కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 28 - సెమావలోకనం - అదేమి అల్లరీ - అదేమి పోరెడీ...
దీపావళి పండగ పప్పీ, కుట్టీలతో సరదాగా గడిచిపోయింది. నాన్న ఎంత వద్దని చెప్పినా ఒక టెక్స్ట్ బుక్కేదో మోసుకెళ్ళాను. దాన్నలాగే ఎక్కడా తెరిచి చదివిన ఆనవాలే లేకుండా భద్రంగా మోసుకుంటూ మళ్ళీ హాస్టల్‌కి చేర్చాను.
మా ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలతో పాటు మా సీనియర్ల ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. వాళ్లింక హాస్టల్ వెకేట్ చేయడం, సిక్స్త్ సెమిస్టర్ లో చేయాల్సిన ప్రాజెక్ట్ కోసం వాళ్ళు వెళ్లాల్సిన ఊళ్లకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడంలో మహా బిజీగా వున్నారు. శ్రీలత, సంగీత, గుత్తి పద్మజలతో ఆ పరీక్షలై పోయింతర్వాతి రోజులు హడావిడిగా, సరదాగా, కొంచెం బెంగగా, ఇంకొంచెం దిగులుగా గడిచాయి నాకు.
[అన్నట్లు మర్చిపోయాను - ఇది కొంచెం పాత విషయం - ఇప్పుడు వెనక్కి వెళ్ళలేను కాబట్టి ఇక్కడ రాసుకోవాల్సిందే. మా సీనియర్స్ వాళ్ళ ఫోర్త్ సెమిస్టర్లో అనుకుంటాను - ఇంటర్-యూనివర్సిటీ ఫెస్టివల్ కోసమని కేలికట్ వెళ్ళొచ్చినట్లున్నారు. అప్పుడు గుత్తి పద్మజ వాళ్ళందరూ కలిసి ఒక స్కిట్ వేశారు. ఆ స్కిట్ ఒక కాలేజ్‌లో స్టాఫ్ కోసం ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసే ఇంటర్వ్యూ. అందులో గుత్తి పద్మజ ప్రిన్సిపాల్ అనుకుంటాను. రిహార్సల్స్ అప్పుడు తనొక ఎరుపురంగు పెడన చేనేత చీర కట్టుకోవడం గుర్తుంది నాకు. ఇంకో సీనియర్ మైథిలి (మద్రాస్ నుంచి వచ్చిన అమ్మాయి) మ్యూజిక్ టీచర్ పోస్టు కోసమని వస్తుంది. తను Twinkle Twinkle Little Star - rhyme ని కర్ణాటక సంగీతం, బెంగాలీ రబీంద్ర సంగీత్, పంజాబీ భాంగ్రా - ఇలా రకరకాల ట్యూన్లలో పాడుతుంది. ఇంకో సీనియర్ ఇందు Physical Education teacher గా వస్తుంది. నేను వాళ్ళందరూ రిహార్సల్స్ చేస్తుంటే టేబుల్ మీద కాళ్ళూపుకుంటూ కూర్చుని తెగ ఎంజాయ్ చేసేదాన్ని. ]
ఇంక రెండ్రోజుల్లో సీనియర్స్ హాస్టల్ రూములు ఖాళీ చేసి వెళ్తారనగా నేను రోజూ లాగే వాళ్ళతో కూర్చుని భోంచేస్తున్నాను. అప్పుడు గుత్తి పద్మజ "ఇప్పుడు నేనొక త్రీ సెంటెన్సెస్ చెప్తాను. అవి ఏ లాంగ్వేజ్‌లో ఉన్నాయో గెస్ చేయాలి మీరంతా" అంది. సరే అంటే సరే అని రెడీ అయిపోయాం శ్రీలత, సంగీత, పద్మజవల్లి - వాళ్లతో పాటు నేనూను.
అప్పుడు పద్మజ చెప్పిన సెంటెన్సెస్ ఇవీ...
పి క నా సి ఏ.
బ, పి కెన్ పీ ఏ.
విదా ఏ, పికనాలి.
ఎంత ఆలోచించినా అవేంటో అంతుబట్టలేదు మాకు. ఇంక మేమందరం చెప్పలేమని ఒప్పేసుకున్న తర్వాత తనదైన స్టయిల్లో గట్టిగా - బోల్డన్ని బుల్లిబుల్లి గంటలు ఒకేసారి మోగుతున్నట్టుగా నవ్వి - అవేంటో చెప్పింది. అవి తను చిన్నప్పుడు స్కూల్లో టీచర్ పెదవుల కదలికను బట్టి, బట్టీ పట్టిన సైన్స్ పాఠం లోవి అని చెప్పింది. ఇంతకీ ఆ వాక్యాలేంటీ అంటే... ఇప్పుడే చెప్పేసుకోవడానికి తొందరేం లేదు. చివర్లో చెప్తా - ఈలోగా మీకు తట్టకపోతే.
All good things must come to an end! నేను MCAలో చేరినప్పట్నుంచి నన్ను ఎంతో ఇష్టంగా LGP (లల్లి గోల పిల్ల) అంటూ వాళ్లలో కలుపుకుని - ఇంటి మీద బెంగతో నేనేడిస్తే నన్ను మరిపించడానికి తన దగ్గరున్న టేప్ రికార్డర్లో నాకిష్టమైన పాటలు పెట్టే శ్రీలత, తన కంచంలోనే అన్నం కలిపి ముద్దలు తినిపించిన సంగీత, నన్ను నవ్వించడానికి ఎన్నెన్నో జోక్స్ చెప్తూ - నాతో కలిసి పాటలు పాడిన గుత్తి పద్మజ - వీళ్ళందరూ యూనివర్సిటీలో వాళ్ళ చదువులు అయిపోయి సిక్స్త్ సెమిస్టర్ ప్రాజెక్ట్ కోసం వెళ్లాల్సిన సమయం వచ్చేసింది.
They came, they studied, they left అన్నట్లుగా మా SPMVV నుంచి second batch of MCA girls - శ్రీలత, సంగీత, పద్మజ, పద్మజవల్లి, ఉషాలక్ష్మి, అన్నపూర్ణ, సుమలత, సుమిత్ర, మైథిలి, డే స్కాలర్స్ అయిన ఇందు, స్మిత, సునీత - వీళ్ళందరూ (ఇంకా కొందరి పేర్లు మర్చిపోయాను) - హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు లాంటి సిటీలకి - ప్రాజెక్ట్ వర్క్ కోసమని వెళ్లారు.
ఇంకిప్పుడు కాలేజ్ లోనే కాదు, హాస్టల్లో కూడా మాదే సీనియర్ బాచ్. MCA లోనే కాక మిగిలిన అన్ని కోర్సుల్లోకీ సబ్-జూనియర్స్ వచ్చేశారు.
నాకు గుర్తున్నంత వరకూ మా సబ్స్ లో నాకు మంచి ఫ్రెండ్ అయిన అమ్మాయి - మాధవి నారపరెడ్డి. తనే నాతో పాటు మా వార్డెన్ అరుణాచంచల దగ్గరికి నేను ఈ దీపావళికి ఇంటికి రావడానికి పర్మిషన్ అడగడానికి తోడు వచ్చింది. మాధవి హైదరాబాదు ఇక్రిశాట్ నుంచి వచ్చింది. తను మా క్లాస్మేట్స్ సునీత, పద్మప్రియల రూం (506-బి) లో ఉండేది. నేను మామూలుగా హాస్టల్లో భోంచేసేటప్పుడు కూరలు తినేదాన్ని కాదు. సాంబారు చేసిన రోజుల్లో మాత్రం ఆ సాంబారు బకెట్టు తెచ్చి పక్కన పెట్టుకుని అందులో వేసిన ముక్కలు, ములక్కాడలు బోల్డన్ని తినేదాన్ని. మిగిలిన రోజుల్లో పెరుగన్నం మాత్రం తినేదాన్ని. అలాంటప్పుడు మాధవి నాకోసం తను ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళు, పొడులు త్యాగం చేస్తూ ఉండేది.
అలాగే నా రూంలోకి కూడా B.Ed అమ్మాయిలు ఇద్దరు వచ్చారు. అప్పటి వరకూ నేను తలుపు కెదురుగుండా వుండే భాగంలో ఉండేదాన్ని. ఇప్పుడు ఇంతకు ముందు పద్మజవల్లి వున్న వైపుకి మారాను. B.Ed అమ్మాయిలు నాగలక్ష్మి, సుశీల ఇంతకుముందు శ్రీలత వున్న వైపున్న రెండు మంచాల దగ్గర అడ్జస్ట్ అయ్యారు. నేను ఖాళీ చేసిన మంచం ఇంకా ఖాళీగానే వుంది.
నా రూం లోకి వచ్చిన ఇద్దరు B.Ed అమ్మాయిల్లో నాగలక్ష్మి అనే రాజంపేట నుంచొచ్చిన అమ్మాయి అచ్చు ఒకప్పుడు పత్రికల్లో కనిపించే కరుణాకర్ బొమ్మలా ఉండేది - నారాయణుడు మెచ్చేలాంటి మెరుపు రంగు ఒళ్ళు, పెద్దపెద్ద కళ్ళు, పొడుగు జడ, చిన్నచిన్న పెదవులు, పన్ను మీద పన్ను, గడ్డం దగ్గర చిన్నినొక్కుతో - నాకైతే భలే నచ్చేసింది.
నాగలక్ష్మి నన్ను "లల్లి" అని పిలిచినా "మీరు" అనేది. బహుశా నన్ను "మీరు" అంటూ మాట్లాడిన మొదటి అమ్మాయి తనేనేమో. నేను మాత్రం అందర్నీ అన్నట్లే తననీ "నువ్వు" అనే అనేదాన్ని. తనకీ నేను చాలా నచ్చేసినట్టున్నాను. నేను ఎప్పుడైనా SVU SBM (School Of Business Management) కి అబ్బాయిని కలవడానికి వెళ్లాలనుకుంటున్నానని తెలిస్తే సుశీలతో కలిసి నాతో పాటే వచ్చి SBM దగ్గర దింపి వెళ్ళేది - "లల్లీ! మీరొక్కళ్ళూ ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళొద్దూ" అంటూ.
ఒక్కోసారి నేను హడావిడిగా క్లాసుకి వెళ్ళిపోతే తన బట్టలతో పాటు నా డ్రెస్సులు కూడా ఉతికేసి ఆరేసేసేది. సాయంత్రం క్లాసులన్నీ అయ్యాక రూంకి వచ్చిన నాకు నా మంచం మీద మడత పెట్టిన బట్టలు చూసి బోల్డు మొహమాటం వేసేది. "అదేంటి నాగలక్ష్మీ - నా బట్టలెందుకు ఉతికావు?" అనడిగితే "ఒక్క డ్రెస్సే కదా! పరవాలేదు లెండి" అనేది. "నాకు ఫరవా వుంది - ఇలా చెయ్యకింక" అని నేనంటే - గలగలా - అచ్చు వాళ్ళ ఊరి పక్కన పరుగులు తీసే బాహుదా నది మిలమిలలాడినట్లు - మెరిసే కళ్ళతో - బహు బాగా నవ్వేది. ఒకట్రెండు సార్లు అలా జరగ్గానే చాలా గట్టిగా చెప్పాను తనకి - "నాగలక్ష్మీ! ఇలా చేస్తే నీతో అస్సలు మాట్లాడను, మేట్రన్‌కి చెప్పి నిన్ను నా రూంలోంచి వేరే చోటికి మార్చెయ్యమని చెప్తాను" అని. అప్పట్నుంచీ నా బట్టలు ఉతకడం మానేసింది. హమ్మయ్య! అనుకున్నాను.
సరే! శ్రీలత, సంగీత వాళ్ళందరూ వెళ్ళిపోయాక - నా రూంలో ఉండడానికి నాక్కొంచెం బెంగగా అనిపించేది. నా కోసం వెయిట్ చేసి నాతో పాటు లంచ్‌కి, డిన్నర్‌కి వచ్చి నాతో కబుర్లు చెప్పడానికి ఎవరూ లేరని దిగులుగా ఉండేది. దాన్ని మర్చిపోవడానికి డైనింగ్ హాల్లో రోజూ ఒకే టేబుల్ - ఒకే గ్రూప్ అమ్మాయిలతో కాకుండా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ, ఎవరు కబుర్లు చెప్తే వాళ్ళతో కూర్చుని భోంచేసేదాన్ని. అలా హాస్టల్ మొత్తంలో ఒక్క MCA వాళ్ళే కాకుండా నన్ను పలకరించనివాళ్ళు, నేను మాట్లాడనివాళ్ళు అంటూ ఎవరూ వుండేవారు కాదు.
ఇంతకు ముందు కన్నా నా క్లాస్‌మేట్స్‌తో కొంచెం ఎక్కువగా కలవడం మొదలుపెట్టాను. ఇంతకు ముందెప్పుడో మొదట్లో చెప్పనట్లు గుర్తు - మా క్లాస్‌లో నలుగురు అమ్మాయిలు మాత్రం ఎప్పుడూ కలిసే తిరిగేవారు, ఏ పని చేసినా కలిసి చేసేవారు. వాళ్ళు - మల్లిక, నిగమ, సునీత, నిరుపమ. అందులో మల్లిక, నిరుపమ గుంటూర్లో BH లో నా క్లాస్‌మేట్స్ ఇంటర్మీడియట్ లో. వాళ్లిద్దరూ నిగమతో కలిసి 502-బి లో ఉండేవారు. సునీత 506-బి లో ఉండేది. కానీ నలుగురూ ఎక్కువగా 502-బి లోనే ఉండేవారు. నేను కూడా వాళ్లతో కొంచెం కొంచెంగా కలవడం మొదలుపెట్టాను.
వాళ్ళ నలుగురి లోకీ నాకు నిరుపమ, సునీత బాగా నచ్చేవారు. నిరుపమ-studiousness ఒక extreme అయితే సునీత-playfulness was on the other end. గుండమ్మ కథలో జమునలా బారెడు పొద్దెక్కాక నిద్ర లేచే సునీత కోసం dining hall నుంచి breakfast తెచ్చేవారు మల్లిక, నిగమ. అలా తెచ్చిన వాళ్ళిద్దరినీ నిరుపమ తిడుతూ ఉండేది - సునీతని అంత pamper చెయ్యొద్దని. వాళ్ళ నలుగురినీ చూస్తుంటే నాకు భలే సరదాగా ఉండేది.
ఒకరోజు సాయంత్రం నేను క్లాసెస్ అయిపోగానే వచ్చి నా 603-wing కి ఎదురుగా వున్న మెట్ల landing మీద నించుని కింద నించుని కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలను చూస్తున్నాను. ఇంతలో నిరుపమ తానుండే రూమ్ నుంచి థర్డ్ ఫ్లోర్లో వున్న నా దగ్గరికి వస్తూ కనిపించింది. ఏంటబ్బా ఈ టైంలో వస్తోంది అనుకుంటుండగానే తనూ మెట్లెక్కి నా దగ్గరికి వచ్చింది.
"హాయ్! నిరుపమా! మిగిలిన వాళ్ళేరీ" అంటూ పలకరించాను.
"హాయ్!" అనేసి "అద్సరే కానీ... నీ 603-A లో ఖాళీ వుంది కదా?! నేను వద్దామనుకుంటున్నాను నీ రూం లోకి" అంది.
నాకు భలే సంతోషంగా అనిపించింది. ఇప్పటిదాకా మరి నా క్లాస్ వాళ్లతో కలిసుండే అవకాశమే రాలేదు నాకు. వెంటనే గబగబా "ఓ తప్పకుండా! పద హాస్టల్ ఆఫీస్ లో మాట్లాడి వద్దామా? రేపే మారిపోతావా?" అని బోల్డు హడావిడిగా అడిగాను.
"నిన్నడిగి కణ్ణగితో మాట్లాడమనుకున్నాను. రేపే వచ్చేస్తాను నీ రూం లోకి" అంది.
ఇంక ఆ రాత్రి అబ్బాయికి రాసిన ఉత్తరంలో అన్నీ నిరుపమ సంగతులే, తను నా రూమ్ లోకి షిఫ్ట్ అయితే ఎంత బావుంటుందో, తన కంపెనీని నేనెంత ఎంజాయ్ చేస్తానో - ఇవే కబుర్లు.
అన్నట్లు చెప్పలేదు కదూ - దాదాపు ప్రతిరోజూ బదరి నేను కలిసి వాకింగ్ కి వెళ్లి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా మళ్ళీ ప్రతిరోజు రాత్రీ ఒకళ్ళకొకళ్ళం ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. నేను రాసేవి ఏవో గాలికబుర్లలా వున్నా అబ్బాయి రాసేవి మాత్రం designer ఉత్తరాల్లా ఉండేవి. ఒక ఉత్తరం పేపర్ మధ్యలో మొదటి అక్షరంతో మొదలుపెట్టి తర్వాత అక్షరాల్ని, మాటల్ని imaginary concentric circles మీద రాసినట్లు ఉండేది. అది చదువుకోవాలన్నా ఆ పేపర్ని గుండ్రంగా తిప్పుతూ చదువుకోవాల్సి వచ్చేది. ఇంకో ఉత్తరమేమో "రిదం సురపుత్రి తాలిల. వి" అంటూ తిరగేసి రాసిన నా పేరుతొ మొదలయి మిగిలినదంతా కూడా తిరగేసిన తెలుగులో ఉండేది. ఈ తమాషా రాతలకి తోడు తన అక్షరాలు చెక్కుతూ రాసినట్లు భలే అందంగా ఉండి - మొత్తానికి ప్రతి ఉత్తరం ఒక అందమైన అల్లిబిల్లి ముగ్గులా ఉండేది. ఆ అందమైన రాతకి తోడు మంచిమంచి రంగురంగుల లెటర్ పాడ్స్ మీద నా మీద రాసిన పాటలు - ఎంత బావుండేవో!
ఒక్కోసారి ఇంటర్నల్స్ అవీ ఉన్నప్పుడు అలిపిరి వెళ్లడం కుదిరేది కాదు. అప్పుడు ఉత్తరాలు పోస్ట్ చేసుకునేవాళ్లం - ఆ వారం రోజుల విశేషాలతో. నేనందుకే అబ్బాయిని నా "వాకింగ్ డైరీ" అని అనేదాన్ని. నేను పోస్ట్ చేసే ప్రతి ఎన్వలప్ మీదా ముందు అడ్రస్ రాసి వెనక పక్క మాత్రం ఏదో ఒక పాట తప్పకుండా రాసేదాన్ని.
అలా చాలా పాటలు రాసినా - చాలా ఎక్కువసార్లు రాసిన ఒక పాటేంటంటే ...
मिलो न तुम तो हम घबराये
मिलो तो आँख चुराये
हमें क्या हो गया है
तुम्हीं को दिल का राज़ बतायें
तुम्हीं से राज़ छुपायें
हमें क्या हो गया है ...
అస్సలు నేను పాటలు పాడడానికి, వాటిని వాడడానికి సందర్భాలు, అవకాశాలు వెతుక్కునేదాన్ని - అలాంటివేవీ దొరక్కపోతే కొత్తవి నేనే సృష్టించుకునేదాన్ని - ఆ ఎన్వలప్ మీద రాసే పాటల్లాగా.
సరే! నిరుపమ నా రూం లోకి వచ్చేసింది. అలా రావడం నాకు భలే నచ్చేసింది. తలుపు కెదురుగా ఖాళీగా వున్న మంచం ప్లేస్ తాను తీసుకుంది. ఆ కిటికీ లోంచి సాయంత్రం కాగానే లైట్లు వెలిగి వెలుగులో నక్షత్రాల దారిలా కనిపించే తిరుమలకి నడిచెళ్లే దారిని చూసి నిరుపమ తెగ మురిసిపోయింది. నా కోసం నిరుపమ, నిరుపమ కోసం నేను ఆగడం, ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసి వెళ్లడం - మళ్ళీ నాకు నా सूनी-सूनी ज़िन्दगी లోకి మళ్ళీ ఫ్రెండ్షిప్ వెన్నెల వచ్చినట్లుగా అనిపించేది. అసలు మనకంటూ ఉంటూ, మన కోసమంటూ, మన కోసముంటూ ఒక ఫ్రెండుంటే ఎంత బావుంటుందో అపర్ణ నేర్పిస్తే - దాన్ని మళ్ళీ ఇంకోసారి నాకు గుర్తు తెచ్చింది మాత్రం ఫిఫ్త్ సెమెస్టర్లో నిరుపమతో గడిపిన టైం.
ఎప్పట్లాగే ఆ రోజు అబ్బాయితో కలిసి అలిపిరి దాకా నడిచి వెళ్ళి - ఇద్దరం వెనక్కి వస్తూ వున్నాము.
హాస్టల్ దగ్గర తను నన్ను దింపి తను తిరిగి వెళ్లాల్సిన సమయం అయ్యేటప్పటికి - అప్పటికి గంట క్రితం నిరుపమ, నాగలక్ష్మి, సుశీలల దగ్గర మొదలు పెట్టిన కబుర్లు దీపావళికి ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడం కుదరని గోరింటాకుని బెంగగా తలుచుకోవడం దగ్గర ఆగాయి.
ఆ చివరి సంగతి వింటూనే అబ్బాయి అడిగిన ప్రశ్న - అది కూడా అప్పటికి మాట్లాడడానికి వీలు కుదిరింది కాబట్టి - "నీకు గోరింటాకు అంటే అంత ఇష్టమా? " అని.
అలా అడగడానికి పర్యవసానం ఎలా వుంటుందో ఊహించలేని తనకి "అవును.గోరింటాకు అంటే నాకు బోల్డు ఇష్టం. అందుకే మా అనాతవరం వెళ్ళినా, శివకోడు వెళ్ళినా నన్ను చూడగానే గోరింటాకు రుబ్బేస్తారు. గుంటూర్లో మా ఆఫీసులో వెంకటేశ్వర్లు ప్రతీ నెలా తక్కెళపాడు నుంచి గోరింటాకు తెచ్చిపెడతాడు. అసలు ప్రతి అట్లతద్దికీ గోరింటాకు పెట్టుకోకుండా ఉండనే ఉండం. నా పుట్టిన రోజుకీ అంతే!" అంటూ గుక్కతిప్పుకోని నా సమాధానం.
అది వింటూనే చిరునవ్వుతో తలాడించి నాకు bye చెప్పేసి ఇంకో ప్రశ్న అడక్కుండా తనటు - చెప్పిన సమాధానాన్నే నెమరేసుకుంటూ, నవ్వుకుంటూ నేనిటు - వెళ్ళి we lived happily ever after - until the next time we met.
ఆ మరసటి రోజు సాయంత్రం బయటికి వెళ్ళడం కుదరలేదు. కానీ ఆ రాత్రి ఎనిమిదింటికి అబ్బాయి నుంచి ఫోన్ - "రేపు శనివారం మధ్యాహ్నం SBM దగ్గరికి రా " అంటూ.
శనివారం వచ్చింది. మధ్యాహ్నం అయ్యింది. SBM దగ్గరికి వెళ్ళానో లేదో నడుస్తూ వెళ్తున్న నా వైపుగా చూస్తూ బదరి, తనకెదురుగా సైకిల్ పట్టుకుని నించుని కబుర్లు చెప్తున్న సాయి ప్రసాద్ కనిపించారు. నన్ను చూడగానే బదరి నవ్వుతూ చెయ్యూపారు.
తనతో మాట్లాడుతున్న సాయి ప్రసాద్ వెనక్కి తిరిగి నన్ను చూడగానే "ఓ తినొచ్చిందా?" అనగానే బదరి అలాగే నవ్వుతూ "తినే వచ్చిందంటావా?" అనగానే సాయి ప్రసాద్ ఆ puన్నుకి "హహ్హహ్హ" అని నవ్వేసి మా ఇద్దరికీ bye చెప్పేసి సైకిల్ మీద వెళ్ళిపోయారు.
నేనూ, అబ్బాయి SBM దగ్గరే నెమ్మదిగా నడుస్తున్నాము. నాకక్కడే ఎందుకు నడుస్తున్నామో అర్థం కాలేదు. అదే అడిగితే తను "ఆగు! తొందరేంటి? క్లాసులేంలేవు కదా?" అన్నారు.
ఓ పది నిముషాలయింది. మళ్ళీ సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న సాయి ప్రసాద్ కనిపించారు. వస్తూనే ఒక ప్లాస్టిక్ కవర్ బదరి చేతికిచ్చారు. దాన్ని బదరి నా చేతికిచ్చారు. అదేంటబ్బా అన్నట్లు చూస్తున్న నాతో బదరి "ఇంక నీ హాస్టల్ కెళ్ళి తీరిగ్గా రెండు చేతులకీ గోరింటాకు పెట్టుకో - బాగా పండాలమ్మాయ్ మరి!" అనగానే బోల్డంత సంబరంతో అసలేం మాట్లాడాలో తెలీలేదు. అంతకు రెండు రోజుల ముందు నా బెంగోరిం-టాకు విని అప్పటికప్పుడు గోరింటాకు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని తెప్పించి వాళ్ళ మెస్సులో తనంటే అభిమానంగా వుండే ఒక cook తో రోట్లో రుబ్బించి, సాయి ప్రసాద్ తో తెప్పించి నాకు ఒక మంచి surprise ఇప్పించారు అబ్బాయి!
రెండో రోజుకి నా అరచేత పూసుకున్న గోరింటాకు - ౘందమామగా, ఆ మామ చుట్టూ మురుస్తున్న చుక్కలుగా, వేళ్ళ చుట్టూ ఉంగరాలుగా - సిందూరరంగు మందార పువ్వులా పూసింది ;)
గోరింట వచ్చింది చెట్టు లేకుండా...
SVU రోట్లోన మెత్తగ నలిగింది
ఎంచక్కా పండింది ఎర్రాని చుక్కా...
రుబ్బీ ఇచ్చినోరికి శ్రీరామరక్షా !
సైకిలెక్కి తెచ్చినోరికి కలకాలం రక్షా !
అన్నట్లు మొట్టమొదట్లో రాసిన పద్మజ cryptic రాతకి అసలు sentences ఇవీ:
పి క నా సి ఏ.
We can not see air.
బ, పి కెన్ పీ ఏ.
But, we can feel air.
విదా ఏ, పికనాలి.
Without air, we cannot live.
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

మీ టైమింగ్ కు, ఓపికగా రాయగలుగుతున్న మీకు జోహార్లు లలిత గారు.
రిప్లయితొలగించండినా బ్లాగ్ చదివి ప్రోత్సహిస్తున్న మీకు చాలా థాంక్స్, పవన్‌గారు!
తొలగించండిపోస్ట్ చాలా పొడుగ్గా వుందండీ. పైపైన చదవ గలిగా అంతే. పోస్టులు చిన్నవి గానూ పెద్దవి గానూ కాకుండా మధ్యస్తంగా వుంటే మంచిది.
రిప్లయితొలగించండిత్వామనురజామి అంటే ఏంటండీ?
పోస్ట్ మొత్తం కాకపోయినా కొంతైనా చదివినందుకు, థాంక్సండి శరత్‌గారు! త్వామనురజామి అంటే my love towards my life!
తొలగించండిమీకు cryptography lo PhD ఉన్నట్టుంది. చివరికి విడమర్చి వ్రాసినా, నాకర్థం కాలేదు. ఈ వాక్యం - They came, they studied, they left - చాలా చక్కగా ఉంది. దీన్ని ఎన్నింటికో అన్వయించుకోవచ్చు. మీ బదరి గారి చేతివ్రాత, కవిత్వం రెండు బావున్నాయి.
రిప్లయితొలగించండిSarath, please read all the series of articles from the beginning with this title. Asking the author to cut down prose is rude and there is a huge fan following for this author. Thanks for your understanding.
అన్యగామిగారూ! ఎంతో ఆత్మీయంగా రాసిన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండిఅంత Cryptography ఏమీ లేదండి. ఇంకొక్కసారి చదవండి - ఒక ఆరేడేళ్ళ పాప lip reading తో English నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా చదువుతుందో వూహించుకుంటూ. :)