"మీకన్నా మీ మూడేళ్ళ బాబుకి తొందరగా వస్తుందండీ డ్రైవింగ్!" - ఎంత ఏసీ కార్లో వున్నా నేను రోడ్డు మీద చేయాల్సిన ఫోకస్ కూడా తనే చేసిన అలసటతో - కొంచెం చిరాకుతో అన్నారు కృష్ణార్జున్.
కృష్ణార్జున్ కాకినాడలో డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్. (అదే మొదటి సారి & ఆఖరు సారి ఆ పేరు వినడం - మళ్లీ ఆ పేరున్న వాళ్లు తటస్థ పడలేదు ఇప్పటిదాకా. అతను అప్పట్లో కాకినాడలో మంచి పేరున్న డ్రైవింగ్ స్కూల్ ఓనర్ అన్నట్లు గుర్తు.)
అప్పటికే COMSYS లో ఇంటర్వ్యూ అయ్యి ఇంకా రేపో మాపో అమెరికాకి విమానమెక్కాలి ఎక్కాలి అన్నట్టు వున్న రోజులు. బ్రిటన్ ఆఫీస్ నుంచి పర్సనల్ ఇంటర్వ్యూ చేసిన Cathy చెప్పింది - బయలుదేరేముందు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోమని. అది వినగానే ఫక్కున నవ్వబోయి - అసలే వచ్చీ రాని ఉద్యోగం ఉరిమీ కురవని వానలాంటిది కదా - నా నవ్వు నాలుగ్గండాల పెట్టు అని ఆపుకున్నాను.
నాకు ముందు నుంచీ మెకానికల్ / ఎలెక్ట్రానిక్ వస్తువులు ఏవైనా వాడాలంటే ట్యూన్ అయ్యీ అవని రేడియోలాగా స్టార్టింగ్ ట్రబుల్. చిన్నప్పుడు ఇంట్లోనూ అంతే - ఏదయినా కొత్త టూఇన్-వన్నో, టీవీనో, వీసీఆరో - ఏది కొన్నా పప్పీనో, కుట్టీనో పెడితే చూడడమే కానీ నేను ముట్టుకునేదాన్ని కాదు. అసలు నేనిప్పుడు చేసే ఉద్యోగానికి, నా స్వభావానికి పొంతనే లేదు :))
సరే ! మరి - డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా. అప్పటికే బదరి ఒక్క క్లాసు లోనే పూర్తి చేసి వున్నారు కృష్ణార్జున్ దగ్గర. బదరి డ్రైవింగ్ స్కిల్స్ తో మహా ఇంప్రెస్స్ అయిపోయిన కృష్ణార్జున్ ఉత్సాహంగా ఒప్పుకున్నారు - నాకూ నేర్పడానికి.
అప్పటికి అమ్మ-నాన్న ఇంకంటాక్స్ కాలనీలో ఇల్లు కొని గృహప్రవేశం చేశారని కాకినాడ వచ్చిన - పాపాయత్తయ్య, లక్ష్మి దొడ్డ, ప్రసాద్ మామయ్య, చెల్లాయత్త, తంబి మామయ్య - వలసపాకలలో వున్న మాఇంటికి వచ్చి వున్నారు
నన్ను చూడడానికి .
పొద్దున్నే తొమ్మిదింటికి కృష్ణార్జున్ కార్ మా ఇంటి ముందు ఆగగానే - ఆ టైం కి ఇంట్లో వున్న వాళ్లు అందరూ బయట కాంపౌండ్ వాల్ దగ్గరికి వచ్చేసి - "మన లల్లెమ్మ కార్ డ్రైవింగు చేస్తోంది. చూద్దాం రండ్రండి"- అని అదేదో నేను అంతరిక్షయాత్రకి వెళ్తున్నానేమో అన్నంత సంబర పడిపోయేవారు - నేను, నా కారు కనిపించినంత మేరా చేతులు ఊపుతూ.
అసలే - నాకు సినిమా పరిజ్ఞానం ఎక్కువ. కార్ ఎక్కీ ఎక్కకుండానే - హిందీ సినిమాలో దేవానందో, తెలుగు సినిమాలో కృష్ణో - పెదవి బిగబట్టి రౌడీలని వెంబడించేటప్పుడు స్టీరింగుని 360 డిగ్రీలు తిప్పేస్తూ వుంటారే - అలా తెగ తిప్పేద్దామని చూసేదాన్ని. అలా తిప్పితేనే కారు వెళ్తుంది అని నేనొక కార్రూలు బుక్కు రాసేసేదాన్నే - పక్క సీటులోంచి - దాదాపు పళ్లు కొరుకుడు నేపథ్య సంగీతంతో - అప్పటికి పదిసార్లు "అది పవర్ స్టీరింగ్ అండీ - జస్ట్ కొంచెం తిప్పితే చాలు - కార్ డైరెక్షన్ మారుతుంది " అన్న మాటలు వినిపించకుండా వుండి వుంటే.
అలా మొదలయిన నా డ్రైవింగ్ - మొదటి వారం, రెండో వారం, మూడో వారం - అదేదో నేను వెళ్లే దారులన్నీ ట్రాఫిక్-బందు-వారోత్సవాల్లో పాల్గొంటున్నట్టు - నా కారుని చూడగానే జనాలు ఇంట్లోకి దూరి తలుపులు వేసుకుని కిటికీల్లోంచి మాత్రమే నన్ను చూసేలా - అయిపోయాయి కానీ నా చోదక శక్తి "యించు"కైనా ఇనుమడించలేదు.
నాలుగో వారం అవుతుండగానే - "బదరీ గారు - ఇలాక్కాదు గానీ. RTO ఆఫీసులో తెలిసిన వాళ్లుంటే లైసెన్స్ తెచ్చేసుకోండి" అనడం తడవు - నాకు బోల్డు ఆనందం - ఇంక డ్రైవింగ్ లెసన్స్ ఉండవని. మొత్తానికి నాకో లైసెన్స్ వచ్చింది - ఎలాగో నాకే తెలీదు - ఇప్పుడు చెప్పడానికి.
నాకు లైసెన్స్ వచ్చింది అని తెలిసిన దగ్గర్నుంచీ - మా నాన్న దగ్గర పనిచేసే కారుడ్రైవర్ హనుమంతరావు - మరీ అవసరం ఉంటే తప్ప నాతో మాట్లాడడం మానేశాడు. ఒకరోజు నాతో - "పాపగారు! మీరు అంబాసడర్ డ్రైవ్ చేయడమేంటండీ చిరాగ్గా - మీకు ఫారిన్ కారే కరెక్ట్" - అన్నాడు కూడా. పాపం! ఏవో తనకీ ఏవో సినిమా సీన్లు గుర్తుకొచ్చి వుంటాయి - ఓనర్ కూతురు ఆక్సిడెంట్ చేస్తే డ్రైవర్ మీద పెట్టి జైలుకి పంపి కూతుర్ని రక్షించుకున్న కథలు. అందుకే తెలివిగా జాగ్రత్త పడ్డాడు. సర్లే ! నాకూ అంత వీరకారాభిమానం లేదు కాబట్టి "పోన్లే - బతికి పోనీ - బండి తోలుకోనీ" అని వదిలేసాను.
ముందు బదరీ, తరవాత నేనూ, బుజ్జిజింక (అన్న) అమెరికా వచ్చేశాము. వచ్చిన మూడు నెలలకి కారు కొన్నారు బదరి. అసలే ఇక్కడ కార్ డ్రైవింగ్ రాకపోతే నడవడం రాదేమో అన్నట్టే. బుజ్జిజింక స్కూల్ దగ్గరే ఆయినా డాక్టర్ అప్పాయింటుమెంట్లకీ, ఏవైనా గబుక్కున వెళ్లి తెచ్చుకోవాల్సిన షాపింగులకీ - అన్నిటికీ బదరీ ఆఫీస్ నుంచి వచ్చాక వెళ్దాము అంటే - పాపం - తనక్కూడా ప్రతీ దానికీ పరుగులు పెట్టడమే అవుతుంది కదా - అని ఇంక తప్పకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలని అనేసుకున్నాను. స్టేట్ రూల్స్ ప్రకారం రిటెన్ టెస్ట్ రాసి లెర్నర్స్ లైసెన్స్ తెచ్చుకున్నాను.
నా సంగతి తెలుసు కదా బదరీకి! అందుకని - తను తీసుకెళ్తే నాకు కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, తొందరగా నేర్చుకుంటాను - అని ఒక శనివారం పొద్దున్నే తొమ్మిది గంటలకి ఒక విశాలంగా వున్న ఒక స్కూల్ గ్రౌండ్ కి తీసుకెళ్లారు. వెనక సీట్లో బుజ్జిజింకతో సహా. తీరా అక్కడికి వెళ్లాక ఒక పది నిముషాలు కాగానే వెనక సీటులోంచి స్కూల్ గ్రౌండులో బెంచ్ మీదకి బుజ్జిజింక బదిలీ - బదరి దవడ కండరం బిగిసీ ;)
కాకపోతే - మేమసలే శాంతి కాముకులం - మాదసలే మహా శాంతియుత సాహచర్యం - కాబట్టి ఆట్టే కాలం వృధా చేయకుండా, రక్తపోటు మరీ హెచ్చకుండా - డ్రైవింగ్ లెసన్స్ తీసుకుందామని నిర్ణయించేసుకున్నాం - ఏకగ్రీవంగా.
మళ్ళీ - చరిత్ర పునరావృతం అయినట్టు - బదరి ఏ Kerry దగ్గరైతే కార్ నేర్చుకున్నారో - ఆ Kerryనే నాకూ డ్రైవింగ్ నేర్పడానికి వచ్చాడు.
మొదటి ఒకటి రెండు క్లాసుల్లో సరదాగా మాట్లాడుతూ ఇండియా గురించేవో జోకులు వేయిబోయాడు - "ఏంటీ?! మీ ఇండియాలో ఒక రోడ్డు మీద కొంచెం దూరం వెళ్లగానే తర్వాత రోడ్డు సడెన్గా మాయమయిపోతుందట కదా ?!" అంటూ.
మా అమ్మ అన్నట్టు విసుగు ముందు పుట్టి తరవాత నేను పుట్టానేమో - అతనికేసి విసుగ్గా చూసి - "అదెవరు చెప్పారో తెలీదు కానీ నేను వచ్చిన సిటీలో ఇంతకన్నా బావుంటాయి రోడ్లు (ఆ మాట అనే టైంకి నా కళ్ల ముందు వెలిగిన రోడ్ - బెంగళూరులో నాకెంతో ఇష్టమయిన ఒకప్పటి - ఎం జి రోడ్)" అనగానే ఇంక జోకులు ఆపేసి సీరియస్ గా డ్రైవింగ్ నేర్పాడు. ఒక ఐదు క్లాసులు కాగానే టెస్ట్ కి తీసుకెళ్లాడు.
పారలెల్ పార్కింగ్ తో సహా అన్నీ బాగానే చేసి 85% మార్కులతో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యాను. టెస్ట్ అయిపోగానే బయట చెట్టుకింద వెయిట్ చేస్తున్న Kerry దగ్గరికి వెళ్లి ఆనందంగా పాస్ అయ్యానని చెప్పగానే "ఉఫ్" అని ఒకసారి గా....ట్టిగా నిట్టూర్చి - " నీకసలు ఎనభై కూడా వస్తాయి అనుకోలేదు - అందుకే భయంగా చెట్టు చాటుగా నుంచుని చూస్తూనే వున్నాను - బానే చేశావు - I got to be very lucky" అని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు.
ఆ మాటలు విని ముందు ఉక్రోషంగా అనిపించినా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిన సంతోషంలో అంతగా పట్టించుకోలేదు నేను.
అసలు కథ ఇప్పుడే ఆరంభం -
కానీ...
బ్రేక్ కే బాద్ - మై మరింత బాదూం!
అంత దాకా - Stay tuned ! :))
[మిగిలిన భాగం - వచ్చే వారం కాక ఆ పై వారం ]

ఇంతకీ వచ్చింది,లైసెన్సేనా, డ్రైవింగా? :)
రిప్లయితొలగించండిచివరికి డ్రైవింగూ, లైసెన్సూ రెండూ వచ్చాయండి :) మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండిలలిత గారు భలే వ్రాస్తారండీ మీరు !! ఏవో జ్ఞాపకాలు తట్టి మరీ లేపారు నాకు. స్కూల్ గ్రౌండ్ లో నేర్చుకోవడం లాంటివి :) Driving Instructor కంటే నాకు, మన పక్కన కూర్చుని టెస్ట్ ఇస్తాడే అతనంటేనే జాలి. ఎంత రిస్క్ తీసుకుని పక్క న కూర్చుంటాడా అన్పిస్తుంది.
రిప్లయితొలగించండికదండీ చంద్రికా! పైకి బింకంగా వున్నా లోపల్లోపల బిక్కుబిక్కుమంటూనే వుంటారేమో వాళ్లు :)) నేను భలే రాస్తానని మీరు అనడం నన్ను భలే సంతోషపెట్టింది :)
తొలగించండిఎన్నో సంవత్సరాలు డ్రైవింగ్ నేర్చుకోకుండా ఎలాగో గడిపేసినా, ఆస్ట్రేలియా వచ్చాక మాత్రం ఇక తప్పలేదు. ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవ్ కావడంతో డ్రైవర్ సీట్లో కూర్చోవాలంటే ఎడమకాలు ముందుగా కార్లో పెట్టాలి. మొట్టమొదటిసారిగా డ్రైవర్ సీట్లో కూర్చునేటప్పుడు, మొదటిసారి కదా అని ముందుగా 'కుడికాలు' లోపల పెట్టి, మెలికలు తిరుగుతూ కష్టపడి సీట్లో కూర్చున్నప్పుడు, నా ఇన్స్ట్రక్టర్ 'Neil' మొహం మీది వింత ఎక్స్ప్రెషన్స్.... ఇంకా ఎన్నో, ఎన్నో గుర్తుకొచ్చాయి :)
రిప్లయితొలగించండిభలే! ఇంకో ఇన్ట్రెస్టింగ్ సిరీస్ మొదలుపెట్టావన్నమాట.
షడ్రసోపేతమైన విందు భోజనంలా ఉంది నీ బ్లాగు ఇప్పుడు.
నీ ప్రోత్సాహం, పొగడ్తలు అన్ని విందులకన్నా పసందు నాకు :)
తొలగించండి"కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల చిన్నదానా"..బాగా రాసావు behind the seat అగచాట్లు..ముచ్చట్లు. Enjoyed this piece, I am sure it resonates with the student-driver phase of many girls of our generation. Next generation అమ్మాయిలు ఎలా "handle" చేస్తారో చూడాలి మరి!
రిప్లయితొలగించండి"behind the seat అగచాట్లు..ముచ్చట్లు"
తొలగించండిNicely put in your words - as usual.
Nex Gen girls may not have the fun that we have gone thro' :))
వంశి సినిమా చూస్తున్నట్టే ఉంది !
రిప్లయితొలగించండిహనుమాన్! వంశీ అబిమానులకి కోపం తెప్పించకు బాబూ - ఇందులో వంశీ సినిమా అంత సీను ఏముంది అనుకునేలా :(
తొలగించండి(పొరపాటున ఎప్పుడయినా తెలుగు బ్లాగులు చదువుతూ నీ కమెంట్ చదివితే)