అనగనగా... అప్పుడెప్పుడో... బుజ్జిజింక చంటప్పుడు ...
ఎంచక్కా పగలంతా బుజ్జిజింకతో పాటు వాడి ఉంగా-ఉంగా భాషలో కబుర్లు చెప్పుకుంటూ, సాయంత్రం అన్నగాడితో పాటు సైన్సూ-లెక్కల పాఠాలు చదువుకుంటూ, ఆకలేస్తే తింటూ, నిద్రొస్తే పడుకుంటూ, ఇంటి వీధిగుమ్మం, పెరటిగుమ్మం దాటి అడుగు బయటికి పెట్టకుండా హా...యిగా పదకొండు నెలలు ఇట్టే గడిచి పోయాయి.
ఆ పదకొండు నెలల పాటు అమ్మ తరగాలనుకునే కూరలు, వండాలంటే సామానులు, అన్నగాడికి పుస్తకాలు, పెన్సిళ్లు, బుజ్జిపాపడికి డైపర్లు, బేబీ పౌడర్లు, క్రీములు ... ఇలా కోరుకున్నవారికి కోరుకున్నన్ని, కోరలేనివారికీ కోరల్లేనివారికీ కోరుకోకపోయినా బొమ్మలు, Teether లు కొన్ని - ఇలా ఏవి కావాలన్నా అన్నీ బదరినే తీసుకొచ్చేవారు. అమ్మ lived happily ever after - హమ్మయ్య!
అప్పటికి అన్నజింకకి పదో ఏడు
బుజ్జిజింకకి పదకొండో నెల
చేస్తున్న ఉద్యోగానికి విరామమిచ్చి ఏడాది
అన్నజింకతో ఆడుకుని బుజ్జిజింకతో పాడుకుని
దో ...బూచీ... అని కళ్ళు మూసి తెరిచేలోగా ఆ ఒక్క ఏడాది హుష్... కాకీ!
ఆ ఆటా-పాటలకి మరిగి, విరామమిచ్చిన కొలువుకి ఎప్పటికీ సెలవు ఇచ్చేయాలనిపించింది.
అలా అనిపించడానికింకో కారణం కూడా వుంది...
ఒకేడాది పాటు ఈడ నున్న నన్ను ఆడేడో కాలిఫోర్నియాలో వున్న ఆడ-మలయాళం-బాసు (lit.ly & fig.ly) చూలింతనని కూడా చూడకుండా పెట్టిన ఆరడి మళ్ళీ ఇంకోసారి ఆ పక్కక్కూడా తొంగి చూడకూడదు అనిపించేలా చేసింది.
ఆడుకుంటూ, పాడుకుంటూ నా కాలక్షేపం ఎలా అవుతోందీ అంటే...
ఆకలి వేళ అమ్మనౌతూ
పప్పు వండి ఆమ్ పెడుతూ
ఆటల వేళ అల్లరౌతూ
పంటా లేసి పంతం పోతూ
అమ్మని నన్ను ఉడికిద్దామని గుక్కే పెడితే
కీ ఇచ్చిన బొమ్మల్లె బుజ్జిజింకతో పాటు రాగం పెడుతూ - రాగాల, సరాగాల, హాసాల, విలాసాల - కులాసాగా నడుస్తోంది కాలం.
అప్పుడో రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన బదరి చెప్పిన కబురేంటంటే ఎవ్వరో పుణ్యాత్ములు పిలిచి మరీ నాకు ఉద్యోగం ఇస్తామంటున్నారని.
"అబ్బే! నాకొద్ద"న్నా.
మళ్ళీ రెండో రోజూ అదే మాట. పైగా నా CV ఇమ్మని ఒకటే అడుగుట అట.
"అమ్మో! మళ్ళీ అక్కడికే..?! నే రా" నన్నా.
మూడో రోజొచ్చి "అబ్బే! ఆ పాత టీము కాదు. ఎంచక్కా ఇది కొత్తది. అన్నిసార్లు అడిగాడు పాపం! ఒకసారి నీ CV ఇచ్చి చూద్దాం" అంటూ పట్టుకెళ్లారు బదరి.
మొత్తానికి మళ్ళీ డబ్బా లంచూ, లాప్టాప్ సంచీ సర్దుకుని ఆఫీసుకి ప్రయాణం.
పగలంతా బుజ్జిజింక నొక్కడినీ, సాయంత్రం బడయ్యాక వాడికి తోడుగా అన్ననీ చూసుకొమ్మని ఒకరింట వదిలి వెళ్ళేవాళ్ళం.
మా ఇంటి నుంచి డౌన్‌టౌన్‌లో వున్న ఆఫీసుకి ఒక గంట ప్రయాణం. ఆ గంటా గంట కొట్టినట్లు నేను గణ-గణా మాట్లాడకుండా ఉండాలంటే, తను ప్రశాంతంగా డ్రైవ్ చెయ్యాలంటే "ఏం చేస్తే బావుంటుందబ్బా?!" అనాలోచించి పాతవో, కొత్తవో పది పాటలుంటే - అవి నేను వినే వీలుంటే - ఆట్టే మాట్లాడి, ఆ మాటలతో ఆట్లాడి, ఆ మాటల ఆటల్లో పోట్లాడి, ఆ మాటల ఆటల పోట్లాటల్లో పడరాని పాట్లు పెట్టనని అనుకుని, అనుకున్నదే తడవు కొన్ని MP3 లని పట్టుకుని ఓ CD లో పట్టి అట్టేపెట్టేశారు బదరి.
మళ్ళీ ఆ పాటలెలా ఉండాలంటే - ఒకే భాషవి కాకూడదు, వినగానే నచ్చెయ్యాలి, పాట బావుండాలి, మాట నచ్చాలి, మ్యూజిక్ బావుండాలి, మ్యాజిక్ చేసినట్టుండాలి.
ఇన్ని షరతులతో కొత్తవీ, పాతవీ, తెలుగువి, ఇంగ్లీషువీ, తమిళంవీ, శాస్త్రీయ సంగీతం, అన్నమాచార్య దేశికవితాగానం - ఇలా అన్నీ కలిపేసిన పాటల వరసేంటంటే ... (మచ్చుకి కొన్ని మెచ్చుతునకలు మాత్రం)...
చుక్కల తోటలో ఎక్కడున్నావో (కృష్ణ, జయప్రద)
నాదారి ఎడారి నా పేరు బికారి (కృష్ణ)
భో శంభో శివ శంభో (మహారాజపురం రామచంద్రన్)
I know you think that I shouldn't still love you (Dido - White Flag)
తెన్మేరు పరువక్కాట్రు (కరుత్తమ్మ - ఉన్ని కృష్ణన్, చిత్ర)
మరీ ... మరీ... కలవరం (సినిమా పేరు శ్రీ )
Daddy Cool (Boney M)
కన్నుల్లో మియ్యా మియ్యా
లాలీ లాలీ లాలీ లాలీ జో (అన్నమయ్య దేశికవితాగానం - ఎస్జానకి).
పైన లిస్టిన పాటల్లో ఒకటి - కన్నుల్లో మియ్యా మియ్యా - అన్న పాట ఎందులోదో తెలీదు కానీ మా ఇద్దరికీ కూడా ఇష్టమయ్యింది అప్పుడు. ఎంత నచ్చిందీ అంటే ముందొచ్చే మ్యూజిక్ ఒక చిన్న ముక్క మా ఫోన్లకి రింగ్‌టోన్‌గా వాడుకునేంతగా.
ఆ తర్వాత నెమ్మదిగా సీడీల కాలం చెల్లింది. ఒకే కార్లో ఆఫీసుకెళ్లే వీల్లేకపోయింది. ఆ పాటల లిస్టులు మాత్రం మిగిలాయి.
మళ్ళీ ఇన్ని రోజులకి మాకు నచ్చిన కన్నుల్లో మియ్యా మియ్యా పాట అసలే సినిమా లోదో, ఎక్కడైనా ఉందేమో అని వెతికితే అసలు చిక్కితేనా? యూట్యూబ్ లో ఒక రోజు వెతుకుతూ ఉంటే అనుకోకుండా "kannullo miya miya" అని టైప్ చేయబోయి "kannale miya miya" అని తప్పు టైప్ చేశా. ఆ తప్పే నా పాలిట పాట-ఒప్పు అయింది. కళ్ళ ముందు "అళ్ళి తంద వానమ్" అన్న తమిళ సినిమా లోంచి "కణ్ణాలే మియా మియా" అంటూ నేను వెతుకుతున్న కన్నుల్లో మియ్యా మియ్యా పాటకి తమిళ-కవల కనిపించింది.
ఆ పాట అంచు పట్టుకుని వెతుక్కుంటూ వెళ్తే దానికి తెలుగు డబ్డ్ వెర్షన్ పేరు సత్తి అని కనిపించడం
కనిపించిన ఆ సత్తి సినిమా పాటల కోసం నేను మళ్ళీ గూగుల్తో వెతకడం
వెతికిన నాకు ఎక్కడో ఆ పాటల MP3లు కనిపించడం
కనిపించిన ఆ పాటని పట్టి యూట్యూబ్ కెక్కించమని బదరిని అడగడం
అడిగిందే తడవు బదరి నాకొక యూట్యూబ్ లింక్ ఇవ్వడం...
ఇచ్చిన లింక్ క్లిక్కి నేనా పాట వినడం
విన్న పాటని రాయడం
రాసిన పాట వెనక కథ చెప్పడం
చెప్తున్న కథని బ్లాగు కెక్కించడం
అంతా - భలేగా జరిగిపోయిందిగా...
డం డం డిగా డిగా - పాటే దొరికిందిగా ...
అసలీ తెలుగు పాటలో మాటలు అంత గొప్పగా వుండవు కానీ...మ్యూజిక్ హుషారుగా, తమాషాగా - ఉయ్యాలూగిస్తుంది...
పైన తమిళపాటలో వున్న ప్రభుదేవా, లైలాల డాన్సు వీడియోనే ఈ తెలుగు పాటక్కూడా applicable. తమిళ పాట వీడియో మ్యూట్ లో పెట్టి, తెలుగు పాట వినేస్తే సరి.
ఈ పాట రాసింది: బోస్ గోగినేని.
పాట వరస కట్టింది: విద్యాసాగర్ (చంద్రముఖి మ్యాజిక్ మ్యూజిక్ డైరెక్టర్).
పాడినవారు: ఉన్ని మీనన్, ఉష
ఈ పాటలో ఉన్ని మీనన్ గొంతు క్లాసిక్‌గా వుంది. తెలుగులో కూడా అతని చేతే పాడించడం చాలా బావుంది. కాకపోతే అసలు పాటలో కొన్ని మాటలు అర్థం కాలేదు. నాకు తోచినవేవో పెట్టి రాసేశాను ప్రస్తుతానికి - అవెక్కడెక్కడంటే.... కింద underline చేసి పెట్టుకున్నా తరవాతెప్పుడో సరి చేసుకుందామని...
ఇంతకీ అళ్ళి తంద వానమ్ అంటే ఆకాశం చాలా ఇచ్చింది అని అర్థమట (అళ్ళి= a lot తంద=gave వానమ్=sky) - నా ఫ్రెండూ, తమిళ consultant అయిన హేమ చెప్పింది. అర్థం చెప్తూ పేరు poetic గా ఉందని సినిమా చూడొద్దూ, pathetic కావొద్దూ అని మరీ మరీ చెప్పింది. సినిమాల విషయంలో నా adventurous gene గురించి తనకి తెల్సిపోయినట్టుంది కాబోలు! :)
ఈ ఏడాదికి ఇది ఆఖరి బ్లాగ్ పోస్ట్... మళ్ళీ వచ్చే ఏడాది - ఇంకొన్ని పాటలు మోసుకొస్తా ...
~ పాటల భైరవి

కన్నుల్లో మియ్యా మియ్యా - గిల్లుళ్లే కియ్యా కియ్యా
ఒళ్లేదో ఉయ్యాలెయ్యా-ఇదేం ప్రేమయా
కారణం... నువ్వే ప్రియా - కవ్వించే... కళ్ళేనయ్యా
సరసం... ముద్దే కియా - అధరాలు దూరమేలయా

వాలు కన్నుల మౌనం - వాడి కన్నుల గీతం
మూసీ వున్నా కన్నుల భాషేముందో
బరువై రెప్పలు సోలీ - నాలో చప్పుడు చేసీ
కోరిక కూడా కొంచెం కొసరే మదిలో
వలపుల ఎదలో ... హొయ్ ... పిలుపే స్వరమా
మనసే తెలిసీ ... హొయ్... దూరం తగునా
హేయ్... కొంచెం చుమ్మావని... వెంటే పడి కవ్వించకు
ప్రేమే... కోరీ... వస్తే - నన్నే... నెట్టేవేలా ...
ఇలా... జంటై... ఉందాం - ఒకే జగం మనం
కన్నుల్లో మియ్యా మియ్యా - గిల్లుళ్లే కియ్యా కియ్యా
ఒళ్లేదో ఉయ్యాలెయ్యా - ఇదేం ప్రేమయా
నీతో చేరే తీరం - దేహం కోరును దాహం
మోహం కొంచెం ముద్దే కోరుకోదా
కాముని ఆటలు చాలు - మాటలు చెప్పకు నాకు
ఆశే పెట్టుకొని చేరకు ఒళ్ళో
తలగడ పలికే... హొయ్... కోర్కెల అలలై
ఇరవై వయసే... హొయ్... తీయని కలగా
హేయ్... నన్నే వేధించకు... ఓ కోరికే చల్లార్చకు
ఏలా... నాతో... పంతం - ఒళ్ళే... చేస్తా... సొంతం
ఇలా... జంటై... ఉందాం - ఒకే జగం మనం
కన్నుల్లో మియ్యా మియ్యా - గిల్లుళ్లే కియ్యా కియ్యా
ఒళ్లేదో ఉయ్యాలెయ్యా-ఇదేం ప్రేమయా
కారణం... నువ్వే ప్రియా - కవ్వించే... కళ్ళేనయ్యా
సరసం... ముద్దే కియా - అధరాలు దూరమేలయా
ఇంతకీ అళ్ళి తంద వానమ్ అంటే ఆకాశం చాలా ఇచ్చింది అని అర్థమట (అళ్ళి= a lot తంద=gave వానమ్=sky) - నా ఫ్రెండూ, తమిళ consultant అయిన హేమ చెప్పింది. అర్థం చెప్తూ పేరు poetic గా ఉందని సినిమా చూడొద్దూ, pathetic కావొద్దూ అని మరీ మరీ చెప్పింది. సినిమాల విషయంలో నా adventurous gene గురించి తనకి తెల్సిపోయినట్టుంది కాబోలు! :)
ఈ ఏడాదికి ఇది ఆఖరి బ్లాగ్ పోస్ట్... మళ్ళీ వచ్చే ఏడాది - ఇంకొన్ని పాటలు మోసుకొస్తా ...
~ పాటల భైరవి
సూపర్ లలితా...
రిప్లయితొలగించండిథాంక్స్!
తొలగించండిఈ పాట మొదటిసారి వింటున్నానండీ.. చాలా బావుంది.. థాంక్స్ ఫర్ పోస్టింగ్..
రిప్లయితొలగించండిఈ పాట వినగానే నచ్చిందని చెప్పారు. సంతోషం! Thank you!
తొలగించండి