మా సుహాస్ సెయింట్ లూయిస్ "మన బడి" లో నాలుగో సంవత్సరం - ప్రభాసంలో తెలుగు చదువుతున్నాడు. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు కొంచెం తికమక పడతాడు :)
ఒకసారి ప్రభాసం తరగతి గదిలో మాస్టారు "I lost my temper" అంటే "నాకు కోపం వస్తోంది" అని అర్థం చెప్పారట. వెంటనే మా బుజ్జి సుహాస్ కి సందేహం వచ్చేసింది. మాస్టారుని ఇలా అడిగాడట - అంకుల్! "losing" అంటే పోవడం కదా అందుకని "నాకు కోపం పోతోంది" అనాలి కదా అని :))
కోపమేమో గాని నేనే అక్కడ టీచర్ ని అయుంటే నేను తరగతి గది బయటికి "పోయి" వుండేదాన్ని. ఆ తెలుగు చెప్పే ఆయన మంచివారు కాబట్టి సందర్భానుసారంగా సుహాస్ కి బదులిచ్చారు.
ఇంక మాబుల్లి తెలుగు పండితుడు ఇంటికి రాగానే కిరణ్ ఏదో అల్లరి చేస్తుంటే - తమ్ముడూ! అలా చేయకు. నాకు కోపం పోతోంది - అని అల్లరిగా నవ్వాడు. అదేంట్రా అని అడిగిన మాకు (అమ్మా, నాన్నగార్లకి) తెలుగు తరగతి గదిలో జరిగిన సంభాషణ గురించి చెప్పాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి