కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 48 - నాకు దక్కినట్టి - నవ్వులన్ని జ్ఞాపకం!
అదేంటో - కదలదేంటో అనుకున్నప్పుడు కాలినడకలా గడిచే కాలం, కాసేపిలా ఉండనీలే అనిపించినప్పుడు వరదగోదారిలా వడివడిగా పరిగెడుతుంది.
నిజ్జంగా... అప్పటిదాకా బదరితో పెళ్ళవ్వాలని ఎంత అనుకున్నానో, తీరా పెళ్ళి ఇంకొన్ని రోజుల్లో అనగా ఆ కొన్ని రోజులూ సాగి - ఒక్కోరోజు ఇరవై నాలుగుగంటల కన్నా - పొడుగ్గా ఉంటే బావుండుననీ అనుకున్నాను.
నేననుకున్నానని ఆగి, ఉన్నచోట నిలిచి నాతో ఉండిపోవడానికి టైము నా చేతికి కట్టుకున్న వాచీ కాదుగా!
పగలూ-రాత్రీ చెట్టపట్టాలు వేసుకుని పట్టపగ్గాల్లేకుండా పరిగెట్టేశాయి.
ఇంట్లో - ఎంతెంతో కావాల్సినవాళ్ళూ, ఎక్కడెక్కడినించో రావాల్సినవాళ్ళూ - ఒక్కొక్కరుగా బస్సులు, రైళ్ళూ దిగి వస్తూ ఉంటే - పలకరింపులతో, పకపక నవ్వులతో - సందడి ఇంతింతై... అంతంతై ... నవ్వులతో నాలుగింతలై ... పలుకులతో పదింతలైంది.
అనాతవరం నుంచి అప్ప, లలిత దొడ్డ, కొత్త జంట ప్రసాద్-అరుణ వచ్చారు. అప్ప-దొడ్డ వాళ్ళు వచ్చేటప్పుడు మధుపర్కాలు, అమలాపురం భేరు దగ్గర చేయించిన మంగళసూత్రాలు, వెండి చుట్లు, పెళ్ళికొడుక్కి వెండి ఉత్తర జంధ్యాలు పట్టుకొచ్చారట - "అట" అని అనడమెందుకంటే అవేవీ నేను చూడకూడదని నాకు చూపెట్టలేదు మరి! అప్ప వాళ్ళతో పాటే సోమేశ్వరరావు తాతగారు (విస్సు బాబాయి వాళ్ళ నాన్నగారు) కూడా వచ్చారు. చిలకలూరిపేట నుంచి రవి-శారద, బెంగుళూరు నుంచి శ్రీను-శ్యామల, వరంగల్ నుంచి బాబు వచ్చారు. వైజాగ్ నుంచి లలితత్తయ్య వచ్చారు.
శివకోడు నుంచి చెల్లాయత్త ఒక్కరే వచ్చారు. శివకోడులో వాళ్ళ దగ్గర చదువుకుంటున్న తంబి మామయ్య పిల్లలు కృష్ణ, చైతన్యలకి పరీక్షలని చెప్పి ప్రసాద్ మామయ్య రానేలేదు. చెల్లాయత్త వస్తూ గంధం చెక్క, గుమ్మడిపండు, ముచిక ఉన్న కొబ్బరిబొండం, పీచు తీయించిన కొబ్బరికాయలు, ఆడించిన అటుకులు, కూర అరటికాయలు, మామిడికాయలు - ఇలా బోల్డన్ని పట్టుకొచ్చారు.
హైదరాబాదు నుంచి సాంబశివరావు పెదనాన్న, ప్రభావతి దొడ్డ - చిన్నపాప్పిన్ని - ప్రసాద్ బాబయ్య-జ్యోతి పిన్ని, వాళ్ళ పిల్లలు పండు, పవన్ - పాపాయత్తయ్య గారి రామం, జయాంటీ - కాకినాడ నుంచి సాయక్క-వరదరాజు బావగారు, వాళ్ళ పాప హర్షద - వచ్చారు. హర్షద, ప్రశాంతి ఇద్దరికీ అమ్మ - గులాబీ రంగు, నీలం రంగుల్లో - ఒకే లాంటి గౌన్లు కొంది.
అన్నట్టు - ఇలా అందరూ వచ్చి ఇంట్లో ఉన్న సమయంలో నాకు మా ఇంటి పక్కనున్న రమణకుమారి ఫోన్ చేసింది. తనతో మాట్లాడుతుంటే - ఆక్కడే ఉన్న మా అమ్మని మా చెల్లాయత్త నెమ్మదిగా అడుగుతున్నారు "అబ్బాయి నుంచా ఫోనూ?" అంటూ. ఆవిడకి మా అమ్మ "పెళ్ళి కుదిరిన దగ్గర్నుంచి వాళ్ళిద్దరూ అసలు మాట్లాడుకోలేదు. ఇక పెళ్ళయ్యాకే ఏ మాటలైనా" అని భలే గొప్పగా చెప్పింది. నాకు మా అమ్మని చూస్తే - ఆవిడకి కష్టంగా అనిపిస్తున్నా - నా ఇష్టం తీరుస్తూనే అందులోనే ఆవిడ ఇష్టాన్ని వెతుక్కుంటోంది అనిపించింది.
ఆ రోజు మార్చ్ 10. పొద్దున్న ఏడింటిలోగా నాకు తలకు నూనె పెట్టి, పసుపు రాసి నన్ను పెళ్ళికూతుర్ని చేస్తామని చెప్పారు. అంతకు ముందు రోజు రాత్రే అపర్ణ నా దగ్గరికి వచ్చింది - పెళ్ళికూతుర్ని కాబోతున్న నా పక్కనే తను కూడా ఉండాలని.
లలిత దొడ్డ, లలితత్తయ్య, అమ్మ, చెల్లాయత్త, ప్రభావతి దొడ్డ ఒకరొకరుగా వచ్చి నాకు తలకు నూనె పెట్టి, చెంపలకి, చేతులకి పసుపు రాశారు. ఆ తర్వాత మామిడాకులు, పసుపుకొమ్ములు దారంలో వేసి కట్టిన చిన్న రోట్లో పసుపుకొమ్ములు వేసి రెండు రోకళ్ళు పట్టుకుని అందరూ ఇద్దరిద్దరుగా వచ్చి పసుపు దంచారు. ఆ తర్వాత నాకు హారతి ఇస్తున్నప్పుడు - మా ఇంటి కోకిల కుట్టి "క్షీరాబ్ధి కన్యకకు ... శ్రీ మహాలక్ష్మికిని... నీరజాలయకును ... నీరాజనం" అంటూ రాగాలు తీసింది.
నలుగు స్నానం కాగానే అమ్మ ముందే తీసుంచిన పాలపిట్టరంగుకి ముదురునీలం రంగంచు ఉండి, సన్న గీతల - పెద్దగళ్ళ పట్టుచీర కట్టుకుని, జడ వేసుకుని వచ్చాను. పప్పిని తోడపెళ్ళికూతురుగా కూర్చోబెట్టారు.
అప్పుడు చెల్లాయత్త నా నుదుటన కుంకంతో నామం పెట్టి, పాదాలకి పసుపు రాసి, దానిమీద పసుపులో సున్నం కలిపి ఎఱ్ఱబరచిన పారాణి పెట్టారు. ఆ పారాణి మీదుగా తెల్లగా మెరుస్తున్న కొత్త వెండి పట్టీలు పెట్టారు. పప్పీకి కూడా నామం, పారాణి పెట్టారు అత్త. ఇది జరుగుతున్నంతసేపూ అపర్ణ నాతోనే ఉండి, అంతా అయ్యాక తాంబూలం తీసుకుని ఇంటికి వెళ్ళింది.
పప్పిని తోడపెళ్ళికూతురుగా కూర్చోపెట్టినప్పుడు కట్టుకోవడానికి - దానికి ఆకుపచ్చ మీద తెల్లపూలు ఉన్న షిఫాన్ చీర కొంది అమ్మ. ఆ చీర కట్టుకుందని ఆ రోజంతా కుట్టి, నేను పప్పిని పూలచెట్టులా ఉందని ఆట పట్టించాము. పప్పీ ఏమో దాని చీర మీదున్న పూల కన్నా తెల్లగా - దాని మార్కు నవ్వోటి నవ్వి ఊర్కుంది.
పెళ్ళి ఫోటోలు తియ్యడం కోసం కుదుర్చుకున్న ఫోటోగ్రాఫర్ అక్కడే ఉండి అందరిలో ఉన్న నాకు, పప్పికి - మాతో ఉన్న వాళ్ళందరితో కలిపి బోల్డు ఫోటోలు తీశాడు. అవన్నీ అయ్యాక మళ్ళీ నన్ను విడిగా ఒక్కదాన్నే నించోమని, కూర్చోమని, పక్కకి చూడమని, పైకి చూడమని అంటూ మళ్ళీ బోల్డు ఫోటోలు తీశాడు. నాకెందుకో భలే మొహమాటంగా అనిపించి వద్దని విసుక్కున్నా ఎవరూ వినలేదు. ఇంకేం చేస్తాను? ఈ ఒక్కసారికే అనుకుంటూ అన్ని ఫొటోలూ కుయ్-కయ్ అనకుండా తీయించుకున్నాను.
(అన్నట్టు ... నన్ను పెళ్ళికూతుర్ని చేసిన మా ఇంటి మధ్య గదిలో - నేను కూర్చున్న పీటకి - వెనకాల గోడ మీద నేనెంతో ఇష్టంగా వినే La-La-Rasputin పాటల Boney M గ్రూప్ వాళ్ళ పోస్టర్ ఉంది. ముందు అమ్మ ఆ పోస్టర్ తీసెయ్యమని చెప్పింది నాకు.
అదెప్పుడో డిగ్రీ చదివేటప్పుడు ఏదో magazine లో సెంటర్ స్ప్రెడ్ లా వేస్తే దాన్ని చింపి ఆక్కడ అతికించుకున్నా. దాన్ని అమ్మ పెళ్ళి ఫొటోల్లో బావుండదు తీసెయ్యమంటే - నోటితో కాదనలేక, కళ్ళనీళ్ళు నింపుకోబొయ్యానని - మళ్ళీ అమ్మే ఏమనుకుందో - పాపం... ఆ పోస్టర్ని అలాగే ఉండనిచ్చింది.
బెంగుళూరుకి ఫిబ్రవరి 16న ఫోన్ చేసి నాన్న 'లల్లీ! నీ పెళ్ళికి ముహూర్తం పెట్టించాను' అని చెప్పిన తర్వాత నేనసలు నోరు విప్పి 'నాకిది బావుంది, ఇది బాలేదు' అని దేని గురించీ చెప్పలేదు. నా కోసం వాళ్ళు తరతరాలుగా నమ్మిన దారిని పక్కకి పెట్టి, అగ్రహారపు కట్టుబాటుకి ఎదురెళ్ళి - నేను నోరు తెరిచి 'నా పెళ్ళి ఎప్పటికైనా బదరితో మీరే చెయ్యాలి' - అనడిగానని - నా పెళ్ళిని నేను ఊహించలేనంత గొప్పగా చేస్తున్న అమ్మా-నాన్నలని ఇంకేమీ అడక్కూడదని, ఇంకే విషయంలోనూ ఇబ్బంది ఎప్పటికీ ఇబ్బంది పెట్టకూడదని అప్పుడే అనేసుకున్నాను.
ఇప్పుడు Boney M పోస్టర్ ఉంచడం, తీసేయడం చాలాచాలా చిన్న విషయం అయుండొచ్చు - కానీ మా అమ్మ అక్కడ కూడా నన్ను అర్థం చేసుకుంది - నన్నూ, నా ఇష్టాన్ని మన్నించింది.)
ఇంతలో ఇంట్లో పెద్దవాళ్ళందరూ - అప్ప, దొడ్డ, అమ్మ, నాన్న, లలితత్తయ్య, చెల్లాయత్త, రవి, శారద, శ్రీను, శ్యామల, ప్రసాద్, అరుణ - అందరూ బదరి వాళ్ళింటికి వెళ్ళారు. ఎందుకంటే తననీ ఆ తెల్లవారుఝామునే పెళ్ళికొడుకుని చేశారు. పైగా తనకి ఉపనయనం, స్నాతకం కూడా అప్పుడే. అందరూ అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుని భోజనాలు కాగానే ఇంటికొచ్చారు.
ఇక్కడ మా ఇంట్లో ఆ రోజు సాయంత్రం అంకురార్పణ. నేను ఉపవాసం ఉండాలని చెప్పి - మరీ ఏమీ తినకుండా ఉండలేనని - తినమని పూరీ పెట్టారు. కానీ నాకు ఏంటో తెలీని గాబరా. అస్సలేమీ తినాలనిపించలేదు. నేనేమీ తిననన్నానని అమ్మ నాకు హార్లిక్స్ పాలల్లో కలిపిచ్చింది.
మధ్యాహ్నం నేను, పప్పి, కుట్టి, ప్రశాంతి, తంబి మామయ్య అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వున్నాము. రెండున్నర అయిందేమో అప్పుడు - బదరి ఫ్రెండ్ CK (చెన్నకేశవరెడ్డిని CK అని పిలిచేవాళ్ళం) మరుసటి రోజు పొద్దున్నే బదరి వాళ్ళ ఇంటి దగ్గరికి సన్నాయి మేళం పంపించమని చెప్పడానికి వచ్చారు.
వచ్చిన పని పూర్తయి వెళ్తున్న CK ని గేటు దాకా సాగనంపడానికి వెళ్ళిన తంబి మామయ్య చేతికి నాకు బదరి ఇమ్మని చెప్పారని చెప్పి ఒక చిన్న కాయితం ఇచ్చి వెళ్ళారు. మా తంబి మామయ్య అది తెచ్చి నా చేతికి ఇచ్చాడు. అది చూడగానే మా కుట్టెమ్మ "బావగారు ఏదో పేపర్-సందేశం పంపించారు. గట్టిగా చదవ్వే లల్లెమ్మా!" అంది. అదలా అంటూ ఉండగానే ఆ పేపర్ మడతలు విప్పాను. అందులో ఉన్నదేంటీ అంటే ... "యే జిందగీ ఉసీ కీ హై ... జో ఉసీ కా హో గయా..." అన్న ఒక్క లైను. అది మేము పరిచయమైన కొత్తలో - తనని విసిగించడానికి నేనెప్పుడూ పాడుతూ ఉండిన అనార్కలి సినిమా పాట - కొంచెం మార్పుతో (యే జిందగీ ఉసీ కీ హై ... జో కిసీ కా హో గయా....).
అది చదవగానే మళ్ళీ ఆ రోజులన్నీ - తనని మూగబ్బాయి అనుకుని కూడా ఇష్టపడడం, తను మాట్లాడగానే అదేదో మాయేమో అని భయపడిన క్షణం, ఆ తర్వాత యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అలిపిరి దాకా రోజూ నడిచిన నడకలు, మా ఇంటి దగ్గర కిరాణా షాప్ సుబ్బారావు మా గురించి అమ్మకు చెప్పి మాకు చేసి పెట్టిన "మాటసాయం", ఆ తర్వాత జరిగినవి అన్నీ - ఒక్కసారి గుర్తొచ్చాయి. నవ్వు కూడా వచ్చింది.
అలా ఆ పేపర్ చూసి నవ్వుకుంటూనే - అందులో ఏముందా అనేసుకుంటున్న కుట్టి చేతిలో పెట్టాను. అది కూడా అది చదివి - "బానే ఉంది... ఇక మీ ఇద్దరూ మాటలు మానేసి పాటలతో మాట్లాడుకుంటారా ఏంటి?" అని అది కూడా నవ్వేసింది.
ఇంతలో మెల్లిగా సాయంత్రం అయ్యింది. మా ఇంటి పెద్ద గురువుగారు మరువాడ మహదేవుడుగారి అబ్బాయి మరువాడ వెంకన్న గారు నా పెళ్ళికి పౌరోహిత్యం చేయడానికి అమలాపురం నుంచి వచ్చారు. పొద్దున్న బదరి ఒడుగు, స్నాతకం ఆయనే చేయించారు.
ఇంతలో - ఇంత పెద్దపెద్ద లైట్లు, వీడియో కెమెరా పుచ్చుకుని, పొద్దున్నొచ్చిన ఫోటో / వీడియో-గ్రాఫర్ కూడా వచ్చాడు.
అంకురార్పణ కోసమని చెల్లాయత్త పొద్దున్న పెళ్ళికూతుర్ని చేసినప్పటి పాలపిట్టరంగు చీరనే నాకు గోచీ పోసి చీర కట్టి, కుడి పక్క పమిట వేశారు.
అమ్మ, నాన్నల పక్కన నేను కూర్చుని ఉండగా - ఇంటికి పెద్దైన సోమేశ్వరరావు తాతగారు, అప్ప, లలిత దొడ్డ, లలితత్తయ్య, చెల్లాయత్త, లక్ష్మి దొడ్డ, ప్రభావతి దొడ్డ, సాంబశివరావు పెదనాన్న, చిన్నపాప్పిన్ని, జ్యోతి పిన్ని, ప్రసాద్ బాబయ్య, తంబి మామయ్య "మా లల్లెమ్మ పెళ్ళికూతురయ్యింది: అంటూ కళ్ళ నిండుగా నన్ను చూసుకుంటూ, నోటి నిండుగా ఆశీర్వదిస్తుండగా, మా ఇంటి గురువుగారైన మరువాడ వెంకన్న గారు పుట్టమన్ను పోసిన పాలికల్లో నవధాన్యాలు వేసి నా పెళ్ళికి అంకురార్పణ చేశారు.
ఆ రోజు రాత్రి ఇంట్లో అందరి భోజనాలు, ఫలహారాలు, హడావిడి తగ్గింతర్వాత నాకు మళ్ళీ ఒక గ్లాసుడు పాలు కలిపిచ్చింది అమ్మ. పొద్దుట్నించీ జరుగుతున్న కార్యక్రమాలతో సందడిగా ఉన్న ఇల్లు, చుట్టూ ఉన్న అయినవాళ్ళతో ఎంతో సంతోషంగా అనిపిస్తున్నా - రేపొక్కరోజులోనే నా జీవితంలో - అదేంటో ఇదీ అని ఇంకా తెలీకపోయినా - ఏదో పెద్ద మార్పు రాబోతోందీ అన్న కలవరం కూడా వుంది నాలో.
అందులోనూ పొద్దున్నించీ ఉపవాసమేమో, కొంచెం నీరసంగా అనిపించి - నేను వెళ్ళి చివరగా ఉన్న బెడ్‌రూంలో పడుకున్నాను. ఇంతలో అక్కడ ఏదో సర్దడానికి వచ్చిన అమ్మ మంచం మీద పడుకుని ఉన్న నన్ను చూసి "పాపం! నలిగిపోయింది పొద్దున్నించీ... లలితాత్రిపురసుందరి అసలే ఏడు మల్లెలెత్తు" అని ఆవిడలో ఆవిడే అనుకుంటున్నట్టుగానో, మరి పక్కనెవరన్నా ఉన్నారేమో తెలీదు కానీ - నా పక్కనే కూర్చుని నా తల మీద నెమ్మదిగా జోకొడుతోంది. నాకు మెలకువ వచ్చింది కానీ కళ్ళు తెరిస్తే అమ్మ జోకొట్టటం మానేస్తుందని - ఆ క్షణాలు మళ్ళీమళ్ళీ నా జీవితంలో ఇంక రావేమో అన్నట్టుగా - ఆవిడ మాటలు వినిపిస్తున్నా కదలకుండా అలాగే పడుకుని ఉన్నాను.
అప్పుడే నాన్న కూడా వచ్చారు బెడ్‌రూం లోపలికి. వచ్చి మంచం మీద నా పక్కనే వాలారు. అప్పుడు వీలు కుదిరినట్టు ఉంది అమ్మా-నాన్నలిద్దరికీ పెళ్ళిపనులెలా జరుగుతున్నాయో తరచి చూసుకోవడానికి.
నాన్న చెప్తున్నారు అమ్మతో...
"అనుకున్నట్టుగా అన్నీ సమయానికి కుదిరిపోయాయి. సన్నాయి మేళానికి మన విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో వాయించే టీమొకటి ఉంది - వాళ్ళని కుదర్చమని పురమాయించాను.
బ్యాండుమేళం గురించి వాకబు చేస్తుంటే అరండల్ పేట CI - నా ఫ్రెండే 'కామేశ్వర్రావు గారూ... మా డిపార్టుమెంట్ బ్యాండ్ ఉంది' అన్నాడు.
నేనాయన్ని 'అదేంటండి? మీ డిపార్టుమెంటు బ్యాండు ఏదో దేశభక్తి కార్యక్రమాలకి కదా వాడేది?" అనడిగితే ఆయన 'లేదండి... మేము మామూలు ఫంక్షన్లకి కూడా పంపిస్తాము. కాకపోతే డబ్బులు ఛార్జ్ చేస్తాం' అని చెప్పాడు.
So, రేపు కళ్యాణమంటపానికి పోలీస్ బ్యాండ్ వస్తుంది.
నీగ్గుర్తుంది కదా ... మా లక్ష్మయ్యగారు చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ old students meet విజయకృష్ణా ఇంటర్నేషనల్‌లో జరిగినప్పుడు - అప్పుడు సినిమా యాక్టర్ బాలయ్య మా లక్ష్మయ్యగారి క్లాస్మేట్ -మనింటికి కూడా వచ్చాడు - గుర్తుందా? -అక్కడ డెకరేషన్ అంతా సాంబశివరావు అనే అతను చేశాడు.
అతనికి మన లల్లి పెళ్ళని తెలిసి 'సార్! పాప పెళ్ళికి నేనే చెయ్యాలండి డెకరేషన్ - చిలకలు, పావురాళ్ళు, కుందేళ్ళు అన్నీ పట్టుకొస్తాను - మీరస్సలు ఆలోచించకండి' అన్నాడు. అదంతా అతనే చూసుకుంటాడిక. అందులో మనమింకేమీ చూసుకోక్కర్లేదు.
ఇక పెళ్ళికి వచ్చే వాళ్ళ కోసం విజయకృష్ణా ఇంటర్నేషనల్‌లో రూములు బుక్ చేశాను.
వంటకి ఎలాగూ మన మూల శర్మ వాళ్ళు అమలాపురం నుంచి వచ్చారు.
అన్నట్టు మూల శర్మకి ' మా ఆఫీసు స్టాఫు, ముఠావాళ్ళు చాల మంది పెళ్ళికి వస్తారు. వాళ్ళకి మన కోనసీమ స్పెషల్స్ అన్నీ రుచి చూపించాలి. ఏం వండాలో నీకు నేను మెనూ కూడా ఇవ్వను. ఏం వండుతావో నీ ఇష్టం. ఎవ్వరైనా బాలేదు అంటే నీకిచ్చిన అడ్వాన్సుతో మాత్రం అమలాపురం వెళ్ళిపోతావు. భోజనం బావుంది అని అందరూ మెచ్చుకున్నారా - నీకు ఇస్తానన్న దానికి అంతకంతా ఇస్తాను' అని చెప్పాను.
అనాతవరం నుంచి ఊళ్ళో వాళ్ళు నేనీ వర్ణాంతరం పెళ్ళి ఎలా చేస్తానా అని చూడడానికి వస్తున్నారు. రానీ! వాళ్ళే చూస్తారు".
ఇలా అమ్మతో మాట్లాడుతూనే నాన్న నెమ్మదిగా గురక పెట్టడం మొదలు పెట్టారు - బాగా అలిసిపోయి వున్నారు. అమ్మ కూడా ఆయన చెప్పినవన్నీ వింటూ నా పక్కనే మంచం కింద తరగడ వేసుకుని పడుకుండి పోయింది.
నాకూ నిద్ర వస్తోంది... రేప్పొద్దున్నే నాలుగింటికి మంగళస్నానాలు అని చెప్పింది అమ్మ.
అప్పటి వరకు నాన్న మాట్లాడినవన్నీ కళ్ళు మూసుకుని వింటూ ఉన్న నాకు - నేనెంత అదృష్టవంతురాలినో - అని అప్పటికి లక్షోసారి అనిపించింది.
తమ మాట విన్న పిల్లలని అపురూపంగా ఎవరైనా చూస్తారు - వాళ్ళడిగినవన్నీ ఎలాగైనా తెచ్చివ్వాలని చూస్తారు.
కానీ - నా లాంటి అస్సలు మాట వినని పిల్ల కోసం - నేనేమీ అడక్కుండానే అన్నీ ఘనంగా అమర్చాలని మా అమ్మా-నాన్న పడుతున్న తాపత్రయం చూస్తుంటే - ఇటు వీళ్ళే కాదు - అటు బదరి ఇష్టాన్ని మన్నిస్తున్న నాక్కాబోయే అత్తగార్ని తలుచుకుంటూ ...

ఊపిరోసుకున్న తావనీ ... ఉసురందుకున్న వీడనీ
ఈ తావు ... ఈ వీడు ... వీడలేనని
వీలుకాని దిగులు మదిని కమ్మె నాకని
బేలనని, బెంగటిల్లినానని
జాలి చూపక - ఎందుకింత పరుగనీ
అడుగుదామని ఆగమన్నా... కాలాన్ని...
సాగుతున్న కాలమాగక...
ఆగక సాగుటే - తన ఉనికనీ
తను ఆగడమంటే ఆగడమేనని
ఏదేమైనా, తప్పని తన కదలిక కలకాలమని
తప్పేదే కాదని - కదిలింది కాలం
నా బెంగకు నన్నొదిలి ... తన మానాన్ని...

మాకై ... మారిన - పెద్దవాళ్ళకూ
మాకే ... ఇచ్చిన - ఆలంబనకు
నన్నూ... తననూ ... కన్న వాళ్ళకూ
నన్నూ... తననూ ... కన్న వాళ్ళకూ
మాకై వేచే... ముందునాళ్ళకూ
కోటి దండాలు... శతకోటి దండాలు..
మాకే ... ఇచ్చిన - ఆలంబనకు
నన్నూ... తననూ ... కన్న వాళ్ళకూ
నన్నూ... తననూ ... కన్న వాళ్ళకూ
మాకై వేచే... ముందునాళ్ళకూ
కోటి దండాలు... శతకోటి దండాలు..
అని పాడుకుంటూ నేనిక్కడ...
నే పాడుకుంటున్న పాటకు అసలు పాటేదో పట్టుకుని పాడుకుంటూ మీరూ ఇక్కడే...
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

ఊఊఊ మేమూ ఇక్కడే.. మీరు ఇంత కమ్మని కబుర్లు చెబుతూంటే ఎక్కడకి కదలాలనిపిస్తుంది చెప్పండి.. అందుకే 'పదహారేళ్ళకూ' పాట పాడుకుంటూ మళ్ళీ 19 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం.
రిప్లయితొలగించండినా కథలో మాటలు చదువుతూ, నా కథలో పాటలు పట్టుకుంటూ నన్నింత వెన్నంటి ఉన్న మీ ఆత్మీయతకి ధన్యవాదాలు!
తొలగించండిఇంకా ఫొటోలు ఉన్నాయేమో అని ఆశ పడ్డాను!
రిప్లయితొలగించండిగుల్జార్ సినిమాల్లో మంచి గజల్స్‌లా ఆ కవితలు...
మనసు మురిసే మాటలు...
ఆ మురిపెం అంతా కూర్చిన కవితలు..
రెండూ బావున్నాయి చాలా...
నా ఈ కథలో - మధ్యమధ్యలో రాసుకునే చిన్నిచిన్ని వెతలో, కవితలో - అవి నాకు చాలా ప్రియం. వాటిని మెచ్చుకున్న మీ మాటలు మరీ ప్రియం!
తొలగించండిబాగున్నాయండి మీ పెళ్లి ముచ్చట్లు. అంత వివరంగా ఎలా గుర్తు ఉంటాయో మీకు. ఆడవారి కందరికీ అని, నాకు ఆశ్చర్యమే.
రిప్లయితొలగించండిపెళ్లి ఫోటోలు అంటే మా పెళ్లి గుర్తుకు వస్తుంది. ఓ ఫోటోగ్రాఫర్ వచ్చాడు. నుంచుని, కూర్చుని,వంగొని, పడుక్కొని, టేబులు ఎక్కి మరీ తీసాడు. ఇటు తిరగమన్నాడు, అటు అన్నాడు. నవ్వమన్నాడు. నానా హింసా పెట్టాడు. డేవలప్ చేసేటప్పుడు ఏం చేసాడో తెలియదు కానీ అన్నీ నల్లగా మిగిలాయి. బంధు మిత్రులెవరో తీసినవి రెండు అతికష్టం మీద సంపాదించాను.
మీరు పెట్టిన ఫోటో చూస్తే గుర్తుకు వచ్చింది. ........... మహా
నా కబుర్లు చదువుతున్న మీకు మందహాసపూరిత మహామహా ధన్యవాదాలు!
తొలగించండివర్ణాంతరం చేసుకుని కూడా పెళ్ళికొడుకుకి స్నాతకం,ఉపనయనం చేయించారా ? మాకు అలా చేయరు....యే జిందగీ ఉసీ కీ హై ... జో ఉసీ కా హో గయా..అని ఊరికే అన్నారా ?
రిప్లయితొలగించండిఅంతే ...అంతేనండీ, నీహారికా - యే జిందగీ ఉసీ కీ హై ... జో ఉసీ కా హో గయా :)
తొలగించండిభద్రు రాలేదాండీ పెళ్ళికి ఎక్కడా పేరు రాయలేదు.శారదా, అరుణా అక్కాచెల్లెళ్ళే కదూ? ఇంతకీ మీ ఇంటి గురువుగారు మరువాడ వెంకన్న మా అన్నయ్యే(సొంత పిన్ని కొడుకు),అలా మీ పెళ్ళి మా ఇంటివాడి చేతులమీదుగా జరిపించారన్నమాట, శుభం
రిప్లయితొలగించండినా పెళ్ళి మార్చ్‌లో జరగడం వల్ల పిల్లల పరీక్షలు ఉన్నాయని చాలా మంది రాలేకపోయారు - అందుకే బద్రు కూడా రాలేకపోయింది. శారద, అరుణలు అక్కచెల్లెళ్ళేనండి - నాకు వదినలు వాళ్ళిద్దరూ. మరువాడ వెంకన్నగారు మీకు అన్నగారా? భలే!
తొలగించండిChaala baga chepparu. Meelo nannu choosukunnanu.
రిప్లయితొలగించండిమీరెవరో తెలిస్తే బావుండేది. Thanks for your comment!
తొలగించండిఇది చదివాక నా పెళ్ళి సమయంలో జరిగిన ప్రతీ చిన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని డైరీలో రాసుకున్నాను.చాలా కమ్మగా ఉన్నాయి లల్లమ్మా కబుర్లు.
రిప్లయితొలగించండిరాసుకోండి, చిత్రమ్మా! తరవాత చదువుకోవడానికి ఎంతో బావుంటాయి.
తొలగించండిబాగునాయి లలితా మీ పెళ్ళి కబుర్లు.
రిప్లయితొలగించండిచాలా థాంక్స్ అండి, మాలాకుమార్ గారు!
తొలగించండి