ఇప్పటికి పదహారు నెలల క్రిందట మా వూళ్ళో పదహారణాల తెలుగు తానా పండగ తెగ సంబరంగా, అంగరంగ వైభవంగా, గరం-గరం భోజనంగా, బహు పసందుగా జరిగింది.
ఆ తానాయణంలో సాంస్కృతిక-సాహిత్య వారధికి నా వంతుగా, ఓ వాలం-టీరుగా ఓ చిన్నబెడ్డని చేర్చిన నేను అప్పుడెప్పుడో మొదలుపెట్టి చెప్పదలుచుకున్న తానా-కబుర్లలో ఒక అసలు కబురు, ఇంకో కొసరు కబురు ఇంకా మిగిలే వున్నాయి.
ఇన్ని రోజులూ నా కబుర్లే బోల్డన్ని చెప్పేసుకుని, అక్కడెక్కడో ఆగిపోయిన తానా-కబుర్లు మళ్ళీ చెప్పాలంటే - అసలెక్కడ మొదలు పెట్టి ఇంకెక్కడ ఆపానో ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా! అందుకని ఒకసారి నెమరేసుకుంటూ - ఇదీ, ఈ కిందదీ చెప్పేసిన తానా-కబుర్ల వరస:
తా(నా) సంబరాల తాజాకబుర్లు - రాం-రాబర్ట్-రహీం మా ఇంటికి వచ్చినవేళ...
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 1
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 2
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 3
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - కొసరు కబుర్లు
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - అసలు కబుర్లు
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ఉపోద్ఘాతం
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ముక్తాయింపు
ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే ( తానా జ్ఞాపిక నుంచి నా జ్ఞాపకం)
ఏదో అప్పుడా వేడిలో, వేడుకలో రాసేశాను కాబట్టి - తొలిసంజ మలిసంజ; అసలు, కొసరు; ఉపోద్ఘాతం, ముక్తాయింపు - అంటూ ఆపసోపాలు పడుతూనైనా ముందూ-వెనకగా బోల్డన్ని విశేషాలు రాయగలిగాను.
మరిప్పుడు దాదాపుగా ఏడాది మీద ఇంకో పావు-ఏడాది రోజుల తర్వాత రాయబోతున్న తానా సంబరాల మొదటి రోజుని అలా విడగొట్టి రాయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. అందుకే ఆ తొలిరోజు కబుర్లని టోకున ఒక్క flow లో, ఈ ఒక్క పోస్టులో రాసేద్దామని అనేసుకున్నాను. కానీ కుదరదేమో అని అనుమానం వచ్చి మళ్ళీ రెండుముక్కలుగానే రాయదల్చుకున్నాను. అలా మొదలీ penultimate ముచ్చట్లు.
మే 27, 2017 - శనివారం.
ఆ రోజు పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా సెయింట్ లూయిస్ డౌన్‌టౌన్‌లో వున్న అమెరికా సెంటర్ దగ్గర నన్ను డ్రాప్ చేస్తానని కార్లో తీసుకెళ్తున్నారు బదరి. అసలు తానా సభలకి రిజిస్ట్రేషన్ చాలా ఆలస్యంగా చేసుకున్నాను నేను. అంతకు ముందు రోజే రిజిస్ట్రేషన్ ప్యాకెట్ల పంపిణీ జరిగిందని తెలిసింది. అదసలు ఎక్కడ జరిగిందో, అక్కడికి ఎప్పుడు వెళ్ళాలో తెలుసుకునేలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. నేనేమో ఇదే మొదటిసారి తానాకి వెళ్లడం. అసలింతకు ముందు ఎక్కడ జరిగాయో, ఎలా జరిగాయో తెలీదు - తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేనే లేదు. ఇప్పుడు కూడా అనుకోకుండా సాహిత్య కమిటీలో వలంటీర్ని కాబట్టి వెళ్లడమే. లేకపోతే అసలా ఆలోచనే ఉండేది కాదేమో.
సరే! కార్లో వెళ్తున్నామా!? నా ఆలోచనలు, మాటలు, ప్రశ్నలూ అన్నీ తానాకి వెళ్ళాక నేనేం చెయ్యాలో అన్న దాని గురించే. నా తానా-బాధ భరించలేక బదరి రవి కోడూరికి ఫోన్ చేసి - "రవీ! లలిత రిజిస్ట్రేషన్ ప్యాకెట్ తీసుకోలేదు. తనకొకటి తీసుంచుతావా?" - అనడిగారు. అవతల్నుంచి రవి "సరే" అన్నారు అన్నమాట నాకు బదరి చెప్పేదాకా నాకు బెంగగానే వుంది - అదేదో మొదటిరోజు స్కూలుకెళ్తూ పుస్తకాలు మర్చిపోయినట్లు.
అమెరికా కన్వెన్షన్ సెంటర్ దగ్గర నన్ను దింపి, నేను లోపలి వెళ్ళేదాకా ఆగి, అప్పుడు ఇంటికి వెళ్లారు బదరి. లోపలికి వెళ్ళగానే రవి ఎదురొచ్చి రిజిస్ట్రేషన్ ప్యాకెట్ ఎక్కడ తీసుకోవాలో చెప్పారు. తను చెప్పిన కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడున్న సుధీర్ నన్ను చూసి అక్కడున్న సంచులేవో వెతికి - "మీ ప్యాకెట్ లేదండి. అయినా పర్వాలేదు ఇదిగో ఈ బ్యాండ్ వేసుకోండి చేతికి" - అంటూ ఒక పసుపుపచ్చ ప్లాస్టిక్ కంకణం అందించారు నా చేతికి. నా ఎడమ చేతి మణికట్టుకి ధరించా ఆ తానా-దీక్షాబంధనాన్ని.
ఆ తర్వాత ఏం చేయాలా అని చూస్తూ ఉంటే, పక్కనే వున్న ఇంకో కౌంటర్ దగ్గర ఇద్దరు తానా జ్ఞాపికలను (souvenirs) సంచుల్లో సర్దుతూ కనిపించారు. నేను రాసిన నా తెలుగు మీద మక్కువని గురించిన వ్యాసం "ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే" అందులో ఉంటుంది కదా, ఒకసారి చదివేసుకుందాం అనేసుకుని గబగబా వాళ్ల దగ్గరికెళ్లి నాకో సంచీ ఇవ్వండి అనడిగా. వాళ్ళు నన్ను చూసీ చూడగానే - "ఇప్పుడే కాదండి. పదకొండింటికి రండి" - అని చెప్పారు. అప్పటికి పదే అయింది. మా సాహిత్య కమిటీ వారి మొదటి కార్యక్రమం "ఎల్లలులేని తెలుగు" మధ్యాహ్నం ఒంటిగంటకు కానీ మొదలు కాదు. ఇంకా మూడు గంటలు టైం వుంది. ఏం చేద్దామా అనుకుంటూ కొంచెం ముందుకి వెళ్ళగానే మైకులోంచి ఎవరో చెప్తున్నారు (పసుపులేటి రవిగారనుకుంటాను) - "సాహిత్య కమిటీ వలంటీర్లు మెయిన్ స్టేజ్ దగ్గరికి వచ్చి వలంటీర్ బాడ్జెస్ తీసుకోవాలి" అంటూ. అది వినగానే గబగబా ఆ మెయిన్ స్టేజ్ ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్లిన నాకు చేతిలో బ్యాడ్జ్ పట్టుకుని అమృతరెడ్డిగారు ఎదురొచ్చారు. ఆయన నా చేతిలో పెట్టిన వలంటీర్ బ్యాడ్జ్ చూసీ చూడగానే - అసలిప్పటికీ తానా సాహిత్య కమిటీలో నేనేం చేయాలో, చేయబోతున్నానో ఏమీ తెలియని నేను - చేయబోయే ఇంతోటి ఉడతా-భక్తి పనికి అంత గొప్పగా నానా-వర్ణ పతకంలా వున్న ఆ బ్యాడ్జ్ పెట్టుకోవాలా అనుకుని అమృతరెడ్డి గారితో అదే అన్నాను - "నేను ఇది ధరించనండి, దాచుకుంటాను" - అని. ఆయన కూడా - "నేనూ మీలాగే" - అని నవ్వేశారు.
ఇదిగో ఈ కిందదే నే దాచుకున్న తానా వలంటీర్ బ్యాడ్జ్:
ఆ బ్యాడ్జ్ తీసుకుని bag లో పెట్టేసుకుని ఇవతలికి రాబోయేంతలో - మెయిన్ స్టేజ్ మీద కార్యక్రమమేదో మొదలయింది. సరే - పదకొండింటికి వెళ్లి తానా souvenir తీసుకునేదాకా నేను చేయబోయే పని ఏమీ లేదు కదా కాసేపు పెద్దలు చెప్పే మాటలు విందామని కూర్చున్నాను. అప్పటికి పొద్దున్న 10:30అయింది. ముందుగా జంపాల చౌదరిగారు చక్కటి తెలుగులో సభకు స్వాగతం పలికారు. ఆ తర్వాత మాట్లాడినాయిన AP హైకోర్టు జస్టిస్ అట. ఆయన చెప్పిన మిగిలిన విషయాలు ఎలా వున్నా, ఆయన ప్రసంగంలో అమెరికాలో తెలుగువాళ్ళు చేసుకునే పండగ తానా అంటూనే, ఆ మధ్యలో ఒక ప్రసక్తిగా తెచ్చిన మా ఊరి డాక్టర్ - వడ్లమాని సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి ముచ్చట అసందర్భంగా అనిపించింది. అంతకు ముందు రోజు TANA Banquet లో ఈ జస్టిస్ గారిని కలిసిన ఆ డాక్టర్ గారి అమ్మాయి తను తెలుగు ఎందుకు నేర్చుకోలేకపోయిందో అంటూ పంచుకున్న కారణం (ఆ కారణం నా బ్లాగ్ కి కూడా అప్రస్తుతమే!) హైకోర్టు జస్టిస్ గారు సభాముఖంగా ప్రస్తావించటం అస్సలు బాగా అనిపించలేదు.
తర్వాత ఇంకా ఎవరెవరో మాట్లాడారు కానీ - నాకు బాగా గుర్తున్నవి ఇద్దరి ప్రసంగాలు మాత్రమే. ఒకటి పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజుగారిది, రెండవది మాగంటి మురళీమోహన్ గారిది.
ముందుగా కృష్ణంరాజుగారేమన్నారంటే - ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28 అవడం , తానా 1977 మే 28న మొదలవడం, ఈ తానా లో మే 28, 2017 న ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ఎంటీఆర్ తో "అడవిరాముడు" తీసిన రాఘవేంద్రరావు ప్రారంభోత్సవం చేయబోవడం - ఇవన్నీ భగవన్నిర్ణయాలుగా అనిపిస్తున్నాయని మహా-రామా(రావు) భక్తితో మాట్లాడారు. అంతే కాకుండా ఆంధ్రదేశంలో తెలుగులో బోర్డులు పెట్టట్లేదని వాపోయే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి లైఫ్ ఎచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోవడం Make In India లాగా Talk In Telugu ఉద్యమాన్ని మొదలెట్టండి అని గుర్తు చేయడానికట. ఇవన్నీ అంటూ - అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్న మా సెయింట్ లూయిస్ ఆడపడుచులని చూసి ఇంకా కృష్ణంరాజుగారేమన్నారంటే "ఆంధ్రదేశంలో ఎవరూ లంగా-ఓణీలు వేసుకోవట్లేదు. తెలుగుదనం అమెరికాలోనే వుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూడా కనపడాలి అని ఆశిస్తున్నాను" - అంటూ.
[లలిత ఉవాచ: ఆంధ్రరాష్ట్రాల్లో మధ్యతరగతి ఆడపిల్లలు మండే ఎండల్లో పరికిణీలు, ఓణీలు వేసుకుని - జారిపోయే వాటిని సవరించుకుంటూ చదువులకి, ఉద్యోగాలకి తిరగడం ఏమంత ప్రాక్టికల్? ఆడతనం ఒలికించే ఆ పరికిణీ-ఓణీల కన్నా ఒంటినిండా వుండే చుడీదార్లే కొంచెం నయం. పండగల్లో అయితే మాత్రం పరికిణీ-ఓణీల్లో ఆడపిల్లలు అందంగా వుంటారు - అది మాత్రం నిజం]
కృష్ణంరాజు గారి ప్రసంగం విని, ఇంకెవరో ఇద్దరు ముగ్గురు మాట్లాడాక లేచి ఇవతలికి వద్దామనుకునే సరికి "ఇప్పుడు మాగంటి మురళీ మోహన్ గారి కీలకోపన్యాసం" అన్న మాట మైకులో చెప్పగా విని ఒక్క నిముషం ఆగాను. నాకు సినీనటుడు మురళీమోహన్ తెలుసు. కానీ ఈ మాగంటి వారెవరా అని చూస్తే వారు సాక్షాత్తూ మన "జయభేరి" వారే. "అర్రే! మన సినిమాప్త బంధువులేం చెప్తారో వినకపోతే ఎలాగా - అందులోనూ కీలకోపన్యాసం కూడానూ" అనుకుంటూ మళ్ళీ కూర్చున్నాను.
మురళీమోహన్ గారు చెప్పిన మాటలేంటంటే: "ఇంతకు ముందు చాలా సార్లు అమెరికా వచ్చాను. ఇంతకు ముందు వచ్చినప్పుడు మొదట్లో ఆసియా ఖండవాసుల్ని చూస్తే ఆనందంగా, తర్వాత భారతీయులని చూస్తే ముచ్చటగా అనిపించేది. ఇప్పుడు ఇంతమంది తెలుగు వారిని చూస్తుంటే ఆత్మీయులని కలిసినట్లనిపిస్తోంది. వేంకటేశ్వరస్వామి ఎన్ని ఊళ్ళల్లో వున్నా తిరుపతి ప్రత్యేకత తిరుపతిదే. అలాగే అమెరికాలో ఎన్ని సంఘాలున్నా తెలుగు వాళ్ళ సంఘమంటే TANA మాత్రమే. TANA మహావృక్షమైతే మిగిలిన తెలుగు సంఘాలు శాఖలు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. కానీ అది TANA విషయంలో నిజం కాదు*." అని చెప్తూ ఈయన కూడా "ఆంధ్రాలో వున్న లంగా-ఓణీలు, జడకుప్పెలు, వడ్డాణాలు అమెరికా వచ్చేశాయి**" అని తెగ దిగులుపడిపోయారు.
[లలిత ఉవాచ: * ఇదే మురళీమోహన్ గారు NATS కి వెళ్తే ఇలా చెప్తారేమో అనిపించింది: "ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. అది NATS విషయంలో అక్షర సత్యం."
** అబ్బా! అమెరికాలో వడ్డాణాలు, వంకీలు పెట్టుకుని తిరగడాన్ని మెచ్చుకోవడం బానే వుంది కానీ ఆంధ్రాలో అవి పెట్టుకుని తిరిగాలనుకునే వాళ్లకి తలకో gunman ని ఇవ్వగలరేమో కనుక్కోవాలి.]
సరే! ఇంకా ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఇంతలో TANA souvenir ఆవిష్కరణ అని మైకులో చెప్పారు. అప్పుడు అర్థమయింది - ఇందాక ఆ souvenirs సంచుల్లో సర్దుతున్న వాళ్ళు ఎందుకు నన్ను తర్వాత రమ్మన్నారో. వెంటనే లేచి గబగబా souvenir కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూడగానే వాళ్ళు దూరం నుంచే చేతులు విదిలించారు - "ఇప్పుడే కాదు, రాకు హుష్.. హుష్" - అన్నట్లు. అల్లాంటి విదిలింపులు, హుష్హూ-హుష్షూలు పట్టించుకోవడానికి నేనేమన్నా వాయస-వంశదీపాన్నా :) అస్సలా హస్త-చాలన-భాష నాకు అర్థమే కానట్టు వెళ్లి చెయ్యి చాపి నా చేతుల్లో ఓ సావనీరు-సహిత-సంచీ పెట్టేవరకూ కదలని-మెదలని సాలభంజికలా అక్కడే నించున్నా - పదే పదే అడిగి "సాధించి" మరీ సాధించా.
ఆ పుస్తకం తీసుకుని వస్తూ ఉంటే దారిలో అల్లు అరవింద్ గారు, ఇంకో పక్క నుంచి రాఘవేంద్రరావు గారు వారి వారి పరివారాలతో వెళ్తూ కనిపించారు. సరదాగా వాళ్ళని చూసుకుంటూ ముందుకెళ్లగానే భోంచేయ రమ్మంటూ ఒక ఆహ్వానతోరణం కనిపించింది.
అది చూడగానే బహుముచ్చటగా అనిపించి ఓ ఫోటో తీసేసుకున్నా. ఎలాగూ పన్నెండవ్వ బోతోంది. పొద్దున్న ఎప్పుడో ఇంట్లో తిన్న ఉప్మా అప్పటికే అరిగిపోయింది. తొందరగా భోంచేసేస్తే - కొంచెం ఓపిక తెచ్చుకుని తెలుగు సాహిత్య కార్యక్రమం జరగబోయే 132 సంఖ్యాంకిత-అంకణానికి వెళ్లి అక్కడ ఏమైనా అవసరమైన పని చేయొచ్చు కదా అనుకుని భోజనానికి రమ్మని ఆహ్వానిస్తున్న ఆ తోరణాన్ని మురిపెంగా చూస్తూ మాయాబజార్-ఘటోత్కచులవారి పాటని తానా వారి విందుకి వాడుకున్న వారి పేరడీని మెచ్చుకుంటూ అప్పటికే లైనులో నించున్న వారందరి కన్నా వెనకగా నించున్నాను. నెమ్మదిగా లైను కదులుతోంది.
నేను చుట్టూ వున్న ఎలక్ట్రిక్ దీపతోరణాల వెలుగులో నక్షత్ర మాలలు ధరించిన దేవకన్యల్లా TANA పండక్కి వచ్చిన అమ్మలూ, అమ్మాయిలూ కళకళలాడుతూ తిరుగుతుంటే వాళ్ళు ఎటు తిరిగితే అటు వాళ్ళ తళతళల వెంటే నా కళ్ళు తిప్పుతూ మైమరచిపోతూ వున్నాను.
అంతలో చాలా గా...ఠిగా, అంతకన్నా ధాటిగా, అథారిటీగా ఎవరో శ్యామల-వర్ణ తన్వి - ఒక ఆఫ్రికన్-అమెరికన్ లేడీ ఆ భోజనశాల ద్వారం దగ్గర ఒకతన్ని ఆపి అరుస్తోంది. ఒక్కసారిగా నా మైమరపు లోంచి మేల్కొని ఏంటబ్బా ఆవిడ అంటోంది అని వింటే - దాని సారాంశం ఏంట్రా అంటే - పాపం అతను చేతికి పర్పుల్-కంకణం బదులు పచ్చ-కంకణం ధరించాడట. ఈ ఆహ్వానతోరణం కట్టిన భోజనశాల ద్వారం లోంచి పర్పుల్-వాళ్ళే తప్ప పచ్చ-కంకణ-ధారులు వెళ్లకూడదట. ఆవిడ కేమో TANA వాళ్ళు అలా అరవమనే చెప్పారట. ఆవిడ అరుపులకి జడుపు-జ్వరం వచ్చిన పిల్లాళ్ళా హడిలిపోయాడు అతనెవరో పాపం!
చటుక్కున నాకూ తట్టింది - నేనూ సాదా-సీదా పచ్చ-కంకణ-ధారిణినే అని. "అమ్మో! ముందుకెళ్తే ఇంకేమన్నా ఉందా? బతికుంటే బ్రెడ్డూ-బటరూ తినొచ్చు" అనుకున్న దాన్నై ఓ గెంతు గెంతి ఆ లైన్ లోంచి బయటపడి కొంచెం ముందుకెళ్తే అక్కడ పచ్చ-లైను కనిపించింది. ఏదో "ఆకొన్న కూడు అమృతం" అన్న మాట నమ్ముకున్నదాన్నై ఉన్నదాన్ని కాబట్టి వేళకింత ఉట్టి పప్పు అన్నమో, వెన్న రాసీ రాయని పచ్చిబ్బ్రెడ్డో తినగలిగే నాకు ఆ లైన్లో వెళ్లి తినడం అంత అవసరమా అని ఒక్క నిముషం అనిపించింది కానీ మళ్ళీ సాయంత్రం దాకా ఉండాలి కదా అని నాకు నేనే నచ్చచెప్పేసుకుని నేను తినగలిగే మసాలా-రహిత-ఆదరువు ఒకటి వెతుక్కుని గబగబా తినేసి బయటికి వచ్చాను.
[లలిత ఉవాచ: అంత చక్కగా అన్నీ ప్లాన్ చేసిన తానా వారూ! డబ్బులిచ్చి తానా-పల్లకి ఎత్తించే ముఖ్యులైన దాతలకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే - అందులో ఏమాత్రం అనుమానం లేదు, ఆక్షేపణా లేదు. కానీ అన్నం అప్పటికి కడుపు నింపుతుంది, ఆదరణ ఎప్పటికీ మనుసుని నింపుతుంది. నా మటుకు నాకు అన్నంలో ఆదరువులు ఎన్నున్నాయో అనే లెక్క కన్నా పెట్టేవారి ఆదరణ ఎంతుందీ అనేదే లెక్క! అందుకని నా విన్నపం ఏంటంటే ఈసారి తానా సమావేశాలప్పుడు "తానా వారి విందు - హో హో హో నాకే ముందు" అన్న దాని కింద మయూరి సినిమాలో ఎస్పీబీ గారు స్వరబద్ధం చేసిన "నీ పాదం ఇలలోన నాట్య వేదం - నీ నాట్యం నటరాజుకే ప్రమోదం" అన్న పాట వరసలో "ఈ ద్వారం... డోనర్ల వారి కోసం... ఆ ద్వారం ... పచ్చ-కంకణాల కోసం" అని ఇంకో రెండు లైన్లు రాయిస్తిరా నాలాంటి తానా-అజ్ఞానులను ద్వారపాలికల అరుపుల నుంచి రక్షించిన వారౌతారు. నాకు మాత్రం ఈ రోజుకీ మా ఊరి తానా పండగని తలుచుకున్నప్పుడల్లా అన్నంలో పలుకుబెడ్డలా ఆనాటి ఆ ద్వారపాలిక అరుపులు జ్ఞాపకం రాక మానవు. నాలా ఇంకెవరికీ జరగకూడదని అంతే ..అంతే!]
ఈ రోజుకి చాలా చెప్పేశాను - ఇంకొన్ని కబుర్లు మాత్రమే వున్నాయి - అవి వీలయితే వచ్చే రెండు మూడు వారాల్లో...

మా ఊళ్ళో తానా అంటే
సంతోషమై చిందేశా తందానా
చెప్పేశా తానా-ఊసులునా బ్లాగునా
తానా (2017) అయ్యి ఆయె నాళ్ళు చానా
మిగిలుంది కబుర్లు కొన్నే అయినా
చెప్పెయ్యాలి మొదలయ్యేలోగా ఇంకో తానా (2019)
మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. ఆదరువుల కంటే ఆదరణ ముఖ్యమని. మీ టపాలోనే పేర్కొన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇంటికి భోజనానికి వేరే వారి వెంట తీసుకువెళ్ళబడ్డాను (నాకు కూడా ఆహ్వానం మీదే లెండి) ... మా అమెరికా పర్యటనల్లో ఒకసారి. వారింట్లో ఆ ఇంటివారి మొక్కుబడిలాంటి తీరు చూసి నాకు అదే భావన కలిగింది.
రిప్లయితొలగించండితానా వారు ఆ బోర్డు మీదే ఆ పర్పుల్ రంగు బాడ్జ్ బొమ్మ కూడా వేసేస్తే బాగుండేదేమో ... మీరన్న ఆ రెండు లైన్లతో బాటు (అఫ్కోర్స్ .. ఆ లైన్లు మాత్రం ముఖ్యం). వచ్చే సంవత్సరం సంబరాలకు ఆ బాడ్జ్ రంగు మారచ్చేమో లెండి. ఏమయినప్పటికీ వారికి సలహా ఇవ్వకపోయారా ... ఇమెయిల్ ద్వారానో, లేదా ఆ కార్యనిర్వాహకులలో తెలిసిన వారుంటే వారికి చెప్పడమో (మీ టపాలో రవి అని ఒక పేరు చెప్పినట్లున్నారు)? ఇటువంటి పంటి క్రింద రాళ్ళ గురించి ఫీడ్ బాక్ ఇవ్వడంలో తప్పులేదు.
సరే, తతిమ్మా విశేషాలు త్వరగా వ్రాయండి ... క్యాలెండర్ మారక ముందే 🙂.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు, నరసింహారావుగారు! మీరు చెప్పినట్లు feedback పంపడానికి ప్రయత్నిస్తాను. అలాగే కాలెండర్ మారే లోగా తానా కబుర్లు ముగిస్తాను.
తొలగించండిMorning coffee tho Ee vela mee TANA kaburlu ..... chala bagunnayi... meeGathavaati kosam vachi chustunnam...
రిప్లయితొలగించండిThanks for your nice words about my blog, Sarada :)
తొలగించండిబాగుంది, ఇన్నాళ్ళైనా మీరు గుర్తు పెట్టుకుని రాయడం మళ్లీ ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం
రిప్లయితొలగించండినేను రాసిందాన్ని మీరు చదివి మెచ్చుకోవడం ఇంకా బాగుంది, సర్!
తొలగించండి