైనా నాకు వేసవే!
తొలగించండికళ్యాణవైభోగమే..అంత అందంగా జరిగిన వేడుకని ఎంతందంగా చెప్పారో...లైవ్ టెలికాస్ట్ ఇచ్చేసారు
రిప్లయితొలగించండినేను రాసిన వేడుక గురించి చదివి ఎంత మంచి మాటన్నారో! థాంక్స్ శ్రీనివాస్ గారు!
తొలగించండి