16, సెప్టెంబర్ 2018, ఆదివారం

విరిసి... మెరిసి... మురిసె... ఆమని


గడిచిన పూలకారు నెమరులో - నే రాసిన కవిత కౌముది సెప్టెంబర్ నెల సంచికలో - కవితా కౌముది శీర్షికన: http://www.koumudi.net/Monthly/2018/september/sept_2018_kavitha_koumudi.pdf





ఏటి దరిన అది ఏమని?
కూయు కోయిలలు ఊయలలూగే కొమ్మల రెమ్మల తరువని.
తరువులుండే తావది ఏదని?
తరువుల చివురులు తొడిగిన వని
ఆ వని దరి జేరెను ఆమని
దరి జేరిన ఆమనిని కొసరెను ఆ వని
వినుమిదె నా మనవిదె వినమని
విని విరుల సిరుల వరమీయమని
ఆ వని మనవి వినిన ఆమని
చిలకరించె చిఱునగవుల వానని
ఆ నగవులు కురిసి విరిసి విరులాయెనని 
విరులైన నగవులు తరువుల తనువుల నగలాయెనని
నగలైన విరుల తొడిగి తరువులు మెరిసెనని
మెరిసిన విరుల నగల తరువుల వగల గని
మరల మరల విరిసి...  మెరిసి...  మురిసె...  ఆమని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి