2014 సంవత్సరం
అమ్మా, నాన్నా జులై లో రావడం, వాళ్ళతో వెళ్లి అన్నగాణ్ణి కాలేజ్ లో చేర్పించడం, మళ్ళీ వాళ్ళని షికాగో విమానాశ్రయంలో ఎయిర్-ఇండియా విమానం ఎక్కించడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
అసలు హైద్రాబాదులో విమానం ఎక్కి - ఇక్కడికి వచ్చేముందే చెప్పింది అమ్మ - నాన్నకి నడుము నొప్పి వస్తోందని - కానీ నాన్న డాక్టర్ దగ్గరికి అమెరికా నుంచి వెనక్కి వెళ్ళాక వెళ్దామని అనుకుంటున్నారని.
నాకెందుకో అనిపించింది - నాన్నకేదో అది మామూలు నొప్పి కాదు, ఆయన కావాలనే డాక్టర్ దగ్గరికి వెళ్లడాన్ని వాయిదా చేస్తునారని. మళ్ళీ వాళ్ళేమన్నా టెస్టులు అవీ అంటే అమెరికా రావడం కుదరదని.
మరి నేనేమో ఏడాది నుంచీ అంటూనే వున్నాను - "నాన్నా! మీరు వాడి అక్షరాభ్యాసానికి గుంటూరు వచ్చారు, మళ్ళీ వాణ్ణి కాలేజ్ లో చేర్పించడానికి కూడా రావాలి" - అని.
సరే - మొత్తానికి అమెరికా వచ్చారు.
మేమిక్కడ నుంచి టికెట్లు కొంటే ఆరు నెలలకి కొనేస్తామని - మూడు నెలల్లో తిరిగి వెళ్ళేలాగా - అక్టోబర్ రెండవవారంలో ప్రయాణం ఉండేలా - టు అండ్ ఫ్రో టికెట్లు ఆయనే బుక్ చేసుకున్నారు.
ఇక్కడ వున్నప్పుడు - వారానికి ఒక పది గంటలు ఆఫీస్ పని చేసేవారు.
రాజమండ్రి నుంచి ఆఫీస్ వాళ్లు రిపోర్ట్స్ అవీ ఈ-మెయిల్ చేస్తే అవి సరి చూస్తూ - అవసరమైతే ఫోన్ లో కాన్ఫరెన్స్ కాల్స్ జరుపుతూ.
బయటకి ఎక్కడకి వెళ్ళినా ఎక్కువసేపు నడవలేకపోయేవారు. నడుము మీద చేయి వేసుకుని కూర్చుండిపోతూ వుండేవారు.
"కాలిఫోర్నియా అంటే బోల్డు తిరగాలి నాన్నా - పోనీ ఇంట్లో వుండండి నేనూ, తనూ వెళ్లి వాణ్ణి కాలేజ్ లో చేర్పించేసి వచ్చేస్తాము", అంటే - "అబ్బే! ఇంత దూరం వచ్చాను - అమెరికా వెస్ట్ కోస్ట్ చూడాల్సిందే" అన్నారు.
బదరి - నాన్న ఉత్సాహం ప్లస్ ఆయన నడవడానికి పడుతున్న ఇబ్బంది చూసి అన్నారు నాతో - "అంకుల్ కి వాకింగ్ స్టిక్ కొంటే ఆయనకి నడవడానికి సపోర్ట్ గా వుంటుంది, కొంచెం హాయిగా నడవగలుగుతారు" - అని.
వాకింగ్ స్టిక్ అన్న మాటే నాన్నకి నచ్చలేదు మొదట.
ఆయనకి - తానెప్పుడూ ముచ్చటగా నెమరేసుకుని - చుట్టూ వున్న అందరితో పంచుకునే కుర్ర-తనం తాలూకు గత కాలపు జ్ఞాపకాలనుంచి నుంచి - వర్తమానంలో కర్ర-తనానికి జరగబోతున్న బదిలీ - అంత ఇష్టంగా అనిపించినట్లులేదు.
కాని బదరి రోజూ ఆన్లైన్ లో రకరకాల మోడల్స్ లో చేతికర్రలు వెతికి - "అంకుల్! ఇది బావుందా, అది బావుందా" - అని అడుగుతూ - మొత్తానికి తనకి మాత్రమే సొంతమైన సమ్మోహనాస్త్రంతో - నాన్నలో మెల్లిగా చేతికర్రాసక్తిని పెంచారు.
షాపింగ్ కి వెళ్ళిన ప్రతీ చోటా వాకింగ్ స్టిక్ గురించి వాకబు చేస్తూ చేస్తూ చివరికి Unlce Sam's అనే షాప్ లో లాఠీలా కనిపించే ఒక చేతికర్ర కొన్నారు.
అది చిన్న బాటన్ లా వుండి అవసరం అయినపుడు తెరుచుకునేలా గొడుగుకర్రలా పని చేస్తుందన్నమాట.
నాన్నకి అది నచ్చింది - సినిమాల్లో మిలిటరీ పాత్రధారులు పట్టుకునే స్టైలిష్ స్టిక్ లా.
మొత్తానికి రోజూ సాయంకాలం ఒక గంట వాకింగ్ కి వెళ్లి వచ్చేవారు. ఇదంతా ఎందుకంటే కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు నడవడానికి కావాల్సిన స్టామినా సమకూరుతుందని.
అమ్మా, నాన్న వచ్చిన పని నిర్విఘ్నంగా జరిగింది.
అందులో భాగంగా - అన్న ఈగిల్ స్కౌట్ సెరెమనీ - చిన్నప్పట్నుంచి కారులో తిప్పిన తాతగారిని అన్న తన కార్లో షికారుకి తీసుకెళ్లడం - తాతగారు అన్నని లంచ్-డేట్ కి తీసుకెళ్ళడం - అన్నిటికన్నా ముఖ్యంగా తాతగారు-అమ్మమ్మ, నాన్నమ్మ - ముగ్గురూ కలిసి కాలిఫోర్నియా వచ్చి వాడిని కాలేజ్ లో చేర్పించడం - అన్నీ ఒకదాని తర్వాత ఒకటి - అనుకున్నట్టుగా కొన్ని- అనుకోకుండా కుదిరి కొన్ని - జరిగిపోయాయి.
"టికెట్లు పోస్టుపోన్ చేసుకుని - అక్టోబర్ లో ఆకులు రంగులు మారతాయి - అవి చూసి ఇంకో నెలన్నరలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా స్నో పడుతుంది అది చూసి వెళ్ళండి" అంటే "అబ్బే - ససేమిరా కాద"న్నారు నాన్న.
పాపం అమ్మకి ఉండాలనే వుంది. కానీ నాన్న వింటేగా. అనుకున్నట్టుగానే అక్టోబర్ లో ఇండియా వెళ్లారు.
ఇండియా వెళ్ళిన వారం రోజుల్లో ఫోన్ లో అమ్మ గొంతు దిగులుగా వినిపించింది - "నాన్న నిన్న వెళ్లి అన్ని టెస్టులూ చేయించుకున్నారు. మన అపార్ట్ మెంట్ లో తెలిసిన డాక్టర్ గారు ఆ రిపోర్టులు చూడగానే - 'కామేశ్వర్రావుగారూ ముందు మీరు అర్జెంటుగా హైద్రాబాదు వెళ్లాల్సివుంటుంది ' అంటే - నాన్నేమో - 'డిసెంబర్ లో మావాళ్ల ఇంట్లో పెళ్లి వుంది అప్పుడు వెళ్తాను' అన్నారు. అది వినగానే డాక్టరు గారు - 'మీకెలా చెప్పాలో తెలియట్లేదండీ కానీ మీరు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది' అని చెప్పేశారు. ఇంకో వారంలో ప్రయాణం. పప్పీ దగ్గరకి వెళ్తున్నాము" -అని చెప్పింది.
హైదరాబాదులో పప్పీ దగ్గరికి వెళ్లారు - అమ్మా, నాన్న.
స్టార్ హాస్పిటల్ లో డాక్టర్ గోపీచంద్ గారి దగ్గర appointment దొరికింది.
Angiogram, ఇంకా మిగిలిన ప్రిలిమినరీ టెస్టులు అన్నీ అయ్యాక - రిపోర్టులు వచ్చాక వాటి గురించి మాట్లాడడానికి డాక్టర్ గోపీచంద్ గారి దగ్గరికి వెళ్లారు - అమ్మ, నాన్న, పప్పి.
రిపోర్టులు అవీ చూసి డాక్టర్ గారు - తొందర్లోనే సర్జరీ చేయాలి అని చెప్పగానే - నాన్న ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడాలి అని చెప్పి - అమ్మని, పప్పీని డాక్టర్ గారి రూంలోంచి బయటికి వెళ్లమన్నారట.
వాళ్లలా వెళ్లగానే - నాన్న, డాక్టర్ గోపీచంద్ గార్ల మధ్య జరిగిన సంభాషణ:
"డాక్టర్ గారు! ఎంతవుతుందండి ఈ ఆపరేషన్ కి?
"దాదాపు XX లక్షల దాకా అవుతుందండి - రెండు స్టెంట్లు వెయ్యాలి - అదీ కాక Aortic Aneurysm మీకున్న ఇంకొక ప్రాబ్లెమ్. అది ఎప్పుడైనా రప్చర్ అవొచ్చు"
"ఎప్పుడైనా అంటే ఎన్నాళ్లు పడుతుందంటారు?"
"ఇవాళ కావొచ్చు - ఇంకో రెండేళ్లు పట్టొచ్చు"
"ఆపరేషన్ చేస్తే ఎన్నాళ్లు ఉంటానంటారు?"
"ముందు మీరు సిగరెట్లు మానేయాలి - ఆపరేషన్ చేయాలి - అదికూడా 50-50 ఛాన్స్ - ఆ తర్వాత ఓ పదేళ్ల దాకా పర్వాలేదు"
"నాకిప్పుడు 69 ఏళ్లు - ఆపరేషన్ చేయకపోయినా రెండేళ్లుంటాను - చేస్తే 50-50 ఛాన్స్ అంటున్నారు - ఎందుకొచ్చిన గొడవ - నన్నొదిలేయండి - హాయిగా ఇంటికెళ్లిపోతాను"
డాక్టర్ గారేమీ మాట్లాడలేదు.
ఎదురుగా టేబుల్ మీద వున్న బజర్ నొక్కారు - నర్స్ లోపలికి వచ్చింది.
నర్స్ తో డాక్టర్ గారు "బయట కామేశ్వరరావుగారి భార్య వుంటారు - ఒకసారి పిలు" అని చెప్పారు.
నాన్న వెంటనే కంగారుగా "ఇప్పుడావిడని పిలవడం ఎందుకండీ డాక్టర్ గారు?!" అని కుర్చీలో ఇబ్బందిగా కదిలారు.
"ఆపరేషన్ కాకపోయినా రెండేళ్లు వుంటాను కదా - చేయించుకోకూడదు అన్న మీ ప్లాన్ కూడా బావుంది - మీరన్నది ఆవిడకి కూడా చెబ్దామండి" - అన్నారు డాక్టర్.
.... ..... .....
(నాన్న ఆలోచిస్తున్నారు - డాక్టరు అమ్మని పిలవకుండా ఎలా ఆపాలా అని)
"మీ ఆవిడ నాకు ఆల్రెడీ చెప్పారు - మీరు ఆపరేషన్ వద్దంటారని. అందుకే" అంటూ మళ్లీ నర్స్ కేసి తిరిగి - "ముందావిణ్ణి పిలుచుకురా" అని చెప్పారు డాక్టర్ గోపీచంద్ గారు.
నాన్న వెంటనే సర్దుకుని "వద్దు లెండి - ఆపరేషన్ కి ఎప్పుడు రావాలో ఆ వివరాలు చెప్పండి" అంటూ బయటికి నడిచారు.
హైద్రాబాదు - హాస్పిటల్స్ అంటేనే పట్టపగలే చుక్కలు కనిపించే వైనం - అలాంటి నక్షత్ర దర్శనం - ఆపరేషన్ జరగబోతున్నా - చుట్టూవున్నవాళ్లందరూ కంగారు పడుతున్నా - అంత హడావిడిలోనూ నాన్న కావించిన హాస్యప్రియత్వ-దర్శనానికి ఇది నాంది. ఇంక వనచరకొండలు అంటే ... ముక్తాయింపులో చెప్తాను.
<ముక్తాయింపు వచ్చే నెల ఇంకొన్ని కబుర్లతో.... >

ఆరోగ్యం బాగా లేకపోయినా daddy work from home అన్నమాట , ఇప్పుడు ఎలా ఉన్నారు ? వనచరకొండలు=బంజారాహిల్స్?
రిప్లయితొలగించండినాగరాణిగారు: US వచ్చినప్పుడల్లా వారానికి కొన్ని గంటలు ఆఫీస్ కాల్స్ తీసుకునేవారు - మూడు నెలలు ఆగలేని పనులు వుండేవి కాబట్టి. ఒంట్లో బాలేనప్పుడు - వర్క్ చేయలేదులెండి. మళ్లీ ఇప్పుడు - బావున్నారు బిజీ గా వుంటారు ఎప్పుడూ.
తొలగించండివనచరకొండలు=బంజారాహిల్స్ - Yes :)
Thanks for your comment!
లలిత గారూ,
రిప్లయితొలగించండిమీ నాన్నగారి హాస్యాన్ని అంత easy గా తీసికుని, నే రాసిన టపా సీరియస్ గా తీసికోవడానికి, నేనేం పాపం చేశాను తల్లీ?
నాన్నది నా చిన్నప్పట్నుంచీ అలవాటైన హాస్యం - మీది నా బ్లాగప్పట్నుంచీ అలావాటు చేసుకోబోతున్న హాస్యం :) ఇంక నన్ను మన్నించేయండి - please!
తొలగించండిHow is ur father now ?
రిప్లయితొలగించండిHe is doing fine, Amrutha! There is a continuation to this post about his surgery & recovery - that I will be posting next month.
తొలగించండివనచరకొండ కి వెళ్ళాము బాబీ గారిని చూడటానికి హైదరాబద్ లో వున్న అనాతవరము వాళ్ళము.
రిప్లయితొలగించండిఅందర్నీ చూసి సెక్యూరిటీ వోడు కంగారు పడ్డాడు.
ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అటెండ్పాస్ మార్చుకుని బాబీ గారి రూమ్ కి వెళ్లి చూసాము
వునా, హనుమాన్! సెక్యూరిటీ వాళ్లకి రోజూ ఆశ్చర్యమే నాన్నకోసం వచ్చే విజిటర్స్ ని చూసి. ఇంకా కొనసాగింపు వుంది ఇంకొన్ని విశేషాలతో.
తొలగించండి