కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ
రత్నాంటీ బెంగళూరుకు తిరిగి వెళ్లడం, మళ్ళీ అపర్ణ నేను కాలేజ్ కి కలిసి వెళ్లడం - క్లాసుల్లేని టైం లో కాలేజ్ కి ఎదురుగా వున్న నర్సరీలో మొక్కలనీ-మొగ్గలనీ పలకరించి రావడం - మాకు వేడుకయిన వాడుక అయింది.
అపర్ణ బుద్ధిగా ఆంటీ చెప్పినట్టు విని మాథ్స్ (కోటేశ్వర రావు గారు), ఫిజిక్స్ (BRR - రాఘవేంద్రరావు గారు), కెమిస్ట్రీ (JBS - భవభూతిశర్మ గారు) ట్యూషన్లలో చేరింది.
నాకసలే ట్యూషన్స్ అంటే అంతగా గిట్టదు. పొద్దున్నే ఐదింటికి లేచి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సరస్వతి ఆంటీతో అడివి బాపిరాజు - గోనగన్నారెడ్డి, శరత్-శ్రీకాంత్ కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేయడంలో వున్న మజా అదే టైం లో చదువుకోవడానికి వెళ్లడంలో వుండదు. అందుకే కదా ఇంజినీరింగ్ లో సీట్ రానీ రాకపోనీ అని ఏ రవి లోనో , విజ్ఞాన్ లోనో చేరకుండా తప్పించుకుంది!
అసలు B.Sc ఫస్ట్ ఇయర్ బాచ్ ట్యూషన్స్ ఫలానా రోజు మొదలవుతాయని తెలిసినా కావాలని కొంచెం ఆలశ్యంగా వెళ్లాను ;) నే కోరుకున్నట్టే ముగ్గురు లెక్చరర్లూ బాచెస్ పూర్తయ్యాయి - ఇంకెవరినీ చేర్చుకోలేమని చెప్పారు.
దాదాపు గంతులేస్తున్నట్టు ఇంటికి వచ్చాను - కానీ ఇంటి గేట్ దగ్గర్నుంచి మొహం లో బుగ్గలకి కొంచెం దిగులు రాసుకుని అమ్మకి ఈ ఏడాదికి ట్యూషన్స్ కి వెళ్లడం కుదరదని చెప్పాను.
"అవునే ఆస్కారి! ఇంక ఆ ముగ్గురూ తప్ప గుంటూరులో ట్యూషన్స్ చెప్పేవాళ్ళే లేరా ?" - అమ్మ పక్కనే నించుని నా నటనకి ప్రశంసా పత్రమిస్తూ కుట్టి ప్రశ్న.
"నీకెందుకు నా గొడవ? " అని దాన్ని కసుర్తూ - మా అమ్మ "ఆస్కారి" అంటే ఏంటీ అని అడిగేలోగా - "పోన్లేమ్మా, నేను ఏ రోజు లెసన్స్ ఆరోజు చదివేసుకుంటాను" అని చెప్పబోతుండగా - మా అమ్మ వదులుతుందా - "అన్నీ సరే కానీ మాథ్స్ కి మాత్రం ఎక్కడో అక్కడ ట్యూషన్ కి వెళ్లాల్సిందే" - అని చెప్పింది.
ఇంకా తప్పదు కదా - అలా KSRK సుబ్బారావుగారి మాథ్స్ ట్యూషన్ లో నేను చేరడం - ప్రతీ రోజు సాయంత్రం పప్పీ, కుట్టీ నన్ను సైకిల్ మీద రవిశంకర్ హోటల్ పక్కనే వున్న ఆయన ఇంటి దగ్గర నన్ను దింపడం - తీసుకురావడం - సాయంకాలాలు అలా మేడ ఎక్కడానికి లేకుండా అయిపోయింది.
నాకు కదులుతున్న సైకిల్ ఎక్కడం వచ్చేది కాదు - అందుకని పాపం - సైకిల్ వెనక నన్నెక్కించుకోవడానికి పప్పీ కొంచెం ఇబ్బంది పడేది. జిగ్-జాగ్ గా తొక్కుతూ వారానికి రెండు సార్లయినా పడేయడం ప్రాక్టీస్ చేసేది - నేనెక్కడ భయపడకుండా దాని వెనకాల ఎక్కడం అలవాటు చేసేసుకుంటానో అన్నట్టు.
ఇదిలా కాదని ఒక రోజు కుట్టీ నడిగాను సైకిల్ తొక్కడం నేర్పించమని. సరే అని ఒక ఆదివారం మధ్యాహ్నం భోజనాలవగానే ఎర్రటి ఎండలో - పద నేర్పుతాను - అని ఎవరూ ఎక్కువగా తిరగని ఐదో లైను లోకి తీసుకెళ్లింది. నేను సైకిల్ ఎక్కి సీట్ మీద కూర్చోగానే వెనకాల పట్టుకుని - ఊ తొక్కింక - అంది కుట్టి.
కొంచెం దూరం వెళ్లగానే - "ఎలా ఆపాలో తెలియట్లేదే" - అంటే హేండిల్ బార్ కి ఉంటాయి బ్రేకులు నొక్కమంది. నేను ఒక చేత్తో కుదరట్లేదని రెండు చేతులతో గట్టిగా బ్రేక్ వేయడానికి ట్రై చేస్తుంటే - కుట్టిపిల్ల సడెన్ గా సైకిల్ గట్టిగా పట్టుకుని ఆపేసి - "లల్లెమ్మా - ఇంక దిగవే - ఇలా అయితే అయినట్లే. నిన్ను గుద్ది ఎదుటివాళ్ళు బాధ పడతారు . ఎందుకొచ్చిన గొడవ! నేనో పప్పమ్మో నిన్ను మోసుకెళ్లి ఆ ట్యూషన్లో పడేస్తాం - అవగానే ఇంటికి తెచ్చి పడేస్తాం - ఇంకీ జన్మలో సైకిల్ తొక్కడానికి ట్రై చేయకు . నీకూ దేశానికీ కూడా మంచిది" - అని సైకిల్ ఒక చేత్తో , నన్నింకో చేత్తో ఇంటికి లాక్కొచ్చేసింది. అలా నా సైకిల్ తొక్కుట - మూడు పెడళ్ల ముచ్చట అయిపోయింది.
ఇంక కాలేజ్ విషయానికి వస్తే అపర్ణకి, నాకు మా వందేళ్ల కాలేజ్ ని చూసుకుని భలే గర్వంగా వుండేది. ఫిజిక్స్ మెయిన్ అని చెప్పుకోవడం ఇంకా బావుండేది.
కాలేజ్ లో టర్మ్-ఫీ కట్టాలంటే నాకు చాలా మొహమాటంగా వుండేది. ప్రతీ టర్మ్ లో మూడు చలానాలలో పూర్తి పేరు రాయాలి. అది - పాపం - ఆఫీస్ లో వుండే సాల్మన్ అనే ఒకాయన డ్యూటీ. K.R. అపర్ణ అని తన మూడు చలానాలు రాసేసిన తర్వాత నా పేరుతో రాయబోయే ముందు వేళ్లు ముందుకీ వెనక్కీ విరుచుకునేవారు ఆయన. "V.ల.లి.తా. త్రి.పు.ర.సుం.ద.రి" అని నా పేరులో వున్న అక్షరాలని వత్తి పలుకుతూ "ఎందుకమ్మా ఇంత పెద్ద పేరు పెట్టుకున్నావు?" అని నాపేరులో వున్న అక్షరమక్షరానికి అడుగుతూనే వుండేవారు.
టర్మ్-ఫీ కట్టిన ప్రతీసారీ అపర్ణతో చెప్పేదాన్ని - ఆ సాల్మన్ గారి కోసమయినా నేను పేరు మార్చేసుకోవాలి అని. అలా అని నిజంగానే ఒకరోజు చెప్పేశాను తనతో - "నాకు యండమూరి "ఆనందోబ్రహ్మ" నవలలో వాడిన నీహారిక (మంచుతెర) అన్న పదం నచ్చిందీ - ఇవాల్టినుంచి నా పేరు - లలితా నీహారిక" అని. తనకీ అది తెగ నచ్చేసింది. నాకిష్టమయిన మాథ్స్ టెక్స్ట్ బుక్ మీద రాసేసుకున్నాను - నా కొత్త పేరు. చాలా మంది నా అసలు పేరు తెలియని వారు అదే నా పేరు అని నమ్మేంతగా పాపులర్ అయిపోయింది నా కొసరు పేరు - నా టెక్స్ట్ బుక్ అరువు తీసుకున్న సింహాచలం అనే ఒక అబ్బాయి పుణ్యమా అని.
సాధారణంగా ప్రతీ క్లాస్ లోనూ ముందుగా అటెండెన్స్ తీసుకునేవాళ్లు లెక్చరర్స్. అటెండెన్స్ తీసుకోగానే "ఎవరికి క్లాస్ ఇంట్రెస్ట్ లేదో వాళ్లింక బయల్దేరచ్చు" అనగానే ఒక పదిమంది తప్ప అందరూ లేచి వెళ్లిపోయేవారు. ఒక్కోసారి అపర్ణ, నేనూ తప్ప ఇంకెవరూ ఉండేవారు కాదు. అలాంటప్పుడు Thermodynamics టీచ్ చేసే RSP (పార్థసారధి) గారు "మీ ఇద్దరూ కూడా వెళ్ళిపోతే నేను ఈ క్లాస్ కాన్సెల్ చేయొచ్చు కదమ్మా - నాకా ఛాన్స్ ఇవ్వరు మీరు" అని ముద్దుగా విసుక్కుంటూనే పాఠం చెప్పేవారు - అద్భుతంగా - మళ్లీ పరీక్షలకి చదివే అవసరం లేకుండా కూడా గుర్తుండేలా. అసలు ACC లో అందరు లెక్చరర్స్ అంతే - KRCP, JBS, KHR, KR - క్లాసులో ఇద్దరు వున్నా, వంద మంది వున్నా చెప్పే పాఠంలో తేడా ఉండేది కాదు - ఆ కాలేజ్ గురించి విని అక్కడ జరిగే గొడవ గురించి పట్టించుకోకుండా నన్నక్కడ చేర్చిన మా నాన్ననిర్ణయం ఎంత మంచిదో నాకే తెలుసు.
సరే! అపర్ణా, నేనూ - మాకు క్లాస్ లోపలా-బయటా క్లాసులకి క్రమం తప్పకుండా వచ్చే అమ్మాయిలుగా మాకు దొరుకుతున్న ఎక్స్ట్రా-ఎటెన్షన్ కి మురిసిపోతూ వున్న రోజుల్లో - ఒక రోజు - ఫస్ట్ అవర్ అని ఫిజిక్స్ బిల్డింగ్ వైపు వెళ్తూ వుంటే సింహాచలం ఎదురొచ్చి - "ఇవాళ క్లాస్ లేదు" అని చెప్పాడు. మేమిద్దరం మహా ఆనందంగా జనతా బజార్ పక్కనే వున్ననర్సరీకి వెళ్లాము - మా పూబాలలు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి.
తీరా ఆ రెండో రోజు తెలిసింది - RSP గారు వచ్చి క్లాస్ లో ఎవరూ లేరని వెనక్కి వెళ్లిపోయారని.
అంతే - ఇద్దరం గబగబా నడుచుకుంటూ ఫ్రెండ్స్ మధ్య కబుర్లు చెప్తూ నించున్న సింహాచలం దగ్గరికి వెళ్లాము.
"Are you the one who said there was no Physics class yesterday?" - సాధ్యమయినంత మర్యాదగా అడుగుతున్న అపర్ణ ప్రశ్న వినగానే ఎదో చెప్పడానికి ఆతను నోరు తెరవబోతుంటే -
ఇంకో మాట మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా
"Why did you say like that? Don't play such cheap tricks again!" - అని గట్టిగా చెప్పి అపర్ణని తీసుకుని ఇవతలికి వచ్చేస్తున్న నన్ను నోరు తెరుచుకుని చూశారు - సింహాచలం, అతని ఫ్రెండ్స్, ఆ వెనకాల వున్న మా సీనియర్స్.
అంతకు ముందు చూచాయగా విన్న నా రాళ్లు-రువ్వు-పర్వం ప్లస్ ఇప్పటి ఈ బెదిరింపు ఎపిసోడ్ కలిపి నాకు చా...లా మంచి పేరు తెచ్చిపెట్టాయి ACC లో :))
మొత్తానికి మా BSc ఫస్ట్ ఇయర్ ఆడుతూ పాడుతూ అయిపోవచ్చింది - మా ఫైనల్ ఇయర్ బ్యాచ్ వాళ్ల ఫేర్-వెల్ లో "భలే మంచి రోజు - పసందైన రోజు" పాడిన రవిప్రకాష్ సాక్షిగా :)
ఫైనల్ ఎగ్జామ్స్ - ఇంగ్లీష్, హిందీ అయ్యాయి - మూడోది మాథ్స్ - పేపర్ తీసుకుని చూస్తే అంతా గ్రీక్ & లాటిన్. ఎగ్జామ్ హాల్ లో ఇన్విజిలేటర్ల గుసగుసలు - అవుట్-ఆఫ్-సిలబస్ పేపర్ అని.
తల తిప్పి చూస్తే అపర్ణ తల వంచుకుని ఏదో రాసేస్తోంది. నాకేమో ఏం రాయాలో తెలీట్లేదు - అమ్మ చెప్పిన మాట విని అపర్ణ లాగా కోటేశ్వరరావు గారి దగ్గరికి మాథ్స్ ట్యూషన్ కి వెళ్లనందుకు నన్ను నేను తెగ తిట్టేసుకున్నాను.
ఒక అరగంటలో - మొదటిసారిగా - పరీక్ష రాయకుండా బయటికి వచ్చేశాను. ఇంకో రెండు గంటల తర్వాత అపర్ణ వచ్చింది. ఆ ఏడాది మార్చ్ లో మాథ్స్ పరీక్ష అవుట్-ఆఫ్-సిలబస్ అయినా సరే రాసిన వాళ్లు ఇద్దరే అనుకుంటాను - అందులో సార్ధక నామధేయి - అపర్ణ ఒకటి. ఏదయినా మొదలు పెడితే పూర్తి చేసే తీరుతుంది తను - రిజల్ట్ గురించి ఆలోచించకుండా.
BSc ఫస్ట్ ఇయర్ లో మాథ్స్ లో కాలేజ్ ఫస్ట్ - నా ప్రియనేస్తం అపర్ణ.
ఇద్దరం బోల్డంత సంబరంగా వెళ్లి కాలేజ్ మాథ్స్ డిపార్టుమెంట్ ఇచ్చే సిల్వర్ మెడల్ తెచ్చుకున్నాం - వచ్చింది తనకే అయినా - నాకే ఇచ్చిన సంబరం.
తర్వాత - నా చదువు మొత్తంలో సెప్టెంబర్ లో రాసిన ఒకే ఒక్క పేపర్ - మొదటిదీ, చివరిదీ అదే - మాథ్స్.
అదేం అదృష్టమో ఆ ఏడాది సెప్టెంబర్ కూడా అవుట్-ఆఫ్-సిలబస్ పేపరే. కానీ ఈసారి వదిలేయలేదు - రాసేశాను.
ఈరోజుకీ ఆ మాథ్స్ పేపర్ గుర్తుకొస్తే అది మార్చ్ లో రాయక లెక్కలు మార్చినా నా సెప్టెంబర్ స్ట్రెస్సెంబరే అయింది అనిపిస్తుంది !!
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

రిప్లయితొలగించండిమూడు పెడళ్ళన సైకిలు
మాడు పగులునట్లు తిట్లు మాథ్సుల జీరో
నాడెను, సెప్టంబరు పో
రాడెను త్వామనురజామి రాసెను లెక్కల్ :)
జిలేబి
జిలేబి జీ ! నా త్వామనురజామికి అజరామరత్వం సిద్ధించె గదా నేటి ఈ మీ పద్య వ్యాఖ్యతో - ధన్యోస్మి! :)
తొలగించండినెల రోజులు ఎదురు చూయించినా ఆ కరువు తీరేలా రాస్తున్నారండీ.. మళ్ళీ కాలేజ్ లో జాయినయిపోయాను మీతో పాటు...వెరీ నైస్..
రిప్లయితొలగించండినా కబుర్లు చదువుతున్న మీకు ధన్యవాదాలు :)
తొలగించండిబావున్నాయి అక్కా నీ కాలేజ్ కబుర్లు చదువుతుoటే కళ్ళ ఎదురుగా జరుగుతున్నట్టు ఉంది నీ రచనా నైపుణ్యం "ఆస్కారి "పేరు బావుంది.ఈ మద్య నీ కబుర్లు miss అవుతున్నా పనివత్తిడిలో వారం లో ఒకసారైనా నీ బ్లాగ్ చదవకపోతే వెలితి గా ఉంటుంది .....
రిప్లయితొలగించండిఎంతో అభిమానంతో నా కబుర్లు చదువుతూ, వాటి గురించి ఇంకెంతో అభిమానంగా కమెంట్ పెడుతుంటావు. కుదిరినప్పుడే చదువు మరి, హనుమాన్ - తప్పకుండా!
తొలగించండిReminded me of the time i read Sarath Chandra and Adavi Bapiraju novels👏👏👏👏 - S
రిప్లయితొలగించండిI am glad to remind you of those blissful times. Thanks for your comment!
తొలగించండిమూడు నాలుగు వారాలుగా మీ కబుర్లు మిస్ అయ్యాను.. మిస్ అయిన కబుర్లన్నీ ఇవాళే చదివెయ్యాలి అనిపించేంత అద్భుతంగా రాసారండి ఈ పోస్ట్.
రిప్లయితొలగించండిపవన్ గారు! Welcome Back!
తొలగించండిమీ ఇండియా ప్రయాణం కబుర్లు బోల్డన్ని రాయండి మరి - నేనూ చదువుతాను :)
"ఆస్కారి"....... మీ కుట్టి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి ఏం చెప్పినా తక్కువే!
రిప్లయితొలగించండి'ఫేర్ వెల్ డే రోజున .... 'భలే మంచి రోజు..... పాట. అలాంటి సీనియర్లకు సరైన పాట.
భలే సాగిపోతోంది లలితా! నీ త్వామనురజామి..
అలాంటి ఎన్ని పేర్లో :))
తొలగించండిమా సీనియర్స్ చాలా మంచి వాళ్లు పాపం ! ఆ పాట అంత గుర్తు వుండడానికి కారణం - అసలా సందర్భానికి అతకక పోవడమే.