29, జులై 2016, శుక్రవారం

కలల కొనసాగింపుగా...కనులకింపుగా...

పదకొండేళ్ల క్రితం ... అప్పుడు ... 

ఇల్లు కొన్న మొదటి రోజులు 
ఇంట్లో - అమ్మా, నాన్నా, అన్న కాబోతున్న ఓ బుజ్జి-జింకా
ఆ ముగ్గురి కళ్లనిండా ఎదురు చూపుల దీపాలు 
అవి వెలిగించి పెట్టింది - ఇంకో నెలలో రాబోతున్న బుజ్జి-పాపడు 

ఇల్లంటే - ఆకూ కొమ్మా , వెన్నెల వెల్లా ...
ఇల్లంతా - అనుకున్నట్లే అంతా వెన్నెల వెల్లే

అన్నకి తమ్ముడు తోడు రాబోతున్నాడన్న సంబరం 
తమ్ముడొచ్చాక - ఆ ఆలనలో-పాలనలో - అలసి-సొలిసే అమ్మ ఆదమరపుగా వుందని అన్న దిగులు పడకూడదు కదా!
అందుకు నాన్న వేసిన కిటుకు ఏంటంటే - అన్నకి ఇష్టమయిన బొమ్మలతో ఓ రంగుల గది సృష్టించేయడం. 
అది ఎలా చేయడం? నాన్న దగ్గర - అమ్మని, అన్నని నవ్వించే -  బుజ్జిపాపడిని రాత్రంతా ఎత్తుకుని లాలించే - ప్రేమంత్ర దండం వుంది కానీ - "రంగేయరా-బొమ్మ గీయరా డింభకా!" అంటే చిటికెలో గోడల్ని చిత్ర-కుడ్యాలుగా మార్చే మాయల ఎల్ఫులు లేరే మరి ?!


అందుకని - అమ్మా-నాన్న కలిసి అక్కడ వెతికి-ఇక్కడ వెతికి మొత్తానికి రంగులు-బొమ్మలు వేయడం వచ్చిన ఒక అమ్మాయిని పట్టుకున్నారు.


ఆ అమ్మాయి వచ్చింది - అమ్మని, నాన్నని అడిగింది - "ఏం బొమ్మ వేయనూ?", అని.
అమ్మ-నాన్న కలిసికట్టుగా, కూడబలుకుగా "నేనెరుగ నేనెరుగ - మా జింకనడుగు " అన్నారు.


అన్న గంతులేసుకుంటూ చెప్పాడు - ఆటలాడుకునే స్నూపీ, వుడ్ స్టాక్ - బొమ్మలు కావాలని.
తెల్లగా వుండే స్నూపీ , ఎల్లోగా వుండే వుడ్ స్టాక్ - వెల్లవేసిన గోడలమీద - వెలవెలలాడతారు కదా! అందుకని నీలపు ఆకాశంలో ఆడుకుంటున్నట్టు కావాలన్నాడు.


అంతే! గోడలేమయ్యాయో మీరే చూడండి మరి!!!

NASCAR మంచాన్నే కారులా నడిపేయడానికి ముస్తాబయిన స్నూపీ







బంతి గురించి ఊహిస్తూ, బంతాడుతూ, బంతుల నడుమ - చీర్-లీడరైన వుడ్ స్టాక్






క్లోజెట్ కి అటూ ఇటూ నుంచుని హాకీ ఆడుతున్న స్నూపీ - వుడ్ స్టాక్






స్కేట్ బోర్ద్ మీద స్నేహితులు - బంతాడుతూ స్నూపీ




టెన్నిస్ ఆడుకుంటూ .... 





పదకొండేళ్ల తర్వాత... ఇప్పుడు

అన్న ఎదిగాడు - ఇంకా ఎదిగించే చదువుల బడికి వెళ్లాడు
పదకొండేళ్ల క్రితం కన్నుల వెలిగిన ఇంకొక దీపం - అన్నెడబాటుకి బెంగిలి చిన్న బుచ్చుకున్నాడు
మళ్లీ నాన్న మంత్రం వేయాల్సివచ్చింది
ఇంకేం - ఇంకొక రంగుల-బొమ్మల-కారిణిని పిలుచుకొచ్చారు

ఈసారి తమ్ముడి వంతు - బొమ్మల ఎంపిక
శలవులకి ఇంటికి వచ్చిన అన్న అయ్యాడు - తమ్ముడికి బొమ్మల-కన్సల్టెంట్ 
తమ్ముడు  కావాలన్నాడు - బుజ్జి కాల్విన్ చారల హాబ్స్ తోడుగా 
అన్న వేశాడు ఆమోదముద్ర - అంతకన్నా హుషారుగా 

మరి - వాళ్లిద్దరూ ఎన్నిసార్లు చదివారో లెక్కే లేదు - మూడు వాల్యూముల - ఒక్కొక్కటి ఐదేసి వందల పేజీల కాల్విన్ & హాబ్స్ అల్లరి కథలు 
ఇంట్లో ఒక - చిన్నదేమిటి - ఒక పెద్ద సైజు డిజైన్ సెషనే నడిచింది - ఆ పుస్తకాల్లోని ఏ బొమ్మలని గోడకెక్కిద్దామా అని 
మొత్తానికి బొమ్మల ఎంపిక పూర్తయింది 
ఈసారి మంచు రంగు గోడలమీద వేయిద్దామని అనుకున్నారు 

అదుగో...కాల్విన్ & హాబ్స్ - మా బుజ్జి-జింక కలలాంతఃపుర కుడ్యారోహులైన వైనం 

ఎడమ పక్క గోడ కింద మొదలుపెట్టి కుడి గోడ కిందుగా పూర్తయిన నాట్య విన్యాసం (from Book#3 - Pg.351) 




వేసవి కాలపు సరదాలలో కాలవ మీదుగా నడుస్తూ (from Book#1 - Pg. 144)




శిశిరపు రంగులలో హంగులు పోతూ (from Book#1 - Pg. 133)






వాక్-ఇన్ క్లోజెట్ లో - ఒకరికొకరుగా - సేదతీరుతూ 




చివరిగా - కొత్త ప్రారంభానికి ఎదురుచూస్తూ .... (from Book#3 - Pg. 481)

ఇది Bill Watterson వేసిన ఆఖరి కామిక్ స్ట్రిప్ - మా బుజ్జి-జింకలకి - ఇద్దరికీ అతి ఇష్టమైనది :) 



ఆటల పాటల అలిసి
చదువూ-సంధ్యల సొలిసే
బుజ్జి-జింకల కలలు నిండిన కళ్ళు తెరవగానే
ఆ కలల కొనసాగింపుగా - కనులకింపుగా వుండాలని 
కలల-గదులకి రంగుల-హంగుల ముస్తాబు చేసి ఇచ్చేశారు - అమ్మా-నాన్న...



16 కామెంట్‌లు:

  1. "కలల-గదులకి రంగుల-హంగుల ముస్తాబు" చాలా చాలా బాగుందండి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చదివి, చూసి మెచ్చిన మీకు కూడా చాలా చాలా థాంక్స్!

      తొలగించండి
  2. Lalli Bujji jinkala kalala anthapura kudyalu chala bagunnayi. 👌👌
    -Pappi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కదా - నువ్వొచ్చి చూస్తే ఇంకా ఎంత బావుంటుందో :)!!

      తొలగించండి
  3. నేను గోడలకి కలర్స్ వేస్తానండీ...ఇలా బొమ్మలు వేయడం నేర్చుకోవాలి. అన్న సెలెక్ట్ చేసినవే (పాతవి) నచ్చేసాయ్.సింపుల్‌గా ఉండి ఎట్రాక్టివ్ గా ఉన్నాయి. ఒకే గదిలో ఎన్నో బొమ్మలతో నింపేస్తే పిల్లలు ఇష్టపడతారేమో తెలియదు.

    మీ స్నూపీని చూసాక నాక్కూడా పెయింటింగ్ పైకి మనసుపోయింది.హాల్ లో ఒక గోడ ఖాళీగా పిలుస్తోంది కూడానూ....ఎలా వేసారు ? కొన్ని టిప్స్ చెపుతారా ? స్టిక్కర్ లాంటిది తెచ్చి అంటించారా ? చేత్తో డ్రా చేసారా ? క్రియేటివ్ ఐడియా కదా ?

    రిప్లయితొలగించండి
  4. మా బొమ్మల గదులని మెచ్చినందుకు మీకు థాంక్స్!
    ఆ బొమ్మలు ప్రొఫెషనల్ పెయింటర్స్ (ఇద్దరు వేరే-వేరే వాళ్లు) వేశారండీ! వాళ్లు చేత్తో బొమ్మలు గీసి తరవాత రంగులు వేశారు.

    రిప్లయితొలగించండి
  5. చాలా ....చాలా ....బోల్డంత బాగున్నాయ్ బుజ్జి బొమ్మలు మీ రంగుల మాయ బావుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా రంగుల బొమ్మల మాయను మెచ్చిన నీకు బోల్డన్ని థాంక్స్, హనుమాన్!

      తొలగించండి
  6. Print quality paintings!! Just beautiful!
    మీ అక్షయ తూణీరం లో మాటల మంత్రదండాలు, పాటల మంత్రదండాలు, ప్రేమాస్త్రాలు ఇంకా ఏమేమి ఉన్నాయో! :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Yes - especially the Calvin & Hobbes ones - she did an excellent job!

      చిన్న సవరణ - మా "అక్షర" తూణీరం లో వున్నవి "ప్రేమంత్ర" దండాలు - జుయ్ అని గాలిలో తిప్పితే అడిగినవీ, అప్పుడప్పుడూ అడగనివీ కూడా ఇచ్చేవి - గుచ్చే అస్త్రాలు కావు ;)

      తొలగించండి
  7. Colors kunula panduga .....Madhura gnapakalu manasuku panduga. Nice choice.
    -Mani

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. మా బొమ్మల గోడలను మెచ్చినందుకు, వచ్చి చెప్పినందుకు - మీకు చాలా థాంక్స్ అండీ - పవన్ కుమార్ రెడ్డి గారు!

      తొలగించండి
  9. Enjoyed the write-up... The pics on the walls, even more! I personally and sincerely believe that kids who like and can relate to Peanuts/ Snoopy, Pooh bear and Calvin turn out to be wonderful human beings!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. You're right! Snoopy, Pooh, Calvin & Hobbes let the kids have an unadulteratedly-innocent-world-of-imagination. Sometimes I get lost there too - with my mind refusing to accept my own grown-uppity ;)

      తొలగించండి