క్రిందటి శ్లోకం / Previous slOkaH: స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 6
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
శ్లోకం - 7బహవో దుర్లభాశ్చైవయే త్వయా కీర్తితా గుణాఃమునే వక్ష్యామ్యహం బుద్ధ్వాతైర్యుక్తః శ్రూయతాం నరః
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అర్థం:
(నారద ముని వాల్మీకి మహర్షితో ఇలా పలికెను:)
ఓ వాల్మీకి మహర్షీ! నీ చేత కీర్తింపబడిన గుణములు బహు దుర్లభములు. దయచేసి వినుము! నేను ఆలోచించుకుని చెప్తాను అలాటి ఉత్తమమైన గుణములు కలిగిన మానవుడి గురించి.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)
బహవః దుర్లభాః చ ఏవ
యే త్వయా కీర్తితాః గుణాః
మునే వక్ష్యామి అహం బుద్ధ్వా
తైః యుక్తః శ్రూయతాం నరః
బహవః = బహువిధములైన
దుర్లభాః = దుర్లభములు
ఏవ = మాత్రం
యే = ఆ (గుణములు)
త్వయా = నీ చేత
కీర్తితాః = కీర్తింపబడిన
గుణాః = గుణములు
మునే = ఓ వాల్మీకి మహర్షీ!
వక్ష్యామి = చెప్పెదను
అహం = నేను
బుద్ధ్వా = ఆలోచించుకుని
తైః = వాటితో (అలాంటి గుణములతో)
యుక్తః = ఉత్తముడైన
శ్రూయతాం = వినుము
నరః = నరుడు
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
श्लोकः - 7
बहवो दुर्लभाश्चैव |
ये त्वया कीर्तिता गुणाः |
मुने वक्ष्याम्यहं बुद्ध्वा |
तैर्युक्तः श्रूयतां नरः ||
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
Meaning in English
(Narada maharshi said to Valmeeki maharshi as follows:)
"O Valmeeki maharshi! Very rare are the virtues that just have been praised by you. Please listen, reminding myself, I shall tell you about a man associated with those virtues."
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
Word to word meaning (In the same order of occurrence in the slOkaH):
बहवः दुर्लभाः च एव |
ये त्वया कीर्तिताः गुणाः |
मुने वक्ष्यामि अहम् बुद्ध्वा |
तैः युक्तः श्रूयताम् नरः ||
बहवः = many
दुर्लभाः = rare
एव = just
ये = those
त्वया = by you
कीर्तिताः = have been praised
गुणाः = virtues
मुने = O Valmiki maharshi!
वक्ष्यामि = will tell
अहम् = I
बुद्ध्वा = having reminded
तैः = with them (the said virtues)
युक्तः = associated
श्रूयताम् = please hear
नरः = man
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 8

శ్రీరామ పత్ని , జనకజ ,
రిప్లయితొలగించండిగారాముల భూమిపుత్రి , కమనీయ , దయా
వారాశి సీత తోడయి
మీ రామాయణ రచనకు మే లొనరించున్ .
శ్రీరామ కథా కథనపు
రిప్లయితొలగించండిపారమ్యం బెరిగి రాసె వాల్మీకి తగన్
ఆ రాముడె లోకోత్తరు
డారయు డని నారదముని యతనికి దెల్పెన్ .
నోరారా ' రామా ' యని
రిప్లయితొలగించండిశ్రీరాముని బిలిచితేని , సీతాపతి , ప్రే
మారా ' ఓ ' యని పలుకును ,
దూరము లే దా రఘుపతి తోడు జనులకున్ .
శ్రీరామచంద్రమూర్తిని
రిప్లయితొలగించండిచేరంగా గొలుచు భాగ్య శ్రీగల్గె బుధా !
ఆరయ తమ యతనంబున ,
గారవ మిది , యింతకంటె కార్యము గలదే ?