కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 19 - కాకినాడ రేవులో ఓడెక్కి ... తుఫాను అలలలో ఊగామే!
నేను 79-80ల్లో కాకినాడ వెళ్ళేటప్పటికి - కాకినాడలో అప్పటికి నా పాత స్నేహితులు, క్లాస్‌మేట్స్ కొందరుండేవారు.
మొదటగా - పోతుల ఆనందరావని చెప్పేసి నా హైస్కూల్‌మేటు. మేమిద్దరం స్కూల్లో బేస్‌బాల్ ఆడుతుండేవాళ్ళం అప్పుడు. మా స్కూల్ బేస్‌బాల్ టీము చాలా మంచి టీం. అందులో నేను, ఈ పోతుల ఆనందరావు, రాగిడి నాగేశ్వరరావు, కొల్లు వాడు మేమందరం ఆడేవాళ్ళం. మాకు అమలాపురం కాలేజీ, ముమ్మిడివరం కాలేజీల మీద పోటీ ఉండేది. ఎప్పుడూ వాళ్ళ మీద గెలుస్తూనే ఉండేవాళ్ళం మేము. ఆ పోతుల ఆనందరావు ఎస్సెల్సీతో ఆపేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI) లో చేరాడు. వాడు కాకినాడలోనే ఉండేవాడు.
అలాగే సరస్వతుల నర్సింహారావు అనేవాడు నాకు కాలేజ్ మేటు. వాడేంటంటే సేల్స్ టాక్స్ దాంట్లో పని చేసేవాడు. వాడు జగన్నాథ పురం చెక్ పోస్టులో ఉండేవాడు. వాడో ఫ్రెండు.
తర్వాత మూడోవాడు కూచిమంచి రమణ అని చెప్పి నాకు సీనియర్. వీడిదో ఎపిసోడు.
ఈ కూచిమంచి రమణ ఏంటంటే వాడు మంచి సింగర్. నాకు తెలీదా విషయం. కాలేజీ పోటీల్లో వార్షికోత్సవాలు జరిగినప్పుడు నేను పాటల పోటీల్లో పాడుతూ ఉండేవాణ్ణి. సాధారణంగా గుండమ్మ కథలో "లేచింది మహిళాలోకం" ఇలాంటి పాటలు పాడుతూ ఉండేవాణ్ణి.
ఆరోజు ఏం చేశానంటే - మా ఫ్రెండ్స్ అందరూ "ఒరే! అమరశిల్పి జక్కనలో "ఈ నల్లని రాలలో" పాట పాడమన్నారని ఆ పాట పాడా. విన్నవాళ్ళందరూ "బావుంది, బావుంది" అని బానే చప్పట్లు కొట్టారు. మరుసటి రోజు ఈ కూచిమంచి రమణ అదే పాట పాడాడు. అద్భుతం! అసలు ఘంటసాలని దించేశాడు. నేను ప్రేక్షకుల్లో కూర్చున్నవాణ్ణి లేచెళ్లి వాడికి దండం పెట్టి "నేనీ పాటని పాడనింక స్టేజ్ మీద" అని చెప్పాను వాడికి. వాడు కూడా నాతో "నువ్వు కూడా ఎంచగ్గా పాడావు" అన్నాడు. అప్పుడు నేను "నీలా పాడలేకపోయాన్నేను. అసలు నువ్విలా పాడతావు అని తెలిస్తే నేనసలు పాడేవాణ్ణి కాదు." అన్నాను. నాకు ప్రైజ్ రాదని నాకు తెలిసిపోయింది. నేను దాన్ని స్పోర్టివ్ గానే తీసుకున్నాను.
అప్పుడు సుబ్బరాజుగారని మా ప్రిన్సిపాల్ గారు నాకన్నా ఎక్కువ బాధ పడిపోయారు నాకు ప్రైజ్ రాలేదని. అంతకు ముందు రెండేళ్ళూ మొదటి బహుమతి నాదే. ఈ మాటు అయన నా దగ్గరికొచ్చి "నీకింకో అవకాశం ఇస్తున్నాను, ఇంకో పాట పాడు" అనంటే అప్పడు నేను "నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో" అని పాడేశాను. దాంతో కూచిమంచి రమణతో పాటు నాకూ ఓ ప్రైజ్ ఇచ్చేశారు మా ప్రిన్సిపాలు గారు.
ఆ కూచిమంచి రమణ - కాకినాడ పోర్టులో క్లర్కుగా పని చేసేవాడు.
తర్వాత నా క్లాసుమేటు ఆర్వీ రావు అని ఇంకొకడు. ఈ ఆర్వీ రావు వాళ్ళ నాన్నగారు ఇంజినీర్. వీడు పీయూసీ ఒకటే చదివాడు అమలాపురంలో. అప్పుడు ఫైన్ ఆర్ట్స్ లో సెక్రటరీ పోస్టుకి ఎలక్షన్ వస్తే వాడిని సపోర్ట్ చేసి గెలిపించాం. వాడు పీయూసీ అయ్యాక రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళిపోయాడు. వాడేమో ఒక మార్వాడీ వాళ్ళ ఫెర్టిలైజర్స్ కంపెనీలో పని చేస్తుండేవాడు. వాళ్ళు రైస్ బ్రాన్ ఎగుమతి చెయ్యడం, ఫెర్టిలైజర్స్ దిగుమతి చేసుకోవడం చేస్తుండేవాళ్లు. అందులో వాడు మేనేజర్.
వీళ్ళు నలుగురూ నాకు కాకినాడలో ఫ్రెండ్స్. వీళ్ళతో కాలక్షేపం చేస్తూ ఉండేవాణ్ణి.
నిజానికి నాకు కాకినాడలో డిసెంబర్ దాకా పని లేదు. ఎందుకంటే shipments డిసెంబరు దాకా గానీ రావు. నన్ను పంపించింది ఎందుకంటే అక్కడ గోడౌన్లు మాట్లాడుకోవడం, ఆ కస్టమ్స్ వ్యవహారాలు తెలుసుకోవడం కోసం నన్ను ముందుగా పంపించారు మా హెడ్డాఫీసు వాళ్ళు.
డిసెంబర్లో కానీ మనకి ఎక్సపోర్ట్స్ రావు అని చెప్పాను కదా! అప్పటిదాకా ఖాళీ. ఈలోపులో జంగారెడ్డిగూడెం నుంచి మూర్తి, ఏలేశ్వరం స్టాఫ్ మొత్తం మూడు జీపులేసుకుని భద్రాచలం బయల్దేరారు.
అలా బయల్దేరిన వాళ్ళలో - అచ్యుతరామయ్య అని చెప్పేసి ఓ బయ్యరు, నా ఫ్రెండు కూడా - రవి శంకర్ అని నా శిష్యుడు - వీళ్ళు కూడా వున్నారు. వాళ్ళు బయల్దేరే ముందు నాకు ఫోన్ చేసి నన్ను కూడా రమ్మంటే నేను నాతో పాటు మా లల్లీ, కుట్టీలని కూడా తీసుకెళ్ళాను. వాళ్ళిద్దరినీ తీసుకుని ఏలేశ్వరం వెళ్లి, ఏలేశ్వరం నుంచి మూర్తి వాళ్ళతో జాయిన్ అయ్యా.
మూడు జీపులు వేసుకుని - వయా అడ్డతీగల, మారేడుమల్లి - అట్నుంచి అలా భద్రాచలం వెళ్దామని మా ప్లాను. రాత్రి పూట బయల్దేరాం. తెల్లవారేటప్పటికి కిన్నెరసాని వాగు దగ్గర ఆగాం. అక్కడే దంతధావనాలు అవీ చేసుకున్న తర్వాత రెండు జీపులు వాగు దాటి వెళ్లిపోయాయి. మా లల్లీ, కుట్టి ఆ ముందు జీపుల్లో వున్నారు.
ఆఖరి జీపులో నేను, అచ్యుతరామయ్య, మూర్తి వెడుతూ ఉంటే వాగు ఉధృతంగా వచ్చేసింది. జీపు మొత్తం ఇంజిన్ దాకా మునిగిపోయింది. మేమప్పటికి లుంగీలతో వున్నాం. ఆ లుంగీలు పైకి కట్టేసుకుని ఈ జీపుని తోసుకుంటూ ఒడ్డెక్కాం.
ఒడ్డెక్కాక ఇహ అక్కడ మా జీపు నడవదు కదా - మిగతా రెండు జీపుల్లో ఓ జీపుకి తాడేసి కట్టి దీన్ని కొత్తగూడెం దాకా తీసుకెళ్ళాం. కొత్తగూడెంలో రిపేరు చేయించుకుని సాయంత్రానికి భద్రాచలం చేరాం. ఆ రాత్రి భద్రాచలంలో వున్నాం. తర్వాతి రోజు దర్శనాలు చేసుకుని, పంచవటి అదీ చూసుకుని ఆ రోజు సాయంత్రానికి బయల్దేరి ఒరిసా బోర్డర్లో వున్న సీలేరు థర్మల్ స్టేషన్ పిల్లలకి చూపించిన తర్వాత వెనక్కి బయల్దేరేశాం.
అలా వస్తూ దారిలో మారేడుమల్లి వచ్చేటప్పటికి అర్థరాత్రి అయ్యింది. అక్కడ కోయవాళ్ళు వాళ్ళేదో వేటకొచ్చారు బాణాలు పట్టుకుని. మా జీవుల్ని చూసి ఆపేశారు. ఆపేస్తే అందరూ భయపడుతున్నారు. నేనూ, అచ్యుతరామయ్య దిగి "ఏం ఫర్వాలేదు భయపడకండి. మేము మాటాడతాం" అని వెళ్లి వాళ్ళతో "ఒరే బాబూ...మేమేదో భద్రాచలం చూద్దామని సరదాగా వచ్చాము. మీరేంటీ ...? సిగరెట్లు తాగుతారా?" అనడిగి వాళ్లందరికీ తలకో సిగరెట్టు ఇచ్చాము. అందరూ సిగరెట్లు తీసుకుని "జాగ్రత్తగా వెళ్లి రండి" అని మమ్మల్ని వెళ్లనిచ్చారు.
మొత్తానికి అందర్నీ ఏలేశ్వరంలో డ్రాప్ చేసి లల్లీ, కుట్టీలతో కలిసి నేను కాకినాడ వచ్చేశాను.
డిసెంబర్ దాకా నాకు ఏ పనీ లేదని చెప్పాను కదా! నాకు వూరికే ఆఫిసుకి వెళ్లడం, అక్కడ సాయంత్రం దాకా కబుర్లతో కాలక్షేపం చేయడం కొంచెం చికాగ్గానే ఉండేది.
ఆ పరిస్థితిలో - ఒకప్పుడు కృష్ణస్వామిగారు నేను కంపెనీలో జాయిన్ అయినపుడు అయన "మూడంకెల మించి నీకు ఈ కంపెనీలో జీతం రాద"నేవాడు కదా! ఆయనతో ఛాలెంజ్ గా తీసుకున్నాను "ఇదే కంపెనీలో ఐదంకెల జీతం తీసుకుంటా"నని. అదీ మనసులో కదులుతూనే వుంది.
పైగా రెండోది ఏంటంటే "ఇక్కడ పని లేదు. ఏదైనా ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తే బావుంటుంది, ఇక్కడ ఉండడం చాల కష్టంగా వుంది" అని ఆలోచిస్తూ ఉంటే ఈ లోపు అనుకోకుండా మా ముఠామేస్త్రీ విష్ణు వచ్చి "అయ్యగారూ! ఇక్కడ తుని దగ్గర తలుపులమ్మ లోవ అనుంది. అక్కడికెళ్లి మనం ఏం కోరుకుంటే అదవుతుంది. మేమందరం అక్కడికి వెళ్దామనుకుంటున్నాము. మీరు కూడా రండి అక్కడికి" అనడిగాడు.
నిజానికి ఆ అమ్మవారి పేరు తలుపులమ్మ కాదు తలపులమ్మ. తలచుకుంటే కరుణిస్తుందన్నమాట.
అక్కడ పరిస్థితి ఏంటంటే...ఇప్పుడంటే బ్రాహ్మలు వాళ్ళూ చేరి ఎండోమెంటుకొచ్చి వాళ్లు అర్చనలూ అవీ చేస్తున్నారు చేస్తున్నారు కానీ నేనక్కడున్న రోజుల్లో ఆసాదులు ఉండేవారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఓ కోడిని తీసుకెళ్లాలి. ఆ కోడిని అక్కడే బలిచ్చి, అక్కడే వండుకుని, ఆ దేవతకి నైవేద్యం పెట్టి, అది ప్రసాదంగా తిని రావాలి. అదీ పధ్ధతి ఆ రోజుల్లో.
మా ముఠావాళ్ళతో పాటు - నేను, శాస్త్రిగారు, శ్రీనివాసరావుగారు, వెంకటరావు అని చెప్పేసి శాస్త్రిగారి శిష్యుడు - మేము కూడా బయల్దేరి కారేసుకుని వెళ్ళాం. వెళ్ళాక అక్కడ " ఒరే! మేము కోడిని కొయ్యం కానీ మీరు కొయ్యండి. ఓ ముక్క ప్రసాదం తింటాలెండి" అన్నా. నేనక్కడ ఆ అమ్మవారిని "ఎంతకాలం ఈ గుమాస్తా వుద్యోగం నాకు?! ఏదైనా ఇండిపెండెంట్ ఛార్జ్ కావాలి నాకు తల్లీ! పైగా ఇక్కడ పనే లేదు. నాకు ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళిపోతాన్నేను." అని కోరుకుంటూ దండం పెట్టుకున్నాను. ఈ కార్యక్రమం అంతా అయిపోయాక మళ్ళీ కాకినాడ వచ్చేశాం.
నిజంగా చెప్తే నమ్మరు ఎవరూ... మరుసటి రోజు పొద్దున్న నేను ఆఫీసుకి వెళ్ళలేదు పనెలాగూ ఉండట్లేదని. భోంచేసి, పడుక్కుని లేచి మధ్యాహ్నం వెళ్ళాను. వెళ్ళగానే నా టేబుల్ మీద ఓ టెలిగ్రాం .
మా జనరల్ మేనేజర్ HR రామచంద్ర అని - కన్నడ ఆయన. ఆయన "Report immediately at Head office with bag అండ్ baggage " అంజెప్పి ఓ టెలిగ్రామ్ ఇచ్చారు నాకు. .
నాకైతే కొంచెం చెమటలు పట్టాయి. "ఏంట్రా బాబూ...మనమేమన్నా తప్పు చేశామా ఏంటి? ఈ టెలిగ్రామేంటి? ఎందుకు రమ్మన్నారు నన్ను?" అని వెంబడే ఇంటికెళ్ళిపోయి రాత్రి పది గంటలకి బస్సెక్కి చిలకలూరి పేట వెళ్ళిపోయాను.
మరుసటి రోజు పొద్దున్నే వెళ్లి కలిశాను రామచంద్ర గారిని. కలిస్తే... ఆయన చెప్పింది ఏంటంటే "నిన్ను ప్రమోట్ చేసి టంగుటూరు బ్రాంచ్ మేనేజర్ గా వేశారు. నువ్వర్జంటుగా వెళ్ళి ఛార్జ్ తీసుకో అక్కడ" అని.
నాకైతే ఒక విధంగా ఎంత సంతోషమేసిందో! "ఒరే బాబూ నిజంగా ఆ తల్లి - తలపులమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం. దానివల్లనే మనకిది వచ్చింది" అనుకుని ఆ అమ్మవారికి మనసులో ఓ వెయ్యిదండాలు పెట్టుకుని "సరే సార్! నేను కాకినాడెళ్ళి వెళతాను" అంటే ఆయన "లేదు. నీకు కాకినాడకి వెళ్ళడానికి కూడా టైం లేదు. ముందు టంగుటూరు వెళ్లి ఛార్జ్ తీసేసుకో. తీసుకుని అక్కడ ఓ రెండ్రోజులుండి చూసుకుని ఆ ఆతర్వాత కాకినాడ వెళ్ళు" అన్నారు.
మరి నాకక్కడ టంగుటూరులో ఉండడానికి వసతిగా ఏమన్నా ఉన్నాయా అనడిగితే "అక్కడ పత్తిపాటి సుబ్బారావు ఒకాయన వున్నాడు. ఎర్రబ్బాయ్ అంటారు ఆయన్ని. ఆయనకి ఓ నాలుగు గోడౌన్స్, గ్రేడింగ్ హాలు, ఓ చిన్న గెస్ట్ హౌస్ అన్నీ వున్నాయి అక్కడ ఆయన గెస్ట్ హౌస్లో వుండు. అక్కడుండి ముందు ఛార్జ్ తీసుకుని తరవాత కాకినాడెళ్ళి నీ ఫ్యామిలీని షిఫ్ట్ చెయ్యి" అని చెప్పారాయన.
ఇదెప్పుడూ అంటే 1980 ఏప్రిల్-మే ప్రాంతాల్లో. పిల్లలేమో MSN ఛారిటీస్‌లో చదువుతున్నారు. వీళ్ళకి మళ్లీ టంగుటూరు స్కూల్లో సీట్లు అవీ కావాలి అంటే ఏప్రిల్-మే నెలల్లో స్కూళ్ళలో సీట్లూ అవీ ఎవరిస్తారు? అసలే అకడెమిక్ ఇయర్ అయిపోవస్తూ ఉంటుంది.
ఇలాక్కాదని చెప్పి సుబ్బన్న గారి దగ్గరికి వెళ్ళాను. నాకు గురువుగారు, నా వెల్-విషర్ కదా!
ఆయన "ఒరే! వెళ్ళి అక్కడ బీనీడి వెంకట నరసయ్య అని చెప్పేసి వున్నాడు. ఆంజనేయ టొబాకో కంపెనీ వాళ్ళదే టంగుటూర్లో. నేను వాడికి చెప్తాను. నువ్వు వెళ్ళు. నీ పిల్లలకి స్కూల్లో సీట్లు అవన్నీ ఎరేంజ్ చేస్తాడు. అని చెప్పారు.
నేవెళ్ళి ఆ బీనీడి వెంకట నరసయ్యని కలిశాను. ఆయన "కామేశ్వరరావు! మీరు ఎప్పుడొచ్చినా సరే మీ పిల్లలకి హైస్కూల్లో సీట్లు ఉంటాయి. ఏం ప్రాబ్లెమ్ లేదు. నువ్వు బయల్దేరొచ్చేయ్. నీకు ఇల్లు కూడా నేనే చూస్తాను" అని చెప్పి కొండలరావు గారని చెప్పేసి ఆయన ILTD లో పని చేసి రిటైర్ అయ్యాడాయన. ఆయన ఇల్లు కూడా అద్దెకుందని చెప్పాడు నాకు. ఆ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. అలా ఓ నాలుగు రోజులు టంగుటూరు లోనే ఉండి పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కాకినాడకి తిరిగి వచ్చేశాను. వచ్చేసి కాకినాడలో అందరికీ "నాకు టంగుటూరు ట్రాన్స్ఫర్ అయింది" అని చెప్పాను. నెలకి నాలుగంకెల జీతం కావాలనుకున్న నాకు టంగుటూరు కూడా మూడంకెల్లోనే మొదలయింది. సరే! ముందు ఇండిపెండెంట్ ఛార్జ్ వచ్చింది కదా అని నాకు నేనే సర్ది చెప్పుకుని టంగుటూరు వెళ్ళిపోయాను.
ఇక్కడ ఇంతకు ముందు మరిచిపోయిన కొన్ని సంగతులు చెప్పాలి. నేను కాకినాడలో ఉన్నప్పుడు లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఎలాగంటే నాకు చిన్నప్పణ్ణించి కూడా అనాతవరంలో వనసర్ల సాయిబ్బు అని చెప్పేసి అతనికి ఒంటెద్దు బండి ఉండేది. నేను, మా నాన్న, మా అమ్మ అమలాపురంలో వున్న మా అక్కగారు పాపాయమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ బండేసుకెళ్ళేవాళ్ళం. ఆ ఒంటెద్దు బండి తోలేవాణ్ణి నేను సరదాగా. తర్వాత మన పొలంలో అల్లుడు-మావల జత అంజెప్పేసి ఓ ఎడ్ల జత ఉండేది. ఆ ఎడ్ల జతకి రెండెడ్ల బండి నేనే నేర్పి ఆ బండేసుకుని ముమ్మిడివరం సినిమాలకి వెళ్ళేవాణ్ణి. దాంతర్వాత ఏంటంటే ఊళ్లోకి కొత్తగా రిక్షాలొచ్చాయి. ఓ సాయెబుండేవాడు. మా అమ్మగారికో అలవాటుండేది కదా! అమలాపురం వెళ్ళడానికి బండి వాళ్ళో, రిక్షావాళ్ళో వస్తే వాళ్ళని లోపలికి రమ్మని వాళ్లకేదో టిఫినో, పలహారమో పెట్టేది వెనకాల పెరట్లో. వాళ్ళలా లోపలికి తినడానికి వెళ్ళినప్పుడు ఆ రిక్షా వేసుకుని వెళ్లిపోయేవాణ్ణి. రిక్షా కూడా తొక్కేసేవాణ్ణి. వీటన్నిటితో పాటు గుఱ్ఱపు స్వారీ, గుఱ్రబ్బళ్ళు తోలడం సరే సరి!
ఇవన్నీ అయ్యాక తర్వాత్తర్వాత మోటర్ సైకిళ్ళు - ఎస్సెల్సీలో ఉండగానే మొదట నేను నేర్చుకున్నదే బులెట్ మోటార్ సైకిలు - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ది. తరవాత కంపెనీకి వచ్చింతర్వాత కార్లు, జీపులు - ఇవి కంపెనీలో నేర్చుకున్నాను.
లారీ ఎలా నేర్వనేర్చుకున్నానంటే కాకినాడలో చైనా ఎక్స్‌పోర్ట్స్ వచ్చినప్పుడు మాది పదివేల టన్నుల ఆర్డర్.
మా జనరల్ మేనేజర్ రామచంద్రకి ఓ విచిత్రమైన రూలు ఉండేది - లారీలు అన్నీ ఒకసారే వెళ్ళాలి, ఒకసారే రావాలి. ఓ లారీలో స్టెప్నీ, ఓ లారీలో జాకీ, ఓ లారీలో వీల్ రెంచు - ఇలా పెట్టి పంపించేవాడు. పన్నెండు లారీలు ఉండేవి మాకు. ఆయనే ఆటోమొబైల్ ఇన్‌చార్జ్ కూడా. ఈ లారీలు మొత్తం ఒకేసారి అక్కడ లోడ్ చేసుకుని కాకినాడ వచ్చి పోర్టుకి రాగానే మొదటి లారీ అన్లోడ్ కాంగానే ఆ లారీ తీసుకుని మిగతా లారీలు అన్లోడ్ అయ్యేవరకు ఆపోర్టులో ఈ లారీ వేసుకుని తిరుగుతూ వుండేవాణ్ణన్నమాట. అలా నేల మీద నడిచే ప్రతి వాహనం - ఒక్క ట్రెయిన్ తప్ప అన్నీ నేను డ్రైవ్ చేసేవాణ్ణి.
సరే! 1980 జూన్ నెలకి టంగుటూరు వచ్చేశాను.
టంగుటూరులో పత్తిపాటి సుబ్బారావుగారి గ్రేడింగ్ పాయింట్స్ ఉండేవి. ఆరొందల మంది గ్రేడర్స్ అక్కడ.
బయ్యింగ్ పాయింట్స్ ఓ పద్ధెనిమిది ఉండేవి. నెల్లూరు నుంచి కావలి, సింగరాయకొండ, జమ్ములపాలెం, టంగుటూరు, ఇలా చాలా పాయింట్స్ వుండేవి. వీటన్నిటిలో కూడా పొగాకు కొనుగోలు చేసే కంట్రోల్ మొత్తం నాదే. పద్ధెనిమిది కార్లుండేవి అక్కడ కూడా.
అన్నాబత్తుల వెంకట సుబ్బయ్య అని ఒకతను ఉండేవాడు. అతనిది జమ్ములపాలెం. అతను కూడా నేనంటే చాలా అభిమానంగా ఉండేవాడు. కందుకూరులో కూడా ఒక బ్రాంచ్ ఉండేది. అది కూడా ఒక గ్రేడింగ్ పాయింట్. ఆదిపూడి వెంకట్రావు గారని చెప్పేసి ఆయన అక్కడ మేనేజర్. ఆయనకిద్దరు భార్యలు. ఆయన్ని సరదా చేస్తూ "ఒక పక్కన గంగమ్మ, ఒక పక్కన గౌరమ్మ,,, ఇద్దరు భార్యల ముద్దుల మగడా విభూతి మల్లన్నా... మెడలో నాగుల మల్లన్నా!" పాట పాడేవాణ్ణి.
కొండలరావుగారింట్లో అద్దెకు దిగాం కదా! అక్కడ ఎదురుగుండా ఇంట్లో సుబ్బారావు అని ఒకాయన కఱ్ఱసాము నేర్పుతూ ఉండేవాడు. ఆయనకి ఇద్దరాడ పిల్లలు - అమృతరాణి, విషారాణి - భలే వింతైన పేర్లు. ఆ పెద్దపిల్లకి అప్పటికి ఓ పదిహేనేళ్ళు వుంటాయేమో కఱ్ఱసాము భలేగా చేసేది. వాళ్ళింటికి ఎదురుగుండా కరణంగారి ఇల్లు పిల్లలతో సందడిగా ఉండేది.
కొండలరావు గారింట్లో ఓ ఏడాది పాటు ఉన్నాక పిల్లలకి హైస్కూల్ దగ్గరగా ఉండాలని చెఱువు గట్టు మీద చింతచెట్లతోపు దగ్గరగా - కొణికి వెంకట శేషయ్యగారని - ఆయన ఇంట్లోకి మారాము. ఆ ఇంటికి ఏంటంటే ముందో వరండా, తర్వాత రెండు గదులు ఉండేవి అంతే! బాత్రూములు అవీ కూడా లేవు. నేను ఆ వరండాకి ఇనప గ్రిల్ పెట్టించి మూడో గదిలా వాడుకున్నాను. బాత్రూములూ అవీ కూడా నేనే కట్టించుకున్నాను.
(ఇక్కడో మాట చెప్పాలి. 2018లో మా అమ్మాయి లల్లి పదో తరగతి వాళ్ళందరూ పూర్వ విద్యార్థుల సమావేశం జరుపుకున్నప్పుడు మేమందరం టంగుటూరు వెళ్ళాము. అప్పుడు కొణికి వెంకట శేషయ్యగారు మంచం మీద వున్నవాడు కూడా నన్ను చూడ్డానికని లేచి వచ్చాడు. నా రెండు చేతులూ పట్టుకుని "నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు, కామేశ్వరరావుగారూ!" అని ఒకటే ఏడ్చేశాడు. పెద్దాయన పాపం! నన్ను చూసి ఎంతో ఆనందించాడు.
వాళ్ళ ఇల్లు అద్దెకు అడగడానికి వచ్చినవాళ్లు ఆ ముందు గ్రిల్ తీయించేస్తేనే అద్దెకు వస్తామని అంటే - ఆ గ్రిల్ కామేశ్వరరావుగారు కట్టించారూ, అదలా ఉండాల్సిందే, మీరు అద్దెకి రాకపోయినా ఫర్వాలేదు అని చెప్పి - ఆ రెండు వాటాలు ఈ రోజుకీ అలాగే ఖాళీగా ఉంచేసుకున్నాడు. నేనంటే ఎంత అభిమానమో!)
<వచ్చేమాటు తరువాయి కథ>

అంకుల్, అంకుల్! మీరు 3 చక్రాల బండి, ఆటో, ఎయిర్‌ప్లేన్ కూడా నడిపించెయ్యండి వెంటనే! ఆ వివరాలతో మాకు ఒక మంచి పోస్ట్ వస్తుంది!!! ఆ పాటలు కూడా పాడి పోస్ట్‌కి జత చెయ్యండి. ఖూచిమంచి అంకుల్‌ని కూడా తీస్కుని రమ్మని అడగలేను కానీ మీరు పాడండి విని సంతోషిస్తాం.
రిప్లయితొలగించండి