సీ|| శ్రీమనోహర! సురార్చిత సింధుగంభీర
భక్తవత్సల కోటిభానుతేజ
కంజనేత్ర హిరణ్యకశ్యపాంతక శూర
సాధురక్షణ శంఖచక్రహస్త
ప్రహ్లాదవరద పాపధ్వంస సర్వేశ
క్షీరసాగరశాయి కృష్ణవర్ణ
పక్షివాహన నీలభ్రమరకుంతలజాల
పల్లవారుణపాదపద్మయుగళ
భక్తవత్సల కోటిభానుతేజ
కంజనేత్ర హిరణ్యకశ్యపాంతక శూర
సాధురక్షణ శంఖచక్రహస్త
ప్రహ్లాదవరద పాపధ్వంస సర్వేశ
క్షీరసాగరశాయి కృష్ణవర్ణ
పక్షివాహన నీలభ్రమరకుంతలజాల
పల్లవారుణపాదపద్మయుగళ
తే|| చారుశ్రీచందనాగరుచర్చితాంగ
కుందకుట్మలదంత వైకుంఠధామ
భూషణవికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
కుందకుట్మలదంత వైకుంఠధామ
భూషణవికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
ఇదే కదా నాన్నా - మీరు నాకు జోలపాటగా పాడింది - మొన్న మొన్నటిదాకా బాలు, సాయిలకి వినిపించింది?
నా బుజ్జిజింకలకి నిద్ర పుచ్చేవేళ లాలిపాటగా పాడినా, ఇప్పటికీ నాలో నేను పాడుకుంటున్నా, మృదు మేఘధ్వని లాంటి మీ గొంతులో విన్నఆ నృసింహ శతక పద్యాలు ఎక్కడ విన్నా ఇది మా నాన్న పాట అని మురిసిపోతుంటాను.
దాదాపు వారానికి నాలుగు రోజులు మీతో మాట్లాడుతూ ఉంటానా - అయినా ఇంకా ఏదో మీతో చెప్పాల్సిన కబురేదో మిగిలివుందేమో అనిపిస్తూ వుంటుంది.
ఆగండి - కొంచెం - గుర్తు తెచ్చుకోనీండి నన్ను - మీరూ మీ హడావిడీ! - చెప్పాలనుకుంటున్నదేదో చెప్పేయ్ - ఇంకెందుకాలశ్యం - అంటూ నన్నలా కంగారు పెట్టకండి.
అమ్మ చెప్తూ ఉంటుంది - మీకసలు గోదావరి దాటి రావడం ఇష్టం ఉండేది కాదట కదా - గోదావరి దాటివెళ్తే గడ్డి తినాలి అనేవారట కదా! మీ మెడికల్ షాపులో వచ్చినదంతా లాభమే అనుకుని అసలు, లాభం అప్పుడే పుట్టిన నా బేబీ పౌడర్లకి, గౌన్లకి - ఖర్చుపెట్టేస్తే మరి ఎలా? మిమ్మల్ని ఆ గోదావరి దాటించింది - నేనేనేమో అనిపిస్తుందిప్పుడు నాకు!
మీకు గుర్తుందా - మనం గణపవరంలో కరణంగారి మేడ మీద ఒక్క గదిలో వున్నప్పుడు - తెల్లవారు ఝామునే నాలుగింటికి ఏడుస్తూ లేచేదాన్ని. పాపం - అమ్మ - పుట్టినదాదిగా కొబ్బరి చెట్లు, గోదావరి గట్లు, అన్నావదినల, అక్కాచెల్లెళ్ల మధ్య అబ్బరంగా పెరిగొచ్చింది కదా - ఆ గుంటూరు జిల్లాలో ఆ పల్లెటూళ్లో - ఊరి చివరికి వెళ్లి తెచ్చుకుంటేనే కానీ మంచి నీళ్లు దొరకని చోట - అలవాటులేని పనితో అవస్థ పడుతోందని - ఆవిడని లేపకుండా మీరు లేచి - ఆ నాలుగింటికి అన్నం కలిపి నాకు తినిపించేవారు.
మీకు ఖాళీ వున్నప్పుడు, సెలవు రోజుల్లో సరదాగా ఆడించేవారు - నాతో ఆడేవారు. ఒకసారి నా ఐదేళ్ళప్పుడు ఆ ఆట శృతి మించి నేను మీతో ఏదో అరువు-దెబ్బలాడి మీరు తెచ్చిన బిస్కెట్ పేకెట్ విసిరేసి - ఈ గౌను కూడా తీసేస్కో - అని అరుస్తూ వుంటే నా వీపు మీద పడ్డ మీ ఐదు వేళ్ల ఎర్రటి అరచెయ్యి ముద్ర - అది అదే మొదలు, అది అదే ఆఖరు - నాకు గుర్తుండి. ఇంకెప్పుడూ అలా చేయకూడదనుకుని మీకు మీరే ఒట్టు పెట్టుకున్నట్టుగా - నేను మీకెంత కోపం తెప్పించే పనులు చేసినా నన్ను పల్లెత్తు మాట అనలేదు ఈ రోజు దాకా!
అవును నాన్నా! మీకు జ్ఞాపకం ఉందా - ఒకసారి మనింటికి మీ ఆఫీసు వాళ్లు ఎవరో మీకోసం వచ్చారు. మీరారోజు ఇంట్లో లేరు. వాళ్లు - చిన్నపిల్లని కదా - నాతో ఒక రెండు పాటలేవో పాడించుకుని (ఆ పాటలు ఇప్పటికీ గుర్తే నాకు - ఒకటి రంగుల రాట్నంలోని -నడిరేయి ఏ ఝాములో స్వామి నిను చేర దిగివచ్చునో, ఇంకోటి భక్త తుకారాం లో - ఘనాఘన సుందరా), నన్నెందుకడిగారో తెలీదు - మీ నాన్నేం చేస్తాడు కంపెనీ లో - అంటే - నాకు నోటికొచ్చిన ఒకే ఒక మాట - అకౌంటెంట్ - అని చెప్తే - వాళ్ళు గట్టిగా నవ్వి - "అదేం కాదు - గుమస్తా "- అని అనేసి వెళ్లిపోయారు. ఆరోజు సాయంత్రం మీకు ఎప్పటిలాగే మీకు చెప్పే నా ఆరోజు-కబుర్లలో మీకది చెప్తే దానికే మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా నాతో సరదా కబుర్లు చెప్తూ ఆడేసుకున్నారు.
అలాగే ఇంకోసారి - ఆఫీసులో అందరూ వనభోజనాలు plan చేసుకుని - ఒక పెద్ద van మాట్లాడుకుని - పొద్దున్నే నాలుగింటికి లేచి మనమందరం తయారయ్యాక - వచ్చి - బాబీ! అందరం van లో సరిపోము. మీరు రావొద్దు - అని చెప్తే చిన్నపిల్లలం నేను, కుట్టి యేడ్చినది నాకు గుర్తుంది కానీ మీరెప్పుడూ ఏమీ అనలేదు, ఆ తర్వాతెప్పుడూ అది తలుచుకుని మీరు బాధ పడ్డట్టు నాకు గుర్తు కూడా లేదు. అది మీకున్న వరం - నాన్నా! మీరెప్పుడూ మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ల మాటలని గుర్తు పెట్టుకోరు.
ఆ తర్వాత ఏడాదికి ఆరు నెలలు మిమ్మల్ని చూడడానికే వుండేది కాదు - బొంబాయని, మైసూరు సీజన్ అని వెళ్లి పోతూ వుండేవారు. ఈలోగా జంగారెడ్డిగూడెం ట్రాన్స్ఫర్ అన్నారు. పెద్దాడ రామచంద్రరావుగారి ఇంటికి ఎదురుగుండా ఉండే తాతగారి ఇంట్లో అద్దెకుండే వాళ్లం. రామచంద్రరావుగారి భార్య సరోజినీదేవిగారు, వాళ్ల అబ్బాయిలు - నవీన్, సుధీర్ - మనకి బోల్డన్ని సీతాఫలాలు ఇచ్చేవారు - వాళ్ల తోటలోవి.
జంగారెడ్డిగూడెంలో వున్నప్పుడు పొద్దున్న మేము లేవకుండా ఆఫీసుకి వెళ్లే మీరు రాత్రి మేము పడుకున్నాక ఇంటికి వచ్చేవారు. నెలకొకసారి తప్పకుండా మమ్మల్ని జీప్ లో ద్వారకాతిరుమలలో వేంకటేశ్వరస్వామి గుడికో, జీలకర్రగూడెంలో వున్న శిధిలమైన కోటలో, ఎర్రకాలవ పక్కన మద్ది ఆంజనేయస్వామినో - చూపించడానికి తీసుకెళ్లేవారు. అలా జీప్ డ్రైవ్ చేస్తున్న మిమ్మల్ని చూసి నాన్నమ్మ ఎంత మురిసిపోయేవారో కదా :) ప్రతీ దసరాకి మీ ఆఫీసులో కార్లు, జీపులు, లారీలు - అన్నిటికీ ఆయుధ పూజ చేయించేవారు మీరు.
అవును కదూ - జంగారెడ్డిగూడెం వచ్చేటప్పటికే మిమ్మల్ని ఇంతకు ముందు తక్కువచేసిన అందర్నీ దాటివచ్చి ఉద్యోగంలో చాలా మెట్లెక్కేసి వున్నారు - కానీ ఎప్పుడూ కూడా మళ్లీ వెనక్కి చూసుకున్నది లేదు. అప్పటిదాకా నడక మాత్రమే తెలిసిన మీరు నడిచింది లేదు.
తర్వాత మీకు కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. జగన్నాథపురంలో - గరిమెళ్ల సుబ్బారావు గారి ఇంట్లో ఉండేవాళ్లం. అప్పుడే కదా - స్వప్న థియేటర్ లో - ఏమో పిల్లలకి బాగుండదేమో అని - అమ్మ, మీరు మాత్రం వెళ్లి - శంకరాభరణం చూసి వచ్చి- అయ్యో! ఇంత మంచి సినిమా పిల్లలకు చూపించాల్సిందే అని - అదే రోజు సాయంత్రం మమ్మల్ని తీసుకుని వెళ్లి మళ్లీ మాతో చూశారు. అప్పట్నుంచీ ప్రతి కె. విశ్వనాధ్ సినిమా అందరం కలిసి చూడడం మన family tradition లా మారింది.
కాకినాడ అయితే ఇంటికి దగ్గరగా ఉంటాము - పిల్లలకి చదువులకి బావుంటుంది అని - అమ్మ, మీరు అనుకునేంతలో - మీకు టంగుటూరు ట్రాన్స్ఫర్.
ఎక్కడి గోదావరి జిల్లా - ఎక్కడ ప్రకాశం జిల్లా! కానీ ఎలాంటి బెంగా లేకుండా - అమ్మ చెప్పినట్టు "జై-పరమేశ్వరా" అనుకున్నట్టు - టంగుటూరు చేరాము - ముందు కొన్ని రోజులు కొండలరావు గారి ఇంట్లో వుండి , తర్వాత స్కూలుకి దగ్గరగా వుండాలని కొణికి వెంకట శేషయ్య గారి ఇంటికి మారాము.
టంగుటూరులో వున్న నాలుగేళ్లు - ఆ ఊళ్లో తీసుకెళ్లడానికి పార్క్ కానీ , మాకు వేరే వ్యాపకం కానీ లేవని - ప్రతీ వారం మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లేవారు - పరీక్షల రోజుల్లో కూడా మానకుండా.
అసలు నేను పరీక్షలకి ఎప్పుడయినా భయపడుతుంటే - "క్లాస్ లో పాఠం విన్నావు కదా - నీకు బాగానే గుర్తుంటుందిలే - పద - అలా సినిమాకి వెళ్లొస్తే మైండ్ ఫ్రెష్ గా అయ్యి పరీక్ష బా రాస్తావు" అని సినిమాకు తీసుకెళ్లేవారు. నా తెలివితేటల మీద నాకన్నా మీకు నమ్మకం ఎక్కువ.
టంగుటూరులో వున్న నాలుగేళ్లలో ఒంగోలు, సింగరాయకొండ, పాలేరు దగ్గర వనభోజనాలు - మీతో సరదా ప్రయాణాలు. సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నెలకొక్కసారైనా తీసుకెళ్లేవారు. వెళ్లినప్పుడల్లా హుండీలో డబ్బులు వెయ్యొద్దు - పూజారిగారు తెచ్చే పళ్లెంలో వేయమనేవారు మీరు. అలా ఎందుకు నాన్నా అనడిగితే హుండీలో వేస్తే ధర్మకర్తలకి వెళ్తాయి, పళ్లెంలో వేస్తే ఆ పేద బ్రాహ్మణులకి కొంచెమన్నా సహాయం చేసినట్టవుతుంది చెప్పేవారు. అది నేనిప్పటికీ అనుసరిస్తూనే వున్నాను.
టంగుటూరు తర్వాత మీ బదిలీ - మన మజిలీ గుంటూరు. మీరు అంతగా ట్రావెల్ చేసేవారు కాదు. ప్రతీ రోజు సాయంత్రం మాతోపాటు కూర్చుని పాలు-చేలు తో మొదలుపెట్టి తొమ్మిదిన్నరకి వచ్చే ఇంగ్లీష్ న్యూస్ దాకా టీవీ చూస్తూ కబుర్లు చెప్తూ ఉండేవారు. మా ముగ్గురిని - అతివాది, మితవాది, తీవ్రవాది - అని మీరే ముద్దుగా వర్గీకరించేసి - సినిమాలు, రాజకీయాలు మాతో డిస్కస్ చేస్తూ ఉండేవారు. మీకు గుర్తుందో లేదో - ఒకసారి మన ఇంటిపక్క లాయరంకుల్ ఎలా మాట్లాడతారు అని కుట్టి ఇమిటేట్ చేసి చూపిస్తూ ఉంటే - పెద్దవాళ్ల గురించి అలా హేళనగా మాట్లాడకూడదు, పక్కింటి వారి విషయాలు చిన్నపిల్లలు మీరు పట్టించుకోకూడదు - అని కొంచెం గట్టిగానే చెప్పారు. అది నేను మీ దగ్గర నేర్చుకున్న ఇంకో మంచిపాఠం.
ఏసీ కాలేజ్ లో డిగ్రీ కాగానే తిరుపతి హాస్టల్లో చదువు. ఆ టైం లో నేను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని - మీరే నా స్నేహితులేమో అన్నట్లు విని - వాటి వల్ల మీరు ఎంత బాధ, టెన్షన్ పడ్డా - అవేమీ నాకు తెలియనీయకుండా - నన్నూ, నాతో పాటు నామీద నాకు నమ్మకాన్ని పెంచుతూ - నా పిల్లల్ని నేను పెంచితే ఇలాగే పెంచాలి అనిపించేలా - ఎప్పటికప్పుడు నాకు వెన్నుదన్నుగా నిల్చిన మీకు - ఇదిగో ఇప్పటికి ఇలా చెప్పగలుగుతున్నాను. నాకిప్పటికీ గుర్తు - ఆడపిల్లవి నేను చెప్పినట్టు వినాల్సిందే అని అరిస్తే భయపడతాననో - లేకపోతే - నాతో మాట్లాడకుండా మౌనంగా వుండి సాధిస్తే మాట వింటాననో - ఇలా మామూలుగా పెద్దవాళ్లు వాళ్ల పిల్లలు తమ మాట వినేలా చేయాలంటే ఏం చేస్తారో అలాంటివేవీ లేకుండా - మీరు, అమ్మ - నా నిర్ణయాలన్నింటినీ సపోర్ట్ చేశారు కాబట్టే - నేనీరోజు ఇంత కాన్ఫిడెంట్ గా వున్నాను.
ఇవన్నీ ఒక ఎత్తు - మూడు పదులు నిండకుండానే - అసలే దానికి లెక్కలంటే ఇష్టం లేదు కదా - నూరేళ్లని లెక్క తప్పేసేసుకుని - అదెళ్లిపోతే - దానాయుష్షు కూడా నాకే ఇచ్చి వెళ్లింది - అని దాని పిల్లల కోసం మీరు ఆరోగ్యంగా వుండాలి - అని - మీ ఆహారపు అలవాట్లు ఎంత మార్చుకున్నారో నాకు తెలుసు. దాదాపు పదహారేళ్లుగా "పొద్దున్న ప్రకృతి - రాత్రి వికృతి" అనుకుంటూ ఆరోగ్యం-నా భోగ్యం అన్నట్లుండడం మీకే చెల్లింది సుమా !
ఒక్క మాట నాన్నా! ఇప్పుడు కాదు కానీ - కొంచెం చిన్నప్పుడు - మీరు-అమ్మ మీ
పిల్లలమయిన మాకోసమైనా కొంచెం స్వార్థంగా వుంటే - బాగుండును అనుకున్న రోజులు
వున్నాయి కానీ - అది మీకు నప్పదు అని నాకెప్పుడూ తెలుసు. అందుకే
ఎప్పటిలాగే - అందరి గురించి ఆలోచిస్తూ - మీరు మీదైన పద్ధతిలో మీకు నచ్చిన విధంగా తీసుకునే నిర్ణయం ఏదయినా నాకు సమ్మతమే!
అయిన వారి
దగ్గర, కావాలనుకున్నచోట - దూషణ భూషణ అంగీకార తిరస్కారాలని ఒకేలా
తీసుకోవడం మిమ్మల్నే చూసి నేర్చుకున్నాను. మనం చేసేది అందరికీ నచ్చాలని
లేదు - అందరూ మనకి నచ్చినవే చేయాలనుకోకూడదు - అలాగని ఎవ్వరినీ వదులుకోకూడదు
- ఇదీ నేను మీ దగ్గర నేర్చుకున్న గొప్ప జీవిత పాఠం.
మామూలుగా మన ఇండియాలో - నాన్నా! - ఎవరినైనా విమర్శించాలంటే పదిమంది మందిలో వున్నా ఆలోచించకుండా మాటనేస్తారు - అదే పదిమందిలో మంచి మాట చెప్పాలంటే మనసొప్పదు - మొహమాటపడతారు. కానీ నేనలా మొహమాటపడి - ఇలా రాయలేకపోతే - మీరు నా చేత దిద్దించిన అక్షరాలకు, నాకు చెప్పించిన చదువుకి సార్ధకత ఉండదేమో అనిపించింది.
ఎన్నో విషయాల్లో నా గురువు మీరు - నేను పడిపోతే మీరొచ్చి లేపకుండా - అలాగే "పడ్డ చోటు నిన్ను పడేసింది - హన్నా - కొట్టేద్దామా" అని ఇంకెవరిమీదో తప్పు నెట్టేయడం నాకు నేర్పకుండా - నా అంతట నేను లేవడం ఎలాగో నేర్పారు. ఇంతకన్నా గొప్ప పాఠం ఎవరు నేర్పుతారు కదా?!
నిన్న పొద్దున్న మీతో నా ఫన్-భాషణ గుర్తు చేస్తే ఇంకొక్కసారి నవ్వుకుంటారని...
ట్రింగ్ ... ట్రింగ్ ...
"ఆ... చెప్పు లల్లీ !"
"హలో నాన్నా - బావున్నారా?"
"ఓ - బ్రహ్మాండం గా వున్నాను. ఆఫీసులొ వున్నానిప్పుడు"
"ఇప్పుడాఫీసేంటి నాన్నా - రాత్రి ఎనిమిదవుతుంటే?"
"ఇంక్రిమెంట్లు ఇచ్చారు - ఏదో చిన్న పార్టీ"
"ఓ - బావుంది బావుంది"
"నీకో విషయం చెప్పాలాగు మరి ! ఇప్పుడు మోడీ-హడావిడి కదా దేశమంతా ?! నాకు ఫోన్లు వస్తున్నాయి - కామేశ్వరరావు గారు - కోట్లు కొన్ని మేనేజ్ చేయాలండీ- 10% ఇస్తాము ఏదయినా మార్గం చూపించండి అని. వాళ్లకి చెప్తున్నాను - 10 కాదు 50 ఇస్తానంటే మీ కోట్లని మేనేజ్ చెయ్యొచ్చు. నేను మనుషులని తెస్తాను, నా రిస్క్ మీద అకౌంట్లు ఓపెన్ చేయిస్తాను - తలకు రెండు లక్షల చొప్పున మీ డబ్బంతా వాళ్ళ పేర్న బ్యాంకులో వేయిస్తాను- వారం తర్వాత ఒక లక్ష మీకు - ఒక లక్ష వాళ్లకి. మీ పేరు చెప్పుకుని కుటుంబాలు బతుకుతాయి." అని చెప్పాను"
"మీరేంటి - సలహాలరావు మీ కొత్త అవతారమా ? మీకెందుకొచ్చిన గొడవ నాన్నా?"
"బావుంది - ఇప్పుడిస్తే ఆ పేదవాళ్లు - పాపం - నూరేళ్లు జీవించమని దీవిస్తారు - లేకపోతే - ఆ నోట్లన్నీ చలిమంట వేసుకోవాలి అంతే!"
"సరే లెండి! మీరింక తొందరగా ఇంటికి వెళ్లండి - ఎవరైనా వున్నారా - మీరే డ్రైవింగా?"
"నేనే! నాకేం భయం - పోలీసు ఎందుకయినా ఆపినా - నాజేబులో ఐదువందల రూపాయల నోట్లు వున్నాయి - ఇస్తాను - వద్దు, వందివ్వండి - అంటాడు - లేదంటాను - వదిలేస్తాడు" అంటూ నవ్వు
"బానే వుంది మీ సరదా - జాగ్రత్త మరి"
"ఇంకోటి విను - జేబులో 70 వేలు వేసుకొచ్చాను - పొద్దుటినించీ బాకీలు తీరుద్దామని. ఎవరికి 500 నోటు ఇచ్చినా - ఇప్పుడొద్దు సార్ - మార్చిలో ఇవ్వండి పర్వాలేదు అని పారిపోతున్నారు. హహహ!"
నవ్వులతో ముగిసిన మన ఫోన్ కాల్ తల్చుకుని ఇప్పటికీ నవ్వుకుంటున్నాను - ఆ నవ్వుతోనే, నవ్వుతూనే - కొన్ని నవ్వులతో నింపి పంపుతున్నాను - మీ పుట్టినరోజు కానుకగా - ఈ బ్లాగ్ పోస్ట్! చదివేసుకోండి మరి!
Heart touching!!����
రిప్లయితొలగించండిThat's from the heart - maybe that's why it is "Heart touching".
తొలగించండిThanks for your nice comment.
.... హుండీలో వేస్తే ధర్మకర్తలకి వెళ్తాయి, పళ్లెంలో వేస్తే ఆ పేద బ్రాహ్మణులకి కొంచెమన్నా సహాయం చేసినట్టవుతుంది చెప్పేవారు ......
రిప్లయితొలగించండిప్రత్యక్షరసత్యం.
అవును కదండీ! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండిvery very well said andi lalita gaaru.
రిప్లయితొలగించండిThanks, Pavan garu!
తొలగించండిIf you ever come back to my blog to check your comments, I have a request for you. Could you please enable the comments option in your blog via blogger than google+ profile? I like reading your blog posts and add my comments - but I don't like to use google+ profile. The following URL may help you to add a toggle between blogger and google+ comments:
http://helplogger.blogspot.com/2014/12/blogger-and-google-comments-system-with-toggle.html
Thanks very much Lalitha gaaru. It worked :) Some time before I was looking for this option I couldn't able to do it.
తొలగించండిThanks again.
అతివాది, మితవాది, తీవ్రవాది. :-)
రిప్లయితొలగించండి'నూరేళ్ళ లెక్క తప్పేసేసుకుని....' :-(
నీ ఈ సిరీస్ లో ఇంత వరకూ రాసిన ముగ్గురూ ముగ్గురే లలితా!
Very different in nature yet, same with respect to the core qualities.
మీ నాన్నగారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.
అవి మా మాటల తీరుని బట్టి నాన్న పెట్టిన కొసరు-పేర్లు :))
తొలగించండినీ శుభాకాంక్షలు చేరాయి - నాన్నకి! Thank You!
Very nice
రిప్లయితొలగించండిHappy birthday to your nannagaru!
Thanks, Mani - for taking time to read my blog & comment!
తొలగించండిమీ నాన్నగారు మిమ్మల్ని ఒక తోటమాలి అప్పురూపంగా పెంచిన మొక్కలా మిమ్మల్ని కాపాడుతూ ఎదగనిచ్చారు.
రిప్లయితొలగించండిAnd finally how do u remember such small things from that small age? Have u written any diary?
నేనే డైరీ రాయలేదండీ మాధవి! గుర్తున్నవి రాస్తున్నానంతే! చదివినందుకు, మీ మంచి మాటకి ధన్యవాదాలు.
తొలగించండిమల్లె మాలలో ఒక్కొక్క మల్లెని గుచ్చి సుగంధాలు వెరజమ్ముతుంటే నాన్నగారి కి వేసినట్లుంది.
రిప్లయితొలగించండినా జ్ఞాపకాల మల్లెమాలకి మీ వ్యాఖ్యతో మరింత సుగంధం చేకూరినట్లయిందండి - ధన్యవాదాలు.
తొలగించండిSuper lalli మీ క బుర్లుచాల బాగా ఉన్నాయి ఎంత చదివిన ఇంకా చదవాలని అని పిస్తోంది
రిప్లయితొలగించండిథాంక్స్, శ్యామల! నా బ్లాగ్ చదువుతున్నందుకు & మీ కమెంట్ కి!
తొలగించండిVery sensible narration, super like.
రిప్లయితొలగించండిThank You - Fellow-AnTian :)
తొలగించండిఈ వ్యాసం బావుంది, శైలి బావుంది అని ఆపేస్తే...నాకే నచ్చలేదు. నాన్నని, అమ్మని, మిగతా కుటుంబాన్ని మా/నా కుటుంబంలా పరిచయం చేయడం మీకే చెల్లింది. మీగురువుల పరంపర కూడా అద్భుతం. ఆహా ఏమి భాగ్యం..
రిప్లయితొలగించండినా ఈ గురువుల series మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు :)
తొలగించండి