పొద్దున్నే నాన్ననుంచి వాట్సాప్లో ఒక యూట్యూబు లింకొకటి.
ఏంటబ్బా అని చూస్తే అది నేను చిన్నప్పట్నుంచీ చాలా సార్లు విన్న దశావతారాల భజన పాట - నాన్న పాడినది యూట్యూబ్లో పెట్టారు.
ఆయన ఇంతకు ముందు చాలాసార్లు చెప్పారు - హైదరాబాదు వెళ్లినప్పుడు మ్యూజిక్ స్టూడియో కి వెళ్లి పాట పాడానని.
గబగబా ఒకసారి పాట వినేసి - నాన్నకి ఫోన్ చేశాను - ఆ పాట పాడడం వెనకాల కబుర్లేంటో విందామని.
"హలో నాన్నా - బావున్నారా?"
"బావున్నాను - కోయిలమ్మ చూస్తున్నాను టీవీలో" - అడక్కుండానే స్టేటస్ అప్డేట్
(ఒక్కోసారి కార్యక్రమం పేరునిబట్టి 'ఇప్పుడు నేను నీతో మాట్లాడనని' - చెప్తున్నట్లు అర్థం చేసుకోవాలి నేను - అది జోధా అక్బర్ 566 వ ఎపిసోడ్ నాలుగోసారి చూస్తున్నదయినా సరే!)
"అయితే ఫోన్ పెట్టేయనా నాన్నా? మళ్లీ చేయనా అదయిపోయాక?"
"అబ్బే అక్కర్లేదు చెప్పుఏంటి విశేషాలు?"
"ఈ పాటేంటి నాన్నా? ఎప్పుడు పాడారు?"
"ఎప్పుడంటే - హైదరాబాదు వెళ్లినప్పుడు"
"అదే ఎప్పుడు?"
పక్కనే వున్న అమ్మకేసి తిరిగి అడిగారు "మనమెప్పుడు వెళ్లాం ?" - అమ్మ సమాధానం "డిసెంబర్లో వెళ్లాం కదా - పప్పీ దగ్గరికి?"
మళ్లీ నాతో ఫోన్లో - "అదే లల్లీ ! డిసెంబర్ 27 దాకా హైదరాబాదులోనే వున్నాం. అప్పుడు బులుసు సత్యనారాయణమూర్తి అని నా SKBR కాలేజ్-మేట్ నాతో - 'దశావతారాల పాట పాడూ - రికార్డు చేయిద్దాము' అన్నాడు. నాకసలే జలుబుగా వుంది పాడలేనన్నా వినలేదు. రవీంద్ర అని ఒక హిందుస్థానీ పాడే అతను వున్నాడు . అతనికో రికార్డింగ్ స్టూడియో వుంది. అక్కడికి తీసుకెళ్లి నా చెవులకి హెడ్ఫోన్స్ అవీ పెట్టి, నా ముందు మైకు పెట్టి నన్నా స్టూడియోలో పెట్టేశారు - నేను పాడేశాను"
"బావుంది నాన్నా! ఇంతకీ ఆ బులుసు సత్యనారాయణమూర్తి గారేం చేస్తూ వుంటారు?"
"భగవద్గీత ఇంగ్లిష్ లో తర్జుమా చేస్తూ పుస్తకాలు రాశాడు - ఏదో వెబ్సైట్ కూడా ఉన్నట్టుంది - నాకో లింక్ పంపించాడు - నీకు ఫార్వార్డ్ చేస్తాను చూడు - ఈ ఫోన్ పెట్టేశాక "
{నాన్న పంపించిన BS Murthy గారి పుస్తకం లింక్ : Bhagavd-Gita Treatise of Self-Help
యూట్యూబ్ లింక్ : Bhagavd-Gita Treatise of Self-Help}
"ఇంతకీ ఆ యూట్యూబ్లో ఆ దశావతారాల బొమ్మ బావుంది - అదెక్కడిది?"
"అది కూడా తనే - గోపి అని ఒక ఆర్టిస్టు చేత వేయించాడు - బావుంది కదా!"
"బావుంది నాన్నా - చాలా - మీ ఫ్రెండ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చేయించినట్టున్నారు - ఈ మొత్తం రికార్డింగంతా"
"అవును - నీ బ్లాగ్లో పెట్టేయ్"
"పెడతాలెండి బాబూ! ఇప్పుడు పంపారుగా"
"దాంతోపాటు నేనింతకుముందు పాడిన ఆ ఆరు పాటలు కూడా పెట్టేయ్ - నువ్వు పాడిన నాన్నమ్మ పాట - 'కలువరేకులబోలు కనులు చూచుట చాలు ' విన్నాను - నువ్వు బా పాడలేదు "
"సరే - మీరే బాగా పాడతారు - ఒప్పుకుంటాను కానీ - ఓ రెండు నిముషాలు అమ్మకివ్వండి - ఆఫీసుకి టైమవవుతోంది - ప్రస్తుతానికి ఈ దశావతారాలు బ్లాగ్లో పోస్ట్ చేస్తాను - రేప్పొద్దున్న చూడండి"
"సరే ఇస్తానుండు" అని అమ్మకి ఫోన్ ఇచ్చారు.
అమ్మతో రెండంటే రెండే నిముషాలు గబగబా మాట్లాడి మళ్లీ రేపు చేస్తానని చెప్పి పెట్టేశాను.
ఇదిగో - బులుసు సత్యనారాయణమూర్తిదగ్గరుండి రికార్డ్ చేయించగా మా నాన్న పాడిన దశావతారాల పాట -
అవధారు - దశావతారాల ఈ పాట జోరు :)

is Sri.B.S.Murty from BSNL?
రిప్లయితొలగించండినాన్న గారికి కంగ్రాట్స్ చెప్పండి,కష్టపడి విన్నాను జంధ్యాల ’కవి’ని కదా బాగుంది.
శర్మగారు: పాట విన్నందుకు ధన్యవాదాలు - నానుంచి, నాన్ననుంచి కూడా. BS మూర్తి గారు BSNL కాదటండి - NMDC లో పని చేసేవారట.
తొలగించండిThank you for sharing the link in your post. Mee blog nunchi manchi vishayalu nerchukuntunnamu.
రిప్లయితొలగించండిSarada: Thank you for your nice words about my blog.
తొలగించండిHi lalli నాన్న గారు పాడిన ద శావతారాలు 👌🏼👌🏼👌🏼👌🏼
రిప్లయితొలగించండిSyamala: Thank You :)
తొలగించండిPata bagundi lalitha garu.
రిప్లయితొలగించండిYour father voice is good.
రిప్లయితొలగించండిHi Lalli Akka dasavataralu song Chala bagundi👌
రిప్లయితొలగించండిKatyayini, Amrutha, Uma: Thanks for your comment!
రిప్లయితొలగించండిలలితా! ముందుగా, అంత బాగా పాడిన మీ నాన్నగారికి అభినందనలు.
రిప్లయితొలగించండిపాట, బొమ్మ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.
అంత మంచి స్నేహితులున్న మీ నాన్నగారు అదృష్టవంతులు.
నీ అభినందనలు నాన్నకి అందిస్తాను :)
తొలగించండిఈ పాట నా చిన్నపుడు బాబీ గారు పాడితే విన్నాను.
రిప్లయితొలగించండిమళ్లీ ఇన్నాళ్ళకు బాబీ గారి అవతారాలు పాట వినిపించిన నీకు ధన్యవాదములు అక్కా !
నాన్న పాట మళ్లీ విన్న నీకు థాంక్స్, హనుమాన్!
తొలగించండిChala bagundi
రిప్లయితొలగించండిThank You!
తొలగించండి