క్రిందటి శ్లోకం / Previous slOkaH: స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 13
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
శ్లోకం -14రక్షితా స్వస్య ధర్మస్యస్వజనస్య చ రక్షితావేదవేదాంగతత్త్వజ్ఞఃధనుర్వేదే చ నిష్ఠితః
శ్లోకం -15
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః
స్మృతిమాన్ ప్రతిభానవాన్
సర్వలోకప్రియః సాధుః
అదీనాత్మా విచక్షణః
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అర్థం:
(గమనిక: 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వాల్మీకి మహర్షికి వివరిస్తూ నారద మహర్షి రాముని సుగుణాల గురించి చేసిన వర్ణన వుంటుంది.)
శ్లోకం -14
తనదైన నమ్మకాన్ని (ధర్మాన్ని) పరిరక్షించువాడు, తనవారిని రక్షించువాడు, వేదవేదాంగాల తత్త్వము తెలిసినవాడు, విలువిద్యలో నిష్ణాతుడు.
శ్లోకం -15
సకల శాస్త్రముల తత్త్వమెరిగినవాడు, గొప్ప జ్ఞాపకశక్తి కలిగినవాడు, ప్రతిభావంతుడు, జనులందరికీ ఇష్టుడు, అణకువ గలవాడు, ఉన్నతమైన స్వభావము గలవాడు, వివేకశాలి.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)
శ్లోకం -14రక్షితా స్వస్య ధర్మస్యస్వ-జనస్య చ రక్షితావేద-వేదాంగ-తత్త్వజ్ఞఃధనుర్వేదే చ నిష్ఠితః
రక్షితా = పరిరక్షించువాడు
స్వస్య = తనదైన
ధర్మస్య = నమ్మకాన్ని (ధర్మాన్ని)
స్వ-జనస్య = తనవారిని
రక్షితా = రక్షించువాడు
వేద-వేదాంగ-తత్త్వజ్ఞః = వేదవేదాంగాల తత్త్వము తెలిసినవాడు
ధనుర్వేదే = విలువిద్యలో
నిష్ఠితః = నిష్ణాతుడు
శ్లోకం -15
సర్వ-శాస్త్రార్థ-తత్త్వజ్ఞః
స్మృతిమాన్ ప్రతిభానవాన్
సర్వ-లోకప్రి-యః సాధుః
అదీనాత్మా విచక్షణః
సర్వ-శాస్త్రార్థ-తత్త్వజ్ఞః = సకల శాస్త్రముల తత్త్వమెరిగినవాడు
స్మృతిమాన్ = గొప్ప జ్ఞాపకశక్తి కలిగినవాడు
ప్రతిభానవాన్ = ప్రతిభావంతుడు
సర్వ-లోక-ప్రియః = జనులందరికీ ఇష్టుడు
సాధుః = అణకువ గలవాడు
అదీనాత్మా = ఉన్నతమైన స్వభావము గలవాడు (దీనత్వానికి లోబడనివాడు)
విచక్షణః = వివేకశాలి
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
श्लोकः - 14
रक्षिता स्वस्य धर्मस्य
स्वजनस्य च रक्षिता |
वेदवेदाङ्गतत्त्वज्ञः
धनुर्वेदे च निष्ठितः ||
श्लोकः - 15
सार्वशास्त्रार्थतत्त्वज्ञः
स्मृतिमान् प्रतिभानवान् |
सर्वलोकप्रियः साधुः
अदीनात्मा विचक्षणः ||
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
Meaning in English
NOTE: From the slOkaH 8 until slOkaH 20, the virtues of Rama are described by Narada maharshi to Valmeeki maharshi)
श्लोकः - 14
He is the protector of his own faith. He protects his own people. He knows the essence of Vedas & Vedaangaas. He is skilled in archery.
श्लोकः - 15
He knows the meaning of all scriptures. He has sharp memmory. He is intelligent. He is liked by all people. He is obedient, undepressed in sprit, and wise.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
Word to word meaning (In the same order of occurrence in the slOkaH):
श्लोकः - 14
रक्षिता स्वस्य धर्मस्य
स्व-जनस्य च रक्षिता |
वेद-वेदाङ्ग-तत्त्वज्ञः
धनुर्वेदे च निष्ठितः ||
रक्षिता = protector
स्वस्य = of own
धर्मस्य = of faith
स्वजनस्य = of own people
रक्षिता = protector
वेद-वेदाङ्ग-तत्त्वज्ञः = who knows the essence of Vedas & Vedaangaas
धनुर्वेदे = in archery
निष्ठितः = one who is skilled
श्लोकः - 15
सार्व-शास्त्रार्थ-तत्त्वज्ञः
स्मृतिमान् प्रतिभानवान् |
सर्व-लोक-प्रियः साधुः
अदीनात्मा विचक्षणः ||
सार्व-शास्त्रार्थ-तत्त्वज्ञः = who knows the meaning of all scriptures
स्मृतिमान् = who has sharp memory
प्रतिभानवान् = intelligent
सर्व-लोक-प्रियः = who is liked by all people
साधुः = obedient
अदीनात्मा = undepressed in spirit
विचक्षणः = wise
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 16, 17, 18

సకల సద్గుణోపేతుడు , సమధికబల
రిప్లయితొలగించండిశౌర్యవిభవ , ధీరోదాత్త , సద్యశుండు
రామచంద్రప్రభుడు సర్వ రక్షకుండు
చేతులెత్తి కొలుతు క్షితిజ పతిని .
అతి మనోఙ్ఞమ్ము నీ యతులిత నామమ్ము
రిప్లయితొలగించండిరామా యనంగ మంత్రమయి వెలుగు
అతి మనోఙ్ఞమ్ము నీ యతులిత తనుచాయ
నీల మేఘ శ్యామ శ్రీలలితము
అతి మనోఙ్ఞమ్ము నీ యతులిత వక్షమ్ము
కౌస్తుభాలంకృత కళల నెలవు
అతి మనోఙ్ఞమ్ము నీ యతులిత పదయుగం
బమల గంగా జల విమల తలము
రాఘవా ! రావణాంతక ! ప్రభో ! రక్ష , రక్ష
నీదు రామాయణకథా వినోద మతి మ
నోహరము , పురుషోత్తమా ! శ్రీహరీ ! న
మోస్తు 🙏 సీతాపతే ! శుభ మోహనాంగ !