గత ఇరవై ఏళ్ళుగా - ఇక్కణ్ణించి పెట్టట్టుకెళ్ళి అక్కడికెళ్ళి - అక్కణ్ణించి అదే పెట్టట్టుకుని తిరిగొచ్చే ప్రతీసారీ పట్టుకొచ్చేవి - పుట్టింటి పెట్టుపోతలతో పాటు పుస్తకాల దొంతర్లు.
అలా మోసుకొచ్చిన పుస్తకాలన్నీ మొన్నమొన్నటిదాకా ఇంట్లో ఉన్న గదులన్నిటిలో - లివింగ్ రూమ్ సోఫాల మీద, సైడ్ టేబుళ్ల మీద, డైనింగ్ టేబుల్ కుర్చీల మీద, బెడ్‌రూమ్‌లో నైట్ స్టాండ్ మీద, మంచం మీద, బేస్మెంట్లో అలమారుల్లో - ఇందుగలదందు లేదని లేక - అందందు, ఇందిందు అని లేక - ఎందెందూ ఉందుము మేమని - అరమూత పేజీలవి కొన్నీ, బుక్‌మార్కులు పెట్టి మూసినవి ఇంకొన్నీ- పెట్టిన చోట పెట్టినట్లు ఉండేవి. ఎటు చెయ్యి చాపినా అందుతుండేవి.
అందులోనూ - నాకు ఒకేసారి మూణ్ణాలుగు పుస్తకాలు చదవడం అలవాటు.
పొద్దున్న ఫెళ్ళున ఎండ కాసి, మధ్యాహ్నానికి ముసురేసి మబ్బేసి - సాయంత్రానికి చలిపులి జతగా చీకటి పూసుకునే, మా ఊరి predictably unpredictable వాతావరణానికి తగ్గట్టే నా పుస్తకాల చదువు.
ఓ పొద్దు కృష్ణశాస్త్రి,
ఇంకో జాము ముళ్ళపూడి,
మరు సంజె శ్రీపాద,
నిద్రకొరిగే వేళ నవ్వులతో తోడొచ్చే వోడ్‌హౌస్, Dr. Seuss, లారా ఇంగాల్స్ ,
- ఇలా పూటపూటా మారునట - నా చదువుటలు, చదువు పుటలు, పుటల పుస్తకాలు.
అలా ఇల్లంతా పుస్తకాలు పరుచుకుని, చేతికందింది చదువుతూ ఉండడం బాగానే ఉందనిపించినా - ఒక్కోసారి చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి ఇంకోటి చదువుదామా అనుకుని - అదెక్కడుందో చూడబోతే - ఆ సమయానికి అవసరమనుకున్న పుస్తకం ఎక్కడో ఆదమరచి ఒదిగి ఉండి - ఆఖరికి అంజనం వేసినా దొరకనంతగా దాక్కుని ఉండేది. ఇహ దాన్ని వెతుక్కుని వచ్చేలోగా అందులో అంతకు ముందు ఎంత దాకా చదివానో మర్చిపోయేదాన్ని. మళ్ళీ మొదటి నుంచి చదవాల్సి వచ్చేది.
ఇంకిలా కాదనుకుని - ఇల్లంతా రెపరెపలాడుతున్న కాయితాల-రెక్కలవే కాక - ఎప్పటెప్పటివో, ఎక్కడెక్కడివో పోగేసుకున్న పుస్తకాలు అన్నీ కిందటి సంవత్సరం ఒక అలమారాలో అమరుద్దామని - అప్పటికి అందులో ఉన్న లెగో అచ్చుల బొమ్మల్నన్నిటినీ వేరే బీరువా లోకి మార్చి - నాలుగు అరలుగా, నాలుగు రెళ్ళు ఎనిమిది గూళ్ళుగా ఉన్న ఆ తలుపుల్లేని చెక్క అలమారాలో - కంటికి కనిపించి, చేతికి అందిన పుస్తకాలన్నింటినీ ఎలా పడితే అలా పెట్టేశా.
సరే! ఇప్పటికైనా కావల్సిన పుస్తకం చటుక్కున దొరుకుంటుందా అంటే....ఉహూ! ఎదురుగానే ఉంటుంది కానీ ఎంత వెతికినా ఎప్పటికో గానీ కనబడదు. ఆ కనబడిన సమయానికి అదే నేను వెతుకుతున్నది అని గుర్తుండదు.
ఈ రకంగా అనుకున్నది దొరకక, దొరికినది చదవాలనిపించక, ఒకవేళ రెండూ కుదిరి ఓ పుస్తకమేదో తీసి చదివింతర్వాత మళ్ళీ అదెక్కణ్ణుంచి తీశానో అక్కడే పెడదామనుకుంటే - అసలదెక్కణ్ణుంచి తీశానో గుర్తు లేక - తీసినది తీసిన చోట పెట్టే తీరుబడి లేక - మొత్తానికి నా పుస్తకాల పోగు ఓ తీరూ-తెన్నూ లేకుండా అయిపోయింది.
ఇంతలో ఏప్రిల్ నెలలో ఓ రోజు అపర్ణ వాట్సాప్ సందేశం పంపించింది - ఓ అలమార నిండుగా వరసలు, వరసులుగా సర్దిన బోల్డన్ని పుస్తకాల ఫోటోలు, దాని కిందనే దాదాపు 300 పైగా ఉన్న పుస్తకాలని కేటలాగ్ చేశానూ అని కొన్ని మాటలు.
దాంతో పాటే ఆ పుస్తకాల జాబితా కూడా ఒక excel లో జూన్ 19న పంపించింది.
అది చూడగానే నేను చేసిన మొట్టమొదటి పని - మా ఇంటి చెక్క అలమారలో భాషాభేదాలు, పరిమాణప్రమాణాలు పట్టించుకోకుండా, ఏ అరమరికలూ లేక అమరిపోయిన తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలని - అన్నింటినీ బయటికి తీసి - తెలుగు, ఇంగ్లీష్ - అని రెండు గుట్టలుగా పేర్చి - అందులో ఇంగ్లీష్ పుస్తకాలన్నిటినీ వేరే గది లోకి తరలించడం.
ఆ తర్వాత మిగిలినవి - ఖాళీ అయిన ఓ ఎనిమిదరల చెక్క అలమార, రాశిగా పోసిన ఓ ఎనిమిది పాతికల తెలుగు పుస్తకాలు.
అప్పుడు మొదలు నా గృహ గ్రంథాలయ పరికల్పన అనగా Home Library Project - HLP.
నా Home Library Project - HLP అంటూ - నేను కన్న పుస్తకాల అమరికల-కలను సాకారం చేసుకోవడానికి నేనెంచుకున్నవి నాలుగు స-కారాలు: సరదా, సరంజామా, సమయమూ, సందర్భమూ...
చేయాలన్న సరదా,
ఆ చేయాలన్న సరదా తీర్చుకోవడానికి కూర్చుకోవల్సిన సరంజామా,
ఆ చేయాలన్న సరదా తీర్చుకోవడానికి కూర్చుకున్న సరంజామా వాడడానికి తీరుబాటు సమయమూ,
ఆ చేయాలన్న సరదా తీర్చుకోవడానికి కూర్చుకున్న సరంజామా వాడగలిగిన తీరుబాటు సమయానికి తగిన సందర్భమూ.
HLP మొదలు పెట్టడానికి కావలసిన - సరదాలూ, సరంజామాల జాబితా ఇదిగో...
ఉద్యోగపు పని రోజుల్లో అయితే ఆఫీస్ అయిపోయి, సాయంత్రపు భోజనాలు అయిపోవాలి.
శని, ఆదివారాల్లో అయితే అందరి ఆకళ్ళూ తీరిన మధ్యాహ్న వేళ అయినా ఫర్వాలేదు.
ఎప్పుడైనా సరే ముందు ఇంట్లో పెద్దల, పిల్లల భోజనాలు అయ్యి, ఎవరి పుస్తకాలు వాళ్ళు చదువుకుంటూ, ఎవరి ఆటలు వాళ్ళు ఆడుకుంటూ - ఏటవాలుగా పడే ఎండౘాలునో, చల్లగా కురిసే రేయెండ ౙాలునో - హుషారుగా ఉస్సురుస్సురనకుండా ఉండడం - ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి మహా ముఖ్యమైన ముడిసరుకు.
ఇవన్నీ కుదుర్చుకున్నాక, కుదురుగా పుస్తకాల గుట్ట మధ్య కూర్చుని - చేతికందిన పుస్తకాన్ని చేతికందినట్టు - దాని వివరాల్ని ఒక excel లో ఎక్కించాలి.
ఆలా ఎక్సెల్ డాక్యుమెంటులో ప్రతి పుస్తకానికి నేను ఎక్కించుకున్న వివరాలు (columns):
శ్రీపాద, మల్లాది, మధురాంతకం, కొడవటిగంటి, వంగూరి వంటి ప్రముఖుల కథలు, ఇతర కథా సంకలనాలు అన్నిటినీ కథలు (Short Stories) కింద చేర్చాను.
దేవులపల్లి, శ్రీశ్రీ, తిలక్, తదితర కవిప్రముఖుల కవితా సంకలనాలు కవితలు (Poetry) అన్న మకుటం కింద కుదురుకున్నాయి.
మిగిలిన పుస్తకాలన్నీ కూడా వాటికి వాటికి చెందిన - నవలలు (Fiction), వ్యాసాలు (Essays), ఆత్మకథలు (Non-fiction), సినిమా (Movies) - విభాగాల్లో చేరాయి.
పుస్తకాలన్నిటినీ ఒక list గా రాసుకున్న తర్వాత - ప్రతి పుస్తకానికి ఒక code రాసుకున్నాను. ఆ కోడ్ ఎలా ఉంటుందంటే Genre code-Author Initials-ఆ unique number.
ఒకే రచయిత కథలూ, కవితలూ కూడా రాసి ఉండొచ్చు కదా! ఉదాహరణకి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పుస్తకాలు రెండు నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఆయన రాసిన కవితలు అమృతం కురిసిన రాత్రి, ఇంకోటి కథల సంకలనం తిలక్ కథలు.
అన్నట్టు - అపురూప స్నేహితులు - బాపు-రమణలు వేసిన కార్టూన్లని, రాసిన రాతల్ని విడివిడిగా ఇతర విభాగాల్లో పెట్టి విడదీయటం ఇష్టం లేక వాళ్ళిద్దరి పుస్తకాల కోసమే ఒక ప్రత్యేక విభాగం బాపు-రమణీయం (Code: BPRN ) సృష్టించుకున్నాను.
అందులో బాపు వేసిన కళకళలాడే బొమ్మల పుస్తకాలకి BPRN-BP-nn** అనిన్నీ, ముళ్ళపూడి వారి కిలకిలలాడించే హాస్యానికి BPRN-RN-nn** అనిన్నిన్నీ పుస్తక సంకేతాలని (Book Codes) రాసుకున్నాను.
ఇదిగో - ఈ కిందే ఉంది - నా దగ్గరున్న బాపు-రమణీయమైన పుస్తక-జాబితాయణం:
అలాగే నా దగ్గర అనుకోకుండా చేరిన చలం-సాహిత్యం చాలానే ఉంది. అదెలా అంటే ఓ ఐదారేళ్ళ క్రితం మా కుటుంబమిత్రులు రఘు ఇండియా వెళ్ళిపోయేముందు తన ఫ్రెండ్స్ ఎవరో తన దగ్గర ఓ పెట్టెడు తెలుగు పుస్తకాలు వదిలి వెళ్ళారంటూ - అవన్నీ భద్రంగా తెచ్చి నాకిచ్చారు.
ఏం పుస్తకాలున్నాయా అని ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో బోల్డన్ని చలం రచనలు, దువ్వూరి రామిరెడ్డిగారి పానశాల కనిపించాయి. అప్పటి వరకు చలం పుస్తకాల గురించి వినడమే తప్ప నేనెప్పుడూ చదవలేదు.
చదివిన ఒకటి రెండు చలం గారి పుస్తకాలు నాకప్పుడు అంతగా నచ్చకపోయినా - చదవగా చదవగా - నాకు చలం రచనల్లో చాలా నిజాయితీ కనిపించింది. తను చెప్పాలనుకున్న విషయం ఎలాంటిదైనా, దానిని ఎంతో సూటిగా తన అభిప్రాయంగానే, తన రాతల్లో తనే పాత్రగా మారి ప్రకటించిన - చలం ధోరణి నాకు చాలా నచ్చింది.
ఆ రచనల్లో నిజాయితీ, దేనినీ ప్రశ్నించకుండా ఉండలేనితనం, హేతువుకి అందని విషయాలని ఒప్పలేని తనం - చలం రాసిన అన్ని రాతల మీద కాకపోయినా, చాలా రాతల వెనకాల భావాలతో ఒప్పుదల కుదిరింది. చాలా చోట్ల చలమూ, శ్రీపాదల ఆలోచన ఒకటే అయినా చెప్పడానికి ఎంచుకున్న పంథాలు వేరువేరు అనిపిస్తుంది నాకు.
చలం రచనలని - ఇది కథ, ఇది వ్యాసం, ఇది ఆత్మకథ, ఇది కవిత - అని విడదీయాలనిపించక - అన్నిటికీ ఒకటే పేరు చలం సాహిత్యం అని పెట్టేసుకున్నా. ఆ పుస్తకాలకి LT-CHLM-nn** అన్న ప్రత్యేకమైన సంకేతం నప్పింది.
ఇంకో ప్రత్యేక విభాగం - దాశరథి రంగాచార్యుల వారు రాసిన నాలుగు వేదాల అనువాదాల వేద సంహితలు. వాటికి నేనిచ్చుకున్న కోడ్: VD-DR-nn**.
**(nn అంటే 01, 02, 03, 04 ...ఒక వరస సంఖ్య ).
మొత్తానికి నా దగ్గరున్న తెలుగు పుస్తకాలన్నీ ఓ పధ్నాలుగు విభాగాలయ్యాయి.
అవన్నీ - ఇక్కడే - ఈ కిందనే రాసి పెట్టుకున్నా:
హమ్మయ్య! దాదాపు ఒక వారం రోజుల్లో - పుస్తకాల జాబితా రాసి, వాటిని విభాగాలుగా విడగొట్టి, వాటికి సంకేత నామాలు సృష్టించి - మొత్తానికి నా దగ్గరున్న నాలుగైదొందల తెలుగు పుస్తకాల్లో ఒక 222 మాత్రం మా లివింగ్ రూంలో ఉన్న చెక్క అలమారలో సర్దుదామని ఎంచుకున్నాను. మిగిలిన వాటిని బేస్మెంటుకి రవాణా చేసేశాను.
ఇహ ఇప్పుడు ... అసలు పని మొదలు.
ప్రతి పుస్తకానికి ఒక ప్రత్యేకమైన సంకేత నామం (code) పెట్టాను కదా!
దాన్ని రాయడం కోసం - పుస్తకం సైజుకి తగ్గట్టు చిన్నచిన్న లేబుల్స్ కత్తిరించుకుని - రంగురంగుల అట్టలతో ముస్తాబై నించున్న పుస్తకాల వెన్నుల మీద నేను పెట్టిన కొత్త పేర్లు రాసిన చిన్నిచిన్ని కాగితపు-తునకలు అతికించాను.
ఈ కిందున్న బొమ్మలో నేను గీసిన పచ్చ-పెట్టె మధ్యలో బాపు-రమణల పుస్తకాల మీద అంటించిన కాగితపు-తునకలు చూడొచ్చు.
అలా జూన్ 21 వ తారీఖున పుస్తకాలఆ జాబితా రాయడంతో మొదలుపెట్టి, పుస్తకాలన్నిటికీ లేబుల్స్ అతికించి అరల్లో సర్దేటప్పటికి జులై 8వ తారీఖు అయింది.
ఆ పద్ధెనిమిది రోజులూ office hours, ఇంటి పని వేళలు, రెండుపూటలా నడకకి వెళ్ళిన సమయాలూ తప్ప మిగిలిన టైమంతా నా HLP కాయితాల-అంటింపుకే అంకితం.
అంతా అయిన తర్వాత - పాతబంగారాల్లాంటి పుస్తకాలకి కొత్తకొత్త పేర్లెట్టుకుని - అలమారాలో అమర్చుకుని - ఆ మధ్యలో నా బొమ్మలను కూర్చోబెట్టుకుని - అదంతా నేనే చేసింది అని నాతో నేనే అనిఅని ఆశ్చర్యపోయా - వాటిని చూసి బదరి, బుజ్జిజింకలు "ఎంత బావుందో!" అంటే వినివిని మురిసిపోయా.

- రోజుకో గంటో, రెండు గంటలో టైమూ
- కాయితాలు కత్తిరించే సరదా
- కాయితాలు పుస్తకాలకి అంటించే ఓపిక
- ఓ లాప్టాప్ - అందులో ఓ excel సృష్టించే వీలు
- తెల్లరంగు స్టికర్ లేబుల్స్ - అవి లేకపోతే కావలసిన ప్రమాణంలో కత్తిరించుకోవడానికి తెల్ల కాయితాలు
- ఓ కత్తెర
- కత్తరించిన కాయితాలు అతికించడానికి గ్లూ స్టిక్ అని నాజూగ్గా పిలుచుకునే జిగురు-కడ్డీ. నేను pre-cut Avery lebels వాడినా కూడా వాటికి ఉన్న gum ఆరిపోయి ఉన్నాయేమో... మళ్ళీ glue stick వాడాల్సి వచ్చింది.
- చెత్తబుట్టలో పడేసే వంకతో పదేపదే లేచెళ్ళకుండా - కుదురుగా కూర్చుని కనీసం ఒక పది పుస్తకాలైనా లేబుల్ చెయ్యాలంటే - కత్తిరించిన కాయితం ముక్కలు - అవతల పారవేయాల్సినవి - వేసుకోవడానికి ఓ చిన్న ప్లాస్టిక్కుదో, ఇంకెక్కడా అక్కర్లేనిదో ఒక గిన్నె
- ఒక పెర్మనెంట్ మార్కర్ - లేకపోతే ఏదో ఒక బాల్ పెన్ను
ఉద్యోగపు పని రోజుల్లో అయితే ఆఫీస్ అయిపోయి, సాయంత్రపు భోజనాలు అయిపోవాలి.
శని, ఆదివారాల్లో అయితే అందరి ఆకళ్ళూ తీరిన మధ్యాహ్న వేళ అయినా ఫర్వాలేదు.
ఎప్పుడైనా సరే ముందు ఇంట్లో పెద్దల, పిల్లల భోజనాలు అయ్యి, ఎవరి పుస్తకాలు వాళ్ళు చదువుకుంటూ, ఎవరి ఆటలు వాళ్ళు ఆడుకుంటూ - ఏటవాలుగా పడే ఎండౘాలునో, చల్లగా కురిసే రేయెండ ౙాలునో - హుషారుగా ఉస్సురుస్సురనకుండా ఉండడం - ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి మహా ముఖ్యమైన ముడిసరుకు.
ఇవన్నీ కుదుర్చుకున్నాక, కుదురుగా పుస్తకాల గుట్ట మధ్య కూర్చుని - చేతికందిన పుస్తకాన్ని చేతికందినట్టు - దాని వివరాల్ని ఒక excel లో ఎక్కించాలి.
ఆలా ఎక్సెల్ డాక్యుమెంటులో ప్రతి పుస్తకానికి నేను ఎక్కించుకున్న వివరాలు (columns):
- క్రమ సంఖ్య (Serial Number)
- పుస్తకం పేరు
- రచయిత పేరు
- విభాగం (genre)
- సంకేతనామం (code for the book)
శ్రీపాద, మల్లాది, మధురాంతకం, కొడవటిగంటి, వంగూరి వంటి ప్రముఖుల కథలు, ఇతర కథా సంకలనాలు అన్నిటినీ కథలు (Short Stories) కింద చేర్చాను.
దేవులపల్లి, శ్రీశ్రీ, తిలక్, తదితర కవిప్రముఖుల కవితా సంకలనాలు కవితలు (Poetry) అన్న మకుటం కింద కుదురుకున్నాయి.
మిగిలిన పుస్తకాలన్నీ కూడా వాటికి వాటికి చెందిన - నవలలు (Fiction), వ్యాసాలు (Essays), ఆత్మకథలు (Non-fiction), సినిమా (Movies) - విభాగాల్లో చేరాయి.
పుస్తకాలన్నిటినీ ఒక list గా రాసుకున్న తర్వాత - ప్రతి పుస్తకానికి ఒక code రాసుకున్నాను. ఆ కోడ్ ఎలా ఉంటుందంటే Genre code-Author Initials-ఆ unique number.
ఒకే రచయిత కథలూ, కవితలూ కూడా రాసి ఉండొచ్చు కదా! ఉదాహరణకి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పుస్తకాలు రెండు నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఆయన రాసిన కవితలు అమృతం కురిసిన రాత్రి, ఇంకోటి కథల సంకలనం తిలక్ కథలు.
- అమృతం కురిసిన రాత్రి పుస్తకానికి నేనిచ్చిన code: PO-TLK-01.
- తిలక్ కథలు పుస్తకానికి నేనిచ్చిన code: SS-TLK-01.
అన్నట్టు - అపురూప స్నేహితులు - బాపు-రమణలు వేసిన కార్టూన్లని, రాసిన రాతల్ని విడివిడిగా ఇతర విభాగాల్లో పెట్టి విడదీయటం ఇష్టం లేక వాళ్ళిద్దరి పుస్తకాల కోసమే ఒక ప్రత్యేక విభాగం బాపు-రమణీయం (Code: BPRN ) సృష్టించుకున్నాను.
అందులో బాపు వేసిన కళకళలాడే బొమ్మల పుస్తకాలకి BPRN-BP-nn** అనిన్నీ, ముళ్ళపూడి వారి కిలకిలలాడించే హాస్యానికి BPRN-RN-nn** అనిన్నిన్నీ పుస్తక సంకేతాలని (Book Codes) రాసుకున్నాను.
ఇదిగో - ఈ కిందే ఉంది - నా దగ్గరున్న బాపు-రమణీయమైన పుస్తక-జాబితాయణం:
| Book Title | Book Code |
| హరివిల్లు - బాపుబొమ్మలు | BPRN-BP-00 |
| లీలాజనార్థనం - బాపు బొమ్మలు వ్యాసాలు | BPRN-BP-01 |
| బాపు కార్టూన్లు - 1 | BPRN-BP-03 |
| బాపు కార్టూన్లు - 2 | BPRN-BP-04 |
| సాహితీసర్వస్వం - 1 | BPRN-RN-01 |
| కథా రమణీయం (2) | BPRN-RN-02 |
| బుడుగు | BPRN-RN-03 |
| కదంబరమణీయం - 1 | BPRN-RN-04 |
| కదంబరమణీయం - 2 | BPRN-RN-05 |
| సినీరమణీయం - 2 | BPRN-RN-07 |
| కోతికొమ్మచ్చి | BPRN-RN-10 |
| ఇంకోతి కొమ్మచ్చి | BPRN-RN-11 |
| ముక్కోతి కొమ్మచ్చి | BPRN-RN-12 |
అలాగే నా దగ్గర అనుకోకుండా చేరిన చలం-సాహిత్యం చాలానే ఉంది. అదెలా అంటే ఓ ఐదారేళ్ళ క్రితం మా కుటుంబమిత్రులు రఘు ఇండియా వెళ్ళిపోయేముందు తన ఫ్రెండ్స్ ఎవరో తన దగ్గర ఓ పెట్టెడు తెలుగు పుస్తకాలు వదిలి వెళ్ళారంటూ - అవన్నీ భద్రంగా తెచ్చి నాకిచ్చారు.
ఏం పుస్తకాలున్నాయా అని ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో బోల్డన్ని చలం రచనలు, దువ్వూరి రామిరెడ్డిగారి పానశాల కనిపించాయి. అప్పటి వరకు చలం పుస్తకాల గురించి వినడమే తప్ప నేనెప్పుడూ చదవలేదు.
చదివిన ఒకటి రెండు చలం గారి పుస్తకాలు నాకప్పుడు అంతగా నచ్చకపోయినా - చదవగా చదవగా - నాకు చలం రచనల్లో చాలా నిజాయితీ కనిపించింది. తను చెప్పాలనుకున్న విషయం ఎలాంటిదైనా, దానిని ఎంతో సూటిగా తన అభిప్రాయంగానే, తన రాతల్లో తనే పాత్రగా మారి ప్రకటించిన - చలం ధోరణి నాకు చాలా నచ్చింది.
ఆ రచనల్లో నిజాయితీ, దేనినీ ప్రశ్నించకుండా ఉండలేనితనం, హేతువుకి అందని విషయాలని ఒప్పలేని తనం - చలం రాసిన అన్ని రాతల మీద కాకపోయినా, చాలా రాతల వెనకాల భావాలతో ఒప్పుదల కుదిరింది. చాలా చోట్ల చలమూ, శ్రీపాదల ఆలోచన ఒకటే అయినా చెప్పడానికి ఎంచుకున్న పంథాలు వేరువేరు అనిపిస్తుంది నాకు.
చలం రచనలని - ఇది కథ, ఇది వ్యాసం, ఇది ఆత్మకథ, ఇది కవిత - అని విడదీయాలనిపించక - అన్నిటికీ ఒకటే పేరు చలం సాహిత్యం అని పెట్టేసుకున్నా. ఆ పుస్తకాలకి LT-CHLM-nn** అన్న ప్రత్యేకమైన సంకేతం నప్పింది.
ఇంకో ప్రత్యేక విభాగం - దాశరథి రంగాచార్యుల వారు రాసిన నాలుగు వేదాల అనువాదాల వేద సంహితలు. వాటికి నేనిచ్చుకున్న కోడ్: VD-DR-nn**.
**(nn అంటే 01, 02, 03, 04 ...ఒక వరస సంఖ్య ).
మొత్తానికి నా దగ్గరున్న తెలుగు పుస్తకాలన్నీ ఓ పధ్నాలుగు విభాగాలయ్యాయి.
అవన్నీ - ఇక్కడే - ఈ కిందనే రాసి పెట్టుకున్నా:
| Sl, No. | విభాగం | Genre | Genre Code |
| 1 | బాపు-రమణీయం | Bapu-Ramaneeyam | BPRN |
| 2 | బాలల సాహిత్యం | Children's | CH |
| 3 | ప్రబంధాలు | Classic Poetry | CP |
| 4 | వ్యాసాలు | Essays | ES |
| 5 | నవలలు | Fiction | FC |
| 6 | చలం సాహిత్యం | Literature | LT |
| 7 | ఇతరాలు | Miscellaneous | MISC |
| 8 | పురాణాలు | Mythology | MT |
| 9 | సినిమా | Movies | MV |
| 10 | ఆత్మకథలు | Non-fiction | NF |
| 11 | కవితలు | Poetry | PO |
| 12 | కథల సంకలనాలు | Short Stories | SS |
| 13 | వేద సంహితలు | Vedas | VD |
| 14 | జ్ఞాపికలు | N/A (Souvenirs) | ZZ |
హమ్మయ్య! దాదాపు ఒక వారం రోజుల్లో - పుస్తకాల జాబితా రాసి, వాటిని విభాగాలుగా విడగొట్టి, వాటికి సంకేత నామాలు సృష్టించి - మొత్తానికి నా దగ్గరున్న నాలుగైదొందల తెలుగు పుస్తకాల్లో ఒక 222 మాత్రం మా లివింగ్ రూంలో ఉన్న చెక్క అలమారలో సర్దుదామని ఎంచుకున్నాను. మిగిలిన వాటిని బేస్మెంటుకి రవాణా చేసేశాను.
ఇహ ఇప్పుడు ... అసలు పని మొదలు.
ప్రతి పుస్తకానికి ఒక ప్రత్యేకమైన సంకేత నామం (code) పెట్టాను కదా!
దాన్ని రాయడం కోసం - పుస్తకం సైజుకి తగ్గట్టు చిన్నచిన్న లేబుల్స్ కత్తిరించుకుని - రంగురంగుల అట్టలతో ముస్తాబై నించున్న పుస్తకాల వెన్నుల మీద నేను పెట్టిన కొత్త పేర్లు రాసిన చిన్నిచిన్ని కాగితపు-తునకలు అతికించాను.
ఈ కిందున్న బొమ్మలో నేను గీసిన పచ్చ-పెట్టె మధ్యలో బాపు-రమణల పుస్తకాల మీద అంటించిన కాగితపు-తునకలు చూడొచ్చు.
అలా జూన్ 21 వ తారీఖున పుస్తకాలఆ జాబితా రాయడంతో మొదలుపెట్టి, పుస్తకాలన్నిటికీ లేబుల్స్ అతికించి అరల్లో సర్దేటప్పటికి జులై 8వ తారీఖు అయింది.
ఆ పద్ధెనిమిది రోజులూ office hours, ఇంటి పని వేళలు, రెండుపూటలా నడకకి వెళ్ళిన సమయాలూ తప్ప మిగిలిన టైమంతా నా HLP కాయితాల-అంటింపుకే అంకితం.
అంతా అయిన తర్వాత - పాతబంగారాల్లాంటి పుస్తకాలకి కొత్తకొత్త పేర్లెట్టుకుని - అలమారాలో అమర్చుకుని - ఆ మధ్యలో నా బొమ్మలను కూర్చోబెట్టుకుని - అదంతా నేనే చేసింది అని నాతో నేనే అనిఅని ఆశ్చర్యపోయా - వాటిని చూసి బదరి, బుజ్జిజింకలు "ఎంత బావుందో!" అంటే వినివిని మురిసిపోయా.
అలమరలో అమరిన
అంచెలంచెల అమరిక
అచ్చరపు బారులది...
అచ్చెరువుల ఊహలది...

అద్భుతమైన ఆలోచన మీ ఈ HLP
రిప్లయితొలగించండిపుస్తక ప్రియులకు ఇది ఓ పెద్ద HELP
మీ ఈ అత్యద్భుతమైన blogకు నేను CLAP!!
ప్రసాద్‌గారు! నా బ్లాగ్ గురించి మీ మంచి మాటలకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండిExcellent and inspirational!
రిప్లయితొలగించండిThank You andi, Ravi garu!
తొలగించండిఈరోజుల్లో ఇంత శ్రమ అవసరం లేదేమో నండీ. పుస్తకాలని అరల్లో సర్దేటప్పుడు మనం చేసే విభాగాల కంటే వాటి సైజులే ముఖ్యపాత్ర వహిస్తాయి. సైజుల ప్రకారం పుస్తకాలని సర్దుకోవటం చేసాక, వాటికి క్రమసంఖ్యలు అంటించుకొని ఒక ఎక్సెల్ ఫైల్లో అంకెకు ఎదురుగా పుస్తకం వివరాలు వ్రాసుకుంటే సరి.ఈఫైల్ తెరచి మనకు కావలసిన పుస్తకాన్ని సుళువుగానే వెదకచ్చు కదా. దాని నెంబరు తెలిసాక అలమారు లోనుండి బయటకు తీయటం సుళువే కదా. కొత్త పుస్తకం వచ్చినప్పుడు సైజు ప్రకారం ఎక్కడ ఇమిడితే అక్కడ పెట్టండి. ఆ సైజు పుస్తకాల లిష్టులో కొత్త నెంబరు వేయటమే. ఇలా సైజుకో సీరీస్ వేసుకోవటం వలన పని సుళువు అవుతుంది. పూర్వంలాగా ఇంత లైబ్రరీ సైన్స్ పని అవసరం కాదని అనుకుంటాను.
రిప్లయితొలగించండిమీరు చెప్పిన ఐడియా సైజుల వారీగా పుస్తకాలు చదివే అలవాటుండి, ఏ పుస్తకం చదవాలన్నా ఈ-ఫైల్ తెరిచి క్రమసంఖ్య ప్రకారం వెతుక్కునే తీరుబడి వున్నవారికి బావుంటుందండి.
తొలగించండికానీ కావల్సిన పుస్తకం కథో, నవలో కళ్ళతో మాత్రం వెతికి పట్టుకోవాలనుకునే నాకు, నేను చేసుకున్న పద్ధతే రైటు.
నా బ్లాగ్ ఓపిగ్గా చదివి మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు, శ్యామలీయంగారు!
మీ రన్నది కూడా నిజమే. సైజుకో నంబరు సీరీస్ పెట్టుకొని మొత్తం లిష్టంతా ఒకే ఫైల్ గానే ఉంచుకుంటాం కాబట్టి ఆ ఫైల్లో వెతుక్కోవటం ఆట్టే శ్రమ కాదు. ఈ ఫైల్‌ను మీరు గూగుల్ డ్రైవ్ లో పెట్టుకుంటే సరి, సులువుగా మీక్కావలసిన పుస్తకం లొకేట్ చేయవచ్చును. నాదగ్గర చాలా సినిమాలున్నాయి. వీటిని ఇలాగే వర్గీకరించాను చాలా కాలం క్రిందటనే. ఈమధ్య అన్ని సినిమాలూ ఇంటర్నెట్ లోనే చూస్తున్నాం అనుకోండి, అది వేరే సంగతి.
తొలగించండిలలితగారూ చాలా మంచి సేకరణే చేశారు.నేనైతే మీలాగా కోడ్ వ్రాసుకొని సర్దుకున్నాననుకోంది...ఓ రెండ్రోజులతరువాత దేనికోడ్ దేనిదో మర్చిపోయి మళ్ళీ మొత్తం గెలికేసే వుండే వాడిని :)
రిప్లయితొలగించండిమీ వ్యాసం స్ఫూర్తితో నేను కూడా పుస్తకాలు సర్దుకొని ఓ పోస్టు వ్రాసుకుంటాను :)
ముందు కొంచెం పని వుంటుంది కానీ ఒకసారి అనుకుని రాసుకున్న కోడ్ గుర్తుండిపోతుందండి. కావల్సిన పుస్తకం చప్పున తీసి చదువుకోవడం, తీసిన పుస్తకం తీసిన చోట పెట్టటం కూడా సులువవుతుంది. నా బ్లాగ్ మీకు నచ్చినందుకు సంతోషం, భాస్కర రామిరెడ్డిగారు! All the Best for your H.L.P.!
తొలగించండి*మీ రసజ్ఞహృదయం*
రిప్లయితొలగించండి*సృష్టించిన గ్రంథాలయం*
*గ్రంథాలయశాస్త్రానికి ఆదర్శనీయం*
*గ్రంథకర్తలకు ఆనందదాయకం*
*పుస్తకప్రియులకు సౌలభ్యపుష్పకం*
*ధన్యమమ్మా మీ సత్కృత్యం*
*ధన్యమయ్యె!మీకు లభ్యమైన తత్సత్సాహిత్యం*
*గాదిరాజు మధుసూదన రాజు*
రాజుగారు! మీ ప్రోత్సాహకర వ్యాఖ్యకి బోల్డన్ని ధన్యవాదాలు!
తొలగించండిఅందమైన బొమ్మల కొలువులా..సరస్వతీ దేవి గారి ఇంట్లో బుక్ షెల్ఫ్ లా భలే ఉంది.
రిప్లయితొలగించండిఅలా ముద్దుగా చేసుకున్నదే కాకుండా, ఇంకా అందంగా, ఓపికగా పోస్టు రాసేరు కదా...ఎలాంటి అవరోధాలు వస్తాయో అవి ఊహించి, వాటికి చిట్కాలతో సహా. ఆ ఆనందం పంచుకోడం ఇంకా నచ్చేసింది!
పుస్తకాల కొలువులో, వాటిని చదివే బుజ్జితల్లుల్లా ఉన్న ముద్దు బొమ్మలు బోనస్!!
బోల్డు బోల్డు థాంక్యూలు!!
నా పుస్తకాల కూర్పునీ, అందులో కూర్చున్న బొమ్మల కొలువునీ - రెండిటినీ మెచ్చుకున్న మీ పదాల పేర్పుకి బోల్డన్ని థాంక్సు!
తొలగించండి