గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 12 - పని-పాటా? బాడ్మింటన్ ఆటా?
సరే! ఇప్పుడూ కొంచెం నా ఉద్యోగ విషయాలు, కంపెనీ విషయాలు అవన్నీ ఆపి కొంత నా సొంత విషయాలకి మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఏమిటనంటే 1970లో మెడికల్ షాపు పెట్టాం కదా?! ఆ మెడికల్ షాపు 1970 అక్టోబర్ దసరా పండక్కి మొదలుపెట్టాం, 71 ఆగస్టుకి మూసేశాం. పదినెలల వ్యాపారం అది.
ఇదయింతర్వాత ఏంటంటే ఈ లోపులో నా ఇల్లాలు మళ్ళీ గర్భవతి అయింది. రెండో సంతానం. ఆ మెడికల్ షాపు అయిపోయింతర్వాత నేను పొలంలో కూర్చోవడం ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నపుడు అక్టోబరులో మా ఆవిడ ప్రసవించింది. శివకోడులో నున్నా నారాయణమూర్తిగారని చెప్పేసి ఆయన హాస్పటల్లోనే రెండోసారి కూడా అమ్మాయే పుట్టింది. మూణ్ణెళ్ళకి బారసాల అదీ పెట్టారు శివకోడులో. బారసాలకి శివకోడు వెళ్ళా. అలా వెళ్ళినప్పుడు డాక్టర్ నారాయణమూర్తిగారిని కలిశాను. కలిసి "ఏమయ్యా! ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారు - ఇంక నేను బెడ్డెక్కేస్తాను - ఆపరేషన్ చేసేయ్. నాకు చాల్లే ఇద్దరాడపిల్లలు." అంటే ఆయన "అబ్బే ! అలా కాదు - ఇంకో సారి చూడు నువ్వు. తప్పకుండా మగపిల్లాడు పుడతాడు. తొందర పడకు. వంశోద్ధారకులుండాలి" అన్నాడు. సరే - ఆయన మాటెందుకు కాదనడం అని ఊరుకున్నా. బారసాల్లో చంటిపిల్లకి అరుణ అని పేరు పెట్టాం. అరుణ అంటే సూర్నారాయణమూర్తి పేరు. అది పుట్టడం భరణీ నక్షత్రంలో పుట్టింది. అప్పటికి నేను వ్యాపారంలో అదీ దెబ్బతిని వున్నాను కదా! మా అమ్మమ్మగారు పప్పు సూరమ్మగారు, మా అమ్మగారు పేరిందేవిగారు - వాళ్లిద్దరూ కూడా "ఒరే! అరుణ అని సూర్నారాయణమూర్తి పేరు పెట్టావు. పైగా దీనిది భరణి నక్షత్రం. భరణి నక్షత్రం వాళ్లు ధరణి నేల్తారట! అంచాత నీకిప్పట్నుంచి మంచిదశ పడుతుంది." అని నన్ను బాగా ఉత్సాహపరిచారు.
మా రెండో పిల్ల పుట్టినప్పుడే "లేతమనసులు"సినిమా వచ్చింది. అందులో కుట్టి పద్మిని లల్లి, పప్పి అనే కవలపిల్లలుగా యాక్ట్చేసింది. ఆ లల్లి, పప్పి పేర్లే మా పిల్లలకిముద్దు పేర్లయ్యాయి.
అటు తర్వాత 72లో ఉద్యోగానికి గణపవరం వచ్చేశాను కదా! మా ఆవిడ, ఇద్దరాడ పిలల్లూ శివకోడులోనే వున్నారు. గణపవరం ఊళ్ళో కృష్ణారావని చెప్పేసి ఏలూరు నుంచి వచ్చాడొకాయన. గణపవరంలో చుండూరి రంగనాయకులు కాలేజ్ వుంది . దాంట్లో కృష్ణారావుగారు ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన భార్యాబిడ్డలు ఏలూరు లోనే ఉండేవారు. ఈయన ప్రతి వారం ఏలూరు వెళ్ళి వస్తూ ఉండేవాడు. నేను, మా బావమరిది మణి (దత్తు), కృష్ణారావుగారు, మేం ముగ్గురం కలిసి ఒక గోడౌన్ అద్దెకు తీసుకున్నాం. ఒకటే హాలు - పెద్ద హాలు ఈ చివర్నించి ఆ చివరి దాకా. కాకపోతే ఏంటంటే పల్లెటూరు కాబట్టి అక్కడ బాత్రూమ్స్, టాయిలెట్స్ ఉండేవి కాదు. కానీ ఈ గోడౌన్ దగ్గర అవి రెండూ ఉండేవి. ఎవరో కమ్మవారిది అది. మేమేమో అది అద్దెకి తీసుకుని - నేను, దత్తుగారు, కృష్ణారావుగారు - ముగ్గురం అందులో ఉండేవాళ్ళం. అందులో ఓ కిరోసిన్ స్టవ్వు పెట్టుకుని మేమే వండుకుంటూ - మేమిద్దరం కంపెనీకి వెళ్తూ ఉండేవాళ్ళం, ఆయనేమో కాలేజీకి వెళ్తూ ఉండేవాడు. ఈరకంగా 72 జూన్ దాకా మేం ముగ్గురం కలిసున్నాం.
కృష్ణారావుగారేంటంటే కాలేజీలో పని కదా! ఆయనకి ట్రాన్స్ఫర్ అయి వేరే వూరికి వెళ్ళిపోయాడు. ఇంక నేనూ, దత్తుగారూ మిగిలిపోయాం.
గణపవరంలో అనుమంచి లక్ష్మీనారాయణగారని కరణం గారుండేవారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మగారు. వాళ్లకి ఐదుగురు సంతానం - ముగ్గురాడపిల్లలు, ఇద్దరు మొగపిల్లలు. పెద్దావిడ నాగలక్ష్మి, రెండో అమ్మాయి రాజ్యం, మూడో అమ్మాయి హనుమాయమ్మ. హనుమాయమ్మ అపుడు హైస్కూల్లో చదువుతూ ఉండేది. కొడుకుల్లో పెద్దవాడు ప్రకాశం, రెండోవాడు చంద్రుడు. కరణంగారిది పెద్ద ఇల్లు, చుట్టూ కాంపౌండ్ వాలు, పెద్ద గేటు , ఓ బావి. గేటు పక్కగా ఓ చిన్న వాటా ఉండేది - ముందు ఒక వరండా, వెనకాల రెండు రూములుండేవి రైల్వే కంపార్టుమెంటులాగా. నేనూ, మణి (దత్తుగారు) కరణం గారింట్లో చిన్నవాటాలోకి చేరిపోయాం. దానికి బాత్రూం, టాయిలెట్ మేమే కట్టించుకున్నాం. అవి కట్టించుకున్నాక వెళ్లి చేరాం - 1972 జూన్, జులై ప్రాంతంలో.
ఈలోగా కాపరానికి మా ఆవిడొచ్చింది. వస్తూ ఒక పిల్లనే తీసుకొచ్చింది. "అదేంటి! లల్లీ నొక్కదాన్నే తీసుకొచ్చావు? పప్పి ఏదీ?" అనడిగాను. మా ఆవిడకి పెద్దక్కగారు లక్ష్మీ దేవని చేప్పేసి వుంది మా వదినగారు. ఆవిడ భర్త ఐసోల సుబ్బారావుగారు. ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్. వాళ్లకి పిల్లల్లేరు. వాళ్ళేం చేశారంటే మా పప్పీని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్ళిపోయి "మా దగ్గరుంచుకుంటాం , మేం చూసుకుంటాం" అంటే మా ఆవిడ ఇచ్చేసింది. ఇదంతా జరిగిందని నాకు తెలియదు. ఒక్క పిల్లతోనే వచ్చింది. సరే! వాళ్ళూ మావాళ్లే - మా వదినగారు, తోడల్లుడూను. పైగా పిల్ల మీద ప్రాణం పెట్టుకున్నారు. పోన్లే ఎక్కడో అక్కడ బాగా పెరిగితే చాలు అని సర్ది చెప్పుకున్నాను. అలా మా పప్పి వాళ్ళ దగ్గరే పెరిగింది. మధ్యమధ్యలో పిల్లని తీసుకుని గణపవరం వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు పిల్లలిద్దరూ - లల్లి, పప్పి - ఓ రెండ్రోజులు బానే ఆడుకునేవారు. మూడోరోజు ఇద్దరూ కొట్టేసుకునేవాళ్లు - చిన్నపిల్లలు కదా! కొట్టుకుని, జుట్లు పీక్కుని, కళ్ళ నిండా కాటుక కారిపోయేలా ఏడుస్తున్న వాళ్ళని చెరికో భుజం మీద ఎత్తుకుని నేనటూ ఇటూ తిప్పేవాణ్ణి.
1972 లో మా బావమరిది మణికి పెళ్లయ్యింది. అప్పటివరకు మేమందరం ఒకే వాటాలో ఉండేవాళ్ళం. మరిప్పుడు దత్తుగారికి పెళ్లయ్యిది కదా! కరణంగారు ఏం చేశారంటే డాబాపైన గోడలు కట్టేసి పైన రేకులు వేశారు. ఒకటే పెద్దగది అది. అది నాకు అద్దెకిచ్చారాయన. నేను కాపరానికి పైకెళ్లి పోయాను. ఆ ఒక్క గదే మాకు వంటిల్లు, డైనింగు, డ్రెస్సింగు, బెడ్రూము - అన్నీ అక్కడే, అక్కడక్కడే. అందులోనే ఓ సీలింగు ఫ్యాను బిగించుకున్నాను. వేసవికాలం వచ్చేటప్పటికేమోను.. నా దగ్గర మూడు మంచాలుండేవి. ఓ పెద్ద నవారు మంచం, ఇంకో చిన్న మంచం. ఈ చిన్నమంచం ఆ పెద్ద మంచం కిందకెళ్ళి పోయేది. పిల్లని దాని మీద పడుకోబెట్టేవాళ్ళం. ఇంకో మడతమంచం బయట ఉండేది. వేసంకాలం వస్తే చిన్నమంచం, మడతమంచం బయట వేసుకుని చగ్గా డాబా మీద పడుకునే వాళ్ళం చల్ల గాలి పీల్చుకుంటూ.
ఈలోగా 73లో మా ఆవిడ మూడోసారి గర్భవతి అని తెలియగానే ఆఫీసులో ఓ వారం రోజులు సెలవు అడిగి రాజోలు నున్నా నారాయణమూర్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేయమన్నా. వెంటనే ఆయన "అదేంటి! ఎందుకంత తొందర? మూడోది కూడా ఆడపిల్లో, మగపిల్లాడో చూసి ఆ తర్వాత ఆలోచిద్దాం" అన్నాడు. నేను వెంటనే "నాకే పిల్లైనా ఒకటే! నువ్వు చేస్తావా, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లి చేయించేసుకోనా?"అనడిగాను.
ఆరోజుల్లో ఏంటంటే ప్రైవేట్ డాక్టర్లకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే కొన్ని బెనిఫిట్లు ఉండేవి. నేనలా అనగానే నారాయణమూరిగారు "ఒద్దులే బాబూ! రేప్పొద్దున్న వచ్చేయ్ చేసేస్తాను" అన్నాడు. రెండోరోజు పొద్దున్నే వెళ్లి "ఇదిగో డాక్టరుగారూ! నాకు జనరల్ అనస్థీషియా ఇవ్వొద్దు. నువ్వు చేసే ఆపరేషన్ ఏంటో నేనూ చూడాల" అంటే "నీలాంటి వాణ్ణి ఇప్పటిదాకా చూళ్ళేదయ్యా బాబూ!" అంజెప్పి లోకల్ అనస్థీషియా ఇచ్చి చేసేసాడు. తర్వాత ఓ వారం రోజులు శివకోడులో రెస్టు తీసుకుని మళ్ళీ గణపవరం వచ్చి నా ఉద్యోగం రోటీన్లో పడిపోయాను.
1974 లో మా మూడో అమ్మాయి పుట్టింది. మా మూడోది కిరణ్మయి అసలు పేరు - ముద్దు పేరు కుట్టి. దానిక్కొంచెం అల్లరెక్కువ. దానికి ఏడాది వయసున్నప్పుడు - మా ఆవిడ - వంటకి కిరోసిన్ స్టవ్వు కదా - ఆవిడేదో పిల్లకి స్నానం చేయిద్దామని నీళ్లు కాస్తోంది. నీళ్లు కాగాయి బకెట్లో పోద్దామని దించుతోంది. ఇంతలో ఈ కుట్టి వెళ్లి ఆవిడ చీర కుచ్చిళ్ళు పట్టుకుని నించోబోయింది. ఆ పళంగా ఆ కాగే కాగే నీళ్లు కుట్టీ మీద పడిపోయాయి. మెడ కింద నుంచి అంతా కాలిపోయింది. చర్మం లేచిపోయింది. అప్పుడు ఫోన్లూ అవీ లేవు కదా. వెంబడే నా ఆఫీసుకి కబురొచ్చింది - "ఇలాగ మీ అమ్మాయికేమో ఒళ్ళు కాలింది" అంటూ. వెంటనే మా సుబ్బన్నగారి దగ్గరి కెళ్లి "సర్! ఇలా అయింద"ని చెప్తే వెంటనే ఆయన కారిచ్చాడు. ఆ కారు తీసుకుని మా కుట్టిని తీసుకుని చిలకలూరిపేటలో డాక్టరు దగ్గరికెళ్ళాం. ఆయన చూసి "ఏం ప్రమాదం లేదు, చర్మం పైనే కాలింది. చిన్నపిల్లే కదా తొందరగానే మాని పోతుంది" అని చెప్పి డ్రెస్సింగ్ చేసి పంపించేశాడు. ఆయనన్నట్లే తొరగానే తగ్గిపోయింది.
మా దగ్గర ఇద్దరు పిల్లలు, అప్పుడప్పుడు లక్ష్మీదేవితో వచ్చే మా రెండో పిల్ల - ముగ్గురూ, కిందుండే మా దత్తుగారి పిల్లలు అందరూ ఆడుకుంటూ వుండేవాళ్ళు.
గణపవరంలో శ్రీరామనవమి చాలా బాగా చేసేవాళ్ళు. ఎదురెదురుగా రెండు పందిళ్లు వేసేవారు. ఓ పందిట్లో చింతామణి డ్రామా వేస్తే, ఇంకో పందిట్లో సత్యహరిశ్చంద్ర నాటకం వేసేవాళ్ళు. అల్లా పోటా-పోటీగా మంచి మంచి కార్యక్రమాలు ఉండేవి. ఎడ్లపోటీలు ఉండేవి. శ్రీరామనవమి తొమ్మిది రోజులూ కోలాటాలు, చెక్క భజనలు, హరికథలు, బుర్రకథలు, రికార్డింగ్ డాన్సులు, సినిమాలు - మహా హడావిడిగా ఉండేది ఊరంతా.
గణపవరంలో మహిళామండలి కూడా వుండేది సంకా తులిశమ్మగారి ఆధ్వర్యంలో. అక్కడ మా ఆవిడొకసారి పాట కూడా పాడింది "పాడవోయి భారతీయుడా!" అంటూ. గణపవరంలో రోజులు చాలా సరదాగా గడిచిపోతుండేవి.
ఈలోగా మా ఇంటి ఓనరు కరణంగారు ఇంటికి తూర్పు పక్కగా వున్న ఖాళీ స్థలంలో ఇంకో రెండు పోర్షన్లు కట్టించారు. వరసగా మూడు గదులు రైల్వే కంపార్టుమెంట్లలాగా. వాటిని కూడా అద్దెకిచ్చారు. వాటిల్లో ముందు పోర్షన్లోనేమో ఆంజనేయులు ఉండేవాడు. ఈ ఆంజనేయులు మా మావయ్య ఉమామహేశ్వర్రావు (ఆడిటర్) దగ్గర సూర్యనారాయణమూర్తిగారని ఆఫీస్ మేనేజర్ ఉండేవాడు, ఆయన బావమరిది. అతను గణపవరంలో పత్తి కంపెనీలో పని చేసేవాడు. అతనికి నలుగురు పిల్లలు - ఇద్దరు మొగపిల్లలు, ఇద్దరాడపిల్లలు. అతను మొదటి పోర్షన్లో ఉండేవాడు కదా! ఆ పక్క పోర్షన్లో ఒక షావుకారు ఉండేవాడు, పాత బాపారావు అతని పేరు. అతనికో కిరాణా కొట్టుండేది.
గణపవరంలో మూడు కిరాణా కొట్లుండేవి - పాత బాపారావు, కొత్త బాపారావు, మాణిక్యం. కొత్త బాపారావు దగ్గర మా ఖాతా. పాత బాపారావు మా పక్కనే కాపరం ఉండేవాడు. ఈ మాణిక్యం అనే అతను ఓ వింత మనిషి. అతనేవిటంటే సంవత్సరానికొకసారి ఆగస్టు పదిహేనుకి తిరుపతి వెళ్లి తలా, గడ్డం, మీసం మొత్తం నున్నగా చేయించుకొచ్చేవాడు.తిరిగొచ్చింతర్వాత మళ్ళీ ఆగస్టు పదిహేను వరకూ పెంచేవాడు. పెంచి తిరుపతి వెళ్లి మళ్ళీ చేయించుకొచ్చేవాడు.
మేము కూరలూ అవీ - ఫరీద్ అని చెప్పేసి ఒక కూరల కొట్టు - బూబు అని ఓ ముసలమ్మా, ఆవిడ కొడుకు ఉండేవారు. కూరలు మేము అక్కడే కొనుక్కునేవాళ్ళం.
ఇలా గణపవరంలో రోజులు నడుస్తున్నప్పుడేమయ్యిందంటే - నేను నా పాత అలవాట్లు - కంపెనీలో చేరిందగ్గర్నుంచీ డ్రింకు మానేశాను. తర్వాత సిగరెట్లు. నేనసలా రోజుల్లో రెడ్ విల్స్, బ్రిస్టలు - ఆ సిగరెట్లు కాల్చేవాణ్ణి. అటువంటిదీ ఉద్యోగానికి వచ్చినప్పుడు ఏంటంటే - జీతాలు తక్కువ. తరవాతేంటంటే పక్కన ఈ ఆంజనేయులు అనే అతను కాటన్ డివిజన్లో వర్క్ చేసేవాడు. అతను ఫీల్డ్ లో చేసేవాడనుకుంటాను. అతనికో మోటార్ సైకిలుండేది. కొంచెం మాకన్నా జీతాలు ఎక్కువ వాళ్లకి. దాంతోటి ఏంటంటే ఇంటికొచ్చేటప్పుడు పిల్లలకి చాక్లెట్లో, నిమ్మతొనలో, ఏవో ఒకటి తీసుకొచ్చేవాడు. నేను కూడా ఇంటికెళ్ళేటప్పటికి చిన్నచిన్న పిల్లలుండేవారు కదా! పాపం! వీళ్లెదురొచ్చినప్పుడు అస్సలేం తీసుకెళ్లకపోతే బావుండదని సిగరెట్లు కూడా కంట్రోల్ చేసుకుని రెడ్ విల్స్ తాగేవాణ్ణి కాస్తా చార్మినార్ సిగరెట్లు అవసరమైనప్పుడే బయటికెళ్లి ఒక సిగరెట్టు కొనుక్కుని కాల్చేవాణ్ణి. అల్లా పదిపైసలు మిగిలినా పదిపైసలు పక్కన పెట్టుకుని ఒకటో రెండో చాక్లెట్లు కొనుక్కుని ఇంటికి రాగానే పిల్లల చేతికిస్తే వాళ్ళ మొహాలు వెలిగిపోయేవి - డాన్సు చేసేసేవారు. ఆ రకంగా సిగరెట్లు కూడా కంట్రోల్ అయిపోయాయి నాకు.
ఇంత దాకా గోదారి దాటొచ్చిన వాణ్ణి కాదు నేను. అలాగే డబ్బు ఖర్చు లెక్క పెట్టిన వాణ్ణీ కాదు. ఇప్పుడేమో చూసి చూసి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. అలా అని ఇంటి నుంచి నా పొలం శిస్తులు అడిగి తెచ్చుకోవడానికి పౌరుషం. మరెలాగా? మా ఆవిడకి మా అమ్మగారు పెళ్ళిలో 26కాసుల వడ్డాణం పెట్టింది. పండగో పబ్బమో వచ్చినప్పుడు ఆ వడ్డాణాన్ని ఆంధ్రాబ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి పండగ చేసుకునేవాళ్లం.
అది కాకుండా ఎప్పుడైనా ఏమైనా అర్జెన్సీ వస్తే మా ఆఫీసులో క్యాషియర్ మాజేటి నాగేశ్వర్రావు గారని లక్ష్మయ్య గారి బావగారు ఉండేవాడు. ఆయన వేంకటేశ్వరస్వామి భక్తుడు. తిరుపతి అంటే ఇక్కణ్ణించే దండాలు పెట్టేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్లి కూర్చునేవాణ్ణి. కూర్చుని "నాగేశ్వరావుగారూ! నేను రేపు బయల్దేరి తిరుపతి వెళ్తున్నాను" అనగానే అడక్కుండా ఓ రెండొందలు అడ్వాన్స్ ఇచ్చేవాడాయన. పైగా ఆయన సొంత డబ్బులు ఓ పదో, పదిహేనో హుండీలో వేయమని ఇచ్చేవాడు. ఆ రెండొందలూ తెచ్చుకుని అవసరం గడుపుకునేవాణ్ణి.
ఓ మూడ్రోజులు ఆఫీసుకి వెళ్లకుండా నాలుగో రోజు వెళ్ళగానే నాగేశ్వరరావుగారు అడిగేవాడు - "ఏమయ్యా! దర్శనం బాగా జరిగిందా?" అంటూ. "బ్రహ్మాండంగా జరిగిందండి" అనేవాణ్ణి. "మరి తిరుపతి వెళ్ళావు. తలనీలాలు ఇవ్వలేదా?" అనడిగేవాడాయన. నేను తిరుపతి వెళ్తే కదా తలనీలాలివ్వడానికి! నేను వెంటనే "అబ్బే! నేను దర్శనం చేసుకోవడమే కానీ తలనీలాలు ఇవ్వడం, లడ్డూలు కొనుక్కోవడం ఇటువంటివి నాకెందుకో నచ్చవ్. అక్కడ వాళ్ళిచ్చిన లడ్డూ ఏదో అక్కడే తినేసి వచ్చేస్తాను. ఇదీ నా పద్ధతి. నేను ఫస్టు నుంచీ ఇంతేనూ" అంజెప్పేసి అనేటప్పటికి "సర్లే! పోనీ నేనిచ్చిన డబ్బులైనా హుండీలో వేశావా?" అనేవాడాయన. "ఆ! వేసేశాన్లెండి" అనేవాణ్ణి. ఆయనిచ్చిన డబ్బులన్నీ కూడా పక్కన పెడుతూ వుండేవాణ్ణన్నమాట. పక్కన పెట్టి ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ మొత్తమంతా ఒకేసారి వేసేసేవాణ్ణన్నమాట హుండీలో. ఈ రకంగా ఏదో మేనేజ్ చేసేవాణ్ణి.
ఇలా జరుగుతుంటే ఏమయ్యిందంటే అమలాపురంలో వుండే మా పెదబావగారు కఱ్ఱా భాస్కరంగారు "అసలు వీడేం చేస్తున్నాడు? ఏ వుద్యోగం చేస్తున్నాడో, వాడికేం వస్తోందో?" అనుకుని మా అన్నగారి దగ్గరికి వెళ్లారు. ఆయన మమ్మల్ని "ఒరే ఒరే" అనే పిలిచేవారు. ఎందుకంటే మా నాన్నమ్మకి మేనల్లుడే ఆయన. మా అన్నగారి దగ్గరికి వెళ్లి "ఒరే! అసలక్కడ వాడేం చేస్తున్నాడో, వాడికేం వస్తోందో తెలీట్లేదు కదా? కనీసం వాడి వంతు వాడికి పంపించెయ్. ఏదో చన్నీళ్ళకి వేణ్ణీళ్ళు తోడుగా అన్నట్లుగా ఉంటుంది కదా! వాడసలే ముగ్గురు పిల్లలతో వున్నాడు అక్కడ" (నేను ముగ్గురు పిల్లలతో వున్నాననుకుంటున్నాడాయన నేనిక్కడ ఇద్దరు పిల్లలతోనే వున్నానన్న సంగతి ఆయనకీ తెలీదు పాపం!) అనేటప్పటికి మా అన్నగారేం చేశారంటే అప్పట్నుంచీ నా ఒంతుకి రావల్సిన శిస్తు పంపించేస్తూ ఉండేవారు. ఇంకది రావడం మొదలు పెట్టాక బంగారం బ్యాంకులో పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. అలా బాగానే గడిచిపోతూ ఉండేది.
ఇక పోతే మా ముగ్గురి పిల్లల పేర్లూ - లలితా త్రిపుర సుందరి, అరుణ, కిరణ్మయి కదా! మా అమ్మమ్మ - ఈవిణ్ణి శివకోడు మామ్మ అని కూడా అంటారు - మా పెద్దమ్మాయి లల్లీని పొద్దున్నే ఆడిస్తూ "ప్రాతస్మరామి లలితా వదనారవిందం" అంటూ పాడేది. అది సరిగ్గా గుర్తులేదు నాకు.
ఇంక మా అమ్మగారేమో మా రెండో అమ్మాయి అరుణని ఆడిస్తూ - సూర్నారాయణమూర్తి పేరని "కమలములు వికసించే కమలాప్తుడుదయించే" అంటూ మేలుకొలుపు పాట పాడేది. ఎలా అంటే... నాగ్గుర్తున్నంతలో ఇదీ పాట...
మా మూడో పిల్ల కుట్టీవి పెద్దపెద్ద కళ్ళు. అందుకని దాన్నెత్తుకుని మా అమ్మగారు పాడిన పాట "కలువ రేకుల బోలు కనులు చూచితె చాలు కడుపు నిండును కన్నతల్లీ!" అంటూ. అది కూడా నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ పాడాను - ఇలా...
ఇక్కడితో సంతానపర్వం ఆపి - ఇక్కణ్ణించి మళ్ళీ ఉద్యోగ-పర్వంలోకి వెళ్తానింక!
<వచ్చేనెల తరువాయి కథ>

లలిత గారూ,
రిప్లయితొలగించండిఈ పాటలు బాగున్నాయి. వీటి సాహిత్యాన్ని కూడా మీరు అందించితే బాగుంటుంది.
http://boldannikaburlu.blogspot.com/2016/10/blog-post_23.html
తొలగించండిమా నాన్న పాటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం, శ్యామలీయం గారు! పైనిచ్చిన నా బ్లాగ్ లింక్‌లో ఒక పాట వుంది. ఇంక రెండో మేలుకొలుపు పాట తొందరలోనే పోస్ట్ చేస్తాను.
అప్పటి విశేషాలను కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్న మీ నాన్న గారికి, రాస్తున్న మీకు థాంక్స్ లలిత గారు.
రిప్లయితొలగించండిమా నాన్న చెప్పే ఎప్పటి కబుర్లనో ఇప్పటి పోస్టులుగా రాస్తున్న నా బ్లాగ్ చదువుతున్న మీకు ధన్యవాదాలు, పవన్‌గారు! మీరూ బ్లాగ్ రాస్తే చదవాలని వుంది - తొందర్లోనే రాయండి మరి!
తొలగించండిలలితగారూ!! మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.🙏😊
రిప్లయితొలగించండిధన్యవాదాలు, YVR గారు! ఆ బొజ్జగణపయ్య మీకెప్పుడూ అండదండగానుండుగాక! :)
తొలగించండి