అదె కన్నీరాయె
నొచ్చిన కంట - పాట అదె... కన్నీరాయె
అదె పన్నీరాయె
నవ్విన చోట - పాట అదె ... పన్నీరాయె
పాట అదె కన్నీరాయె - పాట అదె పన్నీరాయె
***
అదె పల్లవించె
పలికిన గొంతులో - పాట అదె ... పల్లవించె
అదె పలకరించె
పిలిచిన గుండెతో - పాట అదె ... పలకరించె
పాట అదె పల్లవించె - పాట అదె పలకరించె
***
అదె సోకిపోయె
విన్న చెవుల - పాట అదె ... సోకిపోయె
అదె తాకిపోయె
ఉన్నపాటున ఎదను - పాట అదె ... తాకిపోయె
పాట అదె సోకిపోయె - పాట అదె తాకిపోయె
***
అదె వీడిపోయె
పెదవి దాటి - పాట అదె ... వీడిపోయె
అదె ఉండిపోయె
ఎదల మాటు - పాట అదె ... ఉండిపోయె
పాట అదె వీడిపోయె - పాట అదె ఉండిపోయె
***
అదె మేలుకొలిపె
ఆదమరిచిన పూట - పాట అదె... మేలుకొలిపె
అదె జోల పలికె
అలసి సొలసిన వేళ - పాట అదె... జోల పలికె
పాట అదె మేలుకొలిపె - పాట అదె జోల పలికె
***
*********************
*********************
నా కిష్టమైన పాటొకటి .
చిన్నప్పుడు పాపగా - అమ్మ నాకు పాడగా విని నేర్చుకున్నది.
బడిలో చదువునేటప్పుడు నాకు నేనుగా పాడుకున్నది.
ఆ తర్వాత నేనమ్మనయ్యాక నా పాపడికి జోలగా పాడుకున్నది.
ఈ పాట వినడం, నేర్చుకోవడం, పాడుకోవడం, పాడడం - ఇన్ని కార్యక్రమాలతో చుట్టూ ఉన్న వాళ్ళను నా పాటలతో పాట్లు పెడుతున్న సమయం లోనే నాకంత ఇష్టమైన తీయతీయని తెలుగు పాటకు ఓ హిందీ-కవల వుందని ఎప్పుడో డిగ్రీ చదివే రోజుల్లోనే తెలిసింది. అప్పట్నుంచి ఆ కవల-పాట పని కూడా పట్టేస్తూ ఉండేదాన్ని.
ఇన్ని రోజులకి ఆ రెండిట్నీ నా బ్లాగుకెక్కించే వీలు కుదిరింది.
మొట్టమొదటగా అసలు సిసలైన హిందీ పాట గురించి.
పాటేమో ...తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే... చష్మ్-ఏ-బద్దూర్ ...
సినిమా "ససురాల్". ఇదేమో మన తెలుగు సినిమా "ఇల్లరికం" కి హిందీ కవల.
తెలుగులో ఏఎన్నార్ హీరో.
తిరుగాడుతూ, పాడే హీరో ఎవరంటే ట్రాజెడీకింగ్ అన్న ట్రాకూ, టాకూ వున్న రాజేంద్ర కుమార్. కానీ ఈ పాటలో నవ్వుతూ హుషారుగానే కనిపిస్తాడు.
పాట వింటూ పరుగాడే హీరోయిన్ను ముద్దుముద్దు మాటల బి. సరోజాదేవి. సల్వార్-కమీజ్ మీద నెక్కుకి జాలరు-నెక్లెస్సూ, నడుముకి సన్నటి వడ్డాణం పెట్టుకుని ముద్దుగానే వుంది.
పాట మనోరంజనంగా పాడినవారు రఫీ సాబ్.
పాటను జన-మన-రంజకంగా కట్టినవారు శంకర్-జైకిషన్ జంట.
పాట రాసినవారు - హస్రత్ జైపురి.
సందర్భాన్ని బట్టి చూస్తే ఈ పాట తెలుగు "ఇల్లరికం" లో ఎక్కడి దొంగలు అక్కడనే గప్-చుప్ అనే పాటేమో అనిపించింది నాకు.
ఈ పాటలో నాకు చాలా ఇష్టమైన లైను:
దేఖా న కరో తుమ్ ఆయినా - కహీ ఖుద్ కీ నజర్ న లగే...
ఈ వాక్యం రాస్తున్నంత సేపూ నాకొకటే అనిపించింది - తెలుగులో కూడా అచ్చు పక్కన అచ్చు పెట్టి రాద్దామా అని - ఆఇనా - అని. అది నాకే చదవడానికి బాగా అనిపించక ఆయినా అని రాశాను.
ఈ వాక్యం రాస్తున్నంత సేపూ నాకొకటే అనిపించింది - తెలుగులో కూడా అచ్చు పక్కన అచ్చు పెట్టి రాద్దామా అని - ఆఇనా - అని. అది నాకే చదవడానికి బాగా అనిపించక ఆయినా అని రాశాను.
అలాగే - ఈ వాక్యం వింటున్నంత సేపూ నాకు ఇంకో మంచి తెలుగు పాటలో లైన్లు గుర్తుకొచ్చాయి.
అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయసీ!
అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి...
ఆ తెలుగు పాట కూడా ఈ బి. సరోజాదేవి గురించే. అమరశిల్పి జక్కన్న సినిమాలో ఏఎన్నార్ (ఘంటసాల) పాడిన నిలువుమా నిలువుమా నీలవేణీ పాట అది.
హిందీ లోనూ, తెలుగు లోనూ బి. సరోజాదేవిని చూసి హీరోలిద్దరూ ఒకటే మాట - భాషేదయినా... అద్దమయినా, आइना అయినా - అదేదయినా నిన్ను చూసి నువ్వే అసూయ పడకు, దిష్టి పెట్టుకోకు - అంటూ.
భలే కదా!
మరి ఆ హిందీ పాట కంటూ, వింటూ, మీరూ అంటూ ... మురియుడి!
తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
ముఖ్‌డే కో ఛుపా లో ఆంచల్ మే - కహీ మేరీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
ముఖ్‌డే కో ఛుపా లో ఆంచల్ మే - కహీ మేరీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
యూ న అకేలే ఫిరా కరో - సబ్‌కీ నజర్ సే డరా కరో
యూ న అకేలే ఫిరా కరో - సబ్‌కీ నజర్ సే డరా కరో
ఫూల్ సే జ్యాదా నాజుక్ హో తుమ్ - చాల్ సంభల్‌కర్ చలా కరో
జుల్ఫోం కో గిరా లో గాలోం పర్ - మౌసమ్ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే -
చష్మ్-ఏ-బద్దూర్ ...
ఏక్ ఝలక్ జో పాతా హై - రాహీ వహీ రుక్ జాతా హై
ఏక్ ఝలక్ జో పాతా హై - రాహీ వహీ రుక్ జాతా హై
దేఖ్‌కే తేరా రూప్ సలోనా - చాంద్ భీ సర్ కో ఝుకాతా హై
దేఖా న కరో తుమ్ ఆయినా - కహీ ఖుద్ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
దిల్ మే చుభే వో తీర్ హో తుమ్ - చాహత్ కీ తక్‌దీర్ హో తుమ్
దిల్ మే చుభే వో తీర్ హో తుమ్ - చాహత్ కీ తక్‌దీర్ హో తుమ్
దిల్ మే చుభే వో తీర్ హో తుమ్ - చాహత్ కీ తక్‌దీర్ హో తుమ్
కౌన్ న హోగా తుమ్ సే దీవానా - ప్యార్ భరీ తస్‌వీర్ హో తుమ్
నిక్‌లా న కరో తుమ్ రాహోం పర్ - ఔరోం కీ నజర్ న లగే...
నిక్‌లా న కరో తుమ్ రాహోం పర్ - ఔరోం కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్...
*********************
తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
ముఖ్‌డే కో ఛుపా లో ఆంచల్ మే - కహీ మేరీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
*********************
ఇహ ఇప్పుడు తెలుగు పాట గురించి.
తెలుగు సినిమా పేరు ఖైదీ కన్నయ్య.
పాట రాసిన వారు జి. కృష్ణమూర్తి.
పాటకు తెలుగులో మ్యూజిక్ కొట్టినవారు రాజన్-నాగేంద్ర.
పాటకు తమాషాగా ఆడినవారు రాజసులోచన, ఎవరో ఒక చిన్నబాబు.
బుజ్జిబుజ్జి పాపలకి ఈ పాట పాడుతూ - అర్థం కూడా చెప్తే చాలా బావుంటుంది.
చదువెందుకు చదవాలో...
గొడవెందుకు చేయకూడదో...
బ్రతుకులో ఎలా గెలవాలో - చిన్నచిన్న మాటల్లో ఎంతో గొప్పగా రాసిన పాట ఇది.
ఇప్పటికీ నాకు నేను చెప్పుకుంటూ పాడుకుంటుంటా.
ఈ పాటను కూడా - కంటూ, వింటూ, మీరూ అంటూ ... మరిమరి మురియుడి!
తియతీయని తేనెల మాటలతో- తీస్తారు సుమా గోతులు...
నమ్మవద్దు...
తెలియని చీకటి తొలగించి - వెలుగిచ్చేది చదువే సుమా...
మానవద్దు...
దొంగల చేతికి దొరకనిది - దానము చేసిన తరగనిది
దొంగల చేతికి దొరకనిది - దానము చేసిన తరగనిది
పదుగురిలోన పరువును పెంచి - పేరు తెచ్చే పెన్నిధది
పాఠాలన్నీ చదివేస్తాను - ఫస్టుగ నేను పాసవుతా...
శభాష్
తియతీయని తేనెల మాటలతో- తీస్తారు సుమా గోతులు...
నమ్మవద్దు...
అల్లరి చేయుట చెల్లనిది - ఎల్లపుడాడుట కూడనిది
అల్లరి చేయుట చెల్లనిది - ఎల్లపుడాడుట కూడనిది
ఏడువరాదు ఏమఱరాదు - ధీరునివలెనే నిలవాలి
బెదరను నేను అదరను నేను - ఏదెదురైనా ఎదిరిస్తా...
శభాష్!
తియతీయని తేనెల మాటలతో- తీస్తారు సుమా గోతులు...
నమ్మవద్దు...
బ్రతుకను బాటను కడదాకా - నడచియె పోవలె ఒంటరిగా
బ్రతుకను బాటను కడదాకా - నడచియె పోవలె ఒంటరిగా
ఇడుములు రానీ పిడుగులు పడనీ - నీ అడుగులుతడబడునా?!
పిడుగులు పడినా జడవను నేను - వడివడిగా నే అడుగేస్తా...
శభాష్!
తియతీయని తేనెల మాటలతో- తీస్తారు సుమా గోతులు...
నమ్మవద్దు...
*********************
పాడుకున్న పాటలు నెమరేసుకుంటూ ...
అదె మేలుకొలిపె
ఆదమరిచిన పూట - పాట అదె... మేలుకొలిపె
అదె జోల పలికె
అలసి సొలసిన వేళ - పాట అదె... జోల పలికె
పాట అదె మేలుకొలిపె - పాట అదె జోల పలికె
... అనుకుంటూ... ఇక్కడే ఉంటా...
~ పాటల భైరవి
మేలు కుంటే పాట,
రిప్లయితొలగించండిఏలుకుంటే పాట,
చేదుకుంటే,పాట,
మాదేవుడు,,,,, అని,
పాట మన జీవితాల్లో
పేటలా పెనవేసుకు పోయింది.
అమ్మ జోల పాట, తో మొదలు
పెట్టి, పాటకు మనలో ఊపిరి,పోస్తుంది.
తరువాత పాట మన జీవితం
లో ఒక భాగమైపోతుంది.
ఆఖరుకి పెళ్ళిచూపుల్లో కూడా
అమ్మాయి కి పాడటం వచ్చా,
అని పెళ్ళివారు, అడగడం
కూడా, చాలా,కామన్ పాయింట్ అయిపోయింది.
అలాంటప్పుడు, మీ బోలెడన్ని
కబురుల్లో, పాటలేకుంటే, మజా ఏముంది.
మీ, సరోజా ఆంటీ.
నా పాటల రాతల గురించి మీ మాటలు నాకు బోల్దు నచ్చాయి. థాంక్స్, సరోజాంటీ!
తొలగించండిభలే!
రిప్లయితొలగించండిపాటలు సరే..మణిరత్నం సినిమా కన్నా దానికి ప్రాణం పోసే ఇళయరాజా రీరికార్డింగ్, పాటల్లా - అసలు పాటల కన్నా వాటి ముందూ వెనుకలు - ఈ పోస్ట్‌లో ముందూ వెనుకలు - (పాటల back & fore గ్రౌండులు కాదు) - అతి అద్భుత మాయ :-)
ముందూ వెనుక..ఏదో రాద్దామని ..వీరతాడు ప్రయత్నం.
ఖైర్..
ఐనా ,ఆ హిందీ ఆయన ఆయినా కన్నా ఈ బుద్ధి చదువుల పాట ఇంకా భలే ఉంది - with all due respects to B. SarojaaDevi's beauty and to the song.
పునరావృత్తి... Prologue and conclusion..just what I look forward very dearly for!!
మీ పొగడ్త నాకు పొగడపూల వానే!
తొలగించండిమనసుకు హత్తుకునే పాటలు ఎలా మర్చిపోతాము? మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నావు, లల్లీ! నా బంగారుతల్లి! - Mohini Aunty
రిప్లయితొలగించండిమీవి బంగారు మాటలు, మోహిని ఆంటీ!
తొలగించండి