ముందటి కబుర్లు ఈ లింక్ మీద క్లిక్ చేసి చదివేసుకోండి : తా(నా) సంబరాల తాజా(-2)కబుర్లు - తొలినాటి whole మొత్తం టోకు talks - Penultimate ముచ్చట్లు
దాసరి గారి పాట వరసలో...
దొరకక... దొరకక... దొరకక దొరకక... దొరికిన ఛాన్సు
దొరికీ దొరకక దొరకని ఛాన్సు
ఒకే ఒక్క ఛాన్సు
తిరిగిరాని ఛాన్సు
... అంటూ
పాడేసుకుంటూ రాసేయడం మొదలు పెట్టా...
నా తానా వరసలో చివరాఖరి కబురు ...
అంతంలో ఆరంభం రాస్తూ...
ఆరంభంతో అంతం చేస్తూ...
తానా వారి విందు అయింది. ఇక సాహితీ ఉపన్యాసాల వీనుల విందు కోసమని TANA Program Guide లో సాహితీ సదస్సులు 132వ నంబర్ గదిలో జరుగుతాయని రాసుంది కదా - ఆ గదిని వెతుక్కుంటూ వెళ్ళాను.
ఆ వెళ్లే దారిలో ఒక పక్కగా వేసి వున్న ఒక సోఫా మీద - అమ్మా, నాన్న, ఓ పధ్నాలుగేళ్ల తెలుగమ్మాయి - కనిపించారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు కానీ - ఆ పక్కనుంచి వెళ్తున్న ఓ అమెరికన్ పెద్దాయన ఆగి మరీ "What a pretty outfit!" అని ఆ అమ్మాయి వేసుకున్న గులాబీ రంగు పరికిణీ-జాకెట్టుని మెచ్చుకుంటూ ఉంటే ఆ గులాబి-బాల Thanks చెప్తూ సిగ్గు పడడం మనోహరంగా అనిపించింది. ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని చూస్తే అమెరికాకి రావడం మొదటి సారేమో అనుకున్నాను. తానా కోసం ఇండియా నుంచి కూడా వచ్చారెవరో - ఎవరి చుట్టాలో అని కూడా అనుకున్నాను.
ఆ అమ్మాయి కళ్ళలో మెరుపుని చూస్తూ, ఆ మెరిపించిన అమెరికన్ పెద్దాయన మంచితనానికి మురుస్తూ, ఆ మురిపెపు చిరునవ్వుని మోసుకుంటూ ఒకటింపావు కల్లా 132-ప్రవేశం చేశా.
వేదిక మీద ఓ బల్ల, ఓ నాలుగో ఐదో కుర్చీలు. వేదిక ముందు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఓ ప్ఫదో-ప్ఫన్నెండో వరసల కుర్చీలు. ఆ కుర్చీల వరసలో చివర వరసలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఓ నలుగురు. అంతే! ఇంకెవరూ లేరు.
ఆ మాట్లాడుకుంటున్న నలుగురి మాటల వల్ల నాకర్ధమయ్యిందేంటంటే వాళ్ళలో ఇద్దరు తానాకి ఆహ్వానితులు - సామల రమేష్ బాబు గారు, స.వెం. రమేష్ గారు. ఒక్క నిముషం భలే మొహమాటంగా అనిపించింది. వాళ్ళు తానాకే కాదు మా ఊరి కొచ్చిన అపురూప అతిథులు. నా అంతట నేను వెళ్లి తానా లిటరరీ కమిటీ వలంటీర్ని అని పరిచయం చేసుకోవడానికి మనసొప్పలేదు. ఎందుకూ అంటే చెప్పలేను కానీ అలా ఉట్టి చేతులతో వెళ్లాలని అనిపించలేదు. వెంటనే బయటికి వెళ్లి ఓ పది మంచినీళ్ల బాటిల్స్ పట్టుకుని లోపలికి వచ్చి ఓ అరడజను వేదిక మీదనున్న బల్ల మీద పెట్టి, మిగిలిన నాలుగూ పట్టుకుని స.వెం. రమేష్ గారి దగ్గరికి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకుని ఓ మంచినీళ్ల బాటిల్ ఆయన చేతికి అందించాను. నేను ఆయన రాసిన ప్రళయ కావేరి కథల గురించి విని వున్నాను కానీ చదవలేదు. అందుకని అసలేం మాట్లాడాలో తోచక ఆలోచిస్తూ అక్కడే నించుని వున్నాను.
ఇంతలో అంతకు ముందు నేను బయట చూసిన గులాబీ-బాల మాతా-పిత-సమేతగా లోపలికొచ్చింది. అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి కొంగునాడు తెలుగులో కథలు రాసే సంజనా పద్మం అని. అది తెలియగానే ఎంత ముచ్చటగా అనిపించిందో... తెలుగులో పట్టుమని పది కబుర్లు రాయాలంటే తెగ కష్టపడిపోతాను నేను, ఇంత చిన్నపిల్ల అంత గొప్ప కథలు భలే రాస్తోంది కదా అని! సంజనా పద్మంతోనూ, వాళ్ళమ్మగారు కవితతోనూ మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటల మధ్యలో కవితగారు TANA souvenir లో సంజనా పద్మం కథ కూడా ఉందని. తప్పక చదువుతానని చెప్పగానే ఆ పాప భలే మురిసిపోయింది - చదివి ఎలా ఉందో చెప్పమంటూ.
ఇంతలో ఒక పెద్దాయన ఎవరో వస్తూనే - నేను పలకరించి, మంచినీళ్ల సీసా అందిస్తూ, పరిచయం చేసుకున్నానో లేదో విసుక్కున్నారు - ఏంటమ్మా! ఎవరూ లేరేంటి ఇక్కడ? ఈ నీళ్లు మేం తెచ్చుకోలేమా? - అంటూ. తర్వాత తెలిసింది ఆయన అవధానం చేయడానికి వచ్చిన నరాల రామారెడ్డి గారని. తెలుగు మాష్టారి మొట్టికాయలు ఎప్పుడూ బొప్పి కట్టవు, గట్టి మేలే చేస్తాయి అనేసుకుని, ఆయన విసుగుకి నవ్వేసుకుని - మా వాళ్ళు వస్తున్నారండి, కూర్చోండి - అని ఆయనకి చెప్పి ఇవతలికి వచ్చేసి నేనొక కుర్చీ చూసుకుని కూర్చున్నాను.
ఇంతలో మా లిటరరీ కమిటీ నుంచి సుధాకర్ బోల్డన్ని మంచినీళ్ల బాటిల్స్ మోసుకుంటూ తెచ్చి వేదిక దగ్గరగా పెట్టారు. మిగిలిన కమిటీ మెంబర్లు పసుపులేటి రవిగారు, అమృతరెడ్డిగారు, వారితో పాటు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వాసిరెడ్డి నవీన్ గారు వీళ్ళందరూ వచ్చేశారు. ఈ తెలుగు ప్రముఖుల రాకతో ఒక్క సారిగా వెలుగొచ్చేసింది మా 132 కి. అందరూ కలిసి హడావిడి చేస్తూ "ఎల్లలు లేని తెలుగు" బానర్ కట్టించారు వేదిక మీద.
నేననప్పటికే ఓ కుర్చీలో కూర్చుని వున్నాను కదా - నా వెనక వరసలో "కొత్తపాళీ" నారాయణస్వామి గారు, వారి సతీమణి సావిత్రిగారు కూర్చుని వున్నారు. అప్పటికే ఈమాట రచయితల పరిచయాల్లో నారాయణస్వామిగారి ఫోటో చూసి వున్నాను. సాక్షాత్తూ ఆయనే సతీసమేతంగా కనిపించేటప్పటికి ఇంక ఆగలేక వెనక్కి తిరిగి నన్ను నేను సావిత్రి గారికి, నారాయణస్వామిగారికి పరిచయం చేసుకుని "నేను మీకు తెలీదు కానీ - మీరు నాకు బాగా తెలుసండి మీ బ్లాగ్ చదివాను" అని చెప్పాను సంబరంగా.
రెండు గంటలకి వక్తలందరూ వేదిక మీద, శ్రోతలందరూ వేదిక ముందు కుర్చీల్లో సర్దుకుని కూర్చున్న తర్వాత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సభ ప్రారంభించారు.
ముందుగా స.వెం. రమేష్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడే ముందు మార్టూరి వసంత్ నాయుడు గారు (ఈయన సంజనా పద్మం వాళ్ళ నాన్నగారు) కూడా ఒకటి రెండు విషయాలు చెప్పారు తెలుగువాణి ట్రస్ట్ గురించి. ఆ ప్రసంగ విశేషాలు ఇవీ...
-------------------------------------------------------------------------------------------------------
స.వెం. రమేష్ గారు:
స.వెం. రమేష్ గారు:
తమిళనాడులో 42 శాతం మంది తెలుగు మాట్లాడే వాళ్ళున్నారు. వాళ్లకి నోరుంది కానీ కళ్ళు లేవు. అంటే మాట్లాడగలరు, కానీ అక్షరం తెలీదు. ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడతారు. మేము తెలుగువాణి ట్రస్ట్ ద్వారా పల్లెపల్లెకీ తిరిగి తెలుగు నేర్పడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ తెలుగు నేర్పేవారికి తమిళం, తెలుగు రెండు భాషలూ తెలియాలి. తమిళం లిపి తెలిసినవారికి కొత్త లిపి నేర్పడం చాలా కష్టం.
తెలుగు, తమిళం తెలిసిన 18-20సంవత్సరాల వయసున్న అబ్బాయిలు తెలుగు నేర్పుతూ వుంటారు. కానీ వాళ్ళని స్థానిక తమిళులు చాలా ఇబ్బందులకి గురిచేస్తుంటారు. ఆ పిల్లల మీద రకరకాల కేసులు పెట్టిస్తారు, కొడతారు, రాళ్లు విసురుతారు.
మేమేమీ ఉద్యమాలు చెయ్యట్లేదు. సమానహక్కులు అడగట్లేదు. బళ్ళో తెలుగు చెప్పమని అనట్లేదు. తీరిక వేళల్లో నేర్పుకుంటామని, నేర్చుకుంటామని మాత్రమే అంటున్నా చాలా వ్యతిరేకత ఎదురవుతోంది.
ఎప్పుడైనా బుస కొట్టడం తప్పు కాదు, కరవడం తప్పు కానీ.
[లలిత ఉవాచ: స. వెం. రమేష్ గారి ఈ మాట వినగానే నాకు మా నాన్నమ్మ దగ్గర విన్న పాము - బుస్ కథ గుర్తొచ్చింది.]
తెలుగు వాళ్లలో చాలా పట్టనితనం వుంది. వారిలో మిగిలిన ఒకే ఒక బుస యార్లగడ్డ. తమిళనాడులో తెలుగువారిని చాలా కించపరుస్తారు. జల్లికట్టుని ఆంధ్రా గొల్టీలే నడిపించారంటారు. కమల్ హాసన్ తమిళ పత్రికల్లో తెలుగు "బాహుబలి"ని దుమ్మెత్తి పోస్తున్నారు. మీరేమో ఇక్కడ తానాలో తమిళుల తిరుక్కురళ్, ఆండాళ్ పాశురాలు, రుక్మిణీదేవి అరుండేల్ భరతనాట్యాలు వీటన్నినీ ప్రదర్శించడానికి వీలు కలిపించారు.
తమిళనాడులో కులాల వారీగా వరస కట్టి తెలుగువారిని బయటికి పొమ్మంటున్నారు. నిజం చెప్పాలంటే తమిళనాడులోని దేవాలయాలన్నిటినీ తెలుగు వడ్డెరలు కట్టారు. 110 జానపద కళారూపాలున్న తమిళ సంస్కృతిలో 105 కళారూపాలు తెలుగువారివి. తమిళం తెలుగు సంస్కృతిని మింగేస్తోంది.
ఉడుముల పేటలో కుమ్మరులు, అరుంధతి కులస్తులు, వడ్డెర, మేదర - అందరూ తెలుగు వాళ్ళే. తమిళులకు చేతివృత్తులు, వ్యవసాయం తెలీదు. బట్టల్లేవు, చెప్పుల్లేవు, కుండల్లేవు. ఉత్పత్తి తెలుగువాళ్ళని చూసి నేర్చుకున్నారు.
-------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------
ఇలా స.వెం. రమేష్ గారి ప్రసంగం చాలా ఆవేదనతో, ఆవేశంగా సాగింది.
తర్వాత వక్త: గులాబి-బాల సంజనా పద్మం. కొంగునాడు యాసలో అమ్మభాష గురించి తన వయసుకి మించిన పరిణతితో మాట్లాడింది ఆ అమ్మాయి. ఆ విశేషాలివీ ...
-------------------------------------------------------------------------------------------------------
కొంగునాడు, చోళనాడు, పాండ్యనాడు, మొరసనాడు, తొండనాడు ప్రాంతాల్లో ప్రతి 20 మందిలో పదిహేను మంది అమ్మభాష మాట్లాడతారు. మేము తమిళనాడులో ఉంటూ చాటుమాటుగా నైనా నేర్చుకుని అమ్మభాషలోనే మాట్లాడాలి అనుకుంటున్నాము. మాట్లాడుతున్నాము. కానీ ఆంధ్రాలో అమ్మభాషని వద్దనుకుంటున్నారు. అది తెలిసి చాలా బాధగా అనిపిస్తుంది.
-------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------
[లలిత ఉవాచ: సంజనా పద్మం "గుజ్జుబొమ్మ ఎద్దుల నాయుడు అనే ఒక ఉద్యమకారుడి గురించి, అతని కూతురు కొండమ్మ గురించి చెప్తూ తమిళులు వాళ్ళిద్దరినీ ఎలా తమవారుగా చెప్పుకుంటారో, ఆ కొండమ్మని ఎలా ఒక కొండదేవతగా మార్చేశారో చెప్తూ మన భాషనే కాదు మన మనుషుల్ని కూడా తమిళనాడు తనవారిగా చెప్పుకుంటోంది అని ఎంతో ఆవేదనతో మాట్లాడింది. అసలు ఆ అమ్మాయి మాట్లాడింది విన్న తర్వాత ఆంధ్రలో తెలుగు నేర్చుకోని వాళ్ళని, తెలుగు రాదు అని చెప్పుకునే వాళ్ళని తలచుకుని తెలుగు ఇక ఎల్లలు దాటితే మాత్రమే వెలుగుతుందేమో అనిపించింది. ఇక మన భవిష్యత్తు తెలుగు నినాదం: ఎల్లలు దాటితేనే తెలుగు - ఎప్పటికైనా వెలుగు.]
సంజనా పద్మం మాట్లాడిన తర్వాత సురేష్ కొలిచాల గారు మాట్లాడినట్లు గుర్తు. ఆయన లాప్టాప్‌లో రాసుకొచ్చిన తెలుగు భాష గురించిన ప్రసంగ పాఠాన్ని చదివారు. దాని వల్ల అదేదో తరగతి గదిలో పాఠం వింటున్నట్లుగా అనిపించింది - అంతగా ఆ స్టాటిస్టిక్సూ, లెక్కలూ మనసుకెక్కలేదు. ఇప్పుడు ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తు రావట్లేదు. Loss is mine - literally & figuratively ప్చ్!
తర్వాతి వక్త: సామల రమేష్‌బాబుగారు. ఈయన తెలుగు భాషోధ్యమ సమాఖ్య అధ్యక్షులు, అమ్మనుడి పత్రిక సంపాదకులు. ఈయన ప్రసంగ విశేషాలు ...
-------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------
ఎన్నోభాషాప్రయుక్త రాష్త్రాల్లో భాషకి మంత్రులున్నారు. మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంలో తెలుగుకి మాత్రం మంత్రి లేరు. పాలక పక్షం, ప్రతిపక్షం కలిసి తెలుగు భాషని మోసం చేశారు. ఎన్టీఆర్, పీవీ నరసింహారావు మినహాయింపు.
తెలుగు సంస్కృతి అంటేముగ్గు, పంచె ఇవి మాత్రమే కావు. అవి ఒక భాగం మాత్రమే.
సంజనా పద్మం చేసేది భాషా రక్షణ. మిగిలిన వాళ్లంతా తెలుగు కోసం పాటుపడుతున్నామనేది వాళ్ల వాళ్ళ సిద్ధాంతాల కోసం, భావవ్యాప్తి కోసం తప్ప తెలుగుని రక్షించడం కోసం కాదు.
వాడకపోతే ఏదైనా నశించి పోతుంది. "దేశభాషలందు తెలుగు లెస్స, కానీ తెలుగు less అయిపోతోంది" అనే వ్యంగ్యాలు మానేయండి.
ముగ్గులు వేసి, అర్థం పర్థం లేని పాటలు పాడి, ఆటలు ఆడితే భాషోద్యమం కాదు. భాషని వాడాలి. శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో భాషని చొప్పించాలి.
తెలుగు భాష లేకపోతే మీరు చూసే టీవీ ఉండదు, సినిమా ఉండదు. తెలుగుని కాపాడడానికి వచ్చినన్ని G. O లు ప్రపంచంలో ఇంకే భాష కోసం రాలేదు.
తెలుగుని కాపాడడం ముఖ్యంగా రెండు రంగాల్లో జరగాలి. ఒకటి విద్యారంగంలో తెలుగు బోధించండం ద్వారా. రెండోది పరిపాలనా రంగంలో తెలుగుని అమలు చేయడం ద్వారా. అప్పుడే తెలుగు ఎల్లకాలమూ నిలుస్తుంది. ఎల్లెడలా వెలుగుతుంది.
-------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------
సామల రమేష్‌బాబుగారి ప్రసంగం సుతిమెత్తగా కొట్టినట్లనిపించినా కొంచెం గట్టిగానే తగిలిన చెంపదెబ్బ. నాకు బాగా నచ్చింది. ఆ ఏటు తెలుగు పట్ల మన ఏమరుపాటుకి తగిన చికిత్సే!
ఆయన ప్రసంగం పూర్తయిన తర్వాత సామల రమేష్‌బాబుగారు మా అందరికీ "అమ్మనుడి" మాసపత్రిక ప్రతులందజేశారు.
ఆయన ప్రసంగం పూర్తయిన తర్వాత సామల రమేష్‌బాబుగారు మా అందరికీ "అమ్మనుడి" మాసపత్రిక ప్రతులందజేశారు.
ఆ తర్వాత మా సాహిత్యకమిటీ అధ్యక్షులు పసుపులేటి రవిగారు మా కమిటీ మెంబర్ల చేత వేదిక మీదనున్న వారందరికీ TANA మెమెంటోలు ఇప్పించారు. ముందు నన్ను సంజనా పద్మంకి ఇమ్మని చెప్పారు. మళ్ళీ అంతలోనే సంజనా పద్మంకి అరుణా జంపాలగారు ఇస్తారు, మీరు సామల రమేష్‌బాబుగారికి ఇవ్వండి అన్నారు. సరే! ఎవరికి ఇచ్చినా ఎవరు ఇచ్చినా తానా-సొమ్ము :) ఇచ్చిపుచ్చుకోవటాలు ముగిశాయి.
అప్పటికే ఐదయింది. అప్పటికే పంచెకట్టుతో మూర్తీభవించిన తెలుగుదనమా అనిపించేలా మూర్తిదేవి పురస్కారగ్రహీత కొలకలూరి ఇనాక్ గారు, వారితో పాటే తెలుగు పద్య "రసధుని"కి "రజనీగంధాన్ని" అద్దిన మా గుంటూరు తెలుగు మాష్టారు పాపినేని శివశంకర్ గారు వచ్చి వున్నారు. తర్వాతి కార్యక్రమం వారిదే మరి.
వేదిక మీద - ఇద్దరు వక్తలు ఇనాక్ గారు, శివశంకర్ గారు; ఒక సభాధ్యక్షులు ఆలూరి సురేంద్ర కుమార్ గారు - ముత్యం ముగ్గురు.
వేదిక ముందు - ముందు వరసంతా ఖాళీ కుర్చీలు. ఆ తర్వాతి వరసల్లో చెవులు లెక్కేస్తే కొంచెం మర్యాదగా వుంటుందేమో - నావో రెండు, నావి కాక ఇంకో ముప్పై - వెరసి పదహారణాల తెలుగు వినడానికి అంకెలారా పదహారు జతల చెవులు.
కానీ వక్తలైన ఇనాక్ గారు, పాపినేని శివశంకర్ గారు ఈ మాత్రం నిరుత్సాహపడకుండా రెట్టించిన ఉత్సాహంతో వారివారి ప్రసంగాలు చేశారు. కొలకలూరి వారిది "నా సాహితీ యాత్ర" అయితే, పాపినేని వారిది "నా కథాయానం". ఆ రెండు ప్రసంగాలూ కూడా వారిద్దరూ తానా జ్ఞాపికకి ఏవైతే రాశారో అవే వ్యాసాలు అలాగే వేదిక మీద చెప్పారు. వాటిని ఇక్కడ రాసే కన్నా వారి మాటల్లోనే చదవగలిగితే బావుంటుంది అనిపించింది కానీ నాగ్గుర్తున్నంత వరకూ కొన్ని విశేషాలు ఇక్కడ....
-------------------------------------------------------------------------------------------------------
కొలకలూరి ఇనాక్ గారు:
చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కనిపించిన పుస్తకమల్లా చదివేవాణ్ణి. తర్వాత చందమామ, బాలమిత్రలకు చిన్నచిన్న కథలు పంపేవాణ్ణి. కానీ ఎప్పుడూ వాళ్ళు వేసుకోలేదు.
నా జీవితంలో చుట్టుపక్కల ఏమైనా నాకు ఇబ్బంది కలిగించేది జరిగినప్పుడు ఏమీ చేయలేక ఏడుపొచ్చేది. అలా అని ఏడవలేను కదా! పైకి నవ్వుతూ కనిపించాలి. అంత బాధని నాలో దాచుకోలేక సతమతమయ్యేవాణ్ణి. ఆ బాధని రాత రూపంలో బయటపెడితే తీరిపోయి తేలికగా అనిపించేది. నా రచన అలా మొదలయింది.
నా "మునివాహనుడు" కథ చదివి దాశరథి కృష్ణమాచార్యులు ఎంతో మెచ్చుకున్నారు.
-------------------------------------------------------------------------------------------------------
పాపినేని శివశంకర్ గారు:
నా బాల్యం నెక్కల్లు అనే గ్రామంలో హరికథలు, బుర్రకథలు వింటూ, బ్రహ్మంగారి నాటకాలు చూస్తూ, పల్లె పైరుల మధ్య హాయిగా సాగింది. హైస్కూల్లో పద్యాల పోటీ పెడితేమొదటి బహుమతి వచ్చింది. అప్పుడు "పిల్లల టాగూరు" అనే పుస్తకం ఇచ్చారు నాకు. పదో తరగతిలో రవీంద్రుడి గీతాంజలి అర్థం కాకపోయినా చదివేశా.
మా ఊరి గ్రంథాలయంలో వున్న చందమామ మొదలుకొని టాగోర్, శ్రీశ్రీ, శరత్ - అక్కడ వున్న పుస్తకాలన్నీ చదివేశా. నాకు నేనే పద్యాలల్లటం, కథలు రాయటం మొదలు పెట్టాను. నన్ను మా హైస్కూల్లో "పిల్లకవి" అని పిలిచేవారు.
వాసిరెడ్డి నవీన్ గారితో కలిసి ఒక ఏడాదిలో వచ్చిన కథలన్నీ చదివి అందులో కొన్ని మంచి కథలతో ప్రతి ఏడాదీ కథాసంకలనాలు ప్ర చురిస్తున్నాము.
-------------------------------------------------------------------------------------------------------
నిజంగా చెప్పాలంటే ఇనాక్ గారు, శివశంకర్ గారు ఇంకా చాలా గొప్పగొప్ప విషయాలు చెప్పారు. ఈ కబుర్లు తానా సిరీస్ మొదలు పెట్టిన కొత్తలో రాసి ఉంటే అందులో ఒక వంతైనా రాయగలిగి ఉండేదాన్ని. ఇప్పటికి ఇంతే మరి - మర్చిపోయాను చాలా విషయాలు. ఎక్కడైనా TANA-2017 జ్ఞాపిక upload చేశారోమో కనుక్కుని ఆ pdf లింకులు ఇక్కడ చేరుస్తాను.
మొదటి రోజు సాహితీ ప్రసంగాలు అయిపోగానే అక్కడ పుస్తకప్రదర్శనలో పాపినేని శివశంకర్ గారు రాసిన "తల్లీ! నిన్ను దలంచి...", "రజనీగంధ" అనే పుస్తకాలు తీసుకున్నాను.
కొలకలూరి ఇనాక్ గారి దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకుని మా ఇంటికి తప్పకుండా రావాలని బదరి మాటగా, నా మాటగా కూడా చెప్పాను.
ఇక్కడికి నా TANA కబుర్ల సిరీస్ సమాప్తం!
నేను ఈ సిరీస్ మొదలు పెట్టినప్పుడు చెప్పినట్లే ఇదే ముందూ-వెనకలుగా రాసిన సిరీస్ (Memento అని ఇంగ్లీష్ సినిమాల అదే మన గజిని సినిమాలా...). అందుకని దీని తర్వాత ఏం జరిగిందో తెల్సుకోవాలంటే... ఈ కింది లింక్ మీద క్లిక్కుడి!
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ఉపోద్ఘాతం
తా. క. or తోక : నా ఈ తానా కబుర్లు చదివే మీరందరూ ఒకటి కనిపెట్టారా? మాది లిటరరీ ఫోరమ్ (Literary Forum) కాదండోయ్... లిటరసీ ఫోరమ్ (Literacy Forum) - సాహిత్యంలో ఓనమాలు నేర్చునే నాలాంటి వాళ్లకు సరిగ్గా సరిపోతుంది కదూ... !
చివరిగా ఒక్క మాట, ఎప్పుడో ముందే చెప్పి ఉండాల్సిన మాట : 2017సెయింట్ లూయిస్ తెలుగు ఎసోసియేషన్ సంక్రాంతి సంబరాలకి వెళ్ళినప్పుడు ఎదురొచ్చి "లలిత గారూ!మన ఊళ్ళో జరగబోయే తానా సాహిత్య కమిటీలో మీరు పాల్గొనాలండి" అని ఆహ్వానించిన పసుపులేటి రవి గారికి, వారికి నా పేరు నందించిన శ్రీకాంత్ సరస్వతుల గారికి బోల్డన్ని ధన్యవాదాలు. అలాగే తానా జ్ఞాపిక కోసం ఎన్నో సార్లు జ్ఞాపకం చేసి నా చేత ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే వ్యాసం రాయడానికి ప్రోత్సహించిన వల్లూరుపల్లి వెంకటేశ్వర రావు గారికి, అడుగడుగునా నన్ను మా సెయింట్ లూయిస్ ఆస్థాన రచయిత్రి అని ఆత్మీయంగా గుర్తు చేసుకునే అమృత రెడ్డి గారికి, నేస్తులైన వసుధ, కమల బాంధవిలకు, నేనేం రాసినా మెచ్చుకునే కామేష్ కడియాల గారికి, గిరిధర్ గొట్టిపాటి గారికి, అయినాపురపు శ్రీనివాస్ గారికి, మా "నానీల" విజయశ్రీ కుప్పా గారికి ఇంకా బోల్డన్ని ధన్యవాదాలు. అడగ్గానే అష్టావధానం రికార్డింగ్ షేర్ చేసిన శాస్త్రి కూచి గారికి, కమిటీలో సహకరించిన కుమార్ రెడ్డి గారికి, సుధాకర్ కల్వ గారికి కృతజ్ఞతలు. వీరందరి సహకారం లేనిదే నా ఈ తానా-సిరీస్ లేనే లేదు.

తానా తెనుగు తాన, చానా మురిసిన నేనననా, అమ్మనుడిన ఓ నెనరు?!
తపమేమి చేసితినో ...
తానా నెపమున
తనివి తీర
తెనుగు వాగున
తేనె మునకల మునిగితి తేలితి
తపమేమి చేసితినో ...
ఘనమైన ఒజ్జల చేరి
పలుకు పటిక బెల్లపు
తునకల నేరితి
వారి కూర్మి ప్రేమల బొందితి
తపమేమి చేసితినో ...
ఏ తెలుగుల తపమేమి చేసితినో ...
నే యే తెలుగుల తపమేమి చేసితినో ...
వెలుగు తెలుగుల జిలుగు నొందితి
తా. క. or తోక : నా ఈ తానా కబుర్లు చదివే మీరందరూ ఒకటి కనిపెట్టారా? మాది లిటరరీ ఫోరమ్ (Literary Forum) కాదండోయ్... లిటరసీ ఫోరమ్ (Literacy Forum) - సాహిత్యంలో ఓనమాలు నేర్చునే నాలాంటి వాళ్లకు సరిగ్గా సరిపోతుంది కదూ... !
చివరిగా ఒక్క మాట, ఎప్పుడో ముందే చెప్పి ఉండాల్సిన మాట : 2017సెయింట్ లూయిస్ తెలుగు ఎసోసియేషన్ సంక్రాంతి సంబరాలకి వెళ్ళినప్పుడు ఎదురొచ్చి "లలిత గారూ!మన ఊళ్ళో జరగబోయే తానా సాహిత్య కమిటీలో మీరు పాల్గొనాలండి" అని ఆహ్వానించిన పసుపులేటి రవి గారికి, వారికి నా పేరు నందించిన శ్రీకాంత్ సరస్వతుల గారికి బోల్డన్ని ధన్యవాదాలు. అలాగే తానా జ్ఞాపిక కోసం ఎన్నో సార్లు జ్ఞాపకం చేసి నా చేత ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే వ్యాసం రాయడానికి ప్రోత్సహించిన వల్లూరుపల్లి వెంకటేశ్వర రావు గారికి, అడుగడుగునా నన్ను మా సెయింట్ లూయిస్ ఆస్థాన రచయిత్రి అని ఆత్మీయంగా గుర్తు చేసుకునే అమృత రెడ్డి గారికి, నేస్తులైన వసుధ, కమల బాంధవిలకు, నేనేం రాసినా మెచ్చుకునే కామేష్ కడియాల గారికి, గిరిధర్ గొట్టిపాటి గారికి, అయినాపురపు శ్రీనివాస్ గారికి, మా "నానీల" విజయశ్రీ కుప్పా గారికి ఇంకా బోల్డన్ని ధన్యవాదాలు. అడగ్గానే అష్టావధానం రికార్డింగ్ షేర్ చేసిన శాస్త్రి కూచి గారికి, కమిటీలో సహకరించిన కుమార్ రెడ్డి గారికి, సుధాకర్ కల్వ గారికి కృతజ్ఞతలు. వీరందరి సహకారం లేనిదే నా ఈ తానా-సిరీస్ లేనే లేదు.

"తెలుగు మాష్టారి మొట్టికాయలు ఎప్పుడూ బొప్పి కట్టవు, గట్టి మేలే చేస్తాయి" బాగుంది ఈ మాట లలిత గారు, అది నిజం కూడా.
రిప్లయితొలగించండికదా! పవన్‌గారు!
తొలగించండిభలే వివరంగా రాసుకొచ్చారు లలితగారూ.. ఇది సాహిత్య సమావేశాల కాలం కాబోలు, ఇక్కడా అక్కడానూ. మీదైన శైలిలో రాసిన విధానం చాలా నచ్చింది.
రిప్లయితొలగించండిఇది కిందటేడాది మొదలు పెట్టిన సిరీస్. ఇప్పటికి పూర్తయింది, మానసా! చదివావు, సంతోషంగా వుంది!
తొలగించండిచక్కగా ఉంది మీ తానా వ్యాఖ్యానం. అప్పుడే అయిపోయిందా?
రిప్లయితొలగించండిఇప్పటికే చాలా ఆలస్యమయింది, అన్యగామిగారు! మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
తొలగించండితెలుగు నేల మీద తెలుగు లేదను వారు
రిప్లయితొలగించండితెలుగు పల్లె లందు దిరుగ రయ్య !
దివ్య మైన తియ్య తెలుగు పల్కుల తేనె
రుచులు నాల్క మీద నాట్య మాడు .
మీ పద్యవ్యాఖ్యకి ధన్యవాదాలు, మాష్టారు!
తొలగించండితెలుగు మాష్టారి మొట్టికాయలు ఎప్పుడూ బొప్పి కట్టవు, గట్టి మేలే చేస్తాయి....మొట్టికావలు కాదు దుడ్డు కర్ర తీసుకొని ఇక్కడ తెలుగు ని తెగులు పట్టిస్తున్న నాయకులు అధికారుల బుర్రలు పగలకొట్టాలి...
రిప్లయితొలగించండిఅంత కోపం వద్దు తమ్ముడూ! దుడ్డుకర్రతో కొందర్ని కొట్టి బాధ పడే కన్నా, బలపం-పుల్లతో ఎందరికో తెలుగు నేర్పడం సులువు :)
తొలగించండి