ఆటలాడే చిన్నతనాన - కాలాన్ని బట్టి - తాటాకుబొమ్మలకు బొమ్మగుడ్డలు చుడుతూనో, లక్కపిడతల్లో అన్నాలు వండి వారుస్తూనో, కాయితప్పడవలు మండువా నీళ్ళలో ఒదులుతూనో - ఆడుకుంటూ వున్నా - ఒక చెవి ఎప్పుడూ రేడియోలో వచ్చే పాటల మీద ఉండేది.
ఆ పాటలేంటో, వాటి అర్థాలేంటో అస్సలు తెలీకపోయినా - ఇంట్లో ఎవరో ఒకరు ఆ రేడియోతో గొంతు కలిపి పాడడం, అవి వింటూ ఆడుకోవడం బావుండేది.
అలా విన్న కొన్నికొన్ని పాటలు - ఆ విన్ననాడు అవేంటో తెలీకపోయినా - లీలగా గుర్తుండిపోయాయి.
అలా అలా గాలిఅలల్లా గుర్తున్న ఆ పాటలు - ఒకటి రెండు పదాలు గానో, తీయలేని కూనిరాగాలు గానో మాత్రమే గుర్తుండి తెగ సతాయిస్తాయి ఇప్పటికీ నన్ను.
అవే పాటలు - అనుకోకుండా కనపడి తారసపడి పలకరించే నేస్తాల్లా - ఆదమరపు వేళల్లో వినిపిస్తాయి.
అలాంటి ఒక పాట - ఈ తీయని రేయి తెలవారుటె మానీ ...
దాదాపు ఏడేళ్ళ క్రితం - అమ్మా-నాన్నా, అత్తయ్య ఉన్నారని - వాళ్ళకి కాలక్షేపంగా ఉంటుందని - ఏడాది చందా కట్టి తీసుకుని - వాళ్ళు ఇండియాకి తిరిగి వెళ్ళిపోయాక, తగులూ-మిగులుగా మిగిలున్న Yupp TV Subscription లో - ఆ టీవీవాళ్ళు చూపెట్టిన సినిమాలు చూడలేక - మేము చూద్దామనుకున్న సినిమాలు వాళ్ళు సరిగ్గా చూపెట్టలేక - ఇక చూడడానికి ఏమీ లేక - అప్పుడప్పుడూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు కనిపించకుండా, వినిపించే ఆడియో ఛానెల్ ఒకటి వినేదాన్ని. అందులో ఎప్పుడు విన్నా - ఏదో కేసెట్ లోంచి వస్తున్నట్టుగా - ఒకే వరసలో వచ్చిన పాటలే మళ్ళీ వస్తూ ఉండేవి.
అందులో మొట్టమొదటి పాటే - ఈ తీయని రేయి తెలవారుటె మానీ ... అన్న యుగళగీతం. అందులో male-గళం మహా-మేలు-గళమైన ఎస్పీబీది అని తెలుస్తూనే ఉంది కానీ రికార్డింగ్ స్పష్టంగా లేని ఆ ఆడియోలో కొంచెం feeble గా వినిపిస్తున్న female-గళం ఎవరిదో అర్థం కాలేదు.
కానీ ఆ పాట వినీవినగానే భలే సంతోషమేసింది.
అప్పటిదాకా ఈ ఆహహ ఆహ అహఆహహ ఆహ్హా... అంటూ నేను చేసే అఅహా-కారాలు భరిస్తున్న ఇంట్లోని వాళ్ళందరూ "హమ్మయ్య - పాటేదో దొరికిందిగా - ఈ ఆహా-కారాలు వినే పాట్లు తప్పుతాయి మనకి - ఉష్షూ..." అని ఊపిరి పీల్చుకున్నారు.
ఆ పాటేదో రాసుకోవాలీ, ఆ తర్వాత పాడుకోవాలీ అనుకుంటూనే ఉన్నాను - ఈలోగా Yupp TV చందా ముగిసిపోయింది. ఆచూకీ చిక్కిందనుకున్న పాట ఓ నాలుగైదు మాటలుగా మాత్రం మిగిలిపోయింది. అప్పుడే నేనడిగానని "ఆపాత మధురాలు" బ్లాగర్ రాజ్యలక్ష్మి గారు తన బ్లాగులో పూర్తి పాటని పోస్ట్ చేశారు కూడా.
కాకపోతే ఆ పాట సినిమాలో ఎలా ఉంటుందో చూడాలనిపించేది.
అప్పట్నుంచీ వెతుకుతూ, వెతుకుతూ ఉంటే - ఇప్పటికి దొరికింది యూట్యూబ్లో - ఈ పాట చిట్టితల్లి అనే సినిమా లోది. పాటే కాకుండా ఆ సినిమా కూడా యూట్యూబ్లో ఉంది. నేను పాట చూసి ఊరుకోవచ్చు కదా! అబ్బే! ఆలా ఊరుకుంటే నేనెందుకవుతాను? ముందు పాట గురించి చెప్పడం పూర్తయ్యాక - అసలా సినిమా ఎందుకు చూశానో చెప్తాను. అది చెప్పాలంటే ఇంకో హిందీ పాట గురించి కూడా చెప్పాలి.
అదీ ... చెప్తా...చెప్తా... ఉండి రాగమవ్వుడి!
ఈ తీయని రేయి తెలవారుటె మానీ ... పాటని SPB తో పాటు పాడిన వారు జిక్కి. నాకు తెలిసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం - జిక్కి కలిసి హీరో-హీరోయిన్లకి పాడిన పాట ఇదొక్కటే. అలా ఇదొక అపురూప యుగళగీతం. సంగీతం విజయా కృష్ణమూర్తి. ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు పాటలు రాసిన వారు ఇద్దరు - సి. నారాయణరెడ్డి, జి. కె. మూర్తి. వీళ్ళిద్దరిలో ఈ పాట ఎవరు రాశారో నాకు తెలీలేదు.
ఈ పాటలో నటించిన వారు - హరనాథ్, భారతి. సినిమాలో మాత్రం ఈ పాట వచ్చే సందర్భం మహా అసందర్భం.
ఆ అసందర్భ-సందర్భం ఎలాంటిదో చెప్పాలంటే టూకీగా సినిమా కథ కనీసం పాట వరకైనా చెప్పాలి... వినుకోండి మరి...
అనగనగా ఒక భార్య ఫోటోకి దండేసిన హీరో - అందం కొంచెం మందమైన హరనాథ్. ఆ హీరోకి ఓ ఐదేళ్ళ పాప, కూతురు పోయిందని పిచ్చివాడైన మామగారు. ఆ హీరో గారి పాపకో టీచర్ హీరోయిన్ - చిన్నద కన్నడ (ಚಿನ್ನದ ಕನ್ನಡ) చిన్నది భారతి.
ఓ రోజు భారతి ఎక్కడో నడిచి వెళ్తుంటే త్యాగరాజు వస్తాడు. తనని పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తాడు.
ఇంతలో అదే చోటుకి bat ఊపుకుంటూ వచ్చిన హీరో-హరనాథ్ హీరోయిన్-భారతిని బలవంతం చేస్తున్నవిలన్-త్యాగరాజుని bat పెట్టి బాదేస్తాడు.
ఈలోగా హీరో-హీరోయిన్లని చూడడానికి అన్నట్టు ఆకాశంలో మబ్బులన్నీ ఓ చోటికి పరిగెట్టుకొచ్చి. పెద్దపెద్ద ఉరుములొచ్చి వర్షం కురిసేస్తుంది.
ఇంతలో అదే చోటుకి bat ఊపుకుంటూ వచ్చిన హీరో-హరనాథ్ హీరోయిన్-భారతిని బలవంతం చేస్తున్నవిలన్-త్యాగరాజుని bat పెట్టి బాదేస్తాడు.
ఈలోగా హీరో-హీరోయిన్లని చూడడానికి అన్నట్టు ఆకాశంలో మబ్బులన్నీ ఓ చోటికి పరిగెట్టుకొచ్చి. పెద్దపెద్ద ఉరుములొచ్చి వర్షం కురిసేస్తుంది.
ఇంతలో సీను మారి - ఓ చిన్న ఇల్లు, దానికో కిటికీ, కిటికీ కవతల కురుస్తున్న వర్షం, ఆ కిటికీని మూస్తూ ఉన్న పిచ్చివాడైన హీరో మామగారు.
కిటికీని మూస్తున్న ఆయన ఎందుకో వెనక్కి తిరిగి "అయ్యో! వర్షంలో తడిసి పోయారా ఇద్దరూ?" అంటూ ఉంటాడు కానీ అక్కడ ఏ ఇద్దరున్నారో ఆయనకే ఎరుక. మనకి మాత్రం ఎవ్వరూ కనిపించరు.
అంతలోనే ఆ మామగారు "అమ్మా! బాగా తడిసిపోయావు. ఆ గదిలో నా కూతురు జానకికి ఎంతో ఇష్టమైన చీర ఉంది. కట్టుకో" అంటాడు.
ఆ తర్వాత సీనులో - ఓ టిక్లీల చీర కట్టుకుని ముసుగేసుక్కూర్చున్న భారతి, పక్కనే మెరుపంచుల చొక్కా వేసుకుని ఇంకో కిటికీ మూస్తున్న హరనాథ్ - ఈ తీయని రేయి తెలవారుటె మానీ ... అంటూ కళాత్మకంగా పేనిన సాలెగూళ్ళ మధ్య పాట పాడేసుకుంటారు. పాట చివర్లో హరనాథ్‌ని త్యాగరాజు వెనక నుంచి వచ్చి కత్తితో పొడుస్తాడు. భారతి కెవ్వుమంటుంది.
కానీ ఆ కెవ్వుమన్న భారతి హరనాథ్ ఇంట్లో పాపకి పాఠం చెప్తూ ఉంటూ - ఆ పాఠం మధ్యలో ఈ పాటని కలలా కని - ఆ కలలో కత్తిపోటు నిజమనుకుని - ఆ కాలనీ తల్చుకుని - ఈ ఇలలో కెవ్వుమంటుంది. కానీ అలా కల కనడం అసలు అతికినట్టే లేదు అక్కడ.
అసలా కలేంటో - ఆ కలలో ఆ కురవని వర్షం ఏంటో - వాళ్ళు ఓ ఇంటికెళ్లడమేంటో - ఆ ఇంట్లో ఆ పిచ్చి మామగారుండమేంటో - ఆయన తన అల్లుడితో వచ్చిన అమ్మాయిని తన కూతురి చీర కట్టుకోమని వాళ్ళిద్దరినీ తన ఇంట్లో పాట పాడుకోనివ్వడమేంటో - అక్కడికి దుష్ట-త్యాగరాజు రావడమేంటో - ఆ కత్తి పోటేంటో - కల లోని కత్తిపోటుకి ఇలలోని కెవ్వుమని కేకేంటో ....
అసలు నేనేంటో - ఒక్క పాట నచ్చిందని ఆ పాట పట్టుకుని సినిమా చూడకూడదని ఇప్పటికి ఎన్నోసార్లు సినిమా-దెబ్బలు తగిలినా - అది గుర్తు లేనట్లు మళ్ళీ ఈ సినిమా చూడడమేంటో... ఇది కలయో, నిజమో, అస్తవ్యస్తపు-అతికింపుల సినీ-మాయో!
అసలు నేనేంటో - ఒక్క పాట నచ్చిందని ఆ పాట పట్టుకుని సినిమా చూడకూడదని ఇప్పటికి ఎన్నోసార్లు సినిమా-దెబ్బలు తగిలినా - అది గుర్తు లేనట్లు మళ్ళీ ఈ సినిమా చూడడమేంటో... ఇది కలయో, నిజమో, అస్తవ్యస్తపు-అతికింపుల సినీ-మాయో!
(అన్నట్టు ఈ తీయని రేయి... పాటలో భారతి హెయిర్ స్టైల్ చూస్తుంటే ఇంకోటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు చాలా సినిమాల్లో హీరోయిన్లకి అలాంటి హెయిర్-స్టైల్ ఉండేది. ఇలా ఏవో సినిమాలు చూసొచ్చాక మా నాన్నమ్మని నాకూ అలాంటి జడ వెయ్యమని తెగ విసిగించేదాన్ని. మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి పడుకున్నప్పడు - నాన్నమ్మ కటకటాల్లో ఉయ్యాల బల్ల పక్కనే స్తంభం దగ్గర కూర్చుని - కళ్ళజోడు పెట్టుకుని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు. నేనప్పుడు ఓ దువ్వెన పట్టుకెళ్ళి ఆ హీరోయిన్ లాంటి హెయిర్-స్టైల్ కావాలని పేచీ పెట్టేదాన్ని. దాంతో ఆవిడ నాకు ఓ పది జడలు అల్లి ఓ పురికొసతో పైకి కట్టేవాళ్ళు. పురికొస ఎందుకంటే మరి హీరోయిన్ జడలో రిబ్బన్లు ఏమీ కనపడవు కదా! అందుకని నేను రిబ్బన్ పెట్టి కట్టడానికి ఒప్పుకునేదాన్ని కాను. రిబ్బన్ పెడితే అది నచ్చక వేసిన పది జడలూ విప్పేశానని - నా బాధ పడలేక పురికొసతో - జడ చివర్లు అన్నీ కలిపి - అది కనిపించకుండా పైకి దోపి - ఓపిగ్గా నా ముచ్చట తీర్చారు మా నాన్నమ్మ.)
ఏమాటకామాట చెప్పుకోవాలి - రెండో సారి నీ లేడి కన్నుల లోనా... నీ లేత వన్నెల లోనా..., నీ నడక సొంపుల లోనా... లేనడుము ఒంపుల లోనా...అన్న లైన్లు పాడేటప్పుడు వంపులు తిరిగి, వన్నెలీనిన SPB గొంతు వినాల్సిందే. జిక్కి గొంతు కూడా చాలా మెత్తగా వినిపిస్తుంది ఈ పాటలో.
ఈ కిందున్న పాటని చూస్తూ పాడేసుకోండి... మరి!
ఈ తీయని రేయి తెలవారుటె మానీ - ఇలా నిలిచి కవ్వించనీ
ఈ తీయని రేయి తెలవారుటె మానీ - ఇలా నిలిచి కవ్వించనీ
నీ లేడి కన్నుల లోనా - నీ లేత వన్నెల లోనా...
నీ లేడి కన్నుల లోనా... నీ లేత వన్నెల లోనా...
తీరైన లోకాలన్నీ - తిలకించనీ... తిలకించనీ...
మరుమల్లె మాలికనోయీ ...మరులున్న బాలికనోయీ
మురిపించు మురళిని నేనై - వినిపించనీ... వినిపించనీ...
ఊ!
ఈ తీయని రేయి తెలవారుటె మానీ - ఇలా నిలిచి కవ్వించనీ
నీ నడక సొంపుల లోనా - లేనడుము ఒంపుల లోనా...
నీ నడక సొంపుల లోనా... లేనడుము ఒంపుల లోనా...
ఎనలేని వయ్యారాలు - కనిపించనీ... కనిపించనీ...
నీ హృదయ సీమను చేరీ... నీ పెదవి నవ్వుగ మారీ
అందాల ఆనందాలు అందించనీ... అందించనీ...
అహా!
ఈ తీయని రేయి తెలవారుటె మానీ - ఇలా నిలిచి కవ్వించనీ
****************
****************
ఇందాక చిట్టితల్లి సిన్మాలో "ఈ తీయని రేయి తెల్లవారుటె మానీ ..." పాట గురించి చెప్తూ - ఆ పాటున్న సినిమా చూసే పాట్లు ఎందుకు పడ్డానో ఆనక చెప్తానూ అన్నాను కదా!
అదెందుకంటే - దానికో చిన్న కథుంది.
మా ఇంట్లో వారానికో రెండు సార్లైనా బదరి, నేనూ వినే పాట ఒకటుంది. అది ఏంటంటే... రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే...
మా ఇంట్లో వారానికో రెండు సార్లైనా బదరి, నేనూ వినే పాట ఒకటుంది. అది ఏంటంటే... రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే...
పాట అద్భుతంగా పాడింది ఎవరంటే రవంలో రాగాలు రసరమ్యంగా రవళించు రఫీ - లతా.
పాటకి ఆడింది - రాజేంద్ర కుమార్ - బబిత.
పాట రాసింది - ఆనంద్ బక్షీ.
పాట కట్టింది - లక్ష్మీకాంత్-ప్యారేలాల్.
పాట రాసింది - ఆనంద్ బక్షీ.
పాట కట్టింది - లక్ష్మీకాంత్-ప్యారేలాల్.
ఒక fun trivia ఇక్కడ - తెలుగులో మన ఏఎన్నార్ లాగా హిందీలో ట్రాజెడీ కింగ్ రాజేంద్ర కుమార్.
ఈయన కుమారరత్నం కుమార్ గౌరవ్ అనే ఇంకో హీరో.
కుమార్ గౌరవ్ మొదటి సినిమా లవ్ స్టోరీ - విజేతా పండిట్ హీరోయిన్ను.
దాన్నే తెలుగులో పెద్ద నరేష్ మొదటి సినిమా ప్రేమ సంకెళ్ళుగా తీశారు. తెలుగులో హీరోయిన్ను హిందీ-వెర్షన్ హీరోయిన్నుకి సరి"తూగే" శ్యామల గౌరి.
దాన్నే తెలుగులో పెద్ద నరేష్ మొదటి సినిమా ప్రేమ సంకెళ్ళుగా తీశారు. తెలుగులో హీరోయిన్ను హిందీ-వెర్షన్ హీరోయిన్నుకి సరి"తూగే" శ్యామల గౌరి.
(ప్రేమ సంకెళ్ళు సినిమాలో లో వేటూరి రాసిన మెరుపులా మెరిశావు - వలపులా కలిశావు - కన్ను తెరచి చూసేలోగా నిన్నలలో నిలిచావు పాటలో నిన్నలలో నిలిచావు అన్న మాటలు నాకు భలే ఇష్టం. ఆ పాటకి హిందీ సందర్భ-కవల యాద్ ఆ రహీ హై - తేరీ యాద్ ఆ రహీ హై పాట కన్నా మన వేటూరి వారి తెలుగు పాట బాగు, బహు-బాగు!)
ఇహ పోతే - అంజానా సినిమా హీరోయిన్ బబితేమో - రాజ్ కపూర్ కోడలు, రణధీర్ కపూర్ భార్య, కరిష్మా-కరీనా కపూర్ల తల్లి.
సరే! ఈ పాట ప్రతీవారం వింటాము - చూస్తాము కూడానూ.
చిట్టితల్లి సినిమాలో - ఆ వర్షం, చిన్న ఇల్లు, కిటికీ, లోపల హీరో-హీరోయిన్ల పాట - అవన్నీ చూశాక - "అరె ... ఇదేదో హిందీ రాజేంద్ర కుమార్ రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే...పాట సందర్భంలా వుందే!" అనిపించింది. తీరా చూస్తే ఈ రెండు పాటలకి ఉన్న పోలిక - వర్షం, కిటికీ తప్ప ఇంకేమీ కాదు.
పైగా హిందీ పాటలో బబిత ఒక బాంబే డైయింగ్ దుప్పటో, కర్టెనో కట్టుకుని ఉంటుంది. జుట్టేమో వర్షంలో తడిసి వచ్చినట్టే ఉంటుంది. మన తెలుగు భారతేమో అప్పుడే బ్యూటీ పార్లరుకి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది.
ఈ హిందీ పాటలో చరణాల్లో వాక్యాలు - పొడుగ్గా ఉండి - అక్కడక్కడా తమాషాగా ముక్కలుముక్కలుగా విరుస్తూ పాడతారు రఫీ-లతా.
ఇది కూడా చూస్తూ, వింటూ - ఆనక చదువుకుంటూ పాడేసుకుంటారని....
ఈ కింద వీడియో, ఆడియో, నా రాతయో ...అవీ-ఇవీ-అన్నీ!
ఈ కింద వీడియో, ఆడియో, నా రాతయో ...అవీ-ఇవీ-అన్నీ!
రిమ్‌ఝిమ్ కే గీత్ - సావన్ గాయే... హాయే - భీగీ భీగీ రాతోం మే!
రిమ్‌ఝిమ్ కే గీత్ - సావన్ గాయే... హాయే - భీగీ భీగీ రాతోం మే!
హోఠోం పే - బాత్ దిల్ కీ ఆయే... హాయే - భీగీ భీగీ రాతోం మే!
ఓ .... .... ఓ ... ...
తేరా మేరా - పూఛే నాతా - బడీ వో - యే ఘటా ఘన్‌ఘోర్ హై...
చుప్ హూ ఐసే - మై కహ్ దూ కైసే - మేరా సాజన్ నహీ తూ కోయీ ఔర్ హై?!
కె - తేరా నామ్ - హోఠోం పే మేరే - తేరే సప్‌నే మేరీ ఆంఖోం మే
కె - రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే... హాయే - భీగీ భీగీ రాతోం మే!
మేరా దిల్ భీ - హై దివానా - తేరే నైనా భీ హై నాదాన్ సే
కుఛ్ న సోచా - కుఛ్ న దేఖా - కుఛ్ భీ పూఛా న ఇక్ అంజాన్ సే
చల్ పడే - సాథ్ హమ్ కైసే ఐసే - బన్‌కే సాథీ - రాహోం మే!
కె - రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే... హాయే - భీగీ భీగీ రాతోం మే!
బడీ లంబీ - జీ కీ బాతే - బడీ ఛోటీ యే బర్‌ఖా కీ రాత్ జీ!
కహ్‌నా క్యా హై? సున్‌నా క్యా హై? కహ్‌నే సున్‌నే కీ అబ్ క్యా హై బాత్ జీ?!
బిన్ కహే - బిన్ సునే - దిల్ నే - దిల్‌సే - కర్ లీ బాతే - బాతోం మే
కె - రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే... హాయే - భీగీ భీగీ రాతోం మే
రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే... హాయే - భీగీ భీగీ రాతోం మే
**************
**************
ఓ పాట పట్టుకుని
ఆ పాటని తలమీదెట్టుకుని
ఆ పాటనే తలచి తలచి మురిసిపోవడం
అదే పాటని అందరితో పంచుకోవడం
నాకు ప్రీతి! నాకు పరిపాటి!
~ పాటల భైరవి.
Challa baaga rasaru...apakunda chadivinchaaru....
రిప్లయితొలగించండినా బ్లాగ్ మీకు నచ్చినందుకు సంతోషమండి. ధన్యవాదాలు!
తొలగించండి