గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 13 - సంతానపర్వం
మనం మళ్ళీ ఉద్యోగం వైపు వచ్చేద్దాం.
1974 లో నేను ఎక్సైజు నుంచి స్టాటిస్టిక్సుకి మారాను. ఫాక్టరీ మేనేజర్ సుబ్బన్నగారు స్టాటిస్టిక్స్ డిపార్టుమెంట్‌ని ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు - ఎందుకంటే వీడు (అంటే నేను) ఎక్సైజులో ఉంటే మాట వినట్లేదు ఎవరిదీనూ అంజెప్పేసి.
స్టాటిస్టిక్సులో పనేంటంటే వేరే వేరే గ్రేడింగ్ పాయింట్స్ నుంచి రిపోర్ట్స్ వస్తాయి ప్రతీ సాయంత్రం. అలాగే ఫాక్టరీ రిపోర్ట్స్ వస్తాయి రాత్రికి. ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేసి సుబ్బన్న గారికి మరుసటి రోజు పొద్దున్నకల్లా ఒక రిపోర్ట్ పంపించాలి. అంటే డైరెక్ట్‌గా ఫాక్టరీ మేనేజర్‌కి రిపోర్ట్ చెయ్యాలి నేనిక్కడ.
ఇక మా ఆఫీస్ రూంలో మేం నలుగురం ఉండేవాళ్ళం. నేను, మా స్టాటిస్టిక్స్ హెడ్డు మందపాటి శేషగిరిరావుగారు, అసిస్టెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ పి. ఆర్. ఏకాగారు, టైపిస్ట్ అనిరుధ్.
మందపాటి శేషగిరిరావుగారు కూడా గణపవరంలోనే ఉండేవాడు. ఆయనకి అరవై ఏళ్ల వయసుండేది. సాయంకాలాలు సరదాగా మాతో పేకాట ఆడేవాళ్లు. రాజేశ్వరమ్మగారని అయన భార్య. మాకు పెద్దదిక్కుగా ఉండేవారు. శేషగిరిరావుగారు సుబ్బన్నగారికి చుట్టం. చగ్గా ఓ పేంటూ షర్టూ - ఇన్-షర్ట్ చేసుకుని వచ్చేవాడు. ఆయన నాకు హెడ్డు.
ఇంక పి. ఆర్. ఏకా ఎవరంటే - గుంటూర్లో ఫాదర్ ఆఫ్ ది టొబాకో అనేవాళ్ళం - ఏకా ఆంజనేయులు గారని చెప్పేసి గుంటూర్లో మొట్టమొదటిసారిగా టొబాకో ఇండస్ట్రీస్ ని మొదలు పెట్టింది ఆయనే. మాజేటి & ఏకా అనే కంపెనీ పెట్టి పొగాకు వ్యాపారం మీద లండన్ వెళ్ళినాయన ఆంజనేయులుగారే. ఆయన కొడుకు ఈ పి. ఆర్. ఏకా. ఆంజనేయులుగారు స్వర్గస్థులయ్యాక ఏమైందంటే ఆ ఫ్యాక్టరీలు మొత్తం మూతబడిపోయాయి. ఆయన కొడుకు కూడా వచ్చి ఉద్యోగంలో చేరాడు మద్ది లక్ష్మయ్యగారి దగ్గర.
అనిరుధ్ నా కన్నా ఐదారేళ్ళు చిన్న. అతను 74 లో టైపిస్టుగా చేరాడు. అతను కూడా మా రూంలో ఉండేవాడు.
మొత్తంమ్మీద కంపెనీలో ముగ్గురు టైపిస్టులు వుండేవాళ్ళు - అనిరుధ్, శ్రీనివాస్, సాంబమ్మ.
ఎన్నార్ మజుందార్ అని ఒక ఎక్స్‌పోర్ట్ మేనేజర్ ఉండేవాడు. అయన దగ్గర ఒక స్టెనో శ్రీనివాస్ అంజెప్పేసి, తర్వాత సాంబమ్మ అనే ఒక టైపిస్ట్ ఉండేది. ఆయనేం జేసేవాడంటే ఆ సాంబమ్మ అన్నీ తప్పులు కొడుతుండేది అని చెప్పి శ్రీనివాసునే ఎక్కువ వాడుతూ ఉండేవాడు. ఈ అనిరుద్ధుని పెట్టాక ఇతనికీ పని చెప్తూ ఉండేవాడు. ఎన్నార్ మజుందార్‌కి అనిరుధ్ చుట్టం కూడా.
అనిరుధ్ కంపెనీలో కొత్తగా జేరాడు. ఆఫీసుకి పొద్దున్నే ఏడున్నరకి వచ్చేవాడు. అప్పట్నించి రాత్రి ఏడూ-ఏడున్నరదాకా అలా టైపు కొడుతూనే ఉండేవాడు పాపం!
దానికి కారణం ఏంటంటే లక్ష్మయ్యగారు ఎస్టాబ్లిష్మెంట్ బాగా పెంచారు 73-74లో. 1973లో కె. ఎస్. సుబ్బయ్య పిళ్ళై అని చెప్పేసి ఒక బెంగళూరు ఆయనకి హోసూరులో కంపెనీ, ఒక ఫాక్టరీ ఉండేవి. ఆంధ్రాలో కూడా మంగళగిరి రోడ్డులో ఓ ఫాక్టరీ, ఇంకా ఆంధ్రాలో బ్రాంచెస్ ఉండేవి - కృష్ణా జిల్లాలో నందిగామ, కంచికచర్లలో. ఈ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్స్ లక్ష్మయ్యగారు కొనేశారు. కొనేసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒక తొమ్మిది పెట్టారు.
దాని వల్ల ఏమైందంటే - ఇంతకు ముందు అకౌంట్స్ ఆఫీస్ లో ముగ్గురే వుండేవాళ్ళు - మా బావమరిది దత్తు, శ్రీనివాసరావుగారని ఒక పెద్దాయన, నాగేశ్వరరావుగారని ఒక క్యాషియర్. వీళ్ళు సరిపోక ఒక పది-పన్నెండు మంది ఎకౌంటెంట్సుని, ఎకౌంట్స్ క్లార్కుల్ని ఎపాయింట్ చేశారు. దీనికి ఫైనాన్స్ & ఎకౌంట్స్ మేనేజర్ కింద ఒక సీఏ కాండిడేట్ ని తీసుకున్నారు. ఆ సీఏ సరిపెల్ల సోమయాజులుగారని చెప్పేసి శ్రీకాకుళం నించి ఒచ్చాడాయన.
సరే! ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెరిగినప్పుడు ఆ ఎకౌంట్స్ వాళ్ళు కూడా పెరిగారు కదా!- అందులో ఆనందరావుగారని ఒక ఇంటర్నల్ ఆడిటర్ ఉండేవాడు. తరవాత కాటన్ డివిజన్ ఒకటి పెట్టారు. అందులో వెంకటేశ్వరరావని ఒక ఏభై ఏళ్లాయన ఉండేవాడు - అన్నాయ్ అని పిలిచేవాళ్ళం అందరం. వీళ్లందరి టైపింగ్ పనులన్నీ తీసుకొచ్చి అనిరుధ్ కిచ్చేసేవారు పాపం! వాణ్ణి చూస్తే జాలేసేది నాకు. అందుకే వాడికో సలహా ఇచ్చాను. "పిచ్చోడా! ప్రైవేట్ కంపెనీ ఇది. నీ ఇష్టం వచ్చినట్టు అదే పనిగా నువ్వు టైపు కొట్టడం మొదలుపెడితే పనంతా నీ మీదే వేసేస్తారు. అంచేతేంటంటే తప్పులు కొట్టడం నేర్చుకో. నువ్వెన్ని తప్పులెక్కువ కొడితే నీకింక టైపింగ్ ఎవ్వరూ ఇవ్వరు" అని చెప్పి. పాపం! వాడు భయస్తుడు. "ఒద్దులే అన్నా!" అని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండేవాడు.
నా పని మాత్రం సుబ్బన్నగారికి కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ తయారుచేయడంలో బాగానే నడిచిపోయేది. ఏదో రెండు మూడు గంటల పని - చేసేసి తరవాత అంతా ఫ్రీగా వుంటుండేవాణ్ణి. ఈలోపులో పార్టీల ఇన్‌వాయిస్లు వచ్చేవి. అవన్నీ ఒకసారి చెక్ చేసి నేను సంతకం పెట్టి ఇస్తే ఎకౌంట్స్ ఆఫీసులో సబ్మిట్ చేసేవాళ్ళు.
ఇంతలో పి. ఆర్. ఏకా గారేంచేశారంటే ఓ రోజు నన్ను పిలిచి "రేపు పొద్దున్న ఐదున్నరకి నువ్వు రావాలి" అన్నాడు.
"ఐదున్నరకి నాకు పనేంటండి? అంత పొద్దున్నే వచ్చి చేయాల్సిన పనేం వుంది ?" అన్నా.
"నీకో డ్యూటీ వేశాను." అన్నాడాయన.
"ఏంటా డ్యూటీ?" అనడిగా.
మా ఫాక్టరీ మొత్తం పదకొండు ఎకరాల ప్రెమిసెస్. దాంట్లో వెనకాల త్రెషింగ్ ప్లాంట్ కడుతున్నారు. దాని కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అక్కడ సిమెంట్ గానుగలు అవీ ఆడుతూ ఉంటాయి. ఆ సిమెంట్ గానుగ దగ్గర డ్యూటీ చేసే ఫిట్టరు మరసటి రోజు ఉదయం నేను రాలేనని చెప్పి సెలవు పెట్టాడట. అక్కడ నాకు డ్యూటీ వేశాడీయన.
వేసి రమ్మంటే "నేను అటువంటివి చేయను. నేను ఫిట్టర్ని కాను. నా వర్క్ వేరు. నా వ్యవహారం వేరు. నేను అది చెయ్యను. నే రాను." అన్నాన్నేను.
"నో నో యూ మస్ట్ కమ్. నువ్వొచ్చి తీరాలి. రాకపోతే ... జాగ్రత్త!" అన్నట్లు ఓ బెదిరింపు సెక్షన్ కింద మాట్లాడాడు.
సర్లే అని చెప్పి వెళ్ళిపోయాను. తర్వాతి రోజు కంపెనీకే వెళ్ళలేదు - మొత్తానికి ఎగ్గొట్టేసి ఇంటి దగ్గర కూర్చున్నాను. కూర్చుంటే నేను రాలేదు కదా... పి. ఆర్. ఏకా ఆయనే వెళ్లి ఆ డ్యూటీలో కూర్చున్నాడట. తరవాత మందపాటి శేషగిరిరావుగారితో "ఏడయ్యా వీడు? రమ్మంటే కుర్రాడు ఏంటంత పొగరుగా వున్నాడు?" అని చెప్పేసి అన్నాడట. అపుడు శేషగిరిరావుగారు "బాబూ! వాడి జోలికి వెళ్ళకు నువ్వు. వాడు ఆడిటర్ ఉమామహేశ్వరరావుగారికి చుట్టం. రెండోది వాడు డైరెక్ట్ రిక్రూటు లక్ష్మయ్య గారి దగ్గర్నుంచి. వాడు సుబ్బన్నగారి మాటే విన్లేదు. అందుకే సుబ్బన్నగారు వీణ్ణి మంచి చేసుకోవడం కోసం ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అంచేత...వాడికెందుకు చెప్పావు ఆ పని? వాడటువంటి పనులు చెయ్యడు." అన్నారట.
అంటే "ఆఁ ! అదేంటది? రేపు రానీ చెప్తా వాడి పని" అన్నారట పి. ఆర్. ఏకా.
మరసటి రోజు మామూలుగా ఆఫీసుకి వెళ్ళాను.
నన్ను పిలిచి "ఏం, నిన్న డ్యూటీ వేశాను కదా! ఎందుకు రాలేదు?" అన్నాడు.
"నేనటువంటివి చేయను అని చెప్పాను. నేనటువంటి వాటికి రాను. నా పని నాదే! అసలు మీకూ నాకూ సంబంధం లేదు. మీరు అసిస్టెంట్ ఫాక్టరీ మేనేజర్. ఏకా ఆంజనేయులుగారి కొడుగ్గా మిమ్మల్ని గౌరవిస్తాను. అసిస్టెంట్ ఫాక్టరీ మేనేజర్‌గా నాకు సంబంధం లేదు. నా పనల్లా ఫేక్టరీ మేనేజర్ తోటే! నేను ఛస్తే చేయను మీరు చెప్పే పని. కావాలంటే మీరు ఎక్కడైనా రిపోర్ట్ చేసుకోండి, ఎవరికైనా చెప్పుకోండి" అని చెప్పేసి అనగానే పాపం ఇంక ఆయన తగ్గిపోయాడు.
నా పని నేను సాయంత్రం రిపోర్టులు కలెక్ట్ చేసుకోవడం అదీ చేసుకుంటుండేవాణ్ణి. మధ్యాహ్నం పెద్దగా పనుండేది కాదు. సాయంత్రం నాలుగింటికి మా సుబ్బన్నగారు పెట్టాడుగా బాల్-బాడ్మింటన్ కోర్టు! - అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాణ్ణి. అక్కడ రెండు టీముల్ని తయారు చేశానని చెప్పాను కదా ఇంతకూ ముందు!? ఆ రెండు టీముల్తో గణపవరం, వేలూరు, మార్టూరు, ఫిరంగిపురం టోర్నమెంట్స్ ఆడాం మేము. ఆ టోర్నమెంట్సుకి నాకు సెలవిచ్చి మరీ పంపించేవారు. గెలిచి కప్పులు తీసుకొచ్చా. పైగా ఫిరంగిపురం టోర్నమెంటుకి వెళ్ళినప్పుడు చిలకలూరిపేటలో సీఆర్ క్లబ్బు అనుండేది. ఆ క్లబ్బు తరఫున వెళ్ళాన్నేను. దానికీ కప్పు తెచ్చాను. ఇలా చేసిందే పని - ఆడిందే ఆటగా నా జీవితం నడుస్తోంది.
కాకపోతే ఎక్సైజులో వున్నప్పుడు కృష్ణస్వామిగారు నాతో ఓ మాటన్నారు.
"ఏమయ్యా! కుర్రాడివి. మంచి బ్రైట్ ఫ్యూచర్ వుంది నీకు. అటువంటిది వచ్చి ఈ పొగాకు కంపెనీలో పడ్డావు. మూడంకెల జీతం మించి ఇక్కడ పెరగదు. అంచేత వెళ్ళిపోయి ఏదన్నా మంచిదాంట్లో చేరు నువ్వు" అని ఓ సలహా ఇచ్చారు.
ఆయన తోటి నేను "మూడంకెలు కాదు. ఇదే కంపెనీలో వుండి ఐదంకెల జీతం తెచ్చుకుంటాన్నేను. చూద్దాం లెండి - ప్రయత్నం చేస్తాను" అన్నా.
అలా అన్న నాతో "నీ ఖర్మలే! కష్టమయ్యా అది. మేమింత కాలం నుంచి ఏడుస్తున్నాం కదా" అని ఆయనన్నారు. దాన్నే ఛాలెంజ్ గా తీసుకున్నాను. అనుకోకుండా 1975లో ఓ ఛాన్స్ ఒచ్చింది.
1975 లో ఏమైందంటే లక్ష్మయ్యగారు పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం ఏరియాలో ఐదెకరాలు స్థలం తీసుకుని గోడౌన్స్ అవీ కట్టి, వెస్ట్ గోదావరిలో ఓ పదిహేను బ్రాంచీలు, అలాగే ఈస్ట్ గోదావరిలో ఓ మూడు బ్రాంచీలు - మొత్తం పద్ధెనిమిది బ్రాంచీలు ఓపెన్ చేశారు. ఇవన్నీ పొగాకు కొనుగోళ్ళకి, జంగారెడ్డిగూడెంలో గ్రేడింగ్ ఆపరేషన్సుకి.
మాకు ఇంటాబెక్స్ అని లండన్ నుంచి కంపెనీ ఒకటి వచ్చింది. ఆ కంపెనీలో టోనీ లూయిస్ అని చెప్పేసి అతనొకడు, మాక్స్ బెడోస్ అని ఇంకొకతను - వాళ్లిద్దరూ వచ్చారు. వాళ్లిద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
ఈ పద్ధెనిమిది బ్రాంచీలకి కనపర్తి సీతారామయ్యగారు లీఫ్ మేనేజర్. ఆరడుగుల ఆజానుబాహుడు. పంచెకట్టు అదీ చాలా హుందాగా వుండేవారాయన. ఎప్పుడూ మొహాన నవ్వుండేది కాదు. దూర్వాసుడు అని పేరు పెట్టారాయనకి. ఆ రోజుల్లో జంగారెడ్డిగూడెం ఏరియాలో ఏదో ఫ్రాడ్ జరిగింది అంజెప్పేసి లక్ష్మయ్యగారికి ఎవరో ఉత్తరాలు రాశారు. పొగాకు కొనుగోలులో ఏదో గోల్‌మాల్ జరిగింది, ఇక్కడ డబ్బులు తినేశారు అంజెప్పేసి. అప్పుడేం జేశారంటే ఆ రోజుల్లో షా కమిషన్ అనుండేది. ఆ షా కమిషన్ కింద మమ్మల్ని ఐదుగుర్ని వేశారు. అప్పుడు ఎక్సైజు ఉండేది కాబట్టి గందరగోళం అంతా ఎక్సైజులో అనుకుని కృష్ణస్వామిగార్ని ముందు పంపించారు అక్కడికి. ఆయన వెళ్లి చూస్తున్నాడు కానీ ఆయనకీ అంతుపట్టట్లేదు ఏమీను.
సరే - అప్పుడేం జేశారంటే లక్ష్మయ్యగారు, సుబ్బన్నగారు, సోమయాజులుగారు - ఈ ముగ్గురూ కూర్చుని "కొంచెం హుషారుగా వున్నాడు ఈ కుర్రాడు" అన్జెప్పి నన్ను టీమ్ లీడరు చేసి కాశీ విశ్వనాథం అనొకరు, పామూరి సుబ్బారావు అని ఒకతను (ఇతను సుబ్బన్నగారి మేనల్లుడు), కాటన్ డివిజన్ నుంచి అన్నాయ్ అనేవాళ్ళమని చెప్పా కదా - వెంకటేశ్వరావు అతనొకడు, రాజేశ్వరరావు అని చెప్పేసి ఒక క్రిస్టియన్ అతను, - వీళ్ళ నలుగురికీ నేనేమో టీమ్ లీడర్ని. మా ఐదుగుర్నీ వెళ్లమన్నారు జంగారెడ్డిగూడానికి. వెళ్లి "ప్రతి చిన్న పాయింటూ కూడా నోట్ చేసి అక్కడేమన్నా ఫ్రాడ్ జరిగిందా లేదా కనుక్కోండి. ఇష్టమైనంత టైం తీసుకోండి" అంజెప్పేసి పంపించారు మమ్మల్ని.
మేము ఏలూరు దాకా బస్సులో వెళ్లి అక్కణ్ణించి టాక్సీ చేసుకుని జంగారెడ్డిగూడెం వెళ్లాం. అక్కడ లీఫ్ మేనేజర్ కనపర్తి సీతారామయ్య పంతులుగారు ఇన్-ఛార్జ్. ఆయనకి నేనంటే కొంచెం అభిమానం ఎక్కువ. నన్ను పిలిచి "చూడు నాయనా! ఏదో ఈ కంపెనీలో మచ్చ లేకుండా బతికాను ఇన్నాళ్లూ. ఈ గొడవలన్నీ చూసి వెరిఫై చేసి ఎక్కడన్నా తప్పు జరిగితే చెప్పు నాకు. దాన్ని సరిచేద్దాం. అంచేత ప్రతీది నువ్వు జాగ్రత్తగా చూడు." అని నాకేమో చెప్పారు.
అది విని నేను "సర్! ముందు చిన్న బ్రాంచ్ నుంచి మొదలు పెడ్తాను. మరీ పెద్ద బ్రాంచులకి వెళ్తే తెమలదు పని. చిన్నవి ఒక్కోటొక్కోటి చూసుకుంటూ వచ్చేస్తే ఒక్కో బ్రాంచ్ క్లియర్ అయిపోతుంది" అంటే ఆయన " నీ ఇష్టం. నువ్వెలా ప్రొసీడ్ అవుతావో అవు!" అన్నారాయన.
జంగారెడ్డిగూడెంలో పద్ధెనిమిది కార్లుండేవి. ఈ పద్ధెనిమిది కారుల్లో నేనే బ్రాంచుకి వెళ్లాలన్నా ఆ కారు నాకు ఉంచేసేవారు.
నాతో వచ్చిన నలుగుర్లో అన్నాయ్‌ని, రాజేశ్వరరావుని జంగారెడ్డిగూడెం లోనే ఉంచి ఎకౌంట్స్ వెరిఫికేషన్‌కి పెట్టాను. జంగారెడ్డిగూడెం లోకల్లో ముక్కు రంగారావు అని ఒకతన్ని కూడా తీసుకున్నాము. ఇప్పటికీ వున్నాడు కంపెనీలో. వాడి పెళ్లి కూడా నేనే చేశాను. ఆ రంగారావు, పామూరి సుబ్బారావు, నేను - మాతో పాటు కృష్ణస్వామిగారు ఎక్సైజ్ కూడా చూడాలి కాబట్టి ఆయన్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళం.
పొగాకు కొనుగోళ్ళకి TP-3 అనుండేది - రైతులు దాని మీదే అమ్మాలి. దానిమీద నాకెందుకో అనుమానం వేసి, రైతుల ఇంటింటికీ వెళ్లి, ప్రతి రైతునీ కలిసి వాళ్ళ TP-3 కాపీలు తీసుకున్నాం. అప్పటికి calculators అవీ లేవు. ఫ్యాసిట్ (Facit) అని చెప్పేసి ఉండేవి - తిప్పుకుంటూ కొట్టుకునేవాళ్ళం. ఆ ఫ్యాసిట్ మీద కృష్ణస్వామిగారు పని చేస్తూ ఉండేవారు. అన్ని TP-3 లు వెరిఫై చేస్తూ క్లారిఫై చేసుకుంటూ వచ్చాము. ముందు చిన్న చిన్న బ్రాంచెస్ అన్నీ క్లియర్ చేసేసి - "సర్ ఇది క్లియర్ అయింది, ఇది క్లియర్ అయింది" - అని చెప్పుకుంటూ వస్తుంటే మహా సంతోషంగా ఉండేవారు పంతులుగారు. వెంబడే లక్ష్మయ్యగారికి ఫోన్ చేసి "ఇదుగో ఈ బ్రాంచ్ చూశాడు. అంతా క్లియర్ గా వుంది." అని ఎప్పటికప్పుడు చెప్తుండేవారాయన.
టొబాకో బయ్యర్స్ - పిల్లా రంగారావు, వెంకటేశ్వర్లు, రవీంద్ర రెడ్డి, మురిగిపూడి కోటిలింగం, పుత్తూరు శేషయ్యగారు, మోపర్తి అప్పారావుగారు, జంగారెడ్డిగూడెంలో సుబ్బారావుగారని ఒక బయ్యరు-కమ్-మేనేజర్ - అందరూ కూడా మొత్తం నాకు సరెండర్ అయిపోయారు. వీళ్ళ తోటి నాకు మంచి ఎసోసియేషన్ ఉండేది. ప్రతిరోజూ పొద్దున్నే వచ్చి నాకు :గుడ్‌మార్నింగ్" చెప్పి వెళ్తూ ఉండేవారు. తీరా వీడేమన్నా రాంగ్ రిపోర్ట్ ఇస్తే ప్రాణాలు పోతాయి అని భయపడుతూ ఉండేవారు. తూర్పుగోదావరి మూడు బ్రాంచులకి పిచ్చయ్య అనే అతను బయ్యరుగా ఉండేవాడు. బుచ్చయ్య అనే అతను పశ్చిమగోదావరి బ్రాంచులకి బయ్యర్. వీళ్లందరినీ మొత్తం ఓ కొలిక్కి తీసుకొచ్చా.
ఈ లోపులో ఏంటంటే మాక్స్ బెడోస్, టోనీ లూయిస్ వీళ్ళిద్దరూ కూడా అక్కడ లీఫ్ క్లాసిఫికేషన్స్ చేసేవారు. కొన్న పొగాకంతా జంగారెడ్డిగూడెం వచ్చేది. అక్కడ దాదాపు ఆరొందల మంది గ్రేడర్స్ వుండేవాళ్ళు. వీళ్ళు క్లాసిఫై చేసింతర్వాత ఆ పొగాకు గ్రేడింగుకి వెళ్ళాలి. అదీ పెద్ద ఎస్టాబ్లిష్‌మెంటే! ఈ టోనీను, బెడోసూ అక్కడే ఉండిపోయేవారు. వాళ్ళ కోసం కట్టిస్తున్న గెస్ట్‌హౌస్ కూడా రెడీ అయిపోయింది. వాళ్లిద్దరూ గెస్ట్‌హౌస్‌లో వుండేవాళ్ళు.
నా టీములో వున్న ఐదుగురం మిగిలిన గెస్ట్‌హౌస్ కన్స్ట్రక్షన్ లో ఉందని లాడ్జ్‌లో ఉండేవాళ్ళం. ఈ లాడ్జ్‌లో వున్నప్పుడు పొద్దున్నే కాఫీలు చెప్పేవాళ్ళం. ఆ ఎదురుకుండానే ఓ చిన్న మెస్ ఉండేది. అక్కడే భోంచేస్తూ ఉండేవాళ్ళం. ఇలా ఉంటూ ఓ పదిహేను రోజులయ్యేటప్పటికి సగం బ్రాంచుల పని అయిపొయింది. అన్నీ క్లియర్ గా వున్నాయి అని రిపోర్ట్ ఇచ్చేశాను వాటికి. అప్పుడు లక్ష్మయ్య గారు ఏం చేశారంటే "ఇంకింత మంది అక్కడ ఉండడం అవసరం లేదు, ఎక్సైజ్ కృష్ణస్వామిని అక్కడ ఉంచండి. అక్కడ లోకల్లో తీసుకున్నాడు కాబట్టి ముక్కు రంగారావుని ఎసిస్టెంటుగా తీసుకో. మిగిలిన నలుగుర్నీ వెనక్కి పంపించె"య్యమన్నారు. పామూరి సుబ్బారావు, కాశీ విశ్వనాథం, అన్నాయ్, రాజేశ్వరరావు - వీళ్ళు నలుగురూ వెనక్కి వెళ్లిపోయారు. ఇంక నేనక్కడ జంగారెడ్డిగూడెంలో రెగ్యులర్ అయిపోయాను.
సీతారామయ్య పంతులుగారికి 1206 నంబర్‌తో ఒక అంబాసడర్ కారు ఉండేది. ప్రతి సోమవారం ఆ కార్లో నన్ను జంగారెడ్డిగూడెం తీసుకొచ్చేవారు. ఆయనతో పాటు శనివారం దాకా అక్కడ ఉండి మళ్ళీ శనివారం తిరిగి గణపవరం ఆయన కార్లోనే వచ్చేసేవాణ్ణి. వారంలో రోజులన్నీ కృష్ణస్వామిగారు, నేను ఎక్కడ డౌటుంటే అక్కడికి వెళ్లి వెరిఫై చేసుకుని వస్తూ ఉండేవాళ్ళం.
ఒకసారి ఏమైందంటే - బుట్టాయిగూడెం బ్రాంచ్‌కి వెళ్ళాము. బుట్టాయిగూడెం అంటే కృష్ణంరాజు, వాణిశ్రీ యాక్ట్ చేసిన "భక్త కన్నప్ప" సినిమా అక్కడే తీశారు. అక్కడ కరాటం కృష్ణమూర్తిగారని ఆయన ఇంట్లో ఉండేది మా ఆఫీసు. కరాటం కృష్ణమూర్తిగారు నాగార్జునసాగర్ కాంట్రాక్టర్. పొత్తూరి శేషయ్యగారని ఆయన బుట్టాయిగూడెం బ్రాంచ్ బయ్యరు. ఆయనది చిలకలూరిపేట. ఆజానుబాహుడు. మంచివాడే కాకపొతే కొంచెం పొగరెక్కువ. నాతొ ఎప్పుడూ బెదిరిస్తున్నట్టుగా "నేను సుబ్బన్నగారి దగ్గరికెళ్తే ఆయన నాకు కాఫీ, సిగరెట్టు ఆఫర్ చేస్తాడు, ఏమనుకుంటున్నావో" అనేవాడు. ఆయన బ్రాంచ్ కెళ్ళాను. మధ్యాహ్నం పన్నెండు గంటలయింది టైము.
పొత్తూరి శేషయ్యగారు బయ్యింగ్ వ్యవహారాలు ముగించుకుని ఆఫీసు ముందు కూర్చుని వున్నారు. నేను, కృష్ణస్వామిగారు కారు దిగాం.
మమ్మల్ని చూస్తూనే "ఏంటీ? ఈ వేళప్పుడొచ్చావ్?" అనడిగాడు నన్ను శేషయ్యగారు.
"ఏముంది..మిగతా బ్రాంచుల్లాగే మీ బ్రాంచ్ కూడా చూసెళ్దామని వచ్చా" నన్నా.
"ఏంటి చూసేది నా బ్రాంచి? ఇప్పుడు పన్నెండయింది. ఇప్పుడేం లేదు. రేపెప్పుడో రా!" అని విదిలించాడాయన.
ఆయనంతే మొదట్నుంచీ కొంచెం పొగరుగా ఉండేవాడు. నాకు కార్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, నన్ను బెదిరిస్తున్నట్లు మాట్లాడుతూ - ఇలా ఆయనతో చాలా ఇబ్బందులుండేవి.
నేనాయన విదిలింపు పట్టించుకోకుండా "చూడండి. వచ్చాను. నా పని చేసుకుని నే వెళ్తాను. మీకిబ్బందైతే 'నువ్వు చూడొద్దు' అని రాసిచ్చెయ్యండి, వెళ్ళిపోతాను - నాకిక్కడ డౌటుంది." అన్నా.
అసలేం జరిగిందంటే - జంగారెడ్డిగూడెంలో అన్నీ గ్రేడింగుకి వస్తాయి కదా! వచ్చిందాంట్లో ఏమయ్యిందంటే కొన్ని లో-గ్రేడ్ బేళ్లు రావాల్సిన చోట హై-గ్రేడ్ బేళ్లు వచ్చేశాయి అక్కడికి. బుట్టాయిగూడెం లో జరిగిన క్లెరికల్ మిస్టేక్ అది. ఈ శేషయ్యగారికి అది అర్థం కాలా, తెలీలేదు. సీరియల్ నంబర్ ప్రకారం హై-గ్రేడ్ బుట్టాయిగూడెంలో ఉండాలి, కానీ లో-గ్రేడ్ ఉండిపోయింది. ఇది నేను గమనించే అసలు సంగతేంటో కనుక్కుందామని అక్కడికెళ్లా.
"మీరు నన్ను చూడనియ్యకపోతే కాయితం మీద రాసియ్యండి. ఇదుగో శేషయ్య గారొద్దన్నారు అని చెప్పేస్తాను. మీ ఇష్టం" అన్నా.
వెంటనే ఆయన "ఏం చూస్తావ్? చూసుకో. ఏయ్! చూడండయ్యా ఈయనేదో చూడాలట. చూపించండయ్యా కాయితాలు" అని చిరాకు పడ్డాడు.
"నేను కాయితాలు కాదు. ఫిజికల్ వెరిఫికేషన్ కి వచ్చాను. లోపల రెండు లారీలు సరుకుంది. అది మొత్తం తిరగేసి నాకు చూపించాలి" అన్నాను.
"ఏయ్! ఎండవేళ ఆ సరుకు తిరగేస్తే చూరైపోతుంది. నువ్వీ పని చేస్తే మాత్రం నేనూరుకోను" అన్నాడాయన.
"మీ ఇష్టం. అది కూడా రాసిచ్చెయ్యండి. నేనెళ్ళిపోతాను" అని చెప్పా.
పక్కన కృష్ణస్వామిగారుండి నవ్వుతున్నాడీయన.
"ఏంది కృష్ణస్వామీ! నువ్వైనా చెప్పవయ్యా" అన్నాడు శేషయ్యగారు.
"నేను చెప్పేది ఏముంది? ఆయన మాకు ఇప్పుడు టీం లీడర్. ఆయన చెప్పినట్టు ఇప్పుడు మేం వినాల. అంచేతేంటంటే నువ్వు ఆయనేం చెప్తే అది చేసుకో" అనన్నారు కృష్ణస్వామిగారు.
ముఠావాళ్ళందర్నీ భోజనాలు చేసుకు రమ్మని చెప్పా. "తిరగెయ్యండి మొత్తం బేళ్లన్నీ"అన్నా.
తిరగేసింతర్వాత సీరియల్ నంబర్ ప్రకారం హై-గ్రేడ్ కనిపించాలిక్కడ. కానీ హై-గ్రేడ్ జంగారెడ్డిగూడెం పంపించేశారు కదా - లో-గ్రేడ్ ఉండిపోయిందిక్కడ.
నేనవి చూసీ చూడగానే "శేషయ్యగారూ! ఇక్కడ మీరు హై-గ్రేడ్ కింద చూపెడ్తున్న బేళ్లన్నీ లో-గ్రేడులో వున్నాయి. దీనికి మీరు ఆన్సర్ చెయ్యాల. నేను డైరెక్టుగా వెళ్లి పంతులుగారికి ఇన్‌ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ లక్ష్మయ్యగారికి ఇన్‌ఫార్మ్ చేస్తాను." అన్జెప్పి అనేటప్పటికి ఇంక ఆయనకి చెమటలు పట్టేశాయి.
"ఇదో! ఏమయింది ఏమయింది? ఇంత గందరగోళం జరిగిందా? నాకు తెలీదే! మీరంతా ఏం చేస్తున్నారు" అని చుట్టూ వున్న స్టాఫుని అదిలిస్తున్నాడాయన.
"వాళ్ళేం చేస్తారు? కొత్తోళ్లు వాళ్ళు. సీజనల్‌గా వచ్చినవాళ్లు. వాళ్లకేం తెలుస్తుంది? చూసుకోవాల్సిన భాద్యత మీది. సంతకాలు మీరు పెడుతున్నారు కదా!" అంజెప్పేసి కొంచెం గట్టిగానే మాట్లాడాను.
అది వింటూనే ఆయన "ఇదిగో పంతులూ! ఇలా రా కూర్చో ఓ మాట చెబ్తాను. వూరికే... ఏంటయ్యా! భలేవాడివి. మనం మనం ఒకటి." అంటూ వెంబడే మారిపొయ్యాడు.
"మరి ఇంతకు ముందు సుబ్బన్నగారేదో నీకు కాఫీ ఆఫర్ చేసి సిగరెట్లు అవీ ఇచ్చి కూర్చోబెడతాడన్నావు కదా - వెళ్లి ఆయనతో చెప్పుకో పో" అన్నా.
"బాబూ! అదేం లేదు గానీ అప్పుడేదో అలా అన్నాను గానీ - దా! కూల్ డ్రింకేం తీసుకుంటావ్? కోకోకోలానా? గోల్డుస్పాటా ? ఏం కావాలి నీకూ? చెప్పు" అన్నాడు.
"నాకు ఏమీ వద్దు. నేనిక్కడ నీ దగ్గర కనీసం మంచినీళ్లు కూడా ముట్టను. నా రిపోర్ట్ నేనివ్వాల్సిందే!" అని చెప్పేసి అనేటప్పటికి అసలు ఆయనకి ఎలా పడితే అలా అయిపోయింది. మనిషి ఒణికిపోయి ఆయన కారులో ఎక్కించుకుని జంగారెడ్డిగూడెం తీసుకొచ్చాడు. నా కారు వెనకాలే వచ్చింది.
సరే! మా పంతులు గారేంటంటే మధ్యాహ్నం హాయిగా భోంచేసి పడుకుంటారు కాసేపు. పడుకుని రెండుగంటలకి లేచి ప్రశాంతంగా ఓ కాఫీ తాగి, గోల్డ్‌ఫ్లేక్ కింగ్ సిగరెట్టు తాగి కాలు మీద కాలేసుకుని ఓ కాలాడిస్తూ కూర్చుని వుంటారు. అది ఆయనతో ఏమన్నా పనుండి వెళ్లాలంటే మంచి టైము. గమ్మున ఏదన్నా డబ్బులు ఎడ్వాన్స్ కావాలని సంతకం పెట్టించుకోవాలన్నా అది కరెక్ట్ టైమన్నమాట. టక్కున పెట్టేస్తారు సంతకం. ఆ టైములో ఆయన దగ్గరికి వెళ్ళా.
"ఏమైంది కామేశ్వర్రావ్?" అన్నారు పంతులుగారు.
"బుట్టాయిగూడెం వెళ్ళానండి. కొంచెం తేడా కనపడింది." అన్నా.
"ఏమైంది? పిలు శేషయ్యని" అన్నారు.
"లేదులెండి. క్లెరికల్ మిస్టేక్ అది. కాకపోతే గుడ్డిగా సంతకాలు పెట్టాడీయన. ఇప్పుడు అక్కడ యాక్చువల్ గా హై-గ్రేడ్ ఉండాల. వాళ్లేమో పంపించింది లో-గ్రేడు, హై-గ్రేడు కింద రాసేసుకున్నారు వాళ్ళు. ఆ బేళ్లన్నీ ఇక్కడే జంగారెడ్డిగూడెంలో వున్నాయి. ఆల్రెడీ గ్రేడింగుకి ఇష్యూ అయిపోయాయి. అది పెద్ద ప్రాబ్లెమ్ ఏమీ కాదు. కానీ ఆయన నన్నసలు చాలా ఇబ్బంది పెడుతున్నాడు మొదట్నుంచీ కూడా" అని చెప్పేశాను.
"సరే! నేను చూసుకుంటాలే ఆ శేషయ్య సంగతి. బ్రాంచుల్లో ప్రాబ్లెమ్ ఏమీ లేదు కదా?" అన్నారు పంతులుగారు.
"ఏమీ లేదండి. అన్నీ సరి చేశాను" అన్నాను.
ఆ తరవాత శేషయ్యగారిని పిలిచి పంతులుగారు "ఇక ముందు చూసి సంతకాలు పెడుతూ వుండు. ఏం చేస్తున్నావక్కడ? వూరికే మీటింగులు పెట్టుకుని కబుర్లు చెబుతూ కూర్చోకు" అని చీవాట్లేశారు.
ఈ శేషయ్య ఇంకా ఏం చేశాడంటే సెలైన్ టొబాకో కొన్నాడు. సెలైన్ టొబాకో కంపెనీకి పనికిరాదు. కొనడమే కాకుండా జంగారెడ్డిగూడెం పంపించాడు. వాటిని నేను క్లాసిఫికేషన్ పెట్టించాను. పొగాకు క్లాసిఫికేషన్ చేస్తున్న టోనీ, మాక్స్ అది చూసి "ఇదేంటి సెలైన్ టొబాకో ఎవరు కొన్నారు" అనడిగారు. అలా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టిన శేషయ్య ఇంకోసారి ఇబ్బందుల్లో పడ్డాడు.
ఆ రకంగా 1975 లో జంగారెడ్డిగూడెంలో ఒక వెలుగు వెలిగా - నాకు టర్నింగ్ పాయింటు అది. అప్పుడు ఆలోచించా. పొగాకు కంపెనీలో మనం ఎకౌంట్స్ డిపార్టుమెంటులోనూ, స్టాటిస్టిక్సులోనూ పేపర్ వర్క్ చేసుకుంటూ ఉంటే కృష్ణస్వామిగారు చెప్పినట్టుగా మూడంకెల జీతమే! దీన్ని టొబాకో లీఫ్ లోకి మార్చుకుని లీఫ్ నేర్చుకుంటే పైకెదగడానికి అవకాశం వుంది. బయ్యర్స్, మేనేజర్స్ ఈ హోదాలోకి వెళ్లిపోవచ్చు మనం అనే ఉద్దేశ్యం అప్పుడు నా బుఱ్ఱలోకి ప్రవేశించింది. వెంబడే ఏం చేశానంటే క్లాసిఫికేషన్స్ ఎటెండ్ అవడం, గ్రేడింగుకి ఏమేమి ఇష్యూ చేస్తున్నారు ఇవన్నీ చూస్తూండేవాణ్ణి. అక్కడ పుత్తూరు మస్తాన్ అని - గ్రేడింగ్ సూపర్‌వైజర్ - చిలకలూరిపేట అతనే. నేనంటే చాలా ఫేవర్‌గా ఉండేవాడు. అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను.
లీఫ్ సైడు కెళ్దామని ఆలోచన రాగానే కృష్ణస్వామిగారి దగ్గరికెళ్లి "సర్! నేను లీఫ్ వైపు వెళ్ళిపోతాను. మీరు చెప్పినట్టే ఈ సెక్షన్ తప్పించుకుంటాను" అన్నా.
"మంచిదే... బానే ఉంటుంది చూడు. ట్రై చెయ్." అన్నారాయన. ఒక్కసారిగా వెళ్లనీయరు కదా! అంచేత డెప్యుటేషన్ మీద సీజనల్ గా వెళ్లడం - జూన్, జులై అయిపోయేటప్పటికీ సీజన్ అయిపోయేది - గణపవరం వచ్చేసేవాణ్ణి.
ఈ లోపులో ఏమైందంటే 1975 లోనే మైసూర్లో బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఇక్కణ్ణించే బయ్యర్లు కొంతమంది అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడ లోకల్లో నేమో విరూపాక్షయ్య అనే ఎక్సైజ్ హెడ్డు. అజిత్ ఒంబత్కరే అనే ఆయన మేనేజర్. హాసన్‌లో ఉండేది ఆఫీసు. కింద ఆఫీసు, పైన గెస్ట్ రూములు నాలుగుండేవి. అక్కడ లక్ష్మణమూర్తి, గోపి, మోహనరావు అని చెప్పేసి - మన గుంటూరు వాళ్ళే ముగ్గురూ - వుండే వాళ్ళక్కడ.
నాకు ఎకౌంట్స్ తెలుసు, ఎక్సైజ్ తెలుసు. కొత్త బ్రాంచ్ ఓపెన్ చెయ్యాలంటే ఎక్సైజ్ ఫార్మాలిటీస్ ఉంటాయి. దాంతో లక్ష్మయ్యగారు, పంతులుగారు ఏ కొత్త బ్రాంచ్ ఓపెన్ చెయ్యాలన్నా కామేశ్వరరావు ఉండాల్సిందే అనుకునేవారు. మైసూర్ బ్రాంచెస్ సెటప్ కోసం కూడా నన్నే పంపించారు. 1976 లో మైసూర్ వెళ్లాను.
అజిత్ ఒంబత్కరే తుళు ఆయన. నేషనల్ టొబాకో కంపెనీ లోంచి వచ్చి ఇక్కడ చేరాడు. అతనికి నేనంటే మంచి అభిమానం.
ఆఫీసుకి దగ్గర్లోనే ఒక Yezdi షోరూం ఉండేది. నేను మైసూర్ వెళ్ళగానే "కామేశ్వర్రావ్! నువ్వెళ్ళి ముందు ఓ కొత్త బండి తెచ్చేసుకో Yezdi" అన్నాడు. వెంబడే వెళ్లి ఓ కొత్త యెజ్డి బండి డెలివరీ తెచ్చేసుకున్నాను. నాకప్పటికి లైసెన్సు కూడా లేదు. హెల్మెట్ ఓటి పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాణ్ణి. మొత్తం కర్ణాటక బ్రాంచెస్ అన్నీ కూడా - హున్సూర్, పెరియపట్న, దావణగెరె, చిట్టెనహళ్లి - ఇవన్నీ తిరుగుతుండేవాణ్ణి. షిమోగా వెళ్లాలంటే కారిచ్చేవాడు అజిత్ గారు. దావణగెరెలో ఉత్తమ్ మహాదేవ్ అనే బయ్యరు ఉండేవాడు. షిమోగాలో కొలాసో బయ్యరు. రామనాథపురలో ముత్తన్న, పెరియపట్నలో రాజారాం వుండేవారు.
ఆంధ్రా నుంచి వెళ్లిన బయ్యర్సుకి భాష రాదు కాబట్టి లీఫ్ చూడడానికి వీళ్ళుండేవారు. రైతులతో మాట్లాడడానికి కర్ణాటక లోకల్ బయ్యర్స్ ఉండేవారు.
మైసూర్ వెళ్ళినప్పుడు మొదట్లో భాష రాక నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. హోటల్ కెళ్ళి ఇడ్లీ కావాలంటే వేలు పెట్టి చూపించి అది కావాలని అడిగేవాణ్ణి. కొద్ది రోజుల తర్వాత నెమ్మదిగా కన్నడ నేర్చుకోవడం మొదలుపెట్టాను చిన్నగా. "ఏన్రీ", "చెన్నాగిదీరా?", "ఎష్టు గంటేగే బర్తీరా?" ఇలాంటి చిన్నచిన్న మాటలు, వచ్చీరాని వాక్యాలు కన్నడలో మాట్లాడుతూ రైతులతో వ్యవహారం నడిపేవాణ్ణి.
కర్ణాటక సీజన్‌కు 1976 లో మాత్రమే వెళ్ళాను. తర్వాత ఇంకెప్పుడూ వెళ్ళలేదు. ఆంధ్రాలో మాత్రం జంగారెడ్డిగూడెం ఏరియాలో ఎక్కడ బ్రాంచెస్ ఓపెన్ చెయ్యాలన్నా మొదట్నుంచి చివరిదాకా నేనక్కడ ఉండాల్సిందే. ఇది పంతులుగారు పెట్టిన కండిషన్. ఈ రకంగా నేను లీఫ్ సైడ్ లోకి వెళ్ళిపోయాను.
లెక్కల్లో చేరా...
అక్కణ్ణించి లీవ్ ఇమ్మని అడిగా
లీఫ్ వైపు మళ్ళా
నా లెక్క వేరే అనిపించా
అదీ ... ఓ లెక్కగా సాగిన నా పయనం!
లెక్కల నుంచి లీఫ్ దాకా...
<వచ్చేనెల తరువాయి కథ>

Interesting account!! 👌
రిప్లయితొలగించండిThank You, YVR garu :)
తొలగించండి