( ఈ కథ చిన్నప్పుడు అనాతవరంలో మా నాన్నమ్మ ప్రతీ సాయంత్రం చెప్పే కథల్లో నాకు బాగా నచ్చిన కథ.)
అనగనగా ఒక ఊళ్ళో ఒక పాము వుండేది. ఆ పాము తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కరుస్తూ వుండేది. దాంతో భయపడి ఊళ్లోవాళ్ళు ఎవ్వరూ పాముతో స్నేహం చేసేవారు కాదు. అందరూ కలిసి మెలిసి వుండడం, తనతో మాట్లాడకపోవడం చూసి పాముకి దిగులు వేసింది- తనకి స్నేహితులు ఎవరూ లేరని.
ఇలా వుండగా ఆవూరికి ఒక సాధువు వచ్చారు. అందరితోనూ మాట్లాడి, పాము ఎవరితోనూ కలవకపోవడం చూసి పాము వున్న పుట్ట దగ్గరికి వచ్చి ఇలా అడిగారు - పామూ, పామూ! నువ్వెందుకు అలా దూరంగా ఎవరితోనూ మాట్లాడకుండా వున్నావు? అని.
అప్పుడు పాము - స్వామీ! నేను ఇంతకు ముందు ఈవూరివారిని కరుస్తూ వుండేదాన్ని. అందుకని భయం వేసి నా దగ్గరికి రావడం మానేసారు - అని చెప్పింది.
సాధువు: పామూ! నువ్వు నిజం చెప్పినందుకు చాలా సంతోషం. మరి నువ్వు అలా ఎందుకు అందరినీ కరిచావు?
పాము: స్వామీ! మనుషులెవరైనా నా వద్దకి వస్తే వారు నన్నేమైనా చేస్తారేమో అన్న భయంతో అలా చేసాను. కానీ నన్ను చూడగానే వాళ్ళందరూ అలా దూరంగా పారిపోతుంటే నాకిప్పుడు చాలా బాధగా వుంది - నాతో ఇంకెప్పుడూ స్నేహం చేయరని.
సాధువు పాముతో - అలా అయితే నేను చెప్పినట్టు చేయి. ఇప్పటినుంచి ఎవరు నీదగ్గరగా వచ్చినా ఏమీ చేయకు. వూరికే చూస్తూ వుండిపో. నువ్వేమీ చేయకపోవడం చూసి అందరూ తొందరలోనే నీ స్నేహితులవుతారు - అని చెప్పి మళ్ళీ నెల తర్వాత వస్తానని పాము దగ్గర శలవు తీసుకుని ఆవూరి నుంచి వెళ్ళిపోయారు.
ఆరోజునుంచి పాము సాధువుకిచ్చిన మాట ప్రకారం అందరినీ కరవడం మానేసింది. తన పుట్ట దగ్గరికి ఎవరైనా వస్తే పైకి వచ్చి వాళ్ళతో మాట కలపబోయేది. కానీ పాము సాధువు మాట విని మంచిగా మారిపోయింది అని తెలియని ఊరివారు పాము తాము రాగానే బయటికి రావడం చూసి ఎక్కడ తమకూ, తమ పిల్లలకూ హాని చేస్తుందో అనుకుని రాళ్ళతో కొట్టడం మొదలు పెట్టారు. పాము సాధువుకి ఇచ్చిన మాట ప్రకారం మనుష్యులని కరవకూడదు కాబట్టి తనని తను రక్షించుకోవడం కోసం పుట్టలోపలికి వెళ్లి దాక్కుంది. ఊరివారు బయటికి వస్తారు అన్న భయంతో లోపలే ఉండిపోయింది. దాంతో సరైన ఆహారం దొరక్క బక్కచిక్కి పోయింది.
అన్నమాట ప్రకారం నెల తర్వాత సాధువు పాముని చూడడానికి పుట్ట దగ్గరికి వచ్చారు. వచ్చి- పామూ, పామూ! బయటికి రా. నువ్వు ఎలా వున్నావో చూసి, ఈ నెలలో ఎందరు స్నేహితులని సంపాదించుకున్నావో నువ్వు చెప్తే వినాలని వచ్చాను - అన్నారు.
సాధువు గొంతు విని పాము నీరసంగా పుట్టపైకి వచ్చింది. చిక్కిపోయిన పాముని చూసి సాధువు ఆశ్చర్యపోయి - అదేంటి పామూ! ఇలా వున్నావేంటి? ఏం జరిగింది? - అని అడిగారు.
అప్పుడు పాము చాలా బలహీనమైన గొంతుతో - ఏం చెప్పమంటారు స్వామీ? నేను మీరు చెప్పినట్టే కరవడం మానేసాను. నా పుట్ట దగ్గరకి వచ్చిన వాళ్ళతో స్నేహం చేద్దామని పైకి వస్తే నన్ను రాళ్ళతో కొట్టారు. అందుకే ఆహారానికి వెళ్ళడానికి కూడా భయపడి నా పుట్టలోనే ఉండిపోయాను - అని చెప్పింది.
సాధువు కొంచెం సేపు ఆలోచించి - అయ్యో పాము! ఎంత పని జరిగింది. నిన్ను కరవవద్దన్నాను కానీ బుస కొట్టద్దన్నానా? ఈసారి నుంచి ఎవరైనా నీ దగ్గరికి వస్తే కరవకుండా, అలా అని వూరికే ఉండకుండా ఒక్కసారి "బుస్" అను. ముందు కొన్ని రోజులు భయపడ్డా , నువ్వు "బుస్" అనడం తప్ప కరవవని అర్థం చేసుకుని తొందరలోనే మీఊరివారు నీ స్నేహితులవుతారు - అన్నారు.
పాము సాధువుకి ధన్యవాదాలు చెప్పి ఆరోజు నుంచి ఎవరైనా పుట్ట దగ్గరికి వస్తే ఒకసారి "బుస్" అని తర్వాత ఊరుకోవడం మొదలుపెట్టింది. ఊరివారు పాము ఏమీ చేయదని తొందరలోనే గ్రహించి తాము పుట్ట దగ్గరికి వచ్చేటప్పుడు పాలు, కోడిగ్రుడ్లు పాముకి ఫలహారంగా తెచ్చి ఇచ్చేవారు.
ఆవిధంగా వూరివారిని మంచి చేసుకున్న పాము హాయిగా వారితో కలిసిమెలిసి వుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి