1, ఫిబ్రవరి 2025, శనివారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 16, 17

  క్రిందటి శ్లోకం / Previous slOkaH:  స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 14, 15





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



శ్లోకం -16

సర్వదాభిగతః  సద్భిః
సముద్ర  ఇవ  సింధుభిః
ఆర్యః  సర్వసమశ్చైవ
సదైకప్రియదర్శనః


శ్లోకం -17

స  చ  సర్వగుణోపేతః 
కౌసల్యానందవర్ధనః
సముద్ర  ఇవ  గాంభీర్యే
ధైర్యేణ  హిమవానివ



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అర్థం: 

(గమనిక: 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వాల్మీకి మహర్షికి  వివరిస్తూ నారద మహర్షి రాముని సుగుణాల గురించి చేసిన వర్ణన వుంటుంది.)


శ్లోకం -16

    ఎల్లప్పుడూ నదులతో సముద్రుని వలె సజ్జనులతో (రాముడు) సమీపించబడువాడు. అతడు ఉత్తముడు. అందరితో ఒక్కలా నడుచుకొనువాడు. ఎల్లప్పుడూ అందరికీ ఇష్టుడైనవాడు.



శ్లోకం -17

    అతడు సకల గుణసంపన్నుడు. తల్లైన కౌసల్య సంతోషాన్ని ఇనుమడింపజేయువాడు. గాంభీర్యంలో సముద్రునిలాంటివాడు. స్థైర్యంలో హిమవంతునిలాంటివాడు.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)


శ్లోకం -16

సర్వదా  అభిగతః  సద్భిః
సముద్ర  ఇవ  సింధుభిః
ఆర్యః  సర్వసమః  చ  ఏవ
సదా  ఏకప్రియదర్శనః


సర్వదా  = ఎల్లప్పుడూ
అభిగతః  = సమీపించబడువాడు
సద్భిః = సజ్జనులతో
సముద్ర  = సముద్రుని
ఇవ  = వలె
సింధుభిః = నదులతో
ఆర్యః  = ఉత్తముడు
సర్వసమః  = అందరితో ఒక్కలా నడుచుకొనువాదు
సదా  = ఎల్లప్పుడూ
ఏకప్రియదర్శనః = అందరికీ ఇష్టుడైనవాడు

శ్లోకం -17

సః  చ సర్వగుణోపేతః 
కౌసల్యా-ఆనందవర్ధనః
సముద్ర ఇవ గాంభీర్యే
ధైర్యేణ హిమవాన్ ఇవ


సః  = అతడు
సర్వగుణోపేతః = సకల గుణసంపన్నుడు
కౌసల్యా-ఆనందవర్ధనః = తల్లైన కౌసల్య సంతోషాన్ని ఇనుమడింపజేయువాడు
సముద్ర  ఇవ = సముద్రునిలాంటివాడు
గాంభీర్యే = గాంభీర్యంలో
ధైర్యేణ = స్థైర్యంలో
హిమవాన్  ఇవ = హిమవంతునిలాంటివాడు


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



श्लोकः - 16

सर्वदाभिगतः सद्भिः 
समुद्र  इव सिन्धुभिः |
आर्यः  सर्वसमश्चैव 
सदैकप्रियदर्शनः ||


श्लोकः - 17

स  च  सर्वगुणोपेतः 
कौसल्यानन्दवर्धनः |
समुद्र  इव  गाम्भीर्ये 
धैर्येण  हिमवानिव ||



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Meaning in English

(NOTE: From the slOkaH 8 until slOkaH 20, the virtues of Rama are described by Narada maharshi to Valmeeki maharshi)

श्लोकः - 16

    He is always approached by the virtuous as the ocean is by the rivers. He is noble, alike to all and always dear to all. 



श्लोकः - 17

    He is endowed with all good qualities. He enhances the delight of his mother Kausalya. He compares with the ocean in profundity and with Himavanta (Himalaya) in firmness. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


Word to word meaning (In the same order of occurrence in the slOkaH):

श्लोकः - 16

सर्वदा  अभिगतः  सद्भिः 
समुद्र   इव  सिन्धुभिः 
आर्यः   सर्वसमः  च  एव 
सदा  एकप्रियदर्शनः 

सर्वदा  = always
अभिगतः  = approached
सद्भिः = by virtuous persons
समुद्र   = ocean
इव  = just like
सिन्धुभिः  =  by rivers
आर्यः   = noble 
सर्वसमः  = alike to all
सदा  = always
एकप्रियदर्शनः  = is dear to all


श्लोकः - 17

सः  च  सर्वगुणोपेतः 
कौसल्या-आनन्दवर्धनः |
समुद्रः  इव  गाम्भीर्ये 
धैर्येण  हिमवान्  इव ||

सः  = he
सर्वगुणोपेतः =  endowed with all good qualities
कौसल्या-आनन्दवर्धनः = enhances mother Kausalya's delight
समुद्रः  इव   = like ocean
गाम्भीर्ये  = in profundity
धैर्येण  = in firmness
हिमवान्  इव = like Himavanta




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 18

6 కామెంట్‌లు:

  1. "నదులతో చేరు సముద్రుని వలె "
    చేరు తొలగిస్తే - అర్థం సుబోధమౌతుందేమో

    రిప్లయితొలగించండి
  2. నోరారా ' రామా ' యని ,
    శ్రీరాముని నామ జపము చేసిన చాలున్ ,
    ఆ రాముడె అండ నిలిచి ,
    పోరాడును , జనుల కష్టములు పోనడచున్ .

    రిప్లయితొలగించండి
  3. సకల సుగుణ రాశి , శుభలక్షణములు గల
    రూపలావణ్యు , శ్రీరాము , చూపు దిగని
    దివ్య మంగళ మూర్తి దేదీప్యమాన
    మూర్తిమత్వము కీర్తించ , మునియె నేర్చు .

    రిప్లయితొలగించండి
  4. వసంతపంచమి శుభాకాంక్షలు
    రామాయణ ఘనకార్యాన్ని క్రమం తప్పకుండా
    నిర్వహించగల ఘనతలు మీకు ప్రసాదించాలని
    అమ్మని కోరుకుంటూ .....

    నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
    వాగ్దేవి ! శారదా ! వందనములు ,
    తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
    బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
    బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
    పరదేవతా ! నీకు వందనములు ,
    పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
    పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,

    జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
    వర సరస్వతీ మాతరో ! వందనములు ,
    ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
    వరలు మూలపుటమ్మరో ! వందనములు .

    పాల నీళ్ళ వేరు పరుపంగ నేర్చిన
    హంస నెక్కి తిరుగు నజుని రాణి !
    మంచి చెడుల నెంచు మహనీయ బుధ్ధిచ్చి
    మమ్ము గావు మమ్మ ! మంజు వాణి .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పక పూర్తి చేస్తానండి, మాష్టారు! మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

      తొలగించండి