బోల్డన్ని కబుర్లు...
27, మార్చి 2011, ఆదివారం
నేటి ఇరుగు-పొరుగు
అంతర్జాల పత్రిక "విహంగ"లో ప్రచురింపబడిన నా కవితకై ఈ లింక్ మీద క్లిక్ చేయండి :
నేటి ఇరుగు-పొరుగు
నువ్వూ… నేనూ…
పక్క పక్కనే ఉంటున్నాం
ఇరుగూ-పొరుగూ
అనుకుంటున్నాం
మీ ఇరుగింట్లో మేము
మా పొరిగింట్లో మీరు
ఎవరికి వారం
కలవని ద్వీపాలం
ఉలుకూ లేదు పలుకూ లేదు
పలుకరించే చొరవా లేదు
ఊసూ లేదు బాసా లేదు
మనసు విప్పే ధ్యాసే లేదు
చిరునవ్వు రువ్వితే
మాట కలుస్తుందని జడుస్తాం
పక్కింట్లో పరిచయానికి
పెడమొగమై వెరుస్తాం
నాలుగిళ్ళ లోగిళ్ళ
ఆప్యాయతలు మరిచి
మూసిన తలుపుల చాటు
ఒంటికాయ సొంఠి కొమ్ములయ్యాం
ఖండాంతరాల్లో స్నేహాలు కలుపుతాం
అంతర్జాలంలో ఆత్మ బంధువులవుతాం
మీ ఇంటి పక్కన ఎవరుంటారంటే
సిరా చుక్కలేని తెల్ల కాగితాలవుతాం
ఇలా ఎందుకూ
అని నిలదీసి అడిగితే
జీవితపు పరుగుని
అద్దంలో భూతాన్ని చేస్తున్నాం
-లలిత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి