కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 27 - నాకింకా ...మేడమ్‌తో పని ఏముంది?
దీపావళికి ఇంటికొచ్చాను కదా - నా కథ ఇంకొంచెం ముందుకు నడిచేలోగా ఇక్కడ ఒక్కసారంటే ఒక్కసారి ఆగి ఇప్పటివరకూ గడిచిన సెమిస్టర్లలో జరిగిన సరదా సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ సెమావలోకనం (Sem-అవలోకనం) ...
మా SPMVV లో 1991 మార్చ్ ఎనిమిదో తారీఖుకి ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. అందులో భాగంగా చాలా పోటీలు జరిగాయి. నాకు ఆ రోజు ఎందుకో ఒంట్లో కొంచెం బావుండక రూంలోనే పడుకుని వున్నాను. ఇంతలో మా క్లాసు నుంచి ఎవరో వచ్చారు - "లలితా! పద! మన క్లాస్‌లో డిబేట్ టీంకి ఒక్కళ్ళు తక్కువయ్యారు. నిన్ను సాహితీ మేడం పిలుచుకు రమ్మన్నారు" అంటూ.
"నేనేంటి? ఏమీ ప్రిపేర్ అవకుండా డిబేట్ ఏంటి?" అని నేను తప్పించుకోబోయాను .
"అదేం కుదరదు - నీకు ప్రిపరేషన్ ఏంటి? మేడం కూడా చెప్పారు లలితొస్తే చాలు, ఏ టాపిక్కైనా మాట్లాడేస్తుంది అని. నువ్వింక పద పద" అంటూ తొందర పెట్టారు.
తీరా వెళ్ళాక టాపిక్ - అమ్మాయిలు చదువుకుని ఉద్యోగం చేయాలా, వద్దా?
నేనేమో చదువుకున్న అమ్మాయిల మీద యూనివర్సిటీ బోల్డంత ఖర్చు పెడుతుంది కాబట్టి దాన్ని జస్టిఫై చేయడానికి ఉద్యోగం చెయ్యాలి, ఎంతో కొంత సమాజానికి తిరిగివ్వాలి అంటూ మాట్లాడితే, మా క్లాసులో హైదరాబాదు నుంచొచ్చిన అపర్ణేమో చదువుకున్నంత మాత్రాన అమ్మాయిలు ఉద్యోగం చెయ్యక్కర్లేదు, వాళ్ళ చదువుని పిల్లలని చక్కగా పెంచడానికి ఉపయోగించొచ్చు అంటూ మాట్లాడింది. చివరికి నేను - అమ్మాయిలు ఉద్యోగం చేస్తే కట్నం అడిగే అబ్బాయిలు ఆ మాటే మర్చిపోయి పెళ్లి చేసుకోమని అమ్మాయిల చుట్టూ తిరుగుతారు అనగానే చుట్టూ వున్న అమ్మాయిలందరూ చప్పట్లు కొట్టి నన్ను గెలిపించేశారు.
అదవ్వగానే మా సీనియర్స్ - శ్రీలత. సంగీత, గుత్తి పద్మజ వచ్చి "కాలేజ్ మెయిన్ బిల్డింగ్‌లో ఫాన్సీ డ్రెస్ కాంపెటిషన్ జరుగుతోంది లల్లీ! నువ్వు కూడా రా!" అని తీసుకెళ్లారు. అప్పటికప్పుడు ఫాన్సీ డ్రెస్ అంటే నా దగ్గర ఏమీ props లేవు. తెచ్చుకోవడానికి టైం లేదు. ఏం చేద్దామా అంటే వెంటనే తట్టింది - ఒక పిచ్చి అమ్మాయి వేషం. అప్పటికే నా జుట్టు గాలికి బాగా చెదిరిపోయింది. వేషం బానే కుదిరిపోయింది - ప్రయిజు కూడా వచ్చింది.
1991 ఆగస్టులో కాలేజ్‌లోకి మా సబ్-జూనియర్ బేచ్ కూడా వచ్చేసింది. వాళ్ళ రాకతో పాటే స్టూడెంట్ బోర్డు ఎన్నికల హడావిడి కూడా మొదలయింది. ఈసారి గుత్తి పద్మజ ప్రెసిడెంట్ పోటీకి నించుంది. ఇక ప్రతి సాయంత్రం డిన్నర్ అయిపోయాక రూము రూముకీ వెళ్లి పద్మజకి ఓటు వేయమని అడిగేవాళ్ళం. అలా తిరుగుతున్నప్పుడు కొత్తగా చేరిన MCA అమ్మాయిలు కనిపించగానే వాళ్ళని తొమ్మిదిన్నరకల్లా మా 603 వింగుకి రమ్మని చెప్పేవాళ్ళం. వచ్చిన వాళ్ళ గురించి తెలుసుకుందామని సరదాగా మొదలుపెట్టిన ఆ కార్యక్రమం ఆ కొత్త batch లో ఒకరో, ఇద్దరో అమ్మాయిలు "అసలు మీరెవరు ఇవన్నీ అడగడానికి?" అన్నట్లు మాట్లాడిన తీరుతో కొంచెం serious గా మారి చిన్న సైజు ragging లా మారింది. కానీ చివరికి సరదాగానే ముగిసింది.
నా MCA, హాస్టల్ కబుర్లలో ఒక ప్రత్యేకమైన బుల్లి చాప్టర్ గుత్తి పద్మజ సొంతం. గుత్తి పద్మజ నాకు ఒక ఏడాది సీనియర్. తనని వర్ణించమంటే ఇప్పటికీ కళ్ళ ముందు కదిలేవి - ఎప్పుడూ నవ్వుతున్నట్టుండి కళకళలాడే మొహం, కళకళలాడే మొహంలో తళతళలాడే గుండ్రటి నక్షత్రాల్లాంటి కళ్ళు, తళతళలాడే కళ్ళకి తోడుగా నవ్వే పెదవులు, నవ్వే పెదవులకి అలంకారంగా అటూఇటూ రెండు బుగ్గల్లో పడే సొట్టలు. ఇంకో ప్రత్యేకతేంటంటే తనది దువ్వెనకి లొంగని గిరజాల జుట్టు.
తన నవ్వేమో pealing laughter. ఎంత మందిలో వున్నా తను నవ్వగానే అందరి కళ్ళూ పద్మజ పైనే. చాలా బాగా పాడేది - అచ్చు అలీషా చినాయ్‌లా.
తన దగ్గరే మొట్టమొదటిసారిగా అలీషా చినాయ్ హిందీలో పాడిన Madonna పాటలు విన్నాను - తనే పాడుతుండగా. "మోరే పాపా దేదో మేరా ప్యార్ - ఐసే తో న హోనా తుమ్ ఉధాస్..." (Madonna's - Papa! Don't preach...) పాటతో మొదలు పెట్టి ఆ cassette లో వున్న పాటలన్నీ పాడేది. ఆదివారమో, ఇంకేదైనా సెలవురోజో వస్తే మా 603 వింగ్‌లో పాటల పండగే! వేసవి కాలంలో పవర్ కట్ రోజుల్లో కరెంట్ పోగానే గుత్తి పద్మజ గొంతెత్తి "నందికొండ వాగుల్లోన - నల్లతుమ్మ నీడల్లో.... నీడల్లే వున్నా... నీతో వస్తున్నా ...నీ భరతం పడతా ....నిన్నెత్తుకు పోతా ...ఓఓఓఓఓ " అని పాడుతుంటే ఆ టైంకి బాత్రూముల్లో వుండి బయటికి రాలేక, భయపడి తిట్టుకున్న అమ్మాయిలని తల్చుకుని, తల్చుకుని నవ్వుకునేవాళ్ళం.
పద్మజ పాటలు బాగా పాడడమే కాకుండా ఫ్లూట్ కూడా వాయించేది. SPIC-MACAY కార్యక్రమాల్లో భాగంగా హరిప్రసాద్ చౌరాసియా మా కాలేజ్‌కి వచ్చినప్పుడు ఆయన ముందు పద్మజ ఫ్లూట్ వాయించింది కూడా. అంతే కాదు డాన్స్ ప్రోగ్రాములు, స్కిట్స్ - తను పాల్గొనని ఈవెంట్ ఉండేదే కాదు.
అన్నట్లు - పాత ఫొటోలేవో వెతుకుతూ ఉంటే మా SPIC-MACAY ఫోటోలు చాలా కనిపించాయి. అందులో ఓ మెచ్చుతునక.... [ఈ ఫొటోలో వున్నవారు: హరిప్రసాద్ చౌరాసియా, ఫజల్ ఖురేషి (జాకీర్ హుస్సేన్ తమ్ముడు - తబలా వాయిస్తూ), స్మిత అనే ఆవిడ]
ఇప్పుడు నేనున్నది నాలుగో సెమిస్టర్ అంచున కదా! సెమిస్టర్ల వరసలో కొంచెం ముందుకు వెళ్తే మూడో సెమిస్టర్లో మాకు CSA (Computer System Architecture) ఉండేది. కొంచెం కష్టంగా ఉండేది. అందులోనూ ఆ క్లాస్ మధ్యాహ్నం లంచ్ తర్వాత ఉండేది. పాఠం విందామని ఎంత sincere గా వుందామనీ, విందామని ప్రయత్నించినా కళ్ళు తేలిపోతూ ఉండేవి. చెవులు నిద్ర పోతూ ఉండేవి. దాన్ని రాఘవేంద్ర సర్ టీచ్ చేసేవారు. అల్లాంటి బద్ధకపు మధ్యాహ్నాలు నా కపితలకి, పోరెడీలకీ భలే ప్రేరణగా ఉండేవి.
కపిత అంటే కపిత్వం ఆవహించినప్పుడు రాసే కవిత్వం.
పోరెడీ అంటే క్లాస్ లోంచి పో(వడానికి) రెడీ గా వుండి కూడా, లేచి వెళ్లిపోలేనప్పుడు సదరు సబ్జెక్టు నోట్సులో రాసుకునే పేరడీ పాట. అప్పుడు రాసిన కపితలూ, పోరెడీలు కొన్ని ఇక్కడ ...
కపిత నంబర్ 1:
(మా రాఘవ సర్ గొంతు ఖంగుమంటూ ఉండేది - పాపం! చాలా sincere గా కంప్యూటర్ సైన్సులో ఎంటెక్ చేసిన SV ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ - అంతే sincere గా పాఠం చెప్పేవారు. మంచివారు. కానీ నా కపితలకి అంతకన్నా మంచి matter అయేది ఆయన చెప్పే సబ్జెక్టు.)
రాఘవా!
ఓ గర్జించే మేఘమా!
మధ్యాహ్నం క్లాస్ పెడితే మేం తూగమా!?
ఈ పాఠమేమన్నా రాగమా?
చెయ్యాలి మేము ఆగమా?
వెయ్యాలి నీ నోటికి బీగమా!
కపిత నంబర్ 2:
ఇది ఆర్కిటెక్చరా?
మా బుర్రలకు ఆక్యుపంక్చరా?
ఎపుడాగేను ఈ లెక్చర్?
రాసుకోవాలి మా గాయాలకు టింక్చర్!
పోరెడీ నంబర్ 1:
(అప్పుడప్పుడూ internals లో మార్కులు తగ్గినప్పుడు పర్లేదులే అని భుజం తట్టుకోవడానికి పాడుకున్న పోరెడీ.)
చదవమంటే చదివేది చదువు కాదు...
రాయమంటే రాసేది టెస్టు కాదు...
ఇవ్వమంటే ఇచ్చేవి మార్క్స్ కావు
సున్నైనా వందైనా నీకోసం వేయరు...
పోరెడీ నంబర్ 2:
(ఇది ప్రతిరోజుమధ్యాహ్నం లంచ్ తర్వాత అదీ-ఇదీ అని కాకుండా ఏ క్లాసు జరిగినా ప్రార్థనాగీతంలా పాడుకున్న పోరెడీ పాట.)
వెడలినాడు మా సారు క్లాసు తీయగా
Chalk piece, Register రెండు చేతులా
భోరు భోరునా students ఘొల్లుమన్నారు
వేయకుమా సుత్తింక ఆపమన్నారు
తడబడిపోయి.. సారూ! ఆగమన్నారు
అరచి అరచి కన్నీరై కరుగుతున్నారు...
పోరెడీ నంబర్ 3:
(SPMVV లో మాది MCA third batch. అప్పుడే కొత్తగా మొదలయిన కోర్సేమో... టీచింగ్ స్టాఫ్ అంతా అంతకు ముందు వేరే యూనివర్సిటీల్లో MCA చదివిన వాళ్ళో, ఎంటెక్ చేసిన వాళ్ళో అయివుండేవాళ్లు. అలా మాకోసారి CSA చెప్పడానికి ఒకానొక శ్రీనివాస కుమార్ అనే SV Engg College లో ఎంటెక్ చదివిన అతను వచ్చారు. రావడమే అం...త మంది అమ్మాయిలున్న క్లాసులో నించుని "నా పేరు..S ... S. Kumar" అని చెప్పారు. అంతకు మించి ఆ రోజుకింకేమీ చెప్పలేక, అలా అని మా క్లాసుని వీడి వెళ్లలేక మొత్తానికి ఓ అరగంట మా పేర్లడుగుతూ కాలక్షేపం చేసి నా చేత "నా పేరు లలితా T S , సర్! Yes సర్" అని చెప్పించుకుని, నా పేరు నే చెప్పిన తీరు, ఎస్ ఎస్ అంటూ S మీద stress చేసిన తీరు వినీ వినగానే బోల్డంత stressful అయిపోయి క్లాసు ముగించేసి వెళ్లిపోయారు. రెండోరోజు మధ్యాహ్నం ఎస్కుమార్ గారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన ధైర్యాన్ని కూడదీసుకుని కుడికాలు పెట్టి మరీ మా క్లాసులోకి అడుగు పెట్టబోయే సరికి - ఆ లోపల కనిపించిందేంటా అంటే - బ్రౌన్ కలర్ చుంగిణీ స్కర్ట్‌ని రెండుపక్కలా బుట్టలా లాగి పట్టుకుని - గుండ్రంగా తిరుగుతూ - S. Kumar's S. Kumar's- అని టీవీలో వచ్చే S. Kumar's Textiles adevrtaisement పాడుతున్న నేను, నన్ను చూసి నవ్వుతున్న మా క్లాస్ అమ్మాయిలు. అంతే ముందుకు పడబోయిన ఎస్కుమార్ గారి కుడిపాదం ఒక్క కుదుపుతో వెనక్కి తీసుకోబడినదై గిరుక్కున మళ్లిపోయింది. ఆ మళ్లడం ఇంక మరి తిరిగి చూడకుండా, ఇంకసలు తిరిగి రావడమనేది లేకుండా వెళ్లడమే! అదిగో...అప్పుడు కట్టిన పోరడీ ఇది - అప్పుడెట్టిన ఆరడికి గుర్తిది)
అంతలో సారుగారు లేచినారు
Board మీద చేయి వేసినారు
Class వంక ఓరగా చూసినారు
మరిచిపోయి వెర్రినవ్వు నవ్వినారు
ఒక్క పరుగులో class వదిలి పెట్టినారు
కలకల కలకల - నవ్విరి stundents
దబదబ దబదబ -బాదిరి బెంచీలు
పో పో సారూ - పోయిరా సారూ
పో పో సారూ - పోయిరా సారూ
చెప్పేవారు లేరా? CSA చెప్పేవారు లేరా!
ఇప్పటికి ఈ పోరెడీల అసలు పాటలేవో పోల్చుకుంటూ - ఈ కింది పాటని పాడుకుంటూ మీరిక్కడ ఉండండీ ...
అదేమి అల్లరీ -
అదేమి పోరెడీ...
కాలేజులోన గోల చేసి ఎంత సందడీ ...
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

కెవ్వ్......మీ కాలేజ్ కబుర్లతో నేను కూడా ఒక్కసారిగా పదేళ్లు వెనక్కి వెళ్లిపోయా....
రిప్లయితొలగించండివావ్! మరక్కడే వుండిపోకుండా వచ్చే నెల బ్లాగ్ చదవడానికి ఒచ్చెయ్యండి మరి!
తొలగించండికపిత, పోరెడీ లాంటి పద ప్రయోగాలు వాటి డెఫెనెషన్స్ బాగున్నాయి లలిత గారు.
రిప్లయితొలగించండినా మాట్లాటలు మెచ్చిన మీకు ధన్యవాదాలు, పవన్‌గారు!
తొలగించండి1. పాడమంటే పాడేది పాట కాదు
రిప్లయితొలగించండిఆడమంటే ఆడేది ఆట కాదు
ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు
పువ్వైనా నవ్వైనా నీ కోసం పూయదు
2. వెడలినాడు రాఘవుడు అడవికేగగా
పడతి సీత సౌమిత్రి తోడు నీడగా
3. అంతలో రామయ్య లేచినాడూ
వింటి మీదా చెయ్యి వేసినాడూ
సీత వంక ఓరకంట చూసినాడు
4. ఇదేమి లాహిరి ఇదేమి గారడీ
ఎడరిలోన పూలు పూసి ఎంత సందడీ
వారెవా! సరి లేరు మీకెవ్వరూ...నా పాటలు పట్టుటలో - సరి లేరు మీకెవ్వరూ!
తొలగించండి